rti commissioner
-
‘ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పి?’
అమరావతి: ఎయిడెడ్ విద్యా సంస్థలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఏపీ ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయ్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పని ప్రశ్నించారు..?! ప్రజలకు మేలు చేయడానికే విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రక్షాళన అవసరమని విజయ్‌బాబు పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ విలీనంపై అభ్యంతరం లేదు: రాజీవ్,ఎయిడెడ్ స్కూల్స్ యజమాని అమరావతి: నాడు-నేడుతో విద్యారంగంలో.. మంచి వాతావరణం నెలకొందని రాజీవ్, ఎయిడెడ్ స్కూల్స్ యజమాని తెలిపారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ఈ స్కూల్స్ విలీనంపై తమకు ఎలాంటి అభ్యంతరంలేదని, వీటి ప్రక్షాళనపై ప్రభుత్వ పాలసీ బాగుందని తెలిపారు. దీనికోసం ప్రభుత్వం.. ఐదారు నెలలుగా కమ్యూనికేట్ చేసి ప్రక్షాళన చేస్తున్నారని ఎయిడెడ్ స్కూల్స్ యజమాని పేర్కొన్నారు. చదవండి: ఎల్లో మీడియా పత్రికా విలువల్ని పాటించాలి: మంత్రి సురేష్ -
‘రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో తెలుసా బాబు?!’
సాక్షి, విజయవాడ: ‘‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరడం హాస్యాస్పదంగా ఉంది. అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారో చంద్రబాబుకు తెలుసా. చంద్రబాబు గురించి తెలుసు కాబట్టి మోదీ, అమిత్ షా అపాయింట్ కూడా ఇవ్వలేదు’’ అని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాసివ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రపంచంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి’’ అని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా) ‘‘పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించి ఉంటే బావుండేది. గతంలో చంద్రబాబు ప్రధాని మోదీకి నిరసన స్వాగతం పలికారు. అమిత్ షా కుటుంబతో సహా తిరుమలకు వస్తే దాడులు చేయించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీని వ్యతిరేకిస్తూ దీక్షలు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడాలని చంద్రబాబు భావిస్తున్నారు’’ అని విజయ్ బాబు తెలిపారు. చదవండి: పట్టాభి తీరు సమర్థనీయం కాదు.. పార్టీలకతీతంగా ఖండించాలి -
కె.సుధాకర్‌రావు మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్‌గా పనిచేసిన కె .సుధాకర్‌రావు మందమర్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందారు. 2005 నుంచి 2010 వరకు ఉమ్మడి రాష్ట్రంలో సుధాకర్‌రావు సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితులు. సుధాకర్‌రావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. -
ఓట్ల కోసం ‘కోటా’లో పాగా!
కోటా రాజకీయాల చరిత్రలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టిన రాజకీయ వేత్త పి.వి. నరసింహారావు. రిజర్వేషన్ల ఫలాలు అందుకొని బాగుపడిన పైతరగతిని కోటానుంచి తప్పించాలనే క్రీమీలేయర్ విధానం మొదటిది. అన్ని వర్గాల్లో (కులాలు మతాలతో సహా) పదిశాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి కోటాను వర్తింపజేయడం రెండోది. కొన్ని వర్గాలు ప్రతిఘటించినా క్రీమీలేయర్ మార్పు నిలబడింది. రెండోదీ విలువైనదే అని ఈరోజు పరిణామాలు సూచిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అన్ని సాంకేతిక లోపాల్ని సవరించి రాజ్యాంగాన్ని రెండురోజుల్లో మార్చేసింది. ప్రభుత్వ సర్వీసులలో (ప్రయివేటు సర్వీసులలో కాదు), అన్ని విద్యా సంస్థల (ప్రయివేటు సంస్థలతో సహా, మైనారిటీ కాకుండా) ప్రవేశాలలోఇదివరకు రిజర్వేషన్ పొందని వర్గాలలో పది శాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇచ్చే వీలు కల్పిస్తూ భారత సంవిధానం ఆర్టికల్స్ 15, 16 లను సవరించే 124వ రాజ్యాంగ సవరణ జరిగిపోయింది. కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు ఇదేమిటో పూర్తిగా అర్థం చేసుకునే లోగానే సవరణ బిల్లు పాస్ అయిపోయి బైట పడింది. రిజర్వేషన్ వ్యతిరేకులు కూడా వ్యతిరేకించడానికి వీల్లేకుండా పాలసీని హఠాత్తుగా ప్రకటించారు. కులాధార రిజర్వేషన్లను ఇవ్వడానికి వీల్లే దని కూడా అనేక ధర్మాసనాలు వివరించాయి. ఫలానా కులంలో పుట్టిన వారు ఆర్థికంగా విద్యా సామాజిక పరంగా కూడా వెనుకబడి ఉంటే ఆ కులాన్ని వెనుకబడిన కులంగా పరిగణించడంలో తప్పులేదని, కులాన్ని అప్పుడు ఒక వర్గంగా గుర్తించవచ్చని న్యాయస్థానాలు వివరించాయి. ఓట్ల కోసం కోటాను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయనే విమర్శలు, నిందలు ఎన్ని ఉన్నా, సంవిధాన రూపకల్పనా సమయంలో షెడ్యూల్డు కులాలు, తెగలకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రతి పాదించిన వారికి అధికార కాంక్షతోకూడిన రాజకీయ స్వార్థాన్ని అంటకట్టడం న్యాయం కాదు. ఈ సందర్భంలో మిత్రుడు అరుణ్ పెండ్యాల కోటా విధానాలు ఏ విధంగా పుట్టాయి, అవి ఏరూపం తీసుకున్నాయి, చివరకు ఏ విధంగా పరిణమించాయి. పోనీ, ఆశించినట్టు ఏమైనా ఓట్లు తెచ్చి గెలిపించాయా? అని ఆలోచించారు. ఆ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో ఆయనపైన సోషలిస్టు వర్గాలు కోటా కోసం ఒత్తిడి తెచ్చాయి. మొరార్జీ 1979 జనవరి ఒకటో తేదీన ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల గురించి మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ 1980 జనవరిలో అంటే కమిషన్ ఏర్పాటయిన ఏడాది తరువాత అంతర్గత విభేదాలతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. మండల్ కమిషన్ 1980 డిసెంబర్ 31న నివేదిక ఇచ్చింది. ఓ దశాబ్దం తరువాత ఈ నివేదికకు ప్రాణం పోసిన ఘనుడు వి.పి. సింగ్. 1990 దశకం మొదట్లో చాలా బలహీనమైన సంకీర్ణప్రభుత్వానికి ఆయన అధినేతగా ఉన్నారు. రాజకీయంగా బలపడడానికి ఉపయోగపడుతుందన్న పేరాశతో మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు. రాజ్యాంగ సవరణ చట్టాలు తేలేదు కాని, పరిపాలనాపరమైన ఉత్తర్వులతో కోటాను అమలుచేయాలని, అప్పటికి ఉన్న ఓటు కోటలను బద్దలు కొట్టాలని అనుకున్నారు. కానీ జనం వీధినపడ్డారు. యువకులు ప్రాణాలు బలితీసుకున్నారు. మండల్ మంటల ఆందోళనలతో దేశం దద్దరిల్లింది. కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనాయి. సరిగ్గా ఆ దశలోనే మండల్‌కు పోటీగా బీజేపీ మత కమండలంతో రంగంలో ప్రవేశించింది. బాబ్రీ మసీదు స్థానంలో భవ్యమైన శ్రీరామ మందిర నిర్మాణమే తక్షణ కర్తవ్యమంటూ రథయాత్రకు బయలుదేరారు లాల్‌కృష్ణ అడ్వాణీ మహాశయుడు. మండలానికి కమండలానికి జరిగిన పోటీలో కమండలం బయటపడి మండలం మరుగున పడింది. మండల్ ప్రయత్నాలన్నీ హిందువులను చీల్చడానికి వాడుకుంటున్నవేనని సమస్తిపూర్ సభలో 23.10. 1990న అడ్వాణీ ప్రకటించారు. ‘మీరు శ్రీరామ మందిరం ఉద్యమం పేరుతో రథం వేసుకుని బిహార్‌లో ప్రవేశిస్తే మేం రానివ్వం, అరెస్టుచేస్తాం’ అని నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అదేవిధంగా అడ్వాణీ అరెస్టయ్యారు. వెంటనే వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆయన పదకొండు నెలల పాలన అంతటితో అంతరించడం తెలిసిందే. తరువాత మరో మైనారిటీ సంకీర్ణాన్ని సమర్థవంతంగా అయిదేళ్లు నడిపి సంకీర్ణంలోనూ స్థిరత్వం, సుపాలన సాధ్యమే అని నిరూపించిన పీవీ నరసింహారావు మరొక పాలనా ఉత్తర్వు ద్వారా అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన పదిశాతం కోటా ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాని క్రీమీలేయర్ సంస్కరణను ఆమోదించడం విశేషం. కోటా సాయంతో మళ్లీ అధికారానికి రావాలని ప్రవేశపెట్టిన ఈ పదిశాతం రిజర్వేషన్ల యత్నం ఎంత వరకు ఫలిస్తుందనేది ప్రశ్న. కేవలం ఆర్థిక ప్రాతిపదిక ఆధారంగా కోటాను సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
జనసేనకు విజయబాబు రాజీనామా
సాక్షి, విజయవాడ : జనసేన పార్టీకి విజయ బాబు రాజీనామా చేశారు. జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యహరిస్తున్న విజయబాబు.. అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయబాబు.. రాజీనామాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా, వ్యక్తిగత కారణాల వల్లే విజయబాబు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ఆర్టీఐ కమిషనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. -
సమాచారమా...కష్టం!
వక్కంటి జనార్దన్ అనే వ్యక్తి హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఓ సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెలరోజులు దాటినా అతనికి సమాచారం రాలేదు. దీంతో అతను సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు.అక్కడికి సంబంధిత అధికారి కూడా విచారణకు హాజరయ్యారు. ఆ వ్యక్తి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిషనర్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ అతనికి సమాచారం లభించలేదు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమాచార హక్కు చట్టంపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సమాచారం అడిగినా స్పందించడంలేదు. చూస్తున్నాం.. పరిశీలిస్తున్నాం అంటూ సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. దరఖాస్తుదారుడు కమిషన్‌ను ఆశ్రయించినపుడు కావలసిన సమాచారం ఇస్తామని కమిషనర్ ఎదుట హామీ ఇస్తోన్న అధికారులు తరువాత ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. జరిమానాలు విధించకపోవడం వల్లేనా? దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సమాచార కమిషనర్ నోటీసులు ఇచ్చినా అధికారులు çపట్టించుకోకపోవడంతో చట్టం సరిగా అమలు కావడం లేదు. ఒకవేళ సదరు అధికారి పదోన్నతి, లేదా బదిలీల కారణంగా సీటు మారితే ఇక అంతే సంగతులు. ఆ సమాచారం ఫైలు అటకెక్కుతుంది. సమాచారం ఇవ్వడంలో కావాలని జాప్యం చేసే అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉంటుంది. రోజుకు రూ.250 చొప్పున రూ.25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అధికారులకు జరిమానాలు విధించకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడు పరిష్కారమవుతాయో! సమాచార హక్కు కింద దరఖాస్తులు కొంతకాలంగా వేల సంఖ్యలో పేరుకుపోతున్నాయి. వీటిలో అధికారులు కావాలని జాప్యం చేసేవే అధికం కావడం గమనార్హం. గతంలో జాప్యం చేసిన అధికారులపై కమిషన్ చర్యలు తీసుకునేది. ఈ ఏడాది అక్టోబర్ వరకు దాదాపు 14 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కేవలం ఆరు వేల ఫైళ్లు మాత్రమే క్లియర్ అయ్యాయని, ఇంకా 9 వేలకుపైగా ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని సమాచారం. ఆశించిన సమాచారం లభించకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100 శాతం దరఖాస్తుల్లో తెలంగాణలో కేవలం 30 శాతం మాత్రమే పరిష్కారమవడం ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. చాలామందికి ఏడాది అవుతున్నా సరైన సమాచారం రావడం లేదని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సమాచార హక్కు చట్టం కోరలు లేని పులిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం: బుద్ధామురళి, ఆర్టీఐ కమిషనర్ సమాచారం ఇవ్వని అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయి. కమిషన్ నోటీసులను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని దరఖాస్తుదారులు మా దృష్టికి తీసుకురావాలి. అప్పుడు తప్పకుండా విచారించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తున్నాం. -
పారదర్శకతకు పాతరేసే యావ
సమకాలీనం పారదర్శకత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ హక్కుకు 2005లో చట్టబద్ధ రక్షణ కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడున్నరేళ్లు తెలుగు ప్రభుత్వాలు ఈ అంశాన్నే పట్టించుకోలేదు. అంతకు ముందున్న కమిషన్‌ను విభజన చేయకుండా, విడివిడిగా కమిషన్లు ఏర్పరచుకోకుండా, ఒక్కో కమిషనర్ పదవీ విరమణ చేస్తుంటే సదరు ఖాళీని భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టున్న తీరే సర్కారు వైఖరిని స్పష్టం చేసింది. ఫలితం కమిషన్ సహజ మరణం. పాలనలో పారదర్శకత ప్రశ్నార్థకమౌతోంది. ప్రజా సమాచారపు గుప్పిటి బిగుసుకుంటోంది. సమాచార హక్కు చట్టం వచ్చిన మొదటి అయిదారేళ్లలో కనిపించిన పాటి సానుకూలత కూడా ఇప్పుడు కరువౌతోంది. జనాల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లు సహితం రహస్య పత్రాలవుతున్నాయి. ముఖ్యమైన జీవోలు ‘కాన్ఫిడెన్షియల్’ ముసుగు కింద కనుమరుగవుతున్నాయి. వెలుగు చూడకుండానే కొన్ని ఉత్తర్వులు అమలవుతున్నాయి. సమాచారం చేరవేస్తున్నారని ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వాలు గోప్యత కోటగోడలు కడుతున్నాయి. సమాచారాన్ని బందీ చేస్తూ, వివిధ స్థాయి పాలనా యంత్రాంగానికి తప్పుడు సంకేతాలిస్తున్నాయి. విప్లవాత్మకమైందిగా చెప్పుకుంటున్న సమాచార హక్కు చట్టం అమలు చతికిలబడుతోంది. చడీచప్పుడు లేకుండా వెలగపండులో గుజ్జును ఏనుగు లాగేసినట్టు చట్టాల స్ఫూర్తిని సర్కార్లే మింగేస్తున్నాయి. అధికారుల్లో బాధ్యత–జవాబుదారితనం అడుగంటుతోంది. న్యాయస్థానాలపై ఒత్తిడిని తగ్గించి, సమాచారాన్ని ప్రజా క్షేత్రంలోకి సులభంగా, వెల్లువలా రానివ్వాలని ఈ చట్టం తీసుకువచ్చిన స్ఫూర్తి ఇప్పుడు భంగపడుతోంది. రాజకీయ పక్షాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చినా పార్టీలు, ప్రభుత్వాలు కనీసం ఖాతరు చేయటం లేదు. మొన్నటికి మొన్న కేరళ ప్రభుత్వం అడ్డగోలుగా నియమించిందని, అయిదుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. అంతకు ముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారు జరిపిన నలుగురు కమిషనర్ల నియామకం చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు, దాదాపు పదవీకాలం ముగిసే ముందర వారిని ఇంటికి పంపింది. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు చర్నాకోలా విదిలిస్తే తప్ప కమిషన్ ఏర్పాటు, కమిషనర్ల నియామకానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కాలు కదుపలేదు! రాజ్యాంగం సాక్షిగా, చట్టబద్ధంగా కొనసాగాల్సిన కమిషన్లే ఉనికిలో లేని శూన్యతను సర్కార్లే పనిగట్టుకొని çసృష్టిస్తున్నాయి. గడువు విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత కిందా మీద పడి తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పరచి, ముఖ్య సమాచార కమిషనర్‌ను, ఒక కమిషనర్‌ను నియమించింది. అది కూడా లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు వద్ద వాయిదాలు కోరుతూ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. ‘ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే... ఇదొక తలనొప్పి చట్టం, ఇది లేకుంటే బాగుండు, ఉన్నా ఊపిరిలేనట్టు ఓ మూలన పడుంటే నయముండు అన్నట్టుంద’న్న ఓ క్రియాశీల కార్యకర్త వ్యాఖ్యలు అక్షర సత్యాలు. సర్కార్లే ఇలా ఉండటంతో కంచే చేను మేసినట్టు తయారైంది పరిస్థితి. పెచ్చుమీరిన ఇష్టా‘రాజ్య’ధోరణి కమిషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకం తెలుగునాట మళ్లీ వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియామకం జరిగిన తెలంగాణలో, సదరు ప్రక్రియ వివరాలు కోరుతూ పెట్టుకున్న తమ ఆర్టీఐ దరఖాస్తుకు ఏం సమాచారం ఇస్తారోనని పౌరసంఘాలు నిరీక్షిస్తున్నాయి. అవసరమైతే మళ్లీ న్యాయస్థానం తలుపు తట్టాలని యోచిస్తున్నాయి. కమిషన్ ఏర్పాటు ప్రక్రియ సరిగా జరగలేదని, ఎంపికలోనూ న్యాయస్థానం మార్గదర్శకాలు పాటించలేదని, కమిషన్‌ను పూర్తిస్థాయిలో నింపలేదని చాలా అభియోగాలున్నాయి. కోర్టు ఇచ్చిన గడువు మీరిపోయినా, అదనపు సమయం కోరి నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసిన ఏపీ సర్కారు కదలికల్నీ అక్కడి పౌర సంఘాలు గమనిస్తున్నాయి. పొడిగించిన తాజా గడువు ప్రకారం నవంబరు 20 లోపు కమిషనర్ల నియామకం జరపాలి. ‘కేంద్ర ప్రభుత్వం వర్సెస్ నమిత్ శర్మ’(2013) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, గత ఆగస్టు నెలలో తీర్పు వెలువరిస్తూ కేరళ హైకోర్టు నిర్దేశించిన అంశాల నేపధ్యంలో ఇక్కిడి తాజా పరిణామాల్ని పరిశీలిస్తున్నారు. పారదర్శకత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ హక్కుకు 2005లో చట్టబద్ధ రక్షణ కల్పిం చారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడున్నరేళ్లు తెలుగు ప్రభుత్వాలు ఈ అంశాన్నే పట్టించుకోలేదు. అంతకు ముందున్న కమిషన్‌ను విభజన చేయకుండా, విడివిడిగా కమిషన్లు ఏర్పరచుకోకుండా, ఒక్కో కమిషనర్ పదవీ విరమణ చేస్తుంటే సదరు ఖాళీని భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టున్న తీరే సర్కారు వైఖరిని స్పష్టం చేసింది. ఫలితం కమిషన్ సహజ మరణం. పౌరులు, ప్రజా సంఘాల ఫిర్యాదుతో కోర్టు జోక్యం చేసుకొని ఆరువారాల్లో కమిషన్ ఏర్పాటు, కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆదేశాల దరిమిలా కదలిక మొదలయింది. అయితే కమిషన్లే లేకుండా చూడటం, లేదంటే నియామకాలు జరుపకుండా ఖాళీలు కొనసాగించడం ప్రభుత్వాలకు రివాజయింది. కోర్టు ఆదేశాలుండి తప్పని పరిస్థితుల్లో నియామకాలు జరపాల్సి వస్తే, తమవారనుకున్న అధికార– రాజకీయ అనుచరులకు పునరావాసం కల్పిస్తున్నారు. చట్టం అమలును నీరుగార్చడానికి పారదర్శకతపట్ల ఆసక్తి, అర్హతలేని వారితో కమిషన్లను నింపేస్తున్నారు. చట్ట నిబంధనలు, రాజ్యాంగస్ఫూర్తి ప్రకారం ఇవన్నీ కూడా ఒకటిని మించిన తప్పిదం మరొకటి. అసలెవరిని నియమించాలి? చట్టం అమలులో కీలక పాత్ర పోషించే కమిషన్లలో ఎవరిని కమిషనర్లుగా నియమించాలి? అన్నదొక ప్రశ్న. విద్యార్హతలు నిర్దేశించనందున చూడ్డానికి ఇదొక చిక్కుముడిలా కనిపిస్తున్నా, చట్టం ఈ విషయంలో సుస్పష్టంగానే ఉంది. సమాచారం... ప్రజలకు అందాల్సిన అవసరాన్ని–ఇవ్వనవసరం లేని సహేతుకతను నిర్ణయించే న్యాయప్రక్రియ, చట్టం అమలు పర్యవేక్షణ, చట్టోల్లంఘనలకు శిక్షలు విధించడం అనే మూడు ప్రధాన బాధ్యతలు నిర్వహించే కమిషనర్లది ఏ రకంగా చూసినా ముఖ్య పాత్రే! అందుకు తగ్గ హోదా వారికి ఇచ్చారు. రాష్ట్ర అత్యున్నత ఉద్యోగి అయిన ప్రధాన కార్యదర్శి(సీఎస్)తో సమాన హోదా కమిషనర్లకు, కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమాన హోదాను ముఖ్య సమాచార కమిషనర్‌కు కల్పించారు. కేంద్ర సమాచార కమిషన్‌లోని వారికి ఇంతకన్నా ఒక్కో అంచె అధిక హోదాలున్నాయి. అందుకు తగ్గట్టుగా అర్హులైన వారినే ఎంపిక చేయాలని చట్టం చెబుతోంది. ప్రజా జీవితంలో ప్రముఖులై, ప్రకటించిన న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సామాజిక సేవ, మేనేజ్మెంట్, జర్నలిజం, జన మాధ్యమాలు, పరిపాలనా రంగాల్లో విశేష పరిజ్ఞానం–విస్తృత అనుభవం కలిగి ఉండాలని చట్టం సెక్షన్ 12(5) (రాష్ట్ర కమిషన్లు), సెక్షన్ 15(5) (కేంద్ర కమిషన్)లలో స్పష్టంగా పేర్కొన్నారు. సమాచారం లభించక కమిషన్ వరకు వచ్చే వేర్వేరు రంగాలకు చెందిన అంశాల్ని పరిశీలించాల్సి వచ్చినపుడు ఆయా పరిజ్ఞానం–అనుభవం కలిగిన కమిషనర్లు ఉండాలన్నది ఉద్దేశం! అందుకే, ప్రతి కమిషన్‌లో ఒక ముఖ్య కమిషనర్‌తో పాటు అవసరాన్ని బట్టి పది మంది వరకు కమిషనర్లను నియమించుకోవచ్చని కూడా చట్టం చెబుతోంది. కానీ, దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను ఒక ప్రహసనం చేశారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్నే అత్యధిక సందర్భాల్లో నియమిస్తున్నారు. పదవిలో ఉండి, తదనంతర పునరావాసం కోసం నిరీక్షిస్తూ కొంత, నియామకం తర్వాత ప్రభుభక్తి చూపుతూ కొంత... పాలనా ప్రక్రియనే ఈ చకోరాలు భ్రష్టు పట్టిస్తున్నాయి. అత్యధిక సందర్భాల్లో ప్రభుత్వాలకు ‘అనుకూలురైన’ అధికారుల్నే నియమిస్తున్నారు. ఇంకా ఇతర వీర విధేయుల్నీ ఏ అర్హతా ప్రమాణాలతో నిమిత్తం లేకుండానే నియమిస్తున్నారు. ఈ ప్రక్రియంతా నిర్దిష్ట ప్రాతిపదికన, పారదర్శకంగా జరగాలని నమిత్ శర్మ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది. అభ్యర్థిం చుకున్న/ప్రతిపాదించిన పేర్లలో ఎవరెవరి అర్హతలేమిటి? ప్రజాజీవితంలో ప్రాముఖ్యం ఎలా? ఆయా రంగాల్లో వారికున్న విశేష పరిజ్ఞానం–విస్తృతానుభవం ఏమిటి? అనే వివరాల్ని వారి పేరు పక్కన పొందుపరచాలనీ మార్గదర్శకాలున్నాయి. జాబితా కుదింపులో, తుది ఎంపికలో పేర్లు నిరాకరించిన వారి కన్నా ఎంపిక చేసిన వారికున్న ప్రత్యేకత, అధిక అర్హతలేమిటో సరిపోల్చుకునేలా సదరు సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలనీ పేర్కొన్నారు. మన(సు)కు నచ్చిన ఎవరైనా ప్రజాజీవితంలో ముఖ్యులే అని గుడ్డిగా లెక్కిస్తామంటే కుదరదు. కేరళ తీర్పు గుణపాఠం కావాలి! కేరళ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన అయిదుగురు కమిషనర్ల నియామకాన్ని కొట్టి వేస్తూ రెండు నెలల కింద ఆ రాష్ట్ర హైకోర్టిచ్చిన తీర్పులో పలు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఎంపిక కాని ఓ అభ్యర్థి పిటిషన్, తాము ఎంపికయినా గవర్నర్ ప్రకటించడం లేదని అయిదుగురు చేసుక్ను పిటిషన్లు, రాష్ట్రం దాఖలు చేసిన రిట్ అప్పీళ్లు,.. ఇలా మొత్తం ఆరు అప్పీళ్లను ఉమ్మడిగా పరిశీలిస్తూ న్యాయస్థానం ఈ తీర్పిచ్చింది. ఎంపిక ప్రక్రియ సవ్యంగా, పారదర్శకంగా జరుగలేదన్నదే ఇందులోని ప్రధానాంశం. ముఖ్య సమాచార కమిషనర్, అయిదుగురు సమాచార కమిషనర్ల నియామకానికి గాను ప్రభుత్వం రెండు దఫాలుగా నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానించింది. సెక్షన్ 15 (3)లో చట్టం నిర్దేశించినట్టు ముఖ్యమంత్రి నేతృత్వంలో విపక్షనేత, ఒక సీనియర్ మంత్రితో ఏర్పాటయిన త్రిసభ్య కమిటి 2016 ఫిబ్రవరి 24న భేటీ అయింది. ముఖ్య సమాచార కమిషనర్, అయిదుగురు కమిషనర్ల పదవుల కోసం మొత్తం 269 దరఖాస్తులు వచ్చాయి. ఇన్ని దరఖాస్తులు ఒకే రోజు పరిశీలించడం ఎలా? వీటిని క్షుణ్ణంగా పరిశీలించి కుదించడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, కుదింపు కసరత్తు జరగాలని విపక్షనేత అభిప్రాయపడ్డారు. ఆ మేరకు సమావేశాన్ని వాయిదా వేశారు. మరుసటి రోజు భేటీలో ముఖ్య సమాచార కమిషనర్ పదవి కోసం 4, అయిదుగురు కమిషనర్ల నియామకం కోసం 15 దరఖాస్తుల్ని మాత్రం పరిశీలనకు ఉంచారు. ఏ ప్రాతిపదికన? ఎవరు ఈ కుదింపు ప్రక్రియ చేశారన్న విపక్షనేత ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు. కారణాలు, అర్హతలు వంటివి పేర్ల పక్కన పేర్కొనలేదు. తానీ ప్రక్రియకు సమ్మతించనని నోట్ రాసి ఆయన వెళ్లిపోయారు. మెజారిటీ సూత్రం ప్రకారం కమిటీ, తగిన సంఖ్యలో పేర్లను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపింది. ముఖ్య సమాచార కమిషనర్ నియామకం ఆమోదిస్తూ, కమిషనర్ల విషయంలో గవర్నర్ కూడ అవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ ఫైల్ తిప్పి పంపారు. అభ్యర్థుల విషయంలో తనకు అప్పటికే అందిన ఫిర్యాదుల్ని సర్కారుకు పంపుతూ విచారణ జరుపమన్నారు. కానీ ప్రభుత్వం అవే పేర్లతో జాబితాను తిరిగి పంపింది. అప్పుడు కూడా ఎంపికకు ప్రాతిపదిక, ఇతరుల కన్నా మెరుగైన అర్హతలు, విశేష పరిజ్ఞానం–విస్తృతానుభవాన్ని ధృవీకరించే పత్రాలేవీ జతచేయలేదని గవర్నర్ తిప్పి పంపారు. అయినా ప్రభుత్వం అవే పేర్లను ఖరారు చేసింది. ప్రకటన విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరింది. ఆయన నోటిఫై చేయకపోవడంతో వివాదం తలెత్తింది. ప్రభుత్వ చర్య తప్పని, చట్టం–రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కోర్టు గవర్నర్ చర్యలు సమర్థించింది. పారదర్శకతను పరిరక్షించాల్సిన వారి నియామకాల్లోనే అది లోపించడం సిగ్గుచేటు! ఆవులు పొలాల్లో మేస్తే లేగలు గట్లపైన మేస్తాయా? పౌర సమాజం మేల్కొంటేనే పాదర్శకత లభిస్తుంది. ప్రజాస్వామ్యం దక్కుతుంది. దిలీప్ రెడ్డి వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సత్యదేవుడిని దర్శించిన ఆర్టీఐ కమిషనర్
అన్నవరం : సమాచారహక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ వేంకటేశ్వర్లు దంపతులు గురువారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందించగా దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. -
కాపుల సహనాన్ని పరీక్షించవద్దు
– పదవులు తృణ ప్రాయమే..ఉద్యమానికి సన్నద్ధం – తేల్చిచెప్పిన ఆర్టీఐ కమిషనర్ విజయ్‌బాబు అనంతపురం న్యూటౌన్ : ‘ న్యాయమైన కోరికను కాపులు అడుగుతుంటే అడుగడుగునా రాజకీయాలు చేస్తూ కాపుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఉద్యమానికి సన్నద్ధం కావడమే ఇక మిగిలింది’ అంటూ ఆర్టీఐ కమిషనర్ విజయ్‌బాబు అన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండుతో ఉద్యమానికి సిద్ధమవుతున్న కాపులు జిల్లా స్థాయి జేఏసీలను ఏర్పాటు చేసుకున్నారు. కేటీబీ రాష్ట్ర నాయకులు జంగటి అమరనాథ్ నేతృత్వంలో గురువారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆర్టీఐ కమిషనర్ విజయ్‌బాబు మాట్లాడుతూ కాపుల మంచితనాన్ని చేతకాని తనంగా చూస్తున్నారని ఇకపై ప్రభుత్వ దమననీతిని సహించేది లేదని తేల్చిచెప్పారు. తమకు పదవులు తృణప్రాయమని, ఉద్యమానికి బాసటగా ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. సమైక్యంగా ఉంటేనే ఉద్యమాలు అనుకున్న లక్ష్యం చేరుకుంటాయని విబేధాలు మాని అందరం ఒక తాటిపై నడవాలని సూచించారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేవీ రావు , రిటైర్డ్ డీజీపీ ఎమ్వీ కృష్ణారావు, రాష్ట్ర కాపు జేఏసీ నేతలు తేలపల్లి రాఘవయ్య, పీవీఎస్ మూర్తి, నారాయణరెడ్డి తదితరులు కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాపులపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని అవలంభించడం మంచిది కాదని హితువు పలికారు. ఈనెల 11న రాజమండ్రి వేదికగా కాపులు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా కాపు నాయకులు మల్లికార్జున, రామగోపాల్, విజయ్‌శేఖర్, భాస్కర్, గుజరీ వెంకటేష్, రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు తదితరులు మాట్లాడారు. జిల్లా జేఏసీ ప్రమాణ స్వీకారం ఉద్యమ బాటలో నడవడానికి సిద్ధం కావాలన్న రాష్ట్ర జేఏసీ నేతల పిలుపుతో జిల్లా జేఏసీలను ఏర్పాటు చేసిన అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు. కాపు జిల్లా జేఏసీ చైర్మన్‌గా పూల వెంకటరమణ, కన్వీనర్‌గా భవానీ రవికుమార్, ఉద్యోగ జేఏసీకి సాయినాథప్రసాద్, లీగల్ జేఏసీకి తుకారాం, యువజన విభాగానికి గల్లా హర్ష, మహిళా విభాగం జేఏసీ వక్కల ఉమ, టీచర్స్ జేఏసీకి రవిశంకర్,భవన నిర్మాణ కార్మిక జేఏసీకి వరభద్ర, విద్యార్థి జేఏసీకి శ్రీనివాసులు తదితరులను కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. -
ఎస్కేయూ రిజిస్ట్రార్‌కు షోకాజ్ నోటీసులు
అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రర్ దశరథ రామయ్యపై ఆర్టీఏ కమిషనర్ తాంతియా కుమారి మండిపడ్డారు. సమాచార చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు ఈసందర్భంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే రూ. 2 వేలు జరిమానా విధించారు. బుధవారం అనంతపురంలో సమాచార హక్కు చట్టంపై తాంతియా కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మార్వోలు, వ్యవసాయ అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా తాంతియా కుమారి హెచ్చరించారు.