
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. కోవిడ్ కేసుల నమోదు, లాక్‌డౌన్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ వ్యాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలి. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఐదేళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. గర్భిణీలు, ఉపాధ్యాయులకూ వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు నెలల్లోగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనులు పూర్తి చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment