నిమ్మగడ్డకు మరోసారి ఎదురుదెబ్బ | AP High Court Permission To Peddireddy To Speak With Media | Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డకు మరోసారి ఎదురుదెబ్బ

Published Wed, Feb 10 2021 12:49 PM | Last Updated on Wed, Feb 10 2021 8:16 PM

AP High Court Permission To Peddireddy To Speak With Media - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన విధించిన ఆంక్షలను హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. మీడియా సమావేశం నిర్వహించేందుకు మంత్రి పెద్దిరెడ్డికి న్యాయస్థానం అనుమతిని మంజూరు చేసింది. మీడియా సమావేశాలు నిర్వహించరాదని పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ విధించిన ఆంక్షలను చెల్లుబాటుకావని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రి  మీడియాతో మాట్లాడేందుకు అనుమతినిస్తూ బుధవారం తీర్పును వెలువరించింది. పంచయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డిపై నిర్బంధం విధిస్తూ, మీడియాతో మాట్లాడకుండా నిమ్మగడ్డ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

 ఎస్‌ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి గతవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన​ దాఖలు చేశారు. దీనిపై ఆదివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిమ్మగడ్డ ఉత్తర్వులను కొట్టివేసింది. మంత్రిపై నిర్బంధం విధిస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టింది. మంత్రి ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే మీడియాతో మాట్లాడకూడదంటూ ఇచ్చిన ఉత్తర్వులను మాత్రం న్యాయస్థానం తొలుత సమర్థించింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌.. మీడియాతో మాట్లాడకుండా ఉండాలంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఆంక్షలను తప్పుపట్టింది. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.

నిమ్మగడ్డ ఉత్వర్వులను కొట్టివేసిన హైకోర్టు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement