అమరావతి అభివృద్ధికి రూ.41,225 కోట్లు
హడ్కో, ప్రపంచ బ్యాంకుల నుంచి రుణానికి సీఆర్‌డీఏ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి నీలి-హరిత (బ్లూ-గ్రీన్ సిటీ) నగరంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి రూ.41,225.32 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ ప్రాథమికంగా అంచనా వేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల స్థాయిని పెంచేందుకు రూ.2,537 కోట్ల వ్యయం అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు రూ.25,520 కోట్ల బడ్జెట్ నిధులు అవసరం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ప్రపంచ బ్యాంకు, హడ్కో నుంచి తీసుకున్న రుణాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను వ్యయం చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4,841 కోట్లు, హడ్కో నుంచి రూ.7,500 కోట్ల రుణం తీసుకోనున్నట్లు తెలిపింది.