సాక్షి, ఢిల్లీ: అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
చదవండి: బీజేపీకి పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడుస్తారా?
‘‘హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా కోర్టు.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.
చదవండి: సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ.. పిటిషన్‌లో కీలక అంశాలివే..
Comments
Please login to add a commentAdd a comment