
విశాఖ: పాడేరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయాలు, ఆర్‌బీకేల నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజురు చేస్తామని మంత్రి అవంతి పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రోడ్డు,విద్యుత్,తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.
అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment