మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం: మంత్రి బొత్స | Minister Botsa Satyanarayana Comments on AP Capital Issue | Sakshi
Sakshi News home page

మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం: మంత్రి బొత్స

Published Thu, Mar 3 2022 7:41 PM | Last Updated on Thu, Mar 3 2022 9:55 PM

Minister Botsa Satyanarayana Comments on AP Capital Issue - Sakshi

సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ అనేది మా ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయాన్ని పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పారు. మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం. రాజధాని అంటే భూములు, ఓ సామాజిక వర్గం కాదు. ఇతర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా..?. సీఆర్డీఏ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వం ఉద్దేశ్యం. హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

చదవండి: (సీఆర్‌డీఏ చట్టం అమలులోనే ఉంది: మంత్రి బొత్స)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement