సాక్షి, విజయవాడ : జనసేన పార్టీకి విజయ బాబు రాజీనామా చేశారు. జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యహరిస్తున్న విజయబాబు.. అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయబాబు.. రాజీనామాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా, వ్యక్తిగత కారణాల వల్లే విజయబాబు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ఆర్టీఐ కమిషనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment