పర్యాటక రంగానికి 'ఏపీ' చిరునామాగా మారాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review on State Investment Promotion Board At Tadepalli | Sakshi
Sakshi News home page

పర్యాటక రంగానికి 'ఏపీ' చిరునామాగా మారాలి: సీఎం జగన్‌

Published Wed, Oct 27 2021 12:14 PM | Last Updated on Wed, Oct 27 2021 5:24 PM

CM YS Jagan Review on State Investment Promotion Board At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్లు వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కనున్నాయి. దాదాపు 1,564 గదులు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. వీటిని కంపెనీలు ఐదేళ్ల కాలంలో పూర్తి చేయనున్నాయి. 

చదవండి: (ఇప్పుడిది రైతాంధ్ర)

కీలక ప్రాజెక్టుల వివరాలు..
విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో ప్రఖ్యాత కంపెనీ ఓబెరాయ్‌ అధ్వర్యంలో రిసార్టులు
ఓబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు
విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్,  కన్వెన్షన్‌ సెంటర్‌
తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌
విశాఖపట్నంలో టన్నెల్‌ ఆక్వేరియం, స్కైటవర్‌ నిర్మాణం
విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హెటల్‌ 
అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించగా ఎస్‌ఐపీబీ వీటికి ఆమోదం తెలిపింది.

చదవండి: (ఇళ్ల నిర్మాణం నిలిపివేతపై రంగంలోకి కేంద్రం)

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..  
పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి అని అధికారులకు సీఎం నిర్దేశం.  
టూరిజం అంటే ఏపీ వైపే చూడాలి
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలి
అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలి
నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకొండి
ఆధునిక వసతలు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్థాయి పెరుగుతుంది
పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారు
ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయి
తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి పెరుగుతాయి
విశాఖపట్నంలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలి అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె ప్రవీణ్‌ కుమార్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్‌కుమార్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement