
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలతో పాటు రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో జరగబోయే తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
ప్రత్యక్ష ప్రసారం కోసం తగిన మార్గదర్శకాలు రూపొందించేలా రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన ఎల్‌ఎల్‌ఎం విద్యార్థిని వేమూరు లీలాకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పులు ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. న్యాయస్థానాలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ప్రత్యక్ష ప్రసారం ఎంతో ఉపయోగపడుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment