ఒక్క జత ఇస్తే ఒట్టు! | Aided School Childrens Uniform Not Implemented Prakasam | Sakshi
Sakshi News home page

ఒక్క జత ఇస్తే ఒట్టు!

Published Tue, Aug 28 2018 10:45 AM | Last Updated on Tue, Aug 28 2018 10:45 AM

Aided School Childrens Uniform Not Implemented Prakasam - Sakshi

ఒక ఎయిడెడ్‌ పాఠశాలలో యూనిఫాం ఇవ్వకపోవడంతో సాధారణ దుస్తులతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు

జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలలపై సర్వశిక్షా అభియాన్‌ అధికారులు శీతకన్ను వేశారు. ఆ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో ఇంతవరకు ఒక్కరికి కూడా ఏకరూప దుస్తులు ఇవ్వలేదు. స్కూళ్లు ప్రారంభించి రెండున్నర నెలలు దాటినా యూనిఫాం ఊసే ఎత్తడం లేదు. ఆ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో అధికశాతం పేద విద్యార్థులే. వారికి ఏకరూపు దుస్తులు ఇవ్వకపోవడంతో పాతవి, చినిగిపోయిన వాటిని ధరించుకొని విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. దీనిపై ఎస్‌ఎస్‌ఏ అధికారులు సెప్టెంబర్‌ 4లోగా స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని ఏపీ టీచర్స్‌ గిల్ట్‌ అసోసియేషన్‌ నాయకులు డెడ్‌లైన్‌ విధించడం చర్చినియాంశంగా మారింది.

ఒంగోలు టౌన్‌: ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 16,500 మంది విద్యార్థులకు యూనిఫాం అందించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు బదులుగా ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 4వ తేదీలోపు ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు ఇవ్వకుంటే 5వ తేదీ జరిగే గురుపూజోత్సవం రోజు సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి


కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తామంటూ టీచర్ల్‌ గిల్డ్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ ప్రభాకరరెడ్డి హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమైం ది. గురుపూజోత్సవం నాడు విద్యార్థుల కోసం గురువులు నిరాహారదీక్షకు దిగనుం డటం హాట్‌ టాపిక్‌గా మారింది. విద్యార్థు ల సమస్యలపై ఉపాధ్యాయులు నిరాహారదీక్షకు దిగాల్సిన పరిస్థితులను సర్వశిక్షా అభియాన్‌ అధికారులు కల్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరడుగుతారు?
జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఏటా యూనిఫాం అందజేస్తుంటారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబం ధించి వీటి పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లాపరిషత్, మండల పరిషత్‌ పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్‌ అ«ధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థులకు దుస్తులు అందజేస్తున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలవైపు కన్నెత్తి కూడా చూడలేదు.

ఎయిడెడ్‌ పాఠశాలలకు సకాలంలో యూనిఫాం అందించకుంటే ఎవరడుగుతారన్న ధీమాలో సర్వశిక్షా అభియాన్‌ అధికారులు ఉన్నట్లు ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్ధం అవుతోంది. ముందుగా ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్, మునిసిపల్‌ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసిన తరువాత ఎయిడెడ్‌ పాఠశాలలను చూడవచ్చన్న ధోరణిలో ఆ శాఖ అధికారులు ఉన్నారు. అధికారుల చర్యలను ఖండిస్తూ ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ ప్రభాకరరెడ్డి పత్రికా ముఖ్యంగా చేసిన నిరాహార దీక్ష ప్రకటన విద్యారంగంలో కలకలం రేపింది.

16500 పిల్లల పరిస్థితి ఏమిటి?
జిల్లాలోని 40 మండలాల్లో 238 ఎయిడెడ్‌ పాఠశాలన్నాయి. అందులో 53 ఉన్నత పాఠశాలలు, 17 ప్రాథమికోన్నత పాఠశాలలు, 168 ప్రాథమిక పాఠశాలలున్నాయి. 1 నుంచి 8వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు 16,500 మంది ఉన్నారు. వారిలో అధిక శాతం పేద విద్యార్థులే. యూనిఫాం ఇస్తే వాటిని ధరించుకొని పాఠశాలలకు వస్తుంటారు. అయితే ఇంతవరకు యూనిఫారాలు ఇవ్వకపోవడంతో గత ఏడాది అందించిన దుస్తులతో, ప్రస్తుతం ఉన్న సాధారణ పాత దుస్తుల్లో పాఠశాలలకు వస్తున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలకు యూనిఫాం ఇవ్వకపోవడంతో అందులో చదువుకునేందుకు పుస్తకాలు పట్టుకొని వెళుతున్న విద్యార్థులను చూసి.. వీరు ఏ పాఠశాలకు వెళుతున్నారన్న అనుమానాలను అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 

4వ తేదీలోగా పంపిణీ చేయాలి
జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలలన్నింటికీ సెప్టెంబర్‌ 4వ తేదీలోపు యూనిఫాం అందించాలి. లేకుంటే పెద్దఎత్తున ఉపా«ధ్యాయులను సమీకరించి 5వ తేదీ ఎస్‌ఎస్‌ఏ పీఓ కార్యాలయం వద్ద నిరాహారదీక్షకు దిగుతాం. ఎయిడెట్‌ విద్యార్థుల పట్ల వివక్ష తగదు. వెంటనే అధికారులు స్పందించాలి. – ప్రభాకరరెడ్డి, ఏపీ టీచర్స్‌ గిల్డ్‌  జిల్లా ప్రధాన కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement