బెజవాడలో కరోనాపై టాస్క్‌‌ఫోర్స్‌ మీటింగ్‌ | Panchayati Raj Minister Rama Chandra Reddy On Corona Control Actions | Sakshi
Sakshi News home page

‘జూన్‌ నెలాఖరికీ టార్గెట్‌ పూర్తి చేస్తాం’

Published Tue, May 12 2020 3:06 PM | Last Updated on Tue, May 12 2020 3:35 PM

Panchayati Raj Minister Rama Chandra Reddy On Corona Control Actions - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కరోనా కేసులపై  టాస్క్‌ ఫోర్స్ మీటింగ్ జరిగిందని పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా కట్టడికి రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీటింగ్ లో చర్చించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రత్యేకంగా డాక్టర్లు ను నియమించినట్లు చెప్పారు. స్వచ్చందంగా పని చెయ్యడానికి చాలా మంది డాక్టర్లు ముందుకు వచ్చారని ప్రశంసించారు. జిల్లా లో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 
రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి తగ్గింది కాబట్టి మామిడికి కనీస మద్దతు ధర కన్న మార్కెట్లో ఎక్కువే ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. (కర్నూలు ప్రజలకు భారీ ఊరట)

కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటే దాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుందని వెల్లడించారు. కృష్ణాజిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇప్పటి వరకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, జూన్ నెలాఖరీకి  తమ టార్గెట్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో కరోనా నియంత్రణకు పోలీసులు , డాక్టర్లు,పారిశుద్య కార్మికులు ,ఇతర అధికారులు చాలా కష్ణపడి పనిచేస్తోన్నారని అభినందించారు. అందరి కృషి వల్లే జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని కొనియాడారు.ప్రజలందరు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు. (‘సామాజిక దూరం అంటే చంద్రబాబు 600 కి.మీలు వెళ్లారు’!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement