Aided educational institution
-
ఎయిడెడ్ పాఠశాలలపై కొరడా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని గత మూడేళ్లుగా చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది. 2024–25 విద్యా సంవత్సరం యూడైస్ ఆధారంగా 40 కంటే ఎక్కువ మంది విద్యార్థులను పెంచుకోలేని ఎయిడెడ్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. అలాంటి స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకుని ఉంటే నివేదిక పంపాలని కోరింది. దీంతోపాటు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించేందుకు మండల స్థాయిలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇందులో డీవైఈవో, ఎంఈవో, సీనియర్ హెచ్ఎం సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే యూడైస్, వాస్తవ హాజరులో తేడా ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఎయిడెడ్ పాఠశాలల్లోని ప్రవేశ రిజిస్టర్లు, విద్యార్థుల రికార్డులను ఒకటికి రెండుసార్లు త్రీమెన్ కమిటీ పరిశీలించనుంది. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు పాఠశాలలు, మండలాలు, జిల్లాల వారీగా వాస్తవ హాజరు నమోదు ఎంత అనేది నిర్ధారించి రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు నివేదిక అందిస్తారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 595 ఎయిడెడ్ పాఠశాలలు కొనసాగుతుండగా, 3,010 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 40 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 126 కాగా, అసలు విద్యార్థులే లేకుండా 80 స్కూళ్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూళ్లపై విద్యాశాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ‘ఎయిడెడ్ టీచర్లకు న్యాయం చేయాలి’ఎయిడెడ్ ఉపాధ్యాయులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు బదలాయించి న్యాయం చేయాలని, మొత్తం ఎయిడెడ్ సెక్టార్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఎయిడెడ్ స్కూళ్లల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి కోరారు. -
CM Yogi Adityanath: యోగి ఔర్ ఏక్.. మదర్సాలకు షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు మరో కీలకమైన నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మదర్సాలకు ఎటువంటి నిధులు ఇవ్వకూడదన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఆయన కేబినెట్. దీంతో యూపీలోని చాలావరకు మదర్సాలకు ప్రభుత్వం నుంచి ఇకపై రూపాయి అందదు. మదర్సాలు అన్నీ కూడా జాతీయ గీతం ఆలపించడాన్ని ఇటీవలే యోగి సర్కారు తప్పనిసరి చేసింది. మదర్సాల్లో తరగతులు ఆరంభానికి ముందు విద్యార్థులు, టీచర్లు అందరూ జాతీయగీతం ఆలపించాలంటూ మైనారిటీ శాఖ ఈ నెల 12న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇచ్చిన వారం వ్యవధిలోనే.. కొత్త మదర్సాలను ప్రభుత్వ నిధుల సాయం నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం నిధుల సాయం నుంచి కొత్త సంస్థలనే మినహాయించారు. యూపీ సర్కారు మదర్సాల ఆధునికీకరణ పథకానికి గత బడ్జెట్ లో రూ.479 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులతో మదర్సాలను ఆధునికీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేలకుపైగానే మదర్సాలు ఉన్నాయి. కానీ, వాటిలో 558 మదర్సాలకు మాత్రమే ప్రభుత్వం నిధులను అందించనుంది. దీంతో మిగిలిన వేలాది మదర్సాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల సాయం అందదు. చదవండి: కశ్మీరీ ఫైల్స్.. రక్తపు కూడు సీన్లు ఏంటసలు? -
డిగ్రీ కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విలీనమైన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాల చెల్లింపు, ఇతర సర్దుబాటు చర్యల కోసం ప్రభుత్వం ఆయా కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం జీవో 17 విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చేసిన విధాన నిర్ణయం ప్రకారం ప్రభుత్వంలో తమ సిబ్బందిని విలీనం చేసేందుకు 125 ఎయిడెడ్ కాలేజీల యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. వీరిలో 895 మంది బోధన సిబ్బంది, 1,120 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. బోధన సిబ్బందిలో 864 మందిని వివిధ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న క్లియర్ వేకెన్సీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. మిగతా 31 మందిని కొత్తగా మంజూరుచేసిన కాలేజీల్లోకి పంపారు. అయితే అక్కడ ఇంకా మంజూరు కాని పోస్టుల్లో వారిని నియమించారు. అలాగే ప్రభుత్వంలో విలీనమైన 23 మంది ప్రిన్సిపాళ్లకు ఖాళీలు లేనందున ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. బోధనేతర సిబ్బందిలో 921 మందిని క్లియర్ వేకెన్సీల్లో సర్దుబాటు చేశారు. బోధనేతర సిబ్బందిలో మిగిలిన 199 మందితోపాటు 23 మంది ప్రిన్సిపాళ్లు, 31 మంది టీచింగ్ స్టాఫ్ కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు అవసరమని కాలేజీ విద్యా కమిషనర్ ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం ఆమేరకు పోస్టులు మంజూరు చేసింది. -
జగన్ ప్రభుత్వంలోనే ఎయిడెడ్‌కు జీవం
సాక్షి, అమరావతి: ఎయిడెడ్ విద్యాసంస్థలకు పూర్వవైభవం తీసుకొచ్చే విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో మరోసారి తేటతెల్లమైంది. అలాగే పట్టణ, గ్రామీణ సంస్థలు, సహకార సంస్థలకు ఆర్థిక సాయం, విద్యుత్ రాయితీల విషయంలోనూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే అత్యధిక మేలు జరిగింది. అన్ని రకాల ఎయిడెడ్ విద్యా సంస్థలకు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ. 9,600 కోట్లు గ్రాంటుగా ఇవ్వగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో రూ. 10,048 కోట్లు గ్రాంటుగా ఇచ్చినట్లు కాగ్ పేర్కొంది. అధికారంలో ఉండగా ఖాళీల భర్తీలు చేపట్టకుండా, సరైన పర్యవేక్షణ చేయకుండా ఎయిడెడ్ సంస్థలను కునారిల్లేలా చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే బురద జల్లుతుండడం విడ్డూరంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఒక్క అమ్మ ఒడి పథకం కోసం 2019–20 ఆర్థిక ఏడాదిలోనే రూ. 6,349.47 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఇక విద్యుత్ రాయితీలను చంద్రబాబు ప్రభుత్వం భారీగా కుదించేసినట్లు నివేదికలో తేలింది. సీఎం జగన్ వచ్చిన తర్వాత విద్యుత్ రాయితీల కోసం ఏకంగా నాలుగున్నర రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు. 2019–20లో వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ కోసమే రూ. 4,919.84 కోట్లను వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. ఇక సహకార సంస్థలకు గత ప్రభుత్వం కేవలం రూ. 543 కోట్లు కేటాయించి పూర్తిగా నిర్వీర్యం చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ. 9,487 కోట్లు గ్రాంటుగా ఇచ్చినట్లు వెల్లడైంది. -
పదే పదే చెబితే అబద్ధం నిజమవుతుందా..?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలు, భోదనా సిబ్బంది, విద్యార్థులకు మంచి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు దాన్ని వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం అన్నట్లుగా.. ఏదో అన్యాయం చేస్తున్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 వంటి మీడియా బలం ఉంది కాబట్టి.. ఒక అబద్ధాన్ని పదే పదే వాటితో చెప్పించి.. అదే నిజం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనసభలో శుక్రవారం విద్యారంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏం చెప్పారంటే.. గతంలో ఆస్తిపాస్తులు బాగా ఉన్న వారు ఛారిటీ కింద తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే లక్ష్యంతో భవనాలు నిర్మించి, వాటిలో పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. వాటికి బోధన సిబ్బందిని ఇస్తూ ప్రభుత్వమూ సహకరిస్తూ వచ్చింది. కాలక్రమంలో భవనాలు పాతబడి శిథిలావస్థకు చేరుకున్నాయి. 25 ఏళ్లుగా ఎవరైనా రిటైరైతే.. వారి స్థానాలను భర్తీ చేయడం లేదు. స్కూళ్లు, కాలేజీలు నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయింది. ఒక వైపు ఖర్చులు పెరగడం, మరోవైపు ఆదాయం లేని పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు నిర్వీర్యం అయిపోయాయి. తమను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవాలని ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధనా సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎయిడెడ్ విద్యా సంస్థల ఏర్పాటు వెనక ఉన్న ఉద్దేశం నెరవేరేలా ఆప్షన్లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాల అంగీకారంతోనే.. నడపలేని పరిస్థితిలో ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి అప్పగిస్తే వారి పేరే పెట్టి, శిథిలావస్థలో ఉన్న ఆ భవనాలను నాడు–నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసి, విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీ చేసి, ఆ విద్యా సంస్థల స్థాపన లక్ష్యాలను చేరుకునేందుకు సహాయంగా నిలుస్తుంది. తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్ టీచర్లు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వారి డిమాండ్‌ను కూడా పరిగణలోకి తీసుకుని.. వారిని సరెండర్ చేసి ప్రైవేటు సంస్థగా యాజమాన్యాలు నడుపుకోవచ్చు. n లేదా ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు. ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదు. ఇప్పటికే ఎవరైనా ప్రభుత్వానికి అప్పగిస్తూ నిర్ణయించినా, దాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. తప్పును సరిదిద్ది మంచి చేయాలని సంకల్పిస్తే.. దాన్ని కూడా వక్రీకరించి దుర్మార్గంగా రాజకీయాలు చేస్తే, ఏ విధంగా రాష్ట్రం బాగు పడుతుందో ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను. -
‘ఎయిడెడ్’ను భ్రష్టుపట్టించిందే చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎయిడెడ్ విద్యా సంస్థలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలను టీడీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చకు అనుమతివ్వాలంటూ టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రోటెం చైర్మన్ విఠపు బాలసుబ్రమణ్యం తిరస్కరించడంతో వారు బాయ్‌కాట్ చేశారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ఎయిడెడ్ విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా నిషేధం విధించారని.. వీటి అసలు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయం చేసి లబ్ధిపొందాలని టీడీపీ చూస్తోందని బొత్స మండిపడ్డారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన విజయనగరం మహారాజ ఎయిడెడ్ కళాశాలను కూడా నిర్వహించలేమని గతంలో టీడీపీ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు లేఖ ఇచ్చిన విషయాన్ని సభలో మంత్రి ప్రస్తావించారు. ఇలా అనేకమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వినతుల మేరకే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు కోరుకున్నట్లే చేసేలా వాటికి అవకాశమిచ్చామని, విద్యార్థుల మేలుకోసమే ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. విద్యార్థులకు సీఎం అన్యాయం చేయరు మరో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43 లక్షల మంది విద్యార్థుల మేలు కోసం తపనపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్న సీఎం వైఎస్ జగన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని మూడు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేయబోరని స్పష్టంచేశారు. వీటిని గాడిలో పెట్టి విద్యార్థులకు మరింత మేలు చేసేలా తీసుకుంటున్న చర్యలకు మనమంతా మద్దతుగా నిలవాలన్నారు. ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, ఐ. వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి కూడా మాట్లాడారు. అంతకుముందు.. మాజీ ఎమ్మెల్సీ వల్లభనేని కమలకుమారి మృతికి సంతాపం తెలుపుతూ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
అపోహలు వద్దు.. ‘ఎయిడెడ్’ అప్పగింత పూర్తిగా స్వచ్ఛందం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పిస్తుందని గుర్తు చేశారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయొచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని మరోసారి ప్రస్తావించారు. కాగా విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. చదవండి: ‘ఎయిడెడ్’కు వ్యతిరేకం కాదు ఈ సమావేశంలో నూతన విద్యా విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్ విద్యాసంస్థలు విలీనం చేస్తే.. వారి పేర్లు అలాగే కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. స్వతంత్రంగా నడుపుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే తమ ఉద్దేశమని, ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలు కూడా తగవని స్పష్టం చేశారు. చదవండి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా -
ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు
గుంటూరు ఎడ్యుకేషన్: ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల అధ్యాపక సంఘం (ఆక్టా) హితవు పలికింది. శనివారం గుంటూరులో ఆక్టా ముఖ్య సలహాదారుడు కె.సాంబిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకే ప్రభుత్వం విలీన ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కొన్ని కళాశాలలు ఆస్తులతో సహా విద్యా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడ్డాయని పేర్కొన్నారు. ఆయా విద్యా సంస్థలను వాటి పేర్లతోనే నడుపుతామని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడం తగదన్నారు. అనంతపురంలో జరిగిన ఘటనలో ప్రభుత్వ తప్పిదం లేదన్నారు. విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. వారిపై ఫీజుల భారం ఉండదన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. విలీనం చేయడం ఇష్టం లేని యాజమాన్యాలు.. విద్యా సంస్థలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని నాలుగో ఆప్షన్ ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆక్టా రాష్ట్ర అధ్యక్షుడు కె.మోహనరావు మాట్లాడుతూ.. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టకుండా 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం వల్లే ఎయిడెడ్ విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రధాన కార్యదర్శి రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎయిడెడ్ విషయంలో ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం 4వ ఆప్షన్ కూడా ఇచ్చినందున.. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది యాజమాన్యాలే అని స్పష్టం చేశారు. సమావేశంలో ఆక్టా రాష్ట్ర నాయకులు కె.మోజెస్, రమేష్ పాల్గొన్నారు. -
ఎయిడెడ్‌ను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి.. వాటిని నిర్వీర్యం చేసిన ఘనుడు చంద్రబాబేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఎలాంటి నియామకాలు చేపట్టడానికి వీలు లేకుండా ఖాళీల భర్తీని తిరస్కరిస్తూ 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విద్యార్థి యూనియన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నత్ హుస్సేన్‌తో పాటు 200 మంది టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, సభ్యులు వైఎస్సార్సీపీలో చేరారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వారిని లేళ్ల అప్పిరెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న ప్రయోజనాలను తెలుసుకోవాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, విద్యా సంస్థలను అభివృద్ధి చేయడమే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు టీడీపీ నేతల ట్రాప్‌లో పడవద్దని కోరారు. ప్రభుత్వంలో విలీనం వల్ల ఫీజులు పెరుగుతాయంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇష్టానుసారం ఫీజులు పెంచేందుకు వీలులేదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు కూడా ఆగకూడదని, అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, నాడు–నేడు.. ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌కు మద్దతుగా నిలవాలని ప్రజల్ని కోరారు. టీఎన్ఎస్ఎఫ్ నేత జన్నత్ మాట్లాడుతూ.. విద్యార్థులు, విద్యా సంస్థల అభివృద్ధి కోసం సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నారాయణమూర్తి, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యా సంస్థలకు పునరాలోచనకి అవకాశమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎయిడెడ్ విద్యాసంస్దల విలీనంపై నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ► మొదటి ఆప్షన్‌గా ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులతో సహా ఎయిడెడ్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులని, స్టాఫ్ ని పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించడం ►రెండవ ఆప్షన్‌గా విద్యాసంస్థల ఆస్థులు కాకుండా కేవలం మంజూరు అయిన ఉపాద్యాయ పోస్టులని, స్టాఫ్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించడం ► మూడవ ఆప్షన్‌గా మొదటి రెండు ఆప్షన్లకు వ్యతిరేకంగా పూర్తిగా ప్రైవేట్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగించడం ► నాలుగవ ఆప్షన్‌గా మొదటి, రెండు ఆప్షన్లలో ఇప్పటికే ఎంచుకుని ప్రభుత్వానికి విలీనం చేయడానికి అంగీకరించిన విద్యాసంస్థలకి పునరాలోచన కల్పిస్తూ విలీనంపై అంగీకారానికి వెనక్కి తీసుకుని పూర్తిగా ఎయిడెడ్ విద్యాసంస్థగా నడుపుకోవడానికి అవకాశం ఇచ్చింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2249 ఎయిడెడ్ విద్యాసంస్థలలో 68.78% మొదటి రెండు ఆప్షన్లకు స్వచ్చందంగా అంగీకరించాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. తాజాగా మరోసారి విలీనానికి అంగీకరించిన ఎయిడెడ్ విద్యా సంస్ధలు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే వెసులు బాటు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీలైనంత త్వరగా ఎయిడెడ్ విలీన ప్రక్రియ ముగించడానికి పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, సాంకేతిక శాఖ, ఇంటర్ బోర్డులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఎయిడెడ్‌పై చంద్రబాబు ఆందోళనలు విడ్డూరం
సాక్షి, అమరావతి: ఎయిడెడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయబోనని ఉత్తర్వులు ఇచ్చిన ఘనుడు చంద్రబాబేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఈరోజు అదే చంద్రబాబు ఆందోళనలు చేయడం విడ్డూరమని మండిపడ్డారు. ఉత్తుర్వులు ఇచ్చేటప్పుడు బాబుకు బుద్ధి ఏమైందని, ఆయన హయాంలో చాలా ఘోరాలు జరిగాయని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సజ్జల మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్ధల్లో టీచర్లు సరిపడా లేనందువల్ల వాటిలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని, యాజమాన్యాలు వాటిని నడపలేకపోతున్నాయని తెలిపారు. ఆ సంస్థలను, టీచర్లను స్వచ్ఛందంగా అప్పగిస్తే ప్రభుత్వం నడుపుతుందని, లేదా టీచర్లను సరెండర్ చేసి మీరే విద్యా సంస్థలను నడుపుకోవాలని ఓ విధానాన్ని తెచ్చినట్లు తెలిపారు. ఇందులో బలవంతం లేదు అని కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న చర్యలతో రానున్న ఐదు, పదేళ్లల్లో మన రాష్ట్రం హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పారు. ఫీజుల నియంత్రణకు, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం జరుగుతున్న మహా విద్యా యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. అనంతపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఎయిడెడ్ విద్యా సంస్థలో వాళ్లు గొడవ చేస్తే చంద్రబాబు కొడుకు లోకేశ్ అక్కడకు వెళ్లి కారుకూతలు కూస్తున్నారని అన్నారు. పేద విద్యార్థులు చదువుకోవడం ఎలా అని లోకేశ్ అంటున్నాడని, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తోన్న విషయం గుర్తిస్తే మంచిదని చెప్పారు. చిన్న ఘటనను వారే సృష్టించి, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. వారు చెబుతున్న కాలేజీని సరెండర్ చేయాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. స్వచ్ఛందంగా వచ్చే వారి కాలేజీలనే ప్రభుత్వం తీసుకుంటుందని, వెనక్కి తీసుకుంటామన్నా తిరిగి ఇచ్చేస్తుందని తెలిపారు. పదవి పోయిన నిస్పృహతో లోకేశ్ పచ్చమూకను వెంటేసుకొని అబద్ధాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ, పచ్చ మీడియా విష ప్రచారాన్ని అందరూ ప్రశ్నించాలని కోరారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఆశయాల కొనసాగింపులో భాగంగా సీఎం జగన్ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్, పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ పాల్గొన్నారు. -
‘ఎయిడెడ్’ అప్పగింత స్వచ్ఛందమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వాల నిర్వాకం కారణంగా నిర్వీర్యమైన ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు అత్యధికుల నుంచి మద్దతు లభిస్తోంది. వాస్తవానికి అత్యధిక శాతం సంస్థలు పూర్తిగా అధ్వాన ప్రమాణాలతో కునారిల్లాయి. వీటిలో చదివే విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవు. టీచర్లు, అధ్యాపకులు లేక సరైన బోధన కూడా అందడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అప్పగించే విద్యా సంస్థలను ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నది లక్ష్యం. అయితే తెలుగుదేశం, కొన్ని విపక్ష పార్టీలు ఈ విషయాన్ని వక్రీకరిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను రెచ్చగొడుతుండటం వెనుక వారి రాజకీయ స్వార్థమే తప్ప మరేమీ లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిపుణుల కమిటీ నివేదిక మేరకే.. ► ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం ఎక్కడా ఏకపక్షంగా ముందుకు వెళ్లలేదు. ప్రభుత్వం ఈ విద్యా సంస్థలపై అధ్యయనానికి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ రత్నకుమారి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ► ప్రొఫెసర్ డబ్ల్యూ రాజేంద్ర, ప్రొఫెసర్ గొల్ల జ్ఞానమణి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య, ఇంటర్ విద్య, కాలేజీ విద్య కమిషనర్లను సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. ► ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పెద్ద ఎత్తున కొత్త కోర్సులతో అందుబాటులోకి వచ్చినందున ఎయిడెడ్ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు బాగా తగ్గిపోయాయి. 400కు పైగా ఎయిడెడ్ స్కూళ్లలో ఒక్క విద్యార్థీ లేడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక వంటి పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతోంది. ► ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏటా రూ.1,226.01 కోట్లు వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను కొనసాగించనవసరం లేదని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ సూచనల మేరకు ప్రభుత్వం అన్ని వివరాలతో సమగ్రంగా ఒక జీవో జారీ చేసింది. ఇలా చేయడం ఏ విధంగా తప్పవుతుంది? ► ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్నందున నిబంధనల మేరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. ఆయా సంస్థలను దాతలు ఏ లక్ష్యం మేరకు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం కోసమే సంస్థల ఆస్తులను వినియోగించాలి. ► నిబంధనల మేరకు నడపలేకపోతే తమ సంస్థ కమిటీ అభీష్టం మేరకు సంస్థలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించవచ్చు. లేదా సంస్థలోని ఎయిడెడ్ సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించి, పూర్తి స్థాయి ప్రయివేటు విద్యా సంస్థగా కొనసాగవచ్చు. లేదా ప్రభుత్వ నిబంధనల మేరకు యధాతథంగా కొనసాగవచ్చు. విద్యా సంస్థలు, అధ్యాపకుల అంగీకారం ► రాష్ట్రంలో 2,249 ఎయిడెడ్ విద్యా సంస్థలుండగా అందులో 1,446 సంస్థలు సిబ్బందిని అప్పగించేందుకు అంగీకరించాయి. 101 సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వ పరిధిలో చేర్చేందుకు సుముఖత వ్యక్తపరిచాయి. 702 సంస్థలు అంగీకారం చెప్పకుండా యధాతథంగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నాయి. ► సిబ్బంది కూడా ప్రభుత్వంలో కలవడం ద్వారా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే తమకు అన్ని సదుపాయాలు అమలవుతాయని విలీనానికి ముందుకు వచ్చారు. ► విలీనానికి ఆప్షన్లు ఇచ్చిన సంస్థలు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తే దానికీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ► ఎయిడెడ్ సంస్థలు, సిబ్బంది విలీన ప్రక్రియలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు నుంచి పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ఆయా సంస్థలకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను మ్యాపింగ్ చేసి వారిని అందులో చేర్చేలా ప్రతి స్కూలుకూ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ► ఒకవేళ నిర్ణీత దూరంలో ప్రభుత్వ స్కూలు అందుబాటులో లేకుంటే ఆ ఎయిడెడ్ స్కూలు భవనంలోనే ప్రభుత్వ పరంగా పాఠశాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అందుకు అవకాశం లేని చోట భవనాలను అద్దెకు తీసుకొని పాఠశాల నెలకొల్పేలా ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు విద్యార్థుల చేరికలూ సాఫీగా సాగేలా చేశారు. తల్లిదండ్రులను సంప్రదించి వారికి నచ్చిన స్కూలులో పిల్లలను చేర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫీజుల భారం లేనే లేదు ► ఎయిడెడ్ విద్యా సంస్థలు, సిబ్బంది ప్రభుత్వంలో విలీనంతో ఫీజులు పెరుగుతాయని తెలుగుదేశం, ఇతర పార్టీలు చేస్తున్న వాదన కేవలం దుష్ప్రచారమే. ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలుగా కొనసాగినా, అవి ఇష్టానుసారం ఫీజులు పెంచేందుకు వీలులేదు. ► పలు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఎయిడెడ్ సెక్షన్లతో పాటు అన్ ఎయిడెడ్ సెక్షన్లు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అన్ ఎయిడెడ్ సెక్షన్ల కోర్సుల ఫీజులను ప్రైవేటు విద్యా సంస్థలకు మాదిరిగానే రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్ణయిస్తుంది. ► ప్రస్తుతం 2020–21 నుంచి 2022–23 వరకు ఫీజులు ఖరారయ్యాయి. ఈ ఫీజులకు మించి ఏ విద్యా సంస్థ కూడా అదనంగా వసూలు చేయడానికి వీల్లేదు. ఈ ఫీజుల భారం కూడా విద్యార్థులపై పడకుండా ప్రభుత్వమే వాటిని జగనన్న విద్యాదీవెన కింద పూర్తిగా రీయింబర్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజుల భారం అనే ప్రసక్తే ఎక్కడా ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ► వాస్తవానికి ఎయిడెడ్ విద్యా సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాటిని నిర్వీర్యం చేసింది చంద్రబాబునాయుడే. ఈ విద్యా సంస్థల్లో ఎలాంటి నియామకాలూ చేపట్టడానికి వీల్లేకుండా ఖాళీల భర్తీని తిరస్కరిస్తూ 1999 డిసెంబర్ 17వ తేదీన ఆయన ఉత్తర్వులు జారీ చేయించారు. ఆ తర్వాత 2004, 2017లోనూ అవే ఆదేశాలు జారీ చేయించారు. ఇది చంద్రబాబు నిర్వాకమే ఎయిడెడ్ వ్యవస్థ కుప్పకూలడానికి గతంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణం. నియామకాలు నిలిపివేయించారు. ఇతర సదుపాయాలకు ఇచ్చే నిధులను ఆపేశారు. తనకు సంబంధించిన నారాయణ తదితర కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా ఎయిడెడ్‌లో టీచర్లు లేక విద్యార్థుల చేరికలూ తగ్గిపోయాయి. – శివశంకర్, విద్యావేత్త ఎక్కడ బలవంతం ఉంది? ప్రభుత్వం మా విద్యా సంస్థల విలీనానికి ఎక్కడా ఒత్తిడి చేయలేదు. ఉన్నత ప్రమాణాలతో కొనసాగిస్తామనుకుంటే మీరే నిర్వహించుకోండి.. లేదంటే ప్రభుత్వానికి అప్పగిస్తే అభివృద్ధి చేసి ఉత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తామని చెబుతోంది. ఇందులో ఎక్కడ బలవంతం ఉంది? మేమే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాం. యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చినవే విలీనం అవుతున్నాయి. సిబ్బందిని అప్పగించినా విద్యార్థులపై ఫీజుల భారం పడదు. ఆ ఫీజులను ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయం బాగుండబట్టే సిబ్బందంతా ఆప్షన్లు ఇచ్చారు. – రత్నకుమార్, రాష్ట్ర ఎయిడెడ్ విద్యా సంస్థల అసోసియేషన్ అధ్యక్షుడు విద్యార్థులకు ఎంతో మేలు ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఎయిడెడ్‌లో సరైన బోధన చేసేందుకు తగినంత సిబ్బంది లేరు. ప్రభుత్వ సంస్థల్లో మెరుగైన బోధన జరుగుతోంది కనుక విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎయిడెడ్ అధ్యాపకులుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వంలో చేరడం ద్వారా ఆ సమస్యలు తీరుతాయి. ప్రభుత్వ విద్యా సంస్థలూ మరింత బలోపేతమై విద్యార్థులకు మంచి విద్య అందుతుంది. – త్రివిక్రమరెడ్డి, ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు -
విద్యార్థులపై పైసా భారం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రయివేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్ కాలేజీల్లోని అన్ ఎయిడెడ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అమలు చేస్తోంది. ఏ ఒక్క విద్యార్థి మీద పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా వాటిని భరిస్తోంది. విద్యావ్యవస్థలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానం 1960లో ఆరంభమైంది. అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ డిగ్రీ కాలేజీలకు, సీట్లకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దీనికి అనుగుణంగా కాలేజీలు, సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం ప్రయివేటు డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలో కొంతమంది దాతలు, ప్రముఖులు మంచి ఉద్దేశంతో సమాజానికి సేవచేయాలని కాలేజీలు స్థాపించారు. భీమరంలోని డీఎన్ఆర్ కాలేజీ, ఏలూరులోని సీఆర్‌రెడ్డి కాలేజీ, మదనపల్లెలోని బీటీకాలేజీ, అమలాపురంలోని ఎస్కేబీఆర్ కాలేజీ, విశాఖపట్నంలో డాక్టర్ ఎల్బీ కాలేజీ.. వంటివి ఇలా ఏర్పాటైనవే. వీటిలో విద్యార్థుల చేరికలు పెరుగుతున్న కొద్దీ అదనంగా అధ్యాపకుల అవసరం ఏర్పడింది. సిబ్బంది సంఖ్య పెరిగిన కొద్దీ వారికి వేతనాలు వంటివి అందించడం ఆయా సంస్థలకు ఆర్థికంగా భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా యాజమాన్యాలు ఆర్థికసాయాన్ని అర్థించగా ప్రభుత్వం టీచర్ల వేతనాలకు ఇయర్లీ గ్రాంటును మంజూరు చేసింది. తరువాత దీన్ని 3 నెలలకు మార్చింది. 2010–12 నుంచి ఈ వేతనాల చెల్లింపును సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి చేర్చారు. రాష్ట్రంలో 1,444 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 1,153 ప్రయివేటు అన్ ఎయిడెడ్వి. 137 ఎయిడెడ్, 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు. కాలేజీల సంఖ్య పెరిగాక ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో చేరికలు తగ్గిపోయాయి. 2020–21లో మొత్తం కాలేజీల్లోని సీట్లలో 57 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. ఫీజులు భరిస్తున్న ప్రభుత్వం మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల పునర్వ్యవస్థీకరణ జరిగి మార్కెట్, ఎంప్లాయిమెంటు ఓరియెంటెడ్ కోర్సులు ప్రారంభమయ్యాయి. దీంతో సంప్రదాయ కోర్సుల్లో చేరికలు పడిపోయాయి. ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో 90 శాతం కోర్సులు అన్ ఎయిడెడ్వి ఉన్నాయి. వీటికి ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఖరారు చేసిన ఫీజులే వర్తిస్తాయి. ఈ కోర్సులకు అయ్యే ఫీజులను.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక పూర్తిగా రీయింబర్స్‌మెంటు చేయిస్తున్నారు. ప్రయివేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్ కాలేజీల్లోని అన్ ఎయిడెడ్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అమలవుతోంది. ఏ ఒక్క విద్యార్థి మీద కూడా నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఖరారైన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్నట్లు ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఒకవేళ ఏ కాలేజీలోనైనా నిర్ణీత ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో తగ్గిన చేరికలు ఎయిడెడ్ పాఠశాలల్లో కనీస వసతులు, సరైన బోధన లేకపోవడం, యాజమాన్యాలు కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో చేరికలు మరింతగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇక్కడి సిబ్బంది వేతనాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఖర్చుచేస్తున్న ప్రజాధనం వృధాగా మారుతోంది. విద్యార్థులకు సరైన ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదు. -
చిరకాల స్వప్నం నెరవేరింది..: ఏపీ టీచర్స్ గిల్డ్ హర్షం
సీతమ్మధార(విశాఖ ఉత్తర)/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎయిడెడ్ పాఠశాలల సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ చిరకాల స్వప్నం నెరవేరిందని ఏపీ టీచర్స్ గిల్డ్ హర్షం వ్యక్తం చేసింది. విశాఖ గురుద్వారాలోని వసంత బాల ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏపీటీజీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ తీర్మానం చేశారు. ఏపీ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్షుడు డి.సురేష్‌కుమార్ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. కొన్ని యాజమాన్యాల వైఖరి వల్ల విలీన ప్రక్రియ ఆలస్యమవుతోందని, సిబ్బందిని ప్రభుత్వంలో కలిపేందుకు యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ టీచర్స్ గిల్డ్ విశాఖ జిల్లా అ«ధ్యక్షుడు డి.భాస్కరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులందరిదీ ఒకే మాట.. విజయవాడలోనూ కృష్ణా జిల్లా ఎయిడెడ్ ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి.. సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. సంఘ నేతలు మాట్లాడుతూ సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, క్షీణదశలో ఉన్న ఎయిడెడ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఆయన నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. తాము నూరు శాతం ప్రభుత్వంలో విలీనమయ్యేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వారు స్పష్టం చేశారు. 13 జిల్లాల్లోని ఎయిడెడ్ ఉపాధ్యాయులంతా ఒకే మాటపై ఉంటామన్నారు. -
‘ఎయిడెడ్’కు వ్యతిరేకం కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరమని.. ఇందులోకి రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టంచేశారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకమనే కోణంలో జరుగుతున్న ప్రచారాలు, కథనాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించామన్నారు. ఈ అవకాశాల వెనకనున్న కారణాలను సీఎం జగన్ వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. ► గతంలో డబ్బున్న వారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ఛారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో ఈ స్కూళ్లు, కాలేజీలు నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ► మరోవైపు.. ప్రభుత్వాలు కూడా గడచిన 20–25 ఏళ్లుగా ఎయిడెడ్ పోస్టులను భర్తీచేయకపోవడంతో ఆ పోస్టులు కరిగిపోతూ వచ్చాయి. ఒక విధాన నిర్ణయంలో భాగంగా ఇది చేశాయి. ► యాజమాన్యాలే టీచర్లను నియమించుకుని ఎయిడెడ్ స్కూళ్లను నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ► ఈ దశలో ఎయిడెడ్ స్కూళ్లను, కాలేజీలను నడపడానికి మళ్లీ మళ్లీ డబ్బులు పెట్టాల్సిన పరిస్థితులొచ్చాయి. ఈ విద్యా సంస్థలను నడిపేందుకు యాజమాన్యంలోని వ్యక్తులు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సంస్థల వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పరిస్థితులు కూడా లేకుండాపోయాయి. ► ఈ కారణాలన్నీ కూడా ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల నిర్వీర్యానికి దారితీశాయి. భవనాలన్నీ కూడా శిథిలావస్థకు చేరాయి. రిటైరైన టీచర్ల స్థానే కొత్త వారిని నియమించుకోవడం కూడా యాజమాన్యాలకు ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఒకవేళ టీచర్లను పెట్టినా నాణ్యత లోపించింది. ► ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా చాలాకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తమను ప్రభుత్వంలో భాగంగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయని.. ప్రభుత్వంలో భాగం కానీయకుండా తమ కడుపులు కొడుతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ► ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల వెనకున్న ఉద్దేశాల రక్షణకు, వాటి యాజమాన్యాలకు సహాయకారిగా ప్రభుత్వం ఐచ్ఛికంతో కూడిన విధంగా, స్వచ్ఛందంగా కొన్ని అవకాశాలను కల్పించింది. ► నడపలేని పరిస్థితుల్లో ఉన్న విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి అప్పగిస్తే.. నాడు–నేడులో భాగంగా పునరుద్ధరిస్తాం. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తాం. చారిటీ కింద విద్యాసంస్థలను పెట్టిన దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తాం. ఎయిడెడ్ విద్యాసంస్థల స్థాపన వెనకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగమే ఇది. ఆ సంస్థలను నడుపుతున్న వారికి సహాయంగా నిలిచే కార్యక్రమం ఇది. ► తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్ టీచర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, వారి డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, వారిని సరెండర్ చేసి, ప్రైవేటుగా నడుపుకోవచ్చు. ► లేదా ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు. ► ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు, తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే.. అలా కూడా చెయ్యొచ్చు. దీనికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ► ఎయిడెడ్ విద్యాసంస్థల యజమానులకు, అందులో పనిచేస్తున్న టీచర్లకు, విద్యార్థులకు మంచిచేయాలని, మెరుగైన స్కూళ్లుగా వాటిని తీర్చిదిద్ది నడపాలనే ఉద్దేశంతోనే ఐచ్ఛికంగానే ఈ అవకాశాలను వారు వినియోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతంలేదు.. అని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. -
ఎయి‘డెడ్’తో రాజకీయాలా?
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వాల తప్పిదాలు, యాజమాన్యాల స్వప్రయోజనాలతో రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలు పూర్తిగా గాడి తప్పాయి. 95 శాతానికిపైగా ఈ సంస్థల్లో కనీస బోధనాభ్యసన కార్యక్రమాలు కూడా సరిగా జరగడం లేదు. అనేక స్కూళ్లలో చేరికలు నిలిచి పోవడంతో మూతపడ్డాయి. మరికొన్నింటిలో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విద్యార్థులు లేనందున పలు చోట్ల ప్రభుత్వ వేతనాలు పొందుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు బోధన మానేసి సొంత పనుల్లో ఉంటున్నారు. వీరిలో 90% మంది స్కూళ్లకు సరిగా హాజరు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనలను, సంస్థ విద్యా కార్యకలాపాలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా ఇదే తంతు ఉండడంతో ఈ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. దాతలు ఏ ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాలను యాజమాన్యాలు విస్మరించాయి. సంస్థల ఆస్తులు, నిధులను తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకోవడంపైనే దృష్టి సారించాయి. ఇవీ వాస్తవాలు.. ► బ్రిటిష్ పాలనా కాలంలో ఎయిడెడ్ విద్యా వ్యవస్థ ప్రారంభమైంది. దాతలు తమ సొంత ఆస్తులు, నిధులు దానంగా ఇచ్చి విద్యా సంస్థలను ఏర్పాటు చేయించారు. కాలక్రమంలో ఈ సంస్థల్లోని టీచర్లకు ప్రభుత్వం తరఫున వేతనాలు అందించడంతో పాటు ఇతర కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. ► విద్యా హక్కు చట్టం వచ్చాక ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు హైస్కూలు.. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► ప్రభుత్వ స్కూళ్లలో అన్ని అర్హతలతో కూడిన టీచర్లతో బోధన, ఇతర సదుపాయాలతో పాటు పలు పథకాల కింద ఆర్థిక సాయం విద్యార్థులకు అందుతోంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చేరికలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఈ విద్యా సంస్థల యాజమాన్యాలు వాటిని తమ వ్యక్తిగత స్వార్థానికి వినియోగించుకుంటున్నాయి. ► నియామకాల్లో యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరించి డబ్బులిచ్చిన వారిని నియమించడంతో ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ► ప్రభుత్వ అనుమతులు లేకుండానే సిబ్బందిని నియమించుకుని, ఆ తర్వాత వారిని రెగ్యులర్ చేసేలా పైరవీలు చేస్తున్నాయి. ఈ సంస్థల్లో సిబ్బందికి, ఇతర కార్యకలాపాలకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ► ఎయిడెడ్ సంస్థల్లో సిబ్బంది ఉన్నప్పటికీ పిల్లలు ఉండడం లేదు. దీంతో ఆ సిబ్బందిని అవసరమైన చోట వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచించినా, యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఈ తరుణంలో ఈ సంస్థల్లో నియామకాలు, క్రమబద్ధీకరణలు ప్రభుత్వంపై విపరీత భారాన్ని మోపేవిగా మారాయి. ► అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులను ప్రభుత్వం ఆదుకొంటోంది. నాడు–నేడు కింద ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరగడంతో అక్కడ ఉపాధ్యాయుల అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వంలోకి తీసుకున్న విద్యా సంస్థల్లోని విద్యార్థులకూ అన్ని పథకాలను వర్తింప చేస్తుంది. ► రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు 44,639 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 33,774, ప్రాథమికోన్నత పాఠశాలలు 4,198, ఉన్నత పాఠశాలలు 6,667 ఉన్నాయి. ఎయిడెడ్ స్కూళ్లు మొత్తం 2,001 ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 1,301, అప్పర్ ప్రైమరీ 258, హైస్కూళ్లు 442 ఉన్నాయి. ► రాష్ట్రంలో చేరికలు లేక 482 ఎయిడెడ్ స్కూళ్లు మూత పడ్డాయి. వీటిలో 262 సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించాయి. నిర్వహణలో ఉన్న 1,988 స్కూళ్లలో 1,302 స్కూళ్లు కూడా ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించాయి. వీటిలో 1,127 సంస్థలను ప్రభుత్వంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 686 సంస్థలు సమ్మతి తెలపలేదు. సిబ్బంది, విద్యార్థుల కోసం ఇలా.. ► విద్యార్థులను వారి తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారు కోరుకునే సమీపంలోని మరో పాఠశాలలో చేర్చించేలా రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ► టీచర్లను వారి సీనియార్టీని అనుసరించి ఇతర స్కూళ్లలో నియమించేలా కౌన్సెలింగ్ షెడ్యూలు ఇచ్చింది. నవంబర్7వ తేదీలోగా వీరి నియామకాలు పూర్తి చేయనున్నారు. ► ఎయిడెడ్ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమయ్యాక వారి సేవలను అవసరమైన ఇతర విద్యా సంస్థల్లో వినియోగించుకోనుంది. ఆయా సంస్థలు, అందులోని తాత్కాలిక అన్ఎయిడెడ్ సిబ్బందికీ చట్ట నిబంధనల ప్రకారం ఔట్సోర్సింగ్ విధానం మేరకు వేతనాలు చెల్లిస్తారు. ఇందుకు ప్రభుత్వంపై రూ.95 కోట్ల వరకు భారం పడనుంది. ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ఇదీ పరిస్థితి ► రాష్ట్రంలో ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 137 ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో 4 ఎండోమెంట్(రిలిజియస్) డిపార్టుమెంటు పరిధిలోవి కాగా 16 మైనార్టీ స్టేటస్‌తో ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో ఎయిడెడ్ కోర్సులతో పాటు అన్ఎయిడెడ్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో సరైన చేరికలు ఉండడం లేదు. 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు సిబ్బందితో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్‌ను మాత్రమే సరెండర్ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. ► డిగ్రీ కాలేజీల్లోని ఎయిడెడ్ కోర్సుల్లో 1,02,234 సీట్లుంటే 51,085 మంది, అన్ఎయిడెడ్ కోర్సుల్లో లక్షకు పైగా సీట్లుంటే అందులో సగం మంది మాత్రమే చేరారు. కొన్ని ప్రముఖ కాలేజీల్లో తప్ప తక్కిన వాటిల్లో 30% కూడా సీట్లు నిండడం లేదు. ► 32 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. 33 కాలేజీల్లో చేరికలు 50 శాతానికన్నా తక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల పది శాతం విద్యార్థులు కూడా లేరు. ఈ సంస్థల్లో ఎయిడెడ్ విభాగాల్లో బోధనా సిబ్బంది 1,303 మంది, బోధనేతర సిబ్బంది 1,422 మంది ఉన్నారు. అన్ఎయిడెడ్ కోర్సులకు సంబంధించి 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ► 122 ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లోని 5 జూనియర్ కాలేజీలు.. ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం సిబ్బందిని ఇస్తామని తెలిపాయి. ► ఎయిడెడ్ పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు.. 6,900 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. జూనియర్ కాలేజీల్లో 40 వేల మంది విద్యార్థులు ఉన్నారు. 10 కాలేజీలు మూత రాజమండ్రిలోని ఏవైఎస్ కాలేజ్, పాలకొల్లులోని ఎస్కేఆర్ఎస్ ఓరియంటల్కాలేజ్, గుడ్లవల్లేరులోని ఎస్సీఎస్కాలేజ్, గుంటూరులోని ఎస్జీహెచ్ఆర్, ఎంసీఎంఆర్ కాలేజ్, నరసారావుపేటలోని ఎన్బీటీ, ఎన్వీసీ కాలేజ్, తెనాలిలోని కేఎల్ఎన్సంస్కృత కళాశాల, పొన్నూరులోని ఎస్బీఎస్సంస్కృత కళాశాల, గుంటూరులోని డా.కేవీకే సంస్కృత కళాశాల, ఎస్జీకే ఓరియంటల్ కాలేజ్‌లు మూత పడ్డాయి. ఇలా చేయడం మేలేగా.. ► ఈ నేపథ్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రత్నకుమారి నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ► అన్ని విధాలా నిర్వీర్యమైన ఈ సంస్థలకు ప్రభుత్వ ఆర్థిక సాయం కొనసాగించాల్సిన అవసరం లేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఈ విషయమై ప్రభుత్వం తొలుత ఆయా సంస్థల యాజమాన్యాలు, సిబ్బందితో చర్చించింది. ► ప్రభుత్వానికి ఆయా ఎయిడెడ్ సంస్థలను అప్పగించే విషయంలో నిర్ణయాన్ని యాజమాన్యాల అభీష్టానికే ప్రభుత్వం వదిలేసింది. ప్రభుత్వానికి అప్పగించని సంస్థలు నియమ నిబంధనల మేరకు మాత్రమే వాటిని నడుపుకోవాలి. ప్రతిపక్షాల దుష్ప్రచారం రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే టీడీపీ సహా కొన్ని రాజకీయ పక్షాలు వాస్తవాలను వక్రీకరిస్తూ రాజకీయం చేస్తున్నాయని తల్లిదండ్రులు, ఎయిడెడ్ సిబ్బంది నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల విద్యార్థులను రోడ్లపైకి తెస్తూ ఆందోళనలు చేపట్టడం వెనుక వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప మరేమీ లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఏకంగా 300 వరకు కోర్టు ధిక్కార కేసులు నమోదవ్వగా వాటిని ప్రస్తుత ప్రభుత్వంలోని అధికారులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయాలన్నింటినీ టీడీపీ విస్మరించి ప్రస్తుతం దుష్ప్రచారం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం రాష్ట్రంలోని ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడాన్ని ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇప్పటికే స్వాగతించింది. పూర్తి స్థాయి వేతనాలు పొందుతున్నా వివిధ కారణాల వల్ల సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్నాం. ప్రభుత్వంలో ఎయిడెడ్ కాలేజీలను విలీనం చేయడం వల్ల మేమంతా బాధ్యతాయుతంగా పని చేస్తాం. ఎక్కడ అవసరమో అక్కడ మా విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కనుక విద్యార్థులకూ మేలు జరుగుతుంది. – కనపర్తి త్రివిక్రమరెడ్డి, ఏపీ ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎయిడెడ్‌పై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం ఎయిడెడ్ విద్యా వ్యవస్థపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి మంచి విద్యా ప్రమాణాలను అందించాలన్న ఆలోచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఎయిడెడ్ ఆస్తులు ఇప్పటికే దుర్వినియోగం అయ్యాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాటిని దాతలు ఏ లక్ష్యంతో ఇచ్చారో దానికే వాడాలని ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థలపై శ్వేతపత్రం ఇస్తాం. – ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు సబ్జెక్టు నిపుణులు లేరు. అందువల్ల మేము అందరిలా సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. ఎన్టీఎస్ఈ, ఎన్ఎమ్ఎమ్ఎస్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించలేకపోతున్నాం. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వంలో వీలీనం చేస్తే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు వస్తారు. మేమ అన్ని పోటీ పరీక్షల్లోను సత్తా చాటుతాం. – ఎస్.వీరదుర్గ, పదో తరగతి, గిల్డ్ ఆఫ్ సర్వీస్ పాఠశాల, కాకినాడ, తూర్పుగోదావరి -
ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి
విశాఖపట్నం: ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యంతో ఆదివారం మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో.. మొత్తంగా 89 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయని, వాటిలో 69 పాఠశాలల యాజమాన్యాలు విలీనం చేసేందుకు ముందుకొచ్చాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడి లేదని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా, విద్యార్థుల చదువులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చదవండి: ‘ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పి?’ -
‘ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పి?’
అమరావతి: ఎయిడెడ్ విద్యా సంస్థలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఏపీ ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయ్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పని ప్రశ్నించారు..?! ప్రజలకు మేలు చేయడానికే విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రక్షాళన అవసరమని విజయ్‌బాబు పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ విలీనంపై అభ్యంతరం లేదు: రాజీవ్,ఎయిడెడ్ స్కూల్స్ యజమాని అమరావతి: నాడు-నేడుతో విద్యారంగంలో.. మంచి వాతావరణం నెలకొందని రాజీవ్, ఎయిడెడ్ స్కూల్స్ యజమాని తెలిపారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ఈ స్కూల్స్ విలీనంపై తమకు ఎలాంటి అభ్యంతరంలేదని, వీటి ప్రక్షాళనపై ప్రభుత్వ పాలసీ బాగుందని తెలిపారు. దీనికోసం ప్రభుత్వం.. ఐదారు నెలలుగా కమ్యూనికేట్ చేసి ప్రక్షాళన చేస్తున్నారని ఎయిడెడ్ స్కూల్స్ యజమాని పేర్కొన్నారు. చదవండి: ఎల్లో మీడియా పత్రికా విలువల్ని పాటించాలి: మంత్రి సురేష్ -
ఎల్లో మీడియా పత్రికా విలువల్ని పాటించాలి: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: ఎయిడెడ్ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రభుత్వం ఏపని చేసినా అడ్డు తగులుతున్నాయన్నారు. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. అమ్మ ఒడి అన్ని విద్యాసంస్థలకు వర్తింప చేస్తున్నామన్నారు. ఆర్థిక ప్రోత్సాహకాలతోనే విద్యారంగ ప్రగతి. విద్యాసంస్థ ఏదైనా సరే నిబంధనల ప్రకారం నడవాలి. ఎయిడెడ్ విద్యాసంస్థ ప్రక్షాళనపై శ్వేత పత్రం కూడా ఇస్తాం. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎయిడెడ్ స్కూల్ మూతపడదు. ఎల్లో మీడియా పత్రికా విలువల్ని పాటించాలని మంత్రి సురేష్ హితవు పలికారు. చదవండి: Dr. G Lakshmisha: పేపర్‌బాయ్ టూ ఐఏఎస్ -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు
బద్వేలు అర్బన్: రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీపై మండిపడ్డారు. బుధవారం ఆయన బద్వేలులో విలేకరులతో మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీకి తోడు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుండటం భావ్యం కాదన్నారు. ప్రైవేటు యాజమాన్యం కింద నడిచే విద్యా సంస్థల పనితీరుపై సీఎం వైఎస్ జగన్ ఒక కమిటీ వేసి ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు అప్పగించారన్నారు. ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏ విధంగా పని చేస్తున్నాయి.. టీచర్, విద్యార్థి నిష్పత్తి ఎలా ఉంది.. ఫలితాలు ఎలా వస్తున్నాయి.. నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి.. తదితర విషయాల్లో సూచనలివ్వాలని కమిటీని ఆదేశించారన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితి దారుణం ► ఎయిడెడ్ స్కూళ్లు దాదాపుగా నిర్వీర్యమయ్యాయి. కొన్ని చోట్ల టీచర్లకు, యాజమాన్యం మధ్య సఖ్యత లేదు. చాలా స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. అందువల్ల విద్యార్థులు ఆ స్కూళ్లలో చేరడం లేదు. ► ఈ పరిస్థితిలో యాజమాన్యాలు స్కూళ్లను ప్రభుత్వానికి అప్పగిస్తే అవసరమైన మేరకు టీచర్లను నియమించడంతో పాటు నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేయవచ్చని నిర్ణయించాం. ► అయితే ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తే స్కూళ్లు మూత పడిపోతాయని ప్రతిపక్షం, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నాయి. వాస్తవానికి స్కూళ్లు అప్పగించాలని ప్రభుత్వం ఏ ఒక్క స్కూలు యాజమాన్యాన్ని బలవంత పెట్టడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకోవచ్చు ► ఎయిడెడ్ యాజమాన్యాలు తమకు గ్రాంట్ అవసరం లేదని, టీచర్లను ప్రభుత్వానికి సరెండర్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలుగా నడుపుకుంటామని చెబితే ఎలాంటి అభ్యంతరం లేదు. ► రాష్ట్రంలో ఉన్న సుమారు 137 పైచిలుకు డిగ్రీ కాలేజీల్లో 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్టాఫ్‌తో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపారు. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్‌ను మాత్రమే సరెండర్ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి. మొత్తంగా 93 శాతం డిగ్రీ కాలేజీలు విల్లింగ్‌నెస్ ఇచ్చాయి. ► 122 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉంటే 5 జూనియర్ కాలేజీలు ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం స్టాఫ్‌ను ఇస్తామని తెలిపాయి. ► 1,988 స్కూళ్లకు గాను 1200 స్కూళ్ల యాజమాన్యాలు స్టాఫ్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 88 స్కూళ్లు ఆస్తులతో పాటు స్టాఫ్‌ను ఇస్తున్నట్లు ఒప్పుకున్నాయి. ► విశాఖలో సెయింట్‌పీటర్స్, కాకినాడలో సెయింట్ యాన్స్ స్కూళ్ల యాజమాన్యాలు తాము స్కూళ్లు మూసి వేస్తున్నామని చెప్పాయి. కాబట్టి మీ పిల్లలను వేరే స్కూళ్లలో చేర్పించుకోండని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం విల్లింగ్‌నెస్ ఇచ్చినప్పటికీ, తిరిగి విత్‌డ్రా చేసుకుంటామంటే వారి ఆప్షన్‌ను నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చు. ► రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూళ్ల దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణం. -
కోరుకున్న బడికి ఎయిడెడ్ విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల చేరికలు లేక వెలవెలబోతున్న ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలో విలీనం చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించిన పాఠశాలల విషయంలో అనుసరించాల్సిన కొన్ని విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఈ ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులను వారి తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారు కోరుకునే సమీపంలోని మరో పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలకు సూచించింది. ఈ విద్యార్థులను ఆయా స్కూళ్లలో ఈనెల 31వ తేదీలోగా చేర్పించి ఆ సమాచారాన్ని చైల్డ్ ఇన్ఫోలో అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఎయిడెడ్ టీచర్ల బదిలీలకు షెడ్యూల్ ఇలా ఉండగా ఆయా స్కూళ్లలోని ఎయిడెడ్ టీచర్లను వారి సీనియార్టీని అనుసరించి ఇతర స్కూళ్లలో నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేశారు. షెడ్యూల్ ఇలా.. ► జిల్లాల స్థాయిలో టీచర్ల సీనియార్టీ జాబితా రూపకల్పన: అక్టోబర్ 20 నుంచి 22 వరకు ► ఆ జాబితా ప్రదర్శన: అక్టోబర్ 23 సాయంత్రం 5 వరకు ► అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 24 నుంచి 27 వరకు ► అభ్యంతరాల పరిష్కారం, తుది సీనియార్టీ జాబితా ప్రకటన: అక్టోబర్ 31 ► యాజమాన్యాల వారీగా ఖాళీల ప్రదర్శన: నవంబర్ 1 ► వెబ్ ఆప్షన్ల నమోదు: నవంబర్ 2 నుంచి 5 వరకు ► కేటాయింపు ఉత్తర్వులు విడుదల: నవంబర్ 6 ► స్కూళ్లలో రిపోర్టింగ్: నవంబర్ 7 -
ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నది ఉద్దేశం
-
‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’
సాక్షి, అమరావతి: ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య ఉండాలన్నదే తమ ఉద్దేశమని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేళంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో సంస్కరణల కోసం కమిటీ వేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అమ్మఒడి అందిస్తున్నందున అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ వేసిందపి, ఈ కమిటీ ప్రభుత్వానికి తన రిపొర్ట్ ఇచ్చిందని వెలల్లడించారు. స్వచ్చందంగా గ్రాంటు, కాలేజీలు, ఆస్తులు వదులుకోవడానికి ముందుకు వస్తే ఏం చెయ్యాలో ప్రభుత్వానికి కమిటీ సూచనలు చేసిందన్నారు. యాజమాన్యాలు అప్పగిస్తే ప్రభుత్వమే నడిపేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ యాజమాన్యమైన గ్రాంట్ ఇన్ ఎయిడ్ని ఉపసంహరించుకుంటామన్నా అంగీకరిస్తాం. 93 శాతం ఎయిడెడ్ యాజమాన్యాలు పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగిస్తూ ఆమోదం తెలుపగా.. 5 నుంచి 7 యాజమాన్యాలు ఆస్తులు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారు. 89 శాతం జూనియర్ కాలేజీలు లెక్చరర్లను సరెండేర్ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగా.. 2 వేల ఎయిడెడ్ పాఠశాలల్లో 1200 పైగా స్కూళ్ళు ప్రభుత్వానికి సిబ్బందిని అప్పగించింది.100 శాతం పాఠశాలలు ఆస్తులతో సహా మొత్తం ఏ ఒక్క స్కూలు కూడా మూతపడదు. ఎవరైనా నడపలేకపోతే ప్రభుత్వ పాఠశాలలుగా మార్చి నడుపుతాం. కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం, వర్కింగ్ కమిటీని వేశాం.కాంట్రాక్ట్ లెక్చరర్లు కు ఉద్యోగ భద్రతకు చర్యలు చేపడతాం.ఖాళీలలో వీరిని ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టు లెక్చరర్లు ఎవ్వరు ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందాల్సిన పనిలేదు. గతంలో ప్రభుత్వం పూర్తిగా ప్రయివేటు విద్య వ్యాపారాన్ని ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నాం’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. చదవండి: ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ -
యూజీసీ సాయం కొనసాగేలా చూడాలి
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎయిడెడ్ కళాశాలల్లోని శాశ్వత సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో యూజీసీ నుంచి వచ్చే ఆర్థిక, సాంకేతిక ఇతర సహకారాలను యథావిధిగా కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ప్రైవేట్ యూజీ అండ్ పీజీ ఎయిడెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ సంఘం రాష్ట్ర సమావేశం విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.లక్ష్మణరావు, తూనుకుంట్ల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయని, అయితే శాశ్వత సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా.. కేంద్రం నుంచి ఆర్థిక సహకారం యథావిధిగా కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
ఏపీ: ప్రభుత్వ పరిధిలోకి ఎయిడెడ్, మైనార్టీ డిగ్రీ కాలేజీలు
సాక్షి, అమరావతి: విద్యార్థుల చేరికల్లేక.. మరోవైపు ప్రమాణాలు పడిపోతున్న ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, మైనార్టీ డిగ్రీ కాలేజీలకు ఇక మహర్దశ పట్టనుంది. వీటిని తన పరిధిలోకి తీసుకుని అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు ఫీజులను పూర్తిగా రీయింబర్స్ చేయడంతోపాటు వారి వసతి, భోజనాల కోసం ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకూ వీటిని వర్తింపచేస్తోంది. ఎయిడెడ్ కాలేజీల్లోని రెగ్యులర్ సిబ్బందికి జీతభత్యాలు, ఇతర సదుపాయాల కోసం నిధులు విడుదల చేస్తోంది. అయినా చేరికలు, ప్రమాణాలూ పడిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎటువంటి రుణభారం లేకుండా ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను స్వాధీనం చేయడానికి సుముఖంగా ఉండే యాజమాన్యాలు, సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కాలేజీ విద్య కమిషనర్‌ను ఆదేశించింది. -
చెప్పు..నీకు జీతం వేలల్లో కావాలా,లక్షల్లో కావాలా?!
సాక్షి, అమరావతి:ఎయిడెడ్ కాలేజీల్లో అవసరం లేకపోయినా బోధన, బోధనేతర సిబ్బందిని అన్ ఎయిడెడ్ ప్రాతిపదికన నియమించారు. ఆ సందర్భంలో పెద్దఎత్తున పైరవీలు నడిచాయి. సొమ్ములు కూడా చేతులు మారాయి. తాజాగా ఆ పోస్టులను క్రమబద్ధీకరణ (రెగ్యులర్) చేయిస్తామని.. నెలకు ఇచ్చే రూ.15 వేల నామమాత్రపు వేతనాన్ని రూ.లక్షకు పైగా ఇప్పించేలా చూస్తామంటూ సదరు కళాశాలల యాజమాన్యాలు వసూళ్ల పర్వానికి తెరలేపాయి. కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించైనా ఆ పోస్టులను రెగ్యులర్ చేయిస్తామని నమ్మబలుకుతూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఉన్నత విద్యాశాఖలోని కొందరు కిందిస్థాయి అధికారుల ఆశీస్సులతో రూ.కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నత విద్యా శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం జీతాలొస్తాయంటూ.. రాష్ట్రంలో 137 ఎయిడెడ్ కాలేజీలు ఉండగా.. అందులో దేవదాయ శాఖకు చెందినవి 4, మైనార్టీ స్టేటస్‌లో 16 కాలేజీలు ఉన్నాయి. మిగిలినవి వివిధ యాజమాన్యాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఎయిడెడ్ సెక్షన్లలో మొత్తంగా 1,02,234 సీట్లు ఉండగా.. 51,085 మంది విద్యార్థులున్నట్టు యాజమాన్యాలు చూపిస్తున్నాయి. అదే అన్ ఎయిడెడ్ సెక్షన్లలో 1,54,350 సీట్లున్నాయి. ఇక్కడ కూడా సగం మాత్రమే సీట్లు భర్తీ కాగా.. మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ కాలేజీల్లోని ఎయిడెడ్ విభాగాల్లో 1,303 మంది బోధనా సిబ్బంది, 1,422 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. వీటిలో అన్ ఎయిడెడ్ విభాగంలో 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది కలిపి 2,530 మంది పని చేస్తున్నారు. వీరికి ఆయా యాజమాన్యాలు నెలకు రూ.15 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ పోస్టుల్ని క్రమబద్ధీకరణ చేయిస్తే యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికీ రూ.లక్షకు పైగా వేతనం అందుతుంది. దీనిని ఆశగా చూపి యాజమాన్యాలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. అన్ ఎయిడెడ్ సిబ్బందిని రెగ్యులర్ చేయించేందుకు పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఇలాంటి వారిలో కొందరికి అనుకూలంగా ఉన్నత విద్యాశాఖలోని కొందరు అధికారుల సహకారంతో కోర్టు ఉత్తర్వులు జారీ చేయించి మరీ రెగ్యులర్ చేయించారు. ఆ ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఇప్పుడు మొత్తం అందరినీ రెగ్యులర్ చేయిస్తామంటూ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా.. ఉన్నత విద్యాసంస్థల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన యాక్ట్–1994కు వ్యతిరేకంగా ఈ వ్యవహారానలు నడిపిస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌లుగా తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్న వారి రెగ్యులరైజేషన్‌కు గతంలో ఒక అవకాశం ఇచ్చారు. 1993 నవంబర్ 25 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే రెగ్యులర్ చేయాలని అప్పటి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వారికి యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి, ఎయిడెడ్ పోస్టుల్లో ఖాళీలు ఉంటే రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. వారినీ తప్ప వేరెవరిని రెగ్యులర్ చేయడానికి వీల్లేదు. అలా చేయడం చట్ట వ్యతిరేకం. కానీ.. కోర్టుల నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి గతంలో కొందరిని రెగ్యులర్ చేయించారు. ఇప్పుడు వాటినే చూపిస్తూ అందరినీ రెగ్యులర్ చేయిస్తామని కొన్ని యాజమాన్యాలు, ఉన్నత విద్యాశాఖలోని కొంతమంది అధికారులు పావులు కదుపుతున్నారు. చదవండి : ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు -
మీకు షూస్ ఇవ్వాలా?
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ షూస్ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన మండల విద్యాశాఖాధికారులు వాటిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలోని కనిగిరి, కంభం, పెద్దారవీడు, అర్ధవీడు, బల్లికురవ, అద్దంకి, మార్టూరు మండలాల్లోని ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు షూస్ ఇవ్వకుండా అక్కడి మండల విద్యాశాఖాధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎయిడెడ్ ఉపాధ్యాయులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌తో పాటు షూస్ ఇవ్వాలని సాక్షాత్తు విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కొంతమంది విద్యాశాఖాధికారులు మోకాలడ్డుతుండటంపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎక్కువ శాతం ఎయిడెడ్ పాఠశాలలకు షూస్ పంపిణీ చేసినా ఆ ఏడు మండలాల పరిధిలోని మండల విద్యాశాఖాధికారుల నుంచి వింత సమాధానం రావడంపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు షూస్ ఇచ్చి, తమ విద్యార్థులకు ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. అసలే విద్యార్థుల శాతం తక్కువగా ఉందని కలత చెందుతున్న తరుణంలో షూస్ అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వెంటనే ఏ ఏడు మండలాల పరిధిలోని ఎయిడెడ్ పాఠశాలలకు షూస్ అందించేలా సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. -
ఎయిడెడ్‌లో ప్రైవేటు దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడెడ్ కాలేజీల్లో ప్రైవేటు దందా మొదలైంది. ఇప్పటివరకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో కొన్ని సెక్షన్లలోనే కొనసాగిన ప్రైవేటు దందా.. ఇప్పుడు ఏకంగా ఎయిడెడ్ కాలేజీలను పూర్తి ప్రైవేటు కాలేజీలుగా మార్చేందుకు తెర వెనుక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ తతంగంలో 25 నుంచి 75 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ కాలేజీలు కూడా ప్రైవేటుగా మారిపోతున్నాయి. ప్రభుత్వానికే తెలియకుండా పదుల సంఖ్యలో ఇంటర్మీడియట్, డిగ్రీ ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేటు కాలేజీలుగా ఆయా శాఖలే మార్చేశాయి. ఏళ్ల చరిత్ర గల వరంగల్‌లోని ఓ ఎయిడెడ్ జూనియర్ కళాశాల ఆవరణలోనే కొత్త యాజమాన్యం పేరుతో ప్రైవేటు కాలేజీగా బోర్డు పెట్టారు. హైదరాబాద్ నగరం, ఇతర జిల్లాల్లోని రూ. వేల కోట్ల ఆస్తులు గల ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా కొనసాగించేందుకు కళాశాల విద్యా శాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఇలా 18 కాలేజీలను కళాశాల విద్యాశాఖ ప్రైవేటుగా మార్చేసినట్లు సమాచారం. నియామకాలు చేపట్టకే.. ప్రభుత్వం నియామకాలను చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందితోనే ఎయిడెడ్ కాలేజీలను నడిపిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు లెక్చరర్లను నియమించుకొని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులను వసూలు చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు రూ. వేల కోట్ల ఆస్తులు, భూములు, భవనాలు గల ఆయా విద్యా సంస్థల ఆస్తులపై కన్నేశాయి. వీరంతా సరిపడా లెక్చరర్లు లేరన్న సాకుతో కాలేజీలను నడపలేమంటూ వాటిని మూసేసి ఆస్తులను కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలు కళాశాల విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలోని 18 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందిని ప్రభుత్వ కాలేజీల్లో అవసరం ఉందంటూ వాటిల్లోకి బదిలీ చేసి, అక్కడ ఎయిడెడ్ కాలేజీ అనేది లేకుండా చేసినట్లు సమాచారం. కొన్ని కాలేజీలు మాత్రం ప్రైవేటు కాలేజీలుగా కొనసాగిం చేందుకు సిద్ధం కాగా, మరికొన్ని పూర్తిగా మూతవేసి ఆస్తులను కొట్టేసే యోచనల్లో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సీరియస్.. ఈ తతంగం మొత్తం ప్రభుత్వానికి తెలియడంతో సీరియస్ అయ్యింది. ప్రస్తుతం కళాశాల విద్యాశాఖ ఎయిడెడ్ నుంచి ప్రైవేటుగా మార్చుతూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లోని 5 ఇంజనీరింగ్ కాలేజీలను నగర పరిసరాల్లోకి మార్చుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సదరు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం ఆ షిఫ్టింగ్‌లను రద్దు చేయాలని, ఏఐసీటీఈకీ లేఖ రాయాలని సూచించినా సాంకేతిక విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. దీంతో వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కాలేజీలను షిఫ్టింగ్ చేసేలా సాంకేతిక విద్యాశాఖకు ఉన్న అధికారాలను రద్దు చేసినట్లు సమాచారం. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా మార్చాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎలా మార్పు చేశారన్న దానిపై నివేదిక కోరినట్లు తెలిసింది. ఆస్తులపై దాతల వారసుల కన్ను.. ఒకప్పుడు దాతలు విద్యాదానం చేసేందుకు ఎయిడెడ్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ దాతల వారసులే కొంతమంది ఎయిడెడ్ ఆస్తులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కళాశాల విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కయి ఆయా కాలేజీల్లోని లెక్చరర్లు, సిబ్బందిని ముందుగా ప్రభుత్వ కాలేజీల్లోకి పంపించి, చివరకు ఎయిడెడ్ అనేది లేకుండా చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఎయిడెడ్ పాఠశాలలకు నిధుల్లో కోత
ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం కత్తి కట్టిందా...! అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏటా ఈ పాఠశాలలకు విడుదల చేసే గ్రాంట్స్ విషయంలో ఈ ఏడాది కేటాయింపుల్లో వీటికి మొండి చేయి చూపింది. ఫలితంగా అందులో పని చేస్తున్న ఉపాధ్యాయులే ఏం కావాలన్నా ఖర్చు చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో వీటి సంఖ్య 104 నుంచి 78కి పడిపోయింది. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్‌లో మరిన్ని పాఠశాలలు మూతపడడం ఖాయమని ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయనగరం అర్బన్: ప్రతిష్టాత్మక విద్యా బోధనలు అందించిన చరిత్ర గల ద్రవ్య సహాయ పాఠశాల (ఎయిడెడ్)పై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తుంది. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలతో అవసాన దశలో ఉన్న ఎయిడెడ్ స్కూళ్లపై ఆర్థికంగా దెబ్బతీసే చర్యలు తాజాగా చేపడుతుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఇతర యాజమాన్యాల పాఠశాలలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలకు స్కూల్ గ్రాంట్స్, టీచర్ గ్రాంట్స్ పేరుతో బోధన తరగతులకు ప్రతి ఏడాది నిధులు మంజూరు చేసేవారు. తాజాగా నడుస్తున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో ఈ స్కూళ్లకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో ఎయిడెడ్ పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నిరక్షరాస్యత నిర్మూలన, విద్యాభివృద్ధి పేరుతో కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నా వీటి మనుగడకు మాత్రం కేటాయించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలలు గత ఏడాది వరకు 104 ఉండేవి. 2003లో ఉపాధ్యాయ నియామకాల నిషేధం విధించిన తరువాత ఏర్పడిన ఉపాధ్యాయుల కొరత కారణంగా పలు పాఠశాలలను మూసేసారు. దీంతో తాజాగా 78 స్కూళ్లు మాత్రమే జిల్లాలో ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 6,940 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీటికి ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మాదిరిగానే చాక్‌పీసులకు, రిజస్టర్ల్ మేనేజ్ చేయడానికి, విద్యా బోధనల ఎయిడ్స్ తదితర అవసరాల కోసం స్కూల్ గ్రాంట్స్, టీచర్ గ్రాంట్స్ పేరుతో ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.7 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేలు వంతున ప్రతి ఏడాది ఆయా స్కూళ్లకు నిధులను సర్వశిక్షాభియాన్ నేరుగా వేసేవాళ్లు. ఈ ఏడాది తాజాగా విడుదల చేసిన వార్షిక బడ్జెట్ నిధులలో ఎయిడెడ్ స్కూళ్లకు కేటాయించలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో బోధన సామగ్రికి యాజమాన్యాలుగాని, ఉపాధ్యాయులుగాని వెచ్చించుకోవాల్సి ఉంది. యాజమాన్యాలకు ప్రతి ఏడాది ఇవ్వాల్సిన స్కూల్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ కూడా సకాలంలో ఇవ్వడం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. స్కూళ్లల్లో ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా ఆ నిధులు మంజూరు చేస్తారు. అయితే 15 ఏళ్లగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల అన్ని స్కూళ్లలోనూ ఉపాధ్యాయ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయుల వేతనంలోని కొంత శాతం మాత్రమే స్కూల్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ వస్తాయి. ఉపాధ్యాయుల తక్కువున్న నేపథ్యంలో ఆ నిధులు ఏ ఒక్క పాఠశాలకు సరిపోవడం లేదు. æ దీంతో ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఏడాదికి నిధులివ్వలేదు... ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాల మాదిరిగానే స్కూల్ గ్రాంట్స్ ప్రతి ఏడాది వస్తాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన సమగ్ర సర్వశిక్షాభియాన్ పథకం ద్వారా నిధుల కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపుల్లో ఎయిడెడ్ కేటగిరి పాఠశాలలు లేవు. దీంతో వాటికి నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.–డాక్టర్ బి.శ్రీనివాసరావు, పీ.ఓ, ఎస్ఎస్ఏ నాణ్యమైన బోధనలు సాధ్యం కాదు పాఠశాలలో ఐదు తరగతులలో 45 మంది విద్యార్థులున్నారు. ఒక్కడినే ఉపాధ్యాయుడుని. ఇప్పటికే ఉపాధ్యాయుని కొరత వల్ల అన్ని తరగతులకు బోధనలు అందించడం కష్టంగా ఉంది. స్కూల్ గ్రాంట్స్ ఇవ్వకపోతే పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించడం సాధ్యం కాదు. బోధనా సామగ్రి తప్పనిసరి. కనీసం చాక్‌పీసులు, విద్యుత్ బిల్లులు తదితర సౌకర్యాల కోసం నిధులు అవసరం ఉంది. ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత కారణంగా బోధనలు సంపూర్ణంగా ఇవ్వలేకపోతున్నాం. నిధులు ఇవ్వకపోతే బోధనలు భారంగా మారుతాయి.–ఎస్.వీ.సత్యం, æసింగిల్ టీచర్, ఆర్సీఎం ఎయిడెడ్ ప్రాధమిక పాఠశాల, కొత్తవలస, సాలూరు మండలం -
ఒక్క జత ఇస్తే ఒట్టు!
జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలలపై సర్వశిక్షా అభియాన్ అధికారులు శీతకన్ను వేశారు. ఆ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో ఇంతవరకు ఒక్కరికి కూడా ఏకరూప దుస్తులు ఇవ్వలేదు. స్కూళ్లు ప్రారంభించి రెండున్నర నెలలు దాటినా యూనిఫాం ఊసే ఎత్తడం లేదు. ఆ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో అధికశాతం పేద విద్యార్థులే. వారికి ఏకరూపు దుస్తులు ఇవ్వకపోవడంతో పాతవి, చినిగిపోయిన వాటిని ధరించుకొని విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. దీనిపై ఎస్ఎస్ఏ అధికారులు సెప్టెంబర్ 4లోగా స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని ఏపీ టీచర్స్ గిల్ట్ అసోసియేషన్ నాయకులు డెడ్‌లైన్ విధించడం చర్చినియాంశంగా మారింది. ఒంగోలు టౌన్: ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 16,500 మంది విద్యార్థులకు యూనిఫాం అందించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ అసోసియేషన్ జిల్లా శాఖ సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు బదులుగా ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 4వ తేదీలోపు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు ఇవ్వకుంటే 5వ తేదీ జరిగే గురుపూజోత్సవం రోజు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తామంటూ టీచర్ల్ గిల్డ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకరరెడ్డి హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమైం ది. గురుపూజోత్సవం నాడు విద్యార్థుల కోసం గురువులు నిరాహారదీక్షకు దిగనుం డటం హాట్ టాపిక్‌గా మారింది. విద్యార్థు ల సమస్యలపై ఉపాధ్యాయులు నిరాహారదీక్షకు దిగాల్సిన పరిస్థితులను సర్వశిక్షా అభియాన్ అధికారులు కల్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరడుగుతారు? జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సర్వశిక్షా అభియాన్ ద్వారా ఏటా యూనిఫాం అందజేస్తుంటారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబం ధించి వీటి పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లాపరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్ అ«ధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థులకు దుస్తులు అందజేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎయిడెడ్ పాఠశాలలకు సకాలంలో యూనిఫాం అందించకుంటే ఎవరడుగుతారన్న ధీమాలో సర్వశిక్షా అభియాన్ అధికారులు ఉన్నట్లు ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్ధం అవుతోంది. ముందుగా ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసిన తరువాత ఎయిడెడ్ పాఠశాలలను చూడవచ్చన్న ధోరణిలో ఆ శాఖ అధికారులు ఉన్నారు. అధికారుల చర్యలను ఖండిస్తూ ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకరరెడ్డి పత్రికా ముఖ్యంగా చేసిన నిరాహార దీక్ష ప్రకటన విద్యారంగంలో కలకలం రేపింది. 16500 పిల్లల పరిస్థితి ఏమిటి? జిల్లాలోని 40 మండలాల్లో 238 ఎయిడెడ్ పాఠశాలన్నాయి. అందులో 53 ఉన్నత పాఠశాలలు, 17 ప్రాథమికోన్నత పాఠశాలలు, 168 ప్రాథమిక పాఠశాలలున్నాయి. 1 నుంచి 8వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు 16,500 మంది ఉన్నారు. వారిలో అధిక శాతం పేద విద్యార్థులే. యూనిఫాం ఇస్తే వాటిని ధరించుకొని పాఠశాలలకు వస్తుంటారు. అయితే ఇంతవరకు యూనిఫారాలు ఇవ్వకపోవడంతో గత ఏడాది అందించిన దుస్తులతో, ప్రస్తుతం ఉన్న సాధారణ పాత దుస్తుల్లో పాఠశాలలకు వస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలలకు యూనిఫాం ఇవ్వకపోవడంతో అందులో చదువుకునేందుకు పుస్తకాలు పట్టుకొని వెళుతున్న విద్యార్థులను చూసి.. వీరు ఏ పాఠశాలకు వెళుతున్నారన్న అనుమానాలను అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 4వ తేదీలోగా పంపిణీ చేయాలి జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలలన్నింటికీ సెప్టెంబర్ 4వ తేదీలోపు యూనిఫాం అందించాలి. లేకుంటే పెద్దఎత్తున ఉపా«ధ్యాయులను సమీకరించి 5వ తేదీ ఎస్ఎస్ఏ పీఓ కార్యాలయం వద్ద నిరాహారదీక్షకు దిగుతాం. ఎయిడెట్ విద్యార్థుల పట్ల వివక్ష తగదు. వెంటనే అధికారులు స్పందించాలి. – ప్రభాకరరెడ్డి, ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
సాక్షి ఎఫెక్ట్ : ఎయిడెడ్ టీచర్ల పోస్ట్‌ల దందాకు బ్రేక్!
-
సీఎం పేషీలో పేచీ!
-
సీఎం ఆఫీసు సాక్షిగా ఉద్యోగాల అమ్మకం!
-
ఎయిడెడ్ పోస్టుల దందా
పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్న దళారులు మోసపోవద్దుంటున్న విద్యాశాఖాధికారులు ఎయిడెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అ«ధ్యాపక పోస్టులు భర్తీ చేస్తున్నారు. పోస్టుకు రూ.10 లక్షలు ఇస్తే ఆ ఉద్యోగం మీకే..సరేనండి ఇదిగో రూ.10 లక్షలు అంటూ కొందరు. ఇప్పుడు అంత ఇవ్వలేనండి రూ.5 లక్షలు ఇస్తున్నాను మిగతావి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తాను అని మరికొందరు. ఆ సొమ్ముతేవడానికి అప్పులు చేసి కొందరు, ఇంట్లో బంగారునగలు, ఉన్నవి అమ్మి మరికొందరు పరుగులు మీద తెచ్చి లక్షల సొమ్ములు ఇచ్చేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం జిల్లాలో దళారులు చేస్తున్న ఎయిడెడ్ పోస్టుల దందా. -కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) ఇదీ పరిస్థితి జిల్లాలో 45 హైస్కూల్స్ ఉండగా వాటిలో 774 పోస్టులు ఉండేవి. వాటిలో ప్రస్తుతం 300 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉండగా మరో 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూపీ, ఎలిమెంటరీ స్కూల్స్ 100 వరకూ ఉండగా వాటిలో 529 ఉపాధ్యాయులు పని చేసేవారు. ప్రస్తుతం 310 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉండగా మరో 210 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఖాళీగా ఉన్న ఈ పోస్టులు 15 ఏళ్ల నుంచి ఖాళీగా ఉండగా వాటిని 2004 అక్టోబర్ నుంచి భర్తీని బ్యాన్ చేశారు. తర్వాత 2005లో ఎయిడెడ్ సిబ్బంది కోర్టుకెళ్లారు. స్కూల్స్‌లో బోధకులు లేకపోవడంతో విద్యార్థులు ఉండడం లేదు, తాత్కాలిక పోస్టుల భర్తీ చేయాలంటూ పోరాటల ఫలితంగా 2013లో కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పులో తాత్కాలిక ప్రాతిపదికన ఎయిడెడ్ యాజమాన్యమే జీతాలు ఇచ్చుకోవాలని తెలిపింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తునే ఉంది. కొందరు బోధకులు అవసరం కావడంతో జీవో నెంబర్ 1 ప్రాతిపదికన బోధకులను నియమించుకున్నారు. ఈ బ్యాన్‌ను 30.6.2017న లిప్ట్చేసింది. అంతే....ఎయిడెడ్ పోస్టుల భర్తీ జరుగుతున్నాయి. లక్షలు ఇస్తే ఆ ఉద్యోగాలు మీకే అంటూ దళారులు దందా ప్రారంభించారు. ఇప్పటికే చాలామంది అమాయకులు లక్షల రూపాయలు వారి చేతుల్లో పోసారు. దీనిపై విషయం తెలిసినా విద్యాశాఖ కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు, ఆ పోస్టులు ఏమిటి, ఎవరిని భర్తీ చేయాలనే దానిపై సమాచారం ఇస్తే అభాగ్యులు మోసపోయేవారు కారేమో. ఇలా మోసపోయిన కొందరు ‘సాక్షి’వద్దకు వచ్చి తమ బాధను తెలిపారు. తాము మోసపోయామని తెలిపారు. దీనిపై విద్యాశాఖ, ఎయిడెడ్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే పలు విషయాలను వివరించారు. ఏ పోస్టుల భర్తీ జరుగుతుంది? కోర్టు ఉత్తర్వుల మేరకు 2002 నుంచి ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నేరుగా రెగ్యూలర్ అవుతుంది. ఆ తర్వాత కోర్టు 2013 ఇచ్చిన తీర్పుననుసరించి తాత్కాలికంగా జీవో నెంబర్ 1 ప్రాతిపదికన యాజమాన్యం జీతాలు ఇస్తూ భర్తీ చేసుకున్న తాత్కాలిక బోధకులకు ఫైవ్ మెన్ కమిటీతో ఇంటర్వూలు నిర్వహించి వారిని రెగ్యులర్ చేయాలి. ఇప్పటికే ఆ పక్రియ రాష్ట్ర కేంద్రంగా గుంటూరులో ప్రారంభమైంది. అయితే ఈ పక్రియలో ప్రథమంగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఖాళీలను గుర్తించి రేషనలైజ్ చేయాలి, దీంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలి, అంతే తప్ప ఎయిడెడ్ విద్యాసంస్థల్లో కొత్తవారికి ఉద్యోగాలు అనే పక్రియ ప్రస్తుతం లేదు. ఈ పోస్టులు 2002 ముందు, 2013 తర్వాత ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే. మోసపోవద్దు ఎయిడెడ్ పోస్టులు భర్తీ అవుతున్నాయి. మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెపితే ఎవరూ నమ్మవద్దు. ఇది అంతా మోసం. కొత్తవారిని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియమించే పక్రియ ప్రస్తుతం లేదు. ఈ విధానం ఆ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. దీనిపై కొందరు లక్షల సొమ్ము గుంజుతున్న సమాచారం వచ్చింది. దళారులకు సొమ్ములు ఇచ్చి ఎవ్వరూ మోసపోవద్దు. -–ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి డబ్ల్యూఏపీ నెం.9503/2003 వారికి మాత్రమే కోర్టు తీర్పునిచ్చింది డబ్ల్యూఏపీ నెం.9503/2003 వారికి మాత్రమే. అయితే కొందరు ఎయిడెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారని వచ్చి సొమ్ములు గుంజుతున్నారు. ఇదంతా మోసం. ఎవరూ నమ్మవద్దు. సొమ్ములు పొగొట్టుకోవద్దు. –బి.చిట్టిబాబు, ఏపీ టీచర్స్ గిల్డ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల ధర్నా
ఏలూరు సిటీ : ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఆ విద్యాసంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా జరిగింది. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు డి.రాజశేఖర్, కార్యదర్శి కేజే విజయకుమార్ మాట్లాడుతూ ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, లక్షలాది రూపాయల రికవరీకి కారణమైన యాక్ట్ 37ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం 37ను అనుసరించి టీచర్ల నుంచి రికవరీ చేసిన సొమ్మును సర్వీసులో ఉన్న, రిటైరైన వారికి తిరిగి చెల్లించాలని కోరారు. ఎయిడెడ్ టీచర్ల అన్ ఎయిడెడ్ సర్వీసుకు రక్షణ కల్పించాలని కోరారు. హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, జీపీఎఫ్ వర్తింప చేయాలని, కారుణ్య నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2012లో నియామకాలు పొందిన టీచర్లకు రెగ్యులర్ స్కేల్ వర్తింపజేయాలని కోరారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి కె.రవిప్రకాష్, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు ఎన్.ఆస్కార్ విజయ మాదిగ, జాయింట్ సెక్రటరీ జి.మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఎయిడెడ్ స్కూళ్ల సమస్యలపై ఆఖరి పోరాటం
బోట్‌క్లబ్(కాకినాడ) : ఎయిడెడ్ స్కూల్స్ సమస్యలపై ప్రాస్మా(ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ఆఖరి పోరాటానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ పేర్కొన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లోని ఎంఎస్ఎన్ స్కూల్లో బుధవారం జరిగిన ప్రాస్మా జిల్లా సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల ఉన్నతికి కృషి చేస్తున్నామని చెబుతూ కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల అనేక ఎయిడెడ్ పాఠశాలలు మూతపడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై న్యాయస్థానాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ పూర్వ వైభవం వచ్చేంత వరకూ పోరాటం చేస్తానన్నారు. ప్రాస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె ప్రభాకరరావు మాట్లాడుతూ దేశంలో అక్షరాస్యత గణనీయంగా పెరగడంలో ప్రైవేట్ పాఠశాలలు కీలక పాత్ర వహించాయన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఎయిడెడ్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమైందన్నారు. సమావేశంలో ఖాళీ పోస్టుల భర్తీపై రిట్ అప్పీల్‌పై మధ్యంతర ఉత్తర్వులు పై కోర్టులో కంటెంట్ కేసులు వేయడానికి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ చట్టం ప్రకారం ఎయిడెడ్ పాఠశాలలకు వర్తించవని ఈ విషయంపై ప్రాస్మా తరఫున కేసు దాఖలు చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో ప్రాస్మా జిల్లా అధ్యక్షుడు నెహ్రూ, సెక్రటరీ బి. చిట్టిబాబు పాల్గొన్నారు. -
ఎయి‘డెడ్’ పాఠశాల
ఫలితాలు సాధిస్తున్నా ఆదరణ కరువు కోడెల నియోజకవర్గంలో అవస్థలు ప్రముఖులు చదివిన పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తారనే నమ్మకంతో ఇక్కడ చేరాం. పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. హిందీ, ఎన్ఎస్ బోధించేందుకు ఉపాధ్యాయులే లేరు. ఇక పరీక్షల్లో సమాధానాలు ఏమి రాయాలి. మాకు టీసీలన్న ఇవ్వండి లేదా ఉపాధ్యాయులునైనా నియమించండి. ఎనిమిది మంది 8,9,10 తరగతుల విద్యార్థులు ‘సాక్షి’తో అన్న మాటలు ఇవి... సాక్షి, గుంటూరు/ సత్తెనపల్లి: ఒకప్పుడు అధిక సంఖ్యలో విద్యార్థులు... పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు... ఉత్తమ ఫలితాల సాధనతో ప్రై వేటు స్కూళ్ళను తలదన్నే రీతిలో సాగుతున్న ఎయిడెడ్ స్కూళ్లు ప్రస్తుతం కునారిల్లుతున్నాయి. టీచర్ల నియామకంలో జరుగుతున్న జాప్యం... సర్కారు అలసత్వం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి స్కూళ్ళు చాలా ఉన్నా సత్తెనపల్లి పట్టణానికి సంబంధించి శరభయగుప్తా హిందూ ఉన్నత పాఠశాల ఒకటి. జిల్లా పరిషత్ పాఠశాలలకు సంవత్సరానికి రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర బడ్జెట్ కేటాయిస్తున్న ప్రభుత్వం, ఈ పాఠశాల విషయంలో సాయం రూ. 7వేలకు మించడం లేదు. 1931లో స్థాపన.. సత్తెనపల్లి శరభయగుప్తా హిందూ ఉన్నత ఎయిడెడ్ పాఠశాలను 1931లో స్థాపించారు. కొన్నాళ్ల వరకు 2,200 మంది వరకు విద్యార్థులు చేరారు. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆ సమయంలో బాలికల కోసం ప్రత్యేకంగా సత్తెనపల్లిలో బాలికోన్నత పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో కేవలం మగ పిల్లలు మాత్రమే 1,600 మంది వరకు చదువుతున్నారు. రానురానూ ఉపాధ్యాయులు తగ్గిపోవడంతో ప్రస్తుతం ఈ పాఠశాలలో 135 మంది మాత్రమే విద్యార్థులున్నారు. పది మంది ఉపా«ధ్యాయులు, ఇద్దరు నాన్ టీచింగ్ సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. హిందీ, ఎన్ఎస్ సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులు లేరు. గతంలో మరో ఎయిడెడ్ పాఠశాల కు సంబంధించిన ఉపాధ్యాయుడిని ఇక్కడ ఎన్ఎస్ బోధించేందుకు డిప్యూటేషన్ వేశారు. పాఠశాలలో జరిగిన గొడవల కారణంగా డిప్యూటేషన్ రద్దు చేసి ఎన్నాదేవి మండల పరిషత్ పాఠశాలకు బదిలీ చేశారు. హిందీ బోధించేందుకు ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో పిల్లలు చందాల ద్వారా పండిట్ కోర్సు చేసిన ఉపాధ్యాయురాలిని నియమించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ... సత్తెనపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న శరభయగుప్తా హిందూ ఉన్నత ఎయిడెడ్ పాఠశాలను విద్యా శాఖ అధికారులు సైతం పర్యవేక్షించడం లేదు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో ఉపాద్యాయులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులను నియమిస్తాం.. శరభయ్య ౖహె స్కూల్ ఎయిడెడ్ పాఠశాల కావడంతో జిల్లాలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలల నుంచి త్వరలో డెప్యుటేషన్‌పై ఉపాధ్యాయుల భర్తీ చేపడతాం. ఎస్జీటీలు ఈ పాఠశాలలో ఇద్దరు ఎక్కువగా ఉన్నారు. వారిని ఇతర పాఠశాలలకు డెప్యుటేషన్‌పై పంపే ఏర్పాటు చేస్తున్నాం. డీఈఓ శ్రీనివాసరెడ్డి -
ఎయి'డెడ్' స్కూల్స్
ప్రభుత్వ పాఠశాలలు తగినన్ని లేని రోజుల్లో పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎందరో దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పిన ఎయిడెడ్ పాఠశాలలు నేడు పాలకుల నిర్లక్ష్యానికి కుదేలవుతున్నాయి. ఈ స్కూళ్లలో పోస్టుల భర్తీపై నిషేధం విధించడంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆయా పాఠశాలలకు దూరమవుతున్నారు. ఫలితంగా జిల్లాలో అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. * పోస్టులు భర్తీ చేయక.. పిల్లలు రాక కుదేలు * టీచర్లకు పదోన్నతులు, రేషనలైజేషన్ నిల్ * విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా ఇవ్వని వైనం ఏలూరు సిటీ : ఉన్నతాశయాలతో ఏర్పాటైన ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వ వైఖరితో మూతపడే పరి స్థితి వచ్చింది. పోస్టుల భర్తీపై బ్యాన్ విధించటంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు స్కూళ్లకు దూరమవుతున్నారు. జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేక దీనావస్థకు చేరుకున్నాయి. స్కూళ్లలో పోస్టులు భర్తీ నిలుపుదల, రేషనలైజేషన్ చేయకపోవటంతో టీచర్లు లేని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్యాల్లోని ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుండగా, ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం సౌకర్యాలు లేకపోగా వేధింపులకు గురవుతున్నారు. 37 యాక్ట్‌తో ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సర్వీసంతా కష్టపడి పనిచేసినా పూర్తిస్థాయిలో సొమ్మును తీసుకునే అవకాశంలేని దుస్థితిలో ఉన్నారు. ఏమిటీ వివక్ష : జిల్లాలో ఎయిడెడ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 240 ప్రాథమిక పాఠశాలలు, 40 ఉన్నత పాఠశాలలు, మరో ఐదు యూపీ స్కూళ్లు పనిచేస్తున్నాయి. ఆర్సీఎం, సీఎస్ఐ, ఐసీఎం, సీబీసీఎన్సీ, హిందూ ధార్మిక సంస్థలు, ముస్లిమ్ మైనార్టీ ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతోన్న పేదవర్గాల పిల్లలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. జిల్లాలో 17 వేల 500 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులకు కనీసం యూనిఫాం కూడా ఇవ్వడం లేదు. యాక్ట్ 37ను రద్దు చేయాల్సిందే ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తీవ్ర మానసిక వేదన కలిగించే యాక్ట్ 37ను రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. జీవితకాలమంతా ఉపాధ్యాయ వృత్తిలో కష్టపడి పనిచేయగా వచ్చిన సొమ్మును సైతం ప్రభుత్వం వెనక్కిలాక్కోవటం దారుణమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ఎయిడెడ్ సర్వీస్‌ను రెగ్యులర్ సర్వీసుగా గుర్తించి ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ పథకానికి అర్హత కల్పిస్తూ 1980లో ప్రభుత్వం ఉత్తర్వులతో రెగ్యులర్ సర్వీస్‌తో వేతనాలు పొందుతున్నారు. 2005లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిన చట్టం 37తో పరిస్థితులు తిరగబడ్డాయి. ఈ చట్టంతో 1980 నుంచి 2005 మధ్యకాలంలో పనిచేసిన ఉపాధ్యాయులు తీసుకున్న రెగ్యులర్ సర్వీస్ వేతనాలను రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు తీసుకున్న ఇంక్రిమెంట్ల సొమ్మును సైతం రికవరీ చేయాల్సి రావటంతో పదవీవిరమణ అనంతరం ఉపాధ్యాయులకు చిల్లిగవ్వకూడా మిగిలే పరిస్థితి కన్పించటంలేదు. మూతపడుతున్న పాఠశాలలు ఏలూరులోని డగ్లస్ ఎయిడెడ్ పాఠశాల మూతపడింది. దెందులూరులో ఏళ్ల నాటి నైట్ హైస్కూల్‌ను సైతం మూసివేశారు. శనివారపుపేటలోని సీఎస్ఐ ప్రాథమిక పాఠశాల విలీనమైంది. ఉంగుటూరు, బుట్టాయిగూడెం, ఆకివీడు, పెనుగొండ పరిసర ప్రాంతాలు, ఉంగుటూరు, మెట్ట ప్రాంతాల్లోని ఎయిడెడ్ విద్యాసంస్థలు పిల్లలు లేక వెలవెలబోతున్నాయి. సుమారు 100కు పైగా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయుడితో గుడ్డిలో మెల్లలా నెట్టుకొస్తున్నారు. ఉన్నత పాఠశాలలు సైతం దీనావస్థకు చేరుకున్నాయి. ఆకివీడులోని సీబీసీఎన్సీ ఉన్నత పాఠశాల భవనం శిథి లావస్థకు చేరింది. ఆయా ప్రాంతాల్లో ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం కోర్టులకు ఎక్కటంతో అభివృద్ధి నిలిచిపోయింది. రేషనలైజేషన్ చేయాలి ఎయిడెడ్ పాఠశాలల్లో రేషనలైజేషన్ చేయాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయటంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందించే సౌకర్యాలు కల్పించాలి. ఎయిడెడ్ స్కూళ్లలో చదివే పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేయాలి. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. - కేజే విజయకుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ పాఠశాలలపై వివక్ష ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోంది. యాక్ట్ 37ను వెంటనే రద్దు చేసి, అన్ఎయిడెడ్ సర్వీస్‌కు రక్షణ కల్పించాలి. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకునే అవకాశం కల్పిస్తూ నిషేధం ఎత్తివేయాలి. ఎయిడెడ్ స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. - టి.కొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ యూనియన్ -
ఎయిడెడ్ స్టూడెంట్స్ వేరయా!
► యూనిఫాంకు ఇండెంట్ అడగని వైనం ► మిగతా పాఠశాలలకు ఇచ్చేందుకు నిర్ణయం ► ఆందోళనలో సిబ్బంది కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం చూపుతున్న సవతి తల్లి ప్రేమ మరోసారి బయటపడింది. కస్తూర్బా, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే యూనిఫాంల ఇండెంట్‌ను తీసుకుంది. అయితే ఎయిడెడ్ పాఠశాలల ఇండెంట్‌ను మాత్రం తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అక్కడ కూడా పేద విద్యార్థులే చదువుకుంటున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొట్ట మొదటి సారిగా 2015-16 విద్యా సంవ్సరంలో ఉచిత దుస్తులను ప్రభుత్వం అందజేసింది. జిల్లాలోని 142 ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 16,348 మంది విద్యార్థులు అందుకున్నారు. ఈ సంవత్సరం కూడా దుస్తులు వస్తాయని చెప్పి విద్యార్థుల సంఖ్యను పెంచే పనిలో టీచర్లు ఉన్నారు. వస్తాయా..రావా మరోవైపు ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత దుస్తులతోపాటు మధ్యాహ్న భోజనం సదుపాయం ఉందని ఉపాధ్యాయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పిడుగు లాంటి వార్త వారి చెవిన పడింది. జిల్లాలోని కస్తూర్బా, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఉచిత దుస్తులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇండెంట్‌ను ఇవ్వాలని ఎంఈఓలను ఆదేశించింది. అయితే ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇండెంట్‌ను మాత్రం అడగలేదు. దీంతో ఉచిత దుస్తులు వస్తాయా లేదా అన్న అనుమానం నెలకొంది. ఉచిత దుస్తుల కోసం ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం 160 రూపాయలను చెల్లిస్తుంది. ఈ లెక్కనా ప్రభుత్వం గతేడాది 1.30 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది కూడా దాదాపుగా అంతేమంది విద్యార్థులు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం ఉంది. ఎయిడెడ్ విద్యార్థులకు ఉచిత దుస్తులు ఇవ్వాలి: ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఏపీటీజీ ఏళ్ల పోరాటానికి గతేడాది దిగి ఇచ్చి దుస్తులు అందజేసింది. మళ్లీ ఈ ఏడు ఇవ్వకుండా తిరకాసు పెడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ పోరాటం బాట పట్టక తప్పదు. వెంటనే ఎయిడెడ్ పాఠశాలలకు కూడా ఇండెంట్‌ను కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇమ్మానుయేల్, ఏపీటీజీ రాష్ట్ర కార్యదర్శి ఇంకా నిర్ణయం తీసుకోలేదు: గతేడాది జిల్లాలోని 142 ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 16,340 ఉచిత దుస్తులను పంపిణీ చేశాం. ఈ ఏడాది ప్రభుత్వ, కస్తూర్బా, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల ఇండెంట్‌ను అడిగారు. ఎయిడెడ్ పాఠశాలల ఇండెంట్‌ను అడగలేదు. దాని ప్రకారమే ఎంఈఓలకు ఇండెంట్ కోసం పంపాం. త్వరలో ఎయిడెడ్ విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వై.రామచంద్రారెడ్డి, పీఓ -
ఎయి‘డెడ్’ భవనాలు
చిత్రంలో కనిపిస్తున్న భవనం బుధవార పేటలోని జంపాలగట్టయ్య ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాల. ఇందులో నాలుగు గదులు ఉన్నాయి. అందులో రెండు గదులు ఇప్పటికే కూలీ పోయాయి. మిగిలిన రెండు గదులు చిన్నపాటి వర్షానికే చిత్తడిచిత్తడిగామారుతున్నాయి.ఒకప్పుడు 200 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. నేడు 30 మంది కూడా లేని పరిస్థితినెలకొంది. ఇది ఒక్క జంపాలగట్టయ్య పాఠశాల దుస్థితే కాదు. జిల్లాలోని అన్ని ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉంది.ఎప్పుడూ కూలుతాయో తెలియడం లేదు. అయినా ప్రభుత్వం కాని, ఆయా పాఠశాలల యాజమాన్యాలు కాని కనీసం మరమ్మతులు చేపడుదామనే ఆలోచన చేయడం లేదు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 110 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. 41 ఉన్నత ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చాలా పాఠశాలలకు పక్కా భవనాలు, ఆట స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి భవనాలు. అప్పట్లో మేనేజ్మెంట్లు ఆర్థికంగా ఉండడంతో ఏమైన మరమ్మతులు వస్తే వెంటనే చేయించేవారు. ఇందుకు ప్రభుత్వం కూడా చేయూతను ఇచ్చేది. అయితే ఇరవై ఏళ్ల నుంచి చాలా పాఠశాలల మేనేజ్మెంట్లు నిర్వీర్యమయ్యాయి. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలపై సవతి ప్రేమను చూపుతోంది. దీంతో భవనాలు శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం మానేశారు. జిల్లాలో దాదాపు 80 ప్రైమరీ పాఠశాలలకు సరైన పక్కా భవనాలు లేవు. వీటిలో ఇప్పటికే కొన్ని కూలీపోవడంతో ఆయా స్కూళ్లను ఉపాధ్యాయులే అద్దె భవనాల్లో సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. అక్కడ చాలా ధీనమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. బాతురూంలు లేని పాఠశాలలు కూడా ఎయిడెడ్ విభాగంలోనే ఉన్నాయి. ఇక పక్కాభవనాలు ఉన్నా మరమ్మతులకు గురైన పాఠశాలలే దాదాపుగా 60కు పైగా జిల్లాలో ఉన్నాయి. వీటి మరమ్మతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మైనర్ రిపేరిల కోసం ఒక్క రూపాయిని విడుదల చేయడం లేదు. కేవలం స్కూల్ గ్రాంట్‌ను మాత్రమే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 5 నుంచి 7 వేల వరకు విడుదల చేస్తుంది. స్పెషలాఫీసర్లుగా డీవైఈఓలు, ఎంఈఓలు జిల్లాలో చాలా ఎయిడెడ్ పాఠశాలలకు మేనేజ్మెంట్ కమిటీలు లేవు. దీంతో వాటి స్థానంలో ప్రభుత్వం ఉన్నత పాఠశాలలకు డీవైఈఓలు, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు ఎంఈఓలను స్పెషలాఫీసర్లుగా నియమించింది. అయితే వారు కూడా పాఠశాలల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు. ఈనేపథ్యంలో మర్మతులకు గురైన పాఠశాలలు కూలీపోతున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించకుంటే ఉన్న పాఠశాలల్లో మరికొన్ని కూలీపోయి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. మరమ్మతుల కోసం నిధులు ఇవ్వం ఎయిడెడ్ పాఠశాలల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏమి నిధులను ఇవ్వదు. నిర్వహణ కోసం మాత్రం స్కూల్ గ్రాంటును ఇస్తుంది. ఐదు వేల కంటే ఏ పాఠశాలకు ఎక్కువగా రాదు. వాటితో చాక్‌పీసులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంది. - వై. రామచంద్రారెడ్డి, పీఓ, ఎస్ఎస్ఏ ఎయిడెడ్ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర ఎయిడెడ్ పాఠశాలపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. మేనేజ్మెంట్లు పాఠశాలల స్థలాలపై కన్నేసి వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నాయి. ఎయిడెడ్ స్కూళ్లను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. నిర్వహణ గ్రాంటును ఎయిడెడ్ పాఠశాలలకు ఇవ్వాలి. - విక్టర్ ఇమ్మానుయేల్, ఏపీటీజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు జవజీవాలు
- నియామకాలకు సానుకూలత - విలీనం చేసే విద్యా సంస్థల సంఖ్యపైనా ఆరా - ఉప ముఖ్యమంత్రి శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయలు, అధ్యాపకుల నియామకాల్లేక మూతపడే దశకు చేరుకున్న ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు జవజీవాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల స్థితిగతులు, వాటిని బాగు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఇతర అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం లేనందున, ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం లేనందున ఎయిడెడ్ విద్యా సంస్థలకు చేయూతను ఇవ్వడమే మంచిదన్న అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కొత్త విద్యా సంస్థలను ప్రారంభించడం, భవనాలు నిర్మించడం, కొత్తగా ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకాలు చేపట్టడం వంటి వ్యయప్రయాసలతో కూడిన చర్యలు చేపట్టడం కంటే కొంత చేయూతను ఇస్తే బాగుపడే అవకాశం ఉన్న ఎయిడెడ్ విద్యా సంస్థలను గాడిలో పెడితే మంచిదన్న ఆలోచనలు చేసినట్లు తెలిసింది. తదుపరి భేటీలో తుది నిర్ణయం రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలు మూత పడ్డాయి? ఎన్ని విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని యాజమాన్యాలు కోరుతున్నాయి? ఎన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సహకారం అందించి, నియామకాలు చేపడితే పక్కాగా కొనసాగించవచ్చు? ఇప్పుడు కొనసాగుతున్న విద్యా సంస్థలు ఎన్ని? తదితర అంశాలపై సమగ్ర వివరాలను సేకరించాలని విభాగాధిపతులను ఆదేశించారు. ఈ విషయంలో ఆయా విభాగాల అధిపతులు ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలతోనూ సమావేశాలు నిర్వహించి, వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. ఆ వివరాలన్నీ వచ్చాక త్వరలో మరోసారి సమావేశమై తగిన చర్యలు చేపట్టాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో నియామకాలు చేపట్టేందుకు వీలుగా జీవోను సవరించడానికి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సకాలంలో అందించడం వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్, ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ ప్రవేశాలు ఆన్లైనే
► ప్రైవేటు కళాశాలల అక్రమాలకు చెక్ ► నేటి నుంచి జూన్ 6 వరకు వెబ్ ఆప్షన్లు ► జూన్ 10న సీట్ల కేటాయింపు ► ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు ఆదిలాబాద్ టౌన్ : ప్రైవేటు డిగ్రీ కళాశాలల అక్రమాలను చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. శుక్రవారం నుంచి ఆన్లైన్లో ప్రవేశాల స్వీకరించేలా వెబ్సైట్ కూడా ఏర్పాటైంది. దీంతో పేద విద్యార్థులకు మేలు చేకూరనుంది. జిల్లాలో 11 ప్రభుత్వ కళాశాలలు, ఒక ఎయిడెడ్ కళాశాల, 70 వరకు ప్రైవేటు యాజమాన్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో చాలా ప్రైవేటు కళాశాలల్లో మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, ల్యాబ్ సౌకర్యాలు, తరగతి గదులు లేనప్పటికీ ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులను గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా మరికొన్ని ప్రైవేటు కళాశాలలు విద్యార్థులు లేనప్పటికీ బోగస్ సర్టిఫికెట్లతో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు కాజేస్తున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లోనూ ఒకే విధమైన ఫీజు అమలు చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే విధానం అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఆన్లైన్ సర్వీసును ఏర్పాటు చేసింది. వివరాలను జ్ట్టిఞ://ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో చూడొచ్చు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే అన్ని కళాశాలల్లో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ప్రకారం ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు. ఎంపిక చేసుకున్న కళాశాలలో అధ్యాపకులు, కోర్సుల వివరాలు, మౌళిక వసతుల వివరాలను పొందుపర్చారు. రాష్ర్టంలోని ఏ యూనివర్సిటీకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 20 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. రూ.500లతో జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంటర్ హాల్‌టికెట్ నంబర్, ఆధార్ నంబర్, కుల, నివాస, ఆధాయ ధ్రువీకరణ పత్రం, సెల్ నంబర్, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వికలాంగుల ధ్రువీకరణ పత్రం, ఫొటోను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. హెల్ప్ లైన్ సెంటర్ల ఏర్పాటు విద్యార్థుల సందేహలను నివృత్తి చేసేందుకు జిల్లాలో 3 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో అడ్మిషన్ల విషయంలో సహాయం చేసేందుకు అధ్యాపకులను ఏర్పాటు చేశారు. ఇదీ.. ఆన్లైన్ ప్రవేశాల షెడ్యూల్ ►ఈ నెల 20 నుంచి జూన్ 6వ తేదీ వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు ►జూన్ 7, 8 తేదీల్లో రూ.500 అపరాధ రుసుముతో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు ►10న సీట్ల కేటాయింపు ►10 నుంచి 20 వరకు కళాశాలల్లో చేరడం ►22 నుంచి తరగతుల ప్రారంభం ►21 నుంచి 23 రెండో విడత వెబ్ ఆప్షన్లు ►25న సీట్ల కేటాయింపు ►25 నుంచి 30 వరకు కళాశాలల్లో చేరడం ►జూన్ 30 నుంచి జూలై 1 వరకు చివరి విడత వెబ్ ఆప్షన్లు ►జూలై 3న సీట్ల కేటాయింపు ► 4 నుంచి 7 వరకు కళాశాలల్లో చేరడం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశం కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈనెల 20 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడవు ఉంది. రూ.100 ఆన్లైన్ ఫీజు చెల్లించేందుకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నేట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. విద్యార్థుల సందేహల కోసం మూడు హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశాం. - అశోక్, ప్రభుత్వ ఐడీ కళాశాల ప్రిన్సిపాల్, ఆదిలాబాద్ -
పాత పింఛన్ అమలుకు ఉద్యమాలు
► జాక్టో కన్వీనర్ కరుణానిధి మూర్తి ► ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పాత పింఛన్ విధానం అమలు కోసం పోరాటాలను ఉద్ధృతం చేస్తామని జాక్టో కన్వీనర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కరుణానిధిమూర్తి తెలిపారు. ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం జాక్టో రెండో దశ ఆందోళనలో భాగంగా సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయులు ముందుగా జెడ్పీ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంద్భరంగా కరుణానిధిమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సర్వీసు రూల్స్ ప్రక్రియను వేగవంతం చేసి ఎంఈఓ, డైట్, జేఎల్ పదోన్నతులను చేపట్టాలని, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలన్నారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్ రూపొందించాలన్నారు. అనంతరం జాక్టో డిమాండ్లను నివేదిక రూపంలో ఆర్డీఓకు అందజేశారు. ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అసోసియేషన్ ప్రతినిధి దళవాయి శ్రీనివాసులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జాక్టో నాయకులు జీవీ సత్యనారాయణ, చంద్రశేఖర్, చంద్రశేఖర శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల నియామకాలపై ఆంక్షలు ఎత్తివేయండి
విజయవాడ(గాంధీనగర్) : ఎయిడెడ్ ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఆర్ఎస్వీ బీఈడీ కళాశాలలో ఎయిడెడ్ స్కూళ్ల టీచర్స్ గిల్డ్ కృష్ణా జిల్లా శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులకు రెండు విడతల డీఏ నిలిచిపోయిందని తక్షణమే చెల్లించాలన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల నుంచి లక్షల రూపాయల రికవరీకి కారణమైన జీవో 37ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. ఎయిడెడ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు ఏవీఆర్ ప్రసాద్, అధ్యక్షుడు పి.పాల్, ప్రధాన కార్యదర్శి వీవీ రమణమూర్తి, ఆర్థిక కార్యదర్శి బ్రహ్మారెడ్డి, కార్యదర్శులు సుధీర్‌బాబు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
‘ఎయిడెడ్’కు జవజీవాలు!
సాక్షి, హైదరాబాద్: ఎయిడెడ్ విద్యా సంస్థలకు జవజీవాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల సంఖ్య, వాటిల్లో పరిస్థితులు, విద్యార్థులు, బోధన సిబ్బంది సంఖ్య, ఎంత మందిని నియమించాల్సి ఉంటుందనే అంశాలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలోని పాఠశాలలు, జూనియర్ , డిగ్రీ కాలేజీల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా కమిటీలను వేసింది. కమిటీల నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలోని కొన్ని ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలకు ఎకరాల కొద్దీ విలువైన భూములున్నాయి. వాటిపై కన్నేసిన వారసులు, ఇతరులు ఆ సంస్థలను నిర్వీర్యం చేసి అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములను అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. అలాంటి భూముల కోసమే కొంతమంది న్యాయ వివాదాలను సృష్టించారు. వాటి పరిస్థితిని కూడా ప్రభుత్వం తేల్చేయనుంది. మరోవైపు ఎంతో పేరున్న ఎయిడెడ్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజీలు, వీవీ కాలేజ్, ఏవీ కాలేజ్, అంబేడ్కర్ కాలేజ్, వరంగల్‌లో ఎల్బీ కాలేజీ, సీకేఎం కాలేజీ, ఏవీవీ హైస్కూల్, జూనియర్ కాలేజ్, మహబూబియా పంజతన్ కాలేజీ వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచి పేరున్న కాలేజీలతోపాటు విద్యార్థులు ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో అవసరమైన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లక్షన్నర మంది పిల్లలకు 1,700 మందే టీచర్లు రాష్ట్రంలో 850 వరకు ఎయిడెడ్ పాఠశాలలున్నా ప్రస్తుతం 778 స్కూళ్లు మాత్రమే కొనసాగుతున్నాయి. వాటిల్లో 6 వేల మంది టీచర్లు అవసరం కాగా కేవలం 1,700 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. వాటిల్లో 1.48 మంది పిల్లలు చదువుకుంటున్నారు. యాజమాన్యాలే కొంతమందిని తాత్కాలికంగా నియమించుకొని బోధనను కొనసాగిస్తున్నాయి. ఇక 42 జూనియర్ కాలేజీల్లో (ఇందులో 22 కాలేజీలో హైదరాబాద్‌లో ఉన్నాయి.) 4,500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాటిల్లో 1,200 మంది టీచర్లు అవసరం కాగా కేవలం 272 మంది మాత్రమే ఉన్నారు. ఇక డిగ్రీ కాలేజీలు 63 ఉండగా (ఇందులో 50 హైదరాబాద్‌లోనే ఉన్నాయి) వాటిల్లో 18 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో 1,770 మంది లెక్చర ర్లు అవసరం కాగా కేవలం 325 మంది మాత్రమే ఉన్నారు. వీరు కాకుండా బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టాల్సి ఉంది. నియామకాల్లో యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు, న్యాయ వివాదాల నేపథ్యంలో 2006లో ప్రభుత్వం జీవో 35 ద్వారా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో నియామకాలపై నిషేధం విధించింది. -
తెలుగు, హిందీ పండిట్ల పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలుగు, హిందీ పండిట్ల పరీక్షల షెడ్యూల్‌ను గురువారం ఏపీ ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎం.ఆర్. ప్రసన్నకుమార్ ప్రకటించారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 4 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 2014-15 బ్యాచ్‌కి సంబంధించి 30న పేపర్1- అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విద్య, డిసెంబర్ 1న పేపర్ 2- విద్యాపరమైన మనస్తత్వ శాస్త్రం, 2న ఉ.10 గం. నుంచి 11.30 గం. వరకు పేపర్3 (పార్ట్ ఏ) స్కూల్ నిర్వాహణ, మధ్యాహ్నాం 2 నుంచి 3.30 గం. వరకు పార్ట్-బిలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ, 3న పేపర్-4లో తెలుగు,హిందీ బోధనలో విధానాలు, 4న ఉ.10 నుంచి 11.30 గం. వరకు పేపర్-5లో పార్ట్-ఏలో భౌతిక ఆరోగ్య విద్య, కళలు,పని విద్య, మధ్యాహ్నం 2 నుంచి 3.30 గం. వరకు పార్ట్-బీలో తెలుగు కోసం భాషాభివృద్ధి హిందీ కోసం తులనాత్మక వ్యాకరణలు అంశాలు ఉంటాయని డెరైక్టర్ వెల్లడించారు. ఎయిడెడ్ టీచర్ల వేతనాలు మంజూరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎయిడెడ్ టీచర్ల వేతనాలు విడుదల చేస్తూ విద్యా డెరైక్టర్ కిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి భుజంగరావు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. -
రెన్యువల్‌కూ రేటు!
ఎయిడెడ్ స్కూళ్లకు ముడుపుల బెడద రెన్యువల్ కాకపోతే జీతాలు బంద్ ఉసూరుమంటున్న ఉపాధ్యాయులు విశాఖపట్నం: ఎయిడెడ్ స్కూళ్లకు అవినీతి బెడద పట్టుకుంది. మామూళ్లు ఇస్తేనే తప్ప రెన్యువల్ జరగని పరిస్థితి నెలకొంది. అలా రెన్యువల్ పూర్తికాని పాఠశాలల ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోయే ప్రమాదంలో పడుతున్నాయి. దీంతో ఆయా ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు జీతాలందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిడెడ్ పాఠశాలలకు రెన్యువల్ ర్దిష్టంగా ఉండడం లేదు. ఏటా కొన్ని, రెండేళ్లకు కొన్ని రెన్యువల్ చేసుకోవలసినవి మరికొన్ని ఉన్నాయి. పలుకుబడి ఉన్నవారు, ప్రయివేటు స్కూళ్ల వారు రెన్యువల్ విషయంలో ‘అడిగినవి’ సమర్పించుకోవడంతో ఏమంత అవస్థలు పడడం లేదు. కానీ ఏడాదికో, రెండేళ్లకో రెన్యువల్ చేయించుకోవలసి వస్తున్న చోటా, మోటా స్కూళ్ల వారు చిక్కుల్లో పడుతున్నారు. రెన్యువల్ చేయించుకోవాలంటే సంబంధిత స్కూలు స్థల పత్రాలు, ప్లాన్, లీజు ఆధారాలు, ఫైర్ సర్టిఫికెట్లు, పారిశుధ్య పరిస్థితి, ఆట స్థలం వంటివి సమర్పించాలి. వీటన్నిటినీ రీజనల్ జాయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ)కు పంపుతారు. ఆర్జేడీ సంతృప్తి చెందాక రెన్యూవల్ చేస్తారు. కానీ జీవీఎంసీ, ఫైర్, డీఈవో కార్యాలయాల్లో సంబంధిత సిబ్బంది చేతులు తడిపితేనే తప్ప రెన్యూవల్ ఫైళ్లు కదలడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రెన్యువల్ నోచుకోని స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు. సకల హంగులూ ఉన్న పెద్ద ఎయిడెడ్ స్కూళ్లు, ప్రయివేటు పాఠశాలల నిబంధనలనే రేకుల షెడ్లు, సాదాసీదా భవనాల్లో నడుస్తున్న వాటికీ వర్తింప చేస్తూ పితలాటకం పెడుతున్నారని ఈ టీచర్లు వాపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్కో స్కూలు రెన్యూవల్‌కు స్థాయిని బట్టి 30 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ముడుపులు సమర్పించుకోవలసి వస్తోందని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని భరించే వారికి నిరభ్యంతరంగా రెన్యువల్ అయిపోతోందంటున్నారు. ఆ స్తోమతు లేని స్కూలు యాజమాన్యాలు ముడుపులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా రెన్యువల్ నిలిచిపోయి గుర్తింపు (రికగ్నైజేషన్)కు ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆరేడు నెలలుగా కొన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పుడు జీతాల గ్రాంటును మంజూరు చేసినా స్కూళ్లు రెన్యువల్ కాకపోవడం వల్ల వారు వాటిని పొందే అవకాశం లేదు. ఫలితంగా ఈ టీచర్లంతా అటు జీతాల్లేక, త్వరలో అందుకునే వీలు లేక, తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. -
ఎయిడెడ్ విద్యార్థులకు శుభవార్త!
వీరఘట్టం:ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు కూడా యూనిఫాం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని యోచిస్తోంది. దీనివల్ల జిల్లాలో దాదాపు 1500 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇంతవరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాల విద్యార్ధులకు మాత్రమే యూనిఫాం సరఫరా చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యార్థులు మాత్రం సాధారణ దుస్తుల్లోనే తరగతులకు హాజరవుతున్నారు. వారికీ ప్రభుత్వం యూనిఫాం సరఫరా చేస్తే బాగుంటుందని ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు హైదరాబాద్ నుంచి ఆదేశాలందాయి. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంఈఓలకు సమాచారం అందించారు. జిల్లాలో 25 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒక హైస్కూల్, ఆరు ప్రాధమికోన్నత, 18 ఎలిమెంటరీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1500 మంది విద్యార్థులు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించారు. వీరందరికీ మరో నెల రోజుల్లో యూనిఫాం అందనుంది. -
ఇక ఇంటర్‌లోనూ ఉచిత పాఠ్యపుస్తకాలు
ప్రభుత్వ ఎయిడెడ్ విద్యార్థులకు వరం ఇతర విద్యార్ధులకూ చౌకధరలకే పుస్తకాలు హైదరాబాద్: ఆంధ్రపదేశ్ ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు శుభవార్త. ఈ విద్యాసంవత్సరం నుంచీ పాఠ్యపుస్తకాల్ని ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితోపాటు మిగిలిన ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు కూడా తక్కువ ధరలకే విక్రయించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని దాదాపు మూడు లక్షలమందికిపైగా విద్యార్థులకు ఇవి అందనున్నాయి. గతంలో ప్రైవేటుగా విక్రయించే ఈ పుస్తకాల రేట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి దాదాపు సగం ధరకే విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా పుస్తకాల ధరల్ని ముందుగానే నిర్దేశించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయానికీ రాలేదు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు విక్రయించే పుస్తకాల ధరలిలా ఉన్నాయి. -
'ఇంటర్' కు ఉచిత పాఠ్యపుస్తకాలు
- ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల విద్యార్థులకు ఏపీ సర్కారు వరం హైదరాబాద్: ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో చదివే అన్ని మాధ్యమాల ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే వీటి పంపిణీకి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 450 ప్రభుత్వ జూనియర్, 150 ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లోని 3 లక్షల మంది విద్యార్థులకు ఈ ఉచిత పాఠ్యపుస్తకాలను అందిస్తారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల ముద్రణలో సంస్కరణలు చేపట్టి మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వంపై భారం పడకుండానే విద్యార్ధులకు లాభం చేకూరేలా ఇంటర్మీడియెట్ అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు తెలుగు అకాడెమీ ద్వారా ప్రైవేటు పబ్లిషర్లు కొందరు కొనసాగిస్తున్న ముద్రణను ఇంటర్ బోర్డు రద్దు చేసింది. ఇక నుంచి నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డే ప్రైవేటు ప్రింటర్ల ద్వారా ముద్రణ చేయించి విద్యార్థులకు అందించనుంది. దీనికిగాను టెండర్ ప్రకటన కూడా విడుదలైంది. ఇప్పటి వరకు విద్యాహక్కు చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వ ఆర్థికసాయంతో పదో తరగతి వరకు ఉన్న విద్యార్ధులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ముద్రింపచేసి పంపిణీ చేయిస్తోంది. ఇంటర్మీడియెట్ పుస్తకాలను మాత్రం తెలుగు అకాడెమీ ద్వారా ముద్రింపచేసి విక్రయింపచేస్తోంది. ఇందుకు ప్రభుత్వం ఎలాంటి నిధులు చెల్లించదు. అధికారులు ఈసారి తెలుగు అకాడెమీ నుంచి ఈ ముద్రణ కార్యకలాపాలను తప్పించి నేరుగా టెండర్ల ద్వారా సామర్థ్యమున్న ప్రైవేటు ప్రింటర్లకు ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. -
ప్రభుత్వాధీనంలోకి ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు
ఉన్నత విద్యా మండలి విజ్ఞప్తి ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి చర్యలు రూసా అమలుపై సమీక్షలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. తద్వారా మంచి పేరున్న కాలేజీలను కాపాడుకుని అభివృద్ధి చేసుకోవచ్చునన్నారు. రాష్ట్రంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) అమలుపై కేంద్ర ప్రభుత్వ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్ కుమార్ గురువారం హైదరాబాద్ కు వచ్చారు. రాష్ట్రంలో రూసా అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో పాపిరెడ్డి మాట్లాడారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, న్యాక్ అక్రెడిటేషన్ పొందేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రూసా అమలు కోసం రాష్ట్రానికి రూ. 138 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. రూసా మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టినకొద్దీ రాష్ట్రానికి విడతలవారీగా నిధులు వస్తాయన్నారు. ఫ్యాకల్టీ నియామకాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూసాలో మంజూరైనవి.. ఉస్మానియా, జేఎన్టీయూలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్ల చొప్పున నిధులు. తర్వాత మరో రూ. 10 కోట్లు. డాక్యుమెంట్స్ సరిగా లేనందున కాకతీయ వర్సిటీకి మళ్లీ ప్రతిపాదనలు పంపనున్నారు. ఆదిలాబాద్ మోడల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు షరతులతో ఆమోదం. ఈ ఏడాది రూ. 6 కోట్ల నిధులు. మొత్తంగా రూ. 12 కోట్ల కేటాయింపు. కరీంనగర్, వరంగల్, హుస్సేనీఆలం డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఒక్కో దానికి రూ. 4 కోట్ల నిధులు. పది జిల్లాల్లోని 33 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు. -
పండగకూ పస్తులే!
‘చంద్రన్న సంక్రాంతి’ ఎయిడెడ్ టీచర్లకు శాపం మూడు నెలలుగా జీతాలివ్వని ప్రభుత్వం పండుగ మాసంలో అష్టకష్టాలు పడుతున్న టీచర్లు విశాఖ అర్బన్: మూడు నెలలుగా జీతాలు లేక ఎయిడెడ్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా పెద్ద పండుగకు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకవైపు సంక్రాంతి వారోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. ఉపాధ్యాయుల జీతాలకు నిధులు మంజూరుచేయకుండా వారిని అష్టకష్టాలకు గురిచేస్తోంది. ఎయిడెడ్ టీచర్ల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఆగస్టులో హామీ ఇవ్వగా.. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ టీచర్లు ఆందోళన చేపట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. అప్పుల ఊబిలో ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ ప్రైమరీ స్కూళ్లు 1572, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 291, హై స్కూళ్లు 476 మొత్తం 2339 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రైమరీలో 3661 మంది, అప్పర్ ప్రైమరీలో 1401, హైస్కూల్లో 3302 మంది మొత్తం 8364 ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిపై తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు వీరి జీతాలకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఉపాధ్యాయులు అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. జీతాలు లేకపోవడంతో దసరా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉన్న ఎయిడెడ్ టీచర్లు కనీసం పెద్ద పండుగ సంక్రాంతికైనా జీతాలు వస్తాయని ఆశగా చూశారు. కానీ ప్రభుత్వం ఈ నెల కూడా నిధులు మంజూరు చేయలేదు. సంక్రాంతి వారోత్సవాలు చేసుకొనేదెలా! రాష్ట్ర ప్రజలు సంక్రాంతి వారోత్సవాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండగా.. జీతాలు లేకుండా తామెలా పండుగ చేసుకోవాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వెంటనే జీతాలు ఇవ్వాలని ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ గిల్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. -
‘భద్రత’ భారం పిల్లలపైనే..
* ఖర్చు భరించే స్థోమత తమకు లేదనిచేతులెత్తేస్తున్న ఎయిడెడ్ పాఠశాలలు * ఫీజులు పెంచాలని యాజమాన్యాల యోచన సాక్షి, ముంబై : ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులు పెంచాలని యాజమాన్యాలు యోచిస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్ దేశం పెషావర్‌లో ఒక పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 145 మంది విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలల్లో భద్రతను పెంచాలని స్థానిక పోలీసులు జారీ చేశారు. దీనిపై ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. ఈ సందర్భంగా నగర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల నిర్వాహకులు మాట్లాడుతూ.. పోలీసుల సూచనల ప్రకారం.. పాఠశాలల్లో భద్రతను పెంపొందించే స్తోమత తమ వద్ద లేదన్నారు. ఫీజులు పెంచడం, లేదా ప్రభుత్వం ఇందుకు గాను ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా మాత్రమే తాము భద్రతను కొంత మేర పెంచగలుగుతామని వెల్లడించారు. పెషావర్ ఉదంతం అనంతరం పాఠశాలల్లో భద్రత నిమిత్తం ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ నగర పోలీసులు జీవో జారీచేశారు. పాఠశాల ప్రాంగణంలోని ప్రహరీ గోడను ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెంచి పైన బాబ్డ్ వైర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలు, రౌండ్ ద క్లాక్ పర్యవేక్షించే వాకీ టాకీలతో కూడిన భద్రతా సిబ్బంది, ఇంటర్‌కం వంటి సదుపాయాలు ఏర్పాటుచేయాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలకు వచ్చే సందర్శకులను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఈ అంశమై ఆదేశించారు. అయితే ఇంత మొత్తంలో తాము పాఠశాలల్లో భద్రత కల్పించలేమని ఎయిడెడ్ పాఠశాలల అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయలు, నాన్‌టీచింగ్ సిబ్బందికి చెల్లించే జీతాల వరకు మాత్రమే తమకు ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయన్నారు. భద్రతకు సంబంధించిన ఖర్చు తామే భరిస్తున్నామని రాజ్య శిక్షన్ సంస్థ అసోసియేషన్ కార్యదర్శి ఆర్పీ జోషీ తెలిపారు. విద్యార్థుల భద్రతను అంతర్జాతీయ భద్రత అంశంగా పరిగణించి ప్రభుత్వమే నిధులు కేటాయించాలని జోషి అభిప్రాయ పడ్డారు. -
ఎయిడెడ్ టీచర్ల వ్యవహారంలో అవినీతి!
-
ఎయిడెడ్ టీచర్ల వ్యవహారంలో అవినీతి!
ఎయిడెడ్ టీచర్ల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయస్సు పెంపు విషయంలో అవినీతి జరిగిందంటూ దీనిపై ఉన్నతాధికారులు ఓనివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. అవినీతి కారణంగానే ఆరునెలల పాటు దీన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. కానీ హామీ ఇచ్చాను కాబట్టే చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. గతంలో బదిలీల వ్యవహారంలో కూడా ఇలాగే అవినీతికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అయితే.. సీఎం వ్యాఖ్యలతో మంత్రులు అవాక్కయ్యారు. ఎయిడెడ్ టీచర్ల అవినీతి అంశంపై మాత్రం చంద్రబాబుతో పలువురు మంత్రులు ఏకీభవించారు. -
గోల్మాల్ ఉత్తదే!
చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారంతోపాటూ కోడిగుడ్డును ప్రభుత్వం అందజేస్తోంది. అయితే కోడిగుడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి ఏడాదికి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వానికి టోపీ పెడుతున్నట్లు ఇటీవ ల ఆరోపణలు వెల్లువెత్తాయి.అసెంబ్లీలో సైతం ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని ప్రస్తావించగా, మంత్రి వలర్మతి బదులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తం గా ఏడాదికోసారి టెండర్లు పిలిచి కోడిగుడ్డు కొనుగోలు బాధ్యతను అప్పగిస్తున్నామన్నారు. టెండర్ల విధానం వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వచ్చిందన్నారు. కోడిగుడ్ల కొనుగోలులో గోల్మాల్ జరిగిదంటూ జరిగిన ప్రచా రం ప్రతిపక్షాల కుట్రగా ఆమె అభివర్ణించారు. జయ ముఖ్యమంత్రిగా రూ.31వేల కోట్ల పధకాలను ప్రకటించగా, వాటిల్లో ఒక్కటైనా పూర్తయిందాఅని డీఎంకే సభాపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. డీఎంకే మైనార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన ప్రగతికంటే మూడేళ్లలో తమ ప్రభుత్వం సాధించిందే ఎక్కువని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బదులిచ్చారు. డీఎంకే ప్రభుత్వాన్ని మైనార్టీ ప్రభుత్వం అని పిలవడంపై ఆ పార్టీ సభ్యులు గందరగోళం సృష్టించారు. తమది మైనార్టీ ప్రభుత్వమైతే ప్రస్తుత ప్రభుత్వం ఏమిటి, ఈ ముఖ్యమంత్రిని ఎలా పిలవాలి అంటూ డీఎంకే వ్యాఖ్యానించడంతో మరింత గందరగోళం నెలకొంది. జయలలితను అన్నాడీఎంకే నేతలు ప్రజల ముఖ్యమంత్రి అని పిలవడంపై పరోక్షంగా డీఎంకే సభ్యులు ఎద్దేవా చేయడంతో అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ విజయపరంపర కొనసాగిస్తున్న జయను ప్రజల ముఖ్యమంత్రి అనడంలో తప్పేమిటని ఇండియా కుడియరసు పార్టీ అధ్యక్షులు, శాసనభ్యులు తమిళరసు డీఎంకే సభ్యులను నిలదీశారు. శాంతి భద్రతల సమస్యకు దారితీసే స్థాయిలో రాష్ట్రంలో జాతి విద్వేషాలు లేవని సీఎం పన్నీర్‌సెల్వం, పుదియ తమిళగం పార్టీ సభ్యులు డాక్టర్ కృష్ణస్వామిప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూడేళ్లలో తూత్తుకూడి, తిరునెల్వేలీ జిల్లాలో జాతి విద్వేష సంఘటనలు, కేసుల వివరాలను సభకు వివరించారు. తిరునెల్వేలీలో 2013లో 5 హత్యలు, 2014లో 10, తూత్తుకూడిలో 2013లో ఒకటి, 2014లో 3 హత్యలు జరిగాయని వివరించారు. అయితే అవేవీ తీవ్రస్థాయిలో శాంతి భద్రతల సమస్యకు దారితీయలేదని సీఎం అన్నారు. జయపై డీఎంకే సభ్యులు, కరుణపై అన్నాడీఎంకే సభ్యులు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు తీవ్రస్థాయికి చేరగా బాహాబాహీకి సిద్ధమయ్యూరు. స్పీకర్ ధనపాల్‌ను డీఎంకే సభ్యులు ప్రశ్నిం చగా, సభా నిర్వహణ తనకు తెలుసని ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హెచ్చరించారు. అంతేగాక మార్షల్స్ చేత వారిని వెలుపలకు గెంటివేసే ప్రయత్నం చేయడంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. -
టాయిలెట్స్ లేకుంటే ఎయిడెడ్
ఏలూరు సిటీ :మౌలిక సదుపాయాలు లేకుండానే జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్రంగానే స్పందించేందుకు సిద్ధపడుతోంది. ఎయిడెడ్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. తక్షణమే జిల్లాలోని అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో విధిగా మరుగుదొడ్లు నిర్మించి తీరాలనడంతో డీఈవో డి.మధుసూదనరావు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ఏయే ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయి, ఎక్కడ లేవనే అంశంపై ఎంఈవోల నుంచి నివేదికలు రప్పించుకున్నారు. 127 ఎయిడెడ్ స్కూళ్లలో ఇవి లేవని తేలింది. ఆయా పాఠశాలల్లో డిసెంబర్ 1నాటికి వాటిని నిర్మించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారు. కలెక్టర్‌కు తప్పుడు నివేదిక ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయా.. లేవా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కలెక్టర్‌కు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. 19 ఎయిడెడ్ పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్లు లేవని వారు చెబుతుండగా, 127 పాఠశాలల్లో లేవని ఎంఈవోల క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. దీనినిబట్టి చూస్తే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు సమాచారం ఎందుకిచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు జారీ జిల్లాలో 220 ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉండగా, మరుగుదొడ్లు లేని 127 పాఠశాలల్లో డిసెంబర్ 1నాటికి వాటిని నిర్మించాలని ఆదేశిస్తూ ఆయా పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో నుంచి ఈనెల 21న నోటీసులు వెళ్లాయి. డిసెంబర్ 2న సంబంధిత పాఠశాలలను ఎంఈవోలు తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ మరుగుదొడ్లు నిర్మించకపోతే తొలుత ఆ పాఠశాలలకు గుర్తింపును రద్దు చేస్తామని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 5 నాటికీ వాటిని నిర్మించకపోతే సంబంధిత ఎయిడెడ్ పాఠశాలలకు తాళాలు వేస్తారు. దీంతో పాటు రికార్డులను విద్యాశాఖ స్వాధీనం చేసుకుంటుందని, అక్కడ చదువుతున్న పిల్లలను సమీపంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎంఈవో లు గుర్తించిన ప్రకారం ఏలూరు అర్బన్ పరిధిలో 10, ఏలూరు రూరల్‌లో 7 ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. ఆకివీడు మండలంలో 11, భీమడోలు మండలంలో 11, బుట్టాయగూడెం మండలంలో 2, చింతలపూడి మండలంలో 19, దెందులూరు మండలంలో 7, ద్వారకాతిరుమల మండలంలో 3, జంగారెడ్డిగూడెం మండలంలో 3, కామవరపుకోట మండలంలో 4, కొవ్వూరు మండలంలో 1, కాళ్ల మండలంలో 5, లింగపాలెం మండలంలో 6, నిడమర్రు మండలంలో 2, పెదపాడు మండలంలో 8, పెదవేగి మండలంలో 14, పోలవరం మండలంలో 2, టి.నరసాపురం మండలంలో 4, తాడేపల్లిగూడెం మండలంలో 1, ఉండి మండలంలో 4, ఉంగుటూరు మండలంలో 3 ఎయిడెడ్ పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు. సర్కారు బడుల సంగతేంటి! ఎయిడెడ్ పాఠశాలల సంగతి అటుంచితే.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ చాలాచోట్ల మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఎయిడెడ్ పాఠశాలల్లో విధిగా మరుగుదొడ్లు ఉండాలని చెబుతున్న అధికారులు ప్రభుత్వ పాఠశాలలను పక్కనపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 2,700 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో సగానికి పైగా పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇవి ఉన్నా మరుగునపడ్డాయి. వాటి నిర్వహణ సైతం భారంగానే ఉంది. ఉన్నత పాఠశాలల్లో సైతం మరుగుదొడ్లు లేవు. వీటిపైనా అధికారులు దృష్టి సారించాలని విద్యారంగానికి చెందిన పలువురు కోరుతున్నారు. చర్యలు తప్పవు మరుగుదొడ్లు లేకుండా పాఠశాలలు నిర్వహించ టం నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా ఎప్పటినుంచో నెట్టుకొస్తున్న ఎయిడెడ్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సొమ్ములు లేవని, ఇతరత్రా కారణాలు చెప్పినా సహించేది లేదు. డిసెంబర్ 5వ తేదీ అనంతరం మరుగుదొడ్లు నిర్మించకపోతే పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆ పాఠశాలలకు తాళాలు వేస్తాం. - డి.మధుసూదనరావు, డీఈవో -
ఎయిడెడ్ మాయ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నెలంతా కష్టపడితేనే జీతం సక్రమంగా రాని నేటి పరిస్థితుల్లో ముగ్గురు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పనిచేయకుండానే వేతనాలు చెల్లించిన విద్యాశాఖ తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మార్చి 23న ఎయిడెడ్ మాయ ప్రభుత్వం సీజ్ చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు ఈ ఏడాది ఏప్రిల్ వరకూ వేతనాలు రూ.11 లక్షలు చెల్లించారు. మళ్లీ మే నుంచి ఇప్పటి వరకూ వేతనాలు చెల్లించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. కందుకూరులోని అబ్రహ్మం మెమోరియల్ ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ పాఠశాలకు సంబంధించి స్థల వివాదం ఉంది. అసలు ఈ స్థలం సంస్థది కాదని హైకోర్టు చెప్పడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో కలెక్టర్, డీఈవో ఆదేశాల మేరకు ఆ స్కూల్‌ను మూసివేయడమే కాకుండా ఆ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేరోజున అందులో ఉన్న ముగ్గురు ఎయిడెడ్ ఉపాధ్యాయులను వేరే ప్రాంతాల్లోని ఎయిడెడ్ స్కూళ్లకు డిప్యుటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కె నాగబ్రహ్మేంద్రస్వామిని మద్దిరాలపాడులోని హైస్కూల్‌కు, ఎన్ రాధాకృష్ణమూర్తి, ఇస్సాక్ డేవిడ్‌లను పేర్నమిట్టలోని ఆది ఆంధ్రా ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్‌కు డిప్యుటేషన్‌పై పంపుతూ ఆదేశాలిచ్చారు. అయితే ఈ ముగ్గురు తమను తమ స్కూల్ కరస్పాండెంట్ రిలీవ్ చేయలేదంటూ వారు ఎక్కడా చేరకుండా ఖాళీగా ఉండిపోయారు. వీరు గత ఏడాది డిసెంబర్‌లోనూ, ఈ ఏడాది మార్చిలో తమను కరస్పాండెంట్ రిలీవ్ చేయకపోవడం వల్ల ఎక్కడా చేరలేని పరిస్థితి ఉందని, అందువల్ల తమకు వేతనాలు చెల్లించాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై విద్యాశాఖ ఈ ముగ్గురు ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడానికి వీలుగా ఆఫీస్ నోట్‌ను కలెక్టర్‌కు ఇచ్చింది. ఉపాధ్యాయుల వినతిపత్రంలో తమను కరస్పాండెంట్ రిలీవ్ చేయలేదని పేర్కొనగా, విద్యాశాఖ అధికారులు దీనికి భిన్నంగా ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై వేరే స్కూల్స్‌కు వేయగా అక్కడి కర స్పాండెంట్లు చేర్చుకోనందున వీరిని వేరే స్కూల్స్‌కు డిప్యుటేషన్ వేయడానికి అనుమతి ఇస్తూ అప్పటి వరకూ వేతనాలు చెల్లించాలంటూ నోట్‌పెట్టారు. దీనికి కలెక్టర్ కూడా ఆమోద ముద్ర వేశారు. వీరికి అబ్రహం మెమోరియల్ ఎయిడెడ్ స్కూల్ పేరుతోనే ఏడాదిపాటు సుమారు 11 లక్షల రూపాయల వేతనాలు చెల్లించారు. ఒక మూతపడిన స్కూల్ పేరుతో వేతనాలు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. వారు ఇప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేరే స్కూళ్లలో పనిచేయకుండా, మళ్లీ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ వేతనాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్‌ను వివరణ కోరగా గతంలో ఉన్న విద్యాశాఖ అధికారి వీరికి వేతనాలు చెల్లించినట్లు తన దృష్టికి వచ్చిందని, పని చేయకుండా వేతనాలు ఇవ్వడం తప్పేనని ఆయన అంగీకరించారు. -
గ్రంథా‘లయ’తప్పుతోంది
ఒంగోలు: పఠనా కేంద్రాలుగా పరిఢవిల్లాల్సిన గ్రంథాలయాలు జిల్లాలో దీనావస్థలో నడుస్తున్నాయి. జిల్లాలో 65 మండల, 12 గ్రామీణ గ్రంథాలయాలుంటే వాటిలో కేవలం 25 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. వీటిలో కూడా సగం గ్రంథాలయాలు గత పదేళ్లలో నిర్మించినవే కావడం గమనార్హం. 28 ఏళ్ళుగా నూతన శాఖ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదంటే గ్రంథాలయాల పట్ల పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ఎయిడెడ్ గ్రంథాలయమైన వేటపాలెం సారస్వత విద్యానికేతన గ్రంథాలయం జాతి యావత్తు ప్రశంసలు అందుకుంటుండగా మరోవైపు ఫ్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంథాలయాలు మాత్రం రోజురోజుకూ పాఠకాదరణకు దూరమవుతున్నాయి. జిల్లాలో 65 గ్రంథాలయాలున్నాయి. వాటిలో గ్రేడ్ -1 కేటగిరీలో మార్కాపురం గ్రంథాలయం ఉండగా, మరో నాలుగు గ్రేడ్-2, అరవై గ్రంథాలయాలు గ్రేడ్-3 పరిధిలోనున్నాయి. ఇవి కాకుండా 12 గ్రామీణ గ్రంథాలయాలున్నాయి. జిల్లాలో చివరిగా గ్రంథాలయం ఏర్పాటైంది 1986లో కావడం గమనార్హం. అంటే 28 ఏళ్లుగా కనీసం ఒక్క నూతన శాఖ కూడా ప్రారంభం కాకపోవడాన్ని పరిశీలిస్తేనే గ్రంథాలయాల పట్ల ఎంతటి చిన్నచూపుందో అర్థమవుతోంది. అయితే ఈ సమస్యనుంచి తప్పించేందుకు బుక్ డిపాజిట్ సెంటర్లంటూ 48 ప్రారంభించినా అవి వాస్తవానికి నిరుపయోగమే. అధికారుల లెక్కల్లో ఉన్నట్లు చెబుతున్నా వాస్తవానికి అవి పనిచేస్తున్న దాఖలాలే లేవు. వారంలో శుక్రవారం మినహా అన్ని రోజులు పనిచేసే ఈ బుక్‌డిపాజిట్ సెంటర్లకు పంచాయతీ ఒక గదిని గ్రంథాలయ నిర్వహణ కోసం ఉచితంగా కేటాయించాలి. అందులో రోజుకు రెండు పత్రికలతోపాటు కొన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. నెల రోజులపాటు కేవలం రూ.500లకోసం పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వీటి బాగోగులు చూసే నాథుడే కరవయ్యారు. 65 గ్రంథాలయాలలో సంతరావూరు, ముండ్లమూరు, మల్లవరం గ్రంథాలయాలు గ్రంథపాలకులు లేక ఏళ్ళ తరబడి మూతపడ్డాయి. కనిగిరిలో రికార్డు అసిస్టెంటే ప్రస్తుతం ఇన్‌ఛార్జి గ్రంథపాలకునిగా వ్యవహరిస్తున్నారు. మరో ముగ్గురు ఈ ఏడాది రిటైరయ్యేవారున్నారు. ఇప్పటివరకు 25 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలలో నడుస్తుండగా 15 గ్రంథాలయాలు మాత్రం అద్దె ఇళ్ళల్లో ఏర్పాటు చేశారు. మిగిలినవి మాత్రం ఎటువంటి అద్దె లేకుండా పంచాయతీ భవనాలలో నడుస్తున్నాయి. ప్రస్తుతం పొదిలిలో రూ.17 లక్షలు, వై.పాలెం, త్రిపురాంతకంలలోని గ్రంథాలయాలకు రూ.10 లక్షలు చొప్పున నిధులు వెచ్చించి సొంత భవనాలను నిర్మిస్తున్నారు. ఇక మార్కాపురంలో రూ.7.50 లక్షలు, కంభంలో రూ.5.50 లక్షలతో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. విజ్ఞాన కేంద్రాలపైనా విభజన భారం రాష్ట్రం విడిపోవడంతో విజ్ఞాన కేంద్రాలైన గ్రంథాలయాలకు ఈ ఏడాది ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులే జరగలేదు. సాధారణంగా కనీసం కోటి రూపాయల బడ్జెట్ ఉంటుంది. కానీ ఇంతవరకు బడ్జెట్ కేటాయించకపోగా రోజువారీ నిర్వహణ విషయంలో కూడా 50 శాతం ఖర్చు తగ్గించుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అంటే పత్రికలు, మ్యాగజైన్లు, ఇంకా ఇతరత్రా అన్నింటిపైనా ఈ భారం పడింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు పెద్ద మొత్తంలో విద్యార్థులు వస్తుంటారు. రోజురోజుకు పెరుగుతున్న పోటీకి తగ్గట్లుగా అవసరమైన పుస్తకాలను గుర్తించి కొనుగోలుచేయాలి. కానీ నేడు పుస్తకాల కొనుగోలుకు అధికారులు వెనుకాడుతున్నారు. వారోత్సవాల నిర్వహణకు కోతలే సాధారణంగా గ్రంథాలయాల వారోత్సవాలకు ప్రభుత్వం ఇచ్చేదే మొక్కుబడి మొత్తం. అయితే ఈ ఏడాది అందులోను 50 శాతం కోతలు కోసేసింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వారం రోజుల కార్యక్రమాల నిర్వహణకు రూ.25 వేలు కేటాయించేది. కానీ ఈ ఏడాది రూ.12 వేలతో సర్దుకొమ్మన్నారు. ఇక గ్రేడ్-1, గ్రేడ్-2 గ్రంథాలయాలకు రూ.5 వేలు గత ఏడాది కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ.2,500 మాత్రమే. ఇక మిగిలిన గ్రంథాలయాలకైతే గత ఏడాది రూ.1500 కేటాయించగా ఈ ఏడాది ఆ మొత్తాన్ని కూడా రూ.700 కుదించారు. ఈ కొద్దిపాటి మొత్తంతో వారం రోజులపాటు కార్యక్రమాల నిర్వహణే కాదు, నిర్వహించినట్లుగా ఆధారాలను, అన్ని రకాల బిల్లులను కూడా జిల్లా గ్రంథాలయానికి గ్రంథపాలకులు సమర్పించాల్సి రావడం గమనార్హం. ఈ మొత్తంలోనే కార్యక్రమాల నిర్వహణే కాదు...పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కనిపించని కొత్త పుస్తకాల ఊసు నవలల కోసం డబ్బులు వెచ్చించవద్దు...అన్నీ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలనే కొనుగోలుచేయాలంటూ రెండేళ్ల కిందటే సర్కారు హుకుం జారీ చేసింది. దీంతో పల్లెల్లో ఉన్న గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు రాకపోవడంతో సగం మంది పాఠకులు దూరమయ్యారు. ఆ తరువాత జిల్లాకు సంబంధించి పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. అయితే దీనికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అధ్యక్షతన జరగాలి. కానీ ఆ పదవి ఖాళీగా ఉండడంతో మరింత అవరోధంగా మారింది. దీంతో తగ్గిన పాఠకాదరణను పెంచేందుకు గ్రేడ్-1 గ్రంధాలయ అధికారి నెలకు 7, గ్రేడ్-2 గ్రంథపాలకుడు నెలకు 5, మిగిలిన గ్రంథపాలకులు నెలకు ముగ్గురు చొప్పున కొత్త పాఠకులను (నూతన సభ్యుని చందా రూ.50) పెంచాలంటూ లక్ష్యాలను నిర్థేశించడం విడ్డూరం. కోటి రూపాయలకు పైగా సెస్ బకాయిలు: జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సీహెచ్.వెంకట్రావు పంచాయతీలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు అన్నీ కలిపి కోటి రూపాయలకుపైగా బకాయి పడ్డాయి. ప్రజలు చెల్లించే ఇంటి పన్నులో 8 శాతం గ్రంథాలయ పన్ను ఇమిడి ఉంటుంది. ప్రజలు మీసేవ, లేదా ఈ సేవల ద్వారా చెల్లించిన సమయంలో సంబంధిత మొత్తం జిల్లా గ్రంథాలయ సంస్థకు జమవుతుంది. ప్రజలు నేరుగా పంచాయతీ కార్యదర్శికి, మున్సిపాల్టీలలోని ఖజానా విభాగంలో చెల్లించిన సందర్భంలో మాత్రం గ్రంథాలయ పన్నుకు సంబంధించిన చెల్లింపులు గ్రంథాలయ శాఖ ఖాతాకు జమకావడంలేదు. కందుకూరు, మార్కాపురంల నుంచి వందశాతం పన్ను తమకు జమవుతుంది. కనిగిరి, అద్దంకి, చీమకుర్తి నగర పంచాయతీల నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తమ శాఖకు జమకాలేదు. -
ఎట్టకేలకు ఇసుక రీచ్‌లకు అనుమతి
సాక్షి ప్రతినిధి, విజయనగరం ః జిల్లాలో ఎట్టకేలకు ఆరు ఇసుక రీచ్‌లకు జిల్లా యంత్రాంగం అనుమతిచ్చింది. భూగర్భజల శాఖ పరిశీలించి, అంగీకరించిన తర్వాత నిర్ధేశిత రీచ్‌లలో ఇసుకను వినియోగించడానికి అనుమతి ఇచ్చినట్టు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అవసరం ఎక్కువగా ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ(మేక్స్)గా ఏర్పడిన గ్రామైక్య సంఘాలకు ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. గుర్ల మండలం కలవచర్ల, నెల్లిమర్ల మండలం పారసాం, కొమరాడ మండలం నిమ్మలపాడు(దుగ్గి), కల్లికోట, జియ్యమ్మవలస మండలం బిట్రపాడు, బొబ్బిలి మండలం పారాదిలో ఇసుక రీచ్‌లు గుర్తించి అనుమతులిచ్చినట్టు వివరించారు. జిల్లాలో దాదాపు 60 ఇసుక రీచ్‌లను పరిశీలించగా అందులో మూడో తరగతి రీచ్‌లుగా ఆరింటిని భూగర్భ జల శాఖ గుర్తించడంతో అనుమతులిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆరు రీచ్‌లలో 63 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. జిల్లా అవసరాలకు ఇది సరిపోనందున మరికొన్ని ఇసుక రీచ్‌ల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా అవసరమైతే శ్రీకాకుళం నుంచి రప్పించే ఆలోచన ఉందన్నారు. విజయనగరం, బొబ్బిలిలలో డిపోలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ డిపోల వద్దకు ఇసుక తీసుకొచ్చి, అక్కడ నుంచి రవాణా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తుఫాన్ బీభత్స నేపథ్యంలో మాన్యువల్‌గా నిర్వహిస్తామని, తదుపరి ఆన్లైన్లో కంప్యూటరీకరణ ద్వారా ఇసుక నిర్వహణ చేపడతామని, సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకోవడానికి పరిశీలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రస్తుతానికి ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.500లకు విక్రయించడానికి నిర్ణయించామన్నారు. మేక్స్ పేరుపై ఆంధ్రా బ్యాంకు శాఖలో చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ, సంబంధిత ఇంజినీరింగ్ అధికారి ధ్రువీకరణపత్రం పొంది సమర్పించాలన్నారు. ప్రస్తుతం కొనుగోలుదారులు తమ సొంత ఖర్చులతో వేతనదారులను(లోడింగ్, అన్లోడింగ్) ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేనికోసం ఇసుకను కొనుగోలు చేస్తున్నారో అదే అవసరం నిమిత్తం అదే స్థలంలో ఉపయోగించాల్సి ఉందన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక రీచ్ వద్ద ఎడ్లబండి, ట్రాక్టర్లకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఇసుక తవ్వడానికి యంత్రాల వినియోగం నిషేధమని తెలిపారు. అనధికార ఇసుక స్టాకు పాయింట్ల నిర్వహణను కూడా నిషేధించినట్టు చెప్పారు. ఇసుక అక్రమ రవాణా, ఇతర అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులకు 8008201341 నంబర్‌కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి గ్రామ మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల శాఖలు పర్యవేక్షిస్తాయని, జిల్లా స్థాయిలో గనులు భూగర్బ జలశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. కొసమెరుపు ఏంటంటే కొత్తగా అమలు చేస్తున్న ఈ ప్రక్రియలో లోపాలు ఎదురవుతాయని, అవకతవకలకు అవకాశం ఉంటుందని, అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం విశేషం. ఈ సమావేశంలో డీఆర్డీఎ ప్రాజెక్టు డెరైక్టర్ పెద్దిరాజు, అదనపు పీడీ సుధాకర్, భూగర్భగనుల శాఖ ఏడీ చౌదరి, ఇనిస్టిట్యూషనల్ బిల్డింగ్ ప్రాజెక్టు మేనేజర్ డైసీ పాల్గొన్నారు. -
యూ‘నో’ఫాం
- విద్యాసంవత్సరం ప్రారంభమై 3 నెలలు అవుతున్నా సరఫరా కాని యూనిఫాం - ఇక కుట్టేదెప్పుడు.. కట్టేదెప్పుడు - జిల్లాకు రూ.6 కోట్లు కేటాయింపు - రూ.3 కోట్లు ఆప్కోకు విడుదల - ఎయిడెడ్ విద్యార్థుల పట్ల వివక్ష సాక్షి, కడప : ప్రతి యేడాది లాగే ఈ యేడాది విద్యార్థులకు యూనిఫాం కష్టాలు తప్పడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం మాత్రం అందలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఈ వారంలో మొదలు కావడం చూస్తుంటే మరో మూడు నెలలకైనా యూనిఫాం అందుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,566 పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులు చదివే విద్యార్థులకు యూనిఫాంను సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జిల్లాలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున యూనిఫాం అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు అందజేయాల్సిన దుస్తులకు సంబంధించిన కాంట్రాక్టును ఆప్కో సంస్థకు కేటాయించారు. అయితే సంస్థకు ఇప్పటి వరకు ఎటువంటి మొత్తం అందజేయకపోవడంతో వారు కేవలం మండలాల వారీగా విద్యార్థుల వివరాలు, ఇండెంట్ మాత్రం సేకరించి మిన్నకుండిపోయారు. కాగా నాలుగు రోజుల క్రితం దుస్తుల కోసం ఎస్ఎస్ఏకు దాదాపు రూ. 6కోట్లు మంజూరు కాగా ఇందులో 50 శాతం నిధులను విడుదల చేసినట్లు తెలిసింది. దీంతో ఆప్కో సంస్థ ఆగమేఘాల మీద విద్యార్థులకు దుస్తులను సమకూర్చే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. కుట్టేదెప్పుడు... కట్టేదెప్పుడు.. విద్యార్థులకు దుస్తులు కుట్టే బాధ్యతను ఎస్ఎస్ఏ అధికారులు మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు కేటాయించారు. దీంతో వారికి రేపో మాపో దుస్తులు కుట్టే బాధ్యత అప్పగించనున్నారు. ఇప్పటికే మూడు నెలల ముచ్చట ముగిసింది. ఇక దాదాపు 4 లక్షల దుస్తులను ఎప్పుడు కుడతారో.. పాఠశాలలకు ఎప్పుడు అందజేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో దసరా సెలవుల ముందైనా అందజేస్తారా లేదా అన్న మీమాంసలో విద్యార్థులు ఉన్నారు. ప్రతిసారీ ఇదే వరుస.. విద్యార్థుల విషయంలో ప్రతిసారీ ఇదే వరుస కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. విద్యార్థుల దుస్తుల విషయంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. ప్రతిసారీ పాఠశాలల పునఃప్రారంభ సమయంలో బడిబాట పేరుతో హంగామా చేసే అధికారులకు యూనిఫాం గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నా ఉన్న పథకాలను విస్మరించకుండా సరైన సమయంలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఎయిడెడ్ విద్యార్థుల పట్ల ఎందుకీ వివక్ష.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ, జిల్లా పరిషత్, నగరపాలక, పురపాలక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజనం, ఉచిత దుస్తులను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే అదే ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఎయిడెడ్ పాఠశాలల పట్ల మాత్రం ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలను అందజేస్తున్న ప్రభుత్వం ఉచిత దుస్తుల విషయంలో మాత్రం ఎందుకు మీనవేషాలు లెక్కిస్తున్నారో అంతుచిక్కడం లేదు. -
మూసేసిన స్కూల్లో టీచర్ పోస్టులా?!
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పాఠశాల అది. రెండేళ్ల క్రితం విద్యార్థులు లేరన్న సాకుతో మూతవేశారు. ఆ స్కూల్లో పదేళ్ల కిందట మంజూరైన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికీ విశ్వప్రయత్నాలు చేస్తోంది యాజమాన్యం. అందుకు విద్యాశాఖలోని కొందరు లోపాయకారిగా పావులు కదుపుతున్నారు. సాక్షాత్తు అడిషనల్ జాయింట్ కలెక్టర్‌ను సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ప్రక్రియను నిర్వహించిన నెల్లూరు డిప్యూటీ ఈఓను తప్పించి తాజాగా గూడూరు డిప్యూటీ ఈఓకు ఆ బాధ్యతను అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. మళ్లీ ఆ ఉపాధ్యాయ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన మూసేసిన సీఏఎం స్కూల్ తరుపున ఉద్యోగాలు కల్పించి ఇతర ఎయిడెడ్ స్కూళ్లకు డిప్యుటేషన్‌పై పంపాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అందుకు ప్రస్తుతం ఇన్చార్జీ డీఈఓ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, బాధితులు అందజేసిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని సీఏఎం ఉన్నత పాఠశాలను వందేళ్ల క్రితం మిషనరీలు ప్రారంభించాయి. ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించే క్రమంలో ఎయిడెడ్ పాఠశాలగా మారింది. 1980వ దశకం వరకు అప్రహతిహతంగా విద్యారంగంలో ఆ పాఠశాల ఓ వెలుగు వెలిగింది. జస్టిస్ అన్సారీ, బెజవాడ గోపాల్‌రెడ్డి వంటి ఉద్దండులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించారంటే ఈ పాఠశాల ప్రత్యేకతలను చెప్పనవసరంలేదు. యాజమాన్య నిర్లిప్తత, ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ప్రభావంతో 90వ దశకం నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేపి తగ్గనారంభించింది. ఈ క్రమంలో 2004లో ఎనిమిది టీచర్‌పోస్టుల నియామకానికి యాజమాన్యం నిర్ణయించింది. అప్పుడు పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్య 774. 2004 ఆగస్టులో నాలుగు స్కూల్‌అసిస్టెంట్లు, నాలుగు ఎస్జీటీ పోస్టులకు మొత్తం ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో మ్యాథ్స్ అసిస్టెంట్ మూడు, ఫిజికల్సైన్స్ ఒకటి, ఎస్జీటీలు నాలుగు పోస్టులున్నాయి. అదే ఏడాది అక్టోబర్‌లో 32 మందికి అర్హత పరీక్షను నిర్వహించారు. ఫలితాలు విడుదల చేయకముందే 2004 డిసెంబర్లో ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీని రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కొంతకాలం తరువాత పాఠశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఎయిడెడ్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బ్యాన్ ప్రకటించకముందు ఇంటర్వ్యూలు నిర్వహించిన వారికి పోస్టులు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు 2013 మార్చిలో తీర్పునిచ్చింది. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని యాజమాన్యం అధికారులు, అభ్యర్థులకు చెబుతూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. అదే నెలలో ఇంటర్వ్యూల పేరుతో 32 మంది అభ్యర్థులకు సీఏఎం హైస్కూల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లిమూసేసిన పాఠశాల్లో టీచర్ పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు పొంతనలేని సమాధానాలతో చల్లగా జారుకున్నారు. అనంతరం స్కూల్ పనిచేయడంలేదని, ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు లేవని, ఇంటర్వ్యూలు పంపిన కాల్‌లెటర్లు, అభ్యర్థుల హాల్ టికెట్లు, జవాబుపత్రాలు లేవని డిప్యూటీ ఈఓ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. అప్పుడు డీఈఓగా వ్యవహరిస్తున్న మువ్వా రామలింగం ఈ వ్యవహారంలో తలదూరిస్తే ఉన్న ఆరోపణలకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని మిన్నకుండిపోయారు. ఆర్జేడీ కార్యాలయం ఒత్తిడి, జిల్లా విద్యాశాఖ తాజాగా ఈ ఏడాది జూన్‌లో మళ్లీ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఈ పంచాయతీ ఏజేసీకి చేరింది. విద్యాశాఖ అధికారులను, పాఠశాల యాజమాన్య ప్రతినిధిని పిలిపించి విచారణ చేపట్టారు. అవసరమైన పత్రాలు లేకుండా పోస్టులు ఎలా భర్తీ చేస్తారంటూ ఇంటర్వ్యూ నిర్వహణాధికారి అడిగిన పత్రాలను చూపాలని యాజమాన్యప్రతినిధులు పలు సూచనలు చేశారు. కొద్ది రోజులు మిన్నకున్న ఆ ప్రతినిధి లోపాయకారి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఇన్చార్జీ డీఈఓ తన వంతు సహాయ సహకారాలందిస్తున్నట్లు సమాచారం. మూసేసిన పాఠశాల్లో పోస్టులు భర్తీచేయడం ఏమిటని? విద్యాశాఖలోని ఉద్యోగులు విస్మయం చెందుతున్నారు. మూసివేసింది ఇలా : చరిత్ర క లిగిన పాఠశాలకు రెండు అతిపెద్ద భవనాలు, విశాలమైన మైదానం ఉంది. ఇప్పటికే సీఏఎం హైస్కూల్లో చాలా భాగం అన్యాక్రాంతమైంది. యాజమాన్యం విడతలు విడతలుగా దాన్ని విక్రయించేసింది. స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో ఉన్న విద్యార్థులను బలవంతంగా బయటి స్కూళ్లకు పంపివేశారు. అదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను సైతం పక్క స్కూల్లో చేర్పించారు. 2012లో సుమారు 180 మంది విద్యార్థులు ఉన్నప్పుడు స్కూల్‌ను ఆకస్మికంగా మూసివేశారు. ఇందుకు సంబంధించిన సమాచారం ముందుగా విద్యాశాఖకు పంపలేదు. అప్పుడు పనిచేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులను, ముగ్గురు నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను వివిధ ప్రాంతాల్లో డిప్యుటేషన్‌పై పంపారు. ఎందుకింత శ్రద్ధ?... ముడుపులు ముట్టినందుకేనా? 2004లో రాతపరీక్ష నిర్వహించామని చెప్పే యాజమాన్యం ఈ అంశంపై విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎనిమిది పోస్టులకు సుమారు పది మంది వద్ద రూ. లక్షల్లో వసూలు చేశారనేది బహిరంగ రహస్యం. వారి ఒత్తిడి తట్టుకోలేక కోర్టును ఆశ్రయించేందుకు ఆ అభ్యర్థుల నుంచే మళ్లీ డబ్బులు వసూలు చేశారు. ఉన్న పోస్టులకంటే ఎక్కువ మంది దగ్గర అధిక మొత్తంలో వసూలు చేసినట్లు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు వద్ద నుంచి తీసుకున్నట్లు సమాచారం. అప్పడు రాతపరీక్షకు హాజరైన పలువురు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోయారు. కొంత మందికి రిటైర్మెంట్ డేట్ దగ్గర పడింది. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చిన అభ్యర్థుల ఒత్తిడికి తట్టుకోలేక ప్రభుత్వాన్ని, విద్యాశాఖను, అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలను పునఃప్రారంభించకుండా పోస్టులను భర్తీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలను పాటించాల్సి ఉంది కోర్టు ఉత్తర్వులను పాటించాలి . సీఏఎం స్కూల్ ఉపాధ్యాయుల భర్తీపై పూర్తి నివేదికను ఏజేసీ ఇవ్వమన్నారు. సాధ్యాసాధ్యాలను ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఉష, డీఈఓ -
ఏపీఎన్జీవోల భూమిని బదలాయించొద్దు
ఆ భూములపై యధాతథస్థితిని కొనసాగించండి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం విచారణ 4 వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో ఏపీ ఎన్జీవో మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన 189.11 ఎకరాల భూమిని మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ)కి బదలాయించొద్దని హైకోర్టు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నందున, దాని విషయంలో యధాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూమి స్వాధీనానికి సంబంధించి ఎపీ ఎన్జీవో హౌసింగ్ సౌసైటీకి నోటీసు జారీ, ఇతర పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. గోపన్నపల్లిలో తమకు కేటాయించిన 189.11 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (అసైన్మెంట్) బి.ఆర్.మీనా ఈ నెల 2న జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలోపిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. భూమి స్వాధీనం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని తెలిపారు. భూ స్వాధీనానికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లోనే నోటీసు ఇచ్చామని అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి తమకెటువంటి నోటీసూ అందలేదని కోర్టుకు నివేదించారు. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. భూముల స్వాధీనం నిర్ణయం ప్రస్తుత ప్రభుత్వానిది కాదని చెప్పారు. గత ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 20న సొసైటీకి నోటీసు జారీ చేసి, భూ కేటాయింపులను ఎందుకు రద్దు చేయరాదో వివరణ కోరగా సమాధానం రాకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం భూ స్వాధీన చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. హౌసింగ్ సొసైటీ నోటీసు అందుకుందంటూ, సంబంధిత అక్నాలడ్జ్‌మెంట్‌ను న్యాయమూర్తి ముందుంచారు. హౌసింగ్ సొసైటీ భూముల విషయంలో యధాతథస్థితిని విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఎపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. -
ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 60 ఏళ్ళు వర్తింపజేయాలి
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. 1984లో 55 ఏళ్ళ నుంచి 58 ఏళ్ళకు పదవీ విరమణ వయస్సు పెంచినప్పుడు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తింపజేశారని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 310, 311 పద్దు కింద వేతనాలు చెల్లిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యన్.రఘురామిరెడ్డి, పి.పాండురంగ వరప్రసాద్‌లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్టీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జోసఫ్ సుధీర్‌బాబులు సచివాలయంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్‌ను కలిసి ఎయిడెడ్ టీచర్లను పదవీ విరమణ వయస్సు పెంపులో విస్మరించడం తగదని వినతి చేశారు. తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఎయిడెడ్ సిబ్బందికి 60 ఏళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదాశివరావు, జి.హృదయరాజులు ఓ ప్రకటనలో కోరారు. -
‘మిథ్యా’హ్న భోజనం
కర్నూలు(విద్య) : అధికారుల నిర్లక్ష్యం, వంట ఏజెన్సీల అవినీతితో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అభాసుపాలవుతోంది. బడిలో పిల్లల సంఖ్యకు.. భోజనం వడ్డిస్తున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన కుదరని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజాధనం వృథా అవుతున్నా పర్యవేక్షణ కొరవడింది. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు కలసి వంట ఏజెన్సీలతో కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2,909 ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలు, మదర్సాలు, ఎన్సీఎల్పీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు జిల్లాలో 4 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉండగా.. 3.70 లక్షల మంది ఈ పథకం కింద భోజనం చేస్తున్నారు. ఇందుకు గత యేడాది రూ.6,66,70,000 విడుదల చేశారు. 9, 10వ తరగతులకు మరో రూ.56లక్షలు నిధులు పంపిణీ చేశారు. గత ఏప్రిల్‌లో 16 రోజుల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా డైస్ లెక్కల ప్రకారం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ పథకం అమలుకు బిల్లులు మంజూరు చేస్తారు. ఆయా పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులున్నారనే విషయాన్ని హెచ్ఎంలు, ఎంఈవోలు ఆర్వీఎంకు నివేదిక అందజేస్తారు. దీని ఆధారంగా డైస్ లెక్కలను తయారు చేస్తారు. ఆ మేరకు పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారు. అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు కాపాడుకునేందుకు విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతున్నారని, జిల్లా మొత్తంగా 30 శాతం పైగాా నిధులు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. నాసిరకం భోజనంతో అనారోగ్యం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రూ.4.35లతో పాటు 100 గ్రాముల బియ్యం ఇస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు రూ.6లతో పాటు 150 గ్రాముల బియ్యం కేటాయిస్తారు. ప్రతిరోజూ విద్యార్థులకు అన్నంతో పాటు సాంబార్, పప్పు వండి పెట్టాలి. వారానికి రెండుసార్లు కోడిగుడ్లు అందజేయాలి. ఏజెన్సీల కక్కుర్తితో నాసిరకం కూరగాయలతో నీళ్లచారును వడ్డిస్తున్నారు. దీనికి తోడు వారంలో రెండుసార్లు కాకుండా ఒకసారి మాత్రమే గుడ్లను అందిస్తున్నారు. కొన్ని చోట్ల గుడ్లకు బదులు అరటి పండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. లావుపాటి బియ్యంతో చేసిన అన్నాన్ని తినలేక అధికశాతం పిల్లలు సగం తిని పారేస్తున్నారు. ఆహారం సహించలేని పిల్లలకు కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో అధికశాతం పాఠశాలల్లో 60 శాతం కూడా భోజనం చేయడం లేదు. అయినా పాఠశాలల్లో దాదాపు 90 శాతం పిల్లలు భోజనం చేశారని నిధులు డ్రా చేస్తున్నారు. ఈ పథకాన్ని ఎంఈవోలు తనిఖీ చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తనిఖీలకు వెళ్లినా ఏజెన్సీలు ప్రజాప్రతినిదులచే ఒత్తిడి చేయించి వారి నోరు మూయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేసి, టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టాలని ప్రజాప్రతినిదుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. నత్తనడక వంటగదుల నిర్మాణం మధ్యాహ్న భోజన పథకంలో ప్రధాన సమస్య అయిన వంటగదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ పథకం కింద 2011-12లో మొదటి ఫేస్‌లో 2308 మంజూరు కాగా.. అందులో 1,732 నిర్మాణం చేయాలని నిర్ణయించారు. వీటిలో 356 మాత్రమే పూర్తి కాగా.. 895 వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో వంట గదిని 132 చదరపు మీటర్లలో రూ.75 వేలతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 21 శాతం నిధులు రూ.3.63కోట్లు విడుదల చేశారు. ఒక్క గది నిర్మాణానికి రూ.75 వేలు చాలా తక్కువని, ఈ మొత్తంతో నిర్మించలేమని పంచాయతీరాజ్ శాఖ తేల్చి చెప్పేసింది. దీంతో ప్రభుత్వం హౌసింగ్ విభాగానికి ఈ పనులను అప్పజెప్పింది. రాజకీయ జోక్యం, ఎన్నికల కోడ్ తదితర కారణాలతో వంట గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2012-13లో సెకండ్ ఫేస్ కింద 1572 వంట గదులు మంజూరు కాగా వాటికి రూ.9.62 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కోదానిని 301.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.1.50 లక్షలతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి దాకా డిజైన్ రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. -
విభజన లెక్కల్లో తర్జనభర్జన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘అపాయింటెడ్ డే’ గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారవర్గాల్లో హడావుడి వేగవంతమైంది. గత వారం వరకు ఎన్నికల బిజీగా ఉన్న అధికారగణం.. తాజాగా రాష్ట్ర విభజన తాలూకు అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. జూన్ 2ను రాష్ట్ర అపాయింటెడ్ డేగా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల సర్దుబాట్లు పూర్తి చేయాల్సి ఉంది. సిబ్బంది, వేతనాల పంపిణీ అంశానికి ఈనెల 24 నాటితో తెరపడనుంది. దీంతో చర్యలు వేగిరం చేసిన అధికారులు ఇప్పటికే శాఖల వారీగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర కార్యాలయాలు వివరాలు సేకరించాయి. స్థానికులు.. స్థానికేతరులు.. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు తదితర కచ్చితమైన వివరాలు జిల్లా శాఖల వద్దే ఉంటాయి. ఈనేపథ్యంలో ఇటీవల అన్ని రాష్ట్ర కార్యాలయాలు జిల్లా శాఖలకు నిర్దిష్ట నమూనాలో వివరాలు పంపాలని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఆయా ప్రొఫార్మాలలో వివరాలను నిక్షిప్తం చేసిన అధికారులు రెండ్రోజుల క్రితం రాష్ట్ర శాఖలకు నివేదికలు సమర్పించారు. అదేవిధంగా సాఫ్ట్ కాపీలను సైతం ఇంటర్నెట్ ద్వారా చేరవేశారు. జిల్లాలో దాదాపు 64 ప్రభుత్వ, ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న 30వేల మంది సిబ్బందిలో స్థానిక ఉద్యోగులు ఎంత మంది, స్థానికేతరులు ఎంతమంది అనే లెక్కలు తేల్చి అందజేసినట్లు తెలిసింది. దీంతో పాటు జిల్లాస్థాయి, డివిజన్ స్థాయిలో పనిచేసే వారిపై కొంత ప్రభావం పడనుంది. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు, విద్యాశాఖలో ఉపవిద్యాధికారి, సహాయక సంచాలకులతో పాటు ఇతర శాఖల్లోని జిల్లా, డివిజన్ స్థాయి ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయాలకు సమర్పించారు. హైదరాబాద్‌కు చేరువలో జిల్లా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు. దీంతో స్థానికేతరులుగా గుర్తించబడిన ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 25 నాటికే మే నెల వేతనాలు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి వారంలో వేతనాలు అందుతాయి. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడిగా ఉన్న ఆర్థిక శాఖ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో అపాయింటెడ్ డేకు ముందే ఉద్యోగులకు వేతనాలు సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో ఆయా శాఖల అధికారులు వేతన బిల్లుల తయారీలో నిమగ్నమయ్యారు. ఈనెల 15లోగా వేతన బిల్లులు సమర్పించిన వారికే ఖజానా అధికారులు నిధులు విడుదల చేయనున్నారు. ఈనెల మొదటివారంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనాలు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులు.. తాజాగా ఈనెల 25నాటికే మేనెల వేతనాలు కూడా అందుకోనున్నారు. అంతేకాకుండా ఇతరత్రా రుణాలకు సంబంధించి కూడా ఈనెల 24లోపే తుదిగడువు ఉండడంతో అందుకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే మొదలయ్యాయి. మొత్తమ్మీద ఈనెల 24తర్వాత ఖజానా శాఖ ఖాతా ముగియనుండడంతో ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరిగే అవకాశం లేదు. దీంతో అన్ని శాఖల్లో పెండింగ్ బిల్లులకు సంబంధించి హడావుడి నెలకొంది. -
మెరిశారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. గత ఏడాది కంటే కాస్త మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను మరో మెట్టు పెకైక్కించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను మూడో స్థానంలో నిలిపారు. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 88,691 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 64,958 మంది పాసై 73.24 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో పెరుగుదల.. ఇంటర్ సెకండియర్‌లో గత ఏడాది కంటే ఈసారి ఫలితాల శాతం కాస్త పెరిగింది. గత ఏడాది 72.62శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 73.24శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో 0.61శాతం పెరుగుదల నమోదైంది. ఈ దఫా కూడా బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. 47,984 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 33,588 మంది ఉత్తీర్ణులై 70 శాతం ఫలితాలు సాధించారు. అదేవిధంగా 40,707 మంది బాలికలు పరీక్షలు రాయగా 31,370 మంది పాసై 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 7 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకులో ముందుకు.. ఫలితాల్లో పెరుగుదలతో పాటు రాష్ట్రస్థాయి ర్యాంకులోనూ జిల్లా స్థానం మెరుగుపడింది. గత రెండేళ్లుగా నాలుగో స్థానంలో ఉన్న జిల్లా ర్యాంకు ఈసారి మూడోస్థానానికి చేరింది. ఈ ఏడాది వొకేషనల్ కేటగిరీలోనూ ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 2687 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 1567 మంది పాసై 58 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల నుంచి 2741 మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 1542 మంది ఉత్తీర్ణులై 56శాతం ఫలితాలు సాధించారు. అదేవిధంగా ఎయిడెడ్ కాలేజీల్లో 60శాతం ఫలితాలు వచ్చాయి. -
రూ.80 కోట్ల ఆస్తిపై కన్ను!
అనర్హుల సిఫార్సుకు సర్కారు అంగీకారం ఎయిడెడ్ కాలేజీ యాజమాన్య మార్పునకు పచ్చజెండా హడావుడిగా సంతకాలు చేసిన మంత్రి, ముఖ్య కార్యదర్శి రూ.10కోట్ల ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కర్మన్‌ఘాట్ సమీపంలోని చైతన్య జూనియర్ కాలేజీ (ఎయిడెడ్)కి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను కాజేసే కుట్రకు సర్కారు కళ్లు మూసుకుని పచ్చజెండా ఊపింది. స్పెషలాఫీసర్ అధీనంలో నడుస్తున్న కాలేజీని విద్యార్థుల సొమ్ము కాజేసి సస్పెండైన మేనేజ్మెంట్ సిఫార్సు ఆధారంగా మరో మేనేజ్మెంట్కు అప్పగించేందుకు అంగీకరించింది. ఒక మంత్రి, మరో ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషించిన ఈ తతంగంలో రూ.10 కోట్ల దాకా చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1975లో ఏర్పా టైన ఈ కాలేజీకి 5.5 ఎకరాల స్థలం, ఆస్తులున్నాయి. 1981 నుంచి ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తోంది. అయితే యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులను 2001కి ముందు చార్మినార్ బ్యాంకులో రూ.99 లక్షలకు తనఖా పెట్టింది. పైగా రూ.4.95 లక్షల మేరకు విద్యార్థుల స్పెషల్ ఫీజులను, స్కాలర్షిప్లను దుర్వినియోగం చేసింది. మేనేజ్మెంట్, కరస్పాండెంట్ ఈ అవకతవకలకు పాల్పడటం నిజమేనని ఇంటర్ విద్యా శాఖ విచారణలో తేలడంతో వారిని సస్పెండ్ చేసి 2001లో స్పెషలాఫీసర్‌ను నియమించింది. ఇప్పటికీ కాలేజీ ఆయన అధీనంలోనే ఉంది. కేసు ఇంకా పరిష్కారం కాలేదు. అయినా సరే, ఆస్తులను ఎలాగైనా దక్కించుకునే ఆలోచనతో కాలేజీని మరో యాజమాన్యానికి అప్పగించాలంటూ పాత మేనేజ్మెంట్ తీర్మానం చేసి సర్కారును ఆశ్రయించింది. అది కూడదని ఇంటర్ విద్యా కమిషనర్ స్పష్టం చేశారు. ‘‘విద్యార్థుల సొమ్ము దుర్వినియోగం వ్యవహారం ఇంకా పరిష్కారం కాలేదు. మేనేజ్మెంట్, కరస్పాండెంట్ సస్పెన్షన్‌లో ఉన్నారు. విద్యా చట్టం-1982 ప్రకారం సస్పెండైన మేనేజ్మెంట్కు ఎలాంటి అధికారమూ ఉండదు. అది సర్వసభ్య సమావేశం పెట్టినా, మరో మేనేజ్మెంట్ను ఎన్నుకుంటూ తీర్మానం చేసినా చెల్లదు’’ అంటూ ప్రభుత్వానికి ఆయన నివేదించారు. అయినా సర్కారు పట్టించుకోలేదు. స్పెషలాఫీసర్ పాలనను తొలగించి కొత్త మేనేజ్మెంట్కు బాధ్యతలు అప్పగించాలంటూ ఫిబ్రవరి 21న మెమో (నంబరు 14381/ఐఈ.2-2/2012) జారీ చేసింది! -
ఎయిడెడ్ టీచర్ల ఆన్లైన్ వేతనాలు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాల చెల్లింపు ప్రహసనంగా మారింది. 2005 ఏప్రిల్‌లో ప్రభుత్వం 010 పద్దు ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు 162 నంబరు జీవో జారీ చేసింది. దీని ప్రకారం పంచాయతీరాజ్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాల బిల్లులను ఆన్లైన్ ద్వారా పంపాలనే నిబంధన విధించారు. అప్పట్లో విడుదల చేసిన జీవో ప్రకారం తాజాగా ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారానే వేతన బిల్లులు చెల్లించాలనే నిబంధన విధించారు. దీంతో వారికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రతి మూడునెలలకోసారి ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. వాటిని ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియని పరిస్థితిలో ఆన్లైన్ ద్వారా వేతన బిల్లులు పంపడం, బిల్లులు అందజేసేందుకు నిర్దేశిత తేదీలను ప్రకటించటంతో ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపుల్లో కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 450 ఉండగా.. వాటిలో 902 మంది ఉపాధ్యాయులు, ప్రాథమికోన్నత పాఠశాలలు 69 ఉండగా.. 326 మంది, ఉన్నత పాఠశాలలు 67 ఉండగా 580 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నెల దాటితే ఎరియరే.. ఎయిడెడ్ ఉపాధ్యాయులు సిబ్బందికి వేతనాలు మంజూరు చేసే సమయంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. డిసెంబరు నెలకు సంబంధించిన జీతం జనవరిలో మంజూరు కాకుంటే ఆ నెల జీతం ఎరియర్ కిందకు వెళ్లిపోతుంది. ఆన్లైన్ ద్వారా ఎయిడెడ్ ఉపాధ్యాయులు బిల్లులు పెట్టుకునేందుకు ప్రత్యేక తేదీలను ఖరారు చేసింది. ఎరియర్ బిల్లులైతే ప్రతి నెల 3 నుంచి 11వ తేదీ వరకు, తిరిగి 18 నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్లో ఉంచాలని షరతు విధించారు. ఈ రోజుల్లో ట్రెజరీల్లో ఉన్న సర్వర్ పనిచేయకుంటే బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. మార్చిలోపు క్లియర్ అయ్యేనా.. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న ఎయిడెడ్ ఉపాధ్యాయులకు నాల్గవ క్వార్టర్ కింద ప్రభుత్వం వేతనాన్ని విడుదల చేయాల్సి ఉంది. జనవరి నెల సగం పూర్తయింది. మార్చి నెలాఖరుకల్లా ప్రభుత్వం విడుదల చేసిన నగదును బిల్లులుగా మార్చుకోకుంటే ఆ నగదు మొత్తం వెనక్కి మళ్లే ప్రమాదం ఉంది. ఆన్లైన్ పద్ధతిలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు వేతన బిల్లులు పంపాలనే నిబంధన, నిర్దేశించిన తేదీల్లో సర్వర్లు పనిచేయకపోవడం వంటి అంశాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి కల్లా ఉపాధ్యాయులకు నవంబరు నెల నుంచి రావాల్సిన వేతనాలను చెల్లిస్తారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయులకు ఇబ్బందే.. 2005 ఏప్రిల్‌లో ప్రభుత్వం విడుదల చేసిన 162 జీవో ప్రకారం ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆన్లైన్ పద్ధతిలో వేతన బిల్లులను పంపాలనే ప్రతిపాదనతో ఉపాధ్యాయులు ఇక్కట్ల పాలవుతున్నారని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.సత్యనారాయణ చెబుతున్నారు. 010 పద్దు ద్వారా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తే ఆన్లైన్ పద్ధతిలో బిల్లులను పంపే ఆంశాన్ని అధికారులు పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఫీజుల పెంపుపై విద్యార్థుల ఆగ్రహం
కోలారు, న్యూస్‌లైన్ : ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులను 20 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బస్టాండ్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. డబ్బుపై ఆశతో ప్రైవేట్ కళాశాలలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మకైందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ పేద విద్యార్థుల పాటిల శాపంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో కుదేలైన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు విద్యార్థుల ఫీజుల పెంపు వల్ల తమ పిల్లలకు ఉన్నత విద్యాభ్యాసాన్ని అందించలేని దుస్థితిలో నెట్టివేయబడ్డారని అన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అంబరీష్, మార్కండేయ, అమరేష్, అజగర్, మహేష్ పాల్గొన్నారు. -
‘వర్సిటీ’ ఏర్పాటుకు తణుకే బెటర్!
తణుకు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీని తణుకు పట్టణంలో ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ప్రజలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చినట్లవుతుందని జిల్లాకు చెందిన పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలగా తణుకులోని ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు అకడమిక్ డెరైక్టర్‌గా, నోడల్ కళాశాలగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని డిగ్రీ కళాశాలకు సంబంధించి అన్ని విద్యా విషయాలకు ఈ కళాశాల మార్గదర్శకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడే వర్సిటీని ఏర్పాటు చేయడం సముచితంగా వుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీజీ సెంటర్‌ను తన్నుకుపోయిన గూడెం 2003లో అప్పటి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సింహాద్రి అధ్యక్షతన సమావేశమైన వర్సిటీ పాలకమండలి వర్సిటీ పరిధిలోని విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో పీజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. జిల్లాలోని తణుకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అప్పటి వర్సిటీ పాలకమండలి సభ్యులు గుబ్బల తమ్మయ్య, ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ తీర్మానం చేయించారు. అయితే పీజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన 40 ఎకరాల భూమి లభ్యం కాకపోవడంతో 2004లో అప్పటి జిల్లా కలెక్టర్ తాడేపల్లిగూడెంలో ఏయూ పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో వర్సిటీ అయినా దక్కించుకోవాలని తణుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. -
‘ఎయిడెడ్’ విద్యార్థులపై వివక్ష?
పార్వతీపురం, న్యూస్‌లైన్: ఐటీడీఏ పరిధిలోని ఎయిడెడ్(ద్రవ్యసహాయక) పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలలు, వసతిగృహ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఎయిడెడ్ విద్యార్థులకు ఎందుకు పంపిణీ చేయడంలేదో అర్థం కావడంలేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తరగతి గదుల్లో యూనిఫాం వేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వమే ఐటీడీఏ పరిధిలోగల అన్ని పాఠశాలలకు యూనిఫాంలు సరఫరా చేసింది. ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం సరఫరా చేయలేదు. ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీ పురం మండలంలో 11, కురుపాం మండలంలో 10, కొమరాడ మండలంలో 3 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్నవారంతా గిరిజన విద్యార్థులే. అయితే వీరికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయకపోవడంతో..ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకోవడమే తమ పిల్లల నేరమా? అంటూ ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజన పథకం వంటివి ఈ పాఠశాలల్లో అమలవుతున్నాయి కానీ యూనిఫాం లను పంపిణీ చేయకపోవడానికి కారణమేమిటో పాఠశాలల యాజమాన్యాలకు అర్థం కావడం లేదు. ఈ విషయంపై పలు గిరిజన సంఘాలు స్థానిక శాసనసభ్యులకు, ఐటీడీఏ పీఓకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం కనిపించ లేదు. వందలాది మంది గిరిజన విద్యార్థులకు ఇలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండబోమని పలు గిరిజన ఉపాధ్యాయసంఘాలు, గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
నీరుగారుతున్న ‘రాజీవ్ విద్యా దీవెనలు’ పథకం
గ్రామీణ నిరుపేద ఎస్సీ విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు 2012-13 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రాజీవ్ విద్యా దీవెనలు పథకాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది నుంచి ఎస్సీ విద్యార్థులకు, ఈ ఏడాది నుంచి ఎస్టీ విద్యార్థులకు అమలు పరచాలనేది లక్ష్యం. హాస్టళ్లలో ఉంటూ 9,10 తరగతుల్లో చదువుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు పది నెలలపాటు ప్రతినెలా రూ.300, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.1000 ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హాస్టళ్లలో ఉండకుండా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రతినెలా రూ.100, పుస్తకాల కొనుగోళ్ల కోసం రూ.750 ఇస్తున్నట్లు తెలిపింది. జిల్లాలోని 123 ఎస్టీ హాస్టళ్లలో సుమారు 7 వేలకు పైగా విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారు. వీరిలో గతేడాది 3,500 మంది ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 2,300 మంది పథకం ద్వారా లబ్ధిపొందారు. మిగిలిన వారికి నిరాశే ఎదురైంది. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది 65 మంది విద్యార్థినులు ఉంటే కేవలం 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి నయాపైసా రాలేదు. పథకం కింద దరఖాస్తులో పెట్టిన నిబంధనలు.. అధికారుల తీరు విద్యార్థులనే కాదు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అసంతృప్తికి గురి చేస్తున్నాయి. దరఖాస్తుకు అడ్డంకులు.. వార్షికాదాయం రూ.2ల క్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పథకానికి అర్హులు. వీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థులు బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. కానీ విద్యార్థులకు జీరో అకౌంట్‌తో ఖాతా తెరిచేందుకు బ్యాంకులు ముందుకురావడం లేదు. చాలా మందికి ఆధార్‌కార్డులు అందలేదు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే టీసీలు ఇవ్వాలని ఆయా కేంద్రాలు తేల్చి చెప్తున్నారు. ప్రధానోపాధ్యాయులు బోనోఫైడ్ సర్టిఫికెట్లు జారీ చేసినా ఫలితం లేదు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ముందుకురావడం లేదు. ఈ విషయమై మంచిర్యాలలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్వామిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు జీరో అకౌంట్‌తో ఖాతాలు తెరవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా బ్యాంకులు ముందుకురాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారన్నారు. టీసీలు లేకుండా విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పథకం విషయమై ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డెరైక్టర్ అంకం శంకర్‌ను అడుగగా.. పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోని వారికి డబ్బులు ఇవ్వలేదు.. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నా డబ్బులు అందకపోతే విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
త్రిశంకు దిశగా ఎయి‘డెడ్’ !
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల మూసివేత దిశగా రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను వదిలించుకోవాలని చూస్తుండగా యాజమాన్యాలు తమ ఆధీనంలో ఉన్న పాఠశాలలను పట్టించుకోకపోవటంతో మూసివేత తప్పదనే వాదన వినిపిస్తోంది. మూతపడే పాఠశాలల జాబితాలు ఇప్పటికే తయారైనట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 31వ తేదీలోగా రేషనలైజేషన్ ప్రకారం ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు పది మంది విద్యార్థులుంటే పాఠశాల ఉంచాలనే నిబంధన ఉండగా ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం ఈ సంఖ్యను 30కు పెంచారు. 29 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, 75 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన ఆర్సీఎం యాజమాన్యంలో 40 పాఠశాలలు, సీఎస్ఐ యాజమాన్యంలో 45 పాఠశాలలు సీబీసీఎన్సీ యాజమాన్యంలో మరో 10 పాఠశాలలు మూతపడతాయని అటు యాజమాన్యాలు, ఇటు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర సమ్మెలో సిబ్బంది పాల్గొంటున్న కారణంగా ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల మూసివేత ప్రక్రియను ముగించేందుకు కొంత సమయాన్ని ఇవ్వాలని సీమాంధ్ర జిల్లాలకు చెందిన డీఈవోలు ప్రభుత్వానికి లేఖ రాశారు. సమైక్యాంధ్ర సమ్మె లేకుంటే ఈ నెలాఖరులోపే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. పాఠశాల రద్దైతే పోస్టులు శాశ్వతంగా రద్దు ... జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 850 వరకు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1300 మంది ఉపాధ్యాయులున్నారు. ఏదైనా పాఠశాలను మూసివేస్తే ఆ పాఠశాలలో ఉన్న పోస్టులు శాశ్వతంగా రద్దవుతాయి. పాఠశాల రేషనలైజేషన్ ప్రకారం రద్దయితే అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతి ఇచ్చి వేరే పాఠశాలలో వారి సేవలు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడే తిరకాసు ఉంది. ఆర్సీఎం సంస్థకు చెందిన నన్స్‌కు పదోన్నతుల్లో ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన ఉపాధ్యాయుల నుంచి తమకు పదోన్నతి వద్దని లిఖితపూర్వకంగా ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు లేఖలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా లేఖ ఇస్తే పదోన్నతి తిరస్కరించిన విషయాన్ని ఎస్‌ఆర్‌లో నమోదు చేస్తారు. ఎస్‌ఆర్‌లో ఈ విషయం నమోదైతే గతంలో పొందిన ఇంక్రిమెంట్లను వెనక్కి ఇవ్వాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘం నాయకులు చెబుతున్నారు. సర్దుబాటు... రేషనలైజేషన్ ప్రకారం రద్దయిన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆయా యాజమాన్యాలు ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. ఈ సమయంలో ఆయా యాజమాన్యాలకే సర్వాధికారాలు ఉంటాయి. రద్దయిన పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటే ముందుగా ఆ పాఠశాల హెచ్ఎంకు పదోన్నతి ఇస్తారు. అనంతరం స్కూలు అసిస్టెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. పదోన్నతులు ఇచ్చే సమయంలో జిల్లా వ్యాప్తంగా ఆయా యాజమాన్యాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను మొత్తానికి సీని యార్టీ పరిగణనలోకి తీసుకుంటారు. సీఎస్ఐ, ఆర్సీఎం పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే రెండు యాజమాన్యాల అంగీకా రం ప్రకారం ఉపాధ్యాయులను ఉపయోగించుకునే వెసులుబాటు ఇస్తారు. ఈ తతం గం జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. పదేళ్ల క్రితం ఎయిడెడ్ పాఠశాలలు రద్దయితే సంబంధిత ఉపాధ్యాయుడి సేవలను దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విని యోగించుకునే వెసులుబాటు కల్పించారు. అనంతరం ఈ ఉత్తర్వులను మార్పు చేసి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగించకూడదని సవరించినట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. చక్రం తిప్పుతున్న యాజమాన్యాలు ... ఎయిడెడ్ పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియ, పాఠశాలల రద్దు వేగం పుంజుకోవటంతో ఆయా యాజమాన్యాల ప్రతినిధులు రద్దయ్యే పాఠశాలల జాబితాల తయారీ, పదోన్నతులు పొందాల్సిన వివరాలను ఇప్పటికే సేకరించారు. విజయవాడ డివిజన్లో ఈ ప్రక్రియ పూర్తికాగా, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, నందిగామ డివిజన్లలో ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. పాఠశాలలు రద్దవుతున్నా వాటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నించని యాజమాన్యాలు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలంటే, కోరుకున్న ప్రాం తంలో పోస్టింగ్ ఇవ్వాలంటే తమను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని రాయబారాలు పంపుతున్నారు. పోస్టుల సర్దుబాటు కావాలంటే విద్యాశాఖాధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాలని అడిగిన మొత్తం ఇవ్వకుంటే మీరే ఇబ్బంది పడతారని ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం.