అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్లో భారత్ ఓటమి | england defeat india in quarterfinal under 19 world cup | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 23 2014 4:09 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు చుక్కెదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో కంగుతింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. దీపక్ హుడా (68), సర్ఫరాజ్ ఖాన్ (46 బంతుల్లో 52 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని (222/7) చేరుకుని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. డకెట్ (61), క్లార్క్ (42) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement