PEDDI Reddy Ramachandra Reddy
-
మోసానికి మారుపేరు చంద్రబాబు: పెద్దిరెడ్డి
సాక్షి,వైఎస్సార్ జిల్లా : రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్మును ఏం చేశారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గురువారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ అన్నారు...ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నారు. ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చాను అన్నారు. ఇప్పుడేమో సూపర్ సిక్స్ గురించి మాట్లడడం లేదు. హామీ ఇచ్చే రోజు మీకు తెలియదా? వైఎస్ జగన్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు.. చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హులు. ప్రజల మనోభావాలపై రాళ్ళు వేశారు. ఏడు నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఇచ్చారు..? దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. వైఎస్ జగన్ కోవిడ్-19 సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. హామీ ఇచ్చిన తేదీ ప్రకారం సంక్షేమాన్ని అందించారు. ఆ సంక్షేమం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నేతలు, అధికారులు ఏపీకి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారు. కానీ చంద్రబాబు అలా కాదు. సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉన్నా.. డబ్బులు లేవని దాట వేస్తున్నారు. అంటే చంద్రబాబుకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యం లేదు. అధికారంలోకి వచ్చారు. ఆరోగ్య శ్రీతో పాటు, రాష్ట్రంలోని వైద్య విద్యను నిర్విర్యం చేశారు. మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా.. అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం విధ్వంసమా..?సూపర్ సిక్స్ లేదు. గుండు సున్నా చేశారు. ఆ రోజు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఆనాడు చంద్రబాబుకి వంత పాడారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. -
ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ కుట్రలు చేస్తోంది: పెద్దిరెడ్డి
-
టీడీపీ, జనసేనపై పెద్దిరెడ్డి కామెంట్స్
-
దుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి
-
జగనన్న భూహక్కు-భూరక్షపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం భేటీ అయింది. సబ్ కమిటీలోని సభ్యులుగా ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి జగన్న భూరక్ష-భూహక్కు పథకం ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రమే ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని అన్నారు. సీఎం వైస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను కూడా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఇప్పటి వరకు 4.3 లక్షల సబ్ డివిజన్ లలో సుమారు 2 లక్షల మ్యూటేషన్ లను పరిష్కరించామని తెలిపారు. ఈ ఏడాది మే నెల నాటికి 6వేల గ్రామాలు, ఆగస్టు నెల నాటికి 9వేల గ్రామాలు, అక్టోబర్ నాటికి 13వేల గ్రామాలు, డిసెంబర్ నాటికి మొత్తం 17,461 గ్రామాలకు భూహక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇప్పటి వరకు 5264 గ్రామాల్లో డ్రోన్ ద్వారా చిత్రాలను రికార్డు చేయడం జరిగిందని, జూన్ 2023 నాటికి 4006 గ్రామాలకు ఓఆర్ఐ మ్యాప్‌లను సిద్దం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే 3191 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్, 2464 గ్రామాలకు గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశారని, మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. అలాగే భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా మొబైల్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో కూడా సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు. చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే ఇప్పటికే సర్వే కోసం 30 అత్యాధునిక డ్రోన్లు, 70 బేస్ స్టేషన్లు, 1330 జిఎన్ఎస్ఎస్ రోవర్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, మ్యాప్ లను సిద్దం చేయడం, వెరిఫికేషన్, నోటీసుల జారీ చేయడం, వివాదాలను పరిష్కరించడం, సర్వే రాళ్లను నాటడం దశలవారీగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. సమావేశంలో సీపీఎల్ఎ జి.సాయిప్రసాద్, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పోరేషన్ చైర్మన్ సౌరబ్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు.. పోస్టర్ ఆవిష్కరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. దేశ నలుమూలల నుంచి కోడింగ్ పట్ల ఆసక్తిగల విద్యార్థులు ఎవరైనా ఈ కాంపిటిషన్లో పాల్గొనవచ్చు. ఈ పోటీలో టాప్ స్కోర్ సాధించిన వారికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అడ్మిషన్ లభిస్తుంది. వారికి నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. ట్యూషన్ ఫీజుపై 100 శాతం వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. అలాగే రూ.లక్ష విలువ చేసే బహుమతులు అందుకోవచ్చు. నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఏపీ సచివాలయంలో ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌ను రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మొదట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కోడింగ్ నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు టెస్టులు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. హ్యాకథాన్ పోటీ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 13న ప్రారంభమైంది. జనవరి 31 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చదవండి: అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్ -
అనంతపురంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో సమావేశం
-
టీడీపీ, జనసేనల ముసుగు తొలగిపోయింది : మంత్రి పెద్దిరెడ్డి
-
ఓటమి భయంతోనే రు‘బాబు’
తిరుపతి మంగళం: వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడిపోతానన్న భయం చంద్రబాబుకు పట్టుకుందని.. అందుకే మొన్న కుప్పానికి వచ్చినప్పుడు తన టీడీపీ గూండాలతో రౌడీయిజం చేయించాడని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతి మారుతీనగర్‌లోని మంత్రి కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన కుప్పానికి 35 ఏళ్లలో ఆయన ఏంచేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కుప్పాన్ని పట్టించుకోకుండా, అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని పెద్దిరెడ్డి చెప్పారు. కనీసం చిన్నపాటి అభివృద్ధి లేదా సంక్షేమ పథకాల ద్వారా కూడా చేసిందేమీలేదన్నారు. కానీ, మూడ్రోజుల క్రితం రామకుప్పం మండలంలోని కొల్లుపల్లి గ్రామంలో టీడీపీ నేతలతో అరాచకాలు సృష్టించి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో రక్తంచిందేలా దాడులు చేసి రౌడీయిజం చేయించాడన్నారు. పోలీసులను సైతం తరిమితరిమి కొట్టారని, వారు కూడా ప్రాణభయంతో ఇళ్లల్లో దాక్కున్నారన్నారు. అయితే, పచ్చ మీడియాలో మాత్రం తామేదో చేసినట్లుగా చూపిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తన సెక్యూరిటీని పెంచుకునేందుకు వైఎస్సార్సీపీ దాడులు చేస్తున్నట్లుగా సృష్టిస్తున్నాడన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు కుప్పంవైపు కన్నెత్తి చూడని చంద్రబాబు గత మూడేళ్లలో 6 సార్లు కుప్పం వచ్చాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వచ్చిన ప్రతీసారి రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం, అరాచకాలు సృష్టించడం, రౌడీయిజం చేయడమే తన నైజంగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని మాయలు చేసినా కుప్పం ప్రజలు ఆయన్ను నమ్మేస్థితిలో లేరన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతోనే కుప్పం స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిందని.. దాన్ని తట్టుకోలేకే చంద్రబాబు అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నాడని పెద్దిరెడ్డి మండిపడ్డారు. కుప్పానికి నీళ్లిచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం మరోవైపు.. కుప్పంలోని బ్రాంచ్ కెనాల్లో నీళ్లు ఇవ్వలేదు, గాలేరు–నగరి కాలువ మొదలు పెట్టలేదు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాటి కాంట్రాక్టర్ చంద్రబాబు అనుచరుడే కదా.. ఎందుకు చేయలేదని అతనిని ఎందుకు నిలదీయడంలేదని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కాంట్రాక్టర్ స్పందించడం లేదని, దాంతో అతని కాంట్రాక్టును రద్దుచేసి కొత్త వాళ్లకు ఇచ్చి అతిత్వరలోనే ఆ పనులను పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. అలాగే, త్వరలోనే బ్రాంచ్ కెనాల్ పూర్తిచేసి కుప్పానికి నీళ్లిచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్నారు. హేమనూరు వద్ద డ్యామ్ నిర్మించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పాలర్ ప్రాజెక్టును అడ్డుకున్న నీచుడు ఏదైనా మాట్లాడితే రాష్ట్రం శ్రీలంకలా అయిపోయిందని, కిమ్ గురించి చెబుతాడని.. అసలు దేశ రాజకీయాల్లో పనికిమాలిన శుంఠ, వెన్నుపోటుదారుడు, నియోజకవర్గ ప్రజలకు ఏమీచేయని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఆగమేఘాలపై పాలర్ ప్రాజెక్టును ప్రారంభిస్తే లోపాయకారిగా అప్పటి తమిళనాడు ప్రభుత్వంతో చంద్రబాబు మాట్లాడి స్టే తెచ్చిన నీచుడన్నారు. కుప్పంలో చంద్రబాబు ఓటమి తథ్యం ఇక సీఎం జగన్మోహన్రెడ్డి నిత్యం కుప్పం ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్‌ను గెలిపించుకుంటే మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారని గుర్తుచేశారు. జగన్మోహన్రెడ్డి పథకాలు కుప్పం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తథ్యమన్నారు. అలాగే, 14ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పం ప్రజలకు సెంటు భూమి ఇచ్చిన పాపానపోలేదని.. అదే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే కుప్పంలో ఏడువేల మందికి ఇంటి స్థలాలిచ్చారని.. మరో మూడు వేలమందికి కూడా ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశామన్నారు. ఇక తన కుమారుడు లోకేష్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడని.. ఆయన నాయకత్వ పటిమ ఎలా ఉందో అందరూ ఆలోచించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు రెడ్డెప్ప, మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
‘నడవలేని చంద్రబాబుకు పచ్చపత్రికలే ఊతకర్ర’
సాక్షి,పలమనేరు/వి.కోట: అభివృద్ధి జరగలేదని బజాయించే ఎల్లో మీడియా, టీడీపీ నాయకులకు గ్రామాల్లో నిర్మించిన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, బీఎంసీలు, వెల్నెస్ సెంటర్లు కంటికి కనిపించలేదా అని రాష్ట్ర మైనింగ్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆయన పలమనేరు నియోజకవర్గం వి.కోటలో శనివారం వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. అక్కడ జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కరువు కాటకాలు విలయతాండవం చేసేవన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఈ మూడేళ్లలో క్రమం తప్పకుండా వర్షాలు కురవడంతో కరువు పారిపోయిందని చెప్పారు. నేడు రైతులు పంటలను సాగుచేస్తూ గ్రామాలు కళకళలాడుతున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసని, అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేడు కులమతాలు, పార్టీలకతీతంగా ఇంటింటికీ చేరుతున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పచ్చ పత్రికలు చూస్తే బాగుంటుందన్నారు. పార్టీలకతీతంగా పథకాలు నలభైఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం మూడేళ్లలో చేసిచూపెట్టిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కిందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్నారు. గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలను గుర్తించారని చెప్పారు. దేశం మెచ్చుకున్న సచివాలయ వ్యవస్థను రూపొందించి పార్టీలకతీతంగా పథకాలను అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ఇక ఎప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. వచ్చే ఎన్నికలే కాదు.. ఎన్ని ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో వైఎస్సార్సీపీదే అధికారమని, జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, డీసీసీబీ చైర్మన్ మొగసాల రెడ్డెమ్మ, వి.కోట సర్పంచ్ లక్ష్మి, ఎంపీపీ యువరాజ్, రాష్ట్ర కార్యదర్శులు నాగరాజ్, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, కన్వీనర్ బాలగురునాథ్, జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మొగసాల రెడ్డెప్ప నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నడవలేని చంద్రబాబుకు పచ్చపత్రికలు, మీడియా ఊతకర్రగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కాదని వక్రీకరించి వార్తలు రాసినంత మాత్రాన జనం నమ్మరు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో దీటైన జవాబు చెబుతాం. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా వైఎస్సార్ సీపీదే విజయం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సంక్షేమ పాలన సాగిస్తారు. మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కరువు ఎక్కువగా ఉండే పడమటి మండలాల్లో సైతం వరుణుడు కరుణించాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ మెజారిటీ 32 వేలయితే, రాబోయే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయం. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోంది. ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,రాష్ట్ర మైనింగ్, అటవీశాఖ మంత్రి చదవండి: బాబు, పవన్‌కు రాజకీయ హాలిడే -
కోనసీమ దుర్ఘటనలో జనసేన,టీడీపీ కుట్రలు బట్టబయలు
-
ఆ డబ్బు రైతుల ఖాతాల్లో వేస్తాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ డిమాండ్-సప్లై, పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీగా విద్యుత్తును కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు. మార్చిలో 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని అధికారులు పేర్కొన్నారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన.. షెడ్యూల్ ఇదే డీబీటీద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాల్లో వేస్తామని, నేరుగా రైతులే చెల్లిస్తారని, దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారని సీఎం అన్నారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్ విజయవతం అయ్యిందని, 2020–21లో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 ఎం.యు. కరెంటు ఖర్చుకాగా, 2021– 2022లో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరినా 67.76 ఎం.యు. కరెంటు మాత్రమే వినియోగించారని అధికారులు తెలిపారు. 33.75 ఎం.యు. కరెంటు ఆదా అయ్యిందన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరాలో సంక్షోభం: ♦విద్యుత్‌రంగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సీఎంకు వివరించిన అధికారులు ♦దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సరఫరా సంక్షోభం, విద్యుత్ ఉత్పత్తి రంగంపై పడ్డ ప్రభావం తదితర అంశాలను వివరించిన అధికారులు ♦అంతర్జాతీయంగా, దేశీయంగా వచ్చిన పరిణామాలతో బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడిందన్న అధికారులు ♦బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయంతో పలు రాష్ట్రాల్లో తీవ్ర కొరత ఉందన్న అధికారులు ♦సరిపడా రైల్వే ర్యాక్స్‌ను సరఫరా చేయలేకపోతున్నారు. ♦వెసల్స్ కూడా తగినంతగా అందుబాటులో లేకపోవడం, విదేశాల్లో బొగ్గు ధరలు విపరీతంగా పెరగడం...ఈ కారణాలన్నీ విద్యుత్తు కొరతకు దారితీశాయన్న అధికారులు ♦మరోవైపు డిమాండు కూడా గతంలో కన్నా అనూహ్యంగా పెరిగిందన్న అధికారులు ♦గడచిన మూడేళ్లుగా వర్షాలు బాగా కురిశాయని, భూగర్భజలాలు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల వ్యవసాయరంగం నుంచి కూడా డిమాండ్ స్థిరంగా ఉందన్న అధికారులు ♦మరోవైపు కోవిడ్ పరిస్థితుల తర్వాత పారిశ్రామిక ఉత్పత్తిరంగం పుంజుకుందని తెలిపిన అధికారులు ♦వేసవి ఉష్ణోగ్రతలు కూడా అధికస్థాయిలో ఉన్నాయని, ఫలితంగా అధిక వినియోగం ఉందని తెలిపిన అధికారులు ♦ఏప్రిల్ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 12,293 మిలియన్ యూనిట్లకు చేరిందని, రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్ ఇదని పేర్కొన్న అధికారులు ఎంత ఖర్చైనా కొనుగోలు: ♦వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీ ఎత్తన విద్యుత్తును కొనుగోలు చేసిన విషయాన్ని సమావేశంలో తెలిపిన అధికారులు ♦మార్చిలో సగటున రోజుకు రూ.36.5 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశామని, ఏప్రిల్‌లో సగటున రోజుకు రూ.34.08 కోట్లు వెచ్చించి కరెంటు కొన్నామన్న అధికారులు. ♦వినియోగదారులు ఇబ్బంది పడకుండా, కరెంటు కోతలను అధిగమించడానికి, మార్చి నెలలో మొత్తంగా 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని, ఏప్రిల్‌లో 1047.78 మిలియన్ యూనిట్లు రూ.1022.42 కోట్లతో కొన్నామని తెలిపిన అధికారులు ♦బొగ్గు విషయంలో రానున్న రెండు సంవత్సరాలు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయన్న సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయన్న అధికారులు ♦జనరేషన్ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో కనీసం 10 శాతం వరకూ విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు నొక్కిచెప్తున్నారని వెల్లడించిన అధికారులు. ♦డిమాండ్‌ను అంచనా వేసుకుని ఆ మేరకు కార్యాచరణ చేసుకోవాలన్న సీఎం ♦బొగ్గు కొనుగోలు విషయంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్న సీఎం ♦అనూహ్య డిమాండ్ ఉన్నా కొన్ని నెలల్లో పీక్ సమయాల్లోనూ మిగులు విద్యుత్తు ♦సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్ యూనిట్లు రాష్ట్రానికి దశలవారీగా అందుబాటులో వస్తోందన్న సీఎం ♦మూడు సంవత్సరాల్లో మొత్తం మూడు దశల్లో అందుబాటులోకి సెకీ విద్యుత్తు వస్తోంది ♦2023 చివరి నాటికి మొదటి దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, రెండో దశలో సుమారు 18 మిలియన్ యూనిట్లు, మూడో దశలో సుమారు 9 మిలియన్ యూనిట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్న సీఎం ♦దీంతో పాటు రాష్ట్రంలో కృష్ణపట్నంలో కొత్తగా 800 మెగావాట్లు, వీటీపీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయి: ♦85 శాతం పీఎల్ఎఫ్ అంచనా వేసుకుంటే మరో 30 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి వస్తుంది ♦మొత్తంగా 48 మిలియన్ యూనిట్లు అతిత్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి వస్తోంది ♦సీలేరులో కొత్తగా 1350 మెగావాట్ల కొత్త ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తిచేయడానికి దృష్టిపెట్టాలి: సీఎం ♦డీపీఆర్ పూర్తయ్యిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామన్న అధికారులు ♦కృష్ణపట్నం నుంచి 800 మెగావాట్ల విద్యుత్తు. ♦జులై–ఆగస్టు కల్లా కృష్ణపట్నం విద్యుత్తు వినియోగదారులకు అందనుందని తెలిపిన అధికారులు. ♦విజయవాడ థర్మల్ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుత్పత్తి పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం. ♦పోలవరం పవర్ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపిన అధికారులు ♦ఇప్పటికే టన్నెల్స్ తవ్వకం పూర్తయ్యిందన్న అధికారులు ♦ఈ ప్రాజెక్టుల వల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తును సాధించగలుగుతాం ♦పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్తు సరఫరాపై మళ్లీ చర్యలు తీసుకోవాలి ♦ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు రాకుండా చూడాలి ♦వారి డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్తును సరఫరాచేయాలి ♦ఈ విషయంలో పారిశ్రామిక రంగ వ్యక్తులతో కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి ♦వచ్చే వేసవిలో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి ♦ప్లాంట్ల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు సాధించాలి ♦జెన్కో ఆధ్వర్యంలో ఉన్న ప్లాంట్లను అత్యుత్తమ సామర్థ్యంతో నిర్వహించాలన్న సీఎం ♦85 శాతం పీఎల్ఎఫ్ సామర్థ్యంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ♦దీని వల్ల నాణ్యమైన విద్యుత్తు, మంచి ధరకే అందుబాటులోకి వస్తోంది ♦అంతేకాకుండా... విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు తగ్గించేలా ఆలోచనలు చేయాలి ♦ఖర్చులు తగ్గినా ఆదాయం వచ్చినట్టు లెక్క ♦పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తుకు భరోసా ♦విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులు ♦పర్యావరణ హిత విధానాలతో విద్యుత్ ఉత్పత్తి ♦బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచి మళ్లుతున్న ప్రపంచం ♦ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలు అవసరం ♦పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతి ♦రాష్ట్రంలో 29 చోట్ల ఈ ప్రాజెక్టులకు అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై దృష్టిపెట్టాలి, తదేక శ్రద్ధతో దీనిపై పనిచేయాలి ♦భూ సేకరణ దగ్గరనుంచి అన్నిరకాలుగా సిద్ధంకావాలి ♦ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తైతే 33,240 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది ♦పీక్ అవర్స్‌లో అధిక ఖర్చుకు విద్యుత్తు కొనుగోలు చేసే ఇబ్బందులు, పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ వల్ల తొలగిపోతాయి ♦ఒక్కసారి ప్రాజెక్టు పెట్టిన తర్వాత గరిష్టంగా 90 ఏళ్లపాటు ఆ కరెంటు అందుబాటులో ఉంటుంది ఉచిత విద్యుత్తు-డీబీటీ ♦ఉచిత విద్యుత్త డబ్బు రైతుల ఖాతాల్లోకే, వారిద్వారానే డిస్కంలకు చెల్లింపులు ♦డీబీటీ ద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు రైతుల ఖాతాలోకే: సీఎం ♦నేరుగా రైతులే చెల్లించేలా ఏర్పాటు : సీఎం ♦దీనివల్ల విద్యుత్తు సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారు: ♦ఎక్కడ ఇబ్బంది వచ్చినా.. వెంటనే సిబ్బందిని ప్రశ్నించగలడు: ♦విద్యుత్తు శాఖకూడా రైతులనుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారంపై నిరంతరం ధ్యాసపెట్టగులుగుతుంది, జవాబుదారీతనం పెరుగుతుంది: ♦మీటర్లు కాలిపోవడం, మోటార్లు కాలిపోవడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యమైన కరెంటు అందడంతో పాటు మంచి సేవలు రైతులకు అందుతాయి: శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం: ♦శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ప్రాజెక్ట్ విజయవంతం అయ్యిందన్న అధికారులు ♦జిల్లాలో ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చామని, రైతుల ఖాతాలనుంచి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపిన అధికారులు ♦2020-21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 26,083 కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల కరెంటు ఖర్చయ్యిందని తెలిపిన అధికారులు. ♦2021-2022 ఆర్థిక సంవత్సరంలో కనెక్షన్లు పెరిగి 28,393కు చేరుకున్నాయని, అయినా సరే 67.76 మిలియన్ యూనిట్ల కరెంటు మాత్రమే వినియోగించారని తెలిపిన అధికారులు. ♦సంస్కరణల వల్ల, రైతుల ఖాతాల ద్వారా చెల్లింపులు వల్ల కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని, రైతులకూ నాణ్యమైన విద్యుత్తు అందుతోందని తెలిపిన అధికారులు. పారదర్శకంగా జలకళ ♦వైఎస్సార్ జలకళను పారదర్శకంగా అమలు చేయాలన్న సీఎం. ♦మేనిఫెస్టోలో కేవలం బోరు మాత్రమే వేస్తామని చెప్పాం: సీఎం ♦కాని మనం మోటారు ఉచితంగా ఇస్తున్నాం, దాంతోపాటు రూ.2 లక్షల విలువైన విద్యుద్దీకరణ పనులను ఉచితంగా చేస్తున్నాం ♦రైతులకు దీనివల్ల మరింత మేలు జరుగుతుంది: సీఎం ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఏపీజెన్కో ఎండీ బి శ్రీధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ ఎండీ ఎన్ వి రమణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
AP: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రాష్ట్ర వ్యాప్తంగా 61.03 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ద, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చదవండి: సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి: సీఎం జగన్ శుక్రవారం (ఏప్రిల్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1551.16 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారని తెలిపారు. సచివాలయాల ద్వారా వాలంటీర్లు పెన్షన్ మొత్తాలను నగదు రూపంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందచేస్తారన్నారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్దంగా ఉన్నారన్నారు. పెన్షన్ అందచేసే సందర్భంలో లబ్ధిదారులను గుర్తించేందుకు బయోమెట్రిక్ తో పాటు ఐరిస్, ఆర్బిఐఎస్ విధానాన్ని కూడా వినియోగిస్తారని తెలిపారు. పెన్షన్ మొత్తాలను అయిదు రోజుల్లో నూరుశాతం పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 15 వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్డిఏ కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని మంత్రి తెలిపారు. -
బొగ్గు ఉత్పత్తిలో ఏపీఎండీసీ కీలక ముందడుగు
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీ ఎండీసీ) మరో మైలురాయిని అధిగమించింది. జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్ ఇండియాల సరసన ఇతర రాష్ట్రాల్లో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న మూడో ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపును సాధించింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్న ఏపీఎండీసీ మార్చి 10వ తేదీ నుంచి ఈ గనిలో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. 2007లోనే కేంద్రప్రభుత్వం ఈ బొగ్గుగని ఏపీఎండీసీకి కేటాయించినా, వివిధ కారణాల వల్ల మైనింగ్ కార్యక్రమాలు మాత్రం ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సుల్యారీ కోల్ మైన్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఎదురవుతున్న ఆటంకాలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వపరంగా ఏపీ ఎండీసీకి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడంతో గత ఏడాది ఆగస్టు నెలలో సుల్యారీలో బొగ్గు వెలికితీత పనులకు శ్రీకారం చుట్టారు. ఓవర్ బర్డెన్ పనులు పూర్తి చేసుకుని తాజాగా వాణిజ్య సరళి బొగ్గు ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఏపీఎండీసీ తన విస్తరణలో కీలక ముందుడుగుగా వేసింది. సీఎం వైఎస్ జగన్ చొరవతోనే ఈ విజయం: మంత్రి పెద్దిరెడ్డి సీఎం వైఎస్ జగన్ విజన్ వల్లే ఏపీఎండీసీ ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా తన మైనింగ్ కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యాన్ని సాధించిందని రాష్ట్ర భూగర్భ గనులు, పీఆర్అండ్ఆర్డీ, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2007లోనే ఏపీ ఎండీసీ మధ్యప్రదేశ్ లో సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్నప్పటికీ 2019 వరకు ఒక్క అడుగు కూడా బొగ్గు ఉత్పత్తి విషయంలో ముందుకు పడలేదని అన్నారు. సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్‌ను ఒక సవాల్‌గా తీసుకుని అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. నేడు సుల్యారీలో వాణిజ్యసరళిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడానికి సీఎం చేసిన కృషి కారణమని, ఈ సందర్బంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మైనింగ్ కార్యక్రమాలకు పరిమితమైన ఏపీఎండీసీ జాతీయ స్థాయిలో పెద్దపెద్ద సంస్థలతో పోటీగా బొగ్గు ఉత్పత్తి రంగంలో నిలబడటం, నిర్ధేశిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీఎండీసీ విసి అండ్ ఎండీ విజి వెంకటరెడ్డి, ఇతర అధికారులు, కార్మికులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు, ప్రభుత్వ రంగ సంస్థల నైపూణ్యాలను పెంచుకుంటూ జాతీయ స్థాయిలో తమ కార్యక్రమాలను విస్తరింప చేసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహాన్ని పూర్తిస్థాయిలో అందిస్తోందన్నారు. జార్ఘండ్ లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌ను సైతం 2021లో ఏపీఎండీసీ పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి బిడ్డింగ్ లో దక్కించుకుందన్నారు. అత్యంత నాణ్యమైన కోకింగ్ కోల్ ను ఈ బ్లాక్ నుంచి ఉత్పత్తి చేసేందుకు ఎపిఎండిసి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు. ఉక్కు కర్మాగారాల్లో వినియోగించే ఈ కోకింగ్ కోల్ ను ఏపీఎండీసీ ద్వారా ఉత్పత్తి చేయడం వల్ల మన రాష్ట్ర అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి కోకింగ్ కోల్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గుగనులతో పాటు ఇరత మేజర్ మినరల్స్ విషయంలోనూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా మైనింగ్ కార్యక్రమాలను నిర్వహింపచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా ఏటా రూ.1200 కోట్లు ఆదాయం.. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీ బొగ్గు గని నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఏపీఎండీసీ ఉత్పత్తి చేస్తుందని సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తెలిపారు. రూ.2వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీఎండీసీ ఈ బొగ్గుగనిలో ఉత్పత్తి ప్రారంభించిందని, సాలీనా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం ఈ బొగ్గు గని ద్వారా లభిస్తుందన్నారు. మొత్తం 110 మిలియన్ టన్నులు బొగ్గు నిల్వలు ఈ గని పరిధిలో ఉన్నాయని, కనీసం 22 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పతి జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్ణయించిన 5 మిలియన్ టన్నులను మించి అదనంగా మరో రెండు మిలియన టన్నుల బొగ్గును కూడా ప్రతిఏటా వెలికితీసే అవకాశం ఉందని, ఈ మేరకు సంస్థ సామర్థ్యంను కూడా పెంచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 10 తేదీ నుంచి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించామని, ఈ బొగ్గులో 25 శాతం సూక్ష్మా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లకు కేటాయిస్తామని, మిగిలింది విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విక్రయిస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ లకు బొగ్గు విక్రయాలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన ఎం-జంక్షన్ ద్వారా ఈ-ఆక్షన్ కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి సాధనలో పనిచేసిన సంస్థ ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. -
పండగలా జరుగుతున్న 'వైఎస్సార్ పెన్షన్ కానుక' పంపిణీ
-
చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారు
-
నాసిరకం రోడ్లేసి నిందలా?
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రహదారుల దుస్థితికి చంద్రబాబు సర్కారు నిర్వాకాలే కారణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. గత సర్కారు చివరి రెండేళ్ల పాటు రహదారుల నిర్వహణ, మరమ్మతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా రోడ్ల గురించి పట్టించుకోకుండా నాసిరకం పనులతో సరిపుచ్చి ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు టీడీపీ నేతలు ఆర్టీఐ సమాచారం అంటూ మభ్యపుచ్చే యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తి టీడీపీ హయాంలో ఐదేళ్లలో కొత్తగా 1,356 కి.మీ తారు రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. ఏటా సగటున 271.2 కి.మీ. రోడ్లు వేశారు. రహదారుల విస్తరణ, మరమ్మతులు 8,917 కి.మీ చేసినట్లు చెబుతున్నారు. అంటే ఏటా సగటున 1,783 కి.మీ మాత్రమే పనులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలోనే కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 1,883 కి.మీ తారు (బీటీ) రోడ్ల నిర్మాణం జరిగింది. ఏటా సగటున దాదాపు 942 కి.మీ కొత్త రహదారులు నిర్మించాం. దీంతోపాటు రెండేళ్లలోనే 4,015 కి.మీ మేర రహదారుల విస్తరణ, అభివృద్ధి, మరమ్మతులు జరిగాయి. ఏటా సగటున 2 వేల కి.మీ పైగా రహదారుల అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వ హయాంలో జరిగాయి. మరోవైపు రూ.7,828 కోట్లతో 9,557 కి.మీ. రహదారులకు సంబంధించిన పనులు మంజూరు చేసి చేపట్టబోతున్నాం. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. వర్షాకాలంలో పనులు ప్రారంభిస్తే నాణ్యత దెబ్బ తింటుందనే ఉద్దేశంతో తగ్గుముఖం పట్టగానే ప్రారంభించాలని నిర్ణయించాం. చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో రాష్ట్రం అల్లాడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సకాలంలో వర్షాలతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. వర్షాల కారణంగా కొన్నిచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కరోనా వల్ల మరమ్మతుల పనులు కొంత నిదానంగా జరుగుతున్నాయి. పెద్దిరెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేతలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన స్థాయి గురించి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎంలను ఎవరిని అడిగినా చెబుతారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టి సీఎంలను సైతం ఢీకొట్టి ఎదుర్కొన్న మొనగాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ, అర్హతగానీ టీడీపీ నేతల్లో ఎవరికీ లేదు. చంద్రబాబు, లోకేశ్ మంచి పనులు చేస్తే ఆ పార్టీ 23 స్థానాలకే ఎందుకు పరిమితమైంది? ఏ ఒక్క హామీని అమలు చేయలేదు కాబట్టే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. చదవండి: మతాల మధ్య సోము వీర్రాజు చిచ్చు: వెల్లంపల్లి -
నెల్లూరులో మంత్రుల బృందం పర్యటన
సాక్షి, నెల్లూరు: మంత్రుల బృందం నెల్లూరులో శనివారం పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. కావలిలో రూ.86 లక్షలతో నిర్మించిన అగ్రి, ఆక్వా కల్చర్ ల్యాబ్.. తాళ్లపాలెంలో రూ.45 లక్షలతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే.. తుమ్మలపెంటలో రూ.64 కోట్లతో జలజీవన్ మిషన్‌ను మంత్రులు ప్రారంభించారు. జల జీవన్ మిషన్‌తో 240 గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. ఆముదాల దిన్నెలో రూ.15 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్‌ను కూడా ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా.. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. -
సర్పంచ్ లు మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-
ఇసుక, మైనింగ్‌పై సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఇసుక, మినరల్ కన్సెషన్ అప్లికేషన్లు, మైనింగ్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం రోజున సమీక్ష నిర్వహించారు. ఇకపై జిల్లాల వారీగా ఔట్సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్లు ఉంటాయని మంత్రి తెలిపారు. వాల్యూమెట్రిక్ బదులు వెయిట్ బేసిస్‌లో సీనరేజీ వసూళ్లకు ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా జగనన్న కాలనీలకు ఉచిత ఇసుక కోసం ప్రత్యేక కూపన్లను ఇవ్వాలని అధికారులకు సూచించారు. మైనర్ మినరల్స్ లీజులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంలో మైనింగ్ లీజుల పెంపుదలకు ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. చదవండి: సర్పంచులు, వార్డు సభ్యులందరికీ తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలి -
వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్ఆర్ బీమా పథకాన్ని జులై1 నుంచి కొత్త మార్పులతో అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ సాయం అందిస్తుందని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18-50ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష, 18-70ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణస్తే రూ. 5లక్షల సాయం అందజేయాలని ఆదేశించారు. ఇక జులై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జులై 1లోగా క్లెయిమ్‌లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ అన్నారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం! -
‘పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే మన లక్ష్యం’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో స్వచ్చతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘జగనన్న స్వచ్చ సంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఆయా గ్రామ సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. సోమవారం ఈ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల జెడ్పీ సీఇఓ, డీపీఓ, డ్వామా పీడీ, ఎంపీడీఓ, పంచాయతీ ఇఓ, గ్రామ సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లి సీపీఆర్ కార్యాలయం నుంచి పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్చాంధ్ర ఎండీ సంపత్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూలై 8 స్వర్గీయ వైఎస్సార్ జయంతి నాడు 'జగనన్న స్వచ్ఛసంకల్పం' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు గ్రామ సర్పంచ్ల భాగస్వామ్యం కీలకమని ఆయన అన్నారు. కోవిడ్ మన గ్రామ పొలిమేరల్లోకి రాకుండా చూసే బాధ్యత సర్పంచులదేనని, వాళ్ల సారథ్యంలో స్వచ్ఛమైన పల్లెలను సృష్టించుకోవాలని తెలిపారు. ప్రజలు సర్పంచులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే సమయం ఇదేనంటూ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ( చదవండి: వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు ) -
90,000 మందికి సేవలందించేలా ఆర్టీసీ ఉద్యోగులకు ఆస్పత్రి
సాక్షి, అమరావతి: ఐదు జిల్లాలకు చెందిన దాదాపు 90 వేల మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులకు సేవలందించేలా కడపలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రిని సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మోడల్ డిపోగా రూపొందించిన చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ బస్ డిపో కూడా సీఎం చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభమైంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం కడపలో డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రిని ప్రారంభించడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రి ద్వారా ఆరోగ్యశాఖ, ఆర్టీసీ సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, దీనిపై గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని సీఎం చెప్పారు. 90,000 మందికి వైద్య సేవలు కడపలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ వ్యయం రూ.3.8 కోట్లు కాగా మరో రూ.2 కోట్లతో మెడికల్ ఎక్విప్మెంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. 1.6 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా ఏడుగురు వైద్య నిపుణులు, 25 మంది పారా మెడికల్ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఈ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్య నిపుణులు సేవలందిస్తారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కలిపి దాదాపు 90 వేల మందికి ఈ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందించనున్నారు. కడప బస్ స్టేషన్‌ను ఇకపై డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బస్ స్టేషన్‌గా వ్యవహరించనున్నారు. పుంగనూరు డిపోను రూ.7.5 కోట్ల వ్యయంతో 7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 65 బస్సులతోమోడల్ డిపో తీర్చిదిద్ది వర్క్‌షాప్ నిర్మించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ ఆర్పీ ఠాకూర్, ఈడీలు కృష్ణమోహన్, కోటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుంగనూరు నుంచి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, పలువురు ఎమ్మెల్యేలు, కడప నుంచి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్యెల్యేలు, కడప మేయర్ సురేష్‌బాబు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. సంస్థకు ప్రాణం పోశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డిపోలు మూతబడే పరిస్థితి రావడంతో ప్రైవేట్‌పరం చేసే యత్నం చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంస్థకు ప్రాణం పోసి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఏటా దాదాపు రూ.3,600 కోట్ల భారం పడుతున్నా వెనుకంజ వేయలేదని చెప్పారు. అంత గొప్ప మనసున్న మనిషి సీఎం జగన్ అని పేర్కొన్నారు. కడపలో 20 పడకల ఏరియా ఆస్పత్రి, పుంగనూరు డిపోను ప్రారంభించామని, కార్మికుల శ్రేయస్సు కోసం ఇంతగా ఆలోచిస్తున్న సీఎం ఉండడం మన అదృష్టం అని చెప్పారు. – పేర్ని నాని, రవాణా శాఖ మంత్రి పుంగనూరు ప్రజలకు వరం పుంగనూరు డిపోను ప్రారంభించి ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పుంగనూరు ప్రజలకు ఇది వరం లాంటిదని, 40 ఏళ్లుగా మునిసిపాలిటీగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు డిపో లేదన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో పనులు మొదలైనా తర్వాత ముందుకు సాగలేదని, ఇన్నాళ్లకు ఆయన తనయుడు సీఎం జగన్ సాకారం చేశారన్నారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి -
కరోనా బాధితులను వేధిస్తే సహించం: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: కరోనా కట్టడిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హాజరయ్యారు. సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, కరోనా పేరుతో బాధితులను వేధిస్తే సహించమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం చేయాలని ఆయన స్పష్టం చేశారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఆక్సిజన్ స్టోరేజీపై ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. టెస్టులు చేసిన రోజే రిపోర్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందు జాగ్రత్తగా అదనంగా వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి కాలేజీలను కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. చదవండి: ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్ అమ్మా నన్ను ఎందు‘కని’ పడేశారు..? -
‘చంద్రబాబు చాప్టర్ ముగిసింది’
సాక్షి, నెల్లూరు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని మంత్రులు అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జిల్లాలోని చిట్టమూరు మండలం కొత్త గుంట, గూడూరు నియోజకవర్గం పరిధిలో వాకాడు మండలం కేంద్రంలో ఆదివారం జరిగిన బహిరంగ సభల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, అనిల్‌కుమార్ యాదవ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజమండ్రి ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. 95 శాతానికి పైగా హామీలు అమలు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అర్హులందరికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని.. ఇప్పటికే 95 శాతానికి పైగా హామీలు అమలు చేశామని పేర్కొన్నారు. 90 శాతం ఓటింగ్ జరిగిన గ్రామానికి ప్రత్యేక పారితోషికం అందజేస్తామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి.. మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో రెండో పంటకు నీళ్లిస్తామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. డా.గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్సీలను చంద్రబాబు అవమానించారు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, వేషాలు వేసే పవన్‌తో ఉపఎన్నికలో ప్రచారం చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్.. చంద్రబాబును బీజేపీలో చేర్చే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. గూడూరు నుంచి వైఎస్సార్సీపీకి లక్ష మెజార్టీ రావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీలను చంద్రబాబు అవమానించారన్నారు. ఆ ఘనత వైఎస్ జగన్‌దే.. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌దేనని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గూడూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి లక్ష మెజారిటీ రావాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. చంద్రబాబు చాప్టర్ ముగిసింది.. చంద్రబాబు చాప్టర్ ముగిసిందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కొత్త ఒరవడి తీసుకొచ్చారన్నారు. బడుగు బలహీనవర్గాలకు సీఎం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని మార్గాని భరత్ పేర్కొన్నారు. -
అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంటాం - మంత్రి పెద్ది రెడ్డి
-
నిమ్మగడ్డకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన విధించిన ఆంక్షలను హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. మీడియా సమావేశం నిర్వహించేందుకు మంత్రి పెద్దిరెడ్డికి న్యాయస్థానం అనుమతిని మంజూరు చేసింది. మీడియా సమావేశాలు నిర్వహించరాదని పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ విధించిన ఆంక్షలను చెల్లుబాటుకావని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రి మీడియాతో మాట్లాడేందుకు అనుమతినిస్తూ బుధవారం తీర్పును వెలువరించింది. పంచయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డిపై నిర్బంధం విధిస్తూ, మీడియాతో మాట్లాడకుండా నిమ్మగడ్డ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి గతవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన దాఖలు చేశారు. దీనిపై ఆదివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిమ్మగడ్డ ఉత్తర్వులను కొట్టివేసింది. మంత్రిపై నిర్బంధం విధిస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టింది. మంత్రి ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే మీడియాతో మాట్లాడకూడదంటూ ఇచ్చిన ఉత్తర్వులను మాత్రం న్యాయస్థానం తొలుత సమర్థించింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. మీడియాతో మాట్లాడకుండా ఉండాలంటూ ఎస్ఈసీ జారీచేసిన ఆంక్షలను తప్పుపట్టింది. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. నిమ్మగడ్డ ఉత్వర్వులను కొట్టివేసిన హైకోర్టు -
అత్యుత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్నారు..
సాక్షి, విజయవాడ: కేవలం 18 నెలల కాలంలోనే సీఎం జగన్మోహన్రెడ్డి దేశంలోనే అత్యుత్తమ సీఎంగా గుర్తింపు తెచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంశల వర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా సీఎం జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు.. ఆయన ఇమేజ్ను దెబ్బ తీసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారని, అధికారులను బెదిరించేలా వ్యవహరిస్తున్న ఆయన తీరు ఏమాత్రం సబబు కాదని మంత్రి బొత్స మండిపడ్డారు. పంచాయతీల్లో ఏకగ్రీవాలన్నవి తాము వచ్చాక మొదలు పెట్టినవి కావని, 2001 లోనే ఏకగ్రీవాలు ప్రారంభం అయ్యాయని వివరించారు. ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించుకున్నారన్న ఎస్ఈసీ భాష ఏమాత్రం బాగోలేదని ఆయన విమర్శించారు. గ్రామాల ప్రగతికి ఏకగ్రీవాలు తోడ్పడతాయి.. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల విషయంలో అతని ప్రవర్తన ఏమాత్రం సరిగా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండి పడ్డారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న అధికారలపై కక్షపూరితంగా వ్యవహరించడం అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులకు తగదని హితవు పలికారు. సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలనలో ఏ అధికారికి అన్యాయం జరగదని ఆయన భరోసాను ఇచ్చారు. ఏకగ్రీవాల విషయంలో.. గతంలో ప్రోత్సాహకాలు బాగున్నాయని వ్యాఖ్యానించిన నిమ్మగడ్డ, ఇప్పుడు వేరే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్ది వ్యాఖ్యానించారు. ఏకగ్రీవాలు జరిగితే గ్రామాల్లో ఎలాంటి గొడవలు ఉండవని, అందుకే మన రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఏకగ్రీవాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవాల వల్ల గ్రామాల్లో మంచి పాలనా వ్యవస్థ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవాలకు సంబందించి గతేడాది మార్చిలోనే అదేశాలిచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ఏకగ్రీవాలు ఎంతో తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగానే తమ ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందని మంత్రి స్పష్టం చేశారు. -
నివర్ తుపాను: అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, పశ్చిమగోదావరి: నివర్ తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య బృందాలు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కాజ్‌ల వద్ద పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస చర్యలు, భోజన సదుపాయం, వైద్య సహాయం విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి: సజ్జల) అధికారులు అందుబాటులో ఉండాలి: మంత్రి అనిల్ నెల్లూరు: ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో చెరువులు గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని మంత్రి అనిల్ ఆదేశించారు. (చదవండి: శ్రీవారి మెట్టు మార్గం మూసివేత) ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు: జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. నివర్ తుపాను కారణంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, జలాశయాల్లో నీటినిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్యంతోపాటు అన్ని వసతులు కల్పించాలని, అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. -
చప్పట్లు కొట్టి అభినందించండి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి శుక్రవారంతో ఏడాది పూర్తవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రతి ఇంటి ముందుకు ప్రభుత్వ పాలనను తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది అని పేర్కొన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ‘అవినీతికి తావు లేకుండా 543 సేవలను ఈ రోజు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. అవినీతి రహిత పాలనను ఈ ప్రభుత్వం అందిస్తోంది. సచివాలయ పనితీరుని మన దేశ ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని అభినందించారు. యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్ లో ఒక పాఠ్యాంశంగా మన సచివాలయ వ్యవస్థని చేర్చారు. 61,65,000ల మందికి పెన్షన్లు గత నెల వరకు ఇస్తున్నాం. 34,907 మందిని గత నెల కొత్తగా పెన్షన్ ఇచ్చే జాబితాలో చేర్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా మా ప్రభుత్వంలో ఈ పెన్షన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. 1,26,200 మంది ఇప్పటి వరకు గ్రామ సచివాలయల్లో పనిచేస్తున్నారు. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిది. రేపు గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం సస్పెండ్ అయిన జడ్జ్ ద్వారా దళితులలో లబ్ది పొందాలి అని చంద్రబాబు చూస్తున్నారు’ అని అన్నారు. చదవండి: ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం -
‘వైఎస్సార్ చేయూత’పై మంత్రులు సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ‘వైఎస్సార్ చేయూత పథకం’పై మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ‘వైఎస్సార్ చేయూత’కు రూ.4,643 కోట్లు గత ఏడాది నిధులు కేటాయించామని, ఈ నెల 11న రూ.6,790 కోట్లు చేయూతకు నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. (చదవండి: మహిళల ఆధ్వర్యంలో లక్ష రిటైల్ షాపులు) మహిళలు సాధికారత సాధించేందుకు చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పలు వ్యాపార సంస్థలు, బ్యాంకులతో చర్చించి మహిళలు వ్యాపారం చేసేలా ప్రోత్సాహం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 21 లక్షల మంది వివిధ వ్యాపారుల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. 8 లక్షల మంది పాత షాపులనే కొనసాగిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేంత వరకు సమీక్షలు కొనసాగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆమే’ రాణి) -
కోవిడ్ లక్షణాలున్నా పరీక్షలు రాయొచ్చు
సాక్షి, అమరావతి: కరోనా లక్షణాలు ఉన్నవారు సైతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు రాసేలా ప్రతీ కేంద్రంలో ప్రత్యేకంగా ఐసోలేషన్ పరీక్ష రూమ్ ఏర్పాటు చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఐసోలేషన్ రూమ్‌లో ఇన్విజిలేషన్ బాధ్యతలు నిర్వహించే వారికి పీపీఈ కిట్లతోపాటు ఆ గదిలో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న రాత పరీక్షల ఏర్పాట్లపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే.. ► పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స సదుపాయాలు, కోవిడ్ చికిత్సకు అవసరమైన మందులు, పల్స్ ఆక్సీమీటర్లతో కూడిన సామగ్రి అందుబాటులో ఉంచుతున్నాం. ► పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్కానర్ ఏర్పాటు. అభ్యర్థులు పరీక్షా సమయానికి కనీసం గంట ముందే వారికి కేటాయించిన కేంద్రానికి చేరుకుంటే మంచిది. ► నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించే పరిస్థితి ఉండదు. ► గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు పోటీ పరీక్షలను నిర్వహించగా, 1,10,520 ఉద్యోగాల భర్తీ పూర్తయింది. మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి ఇప్పడు రాత పరీక్షలు నిర్వహిస్తున్నాం. ► ఈ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకోగా, 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దళారులను నమ్మొద్దు: మంత్రి బొత్స ► పరీక్షల్ని అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. అర్హత గల ప్రతిభావంతులకే ఉద్యోగాలు వస్తాయి. ఎవరూ మధ్యవర్తులు, దళారులు చెప్పే మాటల్ని నమ్మొద్దు. ► ఈ విషయమై ఎప్పటికప్పుడు కలెక్టర్లు, ఎస్పీలను వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమన్వయం చేస్తున్నాం. ► కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు లేకపోయినా కొందరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారికి హాల్‌టిక్కెట్లు రావు. -
20 నుంచి గ్రామ, వార్డు సచివాలయల పరీక్షలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలన్ని నేరుగా ప్రజలకి అందేలా సచివాలయ వ్యవస్థ తెచ్చారు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి,జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్‌ల భర్తీపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో సచివాలయ పోస్ట్‌ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. 20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలలో, మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం. కరోనా పాజిటివ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన్ రూములను సిద్ధం చేశాం. పీపీఈ కిట్లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్ చేస్తారు’ అని చెప్పారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ‘సచివాలయ వ్యవస్థ వల్ల దేశంలో మన రాష్ట్రానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ఒక్కో సచివాలయంలో 12 నుంచి 14 మంది వరకూ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. గత ఏడాది 1.10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. 14062 గ్రామ సచివాలయాల్లో, 2166 వార్డు సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 10 లక్షల మంది ఇప్పటి వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. పరీక్షలు పకడ్బందీగా కోవిడ్ ప్రోటోకాల్‌తో నిర్వహిస్తాం. పాజిటివ్ వచ్చిన వారికి పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక రూమ్స్ ఏర్పాటు చేశాం. అభ్యర్థుల కోసం ఆర్టీసీతో కూడా మట్లాడాం. వారి సహకారం తీసుకుంటాం. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొంతమంది హాల్ టికెట్స్ రాలేదని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. నిర్దేశించిన అర్హతలు ఉన్నవారికి మాత్రమే హాల్ టికెట్స్ వస్తాయి’ అని ఆయన తెలిపారు. చదవండి: వీధి దీపాల నిర్వహణ సచివాలయాలకు -
వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ
సాక్షి, విజయవాడ: సెప్టెంబర్ 20నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం విజయవాడలో పంచాయతిశాఖ మంత్రి కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగల భర్తీపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమవేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే నెల 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై వారం రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. సుమారు 10లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. తొలిరోజే సుమారు 4.5లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. దాదాపు 3నుంచి 5వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువగా ఖాళీలు ఉన్న పశుసంవర్థక అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఉండాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఏపీపీఎస్సీ, పురపాలకశాఖ, వ్యవసాయ, పశుసంవర్థకశాఖ అధికారులు పాల్గొన్నారు. Village/Ward Secretariat Exams. 2020 in A. P. - It is informed to all the Applicants and others concerned, that Exams. will start from 20th September 2020. Detailed schedule will be released soon. — Gopal Krishna Dwivedi (@gkd600) August 12, 2020 -
బెజవాడలో కరోనాపై టాస్క్‌ఫోర్స్ మీటింగ్
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కరోనా కేసులపై టాస్క్ ఫోర్స్ మీటింగ్ జరిగిందని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా కట్టడికి రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీటింగ్ లో చర్చించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రత్యేకంగా డాక్టర్లు ను నియమించినట్లు చెప్పారు. స్వచ్చందంగా పని చెయ్యడానికి చాలా మంది డాక్టర్లు ముందుకు వచ్చారని ప్రశంసించారు. జిల్లా లో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి తగ్గింది కాబట్టి మామిడికి కనీస మద్దతు ధర కన్న మార్కెట్లో ఎక్కువే ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. (కర్నూలు ప్రజలకు భారీ ఊరట) కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటే దాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుందని వెల్లడించారు. కృష్ణాజిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇప్పటి వరకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, జూన్ నెలాఖరీకి తమ టార్గెట్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో కరోనా నియంత్రణకు పోలీసులు , డాక్టర్లు,పారిశుద్య కార్మికులు ,ఇతర అధికారులు చాలా కష్ణపడి పనిచేస్తోన్నారని అభినందించారు. అందరి కృషి వల్లే జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని కొనియాడారు.ప్రజలందరు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు. (‘సామాజిక దూరం అంటే చంద్రబాబు 600 కి.మీలు వెళ్లారు’!) -
వాలంటీర్లపై టీడీపీ నేతల అసత్య ప్రచారం
-
ఈ అవినీతి బండారంపై లోతుగా విచారణ చేయాలి
-
ఏపీ: పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు 72.54 శాతం పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ అయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీతో ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. 39 లక్షల 66 వేల మందికి ఒక్కపూటలో గ్రామ వాలంటీర్లు పించన్లు అందజేశారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా అత్యధికంగా కడప జిల్లాలో 84.43 శాతం, నెల్లూరులో 83.18 శాతం పింఛన్లను పంపిణీ చేశారని పెద్దిరెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటింటికి పింఛన్లు అందజేశామని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేశారు. పింఛన్ల కోసం ఫిబ్రవరి నెల రూ. 1,320 కోట్లు విడుదల చేశామని ఆయన వెల్లడించారు. ఇంటింటికి పింఛన్లను డోర్ డెలివరీ చేయడం దేశంలో ఎక్కడా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. (రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటి వద్దకే పెన్షన్' ప్రారంభం) -
చంద్రబాబు భారీ మూల్యం చెల్లించక తప్పదు..!
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రంగా ఖండించారు. హేయమైన చర్యగా ఆయన వర్ణించారు. పిన్నెల్లిపై దాడికి టీడీపీ బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ఈ దాడిలో పాల్గొన్నారని అన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని టీడీపీ భావిస్తోందని విమర్శించారు. ప్రణాళికా ప్రకారమే టీడీపీ గుండాలు ఈ దాడికి దిగారని మంత్రి మండిపడ్డారు. (పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) చంద్రబాబుకు చెందిన రౌడీలే పిన్నెల్లి పై దాడి చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్టాడుతూ.. ‘రాజధానిలో ఎమ్మెల్యేలు పర్యటిస్తే దాడులు చేస్తారా?. విధ్వంసం సృష్టించి అల్లర్లు చేయించాలని చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా..? శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది అని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యేలను పర్యటించనివ్వరా..? చంద్రబాబు గుండాలు రైతుల ముసుగులో దాడులు చేశారు. రైతులు ఎవ్వరైనా రాళ్లు విసిరి, గన్మ్యాన్లను కొడతారా. ఇలాంటి దాడులను ప్రభుత్వం ఉపేక్షించదు. చంద్రబాబు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాయలసీమ ప్రజలు నీళ్లు, ఉపాధి కోరుతున్నారు. ముందు చూపుతో సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. -
ఇది సంక్షేమ రాజ్యం
పెడన: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చేనేత కారి్మకుల సంక్షేమం, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏటా ప్రభుత్వం లబి్ధదారుల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున జమ స్తుందని తెలిపారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత వరకు నేత కారి్మకులకు సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. జిల్లాలో 4,270 మందికి చేనేతలకు రూ.10.24 కోట్లు అందనున్నట్లు స్పష్టం చేశారు. ముద్ర యోజన రుణం కింద ఏడు శాతం వడ్డీ రాయితీతో రూ.లక్ష మాత్రమే ఇచ్చేవారని, ఇదే రాయితీతో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అందించేలా ముఖ్యమంత్రి నేత కార్మికుల కోసం అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నవరత్నాలలోని పథకాలను తూచా తప్పకుండా అమలుచేసి తీరుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే 80 శాతం హామీలు అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చేస్తాను అని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదికాలాల పాటు సీఎంగా ఉండేలా మద్దతు ఇద్దామన్నారు. నేత కార్మికులకు ఆత్మగౌరవం అధికం : మంత్రి పేర్ని నాని నేత కార్మికులు ఆత్మగౌరవంతోనే జీవిస్తుంటారని, వారికి పనులు లేకపోయినా పస్తులుంటారే తప్ప ఏనాడు కూడా చేయి చాచిన దాఖలాలు లేవని రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. నేత కార్మికులను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో సబ్సిడీ రుణాలు, నూలుపై రాయితీలు వంటివి ఏమి కాకుండా నేరుగా నేత కార్మికుని బ్యాంకు ఖాతాలో రూ.24 వేలు జమ అయ్యేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. చేనేతలను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో : మంత్రి కొడాలి నాని చేతి వృత్తిదారుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అధికంగా నేత కార్మికులున్నారని, వారిని ఆదుకోవాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. పలు పథకాలు డిసెంబరు 21న ప్రారంభించుకుందామని చెప్పినా తిరస్కరించిన ముఖ్యమంత్రి, నేత కార్మికులు అధికంగా ఉండే ధర్మవరం నియోజకవర్గంలో నేతన్నల నడుమ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి, వైఎస్సార్ నేతన్న నేస్తం ప్రారంభించేందుకు వెళ్లారని తెలిపారు. చేనేత కార్మికుల పట్ల సీఎంకు ఉన్న అంకితభావం ఎటువంటిదో మీరే ఆలోచించుకోవాలన్నారు. పెడన నియోజకవర్గంలో అధికంగా లబ్ధిదారులు : ఎమ్మెల్యే జోగి రమేష్ జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి అర్హులు 4,270 మంది ఉంటే అందులో పెడన నియోజకవర్గంలో 3,219 మంది ఉన్నారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ సొంత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి రూ.24 వేలు జమ అవుతాయని చెప్పారు. ఆ డబ్బుతో తమ మగ్గాలను ఆధునికీకరించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. డీసీఎంఎస్ చైర్మన్ ఉప్పాల రాంప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, మాజీ కౌన్సిలర్ కటకం ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు భళ్ల గంగాధరరావు, కేడీసీసీబీ డైరెక్టర్ నల్లమోతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మాజీ కౌన్సిలర్లు గరికిముక్కు చంద్రబాబు, మెట్ల గోపిప్రసాద్, బంటుమిల్లి, పెడన, కృత్తివెన్ను, గూడూరు మండలాల పార్టీ అధ్యక్షులు మలిశెట్టి రాజబాబు, దావు బైరవలింగం, కొల్లాటి గంగాధరరావు, తలుపుల కృష్ణ, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, చేనేత జౌళి శాఖ ఏడీ ఎస్.రఘునంద, ఆర్డీఓ ఖాజావలి, తహసీల్దారు పి.మధుసూదనరావు, కమిషనర్ అబ్దుల్రïÙద్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇసుక కొరతపై టీడీపీ దుష్ప్రచారం’
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేరు కాబట్టే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు–భూగర్భ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా వచ్చినప్పటి నుంచి వర్షాలు ఎక్కువగా పడి వరద నీరు భారీగా నదులలో చేరుతుండడంతో.. ఇసుక తవ్వకాలు ఎలా సాధ్యమవుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుండడంపై మంత్రి మండిపడ్డారు. ఏ అంశంపై మాట్లాడాలో టీడీపీ నేతలకు తెలియక దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతలెవ్వరు ఇసుక వ్యాపారం చెయ్యడం లేదని పేర్కొన్నారు. టీడీపీ నేతలు గతంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాత రిజర్వేషన్లు కొనసాగించి ఎన్నికలు నిర్వహించే విషయమై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. -
రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్
సాక్షి, అమరావతి: 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలన్నదే లక్ష్యమని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వాటర్‌గ్రిడ్ పథకంపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. రెండు దశల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాలకు పైప్లైన్ల ద్వారా నీటి సరాఫరా అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో దీర్ఘకాలంగా భూగర్భజలాల వినియోగిస్తున్నారని...ఆ మూడు జిల్లాల్లో సర్ఫేస్ వాటర్ సరఫరాకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్ కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని..ప్రత్యామ్నాయంగా పైప్లైన్ల ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చిత్తూరు, కడప, నెల్లూరు,ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. గిరిజన గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని.. జిల్లాల్లో జలాశయాలు, నదులు, నీటివనరుల లభ్యతపై సమగ్ర అంచనాలు తయారు చేయాలన్నారు. -
పరిశుభ్రమైన తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్ గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ పథకం కింద మొదటి దశలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. రెండో దశలో విజయనగరం, విశాఖ, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో శుభ్రమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులపై దృష్టి పెట్టండి నీటిని సేకరించిన చోటే శుద్ధి చేసి, అక్కడ నుంచి ప్రజలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై నిశితంగా అధ్యయనం చేసి, ప్రణాళిక ఖరారు చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల స్థితిగతులపై దృష్టి పెట్టాలని చెప్పారు. చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో తాగునీరు నింపాక కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కిడ్నీ వ్యాధుల బాధితులు ఉన్న ప్రాంతాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి నేరుగా వారి ఇళ్లకే తాగునీరు సరఫరా చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. -
విప్లవాత్మక బిల్లులు పెట్టాం:పెద్దిరెడ్డి
-
‘ఆ టెండర్లు అన్నీ రద్దు చేస్తాం’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం డ్రికింగ్ వాటర్ కార్పొరేషన్‌తో నిధులు తెచ్చి వాటిని పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని పంచాయతీ రాజ్, గ్రామిణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో తాగు నీరు కోసం కార్పొరేషన్ పెట్టి రూ.17,730 కోట్లకు టెండర్లు పిలిచారన్నారు. ఎన్నికల ముందు ఆగమేఘాల మీద ఏడు కన్సెల్టెన్సీలకు ఇచ్చారని ఆరోపించారు. ఇదంతా కమీషన్ల కోసమే చేశారన్నారు. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి తిరిగి కొత్తగా డీపీఆర్‌లను సిద్ధం చేసి ముందకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా డీపీఆర్‌లను తయారు చేసి అన్ని గ్రామాలకు దశల వారిగా నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. -
జిల్లాకు కీలక పదవులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు కల్పించి కీలకమైన శాఖలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టి జిల్లా అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. జిల్లాకు పెద్ద దిక్కుగా చెప్పుకునే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పెద్దిరెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖలను అప్పగించారు. కళత్తూరు నారాయణస్వామిని డెప్యూటీ సీఎం చేయడంతో పాటు ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖలను అప్పజెప్పారు. సాక్షి, తిరుపతి : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి... రాజకీయ ఉద్ధండుడయ్యారు. రాజకీయ నాయకులతో పాటు... ప్రజలు కూడా పెద్దాయన అని పిలుస్తుం టారు. విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగిన ఆయన ఎంఏ పీహెచ్డీ పూర్తిచేశారు. 1975లో విద్యార్థి సంఘం చైర్మన్‌గా విజయం సాధించారు. నీలం సంజీవరెడ్డి ప్రోత్సాహంతో 1978లో పీలేరు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1989, 1999, 1999, 2004, 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెద్దిరెడ్డి 2019లో పుంగనూ రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎన్.అనీషారెడ్డిపై 43,555 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2009లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో తొలుత మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా విశేష సేవలందించారు. అటవీశాఖతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దివంగతులయ్యాక మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా చాకచక్యంగా రాజకీయాలు నడిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం చేసుకున్నారు. జిల్లాకు చెందిన చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోయినా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. వారిద్దరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా... భయపడకుండా వారి ప్రజావ్యతిరేకపాలనపై పోరాడారు. కార్యకర్తలకు అండగా ఉంటూ... కష్టాలు, నష్టాలకు ఓర్చి అన్నీ తానై వ్యవహరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో పెద్దిరెడ్డి తోపాటు ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. కేంద్ర రాజకీయాల్లోనూ... పెద్దిరెడ్డి రాజకీయ నాయకులతోనే కాకుండా ప్రజలతో మంచి సంబంధాలు నెరపుతారు. ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలపై వెంటనే స్పంది స్తుం టారు. పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర స్థాయిలోనూ రాజకీయాలు నెరిపిన నేతగా పేరుంది. ప్రస్తుతం కుమారుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీగా ఘన విజయం సాధించి లోక్‌సభ పక్ష నేతగా ఎంపికయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా భారీ విజయం సొంతం చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ నాయకుడు నారాయణస్వామి వైఎస్ జగన్ తొలి మంత్రివర్గంలో మరో మంత్రి కళత్తూరు నారాయణస్వామి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణస్వామికి మంత్రివర్గంలో చోటు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. నారాయణస్వామి స్వగ్రామం కార్వేటినగరం మండలం పాదిరికుప్పం. బీఎస్సీ వరకు చదువుకున్నారు. జిల్లా అంబేడ్కర్ యువజన సంఘం కార్యదర్శిగా కొనసాగారు. 1981లో కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లోనే కార్వేటినగరం సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1987లో కార్వేటినగరం ఎంపీపీగా ఎన్నికయ్యారు. పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్ హయాంలో 2004లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ దివంగతులయ్యాక కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్సీపీ జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్‌గా, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమస్వయకర్తగా పనిచేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా రు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్థులపై ఘన విజయం సాధించారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నారాయణస్వామికి ప్రత్యేకించి దళిత సామాజికవరా>్గనికి అవకాశం కల్పించా లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చోటు కల్పించారు. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణస్వామికి డెప్యూటీ సీఎంతో పాటు.. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖలు అప్పగించారు. సత్యవేడుకు ‘కళ’త్తూరు మార్క్ సత్యవేడు నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత ఒక్కసారిగా అభివృద్ధి జరిగింది నారాయణస్వామి హయాం లోనే. 1961లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే సాగింది. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో 2004–2009 మధ్య కాలంలో నారాయణస్వామి ఆ నియోజవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ ప్రోత్సాహం, నారాయణస్వామి కృషితో అప్పట్లోనే ఆ నియోజకవర్గ పరిధిలో శ్రీసిటీ ఏర్పాటైంది. దేశ, విదేశ పరిశ్రమలు వందలాదిగా ఏర్పాటు కావడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. నియోజకవర్గానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. విద్యాభివృద్ధికి డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరయ్యాయి. రైతాంగం కోసం నాగలాపురం మండలంలో భూపతేశ్వరకోన ప్రాజెక్టు, ఉబ్బలమడుగు సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. తెలగుగంగ ప్రధాన కాలువ నుంచి రూ. 100 కోట్ల నిధులతో ఉపకాలువలు తవ్వించి 17 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పించేందుకు కృషి చేశారు. సత్యవేడు ఎమ్మెల్యేగా నారాయణస్వామి ఉన్న ఆ ఐదేళ్లలో తప్ప... అంతకుమునుపుగానీ ఆ తరువాతగానీ అంతటి అభివృద్ధి జరగలేదు. -
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెద్దిరెడ్డి
-
కాబోయే ముఖ్యమంత్రి జగనే
పుంగనూరు (చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళిని బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 140 స్థానాలు లభిస్తాయని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు బైబై చెప్పి వైఎస్. జగన్మోహన్రెడ్డికి పట్టం కట్టారని పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం పుంగనూరులో పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలో 140 స్థానాలకు పైగా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని చాటుకున్నారని, వైఎస్.జగన్మోహన్రెడ్డి పట్టుదల, కృషితో చేపట్టిన ఎన్నికల సంగ్రామానికి రాష్ట్ర ప్రజలు అండగా నిలిచారన్నారు. -
అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టండి
చిత్తూరు కలెక్టరేట్: నాలుగన్నర సంవత్సరాలుగా బాధితులను ఆదుకోకుం డా అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్న అవినీతి టీడీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం చిత్తూరులోని కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ధర్నా చేపట్టారు. తొలుతనగర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దుర్గమ్మ ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా శిబిరంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు. శాసనసభలో దీనిపై తొలిసారి తమ పార్టీయే గళం విప్పిందన్నారు. బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడకూడదని సూచించారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆ సొమ్మును బాధితులకు అందజేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై టీడీపీ కన్నుపడిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, కుమారుడు లోకేశ్, మంత్రులు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకునేందుకు ప్రయత్నిం చడం దారుణమన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19.70 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. 1995 నుంచి అగ్రిగోల్డ్ చిన్న రైతులు, అన్ని వర్గాల నుంచి డిపాజిట్లు సేకరించిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణం ఏదైనా ఉందంటే అది అగ్రిగోల్డేనన్నారు. అలాంటి వారికి టీడీపీ ప్రభుత్వం మద్ధతు పలికి చర్యలు చేపట్టకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇదంతా సీఎం చంద్రబాబునాయుడు అసమర్థపాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది మృతి చెంది తే 140 మందికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. టీడీపీ మంత్రులు పత్తిపాటి, సుజనాచౌదరిలు అగ్రిగోల్డ్ భూములను దోచుకుంటున్నారని విమర్శించారు.అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డీఆర్వో గంగాధరగౌడ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాంధీ, జెడ్పీ మాజీ చైర్మన్ కుమారరాజా, ఈసీ మెంబర్ పురుషోత్తంరెడ్డి, అగ్రిగోల్డ్ బాసట కమిటీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, బంగారుపాళెం మాజీ ఎంపీపీ సుగుణాకర్‌రెడ్డి, వేల్కూరు బాబురెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ నాయకుడు గోవిందన్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు చేసేవన్నీ అవకాశవాద రాజకీయాలు
-
చిత్తూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
సిగ్గుమాలిన రాజకీయాలకు కేరాఫ్ బాబే
విజయవాడ సిటీ: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిగ్గుమాలిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకోవడం చూస్తే వైఎస్సార్ మరణం తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పెట్టిన కేసులన్నీ చంద్రబాబు కుట్రలో భాగమేనని స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబుకు బీజేపీ, కాంగ్రెస్‌తో రెండింటితోనూ సంబంధం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని రంగులైనా మార్చగల సమర్ధుడని వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి, ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా మోసం చేసిన కాంగ్రెస్‌తో పొత్తుకు తెలుగుదేశం పార్టీ వెంపర్లాడడం సిగ్గుచేటన్నారు. నాలుగున్నరేళ్లు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రజల వద్దకు ఏమని చెప్పి వెళ్లాలో తెలియక సతమతమవుతూ మానసిక జబ్బుతో బాధపడుతున్నారన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి చెందినప్పుడే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చనిపోయిందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పార్టీ సిద్ధాంతాలు, విలువలను మరిచి చంద్రబాబు కాంగ్రెస్‌తోనే పొత్తుకు సిద్ధమవుతున్నాడన్నారు. ప్రతిపక్షంలో ఉండి అధికారపార్టీకి మద్దతు ఇచ్చిన ఘనుడు గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మద్దతు ఇచ్చి మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కాడని మండిపడ్డారు. అప్పటి నుంచే చంద్రబాబు కాంగ్రెస్‌తో సంబంధాలు పెట్టుకున్నాడన్నారు. 2014లో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్‌ను సోనియాగాంధీని బండబూతులు తిట్టాడని, గుంటూరుకు కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తే కోడిగుడ్లతో కొట్టించాడని, కాంగ్రెస్‌ను అంతమొందించేందుకు కత్తులు, కొడవళ్లు పట్టుకొని రోడ్ల మీదకు రావాలని పిలుపునిచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ‘‘కాంగ్రెస్ దేశానికి పట్టిన శని, కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి, కాంగ్రెస్ విధానం దోచుకోవడమే, కాంగ్రెస్‌ను పాతరవేయాలి’’ అంటూ చంద్రబాబు చేసిన అనేక ఆరోపణల పత్రికా కథనాలను సైతం పెద్దిరెడ్డి మీడియాకు చూపించి వివరించారు. ఇప్పుడు పథకం ప్రకారమే కిరణ్‌కుమార్‌రెడ్డిని చంద్రబాబు కాంగ్రెస్‌లో చేర్పించారని పెద్దిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆనాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముళ్లు వీరప్పను మించిన స్మగ్లర్లు అని ఆరోపణలు చేసిన చంద్రబాబు వారిని పిలిచి కార్పొరేషన్ చైర్మన్‌గా కేబినెట్ ర్యాంకు ఇచ్చాడని గుర్తు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి దొంగల కంపెనీకి నాయకుడని మాట్లాడి ఇప్పుడు వారితోనే పొత్తుకు చంద్రబాబు సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. చిత్తూరు జిల్లాలో 12 వందల అడుగుల మేర బోరు వేసినా నీళ్లు వస్తాయనే నమ్మకం లేదని, అలాంటి చోటు నుంచి వచ్చిన చంద్రబాబు అసెంబ్లీలో కరువును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.. 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని చెప్పకోవడం హేయనీయమన్నారు. ఖరీఫ్‌లో ఒక్క ఎకరానైనా రెయిన్‌గన్స్‌తో ఒక్క ఎకరా పంట కాపాడి ఉన్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. -
పాదయాత్రతో పెనుమార్పులు
విజయవాడ సిటీ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం చేరేసరికి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా జగన్ వెంట నడుస్తున్నారని తెలిపారు. తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ చేరుకున్న సమయంలో జగన్‌కు ప్రజలు పలికిన ఘనస్వాగతమే అందుకు నిదర్శనమన్నారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభానుతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడారు. నవంబరు 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర సోమవారం 2,000 కిలోమీటర్ల మైలురాయి దాటుతుందని, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామం ఇందుకు వేదిక కానుందని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జగన్ అక్కడ 40 అడుగుల స్థూపాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. జగన్ పాదయాత్రకు లభిస్తున్న స్పందన చూసి చంద్రబాబుకు మతిభ్రమించిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. వడ్డీలకు సరిపోకుండా రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 92 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతకు 40 లక్షల ఉద్యోగాలు కల్పించటంతోపాటు 20 వేల పరిశ్రమలు తెచ్చామంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారన్నారని ధ్వజమెత్తారు. నిజంగానే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే అదే పార్టీకి చెందిన మహారాష్ట్ర మంత్రి భార్యను టీటీడీలో సభ్యురాలిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. బీజేపీతో అంటకాగుతూ వైఎస్సార్ సీపీపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఆమోదం పొందుతాయని, ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పెద్దిరెడ్డి స్వాగతించారు. ఉప ఎన్నికలను రిఫరెండంగా భావించాలని, టీడీపీకి డిపాజిట్లు రాకంటే చంద్రబాబు తక్షణమే రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. -
ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ములేదు
పీలేరు/కల్లూరు: సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చే యించి ఎన్నికలకు వెళ్లే దమ్ముధైర్యం సీఎం చంద్రబాబునాయుడుకు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఇంటింటికీ వైఎస్సార్ కుటుం బంలో భాగంగా పులిచెర్ల మండలం కొడిదపల్లెలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన వారికి రూ.కోట్లు ఇచ్చి కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపిం చారు. ఈ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసే వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. పులిచెర్ల మం డలంలోని దిగువపోకలవారి వారిపల్లె, 102ఇరామిరెడ్డిగారిపల్లె, ఎర్రపాపిరెడ్డిగారిపల్లె, పులిచెర్ల, రెడ్డివారిపల్లె, కమ్మపల్లె, అయ్యావాండ్లపల్లెలో ఆయన పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శమని, ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాలని పేర్కొన్నారు. -
కావలి ఎమ్మెల్యే దీక్షకు జిల్లా నేతల మద్దతు
తిరుపతిరూరల్: నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే బండి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు. దీక్షా శిబిరానికి వెళ్లి ఎమ్మెల్యేతో పాటు దీక్షలో కూర్చున్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కరువు ప్రారంభమైందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి హాయంలో పుష్కలంగా పడిన వర్షాలు చంద్రబాబు రాగానే ముఖం చాటేశాయని ఎద్దేవా చేశారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు ఏ వర్గానికి కూడా మేలు చేయని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబని దుయ్యబట్టారు. గ్రామాల్లో నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే విదేశీ పేరుతో చంద్రబాబు ఎంజాయ్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రైతులు, ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నిత్యం పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. -
వైఎస్సార్ సీపీ బలోపేతానికే పల్లెబాట
‘ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సమస్యలను గుర్తిస్తూ, వాటికి పరిష్కారం చూపుతూ తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే పల్లె బాట కార్యక్రమం చేపట్టాం’ అని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చౌడేపల్లె: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లెబాట కార్యక్రమం చేపట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం ఎమ్మెల్యేలు కే.నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డితో కలిసి చౌడేపల్లె మండలంలో పర్యటించారు. చిన్నగొర్నికుంట, కాటిపేరి, వడ్డివారిపల్లె, గురుమర్థనపల్లె, అగిస్తిగానిపల్లె, గిరిజాపురం, కావలివారిపల్లె,పెద్దగొర్నికుంట, లద్దిగం, పుదిపట్ల తదితర గ్రామాల్లో పర్యటించారు. పల్లెపల్లెలో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలను మోసగించే కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని విస్మరించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. హుద్‌హుద్ బాధితుల సాయం కోసం కేంద్రం ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లను తీసుకోలేని స్థాయిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. పార్టీని పట్టిష్టం చేస్తాం.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కే.నారాయణస్వామి తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసమే పల్లెబాట కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, జెడ్పీటీసీలు రుక్మిణమ్మ, వెంకటరెడ్డియాదవ్, ఎంపీపీలు అంజిబాబు, నరసింహులు, పార్టీ జిల్లా నేతలు ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, ఎన్.రెడ్డెప్ప, పోకల అశోక్‌కుమార్, మునిక్రిష్ణారెడ్డి, జింకా వెంకటాచలపతి, బెరైడ్డిపల్లె క్రిష్ణమూర్తి, విశ్వనాథం, జి.శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.