సాక్షి, విశాఖపట్నం: కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి ఏపీకి అదనంగా 230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రానుందని వెల్లడించారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు.
చదవండి: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి
ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు
Comments
Please login to add a commentAdd a comment