Capital Amaravati
-
బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'
సాక్షి, అమరావతి: వారం.. వారం అప్పులే! బడ్జెట్లోనూ.. బడ్జెట్ బయటా అప్పుల మోతలే! ఎటు చూసినా రుణ భారమే! ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే! రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తాజాగా రూ.1.19 లక్షల కోట్లను దాటేశాయ్! చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంట్ చార్జీల బాదుడు.. ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు.. మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన రూ.5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకు ఎగబాకింది! సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మూడు నెలల ముందే..మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి రూ.74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని ‘కాగ్’ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం రూ.8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కార్పొరేషన్ల పేరుతో మరిన్ని..కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారెంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు–మర్చంట్ బ్యాంకర్‌ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి ఒక్కటీ అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు.పథకాలు లేవు.. మరి ఏం చేస్తున్నట్లు?వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మిన విషయం తెలిసిందే. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్ సిక్స్, సెవెన్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూలు పిల్లలకు ‘అమ్మ ఒడి’ లేదు. విద్యార్థులకు రూ.3,900 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. హామీలను అమలు చేయకుండా.. పథకాలను నిలిపివేస్తూ.. ఎడాపెడా అందినకాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కారు అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. అటు అప్పులు.. ఇటు అమ్మకాలుఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అప్పులతోనే అమరావతి!రాజధాని అమరావతి కోసం తొలి దశలో రూ.52 వేల కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి రూ.5 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సీఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా రూ.21 వేల కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
అమరావతి పార్టనర్.. ఈశ్వరన్‌కు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట జరిగిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్వదేశంలో అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) విచారణలో నిగ్గు తేలింది. ఈశ్వరన్ అవినీతికి పాల్పడినట్టు న్యాయ విచారణలో కూడా నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. జూనియర్ అధికారి నుంచి మంత్రిగా.. 2008లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్ అనతి కాలంలో ఉన్నత స్థానానికి ఎగబాకారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి ఈశ్వరన్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ – సింగపూర్ పర్యాటక విభాగాల మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గత ఏడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన ఈశ్వరన్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్ïÙట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించినట్లు ఒక అభియోగం నమోదైంది. బాబు భూ దోపిడీలో పార్టనర్ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం రాజధాని పేరిట యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమిక పోషించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి నాటి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా హడావిడి చేసింది. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బృందం బినామీ పేర్లతో కొల్లగొట్టింది. ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ ఈశ్వరన్ కీలక పాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామిక వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
హైవేతో అమరావతి అనుసంధానం
సాక్షి, అమరావతి: రాజధాని(అమరావతి) ప్రాంతాన్ని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16)తో కలిపేందుకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడి గ్రామాల మీదుగా ఆరు లేన్లతో నాలుగు ప్రధాన రహదారులను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరు లేన్ల రోడ్ల పనులకు సంబంధించి అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సైతం సిద్ధం చేశారు. త్వరలో సీఎం చంద్రబాబుతో సమావేశమై నిర్ణయం తీసుకుని టెండర్లకు వెళ్లాలని సీఆర్డీఏ యోచిస్తోంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గతంలోనే ఈ రోడ్లకు అలైన్మెంట్ కూడా చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే వీటిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలోని ప్రధాన రహదారులను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ–1 నుంచి ఈ–16 వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్–1 నుంచి ఎన్–18 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ–5, ఈ–11, ఈ–13, ఈ–15 రోడ్లు నిర్మించి.. పడమర వైపు ఉన్న ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. కాగా, రాజధాని నుంచి గ్రామాల మీదుగా వెళ్తున్న ఈ రహదారుల నిర్మాణానికి పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–5 రహదారి ఈ రోడ్డు నిర్మాణం ఉండవల్లి నుంచి ప్రారంభమవుతుంది. ఉండవల్లి, మందడం, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం మీదుగా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. మొత్తం 18 కి.మీలు మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ మార్గం.. గ్రామాల మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–11 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 6.3 కి.మీ మేర.. జాతీయ రహదారితో అనుసంధానించేందుకు మరో 4.50 కి.మీ మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. ఈ రోడ్డును నీరుకొండ, కురగల్లు, నవులూరు మీదుగా మంగళగిరిలోని ఎయిమ్స్ ముందు నుంచి ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. ఈ–13 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. అనంతరం మంగళగిరి వద్ద ఎన్‌హెచ్–16తో అనుసంధానించేందుకు మరో 2.5 కి.మీ మేర రోడ్డును విస్తరించి ఎయిమ్స్ వెనుక నుంచి జాతీయ రహదారితో కలుపుతారు. ఈ రోడ్డు నీరుకొండ డౌన్ నుంచి నిడమర్రు, ఎర్రబాలెం, నవులూరు, మంగళగిరి మీదుగా వెళుతుంది. ఈ–15 రహదారి నిడమర్రు నుంచి జగనన్న లేఅవుట్, నవులూరు, క్రికెట్ స్టేడియం మీదుగా ఎయిమ్స్ వద్ద ఉన్న పాత హైవేకు అనుసంధానం చేస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు(ఈ–3)ను.. దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 21 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టారు. అయితే, దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కి.మీ మేర రోడ్డు పూర్తయ్యాక అనేక వివాదాలతో పనులు నిలిచిపోయాయి. రెండో ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 3 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. మరో 4 కి.మీ మేర మార్గంలోని రైతులను ఒప్పించి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని సీఆర్డీఏ భావిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ఈ నెలలోనే టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. -
విరాళాలు, ఆస్తుల అమ్మకం.. ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట!
సాక్షి, అమరావతి: ‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగు జాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరు. విధ్వంసానికి జగన్ ఒక కేస్ స్టడీ. మాకు రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. తెలివి గల మానవ వనరులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఒక టైమ్ బాండ్ అంటూ పెట్టుకోలేదని, పాత ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేయడం చూస్తుంటే.. గత ప్రభుత్వం చెప్పిందే నిజమని స్పష్టమవుతోంది. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదని, రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు అమరావతి పేరును సూచించారన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి.. దేశంలోని అన్ని పవిత్ర ప్రదేశాల నుంచి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చామన్నారు. కుప్పం వారికైనా, ఇచ్ఛాపురం వారికైనా అమరావతి సమదూరంగా ఉంటుందని, అందువల్లే ఇక్కడ రాజధాని నిర్ణయించినట్టు చెప్పారు. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరని, రాజధానికి రెండు వైపులా 12 చొప్పున ఎంపీ స్థానాలు ఉన్నాయని, విభజన అనంతరం శివరామృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి కృష్ణా, గుంటూరు లేదా ఆ 2 జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు చెప్పిందన్నారు. ఏటా 3 పంటలు పండే మంచి భూమిని రాజధాని కోసం తీసుకోవడం సరికాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని ఇక్కడ ఆయన వక్రీకరించి అనుకూలంగా మార్చుకున్నారు.హైదరాబాద్‌కు కరెంట్, నీళ్లు.. బాబు ఘనతేనటగతంలో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉన్నా, సైబరాబాద్ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌కు నాడు సరిగా కరెంట్, నీళ్లు లేవని.. రానురాను అన్నీ కలిసొచ్చాయన్నారు. ఎంత మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చామని, 14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ పరిశ్రమలను కూడా సైబరాబాద్‌కు తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చామని, తన హయాంలో సాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశానని బాబు గొప్పలు చెప్పుకున్నారు. తొలుత అమరావతికి ల్యాండ్ పూలింగ్ సాధ్యమవుతుందా.. అని అనుమాన పడినా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను 29,966 మంది రైతులు ఇచ్చారన్నారు. ఈ రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వాలని నిర్ణయించామని, వ్యయసాయ కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్ అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 1నే దాన్ని రూ.5 వేలకు పెంచి అందించామన్నారు. వాస్తవంగా పెన్షన్‌ను పెంచింది గత ప్రభుత్వమనే విషయాన్ని మరచి తన ఖాతాలోకి వేసుకోవడం బాబుకే చెల్లింది.గత ప్రభుత్వంపై ఏడుపువైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభించారని, కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ప్రజా వేదికను కూల్చేశారని, తర్వాత మూడు రాజధానులు ప్రకటించారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘జీఎన్.రావు, బోస్టన్ కమిటీ అంటూ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజావేదిక శిథిలాలను తొలగించవద్దని ఇప్పుడు అంతా చెబుతున్నారు. అది చూస్తే ప్రతి ఒక్కరిలో గత ప్రభుత్వ విధ్వంసం గుర్తుకు రావాలి. జగన్ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారు. తిరుపతి యాత్రకు వెళితే ఉండటానికి మండపాలు ఇవ్వకుండా వేధించారు. అరసవెల్లి యాత్రకు వెళితే దాడులు చేసి మధ్యలోనే నిలిపేయించారు’ అని సీఎం చంద్రబాబు మొసలి కన్నీళ్లు కార్చారు. గత పాలకులు అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారని, వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేశారని, రూ.1000 కోట్లు గ్రాంట్ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశారని.. ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. సింగపూర్ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారని, 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్‌ను నాశనం చేశారని, అది పూర్తయితే ప్రభుత్వానికి రూ.57.37 కోట్లు ఆదాయం వచ్చేదని, మున్ముందు రూ.885 కోట్లకు పెరిగేదన్నారు. కానీ దాన్ని కూడా నాశనం చేయడంతో ఇప్పుడు రూ.164.5 కోట్ల నష్టంతో పాటు రాజధాని పరిధిలోని రోడ్లు, భవనాలు దెబ్బ తిన్నాయన్నారు.నిర్మాణ ఖర్చు పెంచడానికే ఈ మాటలు..గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసంతోనే రాజధాని నిర్మాణం ఖర్చు పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పడం చూస్తుంటే మళ్లీ ఎస్టిమేషన్లు పెంచుకోవడం కోసమేనని తెలుస్తోంది. ‘రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లింది. సంపద ఉత్పత్తి పెరగలేదు. అన్ని రంగాలు రివర్స్ అయ్యాయి. నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలో ఉన్న పనులు పూర్తవలేదు. రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. ఏపీలో భూముల విలువ కూడా తగ్గిపోయింది. హైకోర్టు, హెచ్‌వోడీ, సచివాలయాల భవనాల ఐకానిక్ పునాదులన్నింటినీ నీళ్లలో ముంచేశారు. గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జీల కోసం నిర్మించ తలపెట్టిన వాటిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. నేను పడ్డ కష్టం వృధా అయింది. అది చూస్తే మనసు నిగ్రహం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాజధాని కాలం కూడా అయిపోంది. పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. సింగపూర్ ప్రతినిధులు వస్తారో రారో తెలీదు. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం మనది. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? నన్ను ఇబ్బందులు పెట్టారని నేను మాట్లాడడం లేదు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదు. బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతా’ అని అన్నారు.ఉద్యోగ కల్పనకు నిలయంగా రాజధాని రూపకల్పనరాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన అమరావతిలో జరుగుతుందని సీఎం చంద్రబాబు మరోసారి చుక్కలు చూపారు. ప్రతి పంచాయతీ సంక్షేమానికి ఇది నిక్షేపంలా ఉంటుందన్నారు. అమరావతి నాది అని చెప్పుకునేలా ప్రణాళిక రూపొందించామని, మాస్టర్ ప్లాన్‌లో మార్పులు లేవని తెలిపారు. గతంలో రూపొందించిన అదే మాస్టర్ ప్లాన్‌ను కొనసాగిస్తామన్నారు. ఇన్ని చెప్పిన బాబు.. అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని, కొన్ని ఆస్తులు అమ్మి సంపద సృష్టిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఎన్నో సందేహాలకు తెర లేపింది. ఇక్కడ భూములమ్మిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొంటే అక్కడ కూడా విలువ పెరుగుతుందని, ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగి ఉంటే ప్రభుత్వానికి కూడా పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్నారు. విట్, ఎస్ఆర్, అమృత్ లాంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలు చదువుకుంటే కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయని యువతను మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. రాజధాని పునర్నిర్మానంపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. రాజధాని పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే పనులు ప్రారంభిస్తామే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి సెంటు పట్టాలని డ్రామాలాడారని, ఇల్లు లేని వారికి వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ లెక్కన అమరావతిలో పేదలకు స్థానం లేదని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఎయిమ్స్‌కు కూడా నీళ్లివ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, తద్వారా పడకల పెరుగుదలకు అవరోధం ఏర్పడి ఆసుపత్రిలో ఓపీలు కూడా తగ్గాయని చెప్పారు. ఏ లెక్కన చంద్రబాబు ఈ మాట చెప్పారో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఎయిమ్స్‌లో ఓపీలు పెరగడం గమనార్హం. గతంలో అనుమతులు పొందిన 132 సంస్థలకు గాను 122 సంస్థలు అమరావతికి రాలేదని చెప్పుకొచ్చారు. ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట!అమరావతిలో 53,748 ఎకరాలు సేకరించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885 ఎకరాలు, రిటర్నబుల్ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వద్దనున్న భూమిని విక్రయించి రాజధాని నిర్మాణం చేయొచ్చని ఆలోచించామని, కేంద్ర ప్రభుత్వం కేపిటెల్ గెయిన్ మినహాయింపునిచ్చి రూ.2,500 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుని రూ.1,500 కోట్లు కూడా అందించిందన్నారు. నాడు రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జేఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయని, సింగపూర్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. మొదట సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థ అందించిందన్నారు. దేశంలోనే స్మార్ట్ సిటీగా, ప్రపంచ స్థాయి ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్ రూపొందించినట్టు చెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌తో పాటు అన్ని విభాగాలు ఒకేచోట ఉండాలని మాస్టర్ ప్లాన్‌లో నిర్ణయించామన్నారు. దేశంలో ఏ సిటీకి లేనంత మేర నదీ ప్రాంతం అమరావతికి ఉందని, రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్‌తో నగరానికి రూపకల్పన చేశామన్నారు. రూ.51,687 కోట్లతో రాజధాని పనులకు అంచనా వేసి, రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచామని, అప్పటికే జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించామని, రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగులో ఉందన్నారు. -
అమరావతిపై చంద్రబాబుకే అనుమానాలున్నాయా?
ఏపీ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన,బీజేపీ సభ్యులంతా కలిసి ఆయనను తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే విశాఖను ఆర్దిక రాజధానిగా అభివృద్ది చేస్తామని, కర్నూలును కూడా ప్రగతి పధంలోకి తీసుకు వెళతామని అన్నారు. ఆయన తాను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి కాకుండా అమరావతిపైనే ప్రసంగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు పెట్టడం ద్వారా ఏపీ అభివృద్దికి ప్రయోజనం జరుగుతుందని భావించారు. విశాఖ పట్నం అయితే రాష్ట్రం అంతటికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆశించారు. అమరావతి మాదిరి లక్షల కోట్లు ఖర్చుపెట్టవలసిన అవసరం ఉండదని అనుకున్నారు. కాని దానిని తెలుగుదేశం,ఇతర విపక్షాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాయి. దాంతో జగన్ ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. కాకపోతే తమ విధానం మూడు రాజధానులు అని ఆయన అన్నారు. కాని ఆయన తిరిగి అదికారంలోకి రాలేకపోయారు.విశాఖ, కర్నూలులకు అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ అక్కడి వారిని మోసం చేశారని అంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన చిక్కే ఇది. ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటారు. ఇందులో జగన్ మోసం చేసింది ఏముంది? ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో గెలిచిన తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తామని ప్రకటించారు. విశాఖను సుందరంగా తీర్చి దిద్దారు. రిషికొండపై ఆకర్షణీయమైన భవంతిని నిర్మించారు. అలాగే కర్నూలులో పలు న్యాయ రంగానికి సంబంధించిన పలు ఆఫీస్ లు ఏర్పాటు చేశారు. లోకాయుక్త ఆఫీస్ ను కూడా అక్కడే నెలకొల్పారు. హైకోర్టు ఏర్పాటు పూర్తిగా ఆయన చేతిలో లేనిది కనుక దానిపై ముందుకు వెళ్లలేకపోయారు. ఈ విషయాలలో జగన్ చిత్తశుద్దిని శంకించనవసరం లేదు.జగన్ ఒకటి తలిస్తే, ప్రజా తీర్పు మరో రకంగా రావడంతో చంద్రబాబుకు అది అడ్బాంటేజ్ అయింది. విశాఖ ప్రజలు కూడా తమకు రాజధాని వద్దని అనుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు తప్పు లేదు. ఎందుకంటే జగన్ ఆ ప్రాంతానికి అంత పెద్ద వరం ఇస్తే ,దానిని వారు ఆదరించలేదు.కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావవల్సి ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యంగా వైఎస్సార్సీపీకి వ్యతిరేక తీర్పు వచ్చింది. తాజాగా చంద్రబాబు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం లేదు. ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాన్ని మార్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. వచ్చే ఐదేళ్లు టీడీపీ కూటమి అధికారంలో ఉంటుంది కనుక వారు చేయదలచుకున్నది అంతా అమరావతిలోనే చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలలో వైసిపి గెలిచినా, ఇందులో మార్పులు చేయడం కష్టం అవుతుంది. అప్పుడు మళ్లీ మూడు రాజధానులు అన్నా ఉపయోగం ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అమరావతిపై ఇక వివాదాన్ని ముగించడం మంచిది. వైఎస్సార్సీపీ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. అమరావతికి సంబంధించి కొన్ని చిక్కుముళ్లను చంద్రబాబు విడదీయవలసి ఉంటుంది. 2014 టరమ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కేవలం ప్రాధామిక సదుపాయాల కోసం లక్షతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని , ఈ నిదులను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యయం ఇంకా భారీగా పెరిగి ఉంటుంది.అంత మొత్తాన్ని ఎలా వెచ్చిస్తారో చెప్పగలగాలి. కేంద్రం ఇప్పుడు ఏమైనా ఆ ప్రకారం ఇస్తే ఇబ్బంది లేదు. అలా ఇవ్వకపోతే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. అప్పట్లో ప్రధాని మోదీ మట్టి,నీళ్లు ఇచ్చి వెళ్లారని చంద్రబాబు విమర్శించేవారు. ఈ విడత టీడీపీపై కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది కనుక లక్ష కోట్లను రాజధాని కోసం సాధించగలిగితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. గత ప్లాన్ ప్రకారం నవ నగరాలన్నింటిని ఇక్కడే నిర్మిస్తారా?లేక వాటిని వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అంతేకాదు. అమరావతి భూముల విషయంలో పలు వివాదాలు ఉన్నాయి. కొంతమంది రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. వారిపై అప్పట్లో కేసులు కూడా పెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించింది. ఆ రోజుల్లో పంటలను దగ్దం చేసి భూములు లాక్కునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. అలాంటి చోట్ల ఏ రకంగా ముందుకు వెళతారో తెలియదు. ప్లాట్ల కేటాయింపుపై కూడా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవల్సి ఉంటుంది. వారికి రోడ్లు,డ్రైనేజ్, రక్షిత నీరు మొదలైనవాటిని సమకూర్చుకోవాలి. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణాగ్రత తగ్గించాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇంటింటికి ఏసీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవన్ని చేయగలిగితే తెలుగుదేశంకి ఖ్యాతి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల వసతుల కోసం ఏభై అంతస్తుల టవర్ లు నిర్మించాలని తలపెట్టారు. అదే ఆలోచనను మళ్లీ చేస్తారో?లేదో తెలియవలసి ఉంది. కృష్ణానది పక్కన ఉండడంతో నేల స్వభావం భారీ భవంతులకు అనువైనది కాదని నిపుణులు చెబుతారు. అందువల్లే రాఫ్ట్ టెక్నాలజీకి వెళుతున్నామని అనేవారు. అది బాగా ఖరీదైనది. అయినా ఖర్చు భరించక తప్పదు. మరో కీలక అంశం సింగపూర్ కంపెనీలకు గతంలో మాదిరే మళ్లీ భూములు కేటాయిస్తారా? లేదా ?అన్నదానిపై నిర్ణయం చేయవలసి ఉంటుంది. వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం పక్షాన భూమి ఇవ్వడమే కాకుండా,అవసరమైన రోడ్లు తదితర సదుపాయాలను సమకూర్చడానికి 5,500 కోట్లు వ్యయం చేయడానికి సిద్దపడ్డారు. ఇప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. సింగపూర్ కంపెనీల నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం బాగా తక్కువగా ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. పైగా వారితో ఏ వివాదం వచ్చినా లండన్ కోర్టులో తేల్చుకోవాలని రాసుకున్నారు. 2019 లో తమ ప్రాజెక్టు వయబుల్ కాదని భావించి సింగపూర్ సంస్థలు దానిని వదలుకున్నాయి. సింగపూర్ సంస్థలకు స్విస్ చాలెంజ్ పద్దతిన భూములు ఇవ్వడం పై ఆనాడు కోర్టులలో వివాదాలు నడిచాయి. కోర్టు సంబంధిత చట్టంలోని కొన్ని క్లాజులను కొట్టివేయగా,వాటిని మార్చి మళ్లీ చట్టాన్ని ఆమోదించారు. నిజానికి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి ముప్పైమూడు వేల ఎకరాల భూమి సమీకరించకుండా ,ప్రభుత్వానికి అవసరమైన వెయ్యి నుంచి ఐదువేల ఎకరాల భూమి తీసుకుని , అందులో భవనాల నిర్మాణం చేపట్టి ఉంటే ఇంత రాద్దాంతం అయ్యేది కాదు. ఆయన ఓవర్ యాంబిషస్ గా దీనిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యేది. ఇతర జిల్లాలప్రజలు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెడితే ఎలా అని ప్రశ్నించేవారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే దాదాపు అన్ని జిల్లాల ప్రజలు అమరావతిని ఆమోదించినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి కనుక చంద్రబాబు తన ఇష్టానుసారం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. చంద్రబాబు రాగానే అధికారులు అక్కడ హడావుడి ఆరంభించారు. బహుశా కొన్ని పూర్తి కాని భవనాలకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత మిగిలిన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. అమరావతి రాజధాని పూర్తి కావడానికి చాలాకాలం పట్టవచ్చు. నిధుల సమస్య, సాంకేతిక అంశాలు, భూ సేకరణ వంటి వ్యవహారాలు సజావుగా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కృష్ణానదికి ఆవల వైపున ఉన్న అమరావతిలోనే జరుగుతుందని తొలుత ప్రకటించారు. కాని ఏ సెంటిమెంట్ అయినా అడ్డం వచ్చిందేమో తెలియదు కాని, ఈసారి కృష్ణా నదికి ఈవల వైపు అంటే విమానాశ్రయం ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంటే 2014లో అమరావతి వైపు ప్రమాణ స్వీకారం చేయడం అచ్చి రాలేదని భావించి వాస్తు పండితులు ఈ మార్పు చేశారా?అన్న సందేహం వస్తుంది. అమరావతి వాస్తుపైనే అనుమానాలు ఉన్న నేతలు దానిని ఏ రీతిన ముందుకు తీసుకువెళతారన్నది ఆసక్తికరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు. "14 ఏళ్లుగా సీఎంగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేస్తాం. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజాహితం కోసం ముందుకెళ్తాం. మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా అజెండా అని అన్నారు.""ఎన్డీయే శాసనాసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కలిసి పని చేయడం వల్ల కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ తీర్పు వల్ల మనకు ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ నన్ను పరామర్శించి పొత్తు పెట్టుకుందామని చెప్పారు. బీజేపీతో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేయడం వల్ల సీట్లు, ఓట్లు వచ్చాయి"అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడా ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేను, పవన్ సామాన్యులమే. ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తాం అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు.. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చంద్రబాబును తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్‌ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు బినామీలు పచ్చని భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ డ్రామాలో నారాయణ, లింగమనేని ఇలా ఎవరికి వారే వీర లెవల్లో రక్తి కట్టించారు. క్విడ్ ప్రోకోతో అనుమానం రాకుండా కథంతా నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట లింగమనేనికి భూముల లబ్ధి, నారాయణ కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు ఎసిసోడ్ ఈ డ్రామాకే హైలైట్. బాబు, నారాయణ ద్వయం లింగమనేని రమేశ్‌తో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో బేరం కుదుర్చుకుని క్విడ్ ప్రోకోకు బరితెగించారు. తిలా పాపం.. తలా పిడికెడు.. అన్నట్లు ఈ దోపిడీలో తన దత్తపుత్రుడికీ చంద్రబాబు కొద్దిపాటి వాటా పంచారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తమకు భూములు కానుకగా ఇచ్చిన వారికి అనుకూలంగా చేయడమే ఈ క్విడ్ ప్రోకో కథ. ప్రతిఫలంగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు, బాబుకు కరకట్టపై బంగ్లా కానుక. రాజధానిలో కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంట్‌ను ఇష్టమొచ్చినట్టుగా మెలికలు తిప్పుతూ తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకోవడంలో చంద్రబాబు బరితెగింపునకు బాబోయ్ అనాల్సిందే. లింగమనేని రమేశ్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.887.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చేశారు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో సహా వెలికితీసి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేపీవీ అంజని కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సాగించిన దోపిడీ కాండ గురించి రెండు మూడు సీజన్లతో వెబ్ సిరీస్ తీయొచ్చు. ఈ కుంభకోణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ఘట్టం అత్యంత కీలకం. సీఆర్డీఏ అధికారుల 94 కి.మీ. అలైన్మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఐఆర్ఆర్ నిర్మించాలి. అయితే చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని ఐఆర్ఆర్ నిర్మించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. దీనిని గోప్యంగా ఉంచిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే డిజైన్ ఉండాలని ఈ కన్సల్టెన్సీకి షరతు విధించారు. అంటే... అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీని అడ్డం పెట్టుకొని ఆమోదించేలా చేశారు. ఇదేం పని నారాయణ! సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగిస్తారు. ఇలాగైతే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాలి. దీంతో సీఆర్డీఏ అధికారులపై నారాయణ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రపురం– కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. హెరిటేజ్‌కు భూ సంతర్పణ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పి లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి క్విడ్ ప్రోకోగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు సమకూరాయి. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాల లబ్ధి కలిగింది. 2014 జూన్–సెపె్టంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ ఉన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు బహుకరించారు. పవన్ కల్యాణ్‌కు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు సమీపంలోనే 2.4 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఐఆర్ఆర్లో అవినీతి విశ్వరూపం ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలుండేది. ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు తర్వాత ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్‌తో ఒప్పందం చేసుకున్న మరో 4.5 ఎకరాల విలువ సైతం రూ.24 కోట్లకు చేరుతుంది. -
పేదల ఇళ్లు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేదల ఇళ్ల నిర్మాణాన్ని సైతం వదల్లేదు! రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ మొత్తంలో దోపిడీకి వేసిన పథకం ఆదాయపు పన్ను శాఖ తాజాగా జారీ చేసిన 46 పేజీల సుదీర్ఘ నోటీసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో డొల్ల కంపెనీల పేరుతో రూ.వందల కోట్లు స్వాహా చేసి పక్కా ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ‘ఈడబ్ల్యూఎస్’ పథకం కింద పేదల ఇంటి నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని 2019 నవంబర్ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్ వాసుదేవ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇందులో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, అంతేకాకుండా పార్టీ ఫండ్ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని కోరినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది. నగదు బదిలీలో ఆ ముగ్గురు.. కోడ్ భాషలో సబ్ కాంట్రాక్టుల ముసుగులో డొల్ల కంపెనీలు హయగ్రీవా, అన్నై, షలఖ కంపెనీల ద్వారా అక్రమంగా నగదును చంద్రబాబు నాయుడుకు తరలించడంలో వినయ్ నంగాలియా, విక్కీ జైన్, అంకిత్ బలదూత కీలకపాత్ర పోషించినట్లు మనోజ్ వాసుదేవ్ పార్థసాని తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు ఐటీశాఖ నోటీసుల్లో పేర్కొంది. వీరంతా బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌కు చేరవేసినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్‌లో దినార్ల రూపంలో చెల్లించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించాడు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నగదు బదిలీకి కోడ్ భాషలో హెచ్‌వైడీ అని అందులో ఉంది. విజయవాడకు విజయ్ అని, విశాఖపట్నంకు విష్ అని, బెంగళూరుకు బాంగ్ అని కోడ్ భాషల్లో నమోదు చేసుకున్న వివరాలను, ఎక్సెల్ షీటును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డగోలు వాదన ఆపి జవాబు చెప్పు!! చంద్రబాబు అసంబద్ధ వాదనలను కట్టిపెట్టి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పి తీరాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది! సబ్ కాంట్రాక్టుల ముసుగులో దొంగ ఇన్వాయిస్లు సృష్టించి నగదును అక్రమంగా తరలించినట్లు తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలున్నాయని, చట్ట ప్రకారం విచారించే అధికారం తమకు ఉన్నందున లెక్కల్లో చూపని రూ.118 కోట్లకు సమాధానం చెప్పాల్సిందేనని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ తన రాజగురువు రామోజీ తరహాలో ఏదో ఒక అభ్యంతరాన్ని తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తు ముందుకు కదలకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్‌కు అసలు విచారణ పరిధి లేదని ఒకసారి, జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ అధికారి ఈ కేసును సెంట్రల్ ఆఫీసుకు బదిలీ చేయకుండానే నోటీసులు ఇచ్చారని మరోసారి, అసలు ఐటీ దాడుల్లో సీజ్ చేసిన వివరాలను తనకు తెలియచేయలేదని, అందులో తన పేరు ఎక్కడా లేదంటూ.. ఇలా వరుసగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు అడుగు ముందుకు పడకుండా కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి లేఖల మీద లేఖలు రాస్తూ నాలుగుసార్లు దర్యాప్తును అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రతిసారి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చుతూ సహనంగా సమాధానాలిస్తోంది. ముందుగా రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ పూర్తి సాక్ష్యాధారాలతో మరోసారి సెక్షన్ 153 సీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులతో పాటు మనోజ్ వాసుదేవ్ పార్థసాని (ఎంవీపీ), చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌లపై ఐటీ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎక్సెల్ షీట్లు, వాట్సాప్ మెస్సేజ్‌లు, ఈ మెయిల్స్, బ్యాంకు లావాదేవీల వివరాలతో పాటు వారు విచారణ సందర్భంగా ఆ నగదును చంద్రబాబుకు ఏ విధంగా చేర్చారో వెల్లడిస్తూ వివరాలను పొందుపరిచింది. తప్పించుకుని తిరుగుతూ.. చంద్రబాబు స్క్రూటినీ కేసును హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్–4 ప్రిన్సిపల్ కమిషనర్ గతేడాది సెక్షన్ 127 కింద హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్–2(4)కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి సెక్షన్ 153 సీ, 143(2)/142(1) కింద విచారణకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2022 అక్టోబర్ 10, అక్టోబర్ 27, ఈ ఏడాది జనవరి 31, జూన్ 20న చంద్రబాబు నాలుగు లేఖలు రాశారు. అసలు సెంట్రల్ సర్కిల్ కార్యాలయానికి సెక్షన్ 153 సీ కింద తనకు నోటీసులిచ్చే అధికారం లేదని వాదించగా దీన్ని తోసిపుచ్చింది. జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్ సెక్షన్ 127 కింద ఈ కేసును తమకు బదిలీ చేయడంతో చట్ట ప్రకారం తక్షణం దర్యాప్తు మొదలు పెట్టినట్లు స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు వెంటనే సెక్షన్ 127 కింద కేసు బదిలీ కాకుండానే సెంట్రల్ సర్కిల్ ఆఫీసు తనకు నోటీసులు ఇచ్చిదంటూ వాదించగా దానికి కూడా స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇచ్చింది. దర్యాప్తులో సీజ్ చేసిన వివరాలను తనకు పూర్తిగా తెలియచేయలేదని ఒకసారి పేర్కొనగా అందులో తన పేరు ఎక్కడా లేదు కాబట్టి తనకు నోటీసులు వర్తించవంటూ మరోసారి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఐటీ శాఖ స్పందిస్తూ మనోజ్ వాసుదేవ్ పార్థసాని వద్ద సోదాల్లో సీజ్ చేసిన వస్తువుల వివరాలన్నీ మీకు (చంద్రబాబుకు) తెలియచేశామని, ముఖ్యమంత్రి హోదాలో కేటాయించిన కాంట్రాక్టుల నుంచి సబ్ కాంట్రాక్టుల రూపంలో ఎటువంటి పనులు చేయకుండానే నగదు చంద్రబాబుకు చేరినట్లు బలమైన ఆధారాలను సేకరించడంతో మీ అభ్యంతరాలను కొట్టి వేస్తున్నామని, పూర్తి వివరాలను మరోసారి అందచేస్తున్నామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తునకు సహకరించాల్సిందేనంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది. 46 పేజీల సుదీర్ఘ నోటీసులో మొత్తం ఈ కుంభకోణం ఏ విధంగా జరిగిందో పూసగుచ్చినట్లు బ్యాంకు లావాదేవీలు, కోడ్ భాషలను క్రోడీకరించి రుజువులతో మరీ వెల్లడించింది. -
పేదల ఇళ్ల స్థలాలపై అడ్డుపడలేం!
‘‘మేం ఉండే చోట పేదలుండటానికి వీల్లేదు!. వాళ్లకు ఇక్కడ స్థలాలిస్తే ‘సామాజిక తూకం’ దెబ్బతింటుంది’’ అంటూ న్యాయస్థానాలకు వెళ్లి ఓడిపోయిన వారు... మరిన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మరిన్ని కోర్టులకు వెళుతున్నారు తప్ప... అవి పేదల ఇళ్లే కదా అని వదిలేయటం లేదు. సోమవారం కూడా వీరు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కనీసం ‘స్టే’ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ తరఫున వాదించడానికి గతంలో భారత సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్‌గా పనిచేసిన హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారంటే... వీరి వెనక ఎంతటి ఆర్థిక బలమున్న మనుషులున్నారో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. అసలు రాజధాని రైతుల పేరిట దాఖలు చేస్తున్న పిటిషన్లను ఇంతటి ఖరీదైన న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ హైకోర్టుల్లోను, సుప్రీం కోర్టుల్లోను ఎలా నడిపిస్తున్నారనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. తెలుగుదేశం కూడా వీళ్ల పిటిషన్లకు ఇన్నేసి కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చుపెడుతోందో... ఒకవంక అలా చేస్తూ మరోవంక రాజధాని ప్రాంతంలో ఆందోళనల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి ఎందుకు వెళుతోందో అర్థం కాని విషయం. అసలు ఆ ప్రాంతంలో పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థలాలివ్వకూడదని చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? ఇదేమీ ఆయన సొంత రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు కదా? ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా ఆయన్ని రామోజీరావు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రాజధాని ప్రాంతంలో పేదలకు ఓ కాలనీ ఉంటే తప్పా? వారూ అందరితో పాటు అక్కడ బతికితే తప్పేంటి? సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతి ప్రాంతంలో 50 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సామాజిక న్యాయాన్ని పరిరక్షిస్తూ, రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు నివసించేలా సీఆర్డీఏ పరిధిలోని 1,402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు పేదల ఇళ్ల స్థలాల కోసం శరవేగంగా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్–5 జోన్‌కి వ్యతిరేకంగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఊట్ల శివయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం జస్టిస్ అభయ్.ఎస్.ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం మూడు రాజధానుల పిటిషన్లతో దీన్ని జత చేస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదని, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. అమరావతి భూములకు ఈడబ్ల్యూఎస్ స్కీమ్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందన్నారు. దీన్ని ఏపీ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వ్యతిరేకించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. సీజేఐ సూచనల మేరకు.. రాజధానికి సంబంధించి ఇతర వ్యాజ్యాలు మరో ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం ప్రస్తావించింది. ఆయా పిటిషన్లతో వీటిని జత చేస్తామని పేర్కొంటూ శుక్రవారం లోపు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిపై సీజేఐ సూచనలు తీసుకుని జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందున్న పిటిషన్లతో కలిపి విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలంది. ఈ కేసులో కేవియట్ దాఖలు చేసిన మస్తాన్ వలీ తరఫు న్యాయవాది అభిజిత్‌సేన్ గుప్తా కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటిషన్లు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పేదల విజయం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడం పేదల విజయమని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సుప్రీంకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోనే ఉందన్నారు. ఒకసారి భూములిచ్చాక వాటిపై ప్రభుత్వానికే హక్కులుంటాయన్నారు. -
టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు
-
టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: రాజధాని భూముల కేసులో టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. కాగా, రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లు తేలింది. చదవండి: ‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’! -
రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట
సాక్షి, ఢిల్లీ: అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా? ‘‘హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా కోర్టు.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది. చదవండి: సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ.. పిటిషన్లో కీలక అంశాలివే.. -
మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: శాస్త్రీయ విధానంతోనే రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదాయం అంతా ఒకేచోట కేంద్రీకృతం కావద్దనేది మా అభిమతం అని తెలిపారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. వికేంద్రీకరణపై మాకు స్పష్టత ఉంది. వికేంద్రీకరణ ఎందుకు అవసరమో మేం స్పష్టంగా చెబుతున్నాం. అమరావతిలోనే రాజధాని ఎందుకుండాలో చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అసహనంతో ఊగిపోతున్నారు. కర్నూలులో ఆయన విన్యాసాలను ప్రజలు చూశారు. చంద్రబాబు తీవ్ర నిస్పృహతో ఉన్నారు. న్యాయరాజధానిపై వైఖరి అడిగితే సమాధానం చెప్పాలి. అంతేకానీ, స్థానిక ప్రజలను బెదిరిస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కర్నూలు వెళ్లినపుడు న్యాయరాజధానిపై ప్రజలు అడగరా?. ప్రజలు అడిగితే సమాధానం చెప్పకుండా బెదిరిస్తారా?. చంద్రబాబు మాటలతో టీడీపీ అంటే తిట్లు, దూషణలు, బూతులు పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. అన్ని చిట్‌ఫండ్స్ మాదిరిగానే మార్గదర్శిలో తనిఖీలు చేస్తే కక్ష సాధింపు అని గగ్గోలుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపాజిట్లు తీసుకుని డైవర్ట్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేయొద్దా?. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?' అని ప్రశ్నించారు. చదవండి: (వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్ తమ్మినేని) -
Supreme Court: అమరావతి కేసు విచారణ 28కి వాయిదా
సాక్షి, ఢిల్లీ: అమరాతి కేసు విచారణను సుప్రీంకోర్టు 28కి వాయిదా వేసింది. విభజన కేసులను వేరుగా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సంఘ్వీ కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్లో పేర్కొన్నారు. చదవండి: లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి -
సుప్రీంలో అమరావతి రాజధాని కేసు.. అన్నిటిని కలిపే విచారణకు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులన్నింటిని లిస్ట్ చేసి విచారించనున్నారు. రెండు అంశాలపై 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కే.ఎం.జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోనే కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి. 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ.2000 కోట్లతో పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది, ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది అని పిటిషన్లో పేర్కొన్నారు. చదవండి: (సీఎం జగన్ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు: సజ్జల) -
61 సార్లు స్టేషన్‌కు తీసుకెళ్లి.. నరకం చూపి.. పళ్లు రాలగొట్టి..
గుంటూరు: ‘నన్ను చూసి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేశారు. నేనే బ్రాండ్, నాదే ఇమేజ్. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం నా కల. ఆ కలలు పటాపంచలవుతున్నాయ’ని నిత్యం వాపోయే చంద్రబాబు, ఆయన ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో ఎన్నెన్ని అరాచకాలు చేసిందో, గ్రామీణుల మధ్య ఎంతెంత అగాధాలను సృష్టించిందో కళ్లారా చూసినా, చెవులారా విన్నా ‘రియల్’ వ్యవహారాలు బట్టబయలవుతాయి. ఒక్కో ఊరిది ఒక్కో కథ. ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యథ. బాబుకు ఆయన ‘రియల్’ బృందానికి కులం లేదు, మతం లేదు, గ్రామం లేదు. అప్పట్లో భూమి ఇచ్చారా? లేదా? అన్నదే ముఖ్యం. ఇచ్చేస్తే సరి. లేదంటే అంతే మరి.. అన్నట్లుగానే చర్యలు కొనసాగాయి. ఇదిగో ఈ ఫోటోలోని వ్యక్తిని చూశారుగా. బండ్ల బసవయ్య. ఈయనది తుళ్లూరు మండలం అనంతవరం. భూగాధను, శారీరక వ్యథను ఆయన మాటల్లోనే విందాం. మా నాన్న బండ్ల ప్రకాశరావు. శివరామ కృష్ణయ్య నా సోదరుడు. వారసత్వంగా మా ఇద్దరికీ రెండు చోట్ల ఎకరం 20 సెంట్లు సంక్రమించింది. ఎత్తిపోతల పథకం కింద మెట్ట. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వాలంటూ భూసేకరణకు టీడీపీ సర్కారు ప్రకటన జారీ చేసింది. నాతో సహా మా గ్రామానికి చెందిన 46 మంది సుమారు 500 ఎకరాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పటి మంత్రులు పి.నారాయణ, పి.పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, టీడీపీకి చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులు అధికారులు, పోలీసులను వెంటపెట్టుకుని నిత్యం రాజధాని గ్రామాల్లో తిరుగుతూ భూసమీకరణకు సామ, దాన, భేద దండోపాయాలన్నీ ప్రయోగించేవారు. చివరకు నా మిత్రులు నయాన, భయాన చెప్పడంతో మా భూమిని ఇవ్వడానికి అంగీకరించక తప్పలేదు. కొలతల పేరిట అంతా మాయే... అనంతవరంలోని సర్వే నంబరు 217లో బండ్ల, ఎడ్లూరి కుటుంబీకులకు 12.68 ఎకరాలు ఉంది. డాక్యుమెంట్ల ప్రకారం ఓ తండ్రి, కొడుకుకు కలిపి 2.03 ఎకరాలు ఉండగా సర్వేలో మతలబులు చేసి 2.20 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. వారివురికి 17 సెంట్లు అదనంగా చేరింది. ఇదేవిధంగా మరొకరికి 17 సెంట్లు కలిపేశారు. మొత్తం మీద మా అన్నదమ్ములకు ఉన్న 1.20 ఎకరాలలో.. ప్రభుత్వం ఇచ్చిన అవార్డు నోటిఫికేషన్ ప్రకారం 25 సెంట్లు, కొలతల్లో 30 సెంట్లు, తుదిగా 34 సెంట్లు తగ్గిపోయినట్లు రికార్డుల పరంగా చూపారు. రూ.కోటి 30 లక్షలు పోయినట్లే.. ఎత్తిపోతల పథకం కింద సాగుభూమి ఎకరం ధర రూ.15 లక్షలు. రాజధాని పేరిట చంద్రబాబు చెప్పిన ప్రకారం రూ.4 కోట్లు పలికింది. ఆ చొప్పున 34 సెంట్లు తగ్గినందుకుగాను రమారమి రూ.1.30 కోట్లను మేం కోల్పోయాం. న్యాయస్థానాల్లో పోరాటం.. భూసమీకరణ ప్రకటనను నిలిపేయాలని 2016లో హైకోర్టుకు వెళ్లా. తప్పుడు కొలతలతో భూమిని తగ్గించేశారని, న్యాయం కోరుతూ 2018లో మంగళగిరి కోర్టును ఆశ్రయించా. ఈ వ్యాజ్యం నడుస్తోంది. కౌలూ ఇవ్వలేదు.. మా భూమిని తీసేసుకున్నారు. సరిహద్దులన్నీ చెరిపేశారు. కనీసం కౌలు కూడా ఇవ్వలేదు. గత ఎనిమిదేళ్లుగా లెక్కగడితే మా అన్నదమ్ములకు రూ.పది లక్షలకు పైగా కౌలు రావాల్సి ఉంది. మా భూమిని పొందిన వారు కొంత అమ్ముకున్నారు. కౌలూ పొందుతున్నారు. మేం మాత్రం అన్యాయమైపోయాం. 61 సార్లు స్టేషన్‌కు తీసుకెళ్లి.. నరకం చూపి.. పళ్లు రాలగొట్టి.. పశ్చిమబెంగాల్‌తో సహా దేశంలో భూ వ్యవహారాలు ఏం జరిగాయో అవగాహన ఉన్నందున భూసమీకరణకు అంగీకరించలేదు. టీడీపీ నాయకులు, అధికారులు, మీడియా వద్ద మాట్లాడిన ప్రతిసారీ నన్ను పోలీసులు అదుపులోకి తీసుకునేవారు. అరెస్టు చేశామంటూ తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు 61 పర్యాయాలు తీసుకెళ్లారు. వ్యూహాత్మకంగా రికార్డులకు ఎక్కకూడదనే ఉద్దేశంతో కేసు నమోదుచేసేవారు కాదు. రేయింబవళ్లు స్టేషన్లో ఉంచేవారు. అన్నం, నీళ్లు కూడా ఉండేవి కావు. అప్పటి ఎస్ఐ (ఇప్పుడు సీఐ) కొట్టడంతో దవడ పళ్లు రాలిపోయాయి. స్టేషన్‌కు తీసుకెళ్లిన ప్రతిసారి భూసమీకరణను వ్యతిరేకించే వారు, గ్రామస్తులు, రైతు నాయకులు యాభై అరవై మందికిపైగా పోగై స్టేషన్ వద్దకు వచ్చేవారు. చివరకు పోలీసులకు నన్ను వదిలిపెట్టక తప్పేది కాదు అని బండ్ల బసవయ్య ‘సాక్షి’కి వివరించారు. అమరావతిలో 5 సెంట్లు అమ్ముకుని... అప్పటి ప్రభుత్వ దమనకాండను అడ్డుకోవడానికి అమరావతిలో విలువైన ఐదు సెంట్ల భూమిని అమ్ముకుని ఖర్చు పెట్టుకున్నా. న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నా. ఇప్పటి ప్రభుత్వానికీ చెప్పుకుంటున్నా. న్యాయం జరగకపోతుందా అని ఎదురుచూస్తున్నా. ఆనాటి ప్రభుత్వ అరాచకాలకు బలైన నాలాంటి వారెందరో రాజధాని గ్రామాల్లో లేకపోలేదు. ఆనాడు భూమి ఇచ్చినందున ఇల్లు ఇస్తామనడంతో ఉన్న దాన్ని పడగొట్టేశా. ఇవ్వలేదు. ఆ ప్రభుత్వ హయాంలో మూడేళ్లు అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికీ నా కుటుంబ దుస్థితి అదే. చివరగా ఒక్కమాట... మేమూ చంద్రబాబు గారి వర్గీయులమే అంటూ బండ్ల బసవయ్య ముక్తాయింపు ఇచ్చారు. -
అమరావతికి వ్యతిరేకం కాదు : జోగి రమేష్
పెడన: రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకేచోట రూ.3 లక్షల కోట్లు ఖర్చుచేస్తే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. కృష్ణా జిల్లా పెడన మార్కెట్ యార్డు ప్రాంగణంలో సోమవారం వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి జోగి రమేష్ పాల్గొని పెడన మండలంలోని 2,121 మంది లబ్ధిదారులకు రూ.3,97,68,750 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన కుటుంబం, బంధువులు, సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే అభివృద్ధి చెందాలనే విధంగా అమరావతిని ఏకైక రాజధాని చేయాలని కంకణం కట్టుకుని అమరావతి–అరసవల్లి పాదయాత్రకు వ్యూహరచన చేశారని దుయ్యబట్టారు. రైతుల పేరుతో చేస్తున్న ఈ పాదయాత్ర చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు. అమరావతి కావాలా.. లేక చేయూత కావాలా.., అమరావతి కావాలా... లేక ఆసరా కావాలా.. అని మంత్రి ప్రశ్నించడంతో తమకు ఆసరా కావాలి.. చేయూత కావాలంటూ మహిళలు నినదించారు. -
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని కాదు
చంద్రబాబు లెక్కల ప్రకారమే ఇక్కడ మౌలిక వసతులకే రూ.1.10 లక్షల కోట్లు పెట్టాలి. కానీ ఇప్పటి వరకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన రూ.1.05 లక్షల కోట్లు కేటాయించాలంటే కనీసం వంద సంవత్సరాలు పడుతుంది. కేవలం రోడ్లు, డ్రైనేజీకి, కరెంట్ కోసం పెట్టే రూ.లక్ష కోట్లు వందేళ్లలో ద్రవ్యోల్బణం వల్ల కనీసం రూ.20 లక్షల కోట్ల నుంచి రూ.30 లక్షల కోట్లు అవుతుంది. మనం దీన్ని ఏ రకంగా పూర్తి చేయగలుగుతాం? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘చంద్రబాబుతో పాటు దుష్టచతుష్టయం సభ్యులందరూ వాళ్ల పేపర్లలో, టీవీల్లో కామన్‌గా చెబుతున్నట్లు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని కానే కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అంశంపై గురువారం ఆయన శాసనసభలో జరిగిన చర్చలో స్పష్టమైన సమాధానాలిచ్చారు. ‘ఇక్కడ మొత్తం 5,817 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్, రివర్ కన్జర్వేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలు అంటే కృష్టా నదీ పరీవాహక ప్రాంతాలు దాదాపు 820 ఎకరాలు ఉన్నాయి. లంక భూములు, ఎన్జీటీ, నదీ గర్భంలో ఉన్నవి, కరకట్ట భూములు కూడా ఉన్నాయి. ఆ 820 ఎకరాల భూమి అమ్మాలనుకున్నా ఎన్జీటీ కోర్టు అంగీకరించదు. ఈ భూములు తీసేస్తే 4,997 ఎకరాల భూమి ఉంది. 2019 ఫిబ్రవరి 5న చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 5,020 ఎకరాలు మాత్రమే కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు ఉంది అని చెప్పారు. (జీవో కాపీ ప్రదర్శిస్తూ) కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 దొంగల ముఠా సభ్యులందరూ కూడా 10 వేల ఎకరాలు, 20 వేల ఎకరాలు ఉన్నాయని చెబుతున్నారు. అందరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని సీఎం మండిపడ్డారు. ఈ చర్చలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నిజంగా అంత ధర ఉందా? ► చంద్రబాబు లెక్క ప్రకారం 5,020 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ భూమిని ఎకరాకు రూ.20 కోట్ల చొప్పున అమ్మితేనే రూ.లక్ష కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు ఇవ్వగలం. నిజంగా ఈ రోజు ఇంత ధర ఉందా ? ఇంత ధరకు చంద్రబాబు కొంటారా? పోనీ రామోజీరావు కొంటారా? రాధాకృష్ణ కొంటారా? పోనీ టీవీ–5 నాయుడు కొంటారా? ► ఇంత ధర లేనప్పుడు ఎకరా రూ.10 కోట్లకు కొంటారా? అని వీళ్లు మనల్ని తిరిగి అడుగుతున్నారు. ఈ మధ్య ఈనాడు రాసింది (ఆ పత్రిక క్లిప్పింగ్‌ను స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ). మీరే ఎకరా రూ.10 కోట్లకు ఎవరైనా కొంటారా అని నేను అడుగుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎలా చేయగలుగుతాం? ఈ ప్రాజెక్టు అడుగులు ముందుకు పడకపోతే ఈ ప్రాంతంలో ఉన్న రైతులేం కావాలి? బాబుపై 420 కేసు పెట్టాలి ► చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కేవలం రూ.5,674కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మరో రూ.2,297 కోట్లు బకాయిలు పెట్టి మనల్ని కట్టమని వదిలేశారు. అంతగా భ్రమలు కల్పించి, డిజైన్లు, గ్రాఫిక్స్ చూపించి మోసం చేసినందుకు నిజానికి 420 కేసు పెట్టాలి. ► ఆయన బినామీలందరికీ కూడా ఇక్కడ భూములుండి.. ఇక్కడ అభివృద్ధి చెందితే ఆ భూములకి రేట్లు పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు రూ.2,297 కోట్లు బకాయిలు పెట్టారు? ► వాస్తవం ఏమిటంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతకన్నా ఎక్కువ పెట్టలేని పరిస్థితి. ఏడాదికి రూ.2 వేల కోట్లు కూడా పెట్టలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. రాష్ట్రంలో 80 శాతం పైచిలుకు ప్రజలు తెల్లకేషన్ కార్డు మీదే బతుకుతున్న పరిస్థితి. రాష్ట్రం అంటే 8 కి.మీ పరిధి కాదు ► రాష్ట్రం అంటే 8 కిలోమీటర్ల పరిధి మాత్రమే కాదు. రాష్ట్రం అంటే 1,62,967 చదరపు కిలోమీటర్ల భూభాగం. మన రాష్ట్రం అంటే 3.96 కోట్ల ఎకరాల భూభాగం. కేవలం కొందరి లబ్ధి కోసం ఉన్న 50 వేల ఎకరాల భూమి మాత్రమే కాదు. చంద్రబాబు దృష్టిలో రైతులు అంటే కేవలం 35 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మాత్రమే. మన దృష్టిలో రైతులంటే ఈ 35 వేల ఎకరాలిచ్చిన రైతులతోపాటు రైతుభరోసాను అందుకుంటున్న మరో 50 లక్షల మందీ రైతులే. రూ.5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబే చెప్పారు అమరావతి ఇటు విజయవాడకు దగ్గరగా లేదు, అటు గుంటూరుకు దగ్గరగాలేదు. దేనికీ దగ్గరగా లేని ఈ ప్రాంతంలో కేవలం రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతులు కోసమే ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున ఖర్చు చేయాలని ఆనాడు చంద్రబాబే లెక్కకట్టారు. అంటే ఈ 53 వేల ఎకరాల అమరావతికి అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని ఆయనే లెక్క తేల్చారు. కేవలం 53 వేల ఎకరాలు అంటే 8 కిలోమీటర్ల పరిధిలో మౌలిక వసతుల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని వాళ్లే ఇచ్చిన నివేదిక ఇది ( కాపీని స్క్రీన్‌పై చూపించారు). ఇక రాజధాని భవనాలు మిగిలిన వాటిని కూడా కలుపుకుంటే కనీసం రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. -
‘ఇదేం పాలసీ.. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..?’
సాక్షి, అమరావతి: పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకమే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ నిర్ణయంతో వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. చదవండి: కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో టీడీపీ నేతలు పాత్రధారులు: దేవినేని అవినాష్ ‘‘పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలి. ఇప్పటికైనా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని’’ మంత్రి హితవు పలికారు. 2018కి పోలవరం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి చేతులెత్తేశారు. మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. ‘‘నేను ముఖ్యమంత్రి అయితే తప్ప శాసన సభకు రానని చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడు. నేను రాను అంటూనే శాసన సభ ప్రాంగణంలోకి ముర్ముకి ఓటు వేయడానికి వచ్చాడు. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..? నీది ఒక పాలసీ...నీ పార్టీది ఒక పాలసీ ఉంటుందా?’’ అంటూ అంబటి ఎద్దేవా చేశారు. ‘‘ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే అమరావతి పాదయాత్ర. అమరావతి అనేది ఓ పెద్ద స్కామ్. ఆ కుంభకోణానికి పునాది వేసింది చంద్రబాబే. అమరావతి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నారా?. వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం. మూడు ప్రాంతాల అభివృద్ధే మాకు ముఖ్యం. అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలనుకోవడం తప్పా?’’ అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. -
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల స్కామ్‌లో ఐదుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 1100 ఎకరాల అసైన్డ్‌భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అభియోగం. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణకు సంబంధించి ఐదుగురిని సీఐడీ అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ.. బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్టుగా అభియోగాలు ఉన్నాయి. చదవండి: అరుదైన రికార్డ్.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణా హౌసింగ్ డైరెక్టర్ ఖాతాల ద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని నిర్ధారణ అయ్యింది.ఈకేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడైంది.ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. -
ఏ–1 చంద్రబాబు.. ఏ–2 నారాయణ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పేరిట సాగిన మరో భారీ భూబాగోతం బట్టబయలైంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీ భూదోపిడీకి పాల్పడ్డారన్నది వెల్లడైంది. ఇన్నర్‌రింగ్ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్‌ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి.. రోడ్డు డిజైన్ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లుగా డ్రామా ఆడి.. తాము ముందుగా అనుకున్న డిజైన్‌నే ఖరారుచేశారు. ఈ మధ్యలో ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు ఇరువైపులా తమ కుటుంబ వ్యాపార సంస్థలు, సన్నిహితులు, బినామీల భూములు ఉండేలా కథ నడిపించారు. ఆ విధంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ, ఆయన బినామీ లింగమనేని గ్రూప్ సంస్థలు, నారాయణ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అడ్డగోలుగా వేలకోట్ల ప్రయోజనం కలిగించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి తమ బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ పేరిట సాగిన అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్, హెరిటేజ్ కంపెనీ, లింగమనేని గ్రూప్ సంస్థలతోపాటు మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–3గా లింగమనేని రమేష్‌లతోపాటు 14మందిపై సోమవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అంతేకాక.. సీఐడీ దర్యాప్తులో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గోప్యంగా ఇన్నర్ రింగ్‌రోడ్డు డిజైన్ టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్ డిజైన్‌ను ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండనున్నది నిర్ధారణ అయిపోయింది. కానీ, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు నియమించిన ఎస్టీయూపీ అనే మరో కన్సల్టెన్సీకి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలనే షరతు పెట్టారు. ఈ అంశంపై సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ పలు సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు డ్రామా ఆడి ముందుగానే ఖరారుచేసిన ఇన్నర్ రింగ్‌రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్‌ను ఆమోదించారు. అటూ ఇటూ భారీగా భూముల కొనుగోలు ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. రాజధాని పరిధి పెంచుకుంటూ పోయారు అమరావతి ప్రాంతంలోనే రాజధాని వస్తుందని ముందుగా నిర్ణయించిన చంద్రబాబు, ఆయన సన్నిహితులు, బినామీలు ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు వేలాది ఎకరాలు కొనుగోలు చేసి అనంతరం రాజధానిని ప్రకటించారు. అంతేకాదు.. తాము కొనుగోలు చేసిన భూముల విలువ వందల రెట్లు పెరిగేలా అమరావతి పరిధిని అంతకంతకూ విస్తరించుకుంటూపోయారు. ఎలాగంటే.. ► రాజధాని అమరావతి 122 చదరపు కి.మీ. పరిధిలో ఉంటుందని 2014, డిసెంబర్ 30న నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ► తరువాత 2015, జూన్ 9న 217 చదరపు కి.మీ.కు.. అనంతరం 391 చదరపు కి.మీ.కు పెంచారు. అంతేకాదు.. అమరావతిలో ఏ ప్రాంతం భూసమీకరణ పరిధిలోకి వస్తుంది... ఏ ప్రాంతం రాదన్నది కూడా నిర్ణయించారు. చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలకు చెందిన వందల ఎకరాల భూములన్నీ కూడా అమరావతి పరిధిలోనే ఉంటూ కూడా భూసమీకరణ పరిధిలోకి రాకపోవడం గమనార్హం. దాంతో ఎకరా సగటున రూ.25లక్షలకు కొనుగోలు చేసిన భూముల విలువ అమాంతంగా ఎకరా రూ.4కోట్ల వరకు చేరింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు అండ్ కో అవినీతి బట్టబయలుకావడంతో సీఐడీ తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ అనేది మా ప్రభుత్వ విధానం అని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయాన్ని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు. మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం. రాజధాని అంటే భూములు, ఓ సామాజిక వర్గం కాదు. ఇతర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా..?. సీఆర్డీఏ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వం ఉద్దేశ్యం. హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (సీఆర్డీఏ చట్టం అమలులోనే ఉంది: మంత్రి బొత్స) -
అందరి మాట.. అభివృద్ధి బాట
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): మూడు రాజధానులతోనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావుల ఫోరం అభిప్రాయపడింది. ఫోరం ఆధ్వర్యంలో ‘పరిపాలన వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఆవశ్యకత–ఆంధ్రప్రదేశ్ సమతుల అభివృద్ధి’ అంశంపై జేఎన్టీయూ (కాకినాడ)లో మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఫోరం అభిప్రాయపడింది. రాష్ట్రానికి, యువతకు మేలు జరగాలంటే ఈ విధానమే సరైందని విద్యార్థులు, మేధావులు ముక్తకంఠంతో చెప్పారు. జేఎన్టీయూకే సివిల్ విభాగం ప్రొఫెసర్, గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాల సమానాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పెట్టుబడులు, అభివృద్ధి అంతా ఒకేచోట ఉంటే మళ్లీ ప్రాంతాల మధ్య అసమానతలు, విద్వేషాలు రగులుతాయన్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చి, ప్రజల్లో ఉన్న గందరగోళానికి స్వస్తి చెప్పాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి, యువతకు మేలు జరగాలంటే మూడు రాజధానుల అంశంపై ప్రజలను చైతన్యపరచాలని ఫోరం నిర్ణయించింది. కార్యక్రమంలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో పాటు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
అది వంద మందిదే.. అందరిదీ కాదు.. ఢిల్లీ ఎక్కడుంది
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): అన్ని వర్గాల భాగస్వామ్యం లేని అమరావతి రాజధాని ఎలా అవుతుందని రాయలసీమ మేధావుల ఫోరం ప్రశ్నించింది. రాజధాని ఏర్పాటు సమయంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను గత సర్కారు విస్మరించిందని పేర్కొంది. అమరావతిలో 50 నుంచి వంద మంది వ్యక్తం చేసే అభిప్రాయం రాçష్టం మొత్తానికి వర్తిస్తుందా? అని నిలదీసింది. అమరావతి రైతుల పేరుతో చేపట్టిన ఉద్యమంలో నిజాయితీ లేదని, కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే ఉందని ఫోరం స్పష్టం చేసింది. అది ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నాయకులు, ప్రజాభిమానాన్ని కోల్పోయిన పార్టీలు నడిపిస్తున్న పెయిడ్ ఉద్యమమని విమర్శించింది. అమరావతి రైతుల పేరిట రాయలసీమ వాసులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించింది. రాయలసీమకు హైకోర్టు వద్దని అడ్డుపడుతున్న వారు ఎస్వీయూలో బహిరంగ సభ నిర్వహిస్తామంటే ఎలా అనుమతిస్తామని సూటిగా ప్రశ్నించింది. తిరుపతిలో సభ నిర్వహించేందుకు వీలు లేదని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఫోరం ప్రకటించింది. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అందరూ స్పందించాలని, ఈ అంశంపై బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్తామని ఫోరం ప్రకటించింది. శ్రీకాళహస్తి, పుత్తూరు, ఎస్వీ యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను జాగృతం చేస్తామని స్పష్టం చేసింది. ‘ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన – రాయలసీమ ప్రజల మనోగతం’ అనే అంశంపై రాయలసీమ మేధావుల ఫోరం మంగళవారం ఎస్వీయూలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీ ఎక్కడుంది? ‘రాజధాని నడిబొడ్డున ఉండాలన్న నిబంధన ఎక్కడుంది? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉందా?’ అని ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఏమూల నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. తమిళనాడు నుంచి రాయలసీమకు వస్తున్న పెట్టుబడులను గత ప్రభుత్వం అడ్డుకుని అమరావతిలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు. డబ్బులు వెదజల్లి రెచ్చగొట్టే యత్నాలు.. అమరావతి ఒక వర్గానికి సంబంధించిన రాజధాని అని ప్రొఫెసర్ ఎ.సుధాకరయ్య పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఉంటే అమరావతి రైతులకు వచ్చే నష్టం ఏమిటని ప్రొఫెసర్ నాగోలు కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరిట డబ్బులు వెచ్చించి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు జరుగుతున్న కుట్రని చెప్పారు. రాయలసీమలో ఎక్కడ సభ తలపెట్టినా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటును ఏనాడు ప్రశ్నించలేదని ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. కోస్తా ప్రజలకు రాజధాని అడిగే హక్కు న్యాయపరంగా, నైతికంగా లేదన్నారు. తాము ఉత్తరాంధ్రతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామన్నారు. సీమవాసుల మద్దతు దుష్ప్రచారమే.. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులు అమరావతికి మద్దతిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీమ ప్రజలు తమ ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నట్లు నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు తిరస్కరించిన ఒకరిద్దరు నాయకులు మినహా ఎవరూ అమరావతి ఉద్యమాన్ని అంగీకరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే మోసానికి గురై మద్రాస్, కర్నూలు నుంచి రాజధాని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే దక్కాలని స్పష్టం చేశారు. ఇక్కడ గ్రామీణ వాతావరణం గల పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. అమరావతి రైతులు రాజధానికి భూములు త్యాగం చేశారని కొందరు నాయకులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, వ్యాపారమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులదే నిజమైన త్యాగమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావాలని గతంలో బీజేపీ, వామపక్షాలు ఒప్పుకున్నాయని, రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గత సర్కారు పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోసీమకు మెడికల్ సీట్లు రాకుండా నష్టం కలిగించిందని, దీనిపై ఉద్యమిస్తే అడ్డుకుందని గుర్తు చేశారు. -
రూ.149.5 కోట్లతో అసెంబ్లీకి రాజమార్గం
సాక్షి, అమరావతి: శాసన రాజధాని అమరావతికి రాజమార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉండవల్లి అవుట్ ఫాల్ స్లూయిజ్ నుంచి ఎన్–13 రహదారి వరకు 15.52 కిలోమీటర్ల పొడవున.. కృష్ణానది కుడి కరకట్టను వెడల్పు చేసి, పటిష్టపరచి రెండు వరుసల (డబుల్ లేన్) రోడ్డును నిర్మించడానికి నడుంబిగించింది. రూ.149.5 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రహదారి నిర్మాణానికి అవసరమైన కేంద్ర పర్యావరణశాఖ, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), రివర్ కన్జర్వేటర్ తదితర అనుమతులను తీసుకోవడం ద్వారా రహదారి పనులను వేగంగా పూర్తిచేసేందుకు జలవనరులశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీకి రాజమార్గాన్ని నిర్మించడం ద్వారా శాసన రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ నుంచి అమరావతి దారేది? కృష్ణానది కుడి కరకట్ట పక్కన నదీ గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు కరకట్టపై ఒక వరుస రోడ్డుపైనే తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయానికి రాకపోకలు సాగించేవారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. విజయవాడతో అమరావతిని అనుసంధానం చేసేలా రోడ్డు నిర్మించే ఆలోచన కూడా చేయలేదు. కళ్లెదుట కనిపిస్తున్న.. రోజూ రాకపోకలు సాగించే రహదారినే అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తున్నానంటూ ప్రచారం చేసుకోవడం గమనార్హం. కరకట్టపై ఒకే వరుస రోడ్డు ఉండటం వల్ల శాసన రాజధాని అమరావతికి రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. దీన్ని గమనించిన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన విజయవాడతో అమరావతిని అనుసంధానం చేసేలా రాజమార్గం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సమతుల అభివృద్ధే లక్ష్యంగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఐదేళ్లు హడావుడి చేసిన చంద్రబాబు చివరకు విజయవాడ నుంచి అమరావతికి కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కల్పించలేక చేతులెత్తేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రిక ఒప్పందాలను గౌరవించి సమతుల అభివృద్ధే ధ్యేయంగా అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తూ చట్టం చేసింది. శాసన రాజధాని అమరావతి అభివృద్ధికి నడుంబిగించింది. అందులో భాగంగానే.. విజయవాడ నుంచి అమరావతికి కృష్ణానది కరకట్ట మీదుగా రాజమార్గం నిర్మాణాన్ని ప్రాధాన్యతగా చేపట్టింది. -
రాజధానిలో రూ.3 వేల కోట్ల పనులకు ప్రభుత్వ గ్యారెంటీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు అవసరమైన రూ.3 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మౌలిక వసతుల కల్పన కింద రోడ్లు, మురుగు నీటిపారుదల, నీటి సరఫరా, జాతీయ రహదారికి రాజధాని రోడ్లను అనుసంధానం చేసే పనులు, భూసమీకరణలో రైతులకివ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు రూ.3 వేల కోట్లు అవసరమని ఏఎంఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు మూడు బ్యాంకులు అంగీకరించగా దానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సిఉంది. నిబంధనల ప్రకారం షరతులకు లోబడి గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. రాజధాని పనుల కోసం సాంకేతిక కమిటీ రాజధానిలో పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు అవసరమైన సిఫారసులు, సూచనలు చేసేందుకు తొమ్మిది మంది సభ్యులతో ప్రభుత్వం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ చైర్మన్‌గా, పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ, ఏపీసీపీడీసీఎల్, ఈఎన్సీలు, సీఈలు ఇతర అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైంది. -
అక్రమాల పుట్ట ‘అమరావతి’
సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే. ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్‌తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్‌లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. అక్రమాల చిట్టా... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మైత్రీ ఇన్ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది. బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా.. టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్‌కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. తాజాగా అసైన్డ్ భూ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు నేపథ్యంలో ఈ నెల 23న చంద్రబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన తప్పించుకునేందుకు దారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం. -
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి, నెల్లూరు రూరల్: రాజధాని అమరావతి ముసుగులో అక్రమంగా అసైన్డ్ భూముల కొనుగోళ్లు, బదలాయింపు కేసులో ఏ–2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సీఐడీ బుధవారం పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపింది. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడలోని పది ప్రాంతాల్లో సీఐడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్లు సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. సీఆర్డీఏ వైస్ చైర్మన్‌గా రాజధాని వ్యవహారాలను నారాయణ పర్యవేక్షించడం తెలిసిందే. అసైన్డ్ భూముల స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 23న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏ – 1గా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఏ – 2గా ఉన్న మాజీ మంత్రి నారాయణకు సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. అయితే నారాయణ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌లోని కూకట్పల్లి లోధా బెల్లేజ 1(ఏ) టవర్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేసింది. ఈనెల 22న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఐపీసీ సెక్షన్లు 120 బి, 166, 167, 217 కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. విచారణకు హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపింది. నోటీసు అందినట్లు పేర్కొన్న నారాయణ సతీమణి పలు కీలక ఫైళ్లు స్వాధీనం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నారాయణకు చెందిన విద్యా సంస్థల్లో సీఐడీ అధికారులు విస్త్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ వైద్య కళాశాల ఆవరణలోని నారాయణ ఇంటికి ఉదయాన్నే చేరుకున్నారు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ జూనియర్ కళాశాల, రూరల్ పరిధిలోని ధనలక్ష్మిపురం, ముత్తుకూరు మండలంలోని విద్యాసంస్థల్లో కూడా తనిఖీలు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ తనిఖీల్లో పలు కీలక ఫైళ్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తనిఖీల్లో అమరావతి సీఐడీ విభాగం డీఎస్పీ రవికుమార్, సీఐలు వెంకటేశ్వర్లురెడ్డి, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి స్కామ్ విచారణకు మూడు ప్రత్యేక బృందాలు
సాక్షి, అమరావతి: అమరావతి కేపిటల్ సొసైటీ స్కామ్‌ను నిగ్గు తేల్చేందుకు మూడు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ స్కామ్‌లో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చి.. వారిని అరెస్టు చేసేందుకు ఇవి శనివారం రంగంలోకి దిగాయి. కృష్ణా జిల్లా నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటల్లో ప్రజల నుంచి లక్షలాది రూపాయల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్ కోఆపరేటివ్ సొసైటీ’పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన సొసైటీ చైర్మన్ కె.ప్రకాశరావు, సొసైటీ డైరెక్టర్లు, మేనేజర్ తదితర ప్రధాన ఉద్యోగులు, ఏజెంట్లపై సెక్షన్ 406, 420తోపాటు ఐపీసీ సెక్షన్ 5, ఏపీపీడీఎఫ్ఈ యాక్ట్–1999 సెక్షన్ల ప్రకారం నూజివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బ్యాంక్ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు, ఉద్యోగుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాస్ చెప్పారు. బ్యాంకు తరహా కార్యకలాపాలు నిర్వహించిన అమరావతి కేపిటల్ సొసైటీ ఎంతమంది నుంచి ఎన్ని లక్షల రూపాయల డిపాజిట్లు వసూలు చేసింది.. ఈ సొసైటీలో ఎంతమంది నిర్వాహకులున్నారు.. వంటి వివరాలను ప్రత్యేక పోలీస్ బృందాలు ఆరా తీస్తున్నాయని తెలిపారు. బ్యాంక్ కార్యకలాపాల రికార్డులు, కంప్యూటర్లు తదితరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించనున్నారు. తక్కువ సమయంలోనే భారీ వసూళ్లు కృష్ణా జిల్లాలోని నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటలపై దృష్టి పెట్టిన సొసైటీ నిర్వాహకులు తక్కువ సమయంలోనే పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు సేకరించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ 3 ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు రూ.35 లక్షలకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే డిపాజిటర్లు ఉన్నారని, అయితే ఫిర్యాదు చేస్తే డబ్బులు రావేమో అనే భయంతో వారు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ముందుకు వచ్చి సమాచారం ఇస్తే ఈ మొత్తం రూ.50 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు శనివారం నూజివీడుకు వెళ్లి అమరావతి కేపిటల్ సొసైటీ స్కామ్ విషయమై స్థానిక పోలీసులతో సమీక్షించారు. పూర్తి వివరాలు సేకరించి డిపాజిటర్లకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
లబోదిబోమంటున్న డిపాజిటర్లు....
-
బోర్డు తిప్పేసిన ‘అమరావతి కేపిటల్ సొసైటీ’
సాక్షి, అమరావతి: ‘అమరావతి కేపిటల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ బోర్డు తిప్పేసింది. అవసరానికి అక్కరకొస్తుందనే ఆశతో పైసా పైసా కూడబెట్టి ఈ సొసైటీలో డబ్బు దాచుకున్న డిపాజిటర్లను ఆ సంస్థ నిలువునా ముంచేసింది. రెండు రోజులుగా నూజివీడులోని సొసైటీ కార్యాలయం తెరవకపోగా, డిపాజిట్ దారుల నుంచి డబ్బు వసూలు చేసిన ఏజెంట్లు ఎవరూ రావట్లేదు. దీంతో ఆందోళనకు గురైన డిపాజిట్‌దారులు శుక్రవారం సొసైటీ వద్దకెళ్లారు. అక్కడెవరూ లేకపోవడంతో సొసైటీ కార్యాలయానికి తాళాలేశారు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు మొరపెట్టుకోవడంతో సొసైటీ దగా వ్యవహారం వెలుగుచూసింది. 2018 నుంచి వసూళ్లు.. విజయవాడ కేంద్రంగా 2018లో ఏర్పాటైన అమరావతి కేపిటల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కృష్ణా జిల్లాలోని నూజివీడు, తిరువూరు, విస్సన్నపేటల్లో బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు, నెలవారీ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు సేకరించింది. ఆ మొత్తాలను గోల్డ్‌లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ పేరుతో వడ్డీలకిచ్చింది. మరోవైపు నూజివీడులో చిరు వ్యాపారుల నుంచి ఏజెంట్లు డైలీ కలెక్షన్లు వసూలు చేసినట్టు సమాచారం. ఓ చిరు వ్యాపారి నెలకు రూ.3వేలు చొప్పున 12 నెలలకు రూ.36 వేలు కట్టే స్కీములో చేరితే అతను 6 నెలలు కట్టిన రూ.18 వేలతోపాటు మరో రూ.18వేల సొమ్మును కలిపి మొత్తం రూ.36 వేలు లోనుగా ఇస్తామని ఏజెంట్లు నమ్మబలికారు. దీంతో నూజివీడు, విస్సన్నపేట, హనుమాన్ జంక్షన్, తిరువూరు ప్రాంతాల్లో సుమారు 500 మందికిపైగా డిపాజిట్‌దారులు అమరావతి సొసైటీలో సొమ్ము జమ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నూజివీడు, తిరుపూరు ప్రాంతాల్లోనే రూ.50 లక్షల వరకు డిపాజిట్లు సేకరించినట్టు సమాచారం. అయితే గడిచిన కొద్దిరోజులుగా గడువు ముగిసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో యాజమాన్యం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. డిపాజిట్లు సేకరించిన ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు. ఒక్క నూజివీడులోనే 35 మంది ఖాతాదారులకు గడువు ముగిసిన డిపాజిట్లకు సంబంధించి రూ.20 లక్షల వరకు సొమ్ము తిరిగి చెల్లించాల్సి ఉందంటున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులును కోరారు. ఈ నేపథ్యంలో డిపాజిట్‌దారులైన భవానీశంకర్, రాజేశ్వరి, వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మిల తదితరుల నుంచి నూజివీడు పట్టణ ఎస్ఐ గణేష్‌కుమార్ వివరాలు సేకరించారు. విచారణకు ఆదేశించా: కృష్ణా జిల్లా ఎస్పీ దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారించి కేసు నమోదు చేయాలని నూజివీడు, తిరువూరు పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. నూజివీడుకు చెందిన వి.దుర్గాలక్ష్మీభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి కేపిటల్ బ్యాంకుపై ఛీటింగ్ కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ బి.శ్రీనివాస్ చెప్పారు. -
అమరావతిలోనూ ఓడించారు
తాడికొండ: తాను అమరావతిని రాజధాని చేస్తే, ఈ ప్రాంతంలోనూ ప్రజలు టీడీపీని ఓడించారని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ వైఎస్సార్సీపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గతంలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని. ప్రజలు అక్కడా ఓడించారని చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా తుళ్లూరులోని దీక్షా శిబిరం వద్ద మహిళా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల భవిష్యత్తు అవసరాల కోసమే రాజధాని నిర్మాణం అని, 5 కోట్ల ఆంధ్రులు ఏకమై ఉద్యమించాలని చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద ఉద్యమం అమరావతి ఉద్యమం అని, చరిత్రలో ఇది నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు, పన్నుల పెంపుతో బాదుడే బాదుడు జరుగుతోందని, రూ.10 వేలు ఇచ్చి రూ.లక్ష వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘నన్ను విమానాశ్రయంలో అరెస్టు చేశావ్.. నేను కన్నెర్రజేస్తే నువ్వు బయటకు రాలేవు’ అంటూ సీఎంపై మండిపడ్డారు. ఎక్కడ పని చేస్తున్నా పోలీసులను వదలను పోలీసులు చాలా ఎక్కువ చేస్తున్నారని, అన్నీ రికార్డు చేస్తున్నానని.. తర్వాత రికవరీ చేస్తానని హెచ్చరించారు. ఎక్కడ డ్యూటీలు చేస్తున్నా మిమ్మల్ని వదలనంటూ బెదిరింపులకు దిగారు. ఎంపీ గల్లా జయదేవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
‘అమరావతి’ ఆందోళనకారుల ర్యాలీ
సాక్షి, గుంటూరు/తాడికొండ: ముందస్తు అనుమతులు లేకుండా రాజధాని అమరావతి ఆందోళనకారులు ర్యాలీ చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరు జిల్లాలోని అమరావతి రాజధాని ప్రాంతంలో 144వ సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇక్కడ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నింటినీ పక్కనపెట్టి ఆందోళనకారులు సోమవారం విజయవాడలోని దుర్గమ్మ గుడి దర్శనానికంటూ ర్యాలీగా బయల్దేరారు. ఓవైపు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్రగా ఆందోళనకారులు విజయవాడకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీ, మందడం, రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ అనుమతులు లేవని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు విజయవాడకు బయల్దేరతామని పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమను అడ్డుకున్నారని తుళ్లూరు మండలం వెలగపూడిలోని సచివాలయం ముట్టడికి యత్నించారు. మల్కాపురం జంక్షన్ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. పలువురు పోలీస్ సిబ్బందిని పిడిగుద్దులు గుద్దడం, గోళ్లతో రక్కడం చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగ్బంధానికి యత్నం దుర్గ గుడి దర్శనం పేరిట ఆందోళనకారులందరూ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని బ్యారేజీని దిగ్బంధించాలని ప్రణాళిక రచించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు ఆదివారమే గుర్తించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామునే ఎక్కడికక్కడ బారికేడ్లు, పికెట్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారుల ముసుగులో టీడీపీ నేతలే ఈ కుట్రలకు తెరలేపినట్టు విమర్శలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ముందస్తు అనుమతులు లేకుండా ఆందోళనకారులు ర్యాలీలకు దిగడం చూస్తుంటే బుధవారం జరిగే ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించేలా కుట్రలు పన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
లక్ష కోట్లు ఒకచోటే వెచ్చిస్తే.. మిగతా ప్రాంతాల సంగతేంటి?
సాక్షి, అమరావతి: రాజధానిగా అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంత భారీ మొత్తాన్ని కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తే, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. కేవలం ఒక ప్రాంతం కోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందని చెప్పారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తన వాదనలను ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. శానసవ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించకూడదు ‘మూడు రాజధానులు ఏర్పాటు విషయంలో చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంది. ప్రజల సంక్షేమం కోసమే శాసనవ్యవస్థ పనిచేస్తుంటుంది. అందువల్ల శానసవ్యవస్థకు ఎలాంటి దురుద్దేశాలను ఆపాదించడానికి వీల్లేదు. శాసన వ్యవస్థ పరిధిలోని వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదు. రాజ్యాంగ మౌలిక çసూత్రాలకు విరుద్ధంగా న్యాయస్థానాలు వ్యవహరించరాదు. మూడు రాజధానుల ఏర్పాటు అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని వ్యవహారం. కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధించజాలరు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే, వాటిని సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఎంతో వెనుకబడి ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. పాలన వికేంద్రీకరణ ద్వారా అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది.’ అని దవే హైకోర్టుకు నివేదించారు. నిజమైన రైతులకు ఎక్కడా అన్యాయం చేయడం లేదు ‘రాజధానిని మారిస్తే, తమ ఆస్తుల విలువ తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్న వ్యక్తులే న్యాయస్థానాలను ఆశ్రయించారు. నిజమైన రైతులకు ప్రభుత్వం ఎక్కడా అన్యాయం చేయడం లేదు. గత చట్టాల కంటే ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాల వల్ల వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. నామమాత్రపు ధరలకు భూములు కొని, కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చునని ఆశపడ్డ వారే ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ అయినప్పటికీ, అది ఇప్పటికీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రజలంతా అహ్మదాబాద్ వైపే మొగ్గు చూపుతారు. గాంధీనగర్ అభివృద్ధికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఒక ప్రాంతం రాజధాని అయినంత మాత్రాన అది అభివృద్ధి చెందుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదనేందుకు గాంధీనగర్ ప్రత్యక్ష ఉదాహరణ..’ అని దవే వివరించారు. మూడు రాజధానులు ఆషామాషీ నిర్ణయం కాదు ‘కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని భూములు దేశంలోనే అత్యంత సారవంతమైన భూములు. ఇలాంటి భూములను రాజధాని కోసం తీసుకోవడం వివేకవంతమైన చర్య కాదు. అలా తీసుకోవడం ద్వారా గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది. లక్ష కోట్ల రూపాయలను ఓ రాజధానిపై పెట్టడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతుంది. ఇప్పటికే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను చెల్లించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి ఉంది. అమరావతి విషయంలో గత ప్రభుత్వం చాలా హడావుడిగా నిర్ణయం తీసుకుంది. కానీ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదు. విభిన్న రంగాల నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి, ఆ కమిటీల సిఫారసుల ఆధారంగా నిర్ణయం తీసుకుంది..’ అని దవే వివరించారు. సుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
గత పాలకులది విశ్వాసఘాతుకం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్ల కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు బుధవారం ముగిశాయి. భూముల కొనుగోళ్ల డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశిస్తూ దీనిపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ప్రకటించారు. అంతకు ముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రాజధానిపై తమకు కావాల్సిన వారికి లీకులివ్వడం ద్వారా గత పాలకులు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, సమాజాన్ని మోసగించారని హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్ణయానికి సంబంధించి అధికారిక రికార్డులు లేవని, వీలునామా రాసినట్లుగా, కుటుంబ ఆస్తులు పంపకాలు చేసుకున్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. రాజధాని నడిబొడ్డున, రింగ్‌రోడ్డు పక్కన, కీలక ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం యాదృచ్ఛికం ఎలా అవుతుందన్నారు. దీని వెనుక భారీ కుట్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి భూములను కారుచౌకగా కొనేశారని, ఇదే విషయాన్ని పోలీసుల ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రైవేట్ భూ కొనుగోళ్ల లావాదేవీలను నేర పరిధిలోకి తీసుకురావడం సబబేనా? అని ప్రశ్నించారు. నేరపూరిత కుట్ర ఉంది కాబట్టే కేసు నమోదు చేసినట్లు శ్రీరామ్ తెలిపారు. ఈ భూముల కొనుగోళ్లతో ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏముందని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించడంతో నష్టం అన్నది ఆర్థిక రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదని ఏజీ చెప్పారు. రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని అధికార ప్రకటనకు ముందే కొందరికి మాత్రమే వెల్లడించడం వల్ల సమాజంలో మిగిలిన వారు నష్టపోయారన్నారు. ఇలాంటి చర్యలన్నీ ఆర్థిక నేరాల కిందకు వస్తాయని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ కోరితే ఇప్పటివరకు స్పందించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, కిలారు శ్రీహాస తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ అమరావతినే రాజధానిగా చేస్తారని 2014 మార్చి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని, పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని వివరించారు. నార్త్‌ఫేస్ హోల్డింగ్స్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ రాజధానికి 8 కిలోమీటర్ల అవతల భూములు కొనుగోలు చేస్తే తప్పుబడుతున్నారన్నారు. -
చంద్రబాబుకు ఆ 29 గ్రామాలే ముఖ్యమా!
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలే ముఖ్యమా? రాష్ట్ర భవిష్యత్ పట్టదా? అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు నిలదీశారు. మూడు రాజధానులకు మద్దతుగా, శాసన రాజధానిలో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌తో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ జంక్షన్లో చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 48 రోజుకు చేరుకున్నాయి. 13 జిల్లాల నుంచి తరలివచ్చిన యానాది సంఘాల ప్రతినిధులు దీక్షలో పాల్గొని మద్దతు పలికారు. రాష్ట్ర యానాదుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.ఏడుకొండలు మాట్లాడుతూ రాజధానిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడాన్ని కోర్టుల ద్వారా అడ్డుకోవడం దురదృష్టకరమని, ఇకనైనా టీడీపీ నేతలు బుద్ధి తెచ్చుకుని కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. వికలాంగుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బందెల కిరణ్ మాట్లాడుతూ టీడీపీ, ఇతర పార్టీల నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని రాజన్న ఆటోనగర్ అధ్యక్షుడు పి.ఖాజావలి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్ సర్కార్ అభివృద్ధి వికేంద్రీకరణ చేపడుతుంటే.. టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. -
ఆ కేసుల్లో తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలి
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలతో పాటు రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో జరగబోయే తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రత్యక్ష ప్రసారం కోసం తగిన మార్గదర్శకాలు రూపొందించేలా రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన ఎల్ఎల్ఎం విద్యార్థిని వేమూరు లీలాకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పులు ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. న్యాయస్థానాలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ప్రత్యక్ష ప్రసారం ఎంతో ఉపయోగపడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. -
అమరావతి భూ అక్రమాల కేసులో ముగిసిన పోలీస్ కస్టడీ
సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి భూ అక్రమాల కేసులో నిందితుల రెండు రోజుల పోలీస్ కస్టడీ శనివారంతో ముగిసింది. అమరావతి గ్రామాల పరిధిలో భూముల రికార్డులను తారుమారు చేసిన కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడ ఎం అండ్ ఎం వస్త్రదుకాణ యజమాని గుమ్మడి సురేష్లను అరెస్టు చేసిన పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. చివరిరోజు శనివారం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విచారణ కొనసాగింది. రెండు రోజుల కస్టడీలో ఏడు గంటల పాటు నిందితులను పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటలకు జిల్లా జైలుకు చేరుకున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి న్యాయవాది సమక్షంలో సురేష్‌ను విచారించారు. ఆయన ఏ విధంగా అసైన్డ్ భూమిని కొనుగోలు చేశాడు..? అప్పటి తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు సహాయంతో అసైన్డ్ భూమిని పట్టా భూమిగా ఏ విధంగా వెబ్ ల్యాండ్‌లోకి ఎక్కించారు..? ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. పరస్పర ఒప్పందంతోనే.. సుధీర్ బాబు, సురేష్‌లు ఇద్దరూ పరస్పర ఒప్పందంతోనే అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగానే సురేష్ భూమిని కొనుగోలు చేసి సీఆర్డీఏకు రికార్డులు సమర్పించే రెండు నెలలకాలం భూమిని పట్టా భూమిగా చూపారని, అనంతరం అసైన్డ్ భూమిగా వెబ్ ల్యాండ్‌లో మార్పు చేసినట్టు సమాచారం. -
‘పవన్.. పార్ట్ టైం పొలిటీషియన్’
సాక్షి, విశాఖపట్నం: రాజధాని అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. పవన్.. పార్ట్ టైం పొలిటీషియన్‌గా ఉంటూ కేవలం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారని విమర్శించారు. విశాఖ గాజువాక నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విశాఖలో రాజధానిని వ్యతిరేకించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అమరావతిపై పవన్ కల్యాణ్ ఒక్కడికే ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ సినిమా తీస్తున్న నేపథ్యంలో.. ఆ బాధలో నిన్నటి వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నామని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారు.. ఆయనకు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేదని విమర్శించారు. మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే పవన్ వ్యతిరేకించడం ఏంటన్నారు కరణం. (వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి) ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని వస్తే నీకేమి బాధ అని కరణం ధర్మశ్రీ, పవన్‌ని ప్రశ్నించారు. మూడు రాజదానులు రావు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పి.. ఒక్క సీటుకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఇంతా జరిగినా ఇంకా పవన్ కల్యాణ్‌లో మార్పు రాకపోవడం దురదృష్టకరం అన్నారు. పవన్‌ది జనసేన కాదు.. కళసేన అని తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులు రావడం ఖాయమన్నారు. ఒక విధానం అంటూ లేకుండా ఆరునెలలుకు ఒకసారి బయటకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేసి కనుమరుగవ్వడం పవన్ కల్యాణ్‌కు అలవాటన్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కల్యాణ్‌కు తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజల వద్దకే పాలన కోసం సచివాలయం... వాలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని కరణం ధర్మశ్రీ తెలిపారు. (‘ఏమిటీ రాతలు.. ఎవరిది చెప్పింది’) అంతేకాక తన నియోజకవర్గంలో గోవాడ చక్కెర ఫ్యాక్టరీని, చెరుకు రైతులని సీఎం వైఎస్ జగన్ కాపాడారని కరణః ధర్మశ్రీ తెలిపారు. సీఎం రైతులకు, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే విమర్శలు చేయడం తగదన్నారు. కరోనా వైరస్‌కు సంభంధించి ఏపీలో రోజుకు వేలల్లో టెస్ట్ చేస్తున్నారని.. దేశంలోనే కరోనా టెస్టులు చెయ్యడం, నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ఏపీ ముందుందని ప్రశంసించారు. -
మాకు గూడు లేదు.. ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వండి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలమైన తమకు ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదని గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరికి చెందిన మహిళలు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు విషయంలో ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా వినాలని అభ్యర్థిస్తూ దాదాపు 450 మంది మహిళలు హైకోర్టులో మంగళవారం వేర్వేరుగా రెండు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేయతలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం వల్ల తమలాంటి లక్షల మంది నిరుపేదలు లబ్ధి పొందుతారని వారు పిటిషన్లలో పేర్కొన్నారు. తమకెవ్వరికీ శాశ్వత నివాసాలు లేవని వివరించారు. చట్ట నిబంధనలను అనుసరించే జీవో సీఆర్డీఏ చట్ట నిబంధనలను అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాల పట్టాల మంజూరు నిమిత్తం గత నెల 25న జీవో 107 జారీ చేసిందని మహిళలు కోర్టు దృష్టికి తెచ్చారు. నిడమర్రు గ్రామంలో 250.48 ఎకరాల్లో ఇంటి స్థలాల పట్టాల మంజూరు కోసం 10,247 మంది అర్హులైన లబ్ధిదారులతో అధికారులు ఓ జాబితా కూడా సిద్ధం చేశారని పేర్కొన్నారు. అలాగే తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో 11,300 మంది అర్హుల జాబితాను సిద్ధం చేశారన్నారు. వీరికి నవులూరులో 215 ఎకరాల్లో, కృష్ణాయపాలెంలో 37 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారని తెలిపారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం.. రాజధాని ప్రాంతం మొత్తం ఏరియాలో 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వారు వివరించారు. అది కూడా రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా కేటాయించవచ్చునని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల తమ వాదనలు కూడా విని.. ఆ తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో తమకు తీరని నష్టం జరుగుతుందన్నారు. -
అక్రమాలపై విచారణకే ‘సిట్’
విజయనగరం గంటస్తంభం: రాజధాని అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, దానిపై విచారణ జరిపేందుకే ‘సిట్’ను నియమించినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 24వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో అధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో అక్రమాలు, దోపిడీ జరగలేదని, దమ్ముంటే విచారణ చేయాలని గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారని గుర్తుచేశారు. విచారణ చేసేందుకు ‘సిట్’ వేస్తే ఇప్పుడు కక్షపూరితం అంటున్నారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి కోసం రూ.17,800 కోట్లుతో టెండర్ వేసి, అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్కీవ్స్ ఫీజ్ కింద రూ.842 కోట్ల చెల్లింపులు చేసేందుకు ఒప్పందం చేసుకుని, రూ.300 కోట్లకుపైగా చెల్లించారన్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామన్నారు. వాస్తవాలను నిర్ధారించేందుకు ‘సిట్’ వేసినట్టు వెల్లడించారు. కులాలు, పార్టీల వారీగా చట్టాలు తెచ్చుకోవాలా? ఈఎస్ఐ కుంభకోణంలో బీసీ మంత్రిని కావున టార్గెట్ చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వాఖ్యలను మంత్రి బొత్స తప్పుబట్టారు. గతంలో అసెంబ్లీలో టీడీపీ నాయకులు తనను ఉద్దేశించి ఎన్నో మాటలన్నారని, అప్పుడు నేను బీసీ మంత్రిని కాదా? అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నవారే బీసీలా? అని నిలదీశారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. కులాలు, పార్టీల వారీగా చట్టాలు తెచ్చుకోవాలా? అని వ్యాఖ్యానించారు. అక్రమాలు గురించి మాట్లాడితే ప్రధానమంత్రి పేరు చెబుతున్నారని, అక్రమాలు చేయమని ఆయన చెప్పారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక విధానం చెబుతుందని, దోచేయాలని చెప్పదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణ వికసిస్తేనే అభివృద్ధి ఫలాలు
మూడు రాజధానులనే విత్తనాలు నాటితే పాలన వికేంద్రీకరణ మొక్కలు పుష్పించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తాయని చెబుతూ.. గులాబీ పువ్వులను ప్రజలకు అందజేశారు. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పుష్పాల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా వివిధ వర్గాల ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. – సాక్షి నెట్వర్క్ ప్రచార రథం ప్రారంభం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాలపై రాష్ట్రమంతటా చర్చ నడుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెకండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ నార్త్ అమెరికా (ఏపీ జీఎస్‌ఆర్‌ఎన్‌ఏ) ఆధ్వర్యంలో ‘వికేంద్రీకరణ జరగాలి.. రాష్ట్రమంతటా అభివృద్ధి జరగాలి’ అనే నినాదంతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన ప్రచార రథాన్ని రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు, నాలుగేళ్లలో దశాబ్దపు అభివృద్ధిని చూపాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రజలంతా నిండు మనసుతో స్వాగతిస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రూ.లక్షల కోట్ల అప్పులతో ఆర్థికంగా కుంగిన రాష్ట్రాన్ని మరింత కుంగదీసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ విభాగం, యువకులు, ఉత్సాహవంతులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ముందుకు కదలటం సంతోషదాయకమన్నారు. నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పండుకాయల రత్నాకర్ మాట్లాడుతూ.. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పాల్గొన్నారు. వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా గుంటూరులో విద్యార్థులు గులాబీ పువ్వులు పంపిణీ చేశారు. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను కూడా అందజేశారు. నరసరావుపేట మార్కెట్ సెంటర్లో మూడు రాజధానులకు మద్దతుగా సంతకాల సేకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. విశాఖపట్నంలో పలుచోట్ల విద్యార్థులు గులాబీ పువ్వులు, కరపత్రాలు పంపిణీ చేశారు. మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, ఆనందపురం, తగరపువలస, అచ్యుతాపురం మండలం మల్లవరంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. చోడవరం, రావికమతం మండలం కొత్తకోటలో వంటావార్పు నిర్వహించగా.. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరై సంఘీభావం తెలిపారు. విజయనగరంలో చేపట్టిన రిలే దీక్షలు 11వ రోజుకు చేరాయి. యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో వాహన చోదకులు, పాదచారులకు గులాబీ పువ్వులు, అవగాహన పత్రాలను పంపిణీ చేశారు. జిల్లాలోని నెల్లిమర్ల, సాలూరు, గజపతినగరం, పార్వతీపురంలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి ప్రజలకు గులాబీలు పంచిపెట్టారు. ఎమ్మెల్యేలు పి.రాజన్నదొర, బొత్స అప్పలనర్సయ్య, అలజంగి జోగారావు హాజరై సంఘీభావం ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో గులాబీ పూలు, కరపత్రాలు పంపిణీ చేసి వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హాజరై మద్దతు తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా భామిని, రాజాంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
మార్మోగిన మూడు రాజధానుల నినాదం
మూడు రాజధానుల నినాదం రాష్ట్రమంతటా మార్మోగింది. పాలన, అధికార వికేంద్రీకరణ ఉపయోగాలను చాటుతూ ప్రజా చైతన్య సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగాయి. పలుచోట్ల చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. మూడు రాజధానులకు మోకాలడ్డుతూ చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతంపై వివిధ వర్గాల ప్రజలు విరుచుకుపడ్డారు. – సాక్షి నెట్వర్క్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి పాలన, అధికార వికేంద్రీకరణతో సాధ్యమని ఎలుగెత్తుతూ కడపలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. వివిధ సంఘాల ప్రతినిధులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే రాజధాని అమరావతి అంటూ చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతంపై మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి, తణుకు, తాడేపల్లిగూడెంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు తప్పనిసరి అని ముక్తకంఠంతో నినదించారు. అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాచైతన్య సదస్సులో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అధికార, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి లెక్కల రాజశేఖర్‌రెడ్డి, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఓబుల్ రెడ్డి వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వికేంద్రీకరణ కోరుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి, సోంపేట, ఆముదాలవలసలో రిలే దీక్షలు కొనసాగాయి. వివిధ సంఘాల నేతలు కలెక్టర్ జె.నివాస్‌ను కలిసి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. -
మరో ఐదుగురిపై సీఐడీ కేసులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దల అండతో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ డొంక కదులుతోంది. ఇందుకు కారకులైన వారిపై సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంకు చెందిన దళిత మహిళ పి.బుజ్జి ఫిర్యాదుతో టీడీపీ మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు మరో నేత బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనితోపాటు కురగల్లు గ్రామానికి చెందిన పల్లెపోగు శివశంకర్ ఫిర్యాదుతో తాతా బసవశంకర్రావు, పాలడుగు నాగలక్ష్మిలపై కూడా కేసు నమోదు చేసింది. తాజాగా.. కృష్ణాజిల్లా విజయవాడ, యనమలకుదురు, పెనమలూరు, పోరంకి ప్రాంతాలకు చెందిన వారిపై సీఐడీ ఐదు కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా పెనమలూరు తహసీల్దార్ జి. భద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యనమలకుదురుకు చెందిన పొల్లినేని కొండలరావుపై కేసు నమోదు చేసింది. తప్పుడు ధృవపత్రాలు చూపించి తెల్లకార్డు పొందిన కొండలరావు రాజధాని ప్రాంతంలోని నేలపాడులో ఎకరా 8 సెంట్లు భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇతనిపై ఐపీసీ సెక్షన్–177, 403, 420, 468, 471, 120(బి) కింద కేసు నమోదు చేసిన అధికారులు అతని తెల్లకార్డు రద్దుకు సిఫారసు చేశారు. అలాగే, పెనమలూరుకు చెందిన మండవ నాగమణి వెంకటపాలెంలో 95 సెంట్లు.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బొల్లినేని నాగలక్ష్మి.. ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి అయిన భూక్యా నాగలక్ష్మి.. పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన అబ్దుల్ జమేదార్ తప్పుడు పత్రాల ద్వారా తెల్లకార్డులు పొంది తద్వారా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినందుకు కేసు నమోదు చేశారు. అసైన్డ్ భూములు కొన్న 106 మంది జాబితా ఐటీ శాఖకు.. కాగా, అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన 106 మంది జాబితాను ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు సీఐడీ మరోసారి పంపించింది. ఈ మేరకు వారికి సంబంధించిన చిరునామా, తెల్లకార్డు నంబర్, కొనుగోలు చేసిన భూమి విస్తీర్ణం, దాని విలువ తదితర వివరాలతో ఐటీ శాఖ కమిషనర్‌కు ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ లేఖ రాశారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారు, రూ.2 లక్షలకు పైగా మొత్తాలను నగదు రూపంలో చెల్లించిన వారి వివరాలను అందజేశారు. వీరిపై ఐటీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంత భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే అనేక అక్రమాలు వెలుగుచూశాయని.. నిబంధనలకు విరుద్ధంగా భూములు కొనుగోలు చేసిన వారిలో తెల్లకార్డుదారులు కూడా ఉన్నారని సీఐడీ ఆ లేఖలో వివరించింది. మరోవైపు.. ఉద్యోగాలు చేస్తున్న వారు, భూములు కలిగిన వారు, విలువైన ఆస్తులు కలిగిన వారు నిబంధనలకు విరుద్ధంగా పొందిన తెల్లకార్డులను రద్దుచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను కూడా సీఐడీ అధికారులు కోరారు. -
వెనకుండి నడిపిందెవరు?
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని పేరుతో అమరావతిలో టీడీపీ నేతలు సాగించిన ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)– 2002, ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఎఫ్ఇఎంఎ–ఫెమ) –1999 ప్రకారం కేసులు నమోదు చేసిన ఈడీ కీలక ఆధారాలపై దృష్టి సారించింది. రాజధాని భూ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర.. వెనకుండి నడిపిందెవరనే విషయాలతో పాటు పలు కోణాల్లో ఆరా తీస్తోంది. చంద్రబాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ముఖ్య నేతలు సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాలు కారు చౌకగా కొనుగోలు చేసి భూ కుంభకోణానికి పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం ఈ కేసును ఏపీ సీఐడీకి అప్పగించడం.. ఈ కుంభకోణం నిజమేనని సీఐడీ నిర్ధారించడం.. కేసులు నమోదు చేసింది. ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉండటంతో ఈడీ, ఆదాయ పన్ను శాఖ(ఐటీ)లకు ఏపీ సీఐడీ నివేదించిన సంగతి విదితమే. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఈడీ కేసు బదిలీ రాజధాని అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ ఈడీ.. ఏపీ సీఐడీని కోరింది. ఈ బాగోతంపై ఇప్పటికే సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ సదరన్ రీజియన్ స్పెషల్ డైరెక్టర్ డి.సుశీల్‌కుమార్‌కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. దీంతో ఈ కేసును హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయానికి బదిలీ చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఈడీ జేడీ (హైదరాబాద్) అభిషేక్ గోయల్ సీఐడీ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలను పరిశీలించారు. మరిన్ని కీలక ఆధారాల కోసం సీఐడీని సంప్రదించగా, మంగళవారం మెయిల్ చేశారు. కీలక ఆధారాల కోసం ఈడీ ఆరా.. ఈడీ జేడీ అభిషేక్ గోయల్.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి అన్ని పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాజధాని భూముల కొనుగోళ్లు, వాటిలో అక్రమాలు, పెద్ద ఎత్తున డబ్బు మారకం, తెల్లకార్డుదారులు కోట్లు పెట్టి భూముల కొనుగోలు వెనుక ఉన్న వారెవరు?.. నల్ల డబ్బు చేతులు మారిందా, విదేశాల నుంచి హవాలా మార్గాల్లో డబ్బు వచ్చిందా.. రూ.10 కోట్లకు మించి భూములు కొనుగోలు చేసిన వారి వివరాలేమిటి లాంటి తదితర వివరాలు కోరినట్టు తెలిసింది. బెదిరింపులకు పాల్పడి భూములు తక్కువ ధరకు కొట్టేయడం, మోసం చేసి భూములు రాయించుకోవడం, చంపుతామనే బెదిరింపులు, కిడ్నాపులు, ప్రలోభాలు తదితర కీలక సమాచారంపై ఆరా తీసినట్లు సమాచారం. రాజధాని అమరావతిలో చోటు చేసుకున్న అక్రమాలపై 2015 నుంచి 2019 వరకు ఏమైనా కేసులు నమోదు అయ్యాయా? వాటికి సంబంధించిన వివరాలను ఈడీ కోరినట్టు తెలిసింది. ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్‌లో ప్రత్యక్ష పాత్ర.. వెనకుండి నడిపిందెవరు.. అనే వివరాలపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. వీటన్నింటిపై సీఐడీ వెంటనే వివరాలు అందించినట్టు విశ్వసనీయ సమాచారం. -
అమరావతిలో మనీల్యాండరింగ్ బాగోతం..
-
‘ఇన్సైడర్’పై ఈడీ కేసు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. రాజధాని పేరుతో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈడీ సోమవారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసు నమోదు చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ ఇచ్చిన ఆధారాల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో రాజధాని ఏర్పాటుపై పథకం ప్రకారం ముందే లీకులు ఇచ్చి అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేలా దోహదపడ్డారనే అభియోగాలున్నాయి. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని నిర్ధారించింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎన్ఆర్ఐ వేమూరి రవికుమార్ ప్రసాద్, పరిటాల సునీత, జీవీ ఆంజనేయులు, లింగమనేని రమేష్, పయ్యావుల కేశవ్, పుట్టా మహేష్ యాదవ్, దూళిపాళ నరేంద్ర, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు తదితర టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిందే. అంతటితో ఆగకుండా టీడీపీ నేతల బంధుమిత్రులకు చెందిన భూములు ఉన్న ప్రాంతాన్ని సీఆర్డీఏ పరిధిలోకి తేవడం, అవసరమైన చోట వారి భూములకు మినహాయింపు ఇవ్వడం, రాజధాని ప్రాంతంలో నిర్మాణాల విషయమై పథకం ప్రకారం వారికి ఉప్పందించి లాభపడేలా చేయడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. తెల్లకార్డుదారులు 761.34 ఎకరాల భూమి కొనుగోలు మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా తీగలాగిన రాష్ట్ర నేర పరిశోధన శాఖ (సీఐడీ) గత ప్రభుత్వ పాలనలో జరిగిన భూ కుంభకోణాలను నిగ్గు తేల్చింది. అమరావతిలో నాలుగు వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించింది. అమరావతి రాజధాని కోర్ ఏరియాలో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. పచ్చ నేతలకు బినామీలుగా తెల్లకార్డుదారుల పేర భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడ్డాయి. టీడీపీ మాజీ మంత్రులపై కేసు నమోదు ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. టీడీపీ మాజీ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావులతోపాటు టీడీపీ నాయకుడు బెల్లంకొండ నరసింహారావుపై సెక్షన్ 420, 506 రెడ్‌విత్ 120(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 3(1)(జి)(పి) కేసు నమోదు చేసిన సీఐడీ.. పలు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. అమరావతి ,పెద్దకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో తెల్లకార్డు దారులను బినామీలుగా అడ్డుపెట్టుకుని 720 ఎకరాలను కొనుగోలు చేసినట్టు నిర్ధారించింది. ఈ కేసును సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలతో సహా ఈడీకీ లేఖ రాసిన సీఐడీ రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మనీ ల్యాండరింగ్ జరిగిందని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చెన్నై రీజినల్ కార్యాలయానికి సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ గత నెలలో లేఖ రాశారు. ఈ మేరకు ఎన్పోర్సుమెంట్ సదరన్ రీజియన్ స్పెషల్ డైరెక్టర్‌కు రాజధాని ప్రాంతంలో తెల్లకార్డుదారుల పేరుతో కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు, తెల్లరేషన్ కార్డు హోల్డర్ల వివరాలను పంపించారు. 2015 అక్టోబర్‌లో వెంకటపాలెంకు చెందిన పి.బుజ్జి భూమిని అప్పటి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ దన్నుతో వారి బినామీలు మోసం చేసి, బెదిరించి, బలవంతంగా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆ లేఖలో సునీల్‌కుమార్ పేర్కొన్నారు. రాజధాని భూముల కొనుగోల్‌మాల్‌లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరడంతో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. ఐటీ ‘తెల్ల’బోయేలా.. తెల్లకార్డు కలిగిన పేద వర్గాలు కోట్లు పెట్టి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో సీఐడీ అందించిన వివరాలను పరిశీలిస్తే ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సైతం తెల్లబోయేలా చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ (ఆంధ్రప్రదేశ్ – విజయవాడ)కు గత నెల 22న సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ ఆధారాలతో సహా లేఖ రాశారు. 2014 – 2015లో పేద వర్గాల వారు భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని, తెల్లకార్డు కలిగిన వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది దర్యాప్తు చేస్తే వారి వెనుక టీడీపీ నేతల పెట్టుబడి బయటకు వస్తుందని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ రాసిన లేఖలో పేర్కొన్నారు. వీరిలో కొంత మంది పాన్‌కార్డు సమర్పించారని, అత్యధిక శాతం వారికి పాన్‌కార్డులు లేవని, వారి పేర్లు, తెల్లకార్డు నంబర్లు, కొనుగోలు చేసిన భూముల దస్తావేజులు, వాటి మార్కెట్ విలువ తదితర వివరాలను ఐటీ శాఖకు ఆయన అందజేశారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని కోణాల్లో దర్యాప్తు రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు రాజధాని భూముల కొనుగోలులో జరిగిన మనీ ల్యాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తుంది. తెల్లకార్డు కలిగిన పేదలు అంత పెద్ద మొత్తాలు పెట్టి భూములు ఎలా కొనుగోలు చేశారనే దానిపై ఐటీ శాఖ దర్యాప్తు చేయాల్సి ఉంది. రాజధానిలో జరిగిన అక్రమాలపై సంబంధిత అన్ని శాఖలు దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. – సునీల్‌కుమార్, సీఐడీ ఏడీజీ నిరుపేదలు భూములు కొన్నారట! దేవతల రాజు ఇంద్రుని రాజధాని అమరావతిని తలదన్నేలా ఆంధ్రులకు కొత్త రాజధాని నిర్మించడం మాటేమోగానీ.. కటిక నిరుపేదలను బినామీలుగా చేసుకుని వేలాది కోట్ల రూపాయల భూములను కాజేయడంలో చంద్రబాబు బృందం సఫలీకృతమైంది. ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిపై అధికారిక ప్రకటన చేయక ముందే లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తక్కువ ధరలకే భారీగా భూములు కొల్లగొట్టి అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడింది. ఏడాదికి రూ.60 వేలలోపు ఆదాయం ఉండే వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిగా గుర్తిస్తారు. ఇలాంటి వారికి తెల్లరేషన్‌కార్డును సర్కార్ జారీ చేస్తుంది. ఇలాంటి నిరుపేదలకు ప్రభుత్వం ప్రకటన చేయక ముందే.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది తెలిసే అవకాశమే లేదు. కానీ, ఇలాంటి వారు 797 మంది రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయక ముందే.. అంటే 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 30 వరకు 761.34 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో ఏ ఒక్కరూ ఆదాయపు పన్ను చెల్లించ లేదు. ఈ దృష్ట్యా వీరంతా గత ప్రభుత్వ పెద్దల బినామీలని స్పష్టమవుతోంది. చంద్రబాబు బృందం తమ కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థలు, సమీప బంధువుల పేర్లతో తక్కువ ధరకే వేలాది ఎకరాలను కాజేసింది చాలక.. తమ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే వారు, అనుచరులను ముందు పెట్టి భూములను కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. - తెల్లరేషన్‌కార్డు పొందడానికి ఏడాదిలో గరిష్ట ఆదాయం రూ.60,000 - ఏడాదిలో గరిష్టంగా ఆదా చేసే మొత్తం రూ.5,000 - 20 ఏళ్లున్న వ్యక్తి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆదా చేసే మొత్తం రూ.2.25 లక్షలు - 797 మంది తెల్లరేషన్‌కార్డుదారులు కొన్న భూమి(ఎకరాల్లో) 761.34 - పాన్‌కార్డు కలిగిన వారు 268 - పాన్‌కార్డులు లేని వారు 529 - రిజిస్ట్రేషన్ (ప్రభుత్వం నిర్ణయించిన) ధర ప్రకారం ఆ భూమి విలువ (రూ.కోట్లలో): 38.56 - బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఆ భూమి విలువ (రూ.కోట్లలో) రూ.220 ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలా.. - 2014 మే 16న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. సింగపూర్‌ను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ అదే రోజు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే ఓత్ ఆఫ్ సీక్రసీని తుంగలో తొక్కుతూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తామని కీలకమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. తన సామాజిక వర్గానికి చెందిన వారికి చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇస్తూ.. రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఇలా తెర తీశారు. - 2014 జూన్ 9న కృష్ణా జిల్లా నూజివీడు పరిసర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామని తమ అనుకూల ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయించారు. - 2014 జూన్ 12న కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, బాపులపాడు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు మంత్రుల ద్వారా ప్రకటింపజేశారు. - 2014 జూలై 5న కృష్ణా జిల్లా ముసునూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ ఇంకొందరు మంత్రులతో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయించారు. - 2014 ఆగస్టు 5న కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాలు రాజధాని ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమంటూ మరికొందరు మంత్రులు చెప్పుకొచ్చారు. - చంద్రబాబునాయుడు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు 2014 ఆగస్టు 9న వేర్వేరు సమావేశాల్లో మాట్లాడుతూ గుంటూరు – విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. - 2014 సెప్టెంబరు 4న విజయవాడ – గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. - తీరా 2014 డిసెంబర్ 30న తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు 2015 జనవరి 1న ఈ మండలాల్లో 29 గ్రామాల్లో అవసరమైన భూమిని సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. పక్కా ప్లాన్‌తో భూ దందా టీడీపీ పెద్దలు, నేతలు.. లంకలు, పోరంబోకు, ప్రభుత్వ భూములను కాజేసి ఆ భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. ప్రభుత్వ పెద్దలకు మంచి రేటు వచ్చే ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించి, రైతులను వెనక్కు నెట్టేసి తీవ్ర నష్టం చేశారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారు. చంద్రబాబు నాయుడు కుటుంబీకులు తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.22 ఎకరాల భూమిని హెరిటేజ్ ఫుడ్స్ కోసం కొనుగోలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ కొనుగోలు జరగడం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు అద్దం పట్టింది. జోన్ల అలైన్‌మెంట్లలోనూ మాయ రాజధానిలో జరిగిన భూ కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూములేవీ ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి ఉద్దేశపూర్వకంగా సరిహద్దులను మార్చారు. 2015 జూన్‌లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన సుర్బానాజురాంగ్‌కు డ్రాఫ్ట్ ప్లాన్ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టింది. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్‌కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం వెల్లడవుతోంది. - మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్‌ను సీఆర్డీయే జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. - నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు చందర్లపేటలో కేటాయించిన 498.3 ఎకరాల విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు. - రాజధాని నగరం చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలో కూడా అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్ రింగ్‌రోడ్డుకు పక్కనే ఉన్నాయి. మురళీ మోహన్ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగు రోడ్డు వచ్చేలా చేశారు. అసైన్డ్ చట్టానికి తూట్లు.. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన వారికి 900 ప్లాట్లు కేటాయించారు. తద్వారా పీఓటీ చట్టాన్ని తుంగలో తొక్కారు. రాజధానికి భూములు తీసేసుకుంటారని ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి.. టీడీపీ నేతలు కారుచౌకగా వారి భూములను కొన్నారు. మంగళగిరి సబ్ రిజిస్టార్ వాటిని రిజిస్టర్ చేయకుండా పక్కన పెడితే.. జీఓ ఎంఎస్ నెంబర్ 258, 580, 575 జారీ చేసి, భూములు కొనుగోలు చేసిన వారిని శివాయి జమేదార్లుగా పరిగణించి వారి నుంచి ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకున్నారు. లేని లంక భూములు కూడా ఉన్నట్లు సృష్టించి ప్లాట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల నుంచి కొల్లి శివరాం 47.39 ఎకరాల అసైన్డ్ భూమి కొన్నారు. ఇతను లోకేశ్‌కు బినామీ అని బయట ఎవరిని అడిగినా చెబుతారు. గుమ్మడి సురేష్ 42.92 ఎకరాలు, బరసు శ్రీనివాసరావు (నారా లోకేష్ మనుషులు) 14.07 ఎకరాల అసైన్డ్ భూమి తక్కువ ధరకు కొన్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. లింగమనేనికి భారీగా లబ్ధి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్ అకడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్‌సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి రాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. -
రాజధాని భూ దందాపై రంగంలోకి ఈడీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం పాల్పడిన ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కుంభకోణంపై దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. 797 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లతో పలువురు టీడీపీ నేతలు 761.34 ఎకరాల భూములను కొనుగోలు చేయడంపై ఏపీ సీఐడీ అధికారులతో ఈడీ అధికారులు శుక్రవారం చర్చించారు. సీఐడీ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై నివేదికతోపాటు బినామీల వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తొలుత తెల్ల రేషన్‌కార్డుదారులకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అనంతరం బడా బాబులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మాజీ మంత్రులపై ఇప్పటికే కేసులు రాజధానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే అంటే 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య చంద్రబాబు బృందం ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఏడాదికి రూ.60 వేలలోపు ఆదాయం మాత్రమే ఉండే తెల్లరేషన్ కార్డుదారులు కోట్లాది రూపాయల విలువైన భూములు కొనుగోలు చేయడంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేసింది. వీరి వెనుక చంద్రబాబు బృందం ఉన్నట్లు ఆధారాలను సేకరించింది. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా బినామీ పేర్లతో భూములు కొన్న మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, చంద్రబాబుకు సన్నిహితుడైన బెల్లకొండ నరసింహారావుపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120 బీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు సమాంతరంగా విచారణ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. విచారణకు రెండు బృందాలు! తొలిదశలో తెల్లరేషన్ కార్డుదారుల పేర్లతో కొనుగోలు చేసిన భూములపై విచారణ చేపట్టి మలిదశలో సీఐడీ దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆదారంగా రాజధాని ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై లోతుగా విచారణ చేసేందుకు ఈడీ సిద్ధమైంది. దీనిపై విచారణకు హైదరాబాద్, చెన్నై కార్యాలయాల్లో పనిచేసే అధికారులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూముల కొనుగోళ్లపై సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివరాలను సేకరించనుంది. ఆదాయపు పన్ను చెల్లించకుండా భూములు కొన్నవారిపై మనీల్యాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసి విచారించాలని నిర్ణయించింది. ఈడీకి వివరాలు ఇచ్చాం ఈడీ అధికారుల సూచన మేరకు అమరావతిలో 761.34 ఎకరాల భూములు కొన్న 797 మంది తెల్లరేషన్‌కార్డుదారుల వివరాలు అందచేశాం. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఈడీకి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తాం. – సునీల్‌కుమార్, సీఐడీ అదనపు డీజీ -
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
సాక్షి, అమరావతి బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. వేకువజామున 2.37 నుంచి 2.50 గంటల మధ్య కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడి లేచి బయటకు పరుగులు తీశారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో, తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో మంచాలు అటూ ఇటూ ఊగాయి. ఎత్తులో ఉన్న సామాన్లు, వస్తువులు కింద పడ్డాయి. దీనికి తోడు పెద్దగా శబ్దాలు కూడా రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపంగా భావించి ఇళ్లల్లోంచి పిల్లా, పాపలతో రోడ్లపైకి పరుగెత్తారు. భూకంపం సంభవిస్తుందన్న భయంతో పలువురు ఉదయం వరకు మళ్లీ ఇళ్లల్లోకి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భూప్రకంపనలు కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతోపాటు విజయవాడ నగరంలోని భవానీపురం, విద్యాధరపురం, గుంటూరు జిల్లా మాచవరం, బెల్లంకొండ, పిడుగురాళ్ల, అచ్చంపేట, తాడికొండ, క్రోసూరు, నాదెండ్ల, సత్తెనపల్లి తదితర మండలాల్లో అలజడి రేపాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వెలటూరులో ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైనట్టు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) గుర్తించింది. కాగా శనివారం టర్కీలో భారీ భూకంపం సంభవించిన కొన్ని గంటలకే తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా ఉండొచ్చని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ టర్కీ మన దేశానికి చాలా దూరంలో ఉండడం వల్ల దాని ప్రభావం కాదని నిపుణులు స్పష్టం చేశారు. నెల రోజుల్లో 300 సార్లు.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో గత నెల రోజులుగా భూమి కంపిస్తోంది. ఒక్కోరోజు పదుల సంఖ్యలో ప్రకంపనాలు వస్తుండటం, ప్రజల భయాందోళనలతో ఈ నెల 12న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చింతలపాలెం మండలంలోని దొండపాడుతోపాటు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి వద్ద సిస్మోగ్రాఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి ఇప్పటివరకు 300 సార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. అయితే.. తీవ్రత 2.5 దాటలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సంభవించిన భూప్రకంపనల తీవ్రత హైదరాబాద్ నగరాన్నీ తాకింది. అయితే దీని తీవ్రత నగరంలో తక్కువగానే ఉంది. బోయిన్పల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో కొందరి ఇళ్లల్లో వస్తువులు కిందపడిపోయాయి. -
అమరావతి రైతులకు వరాలు
సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. అన్నదాతల సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ(ఏఎంఆర్డీఏ) బిల్లును సభ ముందుంచారు. అమరావతి ప్రాంత ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలన్నీ స్పష్టం చేశారు. అసైన్డ్ రైతులకూ ప్లాట్లు అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పరిహార భృతిని(పెన్షన్) రూ.2,500 నుంచి ఏకంగా రూ.5 వేలకు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని కూలీలకు లబ్ధి చేకూరనుంది. ఈ పెన్షన్ పెంపువల్ల ప్రభుత్వ ఖజానాపై అదనంగా నెలకు రూ.5.2 కోట్లు, ఏడాదికి రూ.60.30 కోట్ల భారం పడనుంది. 29 గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నారు. జరీబు భూమి ఏకరానికి రూ.50 వేలు, మెట్ట భూమి ఎకరానికి రూ.30 వేల చొప్పున కౌలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతిఏటా జరీబు భూములకు రూ.5 వేలు, మెట్ట భూములకు రూ.3 వేల చొప్పున కౌలు పెంచనున్నారు. ఈ కౌలు వ్యవధిని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల తరువాత జరీబు భూమికి ఎకరాకు రూ.లక్ష, మెట్ట భూమికి ఎకరాకు రూ.60 వేల చొప్పున ఇవ్వనున్నారు. 29 గ్రామాల్లో 28,586 మంది రైతులు 34,385.275 ఎకరాల భూమిని ఇచ్చారు. వీరంతా పదేళ్ల తర్వాత కూడా లబ్ధి పొందనున్నారు. పట్టా భూములు ఇచ్చిన రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి కూడా ప్రభుత్వం ప్లాట్లు కేటాయించనుంది. ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటాం ‘‘గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములకు తక్కువ ప్యాకేజీ, పట్టా భూములకు ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి దళిత రైతుల పట్ల వివక్ష చూపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతి అసైన్డ్ రైతులకు కూడా పట్టా భూముల రైతులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయం. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం’’ – సలివేంద్రం జార్జి, అసైన్డ్ రైతు, వెలగపూడి రైతు కూలీల జీవితాల్లో వెలుగులు ‘‘అమరావతిని రాజధానిగా ప్రకటించాక ఇక్కడ పొలాలు లేకపోవడంతో మాకు పనులు దొరకలేదు. భూములు లేని నిరుపేద రైతు కూలీలకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2500 చొప్పున మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ భృతిని రూ.5 వేలకు పెంచడం సంతోషంగా ఉంది. రైతు కూలీల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపుతున్నారు’’ – రాయపూడి చెంచు, నిరుపేద రైతు కూలీ, వెలగపూడి -
తెల్లబోయే దోపిడీ
సాక్షి, అమరావతి: రాజధానిగా అమరావతిని ప్రకటించటానికి ముందే టీడీపీ నేతలు 797 మంది తెల్లరేషన్‌కార్డుదారుల ద్వారా భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో గుర్తించింది. పొట్ట గడవటమే కష్టమైన కొందరు నిరుపేదలు రూ.కోట్లు వెచ్చించి ఖరీదైన భూములను కొనుగోలు చేయడం విస్తుగొల్పుతోంది. వీరి వెనుక టీడీపీ పెద్దల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడవుతోంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు ఈ భూ దందాలు జరిగాయి. సీఐడీ అధికారులు వారి ఆధార్ నంబర్లను ఆదాయపు పన్ను శాఖకు అందచేసి పాన్‌కార్డులు, ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలపై ఆరా తీస్తున్నారు. ఐటీ శాఖ ఇప్పటిదాకా వీరిలో 477 మంది వివరాలను పరిశీలించగా 157 మంది పాన్ కార్డులు కలిగి ఉన్నట్లు సీఐడీకి నివేదిక ఇచ్చింది. అయితే వీరిలో ఒక్కరూ ఆదాయపు పన్ను చెల్లించలేదని వెల్లడైంది. మిగతా 320 మంది వివరాలను ఆదాయపు పన్ను శాఖ విశ్లేషిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థలు, సమీప బంధువుల పేర్లతో అమరావతిలో తక్కువ ధరకే వేలాది ఎకరాలను కాజేసింది చాలక తమ డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసేవారు, అనుచరులను ముందు పెట్టిన చంద్రబాబు బృందం భారీగా భూములను కొనుగోలు చేసినట్లు సీఐడీ తేల్చింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎన్నో సాక్ష్యాలు.. - గుంటూరు జిల్లా పొన్నూరులోని చింతలపూడి ఇంటి నెంబర్ 4–83లో నివాసం ఉండే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కుమార్తె ధూళిపాళ్ల వీరవైష్ణవి (ఆధార్ నెంబర్ 465580884906) వయసు 26 ఏళ్లు. మాజీ ఎమ్మెల్యే కుమార్తె అయినా ఆమె తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 074800500478) లబ్ధిదారురాలే. వీరవైష్ణవి తుళ్లూరు మండలం ఐనవోలు సర్వే నెంబర్ 69/2లో మూడు ఎకరాల భూమిని 2014 అక్టోబర్ 13న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.2 కోట్లు పలుకుతోంది. వీర వైష్ణవి తెల్లకార్డు కలిగి ఉండటం ఓ విశేషం కాగా సుమారు రూ.6 కోట్లు వెచ్చించి మూడు ఎకరాలు కొనుగోలు చేయడం మరో విశేషం. అంటే ఆ ముసుగులో దాగిన పచ్చగద్ద ధూళిపాళ్ల నరేంద్రకుమారే అన్నది స్పష్టమవుతోంది. నరేంద్ర మాజీ ఎమ్మెల్యే అయి ఉండీ కుమార్తెకు తెల్లరేషన్‌కార్డు మంజూరు చేయించుకోవడంపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. - గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఇంటి నెంబర్ 3–108లో నివసించే పిన్నిబోయిన రామారావు (ఆధార్ నెంబర్ 206532486739) వయసు 81 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 071204102522) లబ్ధిదారుడైన ఆయన 20 ఏళ్ల వయసు నుంచి ఏటా రూ.ఐదు వేల చొప్పున ఆదా చేసినా 2014 జూన్ నాటికి రూ.3.05 లక్షలకు మించదు. పోనీ ఏడాదికి రూ.పదివేల చొప్పున ఆదా చేసినా రూ.6.10 లక్షలకు మించదు. పిన్నబోయిన రామారావు 2014 జూన్ 6న తుళ్లూరు మండలం ఐనవోలు సర్వే నెంబర్ 26లో ఎకరం రూ.7.68 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున మూడు ఎకరాలను రూ.23.04 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ అక్కడ మార్కెట్ రేటు ఎకరం రూ.1.50 కోట్లు పలుకుతోంది. అంటే రూ.4.50 కోట్లు వెచ్చించి ఆ భూమిని కొన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం తీసుకున్నా ఆయన ఏడాదికి రూ.పది వేల చొప్పున గరిష్టంగా ఆదా చేయగలిగే రూ. 6.10 లక్షలు ఎక్కడ? భూమి కొనుగోలు చేయడానికి వెచ్చించిన రూ.23.04 లక్షలు ఎక్కడ? ఈ నిరుపేద ఏ బడా‘బాబు’ బినామీనో తేల్చేపనిలో సీఐడీ నిమగ్నమైంది. - గుంటూరు జిల్లా మంగళగిరి చెరువుకట్ట సమీపంలో ఇంటి నెంబర్ 7–9లో నివాసం ఉండే పెనుమళ్లి శ్రీనివాసరావు (ఆధార్ నెంబర్ 459984228049) వయసు 52 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 0712049ఏ0213) లబ్ధిదారుడైన ఆయన తుళ్లూరు మండలం పెదపరిమిలో సర్వే నెంబరు 202/2ఏ1లో ఎకరం రూ.11.34 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.45.36 లక్షలు వెచ్చించి నాలుగు ఎకరాలను 2014 జూన్ 6న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.1.50 కోట్లకుపైగా ఉంది. అంటే రూ.ఆరు కోట్లు వెచ్చించి ఆ భూమిని కొన్నట్లు స్పష్టమవుతోంది. అప్పటివరకు గరిష్టంగా రూ.3.20 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడైన శ్రీనివాసరావుకు అంత డబ్బు వెచ్చించి భూమి కొనే శక్తి ఉంటుందా? ఉండనే ఉండదు. శ్రీనివాసరావు వెనుక దాగిన పచ్చగద్దను గుర్తించే దిశగా సీఐడీ అడుగులు వేస్తోంది. - విజయవాడలోని ఫన్‌టైమ్ క్లబ్ రోడ్డులో ఇంటి నెంబర్ 59ఏ–8–6లో నివాసం ఉండే అన్నే వీరభోగవసంతరావు (ఆధార్ నెంబర్ 998504554110) వయసు 58 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 068427000095) లబ్ధిదారుడైన ఆయన తాడేపల్లి మండలం ఇప్పటంలో సర్వే నెంబర్ 163/బీలో ఎకరం రూ.55.70 లక్షల చొప్పున ఆరు ఎకరాలకు రూ.3.35 కోట్లు వెచ్చించి 2014 అక్టోబర్ 18న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం అక్కడ ఎకరం విలువ రూ.పది కోట్లు ఉంది. అప్పటివరకు గరిష్టంగా రూ.3.80 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడు వీరభోగవసంతరావు రూ.కోట్లు వెచ్చించి భూమిని కొనగలడా? ఈ మాయను చేధించేందుకు సీఐడీ సిద్ధమైంది. - విజయవాడ రామచంద్రరావు వీధిలో ఇంటి నెంబర్ 57–12–10లో నివాసం ఉండే జువ్వా అంజలీదేవి (ఆధార్ నెంబర్ 859261831867) వయసు 60 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ061605610058) లబ్ధిదారైన అంజలీదేవి తుళ్లూరు మండలం నేలపాడు సర్వే నెంబర్ 5/2లో ఎకరం రూ.10.50 లక్షల చొప్పున నాలుగు ఎకరాలను రూ.42 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. మార్కెట్ ధర అక్కడ ఎకరం రూ.రెండు కోట్లు ఉంది. అప్పటివరకు గరిష్టంగా రూ.నాలుగు లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారైన అంజలీదేవి రూ.కోట్లు కుమ్మరించి భూములు కొనగలరా? ఆమె వెనుక ఉన్న పచ్చగద్ద ఎవరన్నది సీఐడీ అన్వేషిస్తోంది. - గుంటూరు కొరిటెపాడులో ఇంటి నెంబర్ 67–4–177లో నివసించే గొల్లపూడి శారద (ఆధార్ నెంబర్ 674763182727) వయసు 55 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్లూఏపీ0731022ఏ0458) కలిగిన శారద అమరావతి మండలం నరుకుళ్లపాడు సర్వే నెంబరు 114/బీ, 114/ఏ, 113/బీ, 113/ఏలో ఎకరం రూ.7.53 లక్షల చొప్పున (ప్రభుత్వం నిర్ణయించిన ధర) మూడు ఎకరాలను రూ.22.59 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి 2014 ఆగస్టు 12న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ విలువ ఎకరం రూ.2.50 కోట్లు ఉంది. అంటే ఆ భూమిని రూ.7.50 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అప్పటివరకు ఆమె ఆమె గరిష్టంగా ఆదా చేయగలిగే మొత్తం రూ.3.50 లక్షలకు మించదు. అలాంటప్పుడు ఆ భూమిని కొనగలిగే తాహతు ఆమెకు ఉంటుందా? - ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం సర్వారెడ్డిపాలెంలో నివాసం ఉండే కాకుమాని కోటేశ్వరరావు (ఆధార్ నెంబర్ 410227073379) వయసు 65 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 084408360243) లబ్ధిదారుడైన ఆయన తుళ్లూరు మండలం వెలగపూడి సర్వే నెంబర్ 181/బీలో ఎకరం రూ.16.76 లక్షల చొప్పున (ప్రభుత్వం నిర్ణయించిన ధర) నాలుగు ఎకరాలకు రూ.67.04 లక్షలు వెచ్చించి 2014 సెప్టెంబరు 16న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మార్కెట్ ధర అక్కడ ఎకరం రూ.ఏడు కోట్లు ఉంది. కానీ తెల్లకార్డుదారుడైన కోటేశ్వరావు అప్పటిదాకా గరిష్టంగా ఆదా చేయగలిగే మొత్తం రూ.4.50 లక్షలకు మించదు. మరి ఆయనకు అంత డబ్బు పోసి భూములు కొనడం ఎలా సాధ్యమైంది? కోటేశ్వరరావు వెనుక ఉన్న బడాబాబును బయటకు రప్పించే దిశగా సీఐడీ చర్యలు చేపట్టింది. - కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం ఇంటి నెంబరు 1–132లో నివాసం ఉండే ముక్కపాటి పట్టాభిరామారావు (ఆధార్‌కార్డు నెంబర్ 287486854021) వయసు 71 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు(డబ్ల్యూఏపీ 060607028ఏ0043) లబ్ధిదారుడైన ఆయన అమరావతి మండలం కర్లపూడి సర్వే నెంబర్ 23/2డీ, 23/2ఈ, 26/1, 27/2, 27/1లో ఎకరం రూ.12.04 లక్షలు (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.36.12 లక్షలు వెచ్చించి మూడు ఎకరాలను 2014 సెప్టెంబరు 20న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ రేటు ఎకరం రూ.1.50 కోట్లు ఉంది. ఈ లెక్కన ఆయన రూ.4.50 కోట్లు వెచ్చించి భూమిని కొన్నట్లే. తెల్లకార్డున్న పట్టాభిరామారావు అప్పటిదాకా ఆదా చేయగలిగే మొత్తం గరిష్టంగా రూ.5.10 లక్షలకు మించదు. - గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వైఎస్సార్ సెంటర్ ఇంటి నెంబర్ 1–37లో నివాసం ఉండే మేకా వెంకటరెడ్డి (ఆధార్ కార్డు నెంబర్ 934736078913) వయసు 67 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు(డబ్ల్యూఏపీ071100200217) లబ్ధిదారుడైన ఆయన పెదకాకాని మండలం అనుమర్లపూడి సర్వే నెంబర్ 15/3, 15/4, 15/6, 15/7, 15/8లో ఎకరం రూ.29.35 లక్షలు (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.1.47 కోట్లు వెచ్చించి ఐదు ఎకరాలను 2014 సెప్టెంబరు 29న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.రెండు కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన రూ.పది కోట్లు వెచ్చించి భూమిని కొన్నట్లే. అప్పటివరకు గరిష్టంగా రూ.4.70 లక్షలకు మించి ఆదా చేసే అవకాశం లేని తెల్లకార్డుదారుడైన వెంకటరెడ్డిని బినామీగా చేసుకున్న పచ్చగద్దను తేల్చేపనిలో సీఐడీ నిమగ్నమైంది. - గుంటూరు జిల్లా నాదెండ్లలో పటమటబజార్ ఇంటి నెంబర్ 6–70లో నివాసం ఉండే నెల్లూరి మంగమ్మ (ఆధార్ నెంబర్ 782400477863) వయసు 61 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ073801000059) లబ్ధిదారైన ఆమె తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నెంబర్ 357/బీ1ఏలో ఎకరం రూ.33.60 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.1.35 కోట్లు వెచ్చించి నాలుగు ఎకరాలను 2014 నవంబర్ 10న కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం అక్కడ ఎకరం రూ.ఏడు కోట్లు ఉంది. అప్పటిదాకా గరిష్టంగా రూ.4.10 లక్షలు మాత్రమే ఆదా చేసే అవకాశం ఉన్న మంగమ్మకు రూ.కోట్లు వెచ్చించే శక్తి ఎలా ఉంటుంది? - గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రామిరెడ్డిపేట ఇంటి నెంబర్ 11–12–12లో నివాసం ఉండే రావెల సత్యనారాయణ (ఆధార్ నెంబర్ 667104733878) వయసు 65 ఏళ్లు. తెల్లరేషన్‌కార్డు (డబ్ల్యూఏపీ 0784024ఏ0122) కలిగిన సత్యనారాయణ అమరావతి మండలం అమరావతిలో సర్వే నెంబర్ 185/బీ, 185/సీ, 185/డీలో ఎకరం రూ.11.90 లక్షల (ప్రభుత్వం నిర్ణయించిన ధర) చొప్పున రూ.35.7 లక్షలు వెచ్చించి మూడు ఎకరాలను 2014 డిసెంబర్ 31న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మార్కెట్ విలువ అక్కడ ఎకరం రూ.మూడు కోట్లు ఉంది. ఎంత కష్టపడ్డా అప్పటిదాకా రూ.4.50 లక్షలకు మించి ఆదా చేసే అవకాశాల్లేని రావెల సత్యనారాయణకు రూ.కోట్లు కుమ్మరించే శక్తి ఎలా వచ్చింది? భూములు కొన్న తెల్లకార్డుదారులకు నోటీసులు.. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన 797 మంది తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులకు సీఐడీ నోటీసులు జారీ చేస్తోంది. ‘మీ ఆదాయ వనరులు ఏమిటి? ఎంత ఆదా చేశారు? ఆదా చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లించారా? ఎలాంటి ఆదాయం లేకుండా రూ.కోట్లు వెచ్చించి భూములు ఎలా కొనుగోలు చేయగలిగారు? మీ పేర్లతో భూములు కొనుగోలు చేయడం వెనుక ఉన్నదెవరు?’ అనే అంశాలపై నిగ్గు తేల్చనుంది. పచ్చగద్దల పేర్లను వెల్లడించని వారిపై ఐపీసీ సెక్షన్ 420, 418, 406 కింద కేసులు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆదాయపు పన్ను శాఖను కోరనున్నట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. బడాబాబులను గుర్తించి ఐపీసీ 409, 420, 418, 406, 403 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతోపాటు ఆదాయపుపన్ను శాఖకు వివరాలు పంపి చర్యలు తీసుకోవాలని కోరతామని సీఐడీ అధికారులు వెల్లడించారు. తెల్ల రేషన్‌కార్డు ఎవరికంటే? ఏడాదికి రూ.60 వేల లోపు ఆదాయం ఉన్నవారు మాత్రమే తెల్లరేషన్ కార్డుకు అర్హులు. దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న నిరుపేదలకే తెల్ల రేషన్‌కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది. మరి నిరుపేదలు ఏడాదికి ఎంత ఆదా చేసే అవకాశం ఉంటుంది? రాబడిలో ఖర్చులు పోనూ వారు ఏటా రూ.ఐదు వేలకు మించి ఆదా చేసే పరిస్థితి ఉండదు. 20 ఏళ్లలో రూ.లక్షకు మించి ఆదా చేయలేరు. ఏటా సగటున రూ.పది వేల చొప్పున ఆదా చేసినా 20 ఏళ్లలో రూ.రెండు లక్షలను మాత్రమే ఆదా చేయగలరు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో మనీల్యాండరింగ్.. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బృందం ఇన్సైడర్ ట్రేడింగ్‌తోపాటు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు సీఐడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులను ముందు పెట్టి నల్లధనం వెదజల్లి వారి పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు తేల్చింది. ఇందులో మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఆధారాలు పంపేందుకు సీఐడీ సిద్దమైంది. భూములు కొన్న 797 మంది తెల్లరేషన్ కార్డుదారులతోపాటు వారి వెనుక దాగిన చంద్రబాబు బృందాన్ని బయటకు రప్పించే పనులను సీఐడీకి సమాంతరంగా ఈడీ కూడా చేపట్టనుంది. బినామీలను నమ్మని బడాబాబులు.. బినామీలను ముందు పెట్టి అమరావతిలో తక్కువ ధరలకే భూములను కాజేసిన బడాబాబులు రిజిస్ట్రేషన్ ముగిశాక జాగ్రత్త పడ్డారు. అధికారికంగా రాజధాని ప్రకటన వెలువడ్డాక భూముల ధరలు అమాంతం పెరిగితే బినామీలు ఎదురుతిరిగే అవకాశం ఉందని గుర్తించారు. రిజిస్ట్రేషన్ ముగిశాక ఆ భూములతో తమకు సంబంధం లేదని బినామీలతో అగ్రిమెంట్లు చేయించుకున్నారు. -
చంద్రబాబూ.. గో బ్యాక్
హిందూపురం/అనంతపురం టౌన్/పెనుకొండ/సోమందేపల్లి/అనంతపురం: రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి మార్చకూడదని డిమాండ్ చేస్తూ సోమవారం అనంతపురం జిల్లాలో బస్సు యాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు అడుగడుగునా ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాజధాని విషయంలో బాబు తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై పాలసముద్రం వద్ద ప్రజలు ఆందోళన చేపట్టడంతో అరగంట పాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు కాన్వాయ్ జాతీయ రహదారికి చేరుతుండగానే నిరసనకారులు నల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. బాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు గో బ్యాక్.. రాయలసీమ ద్రోహులు అనే నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో చంద్రబాబు వాహనం దిగి, వారిని వారించే ప్రయత్నం చేశారు. చివరకు చంద్రబాబు నడుచుకుంటూ జోలె పట్టి ముందుకు కదిలినా నిరసనకారులు అడ్డుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వద్దకు వెళ్లేందుకు బాబు ప్రయత్నించగా నిరసనకారులు అడ్డుకోవడంతో కొంతదూరం నడిచి మళ్లీ వాహనంలోకి వెళ్లిపోయారు. నిరసనకారులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు నిరసనకారులను బలవంతంగా పక్కకు తొలగించారు. తర్వాత రోప్ పార్టీతో బాబు కాన్వాయ్‌ని ముందుకు పంపించారు. ‘రండ్రా నా కొడుకుల్లారా చూసుకుందాం’ చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి చిందులు తొక్కారు. ‘రేయ్.. రండ్రా నా కొడుకుల్లారా చూసుకుందాం’ అంటూ నానా దుర్భాషలాడారు. పోలీసులు ఆయనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. అయినప్పటికీ వాహనంలో నుంచి చేయి చూపుతూ నిరసనకారులనుద్దేశించి దురుసుగా మాట్లాడారు. ఆయన అనుచరులు కూడా తొడలు కొడుతూ రేయ్ నరుకుతాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. అమరావతి కోసం ఉద్యమించాలి రాజధానిగా అమరావతి కోసం యువత ఉద్యమించాలని, లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు అన్నారు. సోమవారం అనంతపురంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రబాబు క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు జోలె పట్టుకొని ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని పేర్కొన్నారు. అన్ని జిల్లాలకు సమదూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా ఉంచాలని స్పష్టం చేశారు. రాజధానిని మార్చితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను భోగి మంటల్లో వేసి తగులబెట్టాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు రాష్ట్ర రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారని అన్నారు. అమరావతి కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమే రాజధాని అమరావతి కోసం తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజలందరిదీ ఒక దారి అయితే, సీఎం జగన్‌ది మరోదారిగా ఉందన్నారు. ముఖ్యమంత్రి మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. దీన్ని ప్రజలంతా ఖండించాలని కోరారు. రాజధానిని విశాఖపట్నానికి తరలించాలంటే మొదట 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రజలు ఆ పార్టీని గెలిపిస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చంద్రబాబు సవాల్ విసిరారు. చంద్రబాబు జోలెకు ప్రజా స్పందన సున్నా అమరావతి పరిరక్షణ సమితి పేరిట చంద్రబాబు చేపట్టిన బస్సుయాత్ర అనంతపురం జిల్లా సోమందేపల్లి వై.జంక్షన్లో కొద్దిసేపు ఆగింది. కాన్వాయ్‌ని ఆపగానే చంద్రబాబు తన మెడలో ఉన్న టవల్‌ను జోలెగా పట్టుకొని విరాళాల కోసం అభ్యర్థించగా ప్రజలెవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన కంగుతిన్నారు. అక్కడున్న కొందరు టీడీపీ నాయకులు విరాళాలు అందించాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. కొంతమంది కార్యకర్తలు చంద్రబాబు జోలెలో డబ్బులు వేసి మమ అనిపించారు. బాబు పర్యటనపై రెండు రోజులుగా టీడీపీ ప్రచారం చేస్తున్నా స్పందన లేకపోవడం గమనార్హం. రాయలసీమ ద్రోహి చంద్రబాబు చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
అందరి నోటా వికేంద్రీకరణ మాట
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అందరి నోటా వికేంద్రీకరణ అంశం నానుతోంది. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్న వాదన రోజురోజుకీ బలపడుతోంది. ఒకేచోట కేంద్రీకృతమయ్యే పాలన, అభివృద్ధి వల్ల ఇతర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురై వెనుకంజ వేస్తాయని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అవసరమని మేధావులు ఎప్పటి నుంచో చెబుతున్నా దానికి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాజధానిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మూడు రాజధానుల ఏర్పాటు అభిప్రాయం వ్యక్తం చేసినప్పటి నుంచి దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. – సాక్షి, అమరావతి - అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలనను వికేంద్రీకరించే ఆలోచనను ముఖ్యమంత్రి వెలిబుచ్చారు. సహజంగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకించి, రాద్ధాంతం మొదలు పెట్టినా ఆ పార్టీలోనూ భిన్న వాదనలు వినిపించాయి. - ఉత్తరాంధ్రకు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాయలసీమకు చెందిన ముఖ్య నేత కేఈ కృష్ణమూర్తి వికేంద్రీకరణకు మద్దతు ప్రకటించారు. - అమరావతిలోని గ్రామాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వికేంద్రీకరణ ప్రతిపాదనకు మద్దతు లభించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు కన్వీనర్‌గా నియమించిన నిపుణుల కమిటీ అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు సిఫార్సు చేసింది. - విశాఖపట్నంలో సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ సూచించింది. వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు(బీసీజీ) వికేంద్రీకరణపై ఇచ్చిన నివేదిక హాట్‌టాపిక్‌గా మారింది. - రూ.1.10 లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టడానికి బదులు అదే సొమ్మును సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెడితే రాష్ట్రంలో సాగు భూమి పెరిగి, ఐదేళ్లలో ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చినట్లవుతుందని బీసీజీ నివేదిక స్పష్టం చేసింది. -
3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకేచోట రాజధాని నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి జరగదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై శివరామకృష్ణ కమిటీ చేసిన సూచలను జీవీఎల్ ప్రస్తావించారు. ‘ శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పింది. అయితే గత ప్రభుత్వం రిపోర్టులు, గ్రాఫిక్స్‌కే పరిమితమైంది. చంద్రబాబు కూడా గతంలో నారాయణ కమిటీని నియమించి అమరావతిలో నిర్మాణం చేపట్టారు. అధికార వికేంద్రీకరణను పట్టించుకోలేదు. దీంతో సీమాంధ్ర చాలా నష్టపోయింది. నిజానికి ఒకేచోట రాజధాని నిర్మాణంతో అభివృద్ధి జరగదు’ అని అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పును పునరావృతం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.(ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!) అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిసర ప్రాంతాల్లో జరిగిన భారీ అవినీతి గురించి మాట్లాడుతూ.. ‘ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చి నిర్ణయం తీసుకోవాలి’ అని జీవీఎల్ పేర్కొన్నారు. అదే విధంగా శివరామకృష్ణ కమిటీ సూచలను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వికేంద్రీకరణను సమర్థిస్తున్నాం: జీవీఎల్
-
దళిత ద్రోహి చంద్రబాబు
తుళ్లూరు: రాజధాని అసైన్డ్ భూముల రైతులకు తీరని అన్యాయం చేసిన మాజీ సీఎం చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజధాని గ్రామమైన రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రహదారిపై వారు సమావేశమయ్యారు. రాజధానిలో చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమను తీవ్రంగా మోసగించి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధానికి వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రకటించాక అసైన్డ్ భూములకు ఏడాది పాటు ప్యాకేజీ, కౌలు చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నేతలు, బినామీలతో తప్పుడు ప్రచారాలు చేయించి తమను భయాందోళనలకు గురి చేశారన్నారు. అసైన్డ్ భూములను కారుచౌకగా కొనుగోలు చేశాకే ప్రభుత్వం తమ భూములకు పరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా రాజధానిలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని నిధులు ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా తప్పు చేశానని క్షమాపణ చెప్పాలని లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
రాజధానిలో ‘రోడ్డు దోపిడీ’ నిజమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం పేరుతో టీడీపీ అధికారంలో ఉండగా పాల్పడిన అక్రమాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో బహిర్గతమయ్యాయి. ఏ పనులు ఎవరికి కేటాయించాలో ముందుగానే నిర్ణయించి అంచనాలను భారీగా పెంచేశారని, ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు అప్పగించారని పేర్కొంది. రూ.4,057.95 కోట్ల విలువైన నాలుగు రహదారుల నిర్మాణ పనుల్లో రూ.751 కోట్లకు పైగా దోపిడీకి పథక రచన జరిగినట్లు విజిలెన్స్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. నాలుగు రహదారులు... మూడు సంస్థల కుమ్మక్కు అమరావతిలో నాలుగు రహదారుల నిర్మాణాలకు సంబంధించి ప్రతి అంశంలోనూ అంచనాలను ఎలా పెంచాలనే లక్ష్యంతోనే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహరించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. రాజధానిలో 11వ ప్యాకేజీ రహదారి నిర్మాణంలో అంచనాలను రూ.190.86 కోట్ల మేర పెంచేసినట్లు విజిలెన్స్ తేల్చింది. 12వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.106.42 కోట్లు, 13వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.195.88 కోట్లు, 14వ ప్యాకేజీ రహదారి అంచనాలను రూ.157.74 కోట్ల మేర పెంచేసినట్లు విజిలెన్స్ విచారణ నిగ్గు తేల్చింది. ఈ నాలుగు రహదారుల పనులను మూడు కాంట్రాక్టు సంస్థలు కుమ్మకై దక్కించుకున్నాయని, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలను రూపొందించిందని, ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశం లేకుండా నిబంధనలు విధించిందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. విజిలెన్స్ తేల్చిన వాస్తవాలు – కేవలం అంచనాలను పెంచడం ద్వారానే నాలుగు రహదారుల నిర్మాణ పనుల్లో రూ.651 కోట్ల మేర దోపిడీ జరిగింది. – ఇక అధిక ధరలకు అప్పగించడం ద్వారా మరో రూ.100 కోట్ల మేర కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. – ఇప్పటివరకు చేసిన పనుల్లో నిబంధనలను తుంగలోకి తొక్కారు. చేయని పనులకు కూడా అక్రమంగా బిల్లులు చెల్లించారు. – రాజధాని ప్రాంతం మూడు పంటలు పండే మాగాణి భూమి కాగా రాతి నేల అంటూ లేని పనులను చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – రహదారులకు పక్కన గ్రీనరీ పేరుతో లేని పనులను చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – గ్రీనరీ కోసం మట్టి ఇతర ప్రాంతాల నుంచి తరలించి చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పక్కనే అనంతవరంలో క్వారీలు ఉండగా పేరేచర్ల నుంచి గ్రావెల్ తెచ్చినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పక్కనే కృష్ణా నదిలో ఇసుక ఉంటే మరోచోట నుంచి తరలించినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – వరద నీరు, డ్రైనేజీ పనుల పరిమాణం పెంచేసినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. – పవర్ యుటిలిటీ డక్ట్ పనుల పరిమాణం పెంచేసినట్లు చూపిస్తూ అంచనాలను పెంచేశారు. -
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్
సాక్షి, అమరావతి: రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఆ వివరాలు సరైన సమయంలో బహిర్గతం చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిలో భూ అక్రమాలపై మా వద్ద పూర్తి సమాచారం ఉందని, అవసరం వచ్చినప్పుడు ఆ చిట్టా విప్పుతామన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ రాజధానిలో నాకు భూములే లేవంటున్నారని, ఆయన సవాల్ విసిరితే మొత్తం బయటపెడతాం అని సుజనా చౌదరిని ఉద్దేశించి అన్నారు. రాజధాని భూముల విషయమై చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని పవన్ కల్యాణ్ చాలా చెప్పారని, కానీ ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా గతంలో రాజధానిపై ఆరోపణలు చేశారని, ప్రస్తుతం ఆ పార్టీ నేతలు ఏమి చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందింది కాదని అన్నారు. రాష్ట్రంలో నాలుగు రాజధానుల విషయంపై టీజీ వెంకటేష్ మాట్లాడిన విషయాన్ని మంత్రి దృష్టికి మీడియా తీసుకెళ్ళగా...ఆయన్నే అడగండి అని అన్నారు. అమరావతి రైతులకు కౌలు చెల్లిస్తాం... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అమరావతి రైతులకు త్వరలోనే కౌలు చెల్లిస్తాం. కౌలు డబ్బులు ప్రతి రైతుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. కౌలు అందలేదనే అమరావతి రైతులు ధర్నా చేస్తున్నారని, ఈ విషయమై చర్చించేందుకు రైతులు తన వద్దకు వచ్చారని తెలిపారు. -
రాజధానికి ముంపు గండం!
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘కుంభవృష్టి కురిస్తే? ఎగువ నుంచి భారీ వరద కృష్ణా నదికి వస్తే? స్థానికంగా కుంభవృష్టి కురిసినా, ఎగువ నుంచి భారీగా వరద వచ్చినా రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదు. రెండూ ఒకేసారి వస్తే రాజధాని ప్రాంతం మొత్తం కృష్ణా నదిలా మారడం ఖాయం’’ అని నిపుణులు చెబుతున్నారు. గత వారం కృష్ణానదికి గరిష్టంగా 8 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదైంది. రాజధాని ప్రాంతంలోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇంకాస్త వరద పెరిగి ఉంటే.. అమరావతి పరిస్థితి ఏమిటి? స్థానికంగా వర్షాలు కురిసి కొండవీటి వాగు కూడా ఉప్పొంగి ఉంటే? తదుపరి పరిణామాలను ఊహించుకోలేం. రాజధాని ప్రాంతంలో ఫ్లడ్ లైన్స్ ఏపీ నూతన రాజధాని అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. వరద వస్తే మునిగిపోయే అవకాశం ఉన్న చోట రాజధాని నగరాన్ని ఏర్పాటు మంచిది కాదని ఈ కమిటీ హెచ్చరించింది. వరదలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయకూడదని తన నివేదికలో వెల్లడించింది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలు వరద భారీగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా పేర్కొంది. ఈ ప్రాంతాలను ‘రెడ్‌జోన్’గా గుర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన రాజధాని అమరావతి ప్రాంతానికి వరద ముప్పు ఉంటుందని సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్ 82వ పేజీలో స్పష్టం పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో లో, మీడియం, హై ఫ్లడ్ లైన్స్ ఉన్నాయని తెలిపింది. 2018 ఏప్రిల్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘హ్యాపీసిటీ బ్లూప్రింట్ ఫర్ అమరావతి’ నివేదికలోనూ రాజధానికి వరద ముప్పు ఉందని 176వ పేజీలో ప్రస్తావించారు. 2018 ఏప్రిల్‌లో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ‘హ్యాపీసిటీ బ్లూప్రింట్ ఫర్ అమరావతి’ నివేదికలో ఈ ప్రాంతానికి వరద ముంపు ఉన్నదని చెబుతున్న భాగం నిపుణుల అంచనా ప్రకారం రాజధానికి పొంచి ఉన్న ప్రమాదం - కృష్ణా నది ఉప్పొంగడం వల్ల రాజధానికి వరద ముప్పు ఏర్పడుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిన తర్వాత వచ్చే వరద ప్రవాహం అమరావతికి నష్టం కలిగించేదే. ఇటీవల శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో వరదను నియంత్రించడంతో 10.6 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే ప్రకాశం బ్యారేజీకి వచి్చంది. దానికే అమరావతి ప్రాంతంలోని పొలాల్లో 5 అడుగుల నీళ్లు చేరాయి. అంతకంటే ఎక్కువ వరద వస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. - భారీ ప్రవాహాలకు అవకాశం ఉన్న పలు ఉపనదులు, వాగులు, వంకలు నాగార్జున సాగర్ దిగువన చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. పైనుంచి వరద వచ్చినప్పుడు, సాగర్ దిగువన కూడా వర్షాలు కురిస్తే కృష్ణా నది ఉగ్రరూపం దాలుస్తుంది. అది రాజధానికి అత్యంత నష్టదాయకం. - స్థానిక వర్షాల వల్ల కొండవీటి వాగుకు మెరుపు వరద(ఫ్లాష్ ఫ్లడ్) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రాజధానికి ముప్పు పొంచి ఉంది. సాధారణ సమయాల్లో కొండవీటి వాగులో 4–5 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఫ్లాష్ ఫ్లడ్ వస్తే నీటి ప్రవాహం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. - అటు కృష్ణా నది, ఇటు కొండవీటి వాగులో ఒకేసారి వరద ఉంటే రాజధానికి ముప్పు రెట్టింపవుతుంది. కొండవీటి వాగు నుంచి 4–5 వేల క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ ద్వారా మళ్లించినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. -
అమరావతి అప్పులు కన్సల్టెన్సీలకు ఫలహారం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో గత సర్కారు అందినకాడికి తీసుకున్న అప్పులు నూతన ప్రభుత్వానికి పెనుభారంగా మారాయి. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను కన్సల్టెంట్లు, వడ్డీల చెల్లింపుల కోసం చంద్రబాబు సర్కారు వ్యయం చేసింది. రాజధానిలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టలేదు. అమరావతి బాండ్ల పేరుతో రూ.2,000 కోట్లు అధిక వడ్డీకి అప్పు తీసుకుని అనుత్పాదక కన్సల్టెన్సీలకు రూ.322 కోట్లను చెల్లించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి అథారిటీ నిధి కింద రూ.215 కోట్లు ఉండగా ఇందులో నుంచి రూ.22 కోట్లను కన్సల్టెన్సీలకు చెల్లించింది. రాజధానిలో సచివాలయం, రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,500 కోట్ల నుంచి చంద్రబాబు సర్కారు రూ.329 కోట్లను వడ్డీల చెల్లింపులకు వెచ్చించడం గమనార్హం. అప్పు రూ.2,000 కోట్లు.. వడ్డీలు రూ.2,000.82 కోట్లు విదేశీ, స్వదేశీ బ్యాంకులు ఇచ్చే రుణాలను సంబంధిత ప్రాజెక్టు కోసమే వినియోగించాలి. అయితే ఇష్టానుసారంగా ఖర్చు చేసేందుకు బాండ్ల ద్వారా అప్పులు చేయాలని టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నిర్ణయించారు. దీన్ని అప్పట్లోనే పలువురు ఐఏఎస్ అధికారులు తప్పుబట్టారు. ఒకపక్క పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జీహెచ్ఎంసీ ప్రభుత్వ గ్యారెంటీ లేకుండానే బాండ్లు జారీ చేస్తే కేవలం 9.38 శాతం వడ్డీకే అప్పులు ఇవ్వడానికి భారీగా సంస్థలు ముందుకు వచ్చాయని, కర్ణాటక కూడా 5.85 శాతానికే అప్పులు చేస్తోందని, అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ ఏకంగా అమరావతి బాండ్లకు 10.32 శాతం వడ్డీ చెల్లించాలని ఎలా నిర్ణయిస్తారని అభ్యంతరం తెలిపారు. బాండ్ల దళారీకి అప్పులో 0.1 శాతాన్ని ఫీజు కింద జీహెచ్ఎంసీ చెల్లిస్తుండగా, అమరావతి బాండ్ల దళారీకి మాత్రం 0.85 శాతం చెల్లించాలని నిర్ణయించడంపై కూడా విస్మయం వ్యక్తమైంది. ఇక అమరావతి బాండ్ల ద్వారా చంద్రబాబు సర్కారు ఎంత అప్పు తీసుకుందో అంతకు మించి వడ్డీలు, ఫీజుల రూపంలో చెల్లించాల్సి రావడం గమనార్హం. అమరావతి బాండ్లకు భారీ వడ్డీ, దళారీ ఫీజుతో కలిపి పదేళ్లలో రూ.2,000.82 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అప్పుల భారాన్ని తగ్గించుకుని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగటంపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. -
అమరావతిపై వాస్తవపత్రం
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిపై త్వరలో వాస్తవ పత్రాన్ని విడుదల చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తెలిపారు. గృహ నిర్మాణం, పోలవరం అంశాలపైనా వాస్తవ పత్రాలను విడుదల చేస్తామన్నారు. మంగళగిరిలోని ఓ రిసార్ట్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీటిపై రాష్ట్రమంతా చర్చ జరిగేలా చేస్తామన్నారు. అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. పెద్ద నగరాలతోనే ఆదాయం వస్తుందని.. అలాంటి నగర నిర్మాణాన్ని తాము ప్రారంభిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అమరావతిని మొదటి నుంచి వైఎస్సార్సీపీ వివాదం చేస్తోందని.. దాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిందని విమర్శించారు. అలాగే, అమరావతి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులకు నాలుగు కంపెనీలు టెండర్లు దాఖలు చేస్తే తక్కువ కోట్ చేసిన వారికి పనులివ్వడాన్ని తప్పుపడుతున్నారన్నారు. భూముల ధరలు పడిపోయాయి రెండు నెలల్లో రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పడిపోయాయని దీనికి వైఎస్సార్సీపీ విధానమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఆర్థికమంత్రి ముళ్ల కంపలు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని.. నిర్మాణంలో ఉన్న రాజధానిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు తనిఖీలు చేయడానికి వైఎస్సార్సీపీయే కారణమన్నారు. ప్రభుత్వ వైఖరివల్ల పెట్టుబడులు పెట్టే వారు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారన్నారు. అసెంబ్లీలో హడావుడిగా బిల్లులు పెట్టి, వాటిని తాము వ్యతిరేకించామంటున్నారని బాబు విమర్శించారు. కాగా, చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు, ఆ ప్రాజెక్టుకు కేటాయించిన వెయ్యి కోట్లు దండగని, అవినీతి అని కూడా అంటారేమోనని వ్యాఖ్యానించారు. పీపీఏలపై నిపుణుల కమిటీ పేరుతో తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. అనంతరం.. రిసార్ట్‌లోనే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. -
రుణం వద్దన్నది భారత ప్రభుత్వమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సుస్థిర మౌలిక వసతుల ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదనను భారత ప్రభుత్వమే విరమించుకుందని, దాంతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రపంచ బ్యాంకు తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనను తాము ఉపసంహరించుకోలేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం చేసిన వినతి మేరకే ఈ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గినట్లు పేర్కొంది. రాజధాని ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకపోయినా ఏపీలో కొత్త ప్రభుత్వానికి అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రిన్సిపల్ కమ్యూనికేషన్ అధికారి సుదీప్ మొజుందర్ పేరిట ఆదివారం బ్యాంకు వెబ్సైట్లో పత్రికా ప్రకటన విడుదలైంది. ఏపీ ప్రభుత్వంతో సుదీర్ఘమైన భాగస్వామ్యం అమరావతి ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలన్న విజ్ఞప్తిని ఈ నెల 15 తేదీన భారత ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఈ నేపథ్యంలో దీనిపై తాము ముందుకు వెళ్లలేమని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు తెలిపిందని సుదీప్ మొజుందర్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తుల నిర్వహణ రంగాలను కవర్ చేసే ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. గత నెల 27వ తేదీన ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్య రంగంలో 328 మిలియన్ డాలర్ల కొత్త ఆర్థిక సహాయం కూడా ఇందులో కలిసి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంతో ప్రపంచ బ్యాంకుకు సుదీర్ఘమైన, ఫలవంతమైన భాగస్వామ్యం ఉందని ఆ ప్రకటనలో వివరించారు. వినూత్నమైన ఆవిష్కరణలు చేయడంలో ఏపీ ముందుందని ప్రశంసించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం రూపొందించుకున్న ప్రాధామ్యాలకు అనుగుణంగా వారికి కావాల్సిన సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం విజ్ఞప్తికి లోబడి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమరావతికి రుణం ఇచ్చే ప్రతిపాదనను తాము ఉపసంహరించుకోలేదని, కేంద్ర ప్రభుత్వమే రుణ విజ్ఞప్తిని విరమించుకుందని సుదీప్ మొజుందర్ ‘సాక్షి’కి తెలిపారు. రాజధానిలో ఉల్లంఘనల వల్లే ఆగిన రుణం తమను చూసి రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం ఇదే పాట అందుకున్నారు. కానీ, స్వయంగా ప్రపంచ బ్యాంకే దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వడంతో చంద్రబాబు, ఆయన పరివారం చేస్తున్న ప్రచారంలోని డొల్లతనం తేటతెల్లమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలిన ఎల్లో గ్యాంగ్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. వాస్తవానికి ఈ రుణం మంజూరు వ్యవహారం మూడేళ్లుగా పరిశీలన దశలోనే ఉంది. రుణం కచ్చితంగా వస్తుందనే గ్యారంటీ ఏ దశలోనూ లేకుండా పోయింది. చంద్రబాబు హాయంలో రాజధాని అమరావతి నిర్మాణంలో లెక్కలేనన్ని ఉల్లంఘనలు, అవకతవకలు జరిగాయని అక్కడి రైతులు, పర్యావరణవేత్తలు, మేధావులు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. వాటిపై ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందాలతో పలుమార్లు విచారణ జరిపించింది. ఉల్లంఘనలు నిజమేనని తన వెబ్సైట్లో తనిఖీ బృందం నివేదికలను ఉంచింది. చంద్రబాబు పాలనలో రాజధాని పేరిట జరిగిన అరాచకం వల్లే ఈ రుణం రావడం లేదని అప్పట్లోనే స్పష్టమైంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన హయాంలో జరిగిన వ్యవహారాలన్నింటినీ మరచిపోయి ప్రపంచ బ్యాంకు రుణం రాకపోవడానికి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ నిందలు వేయడం గమనార్హం. -
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, అమరావతి : రాజధాని వ్యవహారాలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాజధాని ప్రాజెక్టులు, వాటి స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, ప్రత్యేక కమిషనర్ రామ్మోహన్రావు సీఆర్డీఏ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, పనులన్నింటినీ ఆయనకు వివరించారు. నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు, వాటి పరిస్థితి, నిధుల సమీకరణ, భూసమీకరణ, భూముల కేటాయింపు తదితర అన్ని విషయాలను తెలుసుకున్న ఆయన తన అనుమానాలను కూడా నివృత్తి చేసుకున్నారు. ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి రాజధాని రోడ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి వివరించారు. రాజధాని వ్యవహారాలను తెలుసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశానని, త్వరలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తానని, సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత ప్రభుత్వ విధానం ప్రకారం ఏం చేయాలో అది చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఉన్నదాన్ని పాడుచేసే పరిస్థితి ఉండదన్నారు. రాజధాని ఆగిపోతుందనే ప్రచారంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. -
వాన కురుస్తుంది....గాలి విరుస్తుంది!!
అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంతా డొల్లేనని మరోసారి రుజువైంది. స్వల్ప వర్షానికే పలుమార్లు చిల్లుపడ్డ కుండల్లా అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం మారింది. తాజాగా బుధవారం కేవలం అరగంటపాటు వీచిన ఈదురుగాలులకు అమరావతి చిగురుటాకులా వణికిపోయింది. ఉధృతంగా వీచిన గాలులకు సచివాలయంలోని టెంట్లు, స్మార్ట్ పోల్ నేలకొరిగాయి. ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సచివాలయంలోని భవనాలకు పైన వేసిన రేకులు గాలి ధాటికి ఎగిరిపోయాయి. కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేకుండా నిర్మించిన భవనాలపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి బ్యూరో మంత్రుల చాంబర్లు.. చిల్లులు పడ్డ కుండలే.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ప్రపంచం గర్వించదగ్గ సచివాలయాన్ని నిర్మించామని చెబుతున్న సీఎం చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఇప్పటికే బట్టబయలైంది. గతంలో రెండుసార్లు కురిసిన వర్షానికి సచివాలయంలోని 4, 5 బ్లాకుల్లో ఉన్న మంత్రుల చాంబర్లలో చిల్లులు పడ్డ కుండలా నీరు కారింది. బ్లాకుల్లో సీలింగ్ ఊడి పడి.. ఫర్నీచర్ తడిసిపోయి.. ఏసీల్లోకి వర్షపు నీరు చేరడంతో సిబ్బంది విధులకు సైతం ఆటంకం ఏర్పడింది. నిర్మాణ సంస్థపై చర్యలేవి? అతి తక్కువ కాలంలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రి నారాయణ చెబుతూ వస్తున్నారు. అయితే.. వర్షం పడిన ప్రతిసారీ సచివాలయంలోని బ్లాకులకు చిల్లులు పడటంతో నిర్మాణాల్లోని డొల్లతనం రుజువైంది. వందల కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణం ఇలా కళ్లెదుటే స్వల్ప వర్షానికే కారుతూ ఉండడాన్ని చూస్తూ అక్కడి అధికారులే పెదవి విరుస్తున్నారు. 2017లో తొలిసారి చిల్లులు పడినప్పటి నుంచి ఇప్పటివరకు సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వం.. నిర్మాణ సంస్థపై చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజధాని గ్రామాల రోడ్లు బురదమయం రాజధానిలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో కొన్ని గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం గమనార్హం. చిన్నపాటి వర్షానికే రాజధాని గ్రామాల రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు ఇళ్లలోకి చేరుతోంది. గతేడాది కురిసిన వర్షానికి రాయపూడిలోని ముస్లిం కాలనీ నీటమునిగింది. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే ప్రతిపక్ష నేత జగన్ చాంబర్లో ఊడిపడిన సీలింగ్‌ను శుభ్రం చేస్తున్న సిబ్బంది (ఫైల్) హైకోర్టు నిర్మాణంలోనూ అంతే.. ఆగమేఘాల మీద తాత్కాలిక హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. సరైన భద్రతా, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. మంగళవారం కురిసిన వర్షానికి హైకోర్టు భవనంపైన ఏర్పాటు చేసిన ఇనుప షీట్లు గాలికి కొట్టుకుపోయాయి. గోడలకు అమర్చిన టైల్స్ విరిగిపోయాయి. సమీపంలోని అన్న క్యాంటీన్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. గాలికి ఎగిరిపడిన రేకులు తగలడంతో అక్కడే పనిచేస్తున్న మహిళా కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో హైకోర్టుకు సెలవులు కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హైకోర్టు పనివేళల్లో జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికంగా పనిచేస్తున్న కూలీలు చెబుతున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే నష్టం వాటిల్లిందని అధికారులు కూడా స్పష్టం చేశారు. కమీషన్ల కక్కుర్తితోనే లీకులు సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలతోపాటు తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనుల అంచనాలను ప్రభుత్వం పెంచుతూ పోయింది. సచివాలయం, అసెంబ్లీ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసింది. హైకోర్టుకు తొలుత రూ.98 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టగా ఆ మొత్తాన్ని రూ.150 కోట్లకు పెంచింది. కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం భారీగా పెంచిందని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలకు ప్రస్తుత సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పాటించకుండా, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2017లో ప్రతిపక్ష నేత చాంబర్లోకి నీరు 2017, జూన్‌లో కురిసిన వర్షానికి సచివాలయం నిర్మాణంలో డొల్లతనం మొదటిసారిగా బయటపడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి సచివాలయం చిల్లులు పడ్డ కుండలా కారడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్లో లీకేజీతో భారీగా నీరు చేరింది. చాంబర్లో సీలింగ్ ఊడిపడడంతో ఫర్నీచర్, ఫైళ్లు తడిసిముద్దయ్యాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి వర్షపు నీరు కారడంతో అక్కడి సిబ్బంది ఆ నీటిని బకెట్లతో ఎత్తి బయటపోశారు. ఈ ఘటన తర్వాత నిర్మాణాల్లోని లోపాలు బయటపడ్డాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని గాలికొదిలేసింది. -
నిన్న అసెంబ్లీ, సచివాలయం.. నేడు హైకోర్టు..
సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలోని తాత్కాలిక నిర్మాణాల్లో డొల్లతనం మరోమారు బట్టబయలైంది. గతంలో చిన్నపాటి వర్షాలకే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో సంభవించిన లీకేజీలను మర్చిపోక ముందే తాజాగా తాత్కాలిక హైకోర్టు భవనంలోని జనరేటర్ గదులకు సంబంధించిన శ్లాబ్ కూలడంతో ఈ భవనం నాణ్యతపై కూడా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జనరేటర్ రూంకు సంబంధించి ఆరు గదులను నిర్మిస్తుండగా అందులో రెండు గదుల్లోని శ్లాబ్ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలింది. అక్కడే పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన నలుగురు కూలీలు గాయపడడంతో అధికారులు హుటాహుటిన వారిని తాడేపల్లి సమీపంలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. కాగా, నిర్మాణాల్లో డొల్లతనం ఎక్కడ బయటపడుతోందోనన్న భయంతో సీఆర్డీఏ అధికారులు శనివారం మీడియా ప్రతినిధులు ఎవరినీ ఆ ఛాయలకు అనుమతించలేదు. నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి చిన్నచిన్న సంఘటనలు చోటుచేసుకుంటాయని.. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయొద్దని అధికారులు హెచ్చరించారు. అక్కడే ఉన్న కూలీలతో కూడా మీడియాను మాట్లాడనివ్వలేదు. గాయపడిన కూలీలు.. వారి పేర్లు.. ఎక్కడ చికిత్స చేయిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లనీయకుండా మీడియాను అడ్డుకుంటున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని సుమోటాగా తీసుకోవాలి తాత్కాలిక హైకోర్టు వద్ద జరిగిన ప్రమాదాన్ని హైకోర్టు సుమోటా తీసుకుని విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణంలో పాటిస్తున్న ప్రమాణాలు, నాణ్యత వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని వారు కోరుతున్నారు. నాణ్యత, భద్రత విషయాల్లో రాజీపడితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, హడావుడిగా నిర్మాణాలు చేస్తున్న క్రమంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తంచేశారు. ఇదే విషయమై హైకోర్టు న్యాయవాది ఓలేటి లక్ష్మీనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ సభ్యులతో కలిసి మంగళవారం తాత్కాలిక హైకోర్టు నిర్మాణంలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, నాణ్యతను పరిశీలిస్తామని చెప్పారు. అందుబాటులో లేని ‘108’ ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో ఒక్క 108 వాహనాన్ని కూడా ఏర్పాటుచేయకపోవడం గమనార్హం. తుళ్లూరు మండలంలో ఉన్న ఏకైక వాహనానికి డ్రైవర్ లేకపోవడంతో సర్వీస్ నిలిచిపోయింది. హైకోర్టు వద్ద ప్రమాదం జరిగిన సమయలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో కారులో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
నేరాలకు అడ్డాగా రాజధాని
సాక్షి, అమరావతి బ్యూరో: యానిమేషన్ వీడియోలు, డిజైన్ల పేరిట అబ్బురపరిచే సెట్టింగులు, మాటల గారడీలు, సింగపూర్, జపాన్ దేశాల పర్యటనలు... ఇవీ నాలుగున్నరేళ్లుగా రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు మనకు చూపించిన సినిమా. క్షేత్రస్థాయిలో మాత్రం అంతా మిథ్యే అన్న వాస్తవం అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా పక్కనపెట్టేసిన ప్రభుత్వం అక్కడ శాంతిభద్రతల పరిరక్షణను కూడా గాలికొదిలేసింది. అమరావతి ప్రాంతంలో గతంలో ఎప్పుడూ లేనంతగా శాంతిభద్రతలు క్షీణించాయి. సామాన్య ప్రజలకు రక్షణ కరువవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. సీఎం ఇంటి వెనుకే ఇసుక అక్రమ దందా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వెనకవైపు నుంచే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. రాజధాని అవసరాల కోసమని చెబుతూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పెనుమాక ఇసుక రీచ్ నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోందని.. ఇది ఇలాగే కొనసాగితే విజయవాడ ప్రాంతం పర్యావరణ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి ఫిర్యాదు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాల్ని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య మండలిని ఎన్జీటీ ఆదేశించింది. నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు సంబంధిత అధికారులు అటువైపు కూడా తొంగిచూడలేదు. రెండు నెలల్లో ముగ్గురు హత్య గత రెండు నెలల్లో రాజధాని పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముగ్గురు హత్యకు గురికాగా, పోలీసుల వేధింపులు భరించలేక ఒక యువజంట ఆత్మహత్య చేసుకుంది. గతేడాది డిసెంబర్ 22న మంగళగిరి మండలంలోని కురగల్లుకు రోడ్డు నిర్మాణ పనుల కోసం రంగారెడ్డి జిల్లా నుంచి తండ్రీకొడుకులు వచ్చారు. వారిని జార్ఖండ్‌కు చెందిన డ్రైవర్ మరో ఇద్దరి సహాయంతో కిరాతకంగా హత్య చేశారు. రెండ్రోజుల అనంతరం మృతుల బంధువుల ఫిర్యాదుతో పోలీసు యంత్రాంగం స్పందించి హత్య కేసును ఛేదించారు. డీజీపీ ఆఫీసుకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నవులూరులో ఈ నెల 11న జ్యోతి అనే యువతి దారుణ హత్యకు గురైంది. దాడిలో ఆమె ప్రేమికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హత్య కేసులో పోలీసుల విచారణ తీవ్ర సందేహాస్పదంగా మారింది. కేసును నిష్పక్షపాతంగా విచారించాల్సిన పోలీసులు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారని, ప్రేమికుడే హత్య చేశాడని జ్యోతి బంధువుల ఆరోపణతో మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల వేధింపులకు దంపతుల ఆత్మహత్య మంగళగిరి మండలం నవులూరుకు చెందిన మిరియాల వెంకటకిరణ్, అతని భార్య హెలీనా పోలీసుల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంకటకిరణ్‌పై చీటింగ్ కేసు నమోదు చేయడంతో పాటు.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్సై సత్యనారాయణ వేధింపులకు పాల్పడడంతో దంపతులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో దళిత సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. భూములు తగులబెట్టిన కేసు క్లోజ్..! రాజధానిగా అమరావతిని ప్రకటించిన అనంతరం 2014 డిసెంబర్ 29న రాజధాని గ్రామాలైన ఉండవల్లి, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, వెంకటపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి ఆగంతకులు అలజడి సృష్టించారు. పంట పొలాలకు నిప్పు పెట్టారు. పెనుసంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రధాన నిందితుల్ని ఇంతవరకూ పట్టుకోలేదు. నాలుగేళ్లపాటు దర్యాప్తు చేసిన గుంటూరు రూరల్ పోలీసులు నిస్సహాయత వ్యక్తం చేస్తూ గతేడాది అక్టోబర్‌లో కేసు క్లోజ్ చేశారు. మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో సుమారు 300 మంది అమాయక రైతుల్ని దర్యాప్తు పేరిట చిత్రహింసలకు గురిచేసి చివరికి కేసును మూసేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారు అధికార పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఎన్ని విమర్శలు వచ్చినా పోలీసుల తీరు మారడం లేదు. టీడీపీ నాయకులకు సహకరిస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రేమ జంటపై దాడి కేసు దర్యాప్తు నుంచి గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణను ఉన్నతాధికారులు తప్పించారు. ఆయనపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. మంత్రి లోకేశ్‌కు దగ్గరగా ఉండే ఓ వ్యక్తికి బంధువు కావడంతో... యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే మంగళగిరి రూరల్ సీఐ బాలాజీని సస్పెండ్ చేశారు. ఎస్ఐ బాబురావును వీఆర్‌కు పంపడంతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వరుసగా వేటు పడుతున్నా పోలీసులు తమ తీరును మార్చుకోవడం లేదని రాజధాని ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఒక్క ఐడియాతో అమరావతి నిర్మిస్తున్నాం..
సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: ఒక్క ఐడియాతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్ తరాలు సంతోషంగా నివసించేలా, సింగపూర్‌ను మించిన నగరంలా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విజయవాడలో బుధవారం హ్యాపీ సిటీస్ సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. నాణ్యమైన జీవితం, ఆనందమయ నగర నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తోందని స్పష్టం చేశారు. తొలుత స్మార్ట్‌సిటీస్, మౌలిక సదుపాయాలకు సంబంధించిన రెండు అవగాహనా ఒప్పందాలను(ఎంవోయూ) రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. అర్బన్ అసెట్ అండ్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సిస్టం, అమరావతి రెసిడెంట్ కార్డులను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని, చాలా కన్సల్టెన్సీలు నగర నిర్మాణంలో సేవలు అందిస్తున్నాయని చెప్పారు. రాజధానిలో 9 సిటీలు, 25 టౌన్‌షిప్‌ల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ, భారత్‌లో అమెరికా కాన్సూల్ జనరల్ మైఖేల్, బూటాన్‌లోని థింపూ నగర మేయర్ కిన్లే దోర్జి, ఇంధన కార్యదర్శి అజైన్ జైన్, సీఆర్డీఏ కబిషనర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు ప్రసంగించారు. వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రూ.8 వేల కోట్లతో చేపట్టనున్న 30 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 140 నదులను అనుసంధానిస్తా: చంద్రబాబు ‘ఐదేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నా.. వచ్చే 75 రోజులు నాకోసం కష్టపడండి’ అని ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా.. ఇలా 140 నదులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరవు అనే మాట వినిపించకుండా చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లాలో 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే వైకుంఠపురం బ్యారేజీకి బుధవారం ముఖ్యమంత్రి భూమిపూజ చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అమరావతికి, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు పోలికే లేదని పేర్కొన్నారు. వైకుంఠపురం వద్ద నీటిని నిల్వ చేసి సుందర జలాశయంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రధాని నరేంద్రమోదీని తమ్ముడిగా సంబోధించిన చంద్రబాబు... ఆయనను ఇంటికి సాగనంపుతానని వ్యాఖ్యానించారు. మోదీ వెళ్లిపోతేనే రాష్ట్రానికి హోదా దక్కుతుందన్నారు. -
అమరావతి పేరుతో మరో దుబారా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ‘పోలవరం’ సినిమా చూపిస్తున్నట్లుగానే రాజధాని అమరావతి సినిమానూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు చూపించబోతున్నారు. రాజధాని నిర్మాణంలో తీవ్రంగా అభాసుపాలై.. తాత్కాలిక నిర్మాణాలతో కాలక్షేపం చేస్తున్న సర్కార్ ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఖర్చులతో అక్కడి పునాదులను రాష్ట్ర ప్రజలకు చూపించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా రూ.39.88 కోట్లను ఖర్చు పెట్టనుంది. ఉదయం టీ, కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెట్టిస్తున్న సీఆర్డీఏ, ఒక్కో వ్యక్తి డిన్నర్‌కు మాత్రం రూ.150ను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికార యంత్రాంగం తీవ్రంగా తప్పుపడుతోంది. ఓ పక్క రాష్ట్రం రెవెన్యూ లోటులో కొట్టుమిట్టాడుతుండగా.. మరోపక్క ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి, 108 అంబులెన్స్‌లకు అవసరమైన డీజిల్‌కు నిధులు ఇవ్వలేని దారుణ పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే.. ఇప్పుడు రాజధానిలో నిర్మాణాలు చూపించడానికి ప్రతిజిల్లా నుంచి జనాల్ని తరలించడానికి నిధులు దుబారా చేయడంపై ఉన్నతాధికార వర్గాలతో పాటు సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. నెలకు రూ.30 కోట్లు ఖర్చయ్యే డీఏను ఉద్యోగులకు, పెన్షనర్లుకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన సర్కారు రాజధానికి ప్రజలను తరలించడానికి కోట్ల రూపాయలు ఎలా ఖర్చుపెడుతుందని సచివాలయ ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ అద్భుత కట్టడాలుంటే ప్రజలే తమంతట తామే వచ్చి చూస్తారని వారంటున్నారు. వర్షం వస్తే లోపలికి నీళ్లు వచ్చేసే తాత్కాలిక సచివాలయం చూసేందుకు జనాలను తరలించాలనుకోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వ నేత ఆలోచనలు పతాక స్థాయికి చేరుకున్నాయని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏదో ఒకటి ఈవెంట్ల తరహాలో నిర్వహిస్తే రాజధానిలో ఏదో జరిగిపోతోందనే ప్రచారం జరుగుతుంది తప్ప వాస్తవానికి ఏమీ ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రెండు నెలలకు రూ.39.88కోట్ల ఖర్చు కాగా, ప్రతీ జిల్లా నుంచి ప్రజలను అమరావతికి తరలించేందుకు బస్సులు ఏర్పాటుచేయడంతో పాటు అమరావతిలో బస, భోజనం తదితర ఏర్పాట్ల కోసం మార్చి నెల వరకు రూ.39.88 కోట్లు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ లెక్క కట్టింది. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం కూడా తీసుకుంది. రైతులు, విద్యార్థులను తరలించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు చూపించడానికి రూ.84.50 కోట్లుఖర్చుచేశారు. తాజాగా మరో రూ.100 కోట్లు మంజూరు చేయాలని సాగునీటి శాఖ ప్రతిపాదనలను పంపగా ఆర్థిక శాఖ పెండింగ్‌లో పెట్టింది. ఇలాంటి వ్యయాలన్నీ కూడా దుబారా కిందకే వస్తాయని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా అద్భుత నిర్మాణాలు నిర్మిస్తే ప్రజలు వారంతట వారే చూసేందుకు వస్తారని, ఇలా బలవంతంగా తరలింపు ఎందుకని ఆ అధికారి అనడం విశేషం. -
రాజధాని శాశ్వత భవనాల వ్యయం రెట్టింపు
సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయం తరహాలోనే రాజధాని అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణ వ్యయం కూడా భారీ స్థాయికి చేరుకుంది. తాత్కాలిక సచివాలయం పేరుతో ఇప్పటికే భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆడిట్ నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేయడం తెలిసిందే. ఈ పనులను టెండర్ నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎక్సెస్‌తో కాంట్రాక్టర్లకు అప్పగించారని ఆడిట్ నివేదికలో పేర్కొంది. చిన్నపాటి వాన కురిస్తేనే తాత్కాలిక సచివాలయంలోని కార్యాలయాల్లోకి వర్షం నీరు వచ్చేలా నిర్మించిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకే శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలభవనాల నిర్మాణ టెండర్లను సర్కారు అప్పగించడం గమనార్హం. శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను ఐదు టవర్లలో 30 లక్షల చదరపు అడుగుల్లో రూ.1,200 కోట్లతో నిర్మించాలని తొలుత నిర్ణయించారు. అయితే టెండర్ల దగ్గరకు వచ్చే సరికి ఇది 69 లక్షల చదరపు అడుగులకు పెరిగిపోయింది. ఐదు టవర్లలో నిర్మాణం చేపట్టేందుకు మూడు ప్యాకేజీలుగా విభజిస్తూ టెండర్లను ఆహ్వానించారు. తొలి ప్యాకేజీ కింద ఐదో టవర్‌లో సాధారణ పరిపాలనశాఖ భవనాల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్‌ను రూ.592.41 కోట్లతో ఎన్సీసీ సంస్థకు అప్పగించారు. రెండో ప్యాకేజీలో మూడు, నాలుగు టవర్ల పనులను రూ.749.90 కోట్లతో ఎల్ అండ్ టీకి అప్పగించారు. ఒకటి, రెండో టవర్లకు మూడో ప్యాకేజీ కింద టెండర్లను ఆహ్వానించి రూ.932.46 కోట్లకు షాపూర్జీ పల్లోంజీకి అప్పగించారు. మొత్తం ఐదు టవర్లలో శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల నిర్మాణ వ్యయాన్ని రూ.2,274.77 కోట్లుగా పేర్కొన్నారు. తొలుత 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలను చేపట్టాలని భావించి తరువాత 69 లక్షల చదరపు అడుగులకు ఎందుకు పెంచారో అర్థం కావడం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. విభిన్న సదుపాయాల పేరుతో ఇంటిగ్రేటెడ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారని, ఇందులోనే అన్ని రకాల వసతుల కల్పనకు ఆస్కారం ఉన్నప్పటికీ కొత్తగా ఐదు టవర్లలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,060 కోట్ల అంచనాతో మరో టెండర్‌ను ఆహ్వానించారని ఆ ఉన్నతాధికారి తెలిపారు. పేరుకు మాత్రమే టెండర్లను ఆహ్వానించి ఎవరూ ముందుకు రాలేదంటూ రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన ఆ పనులను కూడా ఐదు టవర్లు నిర్మించే సంస్థలకే పందేరం చేయనున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. రెట్టింపు దాటిన కన్సల్టెంట్ ఫీజు ఐదు టవర్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కోసం తొలుత 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రూ.1,200 కోట్ల అంచనాతో టెండర్‌ను ఆహ్వానించగా ప్రాజెక్టు వ్యయంలో 0.89 శాతం ఇచ్చేందుకు సీఆర్డీఏ ‘ఈజీఐఎస్’ను ఎంపిక చేసింది. తొలుత అంచనా వేసిన ప్రాజెక్టు వ్యయం ప్రకారం ఈజీఎస్ కన్సల్టెంట్‌కు రూ.10.68 కోట్లు ఫీజు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.2,274.77 కోట్లకు పెరిగిపోవడంతో ఫీజుతో పాటు జీఎస్టీ కలిపి కన్సల్టెంట్‌కు రూ.23.90 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. -
20 సంస్థలకు 120 ఎకరాలు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో 20 సంస్థలకు 120 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో యనమల అధ్యక్షతన బుధవారం ఉపసంఘం సమావేశమైంది. సమావేశం అనంతరం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఆమోదించగా కొన్ని తిరిస్కరించినట్లు మంత్రులు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 50 ఎకరాలు, అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు 5.56 ఎకరాలు కేటాయించినట్లు మంత్రులు తెలిపారు. ఈ భూములకు ఎకరాకు రూ.10 లక్షల నుంచి నాలుగు కోట్ల వరకు ధర నిర్ణయించినట్లు చెప్పారు. నాబార్డుకు ఇచ్చే భూమి విలువను ఎకరాకు రూ.2 కోట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. రామకృష్ణ మిషన్, ఉన్నత విద్యా శాఖ, ఏపీ ఫైబర్‌నెట్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఘం, అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ, కెనారా బ్యాంకు, విజయా బ్యాంకు, ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్, ఏపీ పబ్లిక్ లైబ్రరీస్, ఏపీ ఫైనాన్సియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్, అమరావతి ఎడ్యుకేషనల్ కల్చరర్ అకాడమీ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూముల కేటాయింపు ధరలు నిర్ణయించినట్లు వారు తెలిపారు. గతంలో పది విభాగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మొత్తం కలిపి 85 సంస్థలకు 1374.96 ఎకరాలను కేటాయించినట్లు వివరించారు. నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. -
రాజధానిలో రచ్చబండ
-
రాజదానిలో రచ్చబండ
-
అమరావతిలో సౌకర్యాలు లేవు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజధాని అమరావతిలో తగిన సౌకర్యాలు లేకే ఏడాదికొక జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇలా ఏడాదికో జిల్లాలో వేడుకలు నిర్వహించడం వల్ల ఆ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. గత నాలుగేళ్లుగా కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో నిర్వహించిమని చెప్పారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ పోలీసు బెటాలియన్లు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేడెట్లు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో విశిష్ట సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా 46 పేజీల ప్రసంగ పాఠాన్ని సీఎం చదివి వినిపించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, లక్ష్యాల గురించి వివరిస్తూనే మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణల వర్షం కురిపించారు. తాను అమెరికా వెళ్లినా అన్నదాతకు ఏవిధంగా సాయం చేయాలనే నిరంతరం ఆలోచిస్తానంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రూ. 24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశానన్నారు. గిరిజన ప్రాంతాల్లో ‘గిరి ఆహార భద్రత’ కింద 1.91 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు రూ. 460 చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన డ్వాక్రా పొదుపు సంఘాలు ఇప్పుడు కోటిమంది సైన్యంగా మారినట్లు చెప్పారు. వైద్యరంగంలో తమ ప్రభుత్వ కృషి ఫలితంగానే ప్రజల ఆరోగ్య రక్షణ తలసరి వ్యయం(ఓవోపీఈ) 79 శాతానికి తగ్గిందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక డిజిటల్ లిటరేట్, ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారుకావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 57 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. మొత్తం 56 ప్రాజెక్టుల్లో 29 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కరవు రహిత రాష్ట్రంగా మార్చడానికే రెయిన్‌గన్ టెక్నాలజీ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. వంద శాతం ఇళ్లకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేస్తున్న కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటన్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చినా ఇసుక ఉచితంగా ఇస్తున్నామన్నారు. మోదీ మోసం చేశారు... ఢిల్లీని తలదన్నే రాజధానిని కట్టిస్తానని తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పిన నరేంద్ర మోదీ ఇప్పుడు మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. విభజన చట్టంలోని 18 అంశాలూ నెరవేర్చలేదని చెప్పారు. 11 రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదాను మన రాష్ట్రానికి మాత్రం పెడచెవిన పెట్టారని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌ను రాజకీయ కారణాలతో తొక్కిపట్టారన్నారు. కడప ఉక్కు కర్మాగారానికి భూములిచ్చినా, ఇనుప ఖనిజం చూపించినా అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని చెప్పారు. సెర్ప్ శకటానికి ప్రథమ బహుమతి... స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల శకటాలు ఆకట్టుకున్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం(సెర్ప్) శకటానికి ప్రథమ స్థానం దక్కింది. పర్యాటకం, గృహనిర్మాణ శాఖల శకటాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పితాని సత్యన్నారాయణ, జిల్లాకు చెందిన మంత్రులు కళావెంకటరావు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపీ రామ్మోహన్నాయుడులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం పది గంటల వరకూ ఏకధాటిగా శ్రీకాకుళంలో కురిసిన వర్షానికి మైదానం పూర్తిగా చిత్తడిగా మారింది. వర్షంలోనే కార్యక్రమం కొనసాగించారు. -
అమరావతిపై కేంద్ర సంస్థల అనాసక్తి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుచేసేందుకు మొదట్లో ఉత్సాహం చూపిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు ఇప్పుడు అనాసక్తి ప్రదర్శిస్తున్నాయి. అమరావతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి చూసి రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగిపోతుందని భావించిన పలు కేంద్ర సంస్థలు అక్కడ తమకు భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలకు లేఖలు రాసి అమరావతిలో కార్యాలయాలకు ఎంత స్థలం అవసరమో చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో చాలా సంస్థలు ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రభుత్వం ఈ సంస్థల కంటే కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అవసరం లేకపోయినా వారికి ఎక్కువ భూమిని తక్కువ ధరకు కేటాయించడంతో పాటు వాటికి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలకు భూముల కేటాయింపులో వివక్ష చూపుతూ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన దానికి రెట్టింపు ధర విధించింది. ఏప్రిల్ నెలాఖరు వరకూ 15 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు భూములు కేటాయించింది. ఎకరం రూ. కోటి నుంచి నాలుగు కోట్ల చొప్పున వాటికి ధర నిర్ణయించింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ (సీపీడబ్లు్యడీ), ఆర్బీఐ, ఇండియన్ నేవీ, బీఐఎస్, పోస్టల్, కాగ్, ఐగ్నోలకు ఎకరం కోటి రూపాయల చొప్పున భూమి కేటాయించింది. ఎఫ్‌సీఐ, ఎల్ఐసీ, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డు, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ, హెచ్‌పీసీఎల్, సిండికేట్ బ్యాంక్, ఐఓసీఎల్, రైట్స్ సంస్థలకు ఎకరం నాలుగు కోట్లకు కేటాయించింది. అదే సమయంలో విద్యా సంస్థల పేరుతో విట్, ఎస్ఆర్ఎం, బీఆర్ శెట్టి, అమృతా యూనివర్సిటీలకు వందల ఎకరాలను ఎకరం రూ.50 లక్షలకు కట్టబెట్టింది. కేంద్ర సంస్థలకు కేటాయించిన సమయంలోనే వాటికి భూమి కేటాయించినా వెంటనే భూములు అప్పగించేసింది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూమి చూపించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికితోడు ధర కూడా ఊహించని విధంగా నిర్ణయించడంతో కేంద్ర ప్రభుత్వం వాటిని ఇక్కడ ఏర్పాటు చేసే విషయంపై పునరాలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే భూమి కేటాయించినా ఇప్పటివరకూ ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా సీఆర్డీఏకు డబ్బు కట్టలేదు. కార్పొరేట్ సంస్థలకు నామమాత్రపు రేటుకు భూములు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వంలో భాగమైన తమకు అంతకు రెట్టింపు రేటు నిర్ణయించడంపై పలు సంస్థలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు కేటాయించిన భూమిని అప్పగించే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించడం, మొదట చెప్పిన ప్రాంతంలో కాకుండా వేరే చోట భూమిని ఇస్తామని చెబుతుండడంతో ఆ సంస్థలు అసలు ఇప్పుడు అమరావతికి రావడం అంత అవసరమా? అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలిసింది. -
‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకంపై కుట్ర!
సాక్షి, హైదరాబాద్ : ‘విషయ బలం, ఆలోచనలు లేనివారు ప్రధానాంశాన్ని పక్కదారి పట్టించేందుకు బిగ్గరగా అరవడం, సంబంధం లేని అంశాలను తెరపైకి తీసుకురావడం వంటివి చేస్తుంటారు. నేను రాసిన ‘ఎవరి కోసం అమరావతి’ పుస్తకం విషయంలోనూ దురదృష్టవశాత్తూ కొందరు ఇలాంటి కుట్రే పన్ని అత్యంత ప్రధానమైన సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న నాకు అమరావతి గురించి మాట్లాడే అర్హత లేదనే వాదన ఇందులో భాగమే’.. అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. తాను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నప్పటికీ, పుట్టింది, పెరిగింది, చదువుకున్నది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనేనన్నారు. తాను ఎక్కడున్నప్పటికీ తన అనుబంధం ఎప్పటికీ ఏపీతోనే ఉంటుందని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాను రాసిన పుస్తకంలోని వాస్తవ అంశాలను కొందరు జీర్ణించుకోలేకే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఐవైఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో ఉంటున్న తనకు స్థానికత లేదని, అందువల్ల ఏపీ కొత్త రాజధాని గురించి ప్రస్తావించే అర్హత లేదన్నట్లు కొందరు మాట్లాడటం సరికాదన్నారు. ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్‌లోనే ఉందని.. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని అనేక సంస్థలు ఇంకా విభజనకు నోచుకోలేదని ఆయన గుర్తుచేశారు. -
నరేంద్ర మోదీపై తిరుగుబాటు చేయాలి
సాక్షి, విజయవాడ/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తిరుగుబాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. బ్రిటీష్ వారిపై, నిజాంపై పోరాటం చేశామని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపైనా పోరాడాలని ఉద్బోధించారు. ఐకమత్యంగా ఉంటూ న్యాయమైన హక్కులను సాధించుకునే వరకూ పోరాటం కొనసాగించాలని కోరారు. గతంలో ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేసినప్పుడు, తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకూ పోరాడామని అన్నారు. ఇప్పుడు మనం అడిగేది న్యాయమైన కోరికలని, ధర్మ పోరాటం చేస్తున్నా మని పేర్కొన్నారు. హక్కులని సాధించేదాకా వెనుకడుగు వేయబో మన్నారు. ఈ ధర్మ పోరాటంలో మనమే విజయం సాధిస్తామని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రజలందరి సహకారం కావాలన్నారు. జైలుకు పోతామని భయపెడుతున్నారు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రులపై ఉందని చంద్రబాబు తెలిపారు. తాను కేవలం ముఖ్యమంత్రిని మాత్రమేనని, తన బలం ప్రజలేనని అన్నారు. ప్రజలు సహకరిస్తే కొండనైనా ఢీ కొంటానని వ్యాఖ్యా నించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కేంద్ర ప్రభుత్వం చేయడం లేదన్నారు. మన పొట్టకొట్టే అధికారం వారికి(కేంద్రం) ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంతో విభేదిస్తే జైలుకు పోతామని కొందరు భయపెడుతున్నారని, తాను నిప్పులాగా ఉన్నానని, ఎవరికీ భయపడనని చంద్రబాబు తెలిపారు. ఆటోమొబైల్ హబ్‌గా ఏపీ: సీఎం రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దు తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. శనివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆశోక్ లేలాండ్ బస్‌బాడీ బిల్డింగ్ యూనిట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బస్సులను తయారు చేస్తే వాటిని మార్కెటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పరిశ్రమలు రావడం వల్ల మల్లవల్లి గ్రామం మెగా టౌన్‌షిప్‌గా మారు తుందని చెప్పారు. అశోక్ లేలాండ్ ఎండీ, సీఈఓ వినోద్ కె.దాసరి మాట్లాడుతూ... తమ సంస్థ ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. -
అమృత వర్సిటీకి శంకుస్థాపన
మంగళగిరి టౌన్: విలువలతో కూడిన సమాజం నిర్మాణం కోసం అమృత విశ్వవిద్యాలయం రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు కానుండటం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కురగల్లు, యర్రబాలెం గ్రామాల మధ్య నిర్మించనున్న అమృత విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. అమృతానందమయి ట్రస్ట్ పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు అండగా ఉందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రవేశాలు ప్రారంభించాలని కోరారు. రాజధాని ప్రాంతవాసుల మౌలిక సదుపాయాల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, జడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, కలెక్టర్ కోన శశిధర్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, కొచ్చి అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిలో సీఎస్ఐఆర్ ప్రయోగ కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) ప్రయోగ, ప్రదర్శన కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ గిరీశ్ సాహ్నీ, సీనియర్ శాస్త్రవేత్తలు మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్ఐఆర్ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాల్ని, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదించగా.. సీఎం అంగీకారం తెలిపారు. ‘సెంటర్ ఫర్ స్కేలింగ్ అప్ అండ్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ రెలవెంట్ సీఎస్ఐఆర్ టెక్నాలజీస్’ పేరుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో సవివర కార్య ప్రణాళికను సిద్ధం చేసి తీసుకొస్తామని సాహ్ని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ శాశ్వత నిర్మాణం పూర్తయ్యేవరకు వేచి ఉండనక్కర్లేదని, తాత్కాలిక ఏర్పాటు చేసుకుని వెంటనే పని ప్రారంభించాలని సూచించారు. కాగా, బౌద్ధ ఆలయం నిర్మాణానికి అమరావతిలో పదెకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, డిజైన్లు ఇవ్వాలని మంగళవారం తనను కలిసిన థాయిలాండ్ బృందాన్ని కోరారు. రాష్ట్రం నుంచి థాయి ఎయిర్వేస్ సేవలు నడిపేందుకు బృందం ఆసక్తి చూపగా, విజయవాడ నుంచి ప్రారంభించాలని సీఎం సూచించారు. నేడు చంద్రబాబు దుబాయ్ పర్యటన: సీఎం చంద్రబాబు బుధవారం దుబాయ్ పర్యటనకు వెళుతున్నారు. గురువారం అక్కడి పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులతో సమావేశమై.. విశాఖపట్నంలో ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు. -
ప్రైవేట్ రాజధాని!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధికి సింగపూర్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాల్లో ఊహకందని విచిత్రం బహిర్గతమైంది. రాయితీ, అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌పై సంతకాల కోసం ఓ సంస్థ పుట్టుకొచ్చింది. ఆ సంస్థను సింగపూర్ కన్సార్టియం సృష్టించింది. తొలి నుంచి సింగపూర్ కంపెనీలకు దాసోహమైన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పుట్టుకొచ్చిన సంస్థతో ఒప్పందంపై సంతకాలు చేయించుకునేందుకు సిద్ధమైంది. రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో సింగపూర్ ప్రభుత్వంతో జీ టు జీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ డెవలపర్స్‌గా ప్రైవేట్ కంపెనీలైన అసెండాస్, సెమ్‌బ్రిడ్జి, సెమ్బ్కార్ప్లను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మూడు కంపెనీలతో కూడిన కన్సార్టియంను ఒరిజనల్ ప్రాజెక్టు ప్రాంపెనెట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఆ కన్సార్టియంకు స్విస్ చాలెంజ్ పేరుతో స్టార్టప్ ఏరియా 1,691 ఎకరాలను కట్టబెట్టారు. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ ప్రకారం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం వాటా, కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి 42 శాతం వాటా ఉంది. షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్పైన, రాయితీ, అభివృద్ధి ఒప్పందంపైన సింగపూర్ కన్సార్టియం సంతకం చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ కంపెనీలు సంతకాలు చేయబోమని స్పష్టం చేశాయి. ఆ కంపెనీల తరఫున ఒప్పందాలపై సంతకాలు చేయడానికి కొత్తగా సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ పీఈటీ లిమిటెడ్ (ఎస్‌ఏఐహెచ్)ను సృష్టించాయి. తమ తరఫున ఆ కొత్త కంపెనీ సంతకం చేస్తుందని గతేడాది సెప్టెంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. సింగపూర్ కంపెనీలు కోరినట్లే రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తప్పులను హైకోర్టు ఎత్తి చూపినా.. స్విస్ చాలెంజ్ విధానం పేరుతో నామినేషన్‌పై సింగపూర్ కన్సార్టియంకు భూములు కట్టబెట్టడంలో తప్పులను హైకోర్టు ఎత్తి చూపినా ప్రభుత్వం తీరు మారలేదు. స్విస్ చాలెంజ్ విధానంలో తప్పులను సరిచేయకపోగా ఆ తప్పులకు సమర్థించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్ (ఏపీఐడీఈఏ)–2001కి చట్ట సవరణ చేశారు. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలన చేయాల్సిన అవసరం లేదని చట్టాన్ని సవరించారు. ఇప్పుడు కూడా సింగపూర్ కంపెనీలు కోరినట్లు కీలకమైన రాయితీ అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లో మార్పులు చేయడానికి, అలాగే సంతకందారుల మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను మార్చేయడం గమనార్హం. జీవోకు విరుద్ధంగా సంతకాలకు సిద్ధం ఏదైనా పనిచేయడానికి టెండర్లో కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థతోనే సంబంధిత ప్రభుత్వ శాఖ ఒప్పందం చేసుకుంటుంది. అలాగే ఒక సంస్థ నుంచి అప్పు తీసుకుంటే ఆ సంస్థతోనే ఒప్పందం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపెనెంట్గా సింగపూర్ కన్సార్టియం స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనలను సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లోనే రాయితీ, అభివృద్ధి, షేర్ హోల్డింగ్ డాక్యుమెంట్లను కూడా సమర్పించింది. వీటిపై ఆర్థిక శాఖ మంత్రి యనమల నేతృత్వంలోని హైపవర్ కమిటీ సింగపూర్ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరిపింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై నేరుగా టెలిఫోన్లో బేరసారాలు సాగించారు. అనంతరం సింగపూర్ కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా అప్పగిస్తూ గత ఏడాది మే 8న జీవో 179 జారీ చేశారు. అదే జీవోలో ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపనెంట్.. అంటే సింగపూర్ కన్సార్టియం సంస్థలతో రాయితీ అభివృద్ధి, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లు చేసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ జీవోకు విరుద్ధంగా సింగపూర్ కన్సార్టియం కేవలం తొమ్మిది మంది ఉద్యోగులతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఏఐహెచ్తో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదినుంచీ దాసోహమే.. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ), సింగపూర్ కంపెనీలు సంయుక్తంగా అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ (ఏడీపీ) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేశాయి. అయితే సింగపూర్ కంపెనీలు ఇప్పుడు ఏడీపీ స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఉండరాదని, కేవలం సాధారణ ఏడీపీగానే ఉండాలని స్పష్టం చేశాయి. అందుకు కూడా అంగీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీని ప్రకారం రాయితీ, అభివృద్ధి ఒప్పందం సింగపూర్ కంపెనీలకు బదులు ఎస్‌ఏఐహెచ్, సీఆర్డీఏ మధ్య జరగనుంది. అలాగే షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ కూడా ఎస్‌ఏఐహెచ్, ఏడీపీ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్)ల మధ్య జరగనుంది. అయితే ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపనెంట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోకుండా ఆ కంపెనీలు సూచించిన మరో కంపెనీతో ఒప్పందం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని న్యాయ, ఆర్థిక శాఖలు స్పష్టంగా చెప్పాయి. గతంలో జారీ చేసిన జీవో–179కు వ్యతిరేకమని పేర్కొన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. రాయితీ, అభివృద్ధి ఒప్పందం అంటే... రాయితీ, అభివృద్ధి ఒప్పందం అంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియంకు ఇవ్వాల్సిన 1,691 ఎకరాలతో పాటు ఆ కన్సార్టియంకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన నిబంధనలు, చెల్లించాల్సిన పెనాల్టీలు, అలాగే సింగపూర్ కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్న రెవెన్యూ తదితర అంశాలు ఉంటాయి. స్టార్టప్ ఏరియా ద్వారా మూడు దశల్లో సింగపూర్ కన్సార్టియం రూ. 5,768.60 కోట్లు పొందుతుంది. అవే మూడు దశల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.446 కోట్లు మాత్రమే రెవెన్యూ కింద వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం ఏమేమి చేయాలో ఈ ఒప్పందంలో ఉంటుంది. కంపెనీ ఎలా మారుస్తారు?: ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే తొలుత సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జీటూజీ ఒప్పందం చేసుకున్న తరువాత సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించడమే తప్పు. ఇప్పుడు రాయితీ, అభివృద్ధి, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లపై సింగపూర్ కన్సార్టియం సంతకం చేయకుండా మరో ప్రైవేట్ కంపెనీని ఏర్పాటుచేసి ఆ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేయిస్తామనడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉంది. ఈ విధంగా సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాలపై కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సింగపూర్ కంపెనీలు పెట్టిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు పెట్టలేదు. దీనివల్ల భవిష్యత్‌లో సింగపూర్ కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఇది రాష్ట్రానికి నష్టం. స్విస్‌చాలెంజ్ పేరుకు మాత్రమే. ఇప్పటికే నామినేషన్‌పై సింగపూర్ కన్సార్టియంకు 1,691 ఎకరాలను అప్పగించారు. సింగపూర్ కంపెనీల పేరుతో రైతుల భూముల, వారి శ్రమను దోచుకోవడం తప్ప భూములిచ్చిన రైతులకు ఇప్పటివరకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆంధ్రుల రాజధాని అమరావతిని సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తుందని సినిమా చూపించారు. జీ టూ జీ (ప్రభుత్వానికి, ప్రభుత్వానికీ మధ్య) ఒప్పందం అన్నారు. క్రమంగా సింగపూర్ ప్రభుత్వం అదృశ్యమై మూడు ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం ముందుకొచ్చింది. స్విస్ చాలెంజ్ పేరుతో ప్రతిపాదనలు ఇచ్చింది. 1,691 ఎకరాలను వారికి ధారాదత్తం చేసింది మన ప్రభుత్వం. సింగపూర్ వారి షరతులన్నింటికీ తల ఊపింది. రాయితీ, అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లపై ఆ కన్సార్టియం సంతకం చేయాల్సి ఉంది. కానీ, స్క్రీన్ ప్లే మళ్లీ మారింది. కేవలం తొమ్మిది మంది ఉద్యోగులు పనిచేసే ఒక చోటా కంపెనీని కన్సార్టియం ముందుకు తెచ్చింది. ఒప్పంద సంతకాలు ఆ చోటా కంపెనీయే చేస్తుందట. ముసుగు తొలగడంలేదూ?.. వేల మంది రైతులూ, కూలీల చెమట చుక్కలతో తడిసి పునీతమైన బంగారు భూమి బేహారుల క్రీడా స్థలంగా మారబోతోంది. ప్రభుత్వ పెద్దల ధనాశ ఐదు కోట్ల మంది మధుర స్వప్నాన్ని పీడ కలగా మార్చబోతోంది. -
రాజధాని అమరావతిపై కేసులో నేడు తుదితీర్పు