విశాఖపట్నం: ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యంతో ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం జిల్లాలో.. మొత్తంగా 89 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయని, వాటిలో 69 పాఠశాలల యాజమాన్యాలు విలీనం చేసేందుకు ముందుకొచ్చాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడి లేదని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా, విద్యార్థుల చదువులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.
చదవండి: ‘ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పి?’
Comments
Please login to add a commentAdd a comment