రాజ్‌భవన్‌కు చేరుకున్న ఏపీ గవర్నర్‌ | Governor Biswabhusan Harichandan reached Raj Bhavan | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌కు చేరుకున్న ఏపీ గవర్నర్‌

Published Fri, Dec 10 2021 4:38 AM | Last Updated on Fri, Dec 10 2021 8:27 AM

Governor Biswabhusan Harichandan reached Raj Bhavan - Sakshi

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి రాజ్‌భవన్‌కు చేరుకున్న గవర్నర్‌ దంపతులు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కొత్త వేరియంట్లపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. కరోనా తదనంతర సమస్యల నుంచి కోలుకున్న గవర్నర్‌ గురువారం విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి వచ్చిన గవర్నర్‌ దంపతులకు రాజ్‌భవన్‌ వద్ద అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక వైద్యుల బృందం గవర్నర్‌ దంపతులు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.  

వారి సేవలు చిరస్మరణీయం 
తమిళనాడులో హెలికాఫ్టర్‌ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన లాన్స్‌ నాయక్‌ బి.సాయితేజ, ఒడిశాకు చెందిన జూనియర్‌ వారంట్‌ ఆఫీసర్‌ రాణా ప్రతాప్‌ దాస్‌ దుర్మరణం చెందడంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం వీరు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. లాన్స్‌ నాయక్‌ సాయితేజ, జూనియర్‌ వారంట్‌ ఆఫీసర్‌ రాణా ప్రతాప్‌ దాస్‌ కుటుంబ సభ్యులకు గవర్నర్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్‌వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement