
పుంగనూరు (చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళిని బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 140 స్థానాలు లభిస్తాయని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు బైబై చెప్పి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టారని పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం పుంగనూరులో పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారన్నారు. రాష్ట్రంలో 140 స్థానాలకు పైగా వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ మీద ఉన్న ప్రేమను, నమ్మకాన్ని చాటుకున్నారని, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదల, కృషితో చేపట్టిన ఎన్నికల సంగ్రామానికి రాష్ట్ర ప్రజలు అండగా నిలిచారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment