అమరావతి: ఎయిడెడ్ విద్యా సంస్థలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఏపీ ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయ్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పని ప్రశ్నించారు..?! ప్రజలకు మేలు చేయడానికే విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రక్షాళన అవసరమని విజయ్‌బాబు పేర్కొన్నారు.
ఎయిడెడ్ స్కూల్స్ విలీనంపై అభ్యంతరం లేదు: రాజీవ్,ఎయిడెడ్ స్కూల్స్ యజమాని
అమరావతి: నాడు-నేడుతో విద్యారంగంలో.. మంచి వాతావరణం నెలకొందని రాజీవ్, ఎయిడెడ్ స్కూల్స్ యజమాని తెలిపారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ఈ స్కూల్స్ విలీనంపై తమకు ఎలాంటి అభ్యంతరంలేదని, వీటి ప్రక్షాళనపై ప్రభుత్వ పాలసీ బాగుందని తెలిపారు. దీనికోసం ప్రభుత్వం.. ఐదారు నెలలుగా కమ్యూనికేట్ చేసి ప్రక్షాళన చేస్తున్నారని ఎయిడెడ్ స్కూల్స్ యజమాని పేర్కొన్నారు.
చదవండి: ఎల్లో మీడియా పత్రికా విలువల్ని పాటించాలి: మంత్రి సురేష్
Comments
Please login to add a commentAdd a comment