
సాక్షి, అమరావతి: ఇసుక, మినరల్ కన్సెషన్ అప్లికేషన్లు, మైనింగ్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం రోజున సమీక్ష నిర్వహించారు. ఇకపై జిల్లాల వారీగా ఔట్‌సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్లు ఉంటాయని మంత్రి తెలిపారు. వాల్యూమెట్రిక్ బదులు వెయిట్ బేసిస్‌లో సీనరేజీ వసూళ్లకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లను ఇవ్వాలని అధికారులకు సూచించారు.
మైనర్ మినరల్స్ లీజులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో మైనింగ్ లీజుల పెంపుదలకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు.
చదవండి: సర్పంచులు, వార్డు సభ్యులందరికీ తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలి
Comments
Please login to add a commentAdd a comment