
సాక్షి, తాడేపల్లి: వైఎస్ఆర్ బీమా పథకాన్ని జులై1 నుంచి కొత్త మార్పులతో అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ సాయం అందిస్తుందని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18-50ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష, 18-70ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణస్తే రూ. 5లక్షల సాయం అందజేయాలని ఆదేశించారు.
ఇక జులై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జులై 1లోగా క్లెయిమ్‌లన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ అన్నారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం!
Comments
Please login to add a commentAdd a comment