ఎయిడెడ్ ఉపాధ్యాయుల ధర్నా
ఎయిడెడ్ ఉపాధ్యాయుల ధర్నా
Published Sat, Jan 28 2017 10:44 PM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
ఏలూరు సిటీ :
ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఆ విద్యాసంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా జరిగింది. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు డి.రాజశేఖర్, కార్యదర్శి కేజే విజయకుమార్ మాట్లాడుతూ ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, లక్షలాది రూపాయల రికవరీకి కారణమైన యాక్ట్ 37ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టం 37ను అనుసరించి టీచర్ల నుంచి రికవరీ చేసిన సొమ్మును సర్వీసులో ఉన్న, రిటైరైన వారికి తిరిగి చెల్లించాలని కోరారు. ఎయిడెడ్ టీచర్ల అన్ ఎయిడెడ్ సర్వీసుకు రక్షణ కల్పించాలని కోరారు. హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, జీపీఎఫ్ వర్తింప చేయాలని, కారుణ్య నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2012లో నియామకాలు పొందిన టీచర్లకు రెగ్యులర్ స్కేల్ వర్తింపజేయాలని కోరారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి కె.రవిప్రకాష్, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు ఎన్.ఆస్కార్ విజయ మాదిగ, జాయింట్ సెక్రటరీ జి.మురళీకృష్ణ పాల్గొన్నారు.
Advertisement