State Investment Promotion Board Meeting Chaired by CM YS Jagan Tadepalli - Sakshi
Sakshi News home page

AP: కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

Published Tue, Nov 16 2021 6:15 PM | Last Updated on Tue, Nov 16 2021 7:14 PM

State Investment Promotion Board Meeting Chaired by CM YS Jagan Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్టంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2,134 కోట్లతో ఐదు పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా.. 7,683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..
పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు.
కంపెనీల విస్తరణకు అవకాశాలున్నచోట వారికి భూములు కేటాయించాలి.
భవిష్యత్తులో వారు పరిశ్రమలను విస్తరించాలనుకుంటే అందుకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలి.

ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు..
వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌, రిటైల్‌ లిమిటెడ్‌ ఏర్పాటు
ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్న ఆదిత్యా బిర్లా
రూ.110 కోట్ల పెట్టుబడి, 2112 మందికి ఉద్యోగాలు

వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో ప్లైవుడ్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న సెంచురీ
రూ.956 కోట్ల పెట్టుబడి, 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
ఈ పరిశ్రమ ఏర్పాటు కారణంగా రైతులకు భారీగా మేలు జరుగుతుందన్న అధికారులు
దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్‌ చెట్లను కొనుగోలు చేస్తారన్న అధికారులు
దాదాపు రూ.315  కోట్ల ఉత్పత్తులను రైతులనుంచి కొనుగోలు చేస్తారన్న అధికారులు

చదవండి: (సీఎం జగన్‌కు కలిసిన కియా ఇండియా మేనేజ్‌మెంట్‌)

తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రాసిం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ
ఈ కంపెనీ ద్వారా రూ.861 కోట్ల పెట్టుబడి, 405 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
స్థానిక ప్రజల ఆందోళన నేపథ్యంలో థర్మల్‌పవర్‌ ప్లాంట్‌ను పెట్టబోమని స్పష్టంచేసిన గ్రాసిమ్‌ కంపెనీ
స్థానిక ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని విరమించుకున్నామంటూ స్పష్టంచేసిన కంపెనీ.. కంపెనీ స్పష్టత నేపథ్యంలో ఎస్‌ఐపీబీ ఆమోదం

కొప్పర్తి ఈఎంసీ
వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల (హెచ్‌ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్‌) తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
రూ.127 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 1800 మందికి ఉద్యోగాలు

వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలోనే మరొక పరిశ్రమ పెట్టనున్న ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
ల్యాప్‌టాపులు, ట్యాబ్‌లెట్స్, కెమెరా, డీవీఆర్‌ తయారీ
రూ.80 కోట్ల పెట్టుబడి, 1100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వనున్న డిక్సన్‌

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి అనంతరాము, జీఏడీ ముఖ్య కార్యదర్శి కె ప్రవీణ్‌ కుమార్, ఐటీ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్,  ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement