► ప్రైవేటు కళాశాలల అక్రమాలకు చెక్
► నేటి నుంచి జూన్ 6 వరకు వెబ్ ఆప్షన్లు
► జూన్ 10న సీట్ల కేటాయింపు
► ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
ఆదిలాబాద్ టౌన్ : ప్రైవేటు డిగ్రీ కళాశాలల అక్రమాలను చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రవేశాల స్వీకరించేలా వెబ్‌సైట్ కూడా ఏర్పాటైంది. దీంతో పేద విద్యార్థులకు మేలు చేకూరనుంది. జిల్లాలో 11 ప్రభుత్వ కళాశాలలు, ఒక ఎయిడెడ్ కళాశాల, 70 వరకు ప్రైవేటు యాజమాన్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో చాలా ప్రైవేటు కళాశాలల్లో మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, ల్యాబ్ సౌకర్యాలు, తరగతి గదులు లేనప్పటికీ ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులను గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా మరికొన్ని ప్రైవేటు కళాశాలలు విద్యార్థులు లేనప్పటికీ బోగస్ సర్టిఫికెట్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు కాజేస్తున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లోనూ ఒకే విధమైన ఫీజు అమలు చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం
అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఆన్‌లైన్ సర్వీసును ఏర్పాటు చేసింది. వివరాలను జ్ట్టిఞ://ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే అన్ని కళాశాలల్లో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ప్రకారం ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు. ఎంపిక చేసుకున్న కళాశాలలో అధ్యాపకులు, కోర్సుల వివరాలు, మౌళిక వసతుల వివరాలను పొందుపర్చారు. రాష్ర్టంలోని ఏ యూనివర్సిటీకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 20 నుంచి జూన్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. రూ.500లతో జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంటర్ హాల్‌టికెట్ నంబర్, ఆధార్ నంబర్, కుల, నివాస, ఆధాయ ధ్రువీకరణ పత్రం, సెల్ నంబర్, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వికలాంగుల ధ్రువీకరణ పత్రం, ఫొటోను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
హెల్ప్ లైన్ సెంటర్ల ఏర్పాటు
విద్యార్థుల సందేహలను నివృత్తి చేసేందుకు జిల్లాలో 3 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో అడ్మిషన్ల విషయంలో సహాయం చేసేందుకు అధ్యాపకులను ఏర్పాటు చేశారు.
ఇదీ.. ఆన్‌లైన్ ప్రవేశాల షెడ్యూల్
►ఈ నెల 20 నుంచి జూన్ 6వ తేదీ వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు
►జూన్ 7, 8 తేదీల్లో రూ.500 అపరాధ రుసుముతో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు
►10న సీట్ల కేటాయింపు
►10 నుంచి 20 వరకు కళాశాలల్లో చేరడం
►22 నుంచి తరగతుల ప్రారంభం
►21 నుంచి 23 రెండో విడత వెబ్ ఆప్షన్లు
►25న సీట్ల కేటాయింపు
►25 నుంచి 30 వరకు కళాశాలల్లో చేరడం
►జూన్ 30 నుంచి జూలై 1 వరకు చివరి విడత వెబ్ ఆప్షన్లు
►జూలై 3న సీట్ల కేటాయింపు
► 4 నుంచి 7 వరకు కళాశాలల్లో చేరడం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశం కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈనెల 20 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు గడవు ఉంది. రూ.100 ఆన్‌లైన్ ఫీజు చెల్లించేందుకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్‌నేట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. విద్యార్థుల సందేహల కోసం మూడు హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశాం.
- అశోక్, ప్రభుత్వ ఐడీ కళాశాల ప్రిన్సిపాల్, ఆదిలాబాద్
డిగ్రీ ప్రవేశాలు ఆన్‌లైనే
Published Fri, May 20 2016 2:14 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement
Advertisement