ఎయిడెడ్‌ స్కూళ్ల సమస్యలపై ఆఖరి పోరాటం | aided school problems | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ స్కూళ్ల సమస్యలపై ఆఖరి పోరాటం

Published Thu, Aug 11 2016 1:18 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

aided school problems

బోట్‌క్లబ్‌(కాకినాడ) : ఎయిడెడ్‌ స్కూల్స్‌ సమస్యలపై ప్రాస్మా(ప్రైవేట్‌ రికగ్నైజ్డ్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌) ఆఖరి పోరాటానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ పేర్కొన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లోని ఎంఎస్‌ఎన్‌ స్కూల్లో బుధవారం జరిగిన ప్రాస్మా జిల్లా సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్‌ పాఠశాలల ఉన్నతికి కృషి చేస్తున్నామని చెబుతూ కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల అనేక ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై న్యాయస్థానాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నామన్నారు. ఎయిడెడ్‌ వ్యవస్థ పూర్వ వైభవం వచ్చేంత వరకూ పోరాటం చేస్తానన్నారు. ప్రాస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె ప్రభాకరరావు మాట్లాడుతూ దేశంలో అక్షరాస్యత గణనీయంగా పెరగడంలో ప్రైవేట్‌ పాఠశాలలు కీలక పాత్ర వహించాయన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఎయిడెడ్‌ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమైందన్నారు. సమావేశంలో ఖాళీ పోస్టుల భర్తీపై రిట్‌ అప్పీల్‌పై మధ్యంతర ఉత్తర్వులు పై కోర్టులో కంటెంట్‌ కేసులు వేయడానికి, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడెడ్‌ చట్టం ప్రకారం ఎయిడెడ్‌ పాఠశాలలకు వర్తించవని ఈ విషయంపై ప్రాస్మా తరఫున కేసు దాఖలు చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో ప్రాస్మా జిల్లా అధ్యక్షుడు నెహ్రూ, సెక్రటరీ బి. చిట్టిబాబు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement