చిరంజీవిని తాను విమర్శించకపోయినా విమర్శించినట్లు చిత్రీకరిస్తున్నారు
సీఎం జగన్‌ను ఎదుర్కొనేందుకు తమ శక్తి సరిపోవడం లేదన్నది వారిద్దరికీ అర్థమైంది
చిరంజీవి అభిమానులు, సామాజికవర్గం మద్దతు కూడగట్టుకోవాలన్న తపన, ఆత్రం వారిలో కన్పిస్తోంది
జనసేన, బీజేపీ ఆత్మాభిమానం వదిలేసి టీడీపీ ముందు సాగిలపడ్డాయి
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తాపత్రయపడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలపై ఆయన స్పందించారు. ‘చిరంజీవిని ఉద్దేశించి నేనేమీ అనలేదు. చిరంజీవి కూటమికి మద్దతిచ్చారు..
దీనిపై మీ అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు అడిగితే, చిరంజీవి కూటమికి మద్దతివ్వడం మంచిదే కానీ.. కూటమితో చిరంజీవే కాదు ఇంకా ఎవ్వరూ కలిసి వచి్చనా ఇబ్బందిలేదని మాత్రమే చెప్పా’.. అని ఆయన గుర్తుచేశారు. చిరంజీవిని తాను విమర్శించకపోయినా విమర్శించినట్లు చిత్రీకరించడం వెనుక ఏముందా అని ఆలోచిస్తే.. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు, పవన్ తమ శక్తి సరిపోదని భావించి, చిరంజీవి అభిమానులు, ఆ సామాజికవర్గం వారి ఓట్లను గంపగుత్తగా తీసుకెళ్లి టీడీపీకి ఎలా వేయించాలా అనే తపన, తాపత్రయం అందులో కని్పస్తున్నాయని మండిపడ్డారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..
టీడీపీ ముందు సాగిలబడ్డ జనసేన, బీజేపీ..
► బీజేపీ, జనసేనలు 2014 ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక.. ప్రజలను రాచి రంపాన పెట్టాయి. జనసేన, బీజేపీ ఆత్మాభిమానం వదిలేసి బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా ఇప్పుడు మళ్లీ టీడీపీ ముందు సాగిలపడ్డాయి. ఘోరంగా ఓడిపోతున్నామని తెలిసే బాబు, పవన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు.
► డ్వాక్రా మహిళల గురించి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తోంది. వారిని మోసం చేసిన చరిత్ర ఆయనది. 2014లో రుణమాఫీ చేస్తానని చెప్పి వారిని మోసంచేశారు.
► అసలు చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా? ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎక్కడున్నాడు? చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?
► 2014లో చంద్రబాబు అలవికాని హామీలిచ్చి మోసంచేశారు. మేనిఫెస్టోను సైతం టీడీపీ వెబ్‌సైట్ నుంచి తొలగించారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసంచేసింది ఎవరు? కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతోందనే ఆందోళన చంద్రబాబు, పవన్‌లో కని్పస్తోంది.
ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ..
► చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ ఇచి్చన నోటీసుకు స్పందించకపోగా బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన మాటలు చదివి వినిపించాలని అనుకున్నా. కానీ,
సిగ్గేస్తోంది.
► మేం చంద్రబాబు కుటుంబాల గురించి మాట్లాడితే చంద్రబాబు తలెత్తుకుని తిరగలేరు. ఎన్నికలంటే ఇచి్చన హామీలు చేసిన పనుల గురించి మాట్లాడాలి. ఎన్నికలంటే ప్రజలకు సేవ ఎలా చేయాలి.. వారితో ఎలా మమేకం అవ్వాలి.. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి.. పేదల కోసం సంక్షేమం ఎలా అందించాలి అనే అంశాలపై దృష్టిసారించాలి. కుటుంబాల గురించి కాదన్నది చంద్రబాబు గుర్తిస్తే మంచిది.
► ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ. వాళ్ల పనివాళ్లు చేస్తారు. కక్ష సాధింపు చర్యలకు ఎన్నికల కమిషన్ పాల్పడుతుందని మేం భావించడంలేదు. అధికారుల బదిలీల గురించి మేం ఏమి మాట్లాడం.
► ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ అమల్లోకి వచి్చనప్పటి నుంచి సీఎం జగన్ ప్రజల మధ్యే ఉంటూ గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ మద్దతిమ్మని అడుగుతున్నారు. కానీ, వ్యవస్థలను అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ చూస్తోంది.
► 2019లో ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి మరీ బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు, పదేపదే తప్పుడు ఫిర్యాదులు చేసి ఎన్నికల కమిషన్ అధికారుల్ని బెదిరిస్తున్నారు.
► ఇక పెన్షన్లు పంపిణీ జరగకుండా అడ్డుకుంది టీడీపీనే అని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. మళ్లీ ఇప్పుడు ఆలస్యం కాకుండా ఒకటినే పెన్షన్లు పంపిణీ చేయాలని గొడవ చేస్తున్నారు.
► ఇక వలంటీర్లపై ఎల్వీ సుబ్రమణ్యం, నిమ్మగడ్డ రమేష్లతో బాబు ఫిర్యాదులు ఇప్పించారు. వలంటీర్లను దూషించిన చంద్రబాబు నేడు తాను అధికారంలోకి వస్తే వారికి రూ.10వేలిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment