
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్‌గా పనిచేసిన కె .సుధాకర్‌రావు మందమర్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందారు. 2005 నుంచి 2010 వరకు ఉమ్మడి రాష్ట్రంలో సుధాకర్‌రావు సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితులు. సుధాకర్రావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు.