సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం డ్రికింగ్ వాటర్ కార్పొరేషన్‌తో నిధులు తెచ్చి వాటిని పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని పంచాయతీ రాజ్, గ్రామిణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో తాగు నీరు కోసం కార్పొరేషన్ పెట్టి రూ.17,730 కోట్లకు టెండర్లు పిలిచారన్నారు. ఎన్నికల ముందు ఆగమేఘాల మీద ఏడు కన్సెల్టెన్సీలకు ఇచ్చారని ఆరోపించారు. ఇదంతా కమీషన్ల కోసమే చేశారన్నారు. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి తిరిగి కొత్తగా డీపీఆర్‌లను సిద్ధం చేసి ముందకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా డీపీఆర్‌లను తయారు చేసి అన్ని గ్రామాలకు దశల వారిగా నీరు అందిస్తామని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment