Uniform children
-
పాఠశాలకు.. పాత దుస్తులతోనే!
వికారాబాద్ అర్బన్: పాఠశాలల పునఃప్రారంభ గడువు ముంచుకొస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటికీ విద్యార్థులకు కొత్త యూనిఫాంలు పంపిణీ చేయలేదు. సర్కారీ బడుల్లో చదివే విద్యార్థుల్లో పేద, ధనిక భేదాభిప్రాయాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏటా యూనిఫాం అందజేస్తున్నారు. అయితే స్కూళ్లు తెరుచుకునే సమయంలో కాకుండా విద్యాసంవత్సరం చివరలో యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అప్పటికే బడికి వేసవి సెలవులు వస్తుండటంతో అధికారులు పంపిణీ చేసిన వస్త్రం మూలన పడి ఉంటోంది. ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జూన్ 1న విద్యార్థులు పాత దస్తులతోనే పాఠశాలకు రానున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా పాత బట్టలతోనే పాల్గొననున్నారు. ఏటా ఇదే పరిస్థితి... విద్యార్థులకు అందించే యూనిఫాం విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విషయంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు శ్రద్ధచూపడం లేదు. ఏటా విద్యా సంవత్సరం ముగుస్తున్న సమయంలో వస్త్రం పంపిస్తున్నారు. ఇలాగైతే సకాలంలో పిల్లలకు దుస్తులు ఇవ్వలేకపోతున్నామని తెలిసి కూడా వస్త్రం పంపిణీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. వస్త్రం వచ్చిన తర్వాత విద్యార్థుల కొలతలు తీసుకుని, యూనిఫాంలు కుట్టేందుకు దర్జీలు మూడు నెలల సమయం తీసుకుంటారు. విద్యాసంవత్సరం ముగుస్తున్న సమయంలో పాఠశాలల వారీగా పిల్లల కొలతలు తీసుకుంటే స్కూళ్లు తెరిచే నాటికి కొత్త దుస్తులు అందించవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లాలో 1,043 పాఠశాలలు... జిల్లాలో 1,043 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 88,648 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో యూనిఫాంలు అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసి, సెలవులు పూర్తయ్యి.. పాఠశాలలు తెరిచే సరికి అవి పాతబడి చిరిగిపోతున్నాయి. దీంతో స్కూళ్లు తెరిచిన సమయంలో విద్యార్థులు పాత దుస్తులతోనే వస్తున్నారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం నుంచే పాఠ్య పుస్తకాలతో పాటు,ఏకరూప దుస్తులు కూడా అందించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ఏడాది ఎంత మేర వస్త్రం ఆర్డర్ ఇచ్చారనే అంశంపై ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎంఈఓల నుంచి వివరాలు తీసుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.200 ఖర్చు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల కోసం ప్రభుత్వం ఏటా ఒక్కొక్కరికి రూ.200 ఖర్చు చేస్తోంది. వీటిలో ఆప్కో ద్వారా వస్త్రం కొనుగోలుకు రూ.160, కుట్టు కూలికి రూ.40 చెల్లిస్తున్నారు. కూలి చాలా తక్కువగా ఉందని దర్జీలు సైతం దుస్తులు కుట్టడానికి ముందుకు రావడం లేదు. -
ఒక్క జత ఇస్తే ఒట్టు!
జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలలపై సర్వశిక్షా అభియాన్ అధికారులు శీతకన్ను వేశారు. ఆ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో ఇంతవరకు ఒక్కరికి కూడా ఏకరూప దుస్తులు ఇవ్వలేదు. స్కూళ్లు ప్రారంభించి రెండున్నర నెలలు దాటినా యూనిఫాం ఊసే ఎత్తడం లేదు. ఆ పాఠశాలల్లో చదువుకుంటున్న వారిలో అధికశాతం పేద విద్యార్థులే. వారికి ఏకరూపు దుస్తులు ఇవ్వకపోవడంతో పాతవి, చినిగిపోయిన వాటిని ధరించుకొని విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు. దీనిపై ఎస్ఎస్ఏ అధికారులు సెప్టెంబర్ 4లోగా స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని ఏపీ టీచర్స్ గిల్ట్ అసోసియేషన్ నాయకులు డెడ్‌లైన్ విధించడం చర్చినియాంశంగా మారింది. ఒంగోలు టౌన్: ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 16,500 మంది విద్యార్థులకు యూనిఫాం అందించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ అసోసియేషన్ జిల్లా శాఖ సంబంధిత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు బదులుగా ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 4వ తేదీలోపు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు ఇవ్వకుంటే 5వ తేదీ జరిగే గురుపూజోత్సవం రోజు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తామంటూ టీచర్ల్ గిల్డ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకరరెడ్డి హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమైం ది. గురుపూజోత్సవం నాడు విద్యార్థుల కోసం గురువులు నిరాహారదీక్షకు దిగనుం డటం హాట్ టాపిక్‌గా మారింది. విద్యార్థు ల సమస్యలపై ఉపాధ్యాయులు నిరాహారదీక్షకు దిగాల్సిన పరిస్థితులను సర్వశిక్షా అభియాన్ అధికారులు కల్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరడుగుతారు? జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు సర్వశిక్షా అభియాన్ ద్వారా ఏటా యూనిఫాం అందజేస్తుంటారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబం ధించి వీటి పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లాపరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్ అ«ధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. వాటిల్లో చదువుకుంటున్న విద్యార్థులకు దుస్తులు అందజేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎయిడెడ్ పాఠశాలలకు సకాలంలో యూనిఫాం అందించకుంటే ఎవరడుగుతారన్న ధీమాలో సర్వశిక్షా అభియాన్ అధికారులు ఉన్నట్లు ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి అర్ధం అవుతోంది. ముందుగా ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసిన తరువాత ఎయిడెడ్ పాఠశాలలను చూడవచ్చన్న ధోరణిలో ఆ శాఖ అధికారులు ఉన్నారు. అధికారుల చర్యలను ఖండిస్తూ ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకరరెడ్డి పత్రికా ముఖ్యంగా చేసిన నిరాహార దీక్ష ప్రకటన విద్యారంగంలో కలకలం రేపింది. 16500 పిల్లల పరిస్థితి ఏమిటి? జిల్లాలోని 40 మండలాల్లో 238 ఎయిడెడ్ పాఠశాలన్నాయి. అందులో 53 ఉన్నత పాఠశాలలు, 17 ప్రాథమికోన్నత పాఠశాలలు, 168 ప్రాథమిక పాఠశాలలున్నాయి. 1 నుంచి 8వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు 16,500 మంది ఉన్నారు. వారిలో అధిక శాతం పేద విద్యార్థులే. యూనిఫాం ఇస్తే వాటిని ధరించుకొని పాఠశాలలకు వస్తుంటారు. అయితే ఇంతవరకు యూనిఫారాలు ఇవ్వకపోవడంతో గత ఏడాది అందించిన దుస్తులతో, ప్రస్తుతం ఉన్న సాధారణ పాత దుస్తుల్లో పాఠశాలలకు వస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలలకు యూనిఫాం ఇవ్వకపోవడంతో అందులో చదువుకునేందుకు పుస్తకాలు పట్టుకొని వెళుతున్న విద్యార్థులను చూసి.. వీరు ఏ పాఠశాలకు వెళుతున్నారన్న అనుమానాలను అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 4వ తేదీలోగా పంపిణీ చేయాలి జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలలన్నింటికీ సెప్టెంబర్ 4వ తేదీలోపు యూనిఫాం అందించాలి. లేకుంటే పెద్దఎత్తున ఉపా«ధ్యాయులను సమీకరించి 5వ తేదీ ఎస్ఎస్ఏ పీఓ కార్యాలయం వద్ద నిరాహారదీక్షకు దిగుతాం. ఎయిడెట్ విద్యార్థుల పట్ల వివక్ష తగదు. వెంటనే అధికారులు స్పందించాలి. – ప్రభాకరరెడ్డి, ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
అప్పుల మాసమిది..
సుబ్బారావు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆయన నెల జీతం రూ.12 వేలు. తన కుమారున్ని కార్పొరేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతిలో చేర్పించడానికి రూ.26 వేలు అడిగారు. ఐఐటీ, ఒలంపియాడ్ సెక్షన్ అయితే రూ.45 వేలు అవుతుందని చెప్పారు. బ్యాగు, పుస్తకాలు, స్కూల్ డ్రస్, షూ, బస్సు చార్జీ దాదాపు రూ.16,500 అవుతుంది. ఈ లెక్కన జనరల్ సెక్షన్లో అయితే రూ.42,500.. ఐఐటీ, ఒలంపియాడ్ సెక్షన్లో అయితే రూ.61,500 అవుతుంది. ‘చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పిల్లలు, బంధువుల పిల్లలు ఐఐటీ సెక్షన్లో ఉన్నారు. మన పిల్లాడినీ ఐఐటీ సెక్షన్లోనే చేరుద్దాం. మనం ఎత్తిపెట్టిన మొత్తానికి తోడుగా మరికొంత అప్పు చేద్దాం. ఒక్కగానొక్కడు.. బాగా చదివించుకుందాం.. అప్పు ఎలాగోలా తీర్చుకుందాం’ అని సుబ్బారావు భార్య తెగేసి చెప్పింది. కడప ఎడ్యుకేషన్ : జూన్ నెల వచ్చిందంటే చాలు దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతుంది. పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులతో పాటు స్కూల్ ఫీజును చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రచారార్భాటాలతో ఊదరగొడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ధాటికి సామాన్యులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. అలాంటి స్కూళ్లలో చదివించకపోతే భవిష్యత్ బావుండదనే బెంగతో అప్పులు చేయడానికి వెనుకాడటం లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఏడాది ‘జూన్’ ఖర్చుల కోసం కొంత మొత్తం దాస్తుంటారు. పెరుగుతున్న ఫీజులు, పుస్తకాల ధరల వల్ల ఇలా దాచిన డబ్బు సరిపోవడం లేదు. దాదాపు సగం మొత్తం అప్పు చేయాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు ఎంతగా తగ్గించుకున్నా ఈ నెలలో అప్పు చేయక తప్పడం లేదు. ఫీజును మూడు కంతుల్లో చెల్లించడానికి అవకాశం ఉన్నా, తొలి కంతులో సగం చెల్లించాలి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం. ఏ స్కూలు మంచిది.. ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల ప్రాంగణాలు విద్యార్థుల తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి. పిల్లలను ఏ పాఠశాలలో చేర్చాలనేది తల్లితండ్రులకు ప్రస్తుతం ఎదురవుతున్న ప్రథమ పరీక్ష. అందమైన హోర్డింగులు, రంగు రంగుల కరపత్రాలతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వారు ఆకర్షిస్తున్నారు. వీటిలో నిపుణులైన అధ్యాపకులు ఉన్నారనే విషయాన్ని నిర్ధారించే వారెవరూ ఉండరు. ఆయా పాఠశాలల యాజమాన్యాలు చెప్పింది నమ్మడం తప్ప మరో మార్గం లేదు. ఏ పాఠశాలలో అయినా వాస్తవంగా సైన్స్, మ్యాథ్స్, ఆంగ్లంపై ఎక్కువగా దృష్టి సారించాలి. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న ఆసక్తిని గమనించి చాలా పాఠశాలలు ఐఐటీ, ఒలంపియాడ్ మెథడ్ అంటూ తెరపైకి తెచ్చాయి. ఈ సెక్షన్లో అయితేనే సైన్సు, మ్యాథ్స్‌పై మంచి పట్టు వస్తుందని, ఇంజనీరింగ్/మెడిసిన్‌లో సీటు సాధించాలంటే ఇక్కడ చేర్చక తప్పదని నొక్కి చెబుతుండటంతో తల్లిదండ్రులు అప్పులు చేయడానికి వెనుకాడటం లేదు. కాన్సెప్ట్, ఐఐటి, ఇంటర్ నేషనల్ ఒలంపియాడ్, టెక్నో, ఈ టెక్నో, లెర్నింగ్, స్మార్ట్ ఇలా కొత్త పేర్లు అర్థం కాక.. ఏది మంచిదో తేల్చుకోలేక పలువురు స్కూల్ పీఆర్వోల మాయాజాలానికి బలవుతున్నారు. సౌకర్యాలు దయనీయం పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం గురించి ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ఈ చట్టం ప్రకారం కొన్ని సీట్లు పేద పిల్లలతోపాటు ఎస్సీ, ఎస్టీల పిల్లలకు ఇవ్వాల్సి ఉండగా అలాంటిది ఎక్కడా అమలు కావడం లేదు. ఇక సౌకర్యాల విషయానికొస్తే.. వారు బ్రోచర్లో చూపించినంతగా లోపలుండదు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సరిపడా మరుగు దొడ్లు ఉండవు. ఒక్కో ఫ్లోర్‌కు ఒకటి.. రెండు ఉన్నా వాటి నిర్వహణ ఘోరంగా ఉంటోంది. మరికొన్ని పాఠశాలల్లో గాలి వెలుతురు లేని దుస్థితి ఉంది. ఫీజులను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. పాఠశాలలో తరగతి ఫీజు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఫీజుల నియంత్రణ కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా అవి ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు ప్రభుత్వం నిర్ణయిం చిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. అప్పటికీ మారకపోతే ఆయా పాఠశాలలకు సంబంధించిన గుర్తింపును రద్దు చేస్తాం. - బండ్లపల్లె పత్రాప్‌రెడ్డి,జిల్లా విద్యాశాకాధికారి.