సాక్షి, తాడేపల్లి: శాస్త్రీయ విధానంతోనే రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదాయం అంతా ఒకేచోట కేంద్రీకృతం కావద్దనేది మా అభిమతం అని తెలిపారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. వికేంద్రీకరణపై మాకు స్పష్టత ఉంది. వికేంద్రీకరణ ఎందుకు అవసరమో మేం స్పష్టంగా చెబుతున్నాం. అమరావతిలోనే రాజధాని ఎందుకుండాలో చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు అసహనంతో ఊగిపోతున్నారు. కర్నూలులో ఆయన విన్యాసాలను ప్రజలు చూశారు. చంద్రబాబు తీవ్ర నిస్పృహతో ఉన్నారు. న్యాయరాజధానిపై వైఖరి అడిగితే సమాధానం చెప్పాలి. అంతేకానీ, స్థానిక ప్రజలను బెదిరిస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
కర్నూలు వెళ్లినపుడు న్యాయరాజధానిపై ప్రజలు అడగరా?. ప్రజలు అడిగితే సమాధానం చెప్పకుండా బెదిరిస్తారా?. చంద్రబాబు మాటలతో టీడీపీ అంటే తిట్లు, దూషణలు, బూతులు పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. అన్ని చిట్‌ఫండ్స్ మాదిరిగానే మార్గదర్శిలో తనిఖీలు చేస్తే కక్ష సాధింపు అని గగ్గోలుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపాజిట్లు తీసుకుని డైవర్ట్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేయొద్దా?. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా?' అని ప్రశ్నించారు.
చదవండి: (వెంటిలేటర్లు తీస్తే అంతిమ యాత్రే: స్పీకర్ తమ్మినేని)
Comments
Please login to add a commentAdd a comment