Reforms
-
‘ఉన్నత’ సంస్కరణలు తప్పనిసరి..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో (స్టేట్ యూనివర్సిటీలు) సంస్కరణలు అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా కరిక్యులమ్, పరీక్షల విధానంతో పాటు వర్సిటీల అక్రిడిటేషన్ ప్రక్రియ వరకు అన్నింటిలోనూ మార్పులు తేవాలని పేర్కొంది. జాతీయ పరిశోధన విధానాన్ని ప్రవేశపెట్టి మానవీయ శాస్త్రాలలో పరిశోధనలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది.సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించడం నుంచి ఉన్నత విద్య రోడ్ మ్యాప్ రూపకల్పన వరకు నీతి ఆయోగ్ పలు సూచనలు చేసింది. ఈ మేరకు 20 రాష్ట్రాలకు చెందిన వర్సిటీల వైస్ చాన్సలర్ల ఆమోదంతో రూపొందించిన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మెరుగైన సంస్కరణలకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం, 2047 నాటికి కేంద్రం నిర్దేశించిన వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా నివేదికను తయారు చేసినట్లు నీతి ఆయోగ్ తెలిపింది43 స్టేట్ వర్సిటీలతో కర్ణాటక టాప్.. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో 81% విద్యార్థుల నమోదు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే ఉంది. 2025 జనవరి నాటికి దేశంలో 495 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 43 వర్సిటీలతో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 38 వర్సిటీలతో రెండో స్థానాల్లో నిలిచాయి. గత 14 ఏళ్లలో స్టేట్ వర్సిటీల వృద్ధి 50 శాతానికి పైగా ఉంది. వీటిలో విద్యార్థుల నమోదు 2011–12నుంచి 2021–22 మధ్య 38% పెరిగి దాదాపు 3.24 కోట్లకు చేరుకుంది.పరిశోధనలు.. స్టార్టప్స్విద్యలో నాణ్యతా ప్రమాణాలు, పాలన, నిధులు, ఉపాధి సామర్థ్యం అనే నాలుగు విభాగాలలో 80 సిఫార్సులతోపాటు పరిశోధన, బోధన, డిజిటలైజేషన్, అంతర్జాతీకరణ అనే కీలకమైన నాలుగు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ నివేదికలో సూచనలు చేసింది. మానవీయ శాస్త్రాలు, ప్రాథమిక పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు పరిశోధనలను వాణిజ్యీకరణ చేయాలని, వర్సిటీల్లో స్టార్టప్‌లకు అవకాశం కల్పించాలని, ప్రముఖ పరిశోధన సంస్థలను ఇందులో భాగస్వాములుగా చేయాలని నివేదిక సూచించింది.ఐఐటీలకు దీటుగా ఎదగాలి..నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దశాబ్ద కాలంలో (2011–12 నుంచి 2021–22 వరకు) విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) వృద్ధి పరంగా కేరళ, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్ టాప్ 10 రాష్ట్రాలుగా నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు విద్యార్థి–టీచర్ నిష్పత్తి (పీటీఆర్)లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. లింగ సమానత్వ సూచిక (జీపీఐ)లో నాగాలాండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, సిక్కిం, హరియాణా, రాజస్థాన్, త్రిపుర, తమిళనాడు టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని, ఆ స్థాయిలో మన స్టేట్ వర్సిటీలు కూడా ఉండాలని సూచించింది. దేశంలో ఐఐటీలు వంటి విద్యాసంస్థలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయాలని పేర్కొంది. గత సర్కారు హయాంలో పలు సంస్కరణలు అమలు..నీతి ఆయోగ్ తాజాగా సిఫారసు చేసిన పలు సంస్కరణలను వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏపీలోని వర్సిటీలు, కళాశాల విద్యలో గతంలోనే అమలు చేయడం గమనార్హం. కళాశాలలను కంపెనీల స్టార్టప్స్‌తో అనుసంధానించి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అకడమిక్‌లో భాగం చేసింది. మానవీయ శాస్త్రాలు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసింది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థ ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్‌పై శిక్షణను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ యూనివర్సిటీలు అందిస్తున్న నైపుణ్య కోర్సులను మన విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఎడ్టెక్ సంస్థ ఎడెక్స్‌తో కలిసి 2 వేల అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్ కోర్సులను ఉచితంగా అందించింది.ఏఐసీటీఈ ద్వారా ఏఐ, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అంశాల్లో శిక్షణను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక్క 2023–24 విద్యా సంవత్సరంలోనే డిగ్రీ పూర్తయిన వెంటనే దాదాపు 2 లక్షల మందికిపైగా క్యాంపస్ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించారు. ఇతర సిఫారసులివీ..» విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సెమిస్టర్ ప్రాతిపదికన బోధన నాణ్యతను లెక్కించాలి.» డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను బోధనతో అనుసంధానించాలి. » ప్రొఫెసర్లు, విద్యార్థులకు ప్రపంచ దృక్పథాన్ని అలవరచేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలి. » ఉన్నత విద్య ఆర్థిక సంస్థ (హెచ్ఈఎఫ్ఏ) తరహాలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థను నెలకొల్పాలి. » ఆర్థిక సహాయం కోసం బలమైన పూర్వ విద్యార్థుల సంఘాలు, కార్పొరేట్ కార్యక్రమాలపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలి. » 2047 రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలి. ఉన్నత విద్యా మండళ్లకు అధికారాలు కల్పించి ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను సంస్కరించాలి. » పాలక మండళ్లల్లో బోధనా బృందాలకు చోటు కల్పించాలి. » రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా విభాగాల మధ్య సహకారాన్ని పెంచుతూ అక్రిడిటేషన్ ప్రక్రియను మార్చాలి. » విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లపై దృష్టి పెట్టాలి. వారు ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి. -
ఏటా 7.8 శాతం వృద్ధి అవసరం
న్యూఢిల్లీ: భారత్ అధిక ఆదాయ దేశంగా 2047 నాటికి (అభివృద్ధి చెందిన దేశం) అవతరించాలంటే ఏటా 7.8 శాతం సగటు వృద్ధిని, వచ్చే 22 ఏళ్లపాటు సాధించాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందుకు గాను ఆర్థిక రంగ, భూమి, కార్మిక మార్కెట్‌కు సంబంధించి సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషించింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత్ 2000 నుంచి 2024 మధ్య కాలంలో వృద్ధిని సగటున 6.3 శాతానికి వేగవంతం చేసుకుందంటూ.. గత విజయాలు భవిష్యత్తు లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ‘‘2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం ఎప్పటి మాదిరే సాధారణ పనితీరుతో సాధ్యపడదు. తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి ఎనిమిది రెట్లు వృద్ధి చెందాలి. అందుకోసం వృద్ధి మరింత వేగాన్ని అందుకుని, వచ్చే రెండు దశాబ్దాల పాటు స్థిరంగా కొనసాగాలి. అలాగే, ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు సరిపోవు. సంస్కరణలను మరింత విస్తరించడంతోపాటు, వేగవంతం చేయాలి. అప్పుడే 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్ మారుతుంది’’అని ప్రపంచబ్యాంక్ నివేదిక సూచించింది. విధానపరమైన చర్యలు, పెట్టుబడులు పెంచడం, నిర్మాణాత్మక పరివర్తనతోపాటు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనపై భారత్ దృష్టి సారించాలని పేర్కొంది.చిలీ, కొరియా, పోలండ్ నిదర్శనాలు.. ‘‘చిలీ, కొరియా, పోలండ్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మరింతగా అనుసంధానం కావడం ద్వారా మధ్యస్థ ఆదాయం నుంచి అధిక ఆదాయ దేశాలుగా విజయవంతంగా మారాయి. వాటి నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్వాలి’’అని ప్రపంచబ్యాంక్ భారత్ డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే పేర్కొన్నారు. 2000 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు రెట్లు పెరిగిందని, జీడీపీలో తలసరి ఆదాయం సైతం మూడు రెట్లు అధికమైనట్టు ప్రపంచబ్యాంక్ నివేదిక గుర్తు చేసింది. ఇందుకు మిగిలిన ప్రపంచంతో పోల్చితే భారత్ వేగంగా వృద్ధి చెందినట్టు తెలిపింది. ఇది కఠిన పేదరికం గణనీయంగా తగ్గేందుకు, సేవలు, మౌలిక సదుపాయాల విస్తరణకు దోహదం చేసినట్టు వివరించింది. గత విజయాల మాదిరే భారత్ తన సంస్కరణలను వేగవంతం చేసి, భవిష్యత్తులో మరింత అధిక వృద్ధిని సాధించాల్సి ఉంటుందని కౌమే పేర్కొన్నారు.అధిక యువ జనాభా సౌలభ్యం నేపథ్యంలో మెరుగైన ఉపాధి అవకాశాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, కార్మిక శక్తిలో మహిళల ప్రతినిధ్యాన్ని 35.6 శాతం నుంచి 2047 నాటికి 50 శాతానికి పెంచడం అవసరమని ఈ నివేదికకు సహ రచయితగా వ్యవహరించిన ఎమిలీయా స్కాక్, రంగీత్ ఘోష్ అభిప్రాయపడ్డారు. ‘‘మౌలిక వసతులు మెరుగుపడాలి. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. కార్మిక మార్కెట్ నిబంధనలను క్రమబదీ్ధకరించాలి. నిబంధనల భారాన్ని తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఉత్పాదకతతోపాటు పోటీతత్వం పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ చర్యలతో భారత్ థాయిలాండ్, వియత్నాం, చైనాతో సమానంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటుంది’’అని ప్రంపచబ్యాంక్ నివేదిక సూచించింది. -
మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరం
భారత బ్యాంకింగ్ రంగంలో మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరమని ప్రముఖ ఆర్థికవేత్త, ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విరాల్.వి.ఆచార్య అన్నారు. భారత బ్యాంకింగ్ విధానాలను రూపొందించడంలో ఆర్థిక అవసరాలు, రాజకీయ అంశాలపై పరస్పర చర్చ జరగాలని చెప్పారు. ఐఐఎం బెంగళూరులో జరిగిన ఐఎంఆర్ డాక్టోరల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన్ పాల్గొని మాట్లాడారు.‘దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం ఆర్థిక కారకాల ద్వారా మాత్రమే కాకుండా రాజకీయ వ్యవస్థ ద్వారా కూడా ప్రభావితమవుతోంది. కొన్నేళ్ల కొందట జరిగిన బ్యాంకుల జాతీయకరణ కేవలం ఆర్థిక సమ్మిళితం కోసమే కాకుండా రాజకీయ లక్ష్యాలను కూడా నెరవేర్చింది. జనాకర్షక వ్యయాలను సాధించడానికి ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ విధానం వల్ల మార్కెట్ ఆధారిత సంస్కరణలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా వ్యవస్థలు తేరుకుని సంస్కరణల దిశగా అడుగులు వేయాలి. డిజిటల్ ఫైనాన్స్ పెరుగుదల, బ్యాంకింగేతర రుణదాతల నుంచి నెలకొన్న పోటీ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. డిజిటల్ ఫైనాన్స్‌లో ఇండియా చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ, ముఖ్యంగా కోవిడ్ అనంతరం కార్పొరేట్ సంస్థల లాభాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది ఆర్థిక ప్రయోజనాలు తగ్గడానికి దారితీసింది’ అన్నారు.ఇదీ చదవండి: రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలునిర్మాణాత్మక సంస్కరణలు..దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చే నిర్మాణాత్మక సంస్కరణల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ ఆచార్య నొక్కి చెప్పారు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన సంస్కరణలు రావాలన్నారు. సంస్థలకు అనుకూలంగా ఉండే స్నేహపూర్వక సంస్కరణలకు బదులుగా మార్కెట్‌కు అనుకూలంగా ఉండే విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. -
సంస్కరణల పేరుతో...పాఠశాల విద్యకు తూట్లు!
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో సంస్కరణలు ప్రవేశపెడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117ను ఉపసంహరిస్తున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు ప్రకటించారు. జీవోలో ఉన్న అంశాలకు భిన్నంగా కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్టు గురువారం మెమో జారీ చేశారు. 2022 జూన్‌లో జాతీయ విద్యావిధానాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యలో మార్పులు చేస్తూ గత ప్రభుత్వం జీవో 117ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నా, రద్దు చేయాలన్నా తిరిగి ప్రభుత్వమే మరో జీవో ఇవ్వాల్సి ఉంది. కానీ పాఠశాల విద్య డైరెక్టర్ అందుకు భిన్నంగా జీవోను వెనక్కి తీసుకుంటున్నట్టు మెమో ఉత్తర్వులు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. కొన్ని నెలలుగా గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతున్న డైరెక్టర్, జీవో 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా మార్పులు చేయడంపై ఉపాధ్యాయుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేగాక గ్రామ పంచాయతీల్లో మోడల్ ప్రైమరీ స్కూల్స్ స్థాపనతో పాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ విభజనపైనా మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే, జిల్లా పరిషత్ చట్టాలనే మున్సిపల్ టీచర్లకు కూడా వర్తించేలా ఉత్తర్వులు ఉండటంతో ఆ విభాగం టీచర్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే, గత ప్రభుత్వం తీసుకువచ్చిన స్కూలింగ్ విధానానికి పేర్లు మార్చడంతో పాటు 3–5 తరగతులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేయడం, ఆ తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడంతో పాటు, గ్రామీణ పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హైసూ్కల్ ప్లస్ బోధనను కూడా రద్దు చేస్తున్నట్టు వివరించారు. అంతేగాక మున్సిపల్ స్కూళ్లకు కూడా ప్రభుత్వ, పంచాయతీరాజ్ స్కూల్స్ నిబంధనలు వర్తింపజేయనున్నట్టు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా ఉత్తర్వులు పాఠశాల విద్యా విధానంలో కొత్త విధానం తీసుకొస్తూ విడుదలైన తాజా ఉత్తర్వులు ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం చేసేలా ఉన్నాయి. అన్ని పాఠశాలల్లోను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలు రెండూ అందుబాటులోకి తెచ్చాకే జీవో 117ను రద్దు చేయాలి. సెక్షన్ల వారీగా కాకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి స్టాఫ్ ప్యాట్రన్ నిర్ణయించాలి. ప్రతి మీడియంకు 75 మంది విద్యార్థులు ఉంటే 9 మంది పాఠశాల సిబ్బందిని ఇవ్వాలి. లోపభూయిష్టంగా ఉన్న తాజా ఉత్తర్వులను సవరించాలి. హైసూ్కల్ ప్లస్‌కు ప్రత్యామ్నాయంగా జిల్లా పరిషత్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలి. – సి.వి.ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీటీఎఫ్, అమరావతి మున్సిపల్ టీచర్లకు అన్యాయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు మున్సిపల్ టీచర్లకు అన్యాయం చేసేలా ఉన్నాయి. ప్రభుత్వ విద్య, పంచాయతీరాజ్ టీచర్లకు మేలు చేస్తూ నిబంధనలు రూపొందించారు. పంచాయతీరాజ్ నిబంధనలనే మిగిలిన యాజమాన్యాల్లో ఉన్న పురపాలక, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ టీచర్లకు ఆపాదిస్తున్నారు. ప్రస్తుతం 14 వేలమంది పురపాలక టీచర్లు పట్టణాల్లో పనిచేస్తున్నారు. కానీ ప్రస్తుత నిబంధనలతో పురపాలక టీచర్లను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేసే పరిస్థితి నెలకొంది. జీవో 84 రద్దు చేసి, నిబంధనను తక్షణమే సవరించాలి. – ఎస్.రామకృష్ణ, అధ్యక్షులు, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్విద్యావిధానంలో మార్పులు ప్రస్తుతం జీవో 117 ప్రకారం... పాఠశాల విద్యలో ఆరు అంచెల పాఠశాలలు కొనసాగుతున్నాయి. 1.శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (పీపీ–1, పీపీ–2), 2.ఫౌండేషనల్ స్కూల్ (పీపీ–1 నుంచి రెండో తరగతి వరకు), 3. ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ (పీపీ–1, 2తో పాటు 1 నుంచి 5వ తరగతి), 4. ప్రిహైసూ్కల్/ యూపీ స్కూల్ (3 నుంచి 8 తరగతులు), 5. హైసూ్కల్ (3–10 తరగతులు), 6. హైసూ్కల్ ప్లస్ (3 నుంచి ఇంటర్ వరకు) అమలు చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రకాల పాఠశాలల వ్యవస్థను 5 రకాల పాఠశాలల వ్యవస్థగా మార్పు చేస్తున్నారు. 1.శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2) మహిళా శిశు సంక్షేమశాఖ చూస్తుంది. ఫౌండేషనల్ స్కూల్ (పీపీ–1 టు 2వ తరగతి), ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ స్థానంలో బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మార్చి పాత విధానం అమలు చేస్తారు. ప్రిహైసూ్కల్ స్థానంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్ బోధనను అందిస్తారు.హైస్కూల్స్‌లో 6 నుంచి 10 తరగతులు ఉంటాయి. హైస్కూల్ ప్లస్‌ను రద్దు చేస్తున్నారు. ఈ విధానంలో ప్రధానంగా 3–5 తగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ విధానం, హైస్కూల్ ప్లస్‌లో ఇంటర్ విద్య రద్దవుతుంది. అయితే, హైస్కూల్ ప్లస్ రద్దు చేసిన వాటికి ప్రత్యామ్నాయంగా ఆయా పాఠశాలల స్థానంలో అనుబంధ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. ఒక నిబంధన.. అనేక అనుమానాలుమోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో విద్యార్థుల నమోదు 60 దాటితే తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తామన్నారు. కానీ బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌లో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటారు. ఈ రెండు స్కూలింగ్ విధానంలోనూ ఒకే తరహా తరగతులు కొనసాగుతాయి. కానీ నిబంధనలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.పాఠశాలల్లో 6, 7, 8 తరతుల్లో విద్యార్థుల సంఖ్య 30 లేదా అంతకంటే తక్కువుంటే ఆ పాఠశాల స్థాయిని బేసిక్ ప్రైమరీ స్కూల్‌కు తగ్గించి ఆయా ఉన్నత తరగతుల విద్యార్థులను సమీపంలోని హైసూ్కల్లో చేరుస్తారు. అంటే విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను రద్దు చేస్తున్నారు. దీంతో మూడు కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత తరగతుల చదువు అందే పరిస్థితి లేదు. దీంతో బాలికల ఉన్నత చదువుకు ఆటంకం ఏర్పడుతుంది.ఉన్నత పాఠశాల వ్యవస్థలో 6 నుంచి 10 తరగతులకు సెక్షన్ల వారీగా ఉపాధ్యాయ సంఖ్యను నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 117 జీవో ప్రకారం 3–5 తరగతులను హైసూ్కల్స్‌లో కలపడంతో ఎనిమిది సెక్షన్లు వరకు కొనసాగుతున్నాయి. దీంతో బోధనకు రెండో స్కూల్ అసిస్టెంట్స్‌ను అందించారు. అయితే, 3–5 తరగతులను వెనక్కి తీసుకుపోవడంతో రాష్ట్రంలోని 60 శాతం పైగా హైసూ్కళ్లల్లో ఐదు సెక్షన్లు మాత్రమే మిగులుతాయి.ప్రస్తుతం ఆయా హైసూ్కళ్లల్లో మ్యాథ్స్, ఇంగ్లిష్, సోషల్ బోధన అందిస్తున్న రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఒక పోస్టు రద్దు కానుంది. ఈ చర్యతో వందలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులు చూపనున్నారు.75 కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్ట్ ఇచ్చేది లేదని, వ్యాయామ ఉపాధ్యాయులు సైతం మిగులు ఉంటేనే ఆ పోస్టును కేటాయిస్తామన్నారు. అంటే ఇప్పుడున్న పీఈటీలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. పై నిబంధనల అమలుకు క్లస్టర్ లెవెల్, మండల్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. దీంతో అధికారులపై ఒత్తిడి తప్పదు.ప్రస్తుతం హైస్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఏం చేస్తారేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. దీంతో ఆయా ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. సర్ప్లస్ ఉపాధ్యాయులను ఎక్కడ సర్దుబాటు చేస్తారనేది అనుమానమే. -
‘రక్షణ’లో సంస్కరణలు
న్యూఢిల్లీ: 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాలే లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వ భౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవినీ ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలు బలమైన పునాదులు వేస్తాయని రాజ్‌నాథ్ వెల్లడించారు. త్రివిధ దళాల సంయుక్త కమాండ్ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ భేటీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం చాలా ఉందని భేటీ అభిప్రాయపడింది. 9 సూత్రాల రక్షణ సంస్కరణ ప్రణాళికలో ముఖ్యాంశాలు...→ దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి. అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటి కప్పు డు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపది కన తీర్చడం.→ ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియలను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం.→ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం→ భారతీయ సంస్కృతి, ఆలోచనా ధోరణులను గర్వకారణంగా చర్యలు చేపట్టడం→ సైబర్, స్పేస్‌తో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, హైపర్సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట→ రక్షణ రంగంలో భావి సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలను మరింత శక్తిమంతంగా, సాంకేతికంగా సాటి లేని శక్తిగా మార్చడం. భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిది ద్దడం.→ రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం. వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వా మ్యాలకు ప్రోత్సాహం.→ రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దడం. విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు చేయూత.→ మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి. వారి అనుభవానికి పెద్దపీట. -
స్టాక్ మార్కెట్ మన్మోహనుడు
దశాబ్దకాలంపాటు దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ హయాంలో స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్మురేపాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు 400 శాతం దూసుకెళ్లింది. వెరసి 10 ఏళ్లలో 8 సంవత్సరాలు లాభాలు పంచింది. 2006–07లో 47 శాతం జంప్‌చేయగా.. 2009లో మరింత జోరు చూపుతూ 81 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. పలు కీలక నిర్ణయాలుఆర్థిక మంత్రిగా (1991–96) ఉన్నప్పటి నుంచే క్యాపిటల్ మార్కెట్లలో సంస్కరణలకు బీజం వేశారు మన్మోహన్ సింగ్. భారతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేసే విధానాలకు రూపకల్పన చేసారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 1988లోనే ఏర్పాటైనప్పటికీ 1992లో సెబీ చట్టం ద్వారా దానికి చట్టబద్ధమైన అధికారాలు అందించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పారదర్శకతను పెంపొందించేందుకు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ ఒక పటిష్టమైన నియంత్రణ సంస్థగా మారేందుకు ఇది తోడ్పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశం కలి్పంచడం ద్వారా మార్కెట్లో లిక్విడిటీకి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మన్మోహన్ సంస్కరణలు దోహదపడ్డాయి.బుల్ పరుగుకు దన్ను మన్మోహన్ సింగ్ దేశానికి ఆర్థిక స్వేచ్చను కలి్పంచిన గొప్ప శిల్పి. 1991లో సంస్కరణలతో దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్‌కు తెరతీశారు. వ్యాపారాలు భారీగా విస్తరించాయి. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,000 పాయింట్ల స్థాయి నుంచి జోరందుకుంది. 780 రెట్లు ఎగసి ప్రస్తుతం 78,000 పాయింట్లకు చేరుకుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రిటర్నులు అందించింది. – వీకే విజయకుమార్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్సంస్కరణల జోష్ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ 1991లో చేపట్టిన సంస్కరణలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో చెప్పుకోదగ్గ మార్పులకు కారణమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిచ్చాయి. ఆధునిక భారత్‌కు బాటలు వేశాయి. లైసెన్స్ రాజ్‌కు చెక్ పెట్టడంతోపాటు, స్వేచ్చా వాణిజ్యం, స్టాక్ మార్కెట్లలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఆయన దారి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. – పల్కా అరోరా చోప్రా, డైరెక్టర్, మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ 4,961 నుంచి 24,693కు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదవిలో ఉన్న 2004 నుంచి 2014వరకూ పరిగణిస్తే సెన్సెక్స్ 4,961 పాయింట్ల నుంచి 24,693 వరకూ దూసుకెళ్లింది. ఈ కాలంలో మూడేళ్లు మినహా ప్రతీ ఏటా ఇండెక్స్ లాభాల బాటలో నే సాగడం గమనార్హం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో ఇండెక్సులు పతనంకాగా.. 2011, 2014లోనూ మార్కెట్లు వెనకడుగు వేశాయి. 2011లో సెన్సెక్స్ అత్యధికంగా 27% క్షీణించింది. ఆరి్థక మంత్రిగా మన్మోహన్ 1991లో చేపట్టిన సంస్కరణలు ఆరి్థక వ్యవస్థకు జోష్‌నివ్వడంతో టర్న్అరౌండ్ అయ్యింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. బక్కచిక్కిన రూపాయి బలోపేతమైంది. ప్రధానంగా విదేశీ మారక నిల్వలు భారీగా ఎగశాయి.సెన్సెక్స్ పరుగు ఏడాది లాభం(%) 2004 33 2005 42 2006 47 2007 47 2009 81 2010 17 2012 26 2013 9 -
ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) వయో సంబంధిత సమస్యలతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నా వాటిని తట్టుకుని భారత్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఎగుమతులు పెంచుకుంటోంది. దానికోసం దేశంలో సమర్థ ద్రవ్యోల్బణ నిర్వహణకు చాలామంది కృషి చేశారు. అందులో ప్రధానంగా వినవచ్చే పేరు మన్మోహన్ సింగ్. ఆర్థికశాఖలో ఎకనామిక్ అడ్వైజర్‌గా పనిచేసినా, ఆర్బీఐ గవర్నర్(RBI Governor)గా నిర్ణయాలు ప్రకటించినా, దేశ ఆర్థిక మంత్రిగా బడ్జెట్(Budget) ప్రవేశపెట్టినా ప్రతిదానిలోనూ ఆర్థిక చదురతే కనిపించేది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.ప్రధాన ఆర్థిక సలహాదారుగా..1970వ దశకం ప్రారంభంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలో అనేక కీలక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు.వాణిజ్య విధాన సంస్కరణలు: భారత ఆర్థిక వ్యూహంలో అంతర్గత వాణజ్య విధానం కీలకంగా ఉండేది. ప్రపంచీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గత దృక్పథానికి దూరంగా, బహిరంగ వాణిజ్య విధానాన్ని ప్రతిపాదించారు. ఎగుమతుల ఆధారిత వృద్ధితోపాటు వాణిజ్య అడ్డంకులను తగ్గించేలా కృషి చేశారు.పారిశ్రామిక విధానం: భారత పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి చర్యలను చేపట్టారు.ఆర్థిక రంగ సంస్కరణలు: ఆర్థిక వ్యవస్థలో మెరుగైన నియంత్రణ, స్థిరత్వాన్ని కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సహా భారతదేశ ఆర్థిక సంస్థలను బలోపేతం చేయడానికి పూనుకున్నారు.ఆర్థిక ప్రణాళిక: ప్రణాళికా సంఘంలో భాగంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు దోహదపడ్డారు.ఆర్బీఐ గవర్నర్‌గా..1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా మన్మోహన్ సింగ్ అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. ఇవి దేశ బ్యాంకింగ్ రంగంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.బ్యాంకింగ్ లా (సవరణ), 1983: ఈ చట్టం ద్వారా బ్యాంకులు లీజును అనుమతించడంతో కార్యకలాపాల పరిధి పెరిగింది. ఖాతాదారులకు నామినేషన్ సౌకర్యాలను అందించింది.అర్బన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి, మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ విభాగాన్ని స్థాపించారు.ద్రవ్య విధానం: ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూ అధిక వృద్ధిపై దృష్టి సారించే ఆధునిక ద్రవ్య విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.రుణ లభ్యత: నిరుపేద ప్రాంతాలకు రుణ లభ్యతను సమకూర్చడం, సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయాలని సింగ్ నొక్కి చెప్పారు.ద్రవ్య విధానాల ఏకీకరణ: ప్రభుత్వ వ్యయాలకు నిధులు సమకూర్చడం కోసం ఆర్బీఐ పరపతిపై అధికంగా ఆధారపడకుండా ద్రవ్య, ఆర్థిక విధానాలను ఏకీకృతం చేయాలని చెప్పారు.ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?ఆర్థిక మంత్రిగా..1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి.సరళీకరణ: ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం.ప్రైవేటీకరణ: గతంలో ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడం.విదేశీ పెట్టుబడులు: అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో 51% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించడం, విదేశీ సాంకేతిక ఒప్పందాలకు అడ్డంకులను తొలగించడం.పారిశ్రామిక విధానం: చాలా ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. వ్యాపార విస్తరణ, విలీనాలను సులభతరం చేయడానికి గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతులను సవరించడం. -
ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు
యాక్సిడెంటల్ పీఎం. ఈ పదబంధం డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు అచ్చు గుద్దినట్టుగా సరిపోతుంది. నిజానికి ఆయనకున్న భుజకీర్తులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త. అనుకోకుండా వచ్చి పడ్డ ముళ్లకిరీటం వంటి ఆర్థిక మంత్రి బాధ్యతలను అత్యంత చాకచక్యంగా నిభాయించి దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావి. ఏకంగా పదేళ్లపాటు ప్రధాని. ఆ ఘనత సాధించిన తొలి సిక్కు. నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడు. సమాచార హక్కు వంటి కీలక చట్టాలు చేసిన సర్కారుకు సారథి. అయినా సరే, మన్మోహన్ పేరు చెప్పగానే ఎవరికైనా మదిలో మెదులేది ఆయన అనూహ్యంగా ప్రధాని అయిన తీరే! అందుకే ఆయనపై రాసిన పుస్తకానికి ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సంజయ బారు కూడా ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పేరు పెట్టారు. ‘పీఎం మన్మోహన్’కు మీడియా సలహాదారుగా నాలుగేళ్ల పాటు ఆయనను అతి దగ్గరగా చూసిన అనుభవాలన్నింటినీ అందులో నిర్మొహమాటంగా పొందుపరిచారు. నిశ్శబ్ద సంస్కర్త ప్రధానిగా మన్మోహన్ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పరుగులు పెట్టింది. మన దేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చరిత్రాత్మక చట్టాలు పుట్టుకొచ్చాయి. వామపక్షాలు వ్యతిరేకించినా, ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా వెరవక అమెరికాతో మన్మోహన్ కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం మరో మైలురాయి. దౌత్య రంగంలో కూడా పలువిజయాలకు ఆయన హయాం వేదికైంది. అమెరికా, రష్యా, చైనా వంటి పెద్ద దేశాలతో బంధాలను బలోపేతం చేశారు. ఫలితంగా 2008లో ప్రపంచమంతా పెను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నా మన్మోహన్ ముందుచూపు నిర్ణయాల వల్ల భారత ప్రస్థానం మాత్రం స్థిరంగా సాగింది. ఇన్ని చేసినా కృషికి తగ్గ పేరు రాని నిశ్శబ్ద సంస్కర్తగానే మిగిలిపోయారు మన్మోహన్.మీరు జోక్ చేస్తున్నారా? ఆర్థిక శాఖ ఆఫర్‌పై మన్మోహన్అది 1991. కేంద్రంలో పీవీ సారథ్యంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. మర్నాడే ప్రమాణస్వీకారం. మంత్రివర్గ కూర్పుపై పీవీ మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ సమయాన మన్మోహన్ ఢిల్లీలో తన నివాసంలో కూర్చుని తాపీగా పేపర్ చదువుతున్నారు. అప్పుడు పీవీ ముఖ్య కార్యదర్శి ఆయన ఇంటికి వచ్చారు. ‘ప్రధాని మిమ్మల్ని కేబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి’ అని చెప్పారు. దాన్ని మన్మోహన్ నమ్మలేదు. ‘‘నేనా? కేబినెట్లోకా? మీరు జోక్ చేస్తున్నారా?’’ అంటూ నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మర్నాడు ప్రమాణ స్వీకారానికి వేళవుతున్నా మన్మోహన్న్రాష్ట్రపతి భవన్ చేరుకోకపోవడంతో పీవీ ముఖ్య కార్యదర్శి నేరుగా ఆయన ఇంటికి ఫోన్‌చేశారు. ’ప్రమాణానికి టైం దగ్గర పడుతుంటే మీరింకా రాలేదేంటి?’ అంటూ హైరానా పడ్డారు. అప్పటికి గానీ తాను నిజంగానే మంత్రిని కాబోతున్నట్టు మన్మోహన్ నమ్మలేదు. దాంతో ఉన్నపళాన బయల్దేరి వెళ్లి ప్రమాణస్వీకారం చేశారు. ‘‘అలా నా రాజకీయ జీవితం హడావుడిగా మొదలైంది! కనీసం తయారయ్యే టైం కూడా లేకుండానే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది’’ అంటూ 2005లో ఓ బ్రిటిష్ జర్నలిస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. అవార్డులు.. రివార్డులు ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి మన్మోహన్ లెక్కలేనన్ని గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఎన్నోసార్లు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు. 1987లో దేశ రెండో అతి పెద్ద పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఎన్నో దేశాలు ఆయనకు తమ అత్యుత్తమ పౌర పురస్కారాలు ప్రదానం చేశాయి. కష్టాల బాల్యం మన్మోహన్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్‌లోని గహ్ గ్రామంలో జని్మంచారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చిన్నప్పుడే తల్లి చనిపోతే అమ్మమ్మే అన్నీ తానై పెంచింది. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం అమృత్సర్ వలస వచ్చింది. ఆర్థిక కష్టనష్టాలను ఓర్చుకుంటూనే ఆయన విద్యాభ్యాసం సాగించారు. అసాధారణ ప్రతిభతో స్కాలర్షిప్లు పొందుతూ ఉన్నత విద్య పూర్తి చేశారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, 1954లో మాస్టర్స్ పట్టా పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో నఫీల్డ్ కాలేజీలో పీహెచ్డీ చేశారు. ఆయన సమరి్పంచిన డాక్టోరల్ థీసిస్ ‘భారత ఎగుమతి ధోరణులు, స్వయం ఆధారిత వృద్ధి ప్రాతిపదికలు’ మన ఆర్థిక వ్యవస్థపై ఆయన లోతైన దృష్టికి తార్కాణం. అధ్యాపకునిగా, బ్యూరోక్రాట్‌గా...మన్మోహన్ కెరీర్ ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్‌గా మొదలైంది. పంజాబ్ యూనివర్సిటీ ,ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బోధించారు. ఆర్థికశాస్త్రం, విధానాలపై లోతైన అవగాహన ఆయనది. 1966–69 మధ్య ఐరాసలోనూ పని చేశారు. అనంతరం అనుకోకుండా బ్యూరోక్రాట్‌గా మారారు. తొలుత వాణిజ్య, పరిశ్రమల శాఖలో ఆర్థిక సలహాదారుగా చేశారు. అనంతరం 1972–1976 నడుమ కేంద్ర ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగావున్నారు. 1982–1985 మధ్య రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రాణించారు. తర్వాత రెండేళ్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా సేవలందించారు. ఆయా పదవుల్లో ఉండగా మన్మోహన్ రూపొందించిన పలు కీలక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరణ బాట పట్టించడంలో ఎంతగానో దోహదపడ్డాయి.మచ్చలేని వ్యక్తిత్వం నిజాయితీకి, మచ్చలేని వ్యక్తిత్వానికి ప్రతీక మన్మోహన్. ప్రజా జీవితంలో నాయకులు పాటించాల్సిన విలువలకు బెంచ్‌మార్క్‌గా నిలిచారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అతి నిరాడంబర జీవన శైలి, అన్ని అంశాల మీదా లోతైన అవగాహన సమకాలీన నాయకుల్లో ఆయన్ను అత్యంత విలక్షణంగా నిలిపాయి. నెహ్రూను కూడా కాదని మన్మోహన్‌ను అత్యుత్తమ ప్రధానిగా కుష్వంత్‌సింగ్ వంటి ప్రముఖులు కీర్తించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రచారం నిమిత్తం తన వద్ద తీసుకున్న రూ.2 లక్షలను మన్మోహన్ గుర్తుతో తిరిగిచ్చిన వైనాన్ని కుష్వంత్ చాలాకాలం పాటు ఎందరితోనో చెప్పుకున్నారు.పాలనపై విమర్శ...వ్యక్తిగతంగా మన్మోహన్‌ది ఏ మచ్చా లేని జీవితమే అయినా పాలనపరంగా మాత్రం కొన్ని విమర్శలూ ఎదుర్కొన్నారు. యూపీఏ–2లో రెండోసారి ప్రధాని అయ్యాక కామన్వెల్త్ క్రీడలు, బొగ్గు, 2జీ స్పెక్ట్రం వంటి కుంభకోణాలు ఆయన ప్రతిష్టను మసకబార్చాయి. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నల పరంపరకు, ‘వెయ్యి సమాధానాల కంటే మౌనమే మేలు’ అంటూ ఆయన బదులిచ్చారు. అవినీతి, నమ్మకద్రోహం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలపై బదులిచ్చేందుకు కోర్టుకు రావాల్సిందిగా అనంతర కాలంలో సమన్లు కూడా అందుకోవాల్సి వచ్చింది.ఆ మలుపు... 1991లో మన్మోహన్ జీవితం అనుహ్యమైన మలుపు తిరిగింది. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయమది. విదేశీ మారక ద్రవ్యం దాదాపుగా నిండుకుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో ఏ సంబంధమూ లేని మన్మోహన్‌ను ఎకాయెకిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. దీనిపై అప్పట్లో పలువురు పెదవి విరిచినా ఆ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్‌గా నిలిచింది. మన్మోహన్ విధానాలు, 1991 ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చేశాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపా యిని విలువ తగ్గించినా, విదేశీ పెట్టుబడులకు బాటలు పరిచినా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించినా అన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నిర్ణయాలే! పీవీ మార్గదర్శకత్వంలో ఆయన చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, నేలచూపులు చూస్తున్న మన ఆర్థిక వ్యవస్థ సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. ‘ఏ శక్తీ ఆపలేని ఆలోచనలు మనవి’ అంటూ 1991 బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అనంతర చరిత్ర నిరూపించింది. ప్రధానిగా ప్రస్థానంమన్మోహన్ జీవితంలో 1991ని కూడా మించిన అత్యంత అనూహ్య మలుపుకు 2004 వేదికైంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ మెజారిటీ సాధించినా సోనియాగాంధీ ప్రధాని కావడంపై అభ్యంతరాలు తలెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆమె విదేశీయతను ప్రశ్నించిన పరిస్థితి! దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవిని సోనియా ‘త్యాగం’ చేశారు. ప్రణబ్ సహా కాంగ్రెస్ దిగ్గజాలెందరో ఆ పదవికి పోటీ పడ్డా సోనియా మాత్రంసౌమ్యుడైన మన్మోహన్కేసి మొగ్గారు. అలా అనుకోకుండా దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, ఆ అత్యున్నత పదవిలో ఏకంగా పదేళ్లపాటు నిరాఘాటంగా కొనసాగి ఆయన మరో చరిత్ర సృష్టించారు!రాహుల్ చించేసిన ఆ ఆర్డినెన్స్... ప్రధానిగా తన పాలనా కాలం పొడవునా సోనియా నీడలోనే మిగిలిపోయారన్న అపప్రథ మూటగట్టుకున్నారు మన్మోహన్. జాతీయ సలహా మండలి చైర్పర్సన్ హోదాలో పదేళ్ల పాటు ఆమె బాధ్యత లేని అధికారాలు చలాయించినా చేష్టలుడిగి చూశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 2013లో సోనియా తనయుడు రాహుల్‌గాంధీ చేసిన పని మన్మోహన్ గౌరవ ప్రతిష్టలను మరింత దిగజార్చింది. కళంకిత నేతలు దోషులుగా తేలినా మూడు నెలల పాటు పదవుల్లో కొనసాగవచ్చంటూ 2013లో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ‘నాన్సెన్స్’ అంటూ రాహుల్ కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా విలేకరుల సమావేశం సాక్షిగా ఆర్డినెన్స్ కాపీని చించేశారు. అది మన్మోహన్‌ను కూడా తీవ్రంగా కలచివేసిందని చెబుతారు. బహుశా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కాబోలు, మన్మోహన్‌ను ‘దేశ చరిత్రలోనే అత్యంత బలహీన ప్రధాని’గా బీజేపీ దిగ్గజం ఎల్కే ఆడ్వాణీ, ‘నైట్ వాచ్‌మన్’గా, ‘గాంధీల చేతుల్లో కీలు»ొమ్మ’గా నరేంద్ర మోదీ అభిర్ణించారు! మన్మోహన్ తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా లోక్‌సభకు ఎన్నికవలేదు! ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం 2024 ఏప్రిల్‌తో రాజ్యసభ సభ్యుని హోదాలో ముగిసింది.‘మన్మోహనాలు’ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వివిధ అంశాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించే క్రమంలో పంచుకున్న మనసులోని భావాలు.ఆర్థిక సంస్కరణలపై..→ సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఈ భూమ్మీద ఏ శక్తీ ఆపలేదు.గ్లోబలైజేషన్, ఆర్థిక వ్యవస్థపై:→ భారత్ ఇప్పుడు సమ్మిళిత, సమాన, స్థిరమైన వృద్ధి పథంలో సాగుతోందని నేను నమ్ముతున్నా→ ప్రపంచీకరణ ఒక వాస్తవం. దాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా మన విధానాలను రూపొందించుకోవాలి.నాయకత్వం, పాలనపై..→ భారత్‌కు అపారమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని నిజంగా విశ్వసిస్తున్నా. వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేందుకు సుపరిపాలన అవసరం.ప్రపంచంలో భారతదేశం పాత్రపై→ భారత్ పురాతన దేశమే అయినప్పటికీ అది యువదేశం. ఎటుచూసినా యువతరం కనిపిస్తున్న మాదిరిగానే మనం ఆత్రుతలో ఉన్నాం. కానీ భవిష్యత్తు మనదే అని నేను బలంగా నమ్ముతున్నా.→ మనం ఎదురుదాడి కాకుండా సహకారం, పోటీతత్వం అనే సరైన మార్గాన్ని ఎంచుకుంటే భారత్ ఎదిగేందుకు ఈ ప్రపంచం చోటు కల్పిస్తుంది.ఆయనపై → పెద్ద బాధ్యత అందుకున్న చిన్న వ్యక్తిని నేను.ప్రధానిగా..→ వినయం, లక్ష్యానికితగ్గ పట్టుదల నాయకత్వానికి పునాదులని నేను ఎల్లప్పుడూ విశ్వసించా.విద్య, యువతపై..→ భవిష్యత్తుకు విద్యే కీలకం. దేశ ప్రజలు, భవిత కోసం దేశం చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అదే.→ దేశ యువత గొప్ప కలలు కనాలి. గొప్ప కలలు కంటేనే మనం గొప్ప విజయాలను సాధించగలమని నమ్మొచ్చు.చరిత్ర ఉదారంగానే చూస్తుంది... సమకాలీన మీడియా కంటే చరిత్ర నా పట్ల ఉదారంగానే వ్యవహరిస్తుంది – 2014 జనవరిలో ప్రధానిగా చివరి మీడియా సమావేశంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలివి! మీడియా శరపరంపరగా ప్రశ్నలు సంధించడంతో అలా స్పందించారాయన. ‘సంకీర్ణ రాజకీయాల అనివార్యతకు లోబడి నేను చేయగలిగినంత చేశాను. దానిపై చరిత్రే తుది తీర్పరి’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అవరోధాలు తొలగిస్తూ సంస్కరణలు
న్యూఢిల్లీ: భారత యువత అభివృద్ధి పథంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం సంస్కరణలు తెచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దైనందిన జీవితంలో ఎదురవుతున్న సవాళ్లకు యువత సరైన పరిష్కారాలు చూపుతూ సాగే ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్(ఎస్ఐహెచ్)’ కార్యక్రమం అంతిమ పోరు సందర్భంగా ప్రధాని మోదీ తుది పోటీదారులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపే బాధ్యత తమపై ఉందని నేటి యువత బాధ్యతాయుతంగా ఆలోచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలు సాధించగల, సాంకేతికత సత్తా ఉన్న యువత భారత్ సొంతం. శాస్త్రీయ దృక్పథాన్ని మరింతగా పెంచేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. సంస్కరణలు తెస్తూ భారత యువత అభివృద్ధి పథంలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం తొలగిస్తోంది’’ అని మోదీ అన్నారు. ఏడో దఫా ఎస్ఐహెచ్లో దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల్లో 1,300కుపైగా విద్యార్థి బృందాలు ఫైనల్లో పోటీపడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎడిషన్ పోటీ 36 గంటల్లో ముగుస్తుండగా హార్డ్‌వేర్ ఎడిషన్‌లో పోటీ 15వ తేదీదాకా కొనసాగనుంది. హ్యాకథాన్‌లో భాగంగా జాతీయ ప్రాధాన్యత గల 17 అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశ్రమలు ఇచ్చి సమస్యలకు అత్యంత ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపుతూ విద్యార్థి బృందాలు తమ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తిచేసి సమర్పించాల్సి ఉంటుంది. పలు రంగాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది. -
ఇది టెక్, డేటా శతాబ్ది సంస్కరణలు..
జైపూర్: సంస్కరణలు, పనితీరు, పారదర్శ కతలను పాటిస్తూ భారత్ సాధించిన అభివృద్ధి ఇప్పుడు ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం జైపూర్‌లోని ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లో మొదలైన ‘రైజింగ్ రాజస్తాన్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు, నిపుణుడు భారత్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. గత పదేళ్లలో భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. సంక్షోభాల సమయంలోనూ నిరాటంకంగా ఉత్పత్తిని కొనసాగించే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం కోరుకుంటోంది. అలాంటి భారీ ఉత్పత్తి క్షేత్రంగా భారత్ ఎదగాలి. భారత్ వంటి వైవిధ్యభరిత దేశంలో ప్రజా స్వామ్యం పరిఢవిల్లడం కలిసొచ్చే అంశం. ప్రజాస్వామ్యయుతంగా మానవాళి సంక్షేమం కోసం పాటుపడటం భారత విధానం. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్నే ఎన్నకుంటున్నారు. ఈ సంస్కృతిని యువశక్తి మరింత ముందుకు తీసుకెళ్తోంది. యువభా రతంగా మనం ఇంకా చాన్నాళ్లు మనం కొనసా గబోతున్నాం. భారత్‌లో అత్యంత ఎక్కువ మంది యువత, అందులోనూ నైపుణ్యవంతులైన యువత అందుబాటులో ఉన్నారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాస్వామీకరణ చేయడం ద్వారా ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కుతాయని భారత్ నిరూపించింది. ఈ శతాబ్దిని టెక్నాలజీ, డేటాలే ముందుకు నడిపిస్తాయి’’ అన్నారు. -
EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 3.0 వెర్షన్లో మెగా పునరుద్ధరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు లక్ష్యంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించడంతో సహా ఈపీఎఫ్‌వో సేవల్లో భారీ సంస్కరణలను కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఉద్యోగుల 12 శాతం కాంట్రిబ్యూషన్ పరిమితిని ఈపీఎఫ్ఓ సమీక్షించే అవకాశం ఉందని ఈటీ నౌ మూలాధారాలను ఉటంకిస్తూ రిపోర్ట్ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్‌ను పెంచుకోవడం ద్వారా మరింత సొమ్మును పీఎఫ్‌కు జమ చేసుకునేందుకు వీలు కలగనుందని నివేదిక పేర్కొంది. అయితే, యాజమాన్యం వంతుగా జమ చేసే మొత్తం ఉద్యోగి జీతంపై ఆధారపడి ఉంటుంది.మొత్తంమీద, ఈపీఎఫ్‌వో తీసుకుంటున్న చర్యలను ఉద్యోగుల పొదుపును పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. అదనంగా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను వారి సమ్మతితో పెన్షన్‌గా మార్చడానికి అనుమతించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఏ సమయంలోనైనా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
భూ, సాగు, కార్మిక సంస్కరణలు అవసరం: సీఐఐ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి వేగవంతానికి వీలుగా మోదీ సర్కారు కారి్మక, భూ, సాగు సంస్కరణలు చేపట్టాలని పరిశ్రమల సంఘం సీఐఐ కేంద్రానికి సూచించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధించినట్టు కేంద్ర సర్కారు ఇటీవలే అంచనాలు విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇది 8 శాతం మేర నమోదవుతుందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్‌పురి అంచనా వేశారు. సీఐఐ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. గతంలో చేపట్టిన ఎన్నో విధానపనరమైన చర్యలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలబెట్టినట్టు చెప్పారు. ‘‘అసంపూర్ణంగా ఉన్న సంస్కరణల అజెండాను పూర్తి చేయడంపైనే వృద్ధి అంచనాలు ఆధారపడి ఉన్నాయి. మన ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో అవకాశాలను విస్తృతం చేయడం, పెట్టుబడులు, వినియోగం, సాధారణ వర్షపాతంపై అంచనాలు వృద్ధిని ప్రభావితం చేస్తాయి’’అని పురి వివరించారు. ప్రైవేటు పెట్టుబడులు కూడా పుంజుకున్నట్టు చెప్పారు. జీఎస్టీలో మూడు రకాల రేట్లే ఉండాలని, పెట్రోలియం, రియల్ ఎస్టేట్‌ను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. -
సంస్కరణలు కొనసాగుతాయ్: సీతారామన్
న్యూఢిల్లీ: గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనను వేగవంతం చేసే దిశగా చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ప్రశంసించతగ్గ స్థాయిలో వృద్ధి సాధించగలిగిందన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ వచ్చే నెల ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనితో ఆరు పూర్తి స్థాయి బడ్జెట్లను, వరుసగా ఏడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆమెకు దక్కనుంది. -
వికసిత భారత్ దిశగా సంస్కరణలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా తదుపరి సంస్కరణలను అమలు చేయగలదని కార్పొరేట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పలువురు కార్పొరేట్ దిగ్గజాలు ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత పురోగతి వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీజీకి శుభాకాంక్షలు. మీ దార్శనిక సారథ్యంలో భారత్ అనేక మైలురాళ్లను అధిగమించింది. ఇకపైనా దేశం వృద్ధి బాటలో ముందుకు దూసుకెడుతుందని విశ్వసిస్తున్నాం.– అనిల్ అగర్వాల్, చైర్మన్, వేదాంత గ్రూప్దేశాభివృద్ధి కొనసాగుతుంది నెహ్రూజీ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన మోదీజీకి శుభాకాంక్షలు. కొత్త కేబినెట్ ఏర్పాటుతో దేశ అభివృద్ధి, పురోగతి కొనసాగగలదని ఆశిస్తున్నాను.– సజ్జన్ జిందాల్, సీఎండీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్కీలక సమయం భారతదేశ అభివృద్ధి, శ్రేయస్సుకు ఈ విడత మరింత కీలకం కాగలదని ఆశిస్తున్నాను. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్లక్ష్యానికి పటిష్ట పునాదులు ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడమనేది సంస్కరణల ఎజెండా కొనసాగింపునకు దోహదపడగలదు. ఆర్థిక, సామాజికాభివృద్ధికి తోడ్పడుతూ, వికసిత భారత్ లక్ష్యానికి గట్టి పునాదులు వేసే పురోగామి విధానాలు, చర్యలను కొత్త ప్రభుత్వం తీసుకోగలదని ఆశిస్తున్నాము. – అనీష్ షా, ప్రెసిడెంట్, ఫిక్కీసంస్కరణల అమలు లక్ష్యం అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ను పటిష్టపర్చేందుకు మోదీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం తదుపరి విడత సంస్కరణలు అమలు చేయగలదని ఆశిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్, సీఐఐఎకానమీ మరింత స్పీడ్ కీలక దేశాలకు మించి అత్యధిక వృద్ధి రేటును కొనసాగిస్తూ, దేశ నాయకత్వం భారత్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదని కార్పొరేట్లు విశ్వసిస్తున్నారు.– దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
సంకీర్ణ ప్రభుత్వం.. తగ్గనున్న సంస్కరణల వేగం..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుండటం వంటి పరిణామాలు భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా సంస్కరణల వేగం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల భూ, కారి్మక సంస్కరణలకు కళ్లెం పడవచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని ఆందోళన వ్యక్తపర్చాయి. 2014 తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మెజారిటీని కోల్పోవడానికి సంబంధించిన ప్రభావాలపై ఫిచ్ రేటింగ్స్, మూడీస్ రేటింగ్స్ వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి.ఆర్థిక క్రమశిక్షణకు బ్రేక్.. పటిష్టమైన ఆర్థిక వృద్ధి సాధించే దిశగా మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచడం, దేశీయంగా తయారీ రంగానికి తోడ్పాటునివ్వడం వంటి పాలసీపరమైన విధానాలు ఇకపైనా కొనసాగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. అయితే, బీజేపీకి మెజారిటీ తగ్గడం వల్ల కీలకమైన ఆర్థిక, ద్రవ్యపరమైన సంస్కరణల అమల్లో జాప్యం జరగొచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని పేర్కొంది. 2025–26లో జీ20 కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక వృద్ధి సాధించగలదని భావిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు రిసు్కలు ఉన్నాయని తెలిపింది. ‘వివిధ రంగాల్లో నిరుద్యోగ యువత సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత వృద్ధి బలహీనంగా ఉండటం వంటి అంశాలు ప్రతికూల ప్రభావాలు చూపడాన్ని కొనసాగించవ చ్చు’అని మూడీస్ వివరించింది. ఇక ద్రవ్యలోటు విషయానికొస్తే 2024–25లో నిర్దేశించుకున్న విధంగా దీన్ని 5 శాతానికి తగ్గించుకోగలిగితే, 2025– 26లో 4.5% స్థాయిని సాధించవచ్చని పేర్కొంది. కాగా, ద్రవ్య, రుణపరమైన కొలమానాల విషయంలో ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్‌తో పోలిస్తే భారత్ బలహీనంగానే ఉన్నట్లు పేర్కొంది.ల్యాండ్, లేబర్ సంస్కరణల అమలు కష్టమే‘బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రధానిగా మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టినప్పటికీ మెజారిటీ తగ్గిపోవడమనేది, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న సంస్కరణల అజెండాకు సవాలుగా పరిణమించవచ్చు’ అని ఫిచ్ పేర్కొంది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల ‘వివాదాస్పద సంస్కరణలను, ముఖ్యంగా ల్యాండ్, లేబర్ సంస్కరణలను అమలు చేయడం కష్టంగా మారొచ్చు. దేశీ తయారీ రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు ఇవే తమకు అత్యంత ప్రాధాన్య అంశాలంటూ బీజేపీ ఇటీవలే పేర్కొంది’ అని ఫిచ్ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వం తమ జీవనోపాధిని మెరుగుపర్చాలని సూచించేలా ప్రజలు తీర్పునిచి్చన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాదాన్ని పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఫిచ్ గ్రూప్‌లో భాగమైన బీఎంఐ పేర్కొంది. అయితే, మధ్యకాలికంగా చూస్తే భారత్‌పై సానుకూల అంచనాలు పటిష్టంగానే ఉన్నాయని, ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని బీఎంఐ ఏషియా హెడ్ (కంట్రీ రిస్క్) డారెన్ టే తెలిపారు. బీజేపీ ఎక్కడెక్కడైతే హిందుత్వ జాతీయవాదంపై గట్టిగా ప్రచారం చేసిందో ఆయా రాష్ట్రాలన్నీ దానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
భారత్ అవుట్‌లుక్.. పాజిటివ్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు భరోసా ఇస్తూ పది సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ భారతదేశ సార్వ¿ౌమ (సావరిన్) రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు మెరుగుపరిచింది. గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ వ్యయ నిర్వహణ బాగుందని, ద్రవ్య విధానాల్లో సంస్కరణలు విస్తృత స్థాయిలో కొనసాగుతాయని భావిస్తున్నామని ఎస్అండ్పీ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంతా బాగుంటే రెండేళ్లలో సావరిన్ రేటింగ్‌నూ పెంచుతామని పేర్కొంది. కాగా, ఆరు బ్యాంకులు– ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియాన్ బ్యాంకులు సహా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్‌లకు సంబంధించీ ఇదే అవుట్‌లుక్ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. -
సంస్కరణలు కొనసాగుతాయ్
న్యూఢిల్లీ: బడ్జెట్ అంటే ఏదో ఖర్చుల పద్దుగా పరిమితం కాకుండా అందరికీ ప్రయోజనాలను సమానంగా అందించేందుకు ఉపయోగపడే బ్లూప్రింట్‌గా గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం మార్చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దే దిశగా సంస్కరణల అమలు ఇకపైనా వేగవంతంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ విధానాల్లో మోదీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసిందని మంత్రి వివరించారు. ఇలాంటి పారదర్శక బడ్జెట్లు ఉండే దేశాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ మొదలైనవి సానుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. తద్వారా దేశానికి అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో (గతంలో ట్విటర్) చెప్పారు. ట్యాక్స్‌పేయర్లు తమ కష్టార్జితం నుంచి కట్టే ప్రతి రూపాయిని సమర్ధవంతంగా ఉపయోగించేందుకు, ప్రజా ధనం విషయంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
యునెస్కోలో ‘మన బడి’పై చర్చ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ పాఠశాల మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా..తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు–నేడుపై చర్చ జరిగింది. ఈనెల 13న యునెస్కో ఆధ్వర్యంలో ప్యారిస్‌లోని ప్రధాన కార్యాలయంలో ‘గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరమ్’ సదస్సు ప్రారంభమైంది. 90కి పైగా దేశాల నుంచి 400 మంది విద్యా శాఖ ముఖ్య అధికారులు, స్పెషలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ ఏపీ ప్రతినిధిగా గురువారం పాల్గొని రాష్ట్రంలో అమలు చేస్తోన్న మనబడి నాడు–నేడుపై వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అసమానతలు లేని అన్ని సదుపాయాలతో సమగ్ర విద్య అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఏపీ విద్యా సంస్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పేదింటి పిల్లలు చదువుకునే బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, విభిన్న భాషలు మాతృభాషగా ఉన్న విద్యార్థులు కూడా సులభంగా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు, విద్యార్థులకు ట్యాబ్స్ వంటి అంశాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకున్నాయని షకిన్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. సమగ్ర విద్య మూలస్తంభాల్లో ‘మనబడి నాడు–నేడు’తో వచ్చిన మార్పు ఒకటి అని యునెస్కో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ వివిఎన్ గైరిస్, ఎడ్యుకేషన్ ఫర్ ఇంక్లూజన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ చీఫ్ జస్టీన్ సాస్ అభివర్ణించినట్లు షకిన్ తెలిపారు. -
2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతంగా క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే 2031 నాటికి దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయికి రెట్టింపై దాదాపు 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని.. తద్వారా ఎగువ మధ్య–ఆదాయ దేశంగా మారుతుందని క్రిసిల్ ఇండియా అవుట్‌లుక్ నివేదిక పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణలు తదితర సానుకూల ఆర్థిక నిర్ణయాల వల్ల దేశ ఎకానమీ 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపింది. రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2024–25 నుంచి 2030–31) భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఈ కాలంలో ఎకానమీ సగటును 6.7 శాతం పురోగమిస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఐదవ స్థానంలో.. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎనానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు. 4,500 డాలర్లకు తలసరి ఆదాయం.. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరుగుతుంది. దీనితో దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకా రం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డా లర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పే ర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. తయారీ, సేవల రంగాల్లో మంచి అవకాశాలు... దేశీయ, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా తయారీ– సేవల రంగాలు రెండింటికీ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 2025–2031 ఆర్థిక సంవత్సరాల మధ్య తయారీ– సేవల రంగాలు వరుసగా 9.1 శాతం, 6.9 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని మేము అంచనా వేస్తున్నాము. తయారీ రంగం ద్వారా కొంత పెరుగుదల ఉన్నప్పటికీ, సేవా రంగం భారతదేశ వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తుంది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ -
G20 Summit: తీర్మానాలపై ఎన్నో ఆశలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో విస్తృత చర్చల తర్వాత దేశాధినేతలు ప్రపంచ శ్రేయస్సు కోసం ఎలాంటి తీర్మానాలు చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జులైలో జీ20 దేశాల పర్యావరణశాఖ మంత్రుల సదస్సులో శిలాజ ఇంథనాల వినియోగాన్ని దశాలవారీగా తగ్గించడంపై చర్చలో ఏకాభిప్రాయం కుదరనే లేదు. పునరుత్పాదక ఇంథన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికల్లా 11 టెరావాట్లకు తేవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి అంశాల్లోనూ ఉమ్మడి నిర్ణయం తీసుకోలేకపోయాయి. శిలాజ ఇంధనాలకు బదులు మరో ఇంధన వనరులకు మారడం, బహుళ అభివృద్ధి బ్యాంకు(ఎండీబీ)లో సంస్కరణలు వంటి అంశాల్లో కనీస ఉమ్మడి నిర్ణయాలైనా దేశాధినేతలు తీసుకుంటారేమోనని పలు రంగాల వర్గాలు ఆశగా చూస్తున్నాయి. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు చేకూర్చేలా తక్కువ వడ్డీకి రుణాలు అందేలా ఎండీబీలో సంస్కరణలు తేవాలన్న చర్చ జీ20 శిఖరాగ్ర సదస్సు స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. సంస్కరణలు వాస్తవరూపం దాల్చితే ఎంతో మేలు’ అని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ సంస్థలో గ్లోబల్ పాలసీ విభాగం నేత ఇంద్రజిత్ బోస్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ఇక్కడో సమస్య ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము అందుకున్న నిధులను పర్యావరణ మార్పులు తదితరాలను ఎదుర్కొనేందుకు ఖర్చుచేస్తాయి. గ్రాంట్స్‌గా కాకుండా రుణాలు, పెట్టుబడుల రూపంలో ఈ నిధుల్ని అందుకుంటాయి. వీటిని తిరిగి చెల్లించాలి. కానీ ఆ దేశాలకు ఆ స్తోమత ఉండదు. దీంతో ఈ దేశాలను ఆదుకునేందుకు సంపన్న దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. 2011–20కాలంలో ఇలాంటి దేశాలకు కేవలం 5 శాతం నిధులే దక్కాయి. ఈ నేపథ్యంలో గత వాగ్దానాలు, తీర్మానాలకు కట్టుబడేలా ఈసారైనా జీ20 దేశాలు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటాయో లేదో చూడాలి. -
Brics Summit 2023: ప్రపంచానికి ‘గ్రోత్ ఇంజిన్’ భారత్
జోహన్నెస్‌బర్గ్: రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌లో సంస్కరణలను మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్యంలో వేగం పుంజుకుందని చెప్పారు. మంగళవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్ త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లో ఉందన్నారు. 100కుపైగా యూనికార్న్ కంపెనీలు పని చేస్తున్నాయని వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి అనువైన రంగాలను గుర్తించడంలో 15వ బ్రిక్స్ సదస్సు సఫలమవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన దక్షిణాఫ్రికా చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చువల్‌గా పాల్గొననున్నారు. -
CM Jagan: పేదవిద్యార్థులకు ఇక ప్రపంచస్థాయి కోర్సులు
సాక్షి, గుంటూరు: విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు.. అదీ అత్యుత్తమ యూనివర్సిటీల సర్టిఫికెట్ కోర్సులు ఉచితంగా అందించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్(edX)తో ఎంవోయూ కుదర్చుకుంది. ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కంపెనీ (MOOC) ఎడెక్స్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎడెక్స్ సీఈవో, ‘పద్మశ్రీ’ అనంత్ అగర్వాల్ ఈ ఒప్పందంపై స్వయంగా సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా.. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లను విద్యార్థులకు అందిస్తారు. ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్ సంయుక్త సర్టిఫికేషన్ విద్యార్థులకు లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు… ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలి అని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ అధికారం చేపట్టాక పేద విద్యార్థులకు సంక్షేమ పథకాల ద్వారా అండగా, ఆసరాగా నిలవడంతో పాటు.. విద్యారంగానికి సంబంధించిన ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఏపీ విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆయన ధృడ సంకల్పం.. ఇవాళ ఈ ఒప్పందంతో మరో అడుగు ముందుకు వేసినట్లయ్యింది. -
ఇక న్యాయ, పాలనా సంస్కరణలపై కేంద్రం దృష్టి
కోల్‌కతా: ప్రభుత్వం తదుపరి సంస్కరణల ఎజెండాలో దేశంలోని పరిపాలనా, న్యాయ రంగాలేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు.ఇక్కడ భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (బీసీసీ)లో సన్యాల్ మాట్లాడుతూ, 2014లో కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ‘‘2014 నుండి సంస్కరణల కొత్త పథం అమలులోకి వచ్చింది. గత దశాబ్దంలో, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు జరిగాయి. దివాలా కోడ్ (ఐబీసీ), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి కీలక వ్యవస్థలు అమల్లోకి వచ్చాయి. ద్రవ్యోల్బణ లక్ష్యం నిర్దేశ విధానం ప్రారంభమైంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడు రెండు ప్రధాన సంస్కరణలు.. పరిపాలనా– న్యాయపరమైన సంస్కరణలు అవశ్యం. దీనికి విస్తృత ప్రజా మద్దతు అవసరం’’ అని ఆయన అన్నారు. 7 శాతం వరకూ వృద్ధి స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సన్యాల్ విశ్లేíÙంచారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరత్వం ఉన్నాయని, కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) తగిన స్థాయిలో ఉందని, 13 నెలలకు సరిపడా విదేశీ మారక నిల్వలు (600 బిలియన్ డాలర్లు) ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్దీపనలతో దేశంలో డిమాండ్ పరిస్థితులను పెంచాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని కూడా ఆయన ఉద్ఘాటించారు. ఇలాంటి విధానాలతో దిగుమతులు పెరిగితే అది క్యాడ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. కోవిడ్ సంవత్సరాల్లో తీవ్ర ప్రభావానికి గురయిన సరఫరాల వ్యవస్థను పటిష్టంగా ఉంచాల్సిన అవసరం మాత్రం తక్షణం ఉందని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణంపై అప్పుడప్పుడు కూరగాయల ధరలు పెరుగుతున్న ప్రభావం మినహా అంతర్లీన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అంత బలంగా లేవని భరోసాను ఇచ్చారు. మౌలిక రంగం ఊతం మౌలిక రంగంలో గత పెట్టుబడులు ఇప్పుడు మనకు ప్రయోజనం సమకూర్చుతున్నట్లు సన్యాల్ తెలిపారు. ప్రపంచాన్ని నిరుత్సాహపరిచే పలు ఆర్థిక పరిస్థితలు నేపథ్యంలో భారత్ 6.5 శాతం వృద్ధి సాధించడం మామూలు విషయం కాదని కూడా స్పష్టం చేశారు. ఉద్దీపనల వంటి చర్యలతో వృద్ధి వేగాన్ని భారీగా పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం లేదని ఆయన పేర్కొంటూ, ‘‘స్పష్టమైన రహదారి ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం. ఇప్పుడు ఈ బాటలో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయి’’ అని విశ్లేíÙంచారు. స్థూల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ఇప్పుడు కీలకమని పేర్కొన్న ఆయన ఈ విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరత, సరఫరాల వ్యవస్థలో లోపాలు లేకుండా చేయడం ముఖ్యమన్నారు. జర్మనీ, జపాన్ సరేకానీ... అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఐదవ స్థానంలో నిలిచిన భారత్ ఎకానమీ మన ముందు ఉన్న దేశాలను అధిరోహిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదని అన్నారు. అయితే తొలి రెండు దేశాలు మాత్రం మనకంటే ఎంతో ముందు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు. రూపాయిని అంతర్జాతీయం చేసి, వాణిజ్య మారి్పడిలో కీలక మారకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సన్యాల్ అన్నారు. ‘‘అమెరికా డాలర్ విషయంలో ఈ విధానం ఎంతమాత్రం జోక్యం చేసుకోదు. రూపాయిని భవిష్యత్తులో యాంకర్ కరెన్సీగా ఉండాలన్నదే దేశ విధానం’’ అని ఆయన చెప్పారు. చివరిగా 2011లో జరిగిన జనాభా లెక్క జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తదుపరి జనాభా గణన చేయాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా సన్యాల్ పేర్కొన్నారు. -
సంస్కరణల స్వీయహననం!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్‌కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది. రాబోయే రోజుల్లో మరో ఓటింగ్‌లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది. ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్‌ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు. కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట. నిజానికి, ఇజ్రాయెల్‌లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్‌కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం. ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే! మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు. ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్‌కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది. న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే. దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్‌కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది. -
సంస్కరణల మద్దతుతో దూసుకుపోతున్న భారత్
న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణల ఫలాలతో 2014 నాటికి అంతర్జాతీయంగా 10వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ తెలిపింది. జీఎస్టీ, మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడాన్ని ప్రస్తావించింది. ఈ మేరకు భారత్ ఆర్థిక వ్యవస్థపై బెర్న్‌స్టీన్ ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో దశాబ్దం అంటూ టైటిల్ పెట్టింది. ద్రవ్యోల్బణం కట్టడి, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, డిజిటైజేషన్, కరోనా సమయంలో తీసుకున్న వివేకవంతమైన చర్యలు, చమురు ధరలు నియంత్రణలో ఉండడం సానుకూలించినట్టు పేర్కొంది. ‘‘కొందరికి అదృష్టం రాత్రికి రాత్రే వరిస్తుంది. కానీ, చాలా మందికి ఎన్నో ఏళ్ల కృషితోనే ఇది సాధ్యపడుతుంది. భారత్ స్టోరీ ఇలాంటిదే. బలమైన పునాది నిర్మాణానికి దశాబ్దానికి పైనే సమయం పట్టినప్పటికీ మరింత నమ్మకమైనదిగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించింది’’ అని ప్రశంసించింది. కొన్ని విభాగాల్లో గొప్ప ఫలితాలు మోదీ నాయకత్వంలో భారత్ కొన్ని విభాగాల్లో అద్భుతమైన పురోగతి సాధించినట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. డిజిటైజేషన్, ఆర్థిక వ్యవస్థను సంఘటితంగా మార్చడం, తయారీ రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు మెరుగైన విధాన వాతావరణం, మౌలిక రంగంపై వ్యయాలను పెంచడాన్ని ప్రస్తావించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఆర్థిక వృద్ధి స్తబ్దుగా ఉన్నప్పటికీ, బలమైన పునాదులు పడ్డాయని, నూతన సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలపడినట్టు వివరించింది. సానుకూల వృద్ధి చక్రానికి అవసరమైన పునాదులు పడినట్టు చెబుతూ, ఇక్కడి నుంచి దిగువవైపు రిస్క్ లు చాలా పరిమితమని అభిప్రాయపడింది. 5.7 శాతం చొప్పున ‘‘భారత్ జీడీపీ 2014 నుంచి 5.7 శాతం వార్షిక కాంపౌండెడ్ వృద్ధిని చూసింది. కోవిడ్ కాలాన్ని మినహాయించి చూస్తే వృద్ధి 6.7 శాతంగా ఉంటుంది. యూపీఏ హయాంలో ఉన్న 7.6 శాతానికంటే కొంచెం తక్కువ. కాకపోతే అప్పట్లో బేస్ కనిష్టంగా ఉండడం వల్ల అంత వృద్ధి సాధ్యపడింది’’అని బెర్న్‌స్టీన్ తెలిపింది. తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన సంస్థలు, బలహీన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా మోదీ సర్కారుకు వచ్చినట్టు గుర్తు చేసింది. మోదీ హయాంలో భారత్ పదో స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగా, తలసరి ఆదాయం విషయంలో 147వ ర్యాంకు నుంచి 127వ ర్యాంకుకు మెరుగుపడినట్టు ఈ నివేదిక తెలిపింది. వ్యాపార నిర్వహణ మరింత సులభతరంగా మారినట్టు పేర్కొంది. అంతకుముందు సర్కారు కాలంలో చేసిన తప్పులను సరిచేస్తూ, భారత్ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయడం మంచి ఫలితాలనిచ్చినట్టు విశ్లేషించిది. డిజిటైజేషన్, అందరికీ ఆర్థిక సేవల విషయంలో భారత్ మంచి పురోగతి సాధించినట్టు తెలిపింది. బ్యాంక్ ఖాతాలు కలిగిన వ్యక్తులు 2011 నాటికి 35 శాతంగా ఉంటే, 2021 నాటికి 77 శాతానికి పెరిగారని, జన్‌ధన్ ఖాతాలే 50 కోట్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘పలు పథకాల సబ్సిడీలకు ఆధార్‌ను వినియోగించడం ద్వారా మధ్యవర్తులు, జాప్యాన్ని సర్కారు నివారించింది. యూపీఐ ఎంతో ప్రగతి సాధించింది. ఓఎన్డీసీ ఏర్పాటుకు కావాల్సిన నమ్మకాన్ని కలిగించింది’’అని నివేదిక వెల్లడించింది. వీటిల్లో మెరుగుపడాలి భారత్ కొన్ని అంశాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందని బెర్న్‌స్టీన్ నివేదిక అభిప్రాయపడింది. మానవాభివృద్ధి సూచీలో 2016 నుంచి క్షీణిస్తున్నట్టు పేర్కొంది. కరోనా కాలంలో పాఠశాల సమయం తగ్గిపోవడాన్ని ప్రస్తావించింది. మహిళా అక్షరాస్యత విషయంలో పెద్దగా మార్పు లేదని, అవినీతి నిర్మూలనలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది. లింగనిష్పత్తి సెకండరీ స్కూల్ స్థాయిలో క్షీణించినట్టు తెలిపింది. -
సంస్కరణల మద్దతుతో దూసుకుపోతున్న భారత్
న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణల ఫలాలతో 2014 నాటికి అంతర్జాతీయంగా 10వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ తెలిపింది. జీఎస్టీ, మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడాన్ని ప్రస్తావించింది. ఈ మేరకు భారత్ ఆర్థిక వ్యవస్థపై బెర్న్‌స్టీన్ ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో దశాబ్దం అంటూ టైటిల్ పెట్టింది. ద్రవ్యోల్బణం కట్టడి, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, డిజిటైజేషన్, కరోనా సమయంలో తీసుకున్న వివేకవంతమైన చర్యలు, చమురు ధరలు నియంత్రణలో ఉండడం సానుకూలించినట్టు పేర్కొంది. ‘‘కొందరికి అదృష్టం రాత్రికి రాత్రే వరిస్తుంది. కానీ, చాలా మందికి ఎన్నో ఏళ్ల కృషితోనే ఇది సాధ్యపడుతుంది. భారత్ స్టోరీ ఇలాంటిదే. బలమైన పునాది నిర్మాణానికి దశాబ్దానికి పైనే సమయం పట్టినప్పటికీ మరింత నమ్మకమైనదిగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించింది’’ అని ప్రశంసించింది. కొన్ని విభాగాల్లో గొప్ప ఫలితాలు మోదీ నాయకత్వంలో భారత్ కొన్ని విభాగాల్లో అద్భుతమైన పురోగతి సాధించినట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. డిజిటైజేషన్, ఆర్థిక వ్యవస్థను సంఘటితంగా మార్చడం, తయారీ రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు మెరుగైన విధాన వాతావరణం, మౌలిక రంగంపై వ్యయాలను పెంచడాన్ని ప్రస్తావించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఆర్థిక వృద్ధి స్తబ్దుగా ఉన్నప్పటికీ, బలమైన పునాదులు పడ్డాయని, నూతన సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలపడినట్టు వివరించింది. సానుకూల వృద్ధి చక్రానికి అవసరమైన పునాదులు పడినట్టు చెబుతూ, ఇక్కడి నుంచి దిగువవైపు రిస్‌్కలు చాలా పరిమితమని అభిప్రాయపడింది. 5.7 శాతం చొప్పున ‘‘భారత్ జీడీపీ 2014 నుంచి 5.7 శాతం వార్షిక కాంపౌండెడ్ వృద్ధిని చూసింది. కోవిడ్ కాలాన్ని మినహాయించి చూస్తే వృద్ధి 6.7 శాతంగా ఉంటుంది. యూపీఏ హయాంలో ఉన్న 7.6 శాతానికంటే కొంచెం తక్కువ. కాకపోతే అప్పట్లో బేస్ కనిష్టంగా ఉండడం వల్ల అంత వృద్ధి సాధ్యపడింది’’అని బెర్న్‌స్టీన్ తెలిపింది. తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన సంస్థలు, బలహీన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా మోదీ సర్కారుకు వచ్చినట్టు గుర్తు చేసింది. మోదీ హయాంలో భారత్ పదో స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగా, తలసరి ఆదాయం విషయంలో 147వ ర్యాంకు నుంచి 127వ ర్యాంకుకు మెరుగుపడినట్టు ఈ నివేదిక తెలిపింది. వ్యాపార నిర్వహణ మరింత సులభతరంగా మారినట్టు పేర్కొంది. అంతకుముందు సర్కారు కాలంలో చేసిన తప్పులను సరిచేస్తూ, భారత్ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయడం మంచి ఫలితాలనిచ్చినట్టు విశ్లేíÙంచింది. డిజిటైజేషన్, అందరికీ ఆర్థిక సేవల విషయంలో భారత్ మంచి పురోగతి సాధించినట్టు తెలిపింది. బ్యాంక్ ఖాతాలు కలిగిన వ్యక్తులు 2011 నాటికి 35 శాతంగా ఉంటే, 2021 నాటికి 77 శాతానికి పెరిగారని, జన్‌ధన్ ఖాతాలే 50 కోట్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘పలు పథకాల సబ్సిడీలకు ఆధార్‌ను వినియోగించడం ద్వారా మధ్యవర్తులు, జాప్యాన్ని సర్కారు నివారించింది. యూపీఐ ఎంతో ప్రగతి సాధించింది. ఓఎన్డీసీ ఏర్పాటుకు కావాల్సిన నమ్మకాన్ని కలిగించింది’’అని నివేదిక వెల్లడించింది. వీటిల్లో మెరుగుపడాలి భారత్ కొన్ని అంశాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందని బెర్న్‌స్టీన్ నివేదిక అభిప్రాయపడింది. మానవాభివృద్ధి సూచీలో 2016 నుంచి క్షీణిస్తున్నట్టు పేర్కొంది. కరోనా కాలంలో పాఠశాల సమయం తగ్గిపోవడాన్ని ప్రస్తావించింది. మహిళా అక్షరాస్యత విషయంలో పెద్దగా మార్పు లేదని, అవినీతి నిర్మూలనలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది. లింగనిష్పత్తి సెకండరీ స్కూల్ స్థాయిలో క్షీణించినట్టు తెలిపింది. -
తొమ్మిదేళ్లలో మూడింతలు
న్యూఢిల్లీ: కేంద్రం అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) లాభాలు గత తొమ్మిదేళ్లలో మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడేలా భవిష్యత్‌లోనూ ఈ ధోరణిని పీఎస్‌బీలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,270 కోట్లుగా ఉన్న పీఎస్‌బీల లాభాలు 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 1.04 లక్షల కోట్లకు చేరాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఈ విజయాలను చూసి పొంగిపోతూ పీఎస్‌బీలు అలసత్వం వహించరాదని, అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను, నియంత్రణ సంస్థ నిబంధనలను, పటిష్టమైన అసెట్–లయబిలిటీ .. రిస్క్ మేనేజ్మెంట్ విధానాలను పాటిస్తూ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆమె సూచించారు. గతంలో ఇటు బ్యాంకులు అటు కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లూ ఒత్తిడిలో ఉండేవని .. ప్రస్తుతం అటువంటి పరిస్థితి నుంచి బైటపడ్డాయని మంత్రి చెప్పారు. బ్యాంకుల అసెట్లపై రాబడులు, నికర వడ్డీ మార్జిన్లు, ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి మొదలైనవన్నీ మెరుగుపడ్డాయన్నారు. రుణాల వినియోగం జాతీయ సగటుకన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలపై, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై, బ్యాంకులు ప్రధానంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. అలాగే, ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రచార కార్యక్రమాల ద్వారా మహిళా సమ్మాన్ బచత్ పత్రాలకు ప్రాచుర్యం కలి్పంచాలని చెప్పారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాల కోసం ఉద్దేశించిన నిధులను గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి బదలాయించడం కాకుండా, ఆయా లక్ష్యాల సాధన కోసం పూర్తి స్థాయిలో వినియోగించడంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
G7 Summit: ఐరాసను సంస్కరించాల్సిందే
హిరోషిమా: ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను నేటి వాస్తవాలకు అద్దం పట్టేలా, అవసరాలను తీర్చేలా తక్షణం సంస్కరించుకోవాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. లేదంటే ఐరాస, భద్రతా మండలి వంటివి కేవలం నామమాత్రపు చర్చా వేదికలుగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం జపాన్‌లోని హిరోషిమాలో జీ–7 సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ శాంతే ప్రధాన లక్ష్యంగా స్థాపించుకున్న ఐరాస యుద్ధాలు, సంక్షోభాలను ఎందుకు నివారించలేకపోతోంది? శాంతి గురించి పలు ఇతర వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు తలెత్తుతోంది? ఉగ్రవాదపు నిర్వచనాన్ని కూడా ఐరాస ఎందుకు అంగీకరించడం లేదు? ఆలోచిస్తే తేలేదొక్కటే. ఐరాస ప్రస్తుత ప్రపంచపు వాస్తవాలకు అనుగుణంగా లేదు. గత శతాబ్దానికి చెందిన ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇవన్నీ చాలా సీరియస్‌గా దృష్టి సారించాల్సిన విషయాలు’’ అని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం మానవతకు సంబంధించిన సంక్షోభమని మోదీ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని రష్యా, చైనాలను ఉనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ఏకపక్ష ప్రయత్నాలపై దేశాలన్నీ ఉమ్మడిగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం, లద్దాఖ్ దురాక్రమణకు కొన్నేళ్లుగా చైనా చేస్తున్న యత్నాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు భారత్ సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనికి చర్చలు, రాయబారమే ఏకైక పరిష్కారమని తాము ముందునుంచీ చెబుతున్నామని గుర్తు చేశారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ బుద్ధుని బోధల్లో చక్కని పరిష్కారాలున్నాయన్నారు. హిరోషిమా పార్కులోని స్మారక మ్యూజియాన్ని దేశాధినేతలతో కలిసి మోదీ సందర్శించారు. అణుబాంబు దాడి మృతులకు నివాళులర్పించారు. మీకు మహా డిమాండ్! మోదీతో బైడెన్, ఆల్బనీస్ వ్యాఖ్యలు మీ ఆటోగ్రాఫ్ అడగాలేమో: బైడెన్ జీ–7 సదస్సులో భాగంగా జరిగిన క్వాడ్ దేశాధినేతల భేటీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చి మరీ ఆత్మీయంగా ఆలింగనంచేసుకుని ముచ్చటించడం తెలిసిందే. మోదీ విషయమై తమకెదురవుతున్న గమ్మత్తైన ఇబ్బందిని ఈ సందర్భంగా బైడెన్ ఆయన దృష్టికి తెచ్చారట. వచ్చే నెల మోదీ వాషింగ్టన్లో పర్యటించనుండటం తెలిసిందే. ఆ సందర్భంగా మోదీ పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఎలాగైనా ఆయనతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా అమెరికా ప్రముఖుల నుంచి లెక్కలేనన్ని ‘రిక్వెస్టులు’ వచ్చిపడుతున్నాయట! వాటిని తట్టుకోవడం తమవల్ల కావడం లేదని బైడెన్ చెప్పుకొచ్చారు. భేటీలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా తామూ అచ్చం అలాంటి ‘సమస్యే’ ఎదుర్కొంటున్నామంటూ వాపో యారు! మోదీ మంగళవారం ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో 20 వేల మంది సామర్థ్యమున్న స్టేడియంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దానికి టికెట్లు కావాలని లెక్కకు మించిన డిమాండ్లు, రిక్వెస్టులు వచ్చి పడుతున్నాయని ఆల్బనీస్ చెప్పుకొచ్చారు. ఇటీవలి భారత్ పర్యటన సందర్భంగా గుజరాత్లో 90 వేల మంది సామర్థ్యంతో కిక్కిరిసిన స్టేడియంలో తామిద్దరం ఎలా ప్రజలకు అభివాదం చేసిందీ గుర్తు చేసుకున్నారు. దాంతో బైడెన్ స్పందిస్తూ బహుశా తాను మోదీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలేమో అంటూ చమత్కరించారు! గత మార్చిలో భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ను మోదీ, ఆల్బనీస్ ప్రారంభించడం తెలిసిందే. -
యూనియన్ బ్యాంక్ నంబర్ వన్!
హైదరాబాద్: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రకటించిన ఈజ్ రీఫార్మ్స్ ఇండెక్స్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ర్యాంక్ దక్కించుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు నిర్దేశించిన సంస్కరణల అమలులో అన్ని బ్యాంకుల్లోకి యూనియన్ బ్యాంక్ ముందుంది. అనలైటిక్స్ సామర్థ్యాలు, కస్టమర్లతో సంబంధాలు బలోపేతం, సమర్థవంతంగా రుణాల పర్యవేక్షణ, సమగ్రమైన డిజిటల్ వసూళ్ల నిర్వహణ విధానం, మోసాలు, సైబర్ దాడుల నుంచి తగిన రక్షణ చర్యలు, బ్యాంకింగ్ సేవలను అందించే విషయంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తదితర విభాగాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి పనితీరు చూపించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి అని బ్యాంక్ ప్రకటించింది. -
భారత్ వృద్ధికి సంస్కరణల ఊతం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికే అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను మరింత వేగవంతంగా అమలు చేయడం వల్ల దేశ వృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రతికూలతకు దారితీసిందని బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులు ఎకానమీ పురోగతికి సంబంధించి ప్రపంచం ఒక ‘దశాబ్దాన్ని’ కోల్పోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయని హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. 2000–2010 మధ్య ప్రపంచ స్థూల వృద్ధి రేటు దాదాపు 6.5 శాతం ఉంటే, 2020–30 మధ్య కాలానికి ఈ రేటు 2.2 శాతానికి పడిపోవచ్చని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, ఎకానమీ క్షీణత 2000– 2010 మధ్య సంవత్సరానికి సగటున 6 శాతం ఉంటే, ఈ దశాబ్దంలో మిగిలిన కాలంలో సంవత్సరానికి 4 శాతానికి పడిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం– మాంద్యం పరిస్థితులు తలెత్తితే ఈ పతనం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ‘దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు తిరోగమనం–పోకడలు, అంచనాలు–విధానాల’ పేరుతో విడుదలైన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు. ► భారత్ తోటి దేశాల కంటే వేగవంతమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ, సంస్కరణ ఎజెండాను ముఖ్యంగా తయారీ, మౌలిక రంగంలో వేగవంతంగా అమలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో ఒత్తిడులను తొలగించాల్సి ఉంది. ఈ విభాగంలో సవాళ్లు దేశ పురోగతికి బ్రేకులు వేస్తున్నాయి. ► 2000–10లో భారత్ పెట్టుబడుల సగటు వార్షిక వృద్ధి 10.5 శాతం అయితే, 2011–21లో ఈ రేటు 5.7 శాతానికి పడిపోయింది. ► విద్యుత్, రోడ్డు, రైలు నెట్వర్క్, వ్యాపారాలకు ఎదురవుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల వంటి బలహీనతలు వంటి అంశాలు భారత్ ఎకానమీకి అవరోధాలుగా ఉన్నాయి. ► కోవిడ్–19తో ఎదురవుతున్న పరిణామాలు ప్రపంచ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ► భౌగోళిక ఉద్రిక్తతలూ ప్రపంచ వృద్ధి తిరోగమనానికి దారితీస్తున్నాయి. ► పెట్టుబడుల్లో వృద్ధి క్షీణిస్తోంది. ప్రపంచ శ్రామిక శక్తి మందకొడిగా పెరుగుతోంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల మానవ వనరుల నైపుణ్య కొరత ఎదురవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో వృద్ధి.. జీడీపీ పురోగతికి తగిన విధంగా సరిపోవడం లేదు. -
ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! : నెతాన్యాహు
నిరసనలు, ఆందోళనలు సమ్మెలతో ఇజ్రాయెల్ అట్టుడుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పట్ల ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం మరింత ఆజ్యం పోసేలా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బైడెన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు నెతాన్యాహు బైడెన్ వ్యాఖ్యలకు బదులిస్తూ..ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశం. విదేశాల నుంచి వచ్చే ఒత్తిళ్లపై ఆధారపడి ఇజ్రాయెల్ నిర్ణయాలు తీసుకోదని సూటిగా కౌంటరిచ్చారు. తన ప్రజల ఇష్టానుసారమే ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంటుందని కరాఖండీగా చెప్పారు. కాగా బైడెన్ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయపరమైన సంస్కరణలు రాజకీయ సంక్షోభానికి దారితీసింది కాబట్టి నెతాన్యాహుల వాటిని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు. (చదవండి: డోక్లామ్‌పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు! టెన్షన్లో భారత్) -
సంస్కరణలు నెలపాటు వాయిదా
జెరూసలేం: ప్రజాగ్రహానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తలొగ్గారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ప్రణాళికను నెల పాటు వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్‌ను చీల్చడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వొద్దు. ఆందోళనలు విరమించండి. హింసకు దూరంగా ఉండండి’’ అని ప్రజలకు సూచించారు. పార్లమెంట్ వేసవి సమావేశాలు ఏప్రిల్ 30న పునఃప్రారంభం కానున్నాయి. సంస్కరణలపై బిల్లును వాటిలో ప్రవేశపెట్టాలని నెతన్యాహూ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సంస్కరణలను శాశ్వతంగా పక్కన పెట్టాలని నిరసనకారులు తేల్చిచెప్పారు. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సోమవారం వేలాదిగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. సంస్కరణలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలన్నదే నెతన్యాహూ ఉద్దేశమని తెలుస్తోంది. -
ఫ్రాన్స్‌లో ప్రత్యేక అధికారాలతో పెన్షన్ బిల్లుకు ఆమోదం
పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోంది. దేశ పార్లమెంటులో ఓటింగ్ జరగకుండానే బిల్లు చట్టరూపం దాల్చేలా ప్రత్యేకమైన రాజ్యాంగ అధికారాన్ని పొందేలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్యలు తీసుకున్నారు. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ తీసుకుని వచ్చిన ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీలోని దిగువ సభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అందుకే ఓటింగ్‌కి కొన్ని నిమిషాల ముందు ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ చట్టసభలు ఆమోదించకుండానే బిల్లు చట్టంగా మారేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 49:3ని వినియోగించుకున్నారు. ఈ కొత్త పెన్షన్ బిల్లుపై గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. -
సంస్కరణలకు గుర్తింపు
న్యూఢిల్లీ: జీఎస్ఎం అసోసియేషన్ (జీఎస్ఎంఏ) భారత్‌కు ‘గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్ 2023’ ఇవ్వడం అన్నది దేశం చేపట్టిన టెలికం సంస్కరణలు, విధానాలకు గుర్తింపు అని టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ అన్నారు. అంతర్జాతీయంగా 750 మొబైల్ ఆపరేటర్లు, 400 కంపెనీలతో కూడినదే జీఎస్ఎంఏ. ఏటా ఒక దేశానికి ఈ అసోసియేషన్ అవార్డ్ ప్రకటిస్తుంటుంది. 2023 సంవత్సరానికి గాను జీఎస్ఎంఏ గవర్నమెంట్ లీడర్షిప్ అవార్డ్‌ను భారత్ గెలుచుకుంది. ఫిబ్రవరి 27న బార్సెలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో భారత్‌ను విజేతగా జీఎస్ఎంఏ ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన సంస్కరణలకు అంతర్జాతీయ గుర్తింపుగా పేర్కొన్నారు. సంస్కరణల ఫలితాలను మనం చూస్తున్నట్టు చెప్పారు. భారత టెలికం ఉదయిస్తున్న రంగమని, ప్రపంచం ఈ వృద్ధిని గమనించినట్టు తెలిపారు. ‘‘రైట్ ఆఫ్ వే అనుమతికి గతంలో 230 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం ఎనిమిది రోజుల్లోనే వచ్చేస్తోంది. 85 శాతానికి పైగా టవర్ అనుమతులు తక్షణమే లభిస్తున్నాయి’’అని మంత్రి వివరించారు. 387 జిల్లాల్లో లక్ష సైట్లతో, 5జీ విస్తరణ వేగవంతంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. తయారీ, ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పనపై భారత్ ప్రగతిని వివరించారు. 200 పట్టణాలకు మార్చి నాటికి 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. లక్ష్యానికంటే ముందే దాన్ని చేరుకున్నట్టు ప్రకటించారు. -
ఇంధన రంగంలో అపార అవకాశాలు
సాక్షి, బెంగళూరు: దేశంలో ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని, విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంధన రంగానిది కీలక పాత్ర అన్నారు. చమురు శుద్ధి సామర్థ్యంలో నాలుగో స్థానం భారత్‌లో సుస్థిర ప్రభుత్వం, నిరంతర సంస్కరణలు, సామాజిక, ఆర్థిక సాధికారత పలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు తోడ్పడ్డాయని మోదీ ఉద్ఘాటించారు. ‘‘తొమ్మిదేళ్లలో ఇంటర్నెట్ అనుసంధానం మూడు రెట్లు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ 5 శాతం మేర పెరిగిందన్నారు. ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. 2030 నాటికి 4 ఎంఎంటీల మేర గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇందుకోసం రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. ఇక ఈ–20 ఇంధనం ఈ–20 ఫ్యూయల్ (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్)ను మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ–20ని తొలుత 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తారు. రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తారు. ఈ–20 ఇంధన వినియోగంతో ముడిచమురు దిగుమతుల భారం తగ్గనుంది. తుమకూరు జిల్లా గుబ్బీ తాలూకాలో హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ తయారీ ఫ్యాక్టరీని మోదీ ప్రారంభించారు. -
France: ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్.. ఎందుకీ వ్యతిరేకత?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పెన్షన్ సంస్కరణలు దేశ చరిత్రలో అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దారి తీశాయి. పదవీ విరమణ వయసుని 62 నుంచి 64కి పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెన్షన్ అందుకోవడానికి మరో రెండేళ్లు పని చేయాలా అంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. కార్యాలయాలు మూతబడ్డాయి. ఈఫిల్ టవర్‌ను మూసేశారు. పారిస్ సహా పలు నగరాల్లో 10 లక్షల మందికిపైగా నిరసనకారులు వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 12 ట్రేడ్ యూనియన్లు, లెఫ్ట్ పార్టీలు, ఫార్ రైట్ పార్టీలు కలసికట్టుగా ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం. దేశంలో 68% ప్రజలు ఈ పెన్షన్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. రైట్ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పెన్షన్ సంస్కరణల బిల్లుకు ఎంతవరకు మద్దతు లభిస్తుందన్న అనుమానాలున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపు ఎందుకు? ప్రపంచమంతటా సగటు ఆయుఃప్రమాణం పెరుగుతోంది. జననాల రేటు తగ్గిపోతోంది. దీంతో వయసు మీద పడినా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అయితే రిటైర్మెంట్ వయసు యూరప్‌లోకెల్లా ఫ్రాన్స్‌లోనే తక్కువ. స్పెయిన్‌లో 65, యూకేలో 67, జర్మనీలో 67 ఏళ్లుగా ఉంది. జర్మనీ కూడా రిటైర్మెంట్ వయసును 70 ఏళ్లకు పెంచే యోచనలో ఉంది. ఫ్రాన్స్ కూడా పెన్షన్ నిధుల్ని పెంచుకోవడానికే ఈ సంస్కరణలను తీసుకొచ్చింది. రెండేళ్ల రిటైర్మెంట్ వయసు పెంపుతో ఏడాదికి 1,770 కోట్ల యూరోలు జమ అవుతాయి. 2027 నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యపడుతుంది. ఎందుకీ వ్యతిరేకత? హాయిగా ఇంటి పట్టున ఉండి పెన్షన్ అందుకుందామని అనుకున్న వారు మరో రెండేళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరు. ఇంకా పని చేస్తే రిటైరవక ముందే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని రైల్వే వర్కర్లు, మహిళలు, నైట్‌షిఫ్ట్‌ల్లో ఉండేవారు ఆందోళనగా ఉన్నారు. కనీసం 43 ఏళ్లు పని చేయాలన్న నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలస్యంగా మొదలు పెట్టే మహిళలు, ఉన్నత విద్య చదివే వారు 67 ఏళ్ల దాకా పని చేయాల్సి వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగాలు లేటవుతాయంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లో కనీస పెన్షన్ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదు. కరోనా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ధరాభారం పెరిగింది. ఫ్రాన్స్‌లో పెన్షన్ సంస్కరణలపై నిరసనలు ఇదేం మొదటి సారి కాదు. 2010లో రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచినప్పుడు కూడా ఇదే స్థాయి వ్యతిరేకత ఎదురైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడయ్యాక మాక్రాన్ ఈ సంస్కరణలు తేవాలని గట్టిగా అనుకున్నారు. 2019లో ఈ ప్రతిపాదిత సంస్కరణలకి వ్యతిరేకంగా సమ్మె జరిగినా కరోనా సంక్షోభంతో సమ్మెని ఆపేశారు. పెన్షన్ నిధి పెంచుకోవాలంటే సంపన్నులకి పన్నులు పెంచాలని, పెన్షన్ పథకంలో యాజమాన్యాల వాటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ పథకంలో సంస్కరణలివే ► రిటైర్మెంట్ వయసును ఏడాదికి మూడు నెలల చొప్పున పెంచుతూ 2030 నాటికి 64 ఏళ్లకు పెంచడం. ► 2027 తర్వాత చేరే ఉద్యోగులెవరైనా పూర్తి పెన్షన్ కోసం కనీసం 43 ఏళ్లు పని చేయాలి. ► పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిటైరయే నాటికి 43 ఏళ్ల సర్వీసు లేకపోతే 67 ఏళ్లు వచ్చేదాకా పని చేస్తేనే పెన్షన్ లభిస్తుంది. ► పూర్తి కాలం ఉద్యోగం చేసిన అల్పాదాయ వర్గాలకు 85% పెంపుతో పెన్షన్ 1200 యూరోలు అవుతుంది. 20 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ‘‘నేను ఒక కాస్మటిక్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా కార్యాలయంలో పని చేసే పరిస్థితుల్లేవు. మరో రెండేళ్లు పనిచేయాలంటే నా వల్ల కానేకాదు. ఈ పెన్షన్ బిల్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’’ – వర్జీనియా, మహిళా ఉద్యోగి ‘‘నేను రైల్వేల్లో పనిచేస్తాను. శారీరక శ్రమ చేయాలి. చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటూ పని చేస్తున్నాను.ఈ పరిస్థితుల్లో ఎన్నేళ్లు వచ్చే వరకు పని చెయ్యగలను. కనీసం 43 ఏళ్ల సర్వీసు ఉంటేనే పెన్షన్ వస్తుందనడం చాలా అన్యాయం’’ – రైల్వే కార్మికుడు ఇక వృద్ధులు భారమేనా..? ► ప్రపంచ దేశాలు పెన్షన్లను ఖరీదైన వ్యవహారంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 50 ఏళ్ల క్రితం ప్రతీ 10 మందిలో 8 మందికి డిఫైన్డ్ బెనిఫిట్ పథకాలు వర్తిస్తే ఇప్పుడు ప్రతీ 10 మందిలో ఒక్కరికే వర్తిస్తోంది. ► ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం వృద్ధులలో దాదాపు మూడో వంతు మందికి పెన్షన్‌పై భరోసా లేదు. కొందరికి పెన్షన్ వస్తున్నా అది వారి కనీస అవసరాలకి ఏ మూలకూ సరిపోవడం లేదు. ► వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు ఆర్థికంగా అండదండగా ఉంటారన్న నమ్మకం లేదు. ఎందుకంటే పిల్లల సంఖ్య కూడా ప్రపంచమంతటా క్రమక్రమంగా తగ్గిపోతోంది. కుటుంబంలో పిల్లల సంఖ్య సగటున 1.7కి పడిపోయింది. ► 1960వ దశకంలో ప్రపంచ జనాభాలో ఒక వృద్ధునికి సగటున 12 మంది పని చేసే శ్రామికుల చొప్పున ఉండేవారు. కానీ ప్రస్తుతం అలా పని చేసేవారి సంఖ్య ఏకంగా ఎనిమిదికి పడిపోయింది! 2050 నాటికల్లా ఈ సంఖ్య మరీ తక్కువగా 4కు పడిపోతుందని అంచనా. దీంతో పని చేయలేని వృద్ధులను ప్రభుత్వాలు భారంగా చూసే రోజులొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సత్ఫలితాలనిస్తున్న ఏపీ ప్రభుత్వ సంస్కరణలు
-
Constitution Day: ప్రజల చెంతకు కోర్టులు: సీజేఐ
వ్యాజ్యప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘అపార వైవిధ్యానికి నిలయమైన భారత్ వంటి అతి పెద్ద దేశంలో న్యాయమందించే వ్యవస్థ ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా చూడటమే అతి పెద్ద సవాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు అధునాతన టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి. న్యాయం కోసం ప్రజలు కోర్టు మెట్లెక్కడం కాదు, కోర్టులే వారి చెంతకు చేరే రోజు రావాలి. ఈ దిశగా టెక్నాలజీని న్యాయవ్యవస్థ మరింతగా అందిపుచ్చుకుంటోంది. తద్వారా పనితీరును మరింతగా మెరుగు పరుచుకునేలా కోర్టులను తీర్చిదిద్దుతున్నాం’’ అని వివరించారు. ప్రధాని ప్రారంభించిన ఇ–సైట్లే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఉదాహరణకు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్‌లోని సమాచారం వర్చువల్ జస్టిస్ క్లాక్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0 ద్వారా జిల్లా జడ్జిలు తమ కోర్టుల్లో పెండింగ్ కేసులు తదితరాలన్నింటినీ నిరంతరం మొబైల్లో పర్యవేక్షించగలరు’’ అని చెప్పారు. హైబ్రిడ్ విధానం ద్వారా సుప్రీంకోర్టు విచారణలో లాయర్లు దేశంలో ఎక్కడినుంచైనా పాల్గొంటున్నారని గుర్తు చేశారు. జడ్జిలపై గురుతర బాధ్యత ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాలు అందేలా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అందరిపైనా ఉందని సీజేఐ అన్నారు. ‘‘ఇది జరగాలంటే న్యాయమూర్తులమంతా మన పనితీరును, మనలో పాతుకుపోయిన దురభిప్రాయాలు, తప్పుడు భావజాలాలను ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకుంటుండాలి. భిన్న నేపథ్యాల వ్యక్తుల జీవితానుభవాలకు సంబంధించిన భిన్న దృక్కోణాలను అర్థం చేసుకోనిదే మన పాత్రను సమర్థంగా నిర్వహించలేం’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థది కీలకపాత్ర న్యాయం కోసం ప్రజలు తొలుత ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థనేనని సీజేఐ గుర్తు చేశారు. ‘‘అందుకే ఆ వ్యవస్థను బలోపేతం చేయడం, అవసరమైన అన్నిరకాల సాయమూ అందించడం అత్యవసరం. ఉన్నత న్యాయవ్యవస్థకు మితిమీరిన విధేయత చూపే భావజాలం నుంచి జిల్లా న్యాయవ్యవస్థను బయటికి తేవడం చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘భిన్న రంగాల వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఒడిసిపట్టి న్యాయవ్యవస్థలో భాగంగా మార్చడం చాలా ముఖ్యం. ఇందుకోసం న్యాయ వృత్తిలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చూడటం చాలా అవసరం’’ అని సూచించారు. -
పార్టీల నగదు విరాళాలపై నియంత్రణ.. కేంద్రానికి ఈసీ లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కీలక ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తెరపైకి తెచ్చింది. ‘‘పార్టీలకు అందే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరం. ప్రస్తుతం రూ.20 వేలున్న అనామక నగదు విరాళాల పరిమితిని రూ.2 వేలకు తగ్గించాలి. మొత్తం విరాళాల్లో అవి 20 శాతానికి/రూ.20 కోట్లకు (ఏది తక్కువైతే దానికి) మించరాదు’’ అని పేర్కొంది. ఇలాంటి పలు సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ లేఖ రాసినట్టు సమాచారం. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రూ.2,000కు మించి ప్రతి నగదు విరాళానికీ పార్టీలు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనియా గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్.. సోనియా గాంధీతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు యువ కార్యకర్తలు రూపొందించిన ఆన్లైన్ పిటిషన్‌కు ఆయన అంగీకారం తెలిపిన అనంతరం ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని శశి థరూర్ సోనియా గాంధీకి ఈ భేటీలో చెప్పారని, అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. దీంతో ఆయన అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కొద్దినెలల క్రితం ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చేసిన తీర్మానాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పార్టీకి చెందిన కొందరు యువ నాయకులు ట్విట్టర్లో ఓ పిటిషన్‌ను రూపొందించారు. దీనికి మద్దతుగా 650మంది పార్టీ నాయకులు సంతకాలు చేశారు. దీన్నే ట్విట్టర్లో షేర్ చేసి తాను స్వాగతిస్తున్నట్లు శశిథరూర్ తెలిపారు. దీనిపై ప్రచారం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. I welcome this petition that is being circulated by a group of young @INCIndia members, seeking constructive reforms in the Party. It has gathered over 650 signatures so far. I am happy to endorse it & to go beyond it. https://t.co/2yPViCDv0v pic.twitter.com/waGb2kdbTu — Shashi Tharoor (@ShashiTharoor) September 19, 2022 తీర్మానాలివే.. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే గాక కుటుంబం నుంచి ఒక్కరికి ఒకే పదవి ఇవ్వాలనే తీర్మానాలను ఉదయ్‌పూర్ సమావేశాల్లో కాంగ్రెస్ ఆమోదించింది. అయితే ఐదేళ్లకుపైగా పార్టీలో పనిచేసే కుటుంబాలకు దీని నుంచి మినాహాయింపు ఇచ్చింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 17న అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల అక్టోబర్‌కు వాయిదావేశారు. అయితే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తుండగా.. కొన్ని రాష్ట్రాల అధ్యక్షులు రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలేయాలని మూడు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. దీంతో ఎన్నికలు లేకుండా మళ్లీ గాంధీ కుటుంబసభ్యులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలనే పిటిషన్‌కు శశిథరూర్ బహిరంగంగా మద్దతు తెలిపారు. పార్టీలో సంస్కరణల కోసం డిమాండ్ చేసిన జీ-23 నేతల్లో ఈయన కూడా ఒకరు. ఈ విషయంపై 2020లోనే సోనియా గాంధీకి లేఖ రాశారు. కచ్చితంగా పోటీ.. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని థరూర్ కొద్దిరోజుల క్రితమే చెప్పారు. తాను పోటీ చేసేది లేనిది త్వరలో తెలుస్తుందన్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నాయకుడు కాంగ్రెస్ పగ్గాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోతే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌ను బరిలోకి దింపాలని సోనియా భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే శశిథరూర్ తప్పకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. చదవండి: వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం -
పట్టా పట్టు.. కొలువు కొట్టు
చదువు పూర్తికాగానే ఉద్యోగం కల్పించే లక్ష్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందు కోసం ఉన్నత విద్యలో నూతన జాతీయ విద్యావిధాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థి దశలోనే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో అమల్లో ఉన్న ఇంటర్న్‌షిప్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సిద్ధపడిన విద్యార్థులను పరిశ్రమలతో మ్యాపింగ్ పూర్తి చేసింది. నెల్లూరు (టౌన్): ఉన్నత విద్య చదివే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పని సరి చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్‌లో ఇంటర్న్‌షిప్ ఉంది. డిగ్రీలో కూడా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తే విద్యార్థులు చదువు పూర్తి కాగానే సులభంగా ఉద్యోగ, ఉపాధి పొందే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తోంది. 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పని సరి డిగ్రీలో 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్ తప్పని సరి చేశారు. అకడమిక్ విద్యా సంవత్సరం ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభకు మార్కులు కేటాయించారు. కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో చదువుతో పాటు అనుభవం సంపాదించడం, పరిశ్రమలతో అనుబంధం ఏర్పడేందుకు ఇంటర్న్‌షిప్ ఎంతో ఉపయోగపడుతోంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రెండు సెమిస్టర్ పరీక్షలు అయిన తర్వాత 2 నెలలు పాటు కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సరంలో 3, 4 సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 2 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. డిగ్రీ తృతీయ సంవత్సరంలో 5వ సెమిస్టర్ పరీక్షలు పూర్తయిన తర్వాత 6 నెలల పాటు ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 ఏళ్లు డిగ్రీ కోర్సు అమలు చేయనున్నట్లు ఉన్నత విద్య అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కోర్సును బట్టి (ఉదాహరణకు బీఏ హానర్స్ పేరుతో) సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. 8,964 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ జిల్లాలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ–10, ఎయిడెడ్–3, ప్రైవేట్– 61 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో డిగ్రీ 3 సంత్సరాలు కలిపి మొత్తం 45 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 13,547 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 8,964 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 3,883 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌కు ఆయా పరిశ్రమలు, సంస్థలతో మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకునేందుకు వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌తో విద్యార్థుల డేటాను తెప్పించి వర్సిటీలోనే నమోదు చేయిస్తున్నారు. ఇంటర్న్‌షిప్ మీద కళాశాలల యాజమాన్యాలతో పాటు ప్రిన్సిపల్స్‌కు కూడా వర్సిటీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలు నూతన విద్యా విధానాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, మెంబర్‌గా వర్సిటీ వైస్ చాన్సలర్, మెంబర్ సెక్రటరీగా జాయింట్ కలెక్టర్, అడిషనల్ మెంబరు సెక్రటరీగా వర్సిటీ రిజిస్ట్రార్, మెంబర్లుగా డీఐఈపీసీ జనరల్ మేనేజర్, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, విజ్ఞాన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ (చేజర్ల), కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్, ఆదానీ విల్మర్, సీమెన్స్గమేసా, ఆదానీపోర్ట్, ఐఆర్సీఎస్ చైర్మన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, బీఎం ఆర్ గ్రూపు జీఎంలు ఉన్నారు. ఇంటర్న్‌షిప్‌కు అవకాశం డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కోసం తిరుపతి జిల్లా కలెక్టర్‌తో సమావేశ అనంతరం పరిశ్రమలు, సచివాలయాలు, ఆర్బీకేలు, శ్రీసిటీ, స్కిల్ డెవలప్మెంట్ తదితర విభాగాల్లో 4 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించారు. వచ్చే నెల 6న కమిటీ చైర్మన్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మాట్లాడి మిగిలిన విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించనున్నాం. – సుందరవల్లి, వైస్ చాన్సలర్, వీఎస్‌యూ -
‘ఫెస్టో ఎక్స్‌పోటైనర్’ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సజ్జల
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండి యురో సింక్రనైజెషన్ స్కిల్ క్లస్టర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఫెస్టో ఎక్స్‌పోటైనర్’ వాహనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో చల్లా మధుసూదన్ రెడ్డి, ఎస్డీ అండ్ టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు సత్యనారాయణ, ఎండీ APSSDC, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసి రాజశేఖర్ పాల్గొన్నారు. ఫెస్టో ఎక్స్‌పోటైనర్ వాహనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని పేర్కొన్నారు. ‘నూతన జాతీయ విద్యా విధానం వస్తుందంటున్నారు. కానీ దాని కన్నా ముందే ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. చదువుపైన ఆసక్తి ఉన్న వారికి, చదువుకోవాలనే ఆశ ఉన్న వారికి ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించింది. విద్యావ్యవస్థలో ఈ దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తీసుకువచ్చాము. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలకు సంబంధించిన ఫలితాలు అందుతున్నాయి. నైపుణ్యం సాధించడానికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా వల్ల ఆ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఫెస్టో ఎక్స్పోటైనర్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదీ చదవండి: పాత ఫొటోలతో విష ప్రచారం.. చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల -
National Education Policy–2020: సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. కొత్త మార్పులు ఏమిటంటే.. విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది. విద్యార్థుల టాలెంట్‌ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్‌ను సీబీఎస్ఈ జారీ చేస్తుంది. -
YSRCP Plenary 2022: విద్యా రంగంపై తీర్మానం: హైలైట్స్ ఇవే..
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: మంచి చదువులతో పిల్లలను తీర్చిదిద్దినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధిస్తాయని నమ్మి సీఎం వైఎస్ జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యా రంగంలో ప్రభుత్వం తెచి్చన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారుమయం కానుందని చెప్పారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విద్య మీద ప్రభుత్వం పెట్టే ఖర్చును దేశాభివృద్ధికి పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. చదవండి: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వేల కోట్ల రూపాయలు విద్యా రంగానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు కొనసాగించాలని సీఎం విద్యా సంస్కరణలను యజ్ఞంలా కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్కరణలను ప్రతిపక్షాలు హేళన చేయడంపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు, అవగాహన లేని నేతలే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తెచ్చిందన్నారు. ఒకప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్క టీచరే ఉండటం వల్ల పిల్లలకు సరైన బోధన అందేది కాదన్నారు. కానీ ఇప్పుడు 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌తో పిల్లలకు బోధన అందేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో నాసిరకమైన విద్య.. గత ప్రభుత్వాలు ప్రైవేటు కళాశాలలి్న, స్కూళ్లను ప్రోత్సహించాయని.. పరీక్షలను చూసి రాయించాయని మంత్రి బొత్స తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులను ఉత్తీర్ణులను చేయించి భారీగా దోచుకున్నారని మండిపడ్డారు. నాసిరకమైన విద్యను అందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా మన విద్యార్థులకు పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకని స్థితిని తెచ్చారని నిప్పులు చెరిగారు. ఇలా కాకుండా ఒక కుటుంబంలో విద్యార్థికి మంచి విద్య అందితే ఆ కుటుంబ ఆరి్థక స్థితిగతులు మారిపోతాయన్నారు. ఇది స్నేహపూర్వక ప్రభుత్వమని.. ఉపాధ్యాయులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన పగ్గాలను చేపట్టిన మొదటి రోజు నుంచే విద్యా సంస్కరణలపై దృష్టి సారించారని గుర్తు చేశారు. నేడు ప్రైవేటు స్కూల్స్‌ను మించి సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర పథకాలతో బడికి వెళ్లే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగల ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొన్నారు. హైలైట్స్ ♦విద్యపై పెట్టే ఖర్చు దేశాభివృద్ధికి పెట్టుబడి ♦రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చదువులు ♦ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా రంగంలో సంస్కరణలు ♦ అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక ♦ఇంగ్లిష్ మీడియం విద్య.. ♦మా హక్కు అనేది ప్రతి విద్యార్థి భావన ♦రాష్ట్ర విద్యార్థులు ఏ రాష్ట్రం, ఏ దేశం వెళ్లినా గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పం ♦ఒక విద్యార్థికి మంచి చదువు లభిస్తే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ♦మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే ♦ ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు 35 శాతం సీట్లు ♦గత ప్రభుత్వాల హయాంలో ప్రైవేటు స్కూళ్లకు, కళాశాలలకు ప్రోత్సాహం ♦ కార్పొరేట్‌కు అనుగుణంగానే గత ప్రభుత్వం చట్టాలు పేద పిల్లల పెద్ద చదువులకు అనేక పథకాలు అమ్మ ఒడి జగనన్న మూడో పుత్రిక. పేదల పిల్లలు పెద్ద చదువులు చదివేలా సీఎం వైఎస్ జగన్ అనేక పథకాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. దాన్ని పేదలకు మరింత చేరువ చేశారు. విద్యా రంగంలో సంస్కరణల కోసమే రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. గత ప్రభుత్వాలు విద్యను నిరీ్వర్యం చేశాయి. పాఠశాలల అభివృద్ధిపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదు.. ఆయన తల్లిదండ్రుల కమిటీలను అడిగితే వారే చెబుతారు. – కిలారి రోశయ్య, ఎమ్మెల్యే నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో విద్యా రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. గతంలో ఎవరూ ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టలేదు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని చెప్పి.. మన తలరాతను మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్. అమ్మ ఒడి గొప్ప పథకం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, ఇంకా అనేక కార్యక్రమాలు, పథకాలతో సీఎం సంఘసంస్కర్తగా నిల్చారు. గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా రంగానికి కొమ్ము కాసింది. నారాయణ, చైతన్య యాజమాన్యాలకు అనుగుణంగా చట్టాలు కూడా చేసింది. సీఎం వైఎస్ జగన్ ఆ చట్టాలను మార్చి ప్రైవేటు వర్సిటీల్లో కూడా 35 శాతం సీట్లు పేదలకు ఇస్తున్నారు. – ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అట్టడుగు వర్గాల మేలు కోసమే పథకాలు ఇంగ్లిష్ మీడియం విద్య.. మా హక్కు అని నినదించేలా సీఎం జగన్ పేదల పిల్లలకు ఆంగ్ల మాధ్యమ చదువులను అందిస్తున్నారు. అట్టడుగు వర్గాలకు మేలు చేయాలన్న తపనతోనే వేల కోట్ల రూపాయలు వెచి్చస్తూ విద్యా పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. రక్తం ధారబోసి అయినా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. – సుధాకర్‌బాబు, ఎమ్మెల్యే బడుగుల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దా? రామోజీరావు, చంద్రబాబుతోపాటు ఇతర టీడీపీ నేతల పిల్లలు, మనవళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. బడుగుల పిల్లలకు మాత్రం ఇంగ్లిష్ మీడియం అందకూడదన్నట్టు వీరు వ్యవహరిస్తున్నారు. బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లిష్ చదువులకు పనికిరారన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. – నాగార్జున యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
కాంగ్రెస్‌లో భారీ సంస్కరణలు!
న్యూఢిల్లీ: అంతర్గతంగా బలోపేతం కావాలంటే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ సంస్కరణలు తప్పనిసరి అని సీనియర్ నేతల్లో అత్యధికులు భావిస్తున్నారు. అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మొదలుకుని ఏఐసీసీ, పీసీసీ నుంచి బ్లాక్ స్థాయి దాకా అన్ని కమిటీల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా బాగా పెరగాలని అభిప్రాయపడుతున్నారు. దాన్ని ఇప్పుడున్న 20 శాతం నుంచి కనీసం 50 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. వచ్చే వారం రాజస్తాన్‌లో జరగనున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనల ముసాయిదాల తయారీకి ఏర్పాటైన ఏఐసీసీ ప్యానళ్లు ఇదే అభిప్రాయం వెలిబుచ్చాయి. ఈ ప్రతిపాదనలు కార్య రూపం దాల్చాలంటే ఏఐసీసీ ప్యానళ్లతో పాటు సీడబ్ల్యూసీ, చింతన్ శిబిర్ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. చింతన్ శిబిర్ సన్నాహకాల్లో భాగంగా సోమవారం జరిగే సీడబ్ల్యూసీ భేటీలో వీటిని సమర్పించనున్నారు. పదవులనూ తగ్గించాలి ఏఐసీసీలోనూ, పీసీసీల్లోనూ అన్ని విభాగాల్లో పదవులను కనీస స్థాయికి తగ్గించాలని సంస్థాగత వ్యవహారాల కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం సంఖ్యపై గరిష్ట పరిమితి విధించాలని పేర్కొన్నట్టు చెప్తున్నారు. ‘‘ఉదాహరణకు ఏఐసీసీలో 100 మందికి పైగా కార్యదర్శులున్నారు. ఈ సంఖ్యను 30కి తగ్గిస్తే మేలు. పీసీసీల్లోనూ ఈ పరిమితిని పాటించాలి’’ అని ప్యానల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ముకుల్ వాస్నిక్ సారథ్యంలోని సంస్థాగత వ్యవహారాల కమిటీలో రమేశ్ చెన్నితాల, తారిఖ్ అన్వర్, అజయ్ మాకెన్ తదితరులున్నారు. అలాగే డీసీసీ అధ్యక్షులను ఢిల్లీ నుంచి ఏఐసీసీ స్థాయిలో నామినేట్ చేసే పోకడకు స్వస్తి పలికి పీసీసీ నాయకత్వమే నియమించుకునేలా చూడాలన్న ప్రతిపాదన కూడా ఉంది. -
రూ.7.5 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార నిర్వహణ సులభం కావడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు, ముఖ్యంగా క్రూడ్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి బలోపేతానికి, వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు పది అంచెల విధానాన్ని సూచించింది. మౌలిక రంగంలో పెట్టుబడులను వేగవంతం చేయడం, పీఎల్ఐ కిందకు మరిన్ని రంగాలను తీసుకురావడం, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచడం, అధిక కమోడిటీ ధరలను పరిష్కరించడం, ముడిసరుకులకు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. -
గ్రూప్–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం రాత పరీక్షతోనే అభ్యర్థులను ఎంపిక చేసి నియామకాలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇంటర్వ్యూ(మౌఖిక పరీక్ష)లకు స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇలా అయితే, ఉద్యోగ నియామకాల క్రతువు వేగంగా పూర్తి అవుతుందని, పొరపాట్లకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్–2, అంతకంటే తక్కువస్థాయి ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టింది. నూతన రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడలేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలతో నియామకాల ప్రక్రియ చేపట్టి నూతన ఒరవడిలో సాగవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమేనా.... ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్–1 నియామకాల ప్రక్రియ 3 అం చెల్లో సాగింది. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించేవారు. అనంత రం మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవారు. ఇప్పటివరకు గ్రూప్–2లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గ్రూప్–1, గ్రూప్– 2ల సిల బస్, పరీక్షల విధానంపై ఇప్పటికే టీఎస్పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఒకవేళ ఇంటర్వ్యూలను రద్దు చేస్తే సిలబస్‌లో ఏమైనా మార్పులుంటాయా అనే సందేహాలు కూడా వ్యక్తమ వుతున్నాయి. సిలబస్‌లో మార్పు చేస్తే నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యమయ్యే అవకాశముం దని, నూతన సిలబస్ ఎంపిక, మెటీరియల్ ఫైనలైజేషన్ కొలిక్కి రావడానికి సమ యం పట్టవచ్చని పలువురు భావి స్తున్నారు. అయితే సిల బస్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఇంటర్వ్యూలకు సంబం ధించిన అంశాలను కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షల్లో కవరయ్యే విధంగా కాస్త మార్పులు చేస్తే సరిపోతుందని సర్వీసు నిబంధనలపై పట్టున్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. పొరుగు రాష్ట్రంలో రద్దు గ్రూప్–1, గ్రూప్–2 ఇంటర్వ్యూలను రద్దు చేయాలని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అక్కడ గత ప్రభుత్వంలోని పెద్దలు, కొందరు అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియను ఆసరాగా చేసు కుని ఇష్టానుసారంగా మార్కులు కేటాయించిన అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పారదర్శకత పాటించే విధంగా అక్కడి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దుచేయాలని భావించింది. ఉత్తరాదిలో మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నియామకాలను వేగంగా చేపట్టే లక్ష్యంతో సంస్కరణలు తీసుకురావడం శుభ పరిణామమని నిరుద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’) -
ఏపీలో సత్ఫలితాలిస్తోన్న మైనింగ్ సంస్కరణలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనింగ్ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో నూతన విధానాలకు రూపకల్పన చేశారు. పారదర్శకతతో అక్రమాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఖనిజ ఆదాయంలో గనుల శాఖ సరికొత్త రికార్డు నెలకొల్పింది. చదవండి: ఏపీ: రిజిస్ట్రేషన్లలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రికార్డ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3765 కోట్ల ఆదాయం వచ్చింది. 60 శాతం వృద్ధి రేటుతో గత ఏడాది కన్నా అదనంగా రూ.1425 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లీజు అనుమతులు మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచ్చింది. తద్వారా లీజులు పొంది.. ఏళ్ల తరబడి క్వారింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేసే విధానానికి స్వస్తి పలికారు. ముఖ్యంగా లీజుల కేటాయింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకత పాటిస్తుందని గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్పారు. -
సుదీర్ఘ నిరీక్షణలో సంస్కరణ!
రక్షకభట వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలంటూ ఇటీవల గుజరాత్ పర్యటనలో ప్రధాన మంత్రి మోదీ అన్న మాటలు పోలీసు సంస్కరణల అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారితో కఠినంగా ఉంటూ, సమాజంతో స్నేహంగా ఉండడం రక్షకులకు ఆదర్శం. కానీ, ఇవాళ అందుకు భిన్నంగా ఉందన్నది చేదు నిజం. ఆ తప్పుకు కారణం పోలీసు ప్రవర్తనతో పాటు పాలకుల రాజకీయ జోక్యం! వలస పాలన నాటి వేధింపు ధోరణికి దూరంగా – పోలీసంటే జనానికి మిత్రుడనే అభిప్రాయం కలిగించాల్సిన అమృతకాలం మించిపోతున్నట్టు పాలకులు గుర్తించడం సంతోషం. చేపట్టాల్సిన చర్యలే చాలాకాలంగా మిగిలి ఉన్నాయి. గడచిన 20 ఏళ్ళలో దేశంలో 1888 కస్టడీ మరణాలు జరిగితే, కేవలం 26 మంది పోలీసులే శిక్షకు గురయ్యారు. ఒక్క 2020లోనే 76 కస్టడీ మరణాలు సంభవించాయి. అందులో 15 కేసులతో గుజరాత్‌దే అగ్రాసనం. నిజానికి, 1860లలో చేసిన చట్టం భారత పోలీసు వ్యవస్థకు మూలం. చాలాకాలంగా మార్పుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సంస్కరణలను సూచించాలంటూ, 1977లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం ‘జాతీయ పోలీసు కమిషన్’ను పెట్టింది. 1978 నవంబర్ – 1981 మే మధ్య ఆ కమిషన్ 8 నివేదికలిచ్చింది. ఇక, మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రెబీరో, కేంద్ర హోమ్‌శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య సహా పలువురు నిపుణుల కమిషన్లు వచ్చాయి. అవీ అనేక సంస్కరణల్ని సూచించాయి. వాటిలోనూ చాలాభాగం ఆచరణకు నోచుకోనే లేదు. దశాబ్దిన్నర క్రితం వచ్చిన ప్రకాశ్‌సింగ్ కేసు తీర్పు పోలీసు సంస్కరణల్లో చిరస్మరణీయ ఘట్టం. డీజీపీగా పని చేసిన ప్రకాశ్ సింగ్ తన పదవీ విరమణ తర్వాత పోలీసు శాఖలో సంస్కరణలు కోరుతూ 1996లో సుప్రీమ్ కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు. పదేళ్ళ తర్వాత 2006 సెప్టెంబర్‌లో న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిస్తూ, పోలీసు సంస్కరణలు తేవాల్సిందిగా అన్ని రాష్ట్రాలనూ, కేంద్రపాలిత ప్రాంతాలనూ నిర్దేశించింది. రాజకీయ జోక్యాల బాదరబందీ లేకుండా పోలీసులు స్వేచ్ఛగా పనిచేసేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అనేక చర్యలతో పాటు 7 ప్రధాన అంశాలను కోర్టు తన ఆదేశంలో పేర్కొంది. ఆ తీర్పు నాటి నుంచి 2020 లోపల దేశంలో 18 రాష్ట్రాలు తమ పోలీసు చట్టాలను ఆమోదించడమో, సవరించడమో చేశాయి. అవేవీ కోర్టు చెప్పినదానికి అనుగుణంగా లేవు. నేటికీ దేశవ్యాప్తంగా పోలీసుల బదలీలు, నియామకాల్లో రాజకీయ జోక్యం తగ్గనేలేదు. గత మార్చిలో మహారాష్ట్రలో పలువురు ఐపీఎస్‌లు లాబీయింగ్‌తో పోస్టింగులు పొందుతున్నారని ఆరోపణలు రావడం వ్యవస్థ మారలేదనడానికి నిదర్శనం. సుప్రీమ్‌కోర్టు అనేకమార్లు జోక్యం చేసుకున్నా, ఇవాళ్టికీ థర్డ్ డిగ్రీ ప్రయోగాలు, జైళ్ళలో మానవ హక్కుల ఉల్లంఘనలు, పాలకుల పనుపున లాకప్ హత్యలు, ఎన్కౌంటర్లు ఆగనేలేదు. నాణేనికి రెండో కోణం– సిబ్బంది కొరతతో, వేళాపాళా లేని పోలీసుల విధినిర్వహణ కష్టాలు. దేశంలో ప్రతి లక్ష మందికీ 222 మంది పోలీసులు ఉండాలన్నది ఐరాస సిఫార్సు కాగా, తీరా మన దగ్గర ఉన్నది అందులో సగాని కన్నా కాస్త ఎక్కువగా 137 మందే! రాష్ట్రాల పోలీసు విభాగాల్లో మంజూరైన పోస్టుల్లో 5.3 లక్షలు భర్తీ కాకుండా ఉన్నాయట. నూటికి 44 మంది పోలీసులు రోజుకు 12 గంటలు పని చేస్తుంటే, ప్రతి ఇద్దరిలో ఒకరికి వారాంతపు సెలవే ఉండట్లేదు. విధిలో ఉన్నవారిపై ఒత్తిళ్ళు సరేసరి. ఈ పరిస్థితుల్లో నేరాలు జరిగినప్పుడు తక్షణ న్యాయం అందించే వ్యవస్థ నేటికీ దేశంలో కరవే. నేర, శ్రామిక, సివిల్ వివాదాలు వస్తే వాటి పరిష్కారం అంత తేలిక కాదు. మన దేశంలో వస్తూత్పత్తి, వాణిజ్య రంగాల్లోకి రావడానికి విదేశీ సంస్థల అనాసక్తికి కారణం అదే. దాని ప్రభావం మన దేశంపై ఆర్థికంగా భారీగా పడింది. 1987 నాటికి మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి దాదాపు సమానమైన చైనా గత ఏడాదికి 5 రెట్లు మించిందంటే, ఇలాంటి మన లోపాలే మూలం. మహిళలపై దాడుల కేసులు దాదాపు పాతిక వేలు, అత్యాచారం కేసులు 12 వేలు, వరకట్న మరణాలు 4 వేలకు పైగా అయిదు నుంచి పదేళ్ళుగా పెండింగ్‌లోనే ఉన్నాయని జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్క. సాంకేతికత పెరిగి, ఇ–పోర్టల్స్ వచ్చినా పాస్‌పోర్టులు, నిరభ్యంతర పత్రాల (ఎన్ఓసీల) జారీ లాంటి అనేక ప్రాథమిక సేవలకూ జాప్యం జరుగుతోంది. మాటలతో సరిపుచ్చ కుండా ఈ లోపాలను సవరించడానికి పాలకులు ఆచరణలోకి దిగాలి. శిక్షణ రోజుల నుంచే పోలీ సుల్లో జనస్నేహ ధోరణిని పెంపొందించడం అవసరం. పోలీసులపై ప్రజల ఫిర్యాదుల్ని విచారించే ‘పోలీస్ కంప్లయింట్స్ అథారిటీస్’ పెట్టాలన్న సుప్రీమ్ మార్గదర్శకాన్ని ఇకనైనా అమలు చేయాలి. పోలీసు శాఖను మానవీయంగా, బదలీలు – నియామకాలను పారదర్శకంగా మార్చే సదాలోచనను అందిపుచ్చుకోవడం అవసరమని నిపుణుల మాట. రాష్ట్రాలన్నీ తమ స్థానిక అవసరాలు, ఆలోచనలు, పరిస్థితులకు తగ్గట్టు మార్పు చేసుకొనే వీలుండేలా, అఖిల భారత స్థాయిలో ఓ నమూనా చట్టం తేవాలని వారి వాదన. నిజానికి, పోలీసు విభాగం రాష్ట్ర జాబితాలోది. కానీ, సమాఖ్య స్ఫూర్తికి భంగం వాటిల్లని రీతిలో, దిశానిర్దేశం చేస్తే ఫరవా లేదు. ఏమైనా, పాలకులు, పోలీసులు గుర్తుంచుకోవాల్సింది – క్షణాలలో స్పందించి, ఆపదలో ఆదుకుంటారన్న భరోసా కలిగిస్తేనే... రక్షక భటులనే పేరుకు సార్థక్యం. పోలీసులు స్వేచ్ఛగా, సంతోషంగా, నిర్భయంగా పనిచేసేలా రాజకీయ జోక్యం నివారించడమే పాలకుల కర్తవ్యం. -
పోలీసులంటే ఇంకా భయమే
గాంధీనగర్: అంతర్గత భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు స్వాతంత్య్రానంతరం పెద్దగా ప్రయత్నాలే జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ హయాంలో జనాలను భయభ్రాంతులను చేయడమే అంతర్గత భద్రతా వ్యవస్థ లక్ష్యంగా ఉండేది. ఇప్పటికీ ఈ విషయంలో పెద్దగా మార్పు రాలేదు. పోలీసులంటే ప్రజల్లో భయం, వారికి దూరంగా ఉండాలన్న భావనే కన్పిస్తున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణం సంస్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. ఆయన శనివారం గాంధీనగర్‌లోని రాష్ట్రీ య రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్యూ) తొలి స్నాతకోత్సవంలో ప్రసంగించారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచితే చాలదని, టెక్నాలజీ, జనం సైకాలజీ, యువతరం భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యమున్న శిక్షితులైన అధికారులు తక్షణావసరమని అన్నారు. ‘‘పోలీసులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించగలగాలి. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి వారిలో స్నేహభావన, నమ్మకం పెంపొందించాలి. అంటే శిక్షణ పద్ధతుల్లోనే మార్పు రావాలి’’ అని అన్నారు. విపరీతమైన పనిభారం పోలీసు సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పని భారంతో సతమతం అవుతున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఆసరాగా నిలిచే ఉమ్మడి కుటుంబాల వంటి సంప్రదాయ వ్యవస్థలు క్షీణించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పైగా నేటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉంటే చాలదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఎందుకంటే శారీరక వైకల్యమున్నా మానసికంగా దృఢంగా సిబ్బంది భద్రతా వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడగలరు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారికి యోగ శిక్షణ, నిపుణుల మద్దతు వంటివి తప్పనిసరి’’ అని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ, సంబంధిత స్టార్టప్‌ల విస్తరణను కూడా ప్రస్తావించారు. ఆర్ఆర్యూ విద్యార్థులు వాటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భద్రత, రక్షణ తదితర రంగాల్లో మహిళల రాక పెరుగుతుండటం శుభ పరిణామమన్నారు. 1,090 మంది ఆర్ఆర్యూ విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, నేర న్యాయ వ్యవస్థల్లో సుశిక్షిత సిబ్బందిని అందించేందుకు 2020లో ఆర్ఆర్యూ స్థాపన జరిగింది. రెండు రోడ్ షోలు వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రధాని మోదీ శనివారం మరో రెండు రోడ్ షోలు చేశారు. ఉదయం గాంధీనగర్ జిల్లాలో దేగం నుంచి లవద్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ దాకా 12 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. సాయంత్రం అహ్మదాబాద్‌లో ఇందిరా బ్రిడ్జి నుంచి సర్దార్ పటేల్ స్టేడియం దాకా 3.5 కిలోమీటర్ల మేర మామూలు జీప్‌లో రోడ్ షో చేశారు. అయితే పలుచోట్ల వాహనం దిగి, ‘మోదీ, మోదీ’ అని నినదిస్తున్న జనాన్ని పలకరిస్తూ సాగారు. గుజరాత్లో 1988 నుంచీ బీజేపీయే అధికారంలో ఉంది. -
గ్యాస్ క్వీన్ ఉంటే...యుద్ధమే వచ్చేది కాదు!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకీ తీవ్రంగా మారి అణు ఆయుధాలు వాడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యంతోపాటు అక్కడి పౌరులు సైతం రంగంలో దిగి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడుతున్నారు. కానీ మరికొద్ది గంటల్లోనో, రోజుల్లోనో ఉక్రెయిన్ రష్యా కబంధ హస్తాల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ‘యులియా టిమోషెంకో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. గ్యాస్ క్వీన్ గా పాపులర్ అయిన యులియా మరెవరో కాదు ఉక్రెయిన్ కు తొలి మహిళా ప్రధాని. రష్యా నిర్ణయాలకు తాము వ్యతిరేకమని బహిరంగంగానే చెప్పే తెగువ ఆమెది. పశ్చిమ దేశాలతో మంచి దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ నాటోలో ఉక్రెయిన్ ను చేర్చేందుకు ప్రయత్నించింది. యులియా ప్రభుత్వం ఉన్నంత కాలం.. ఉక్రెయిన్ కు రష్యా కనీసం యుద్ధ భయాన్ని కూడా కలిగించలేక పోయింది. అందుకే అంతా యులియాను తలచుకుంటున్నారు. ఉక్రెయిన్ తొలి మహిళా ప్రధానిగా పని చేసిన యులియా 1960 నవంబర్ 27న అప్పటి యూఎస్ఎస్ఆర్ ఉక్రెయిన్ లో జన్మించింది. ఎకనామిక్స్– సైబర్నెటిక్స్ డిగ్రీని డిస్టింక్షన్ లో పూర్తిచేసింది. డిగ్రీ అయ్యాక లెనిన్ కంపెనీలో ఇంజినీర్–ఎకనమిస్ట్‌గా చేరింది. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ సెంటర్ టెర్మినల్‌కు కమర్షియల్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆ తరువాత ఉక్రెయిన్ యునైటెడ్ ఎనర్జీ సిస్టమ్స్ స్థాపించి దేశంలో అనేక పరిశ్రమలకు గ్యాస్‌ను సరఫరా చేసింది. దీనిద్వారా దేశంలోని ధనవంతుల జాబితాలో ఒకటిగా నిలిచింది. యునైటెడ్ ఎనర్జీని విజయవంతంగా నడిపించడంతో అంతా యులియాను ‘ద గ్యాస్ ప్రిన్సెస్’ అని, గ్యాస్ క్వీన్ అనీ పిలిచేవారు. ఆరెంజ్ రివల్యూషన్ మహిళా వ్యాపార వేత్తగా నిరూపించుకున్న తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టింది యులియా. రాజకీయాల్లోనూ తన ముద్రవేస్తూ ఒక్కో పదవిని అలంకరిస్తూ దేశానికి తొలి మహిళా ప్రధాని అయ్యింది. 2004లో రష్యాకు అనుకూలుడైన విక్టర్ యుష్నకోవ్ 2004 ఎన్నికలలో గెలిచినప్పుడు ఆయన గెలుపుని యులియా వ్యతిరేకించింది. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తూ ‘ఆరెంజ్ రివల్యూషన్ ’ను తీసుకొచ్చింది. విక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆరెంజ్ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి భారీఎత్తున మద్దతు లభించింది. ఆరెంజ్ రివల్యూషన్ విజయవంతం కావడంతో యులియా దేశానికి ప్రధాని అయింది. 2005లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి మహిళా ప్రధానిగా, 2007 డిసెంబర్ నుంచి 2010 మార్చి వరకు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించింది. అంగుళం కూడా ఆక్రమించలేరు! తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది యులియా. ముఖ్యంగా జీతాలు పెంచడం, యుటిలిటీ టారిఫ్‌లు తగ్గించడం వంటి వినూత్న నిర్ణయాలు ఉక్రేనియన్లను ఎంతగానో ఆకర్షించాయి. అంతేగా ‘మా మాతృభూమిని మీకు అప్పగించడానికి మేము సిద్ధంగా లేము’ అని అనేకసార్లు బహిరంగంగానే స్పష్టం చేసింది. అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని రష్యాకు సవాళ్లు విసిరేది. రెండోసారి ప్రధాని అయినప్పుడు గ్యాస్ ఒప్పందం విషయంలో చర్చలు సఫలం కాకపోవడంతో రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఈ సమయంలో యులియా రష్యాను తెలివిగా ఒప్పించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. అందుకే ఇప్పుడంతా ఆమె నాయకత్వంలో దేశం ఉండి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని వాపోతున్నారు. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎంపికై, రెండుసార్లు ప్రధానిగా తనదైన ముద్ర వేసిన యులియా ఇరవై ఏళ్లకుపైగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ దేశం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం!
కోవిడ్ మహమ్మారి సాగించిన ఆర్థిక విధ్వంసంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. సమస్త జీవన రంగాల్లోని ఏ పాయనూ అది వదిలిపెట్టలేదు. మెజారిటీ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆక్స్‌ఫామ్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 శాతం మంది ప్రజలు నష్టపోయారు. వారిలో పేదవాళ్లు మరింత ఎక్కువ నష్టపోయారు. బాగా బలిసినవాళ్లు తెగ బలిశారు. దేశంలోని సూపర్ రిచ్ కుబేరుల సంపద కేవలం ఇరవై మాసాల్లో రెట్టింపయ్యింది. వీళ్లంతా అల్లావుద్దీన్లయితే కోవిడ్ వాళ్ల చేతుల్లో వండర్ ల్యాంప్‌గా మారింది. 2020 మార్చిలో ఈ నూరుగురు కుబేర పుత్రుల ఉమ్మడి సంపద విలువ 23 లక్షల కోట్లు. నవంబర్ 21 నాటికి అది 53 లక్షల కోట్లకు లాంగ్‌జంప్ చేసింది. దేశ జీడీపీలో ఇది రమారమి మూడో వంతు. ఆక్స్‌ఫామ్ లెక్క ప్రకారమే అదే సమయంలో దేశంలో 4.6 కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు. కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 11 కోట్లమందికి పైగా నమోదయ్యారు. అంతకుముందు సంవ త్సరంలో పోలిస్తే ఇది 4 కోట్లు ఎక్కువ. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరుగుతుందట. సుప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఈ పరిణామాలపై ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. 1940ల నాటి దారుణమైన బెంగాల్ క్షామం రోజుల్లో నిరుపేదలను ఎవరూ పట్టించుకోలేదు. అట్లాగే ఇప్పటి కోవిడ్ పరిణామాల్లో కూడా అత్యంత నిరుపేదలు అతి దారుణంగా దెబ్బతిన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం, నేటి భారత ప్రభుత్వం నిరుపేదల విష యంలో ఒకేరకంగా వ్యవహరించాయన్నారు. తనతో మాట్లాడిన సందర్భంలో అమర్త్యసేన్ ఈ వ్యాఖ్యలు చేశారని సీఎన్‌బీసీ న్యూస్ యాంకర్ మిథాలీ ముఖర్జీ ఒక వ్యాసంలో వెల్లడించారు. మొదటి లాక్డౌన్ సమయంలో మండుటెండల్లో నడిరోడ్లపై నెత్తురోడుతూ కదిలిన కోట్లాది మాంసపు ముద్దల మహాప్రస్థాన దైన్యాన్ని ఈ దేశం స్వయంగా వీక్షించింది కూడా! ‘ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాకి వాలదు’ అనే సామెత ఉండేది. అదేవిధంగా ఏ సంక్షోభం ముంచుకొచ్చినా ఐశ్వర్యవంతుణ్ణి ఏమీ చేయలేదు. దరిద్ర నారాయణుడిని మాత్రం ఏ మహమ్మారీ వదిలిపెట్టదు. అతడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం లాగా వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో ప్రముఖమైనది విద్యారంగం. ఈ రంగంలో కూడా అతి ఎక్కువగా నష్టపోయినవారు పేదింటి బిడ్డలే. ఇప్పటికే మన విద్యావ్యవస్థలో ప్రమాణాల రీత్యా ధనిక – పేద అంతరం కొనసాగుతూ వస్తున్నది. ఈ రెండేళ్లలో అంతరం మరింత విస్తరించింది. వసతులున్న పిల్లలు ఆన్లైన్ ద్వారా అంతో ఇంతో మేకప్ చేసుకోగలిగారు. ఏ ఆదరువూ లేని పిల్లలు చదువులకు దూరమై డ్రాపవుట్ అంచున నిలబడ్డారు. భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరినీ సమస్కంధు లుగా, సమాన వాటాదారులుగా ప్రకటించినప్పటికీ ఇంకా ఇన్ని కోట్లమంది ప్రజలు నిస్సహాయులుగా నిరుపేదలుగా మిగిలి పోవడానికి కారణం ఏమిటి? అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్యను అందివ్వలేకపోవడమే అందుకు కారణమని విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పేదరికంపై విజయం సాధించ గలిగే ధనుర్బాణాలను విద్యారంగమే సమకూర్చుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. విద్యారంగం మీద జీడీపీలో కనీసం 6 శాతం ఖర్చుపెడితే తప్ప ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించలేమని జాతీయ విద్యావిధానంపై వెలువడిన కమిటీ రిపోర్టులన్నీ నొక్కి చెప్పాయి. ఆ లెక్కన గడిచిన బడ్జెట్లో కనీసం 10 లక్షల కోట్లయినా విద్యారంగం పద్దులో పెట్టాలి. కానీ కేంద్రం 99 వేల కోట్లను మాత్రమే కేటా యించింది. వాంఛిత కేటాయింపులో ఇది కేవలం పది శాతం. ఇందులో కూడా వాస్తవానికి ఎంత ఖర్చు చేశారో తెలియాలంటే సవరించిన అంచనాలు రావాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చిన దగ్గర్నుంచీ విద్యారంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల కథాకమామీషు ఇదే మాదిరిగా ఉన్నది. తొలిరోజుల్లో విద్యాగంధం ఉన్న కుటుంబాల్లోని పిల్లలు తల్లిదండ్రుల శ్రద్ధ వలన సహజంగానే ముందడుగు వేశారు. వీరికి తోడుగా బడి చదువుతోపాటు ట్యూషన్లు చెప్పించుకునే స్థోమత కలిగిన వాళ్లు మాత్రమే స్కూల్ ఫైనల్ గడప దాటేవాళ్లు. నిరక్షరాస్య కుటుంబాల్లోని పేద పిల్లలు మాత్రం ఆ గడపకు ఆవలనే డ్రాపవుట్లుగా మిగిలిపోయేవారు. ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్ల తర్వాత ఈ సామాజిక దుర్నీతి మరింత క్రూరంగా తయారైంది. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు వెళ్లగలిగిన పిల్లలు ముందడుగు వేశారు. ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా పాడుపెట్టారు. తొలిదశ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యే నాటికే ఉమ్మడి రాష్ట్ర పాలనా పగ్గాలను తస్కరించిన చంద్రబాబు నాయకత్వంలో ఈ సామాజిక విధ్వంసం యథేచ్ఛగా సాగిపోయింది. పేద పిల్లలు వెళ్లగలిగే ప్రభుత్వ బడుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ బడులను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేయలేదు. ఇదే సమయంలో ఐటీ విప్లవం ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనుక్కోలేకపోయిన యువతరం ఆ అవకాశాలను అంది పుచ్చుకోవడంలో విఫలమైంది. పేదవర్గాల్లోని ఒక తరం కలలు విద్యావ్యాపారం రథచక్రాల కింద నలిగిపోయాయి. పేదవర్గాల ప్రజలు నాణ్యమైన విద్యకు మూడు దశాబ్దాల పాటు దూరం కావడానికి కారణమైన బాధ్యుల్లో ఒకటో నెంబర్ ముద్దాయిగా చంద్రబాబునే నిలబెట్టవలసి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ఆయన విద్యారంగం పట్ల తన పాత విధానాలనే కొనసాగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ఘోరంగా ఓడించి అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా చెప్పాలంటే ఆయన విప్లవ శంఖం పూరించారు. విద్యార్జనలో పెరిగిన ధనిక – పేద అంతరాలు, సామాజిక– ఆర్థిక హోదాల ప్రాతిపదికపై పిల్లలు వేర్వేరు బడుల్లో చదవడానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ దుష్పరిణామాలను పరిహరించి కుల మత ప్రాంత లింగ వివక్ష లేకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా పిల్లలంతా ఒక్కటిగా కలివిడిగా చదువుకునే ఒక ప్రణాళికను ఏపీ ముఖ్యమంత్రి తయారు చేసుకున్నారు. వెంటనే దాన్ని దశల వారీగా అమలుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల్లో మొదటిది – ‘అమ్మ ఒడి’ పిల్లల్ని స్కూలుకు/ కాలేజీకి పంపించే ప్రతి అర్హురాలైన తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్నది. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపించలేని దుఃస్థితి తొలగిపోవడం మొదటిది. రెండవది మహిళా సాధికారతకు సంబంధించిన అంశం. అమ్మ చేతిలో డబ్బున్న కారణంగా పిల్లల చదువుకు సంబంధించిన కీలక నిర్ణయాధికారం ఆమెకే ఉంటుంది. సంస్కరణల్లో రెండో ముఖ్యాంశం 16 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమం. కేవలం టాయిలెట్ వసతి లేని కారణంగా ఆడపిల్లలు చదువులు మానేసే దౌర్భాగ్య పరిస్థితి మొన్నటిదాకా మన విద్యావ్యవస్థలో రాజ్యమేలింది. పెచ్చు లూడుతున్న సీలింగ్, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గది గోడలు, విరిగిన కుర్చీలు – బెంచీలు, పగుళ్లుబారిన ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్ లేక పశువులకు ఆవాసంగా మారిన ఆవరణ, పిచ్చిమొక్కలతో విషపురుగుల విహారం, శిథిలాలయాలకు రాలేక సెలవులతో నెట్టుకొచ్చే పంతుళ్లూ... ఇది మొన్నటివరకు ప్రభుత్వ బడి దృశ్యం. ఇప్పుడు కళ్లతో చూస్తే తప్ప నమ్మలేనంతగా ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే 16 వేల స్కూళ్లు కార్పొరేట్‌కు దీటుగా సింగారించు కున్నాయి. ఇప్పుడు పేద పిల్లల్నే కాదు స్థితిమంతుల పిల్లల్ని కూడా అవి రా రమ్మని పిలుస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫామ్, షూ, బెల్ట్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో లభిస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమం సులభంగా అర్థమయ్యే విధంగా రెండు భాషల్లో ఉండే పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పౌష్టికాహారాన్ని నిత్యం 40 లక్షలమందికి అందజేస్తున్నారు. నాణ్యమైన సీబీఎస్ మూల్యాంకన విధానాన్ని కూడా దశల వారీగా ప్రవేశ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల అధ్యయనం తర్వాత ప్రకటించిన ‘నూతన విద్యావిధానం–2020’లో పొందుపర్చిన అంశాల్లో అనేకం ఏడాది ముందుగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించడం ఒక విశేషం. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ‘నీతి ఆయోగ్’ ప్రశంసించింది. పేద కుటుంబాల జీవితాల్లో గేమ్ ఛేంజర్ లాంటి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచే అమలుచేయడం ప్రారంభించారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి తొలిదశలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం నిర్ణయం వెనుక దృఢంగా నిలవడంతో రాజకీయ ప్రతిపక్షాలు జడుసుకొని నోరు మూసు కున్నాయే తప్ప కుట్రలను మాత్రం ఆపలేదు. ప్రభుత్వం చేపట్టిన పలురకాల చర్యల వలన స్థోమత కలిగిన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. అన్నివర్గాల పిల్లలూ కలిసి మెలిసి చదువుకోవడం వల్ల సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. దేశ సమగ్రత బలపడుతుంది. పేదరిక నిర్మూలనకు, కులమత తారతమ్యాలను అంతం చేయడానికి ఉపయోగపడే ఈ నాణ్యమైన విద్యాయజ్ఞాన్ని పూర్తిచేయడం అంత సులభసాధ్యమైనదేమీ కాదు. యాగ భంగానికి మారీచ సుబాహులు పొంచివున్నారు. కుల మతాలకు అతీతంగా పేదవర్గాల ప్రజలందరూ యాజ్ఞికునికి అండగా నిలబడవలసిన తరుణమిది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంగ్లిషు మీడియాన్ని ప్రకటించడమే గాక సర్కారు బళ్ల రూపురేఖల్ని మార్చే కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఇక స్పందించవలసినది కేంద్ర ప్రభుత్వమే! విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థిక వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే ఉన్నాయి. నూతన విద్యావిధాన ప్రకటన అభిలషించినట్లుగా 6 శాతం జీడీపీని విద్యా పద్దు కింద ఈ బడ్జెట్లో కేటాయిస్తారో లేదో చూడాలి. విద్యారంగానికి ఆయా దేశాలు చేస్తున్న కేటాయింపుల జాబితాను చూస్తే బాధ కలుగుతుంది. 198 దేశాలున్న జాబితాలో మనది 144వ స్థానం. ప్రపంచం మొత్తంలో ఉన్న పేదల్లో సగంమంది మన దేశంలోనే ఉన్నారు. వీరిని పేదరికం నుంచి బయటపడేసే బ్రహ్మాస్త్రం నాణ్యమైన విద్య. అందువల్ల అన్ని దేశాల కంటే ఎక్కువ కేటాయింపులు చేయవలసిన అవసరం మన దేశంలో ఉన్నది. కనీసం ఈ రంగంలో ప్రగతిబాటలో పయనిస్తున్న రాష్ట్రాలకైనా ప్రోత్సాహకాలను ప్రకటించడం అత్యవసరం. ఈ దేశ ప్రత్యేక అవసరాల దృష్ట్యా, కోవిడ్ మహమ్మారి కలిగించిన విపరి ణామాల దృష్ట్యా ఈ బడ్జెట్లో విద్యారంగానికి పెద్దయెత్తున కేటాయింపులుంటాయని ఆశిద్దాం. ఈ ఆశ నెరవేరినట్లయితే ఈ దేశ పేదింటి బిడ్డలు ప్రభుత్వాన్ని సరస్వతీ దేవిగా భావించి, పూజిస్తారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆధార్– ఓటర్ ఐడీ అనుసంధానానికి లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ నెంబర్‌తో అనుసంధానించడం సహా పలు ఎన్నికల సంస్కరణలు పొందుపరిచిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. బిల్లును హడావుడిగా తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేసిన విపక్షాలు, దీన్ని స్టాండింగ్ కమిటీ (లా అండ్ జస్టిస్) పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. చివరకు మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఎన్నికల చట్ట సవరణ బిల్లు –2021ను సోమవారం న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఓటర్ ఐడీ– ఆధార్‌ను లింక్ చేయడం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనివల్ల పౌరుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలుగుతుందని, దేశ పౌరులు కాని వారు కూడా ఓటేసే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆధార్ లింకింగ్‌తో పాటు కొత్త ఓటర్ల నమోదుకు నాలుగు కటాఫ్ డేట్లను (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) నిర్ణయించడం, సర్వీసు ఓటర్ నిబంధనలో మార్పును బిల్లులో పొందుపరిచారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో రూ. 3.73 లక్షల కోట్లను వ్యయం చేసుకునేందుకు వీలుకల్పించే సప్లిమెంటరీ గ్రాంట్స్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో రూ.62 వేల కోట్లను ఎయిర్ఇండియాకున్న పాత అప్పులు, ఇతరత్రా బకాయిలను చెల్లించడానికి, రూ. 58 వేల కోట్లను ఎరువుల సబ్సిడీకి, రూ. 53 వేల కోట్లను ఎగుమతుల ప్రోత్సాహక బకాయిలను చెల్లించడానికి, రూ. 22 వేల కోట్లను గ్రామీణాభివృద్ధికి వెచ్చిస్తారు. ఒమిక్రాన్‌పై పోరుకు సిద్ధం కరోనా కొత్త వేరియంట్‌పై పోరుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో చెప్పారు. రాబోయే రెండు నెలల్లో దేశ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 45 కోట్ల డోసులకు పెంచుతామని తెలిపారు. ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. దేశంలో ఇంతవరకు 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్నారు. మరోవైపు మీడియేషన్ (మధ్యవర్తిత్వ) బిల్లును స్టాండింగ్ కమిటీకి, బయోడైవర్సిటీ బిల్లును జాయింట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం రాజ్యసభ ఎన్డీపీఎస్ చట్టానికి ఆమోదం తెలిపింది. సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ఎందుకింత హడావుడి? ఎన్నికల చట్ట సవరణల బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని విపక్షాలు దుయ్యబట్టాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభవ్వగానే ఈ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించారు. అయితే విపక్ష ఎంపీలు మరోసారి ఆందోళన చేపట్టడంతో మరో 45 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం 2.45గంటలకు లోక్‌సభ మళ్లీ సమావేశమైంది. బిల్లును తీసుకురావడంలో ప్రభుత్వం తొందరపాటు చూపిందని, తగిన నిబంధనలు పాటించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరాయి. అయితే పుట్టుస్వామి కేసులో వ్యక్తిగత గోపత్య ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడే ఈ బిల్లును తెచ్చామని, దీనివల్ల ఎవరైనా ఒక్కచోట మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోగలరని, ఒక్కరే వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదై ఉంటే... అలాంటివి గుర్తించి ఏరివేయవచ్చని మంత్రి రిజిజు వివరణ ఇచ్చారు. తద్వారా పారదర్శక ఎన్నికలు జరపవచ్చని అన్నారు. సుప్రీం జడ్జిమెంట్‌లో పేర్కొన్న అన్ని అంశాలకు అనుగుణంగానే బిల్లు రూపొందిందన్నారు. అలాగే ఆధార్‌తో అనుసంధానం స్వచ్ఛందమని స్పష్టం చేశారు. ఆధార్‌తో లింక్ చేయలేదని ఏ ఒక్కరి ఓటునూ తొలగించడం జరగదన్నారు. లా అండ్ పర్సనల్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఇప్పటికే బిల్లులో చేర్చినందున మరలా దీన్ని స్టాడింగ్ కమిటీకి పంపాల్సిన పనిలేదన్నారు. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అయితే బిల్లులో ‘‘ఆధార్ నెంబరు ఇవ్వలేకపోతున్నందువల్ల (నిర్దేశించే సముచిత కారణాన్ని చూపితే)... కొత్తగా ఓటరు నమోదు కోసం వచ్చే ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించ కూడదు, ఓటరు జాబితాలోని ఏ ఒక్క పేరునూ తొలగించడానికీ వీల్లేదు’’ అని మెలిక ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. -
పీఈ, వీసీ ఇన్వెస్టర్లతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)/వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఇన్వెస్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన ఆచరణాత్మక సిఫార్సులను ప్రశంసించిన ప్రధాని .. వారు లేవనెత్తిన సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. సమావేశం సందర్భంగా మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెట్టుబడులకు సానుకూల పరిస్థితులు .. దేశీయంగా వ్యవస్థాపక సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని, భారత స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని పీఈ, వీసీ ఫండ్ల ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. భారత్‌లో పెట్టుబడుల వాతావరణం మరింత సానుకూలంగా మారిందని సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి మునీష్ వర్మ చెప్పారు. దేశంలోకి పెట్టుబడులు పుష్కలంగా వస్తుండటం, ఎదుగుతున్న ఎంట్రప్రెన్యూర్లు, స్టాక్ ఎక్సే్చంజీల్లో కంపెనీలు పెద్ద సంఖ్యలో లిస్టవుతుండటం తదితర అంశాలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేసేందుకు ఇటువంటి సమావేశాలు స్ఫూర్తినిస్తాయని జనరల్ అట్లాంటిక్ ప్రతినిధి సందీప్ నాయక్ తెలిపారు. భారత్‌లో ఇప్పటికే 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశామని, వచ్చే పదేళ్లలో 10 నుంచి 15 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన వివరించారు. అంకుర సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ మోదీని ’స్టార్టప్ ప్రధానమంత్రి’ అంటూ 3వన్4 ప్రతినిధి సిద్ధార్థ్ పాయ్ అభివర్ణించారు. -
సంస్కరణలు పెద్ద ఎత్తున చేపట్టాలి
న్యూఢిల్లీ: భారత్‌కు మరిన్ని సంస్కరణలు అవసరమని, అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు 2021ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగుమతులు గణనీయంగా పెరిగిన సందర్భాల్లోనే భారత్ వృద్ధి సాధించినట్టు గుర్తు చేశారు. భారత్ పోటీనిచ్చేలా ఉండాలని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.. తదుపరి మరిన్ని సంస్కరణలు చేపట్టే విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘సంపద సృష్టి ప్రైవేటు రంగం ద్వారానే సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. వారికి (పారిశ్రామికవేత్తలకు) పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చూడడమే ప్రభుత్వం చేయాల్సిన పని. ఉత్ప్రేరకంగా, సదుపాయ కల్పనదారుగానే ప్రభుత్వం వ్యవహరించాలి. సంస్కరణలను ఈ దిశగానే ముందుకు నడిపించాలి’’ అని కాంత్ చెప్పారు. -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్‌కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్‌దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
Disha Encounter: ‘దిశ’ తండ్రి ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజున తెలంగాణ పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. రియల్ హీరోలు అంటూ ప్రశంసించారు. సామాన్యంగా పోలీసులంటే జనాల్లో ఉండే భయం ఆ రోజు దూరమయ్యింది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. వారిని హీరోలుగా చేసిన సంఘటన ఏంటంటే.. 2019, నవంబర్ 27న ఓ అమ్మాయిపై మృగాళ్లు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఆ దారుణం ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మృగాళ్లకు ఎన్‌కౌంటరే సరైన శిక్ష అని ప్రజలు భావించారు. ఈ క్రమంలో 2019 డిసెంబర్ 6న తెల్లవారు జామున ‘దిశ’ను హతమార్చిన నలుగురిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ సంఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. పోలీసులపై జనాలు పూల వర్షం కురిపించారు. (చదవండి: ‘దిశ’హత్యాచార ఘటన: పోలీసులు చెప్పిందే నమోదు చేస్తారా? ) ఎన్కౌంటర్ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ క్రమంలో దారుణం చోటు చేసుకున్న రెండేళ్లు పూర్తయినప్పటికి.. దిశ కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి కోలుకోలేదు. ఈ క్రమంలో దిశ తండ్రి మాట్లాడుతూ.. ‘‘లైంగిక నేరగాళ్లకు కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్న సమయంలో న్యాయవ్యవస్థ సత్వరమే స్పందించాలి. నెల రోజుల్లోగా నిందితులకు కఠిన శిక్ష విధించాలి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేయకపోతే.. బాధితులకు, వారి కుటుంబాలకు ఎన్నటికి న్యాయం జరగదు’’ అన్నారు. (చదవండి: మళ్లీ తెరపైకి దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన) సమాజంలో ఇలాంటి దారుణాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు లైంగిక నేరాల పట్ల అవగాహన కల్పించాలి. ఇలాంటి దారుణాలు నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో వారికి శిక్షణ ఇవ్వాలి అని కోరారు. చదవండి: Disha Encounter: సంచలనం.. చర్చనీయాంశం -
ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొడతాం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొట్టే పూర్తి సమర్థత భారత నావికాదళానికి ఉందని చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ హరి కుమార్ చెప్పారు. త్రివిధ దళాలల్లో ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను ఆయన సమర్థించారు. మారిటైమ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయాలనుకోవడం మంచి ఆలోచన అని చెప్పారు. శుక్రవారం నావికాదళ దినోత్సవం(నావీ డే) సందర్భంగా హరికుమార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కోవిడ్–19 మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే ఉత్తర సరిహద్దుల్లో భద్రతపరంగా సంక్లిష్టమైన పరిస్థితులు తలెత్తాయని గుర్తుచేశారు. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇది మనకు పరీక్షా సమయమని, అందుకే తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం కదలికలను నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సిద్ధంగా ఉందని తెలిపారు. మన నావికాదళానికి అవసరమైన 72 ప్రాజెక్టులను రూ.1.97 లక్షల కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. ఇందులో రూ.1.74 లక్షల కోట్ల విలువైన 59 ప్రాజెక్టులను దేశీయంగానే అమలు చేయనున్నట్లు వివరించారు. మారిటైమ్ థియేటర్ కమాండ్ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని, మరో ఆరు నెలల్లో ఖరారు కానుందని అడ్మిరల్ హరికుమార్ పేర్కొన్నారు. యుద్ధ నౌకల్లో కీలకమైన విధుల్లో మహిళలను సైతం నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐఎన్ఎస్ విక్రమాదిత్యతోసహా 15 భారీ యుద్ధనౌకల్లో 28 మంది మహిళా అధికారులను నియమించామన్నారు. ఈ సంఖ్య మరింత పెరగనుందని వెల్లడించారు. -
మద్దతు ధరకు చట్టబద్ధత
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసిన రైతన్నలు ఇక కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టనున్నారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేంతవరరు ఉద్యమాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమావేశమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శన చేయాలని నిర్ణయానికొచ్చింది. సోమవారం లక్నోలో మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించి, కేంద్రానికి రైతుల బలమేంటో మరోసారి చూపిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా రైతన్నల కష్టాలు తీరవు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమే అతి పెద్ద సంస్కరణ’’ అని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో పాటు తాము చేస్తున్న డిమాండ్లన్నీ కేంద్రం నెరవేర్చేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందుకోసం మరోసారి ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆరు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిపై తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి. 29న పార్లమెంట్ వరకూ ర్యాలీ తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను రైతులు ముమ్మరం చేయనున్నారు. సోమవారం లక్నోలో కిసాన్ పంచాయత్‌తో పాటు ఈ నెల 26న ఢిల్లీలో అన్ని సరిహద్దుల్లో మోహరిస్తామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అంటే ఈ నెల 29న పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాలే వెల్లడించారు. 24న కేంద్ర కేబినెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అవసరమైన అధికార ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నెల 24న (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల కంటే ముందుగానే కేబినెట్ సమావేశమై చట్టాల రద్దుపై చర్చించి దానికి అవసరమైన తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఆపై ఉపసంహరణ బిల్లుకు తుదిరూపమిస్తారు. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. ఎంఎస్పీకి చట్టబద్ధతతోపాటు మొత్తం ఆరు డిమాండ్లపై రైతులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘11 రౌండ్ల చర్చల తర్వాత ద్వైపాక్షిక పరిష్కార మార్గం కనుగొనడం కంటే మీరు(ప్రధాని మోదీ) ఏకపక్ష తీర్మానానికే మొగ్గుచూపారు’’ అని లేఖలో ప్రస్తావించింది. రైతు సంఘాల ఆరు డిమాండ్లు ► పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలి. ► గత ఏడాది కాలంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ► పోరాటంలో రైతుల ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక స్మారక స్తూపం నిర్మించాలి. ► పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు–2020/21 ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. ‘‘దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం–2021’ లో రైతులపై జరిమాన విధించే అంశాలను తొలగించాలి. హా లఖీమీపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి. -
దుష్ప్రచారం చేస్తే సహించం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కొందరు దీన్ని జీర్ణించుకోలేక పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని, ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు ప్రచారం చేయడంపై సోమవారం ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. రాష్ట్రంలో పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు గాను అమ్మ ఒడి కింద ఇచ్చే నగదు నుంచి వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చిన రూ. 444.89 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తం 45,716 పాఠశాలల్లో ఇప్పటికే ఆయాలను నియమించామని తెలిపారు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒకరు, 600 మంది ఉన్న పాఠశాలల్లో ఇద్దరు, 900 మంది ఉన్న పాఠశాలల్లో ముగ్గురు, 900 పైబడి విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో నలుగురు చొప్పున ఆయాలను నియమించామని చెప్పారు. ఆయాలకు నెలకు రూ.6,000 చొప్పున జీతం చెల్లిస్తున్నామని వివరించారు. మరుగుదొడ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కెమికల్ కిట్లను కూడా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. -
‘ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పి?’
అమరావతి: ఎయిడెడ్ విద్యా సంస్థలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఏపీ ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయ్‌బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎయిడెడ్ సంస్థల్ని ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు నొప్పని ప్రశ్నించారు..?! ప్రజలకు మేలు చేయడానికే విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రక్షాళన అవసరమని విజయ్‌బాబు పేర్కొన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ విలీనంపై అభ్యంతరం లేదు: రాజీవ్,ఎయిడెడ్ స్కూల్స్ యజమాని అమరావతి: నాడు-నేడుతో విద్యారంగంలో.. మంచి వాతావరణం నెలకొందని రాజీవ్, ఎయిడెడ్ స్కూల్స్ యజమాని తెలిపారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. ఈ స్కూల్స్ విలీనంపై తమకు ఎలాంటి అభ్యంతరంలేదని, వీటి ప్రక్షాళనపై ప్రభుత్వ పాలసీ బాగుందని తెలిపారు. దీనికోసం ప్రభుత్వం.. ఐదారు నెలలుగా కమ్యూనికేట్ చేసి ప్రక్షాళన చేస్తున్నారని ఎయిడెడ్ స్కూల్స్ యజమాని పేర్కొన్నారు. చదవండి: ఎల్లో మీడియా పత్రికా విలువల్ని పాటించాలి: మంత్రి సురేష్ -
సంస్కరణలతో వృద్ధి వేగవంతం
న్యూఢిల్లీ: సంస్కరణలు, సరళీకరణ విధానాల బాటలో మరింత ముందుకు వెళ్లడం ద్వారా భారత్ కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి వేగంగా బయటపడుతుందని, అంతర్జాతీయంగా మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఎయిర్ ఇండియా విక్రయం ఒక మైలురాయిగా అభివరి్ణంచింది. పలు దేశాలకు వ్యాక్సినేషన్ సరఫరాలను చేసి కోవిడ్–19 మహమ్మారిపై పోరులో భారత్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని కూడా పేర్కొంది. కోవిడ్–19 మహమ్మారి సమయంలో భారత్ భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం సానుకూల అంశమని ఐఎంఎఫ్–ఎస్టీఐ ప్రాంతీయ శిక్షణా సంస్థ డైరెక్టర్, ఐఎంఎఫ్ (ఇండియా) మాజీ మిషన్ చీఫ్ ఆ్రల్ఫెడ్ షిప్కే పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ఇటీవలి సంవత్సరాలలో వ్యవసాయం, రక్షణ, టెలికమ్యూనికేషన్ సేవలు, బీమా రంగాల్లో ప్రభుత్వ ఇటీవలి సరళీకరణ విధానాలు దేశానికి భారీగా ఎఫ్‌డీఐలను ఆకర్షించడానికి దోహదపడ్డాయి. ఇది కరెంట్ ఖాతా ఫైనాన్సింగ్ పరిస్థితిని మెరుగుపరిచింది. దీనితోపాటు అంతర్జాతీయ ఒడిదుడుకులను భారత్ తట్టుకోడానికి దోహదపడింది. బయోటెక్నాలజీ, రక్షణ, డిజిటల్ మీడియా, ఔషధ రంగాల వంటి కీలక విభాగాల్లో సరళీకరణల వల్ల దేశం మరింత భారీగా ఎఫ్డీఐఅను ఆకర్షించే అవకాశం ఉంది. ► ఆయా సరళీకరణ విధానాలకు భూ, కార్మిక రంగాలకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలూ మద్దతునివ్వాలి. అలాగే పాలనా, నియంత్రణ, న్యాయ వ్యవస్థల మరింత పటిష్టతకు సంస్కరణలను అనుసరించాలి. ► మహమ్మారి వల్ల గడచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహమ్మారి నుంచి అందరూ బైటపడేంతవరకూ ఏ ఒక్కరూ సురక్షితం కాబోరు. ► మహమ్మారి ప్రభావం నుంచి వ్యవస్థలు బయటపడ్డానికి భారత్ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేపట్టిన పలు పాలనా, ద్రవ్యపరమైన చర్యలు సత్ఫలితాలను అందించాయి. సామాన్యుని ఆహార భద్రతకు కేంద్రం చర్యలు హర్షణీయం. ► ఆరోగ్య రంగంలో అన్ని దేశాల సన్నిహిత సమన్వయం అవసరం. ప్రత్యేకించి వ్యాక్సినేషన్ విషయంలో ఇది కీలకం. తద్వారానే ప్రపంచం మహమ్మారి సవాళ్ల నుంచి బయటపడగలుతుంది. వైద్యరంగంతోపాటు విద్యా రంగంలో పురోగతి సమాజాభివృద్ధికి దోహదపడుతుంది. ఈ మేరకు ప్రభుత్వాల చర్యలు తీసుకోవాలి. -
ప్రైవేట్‌పై చైనా కొరడా మతలబు?!
మావో అనంతర పాలకులు కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, రాజ్యాంగాన్ని మార్చడంద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, పట్టణ–గ్రామీణ, తీరప్రాంత– మైదాన ప్రాంతాల మధ్య విభజనలు బాగా పెరిగాయి. గత మూడు దశాబ్దాలుగా చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాంతానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయత్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యాసాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆర్థిక కొలమానాల్లో అత్యున్నత స్థానంలో ఉంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితిలో మాత్రం లేదు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి పరిణామాలు, ప్రత్యేకించి అలీబాబా గ్రూప్, ఎవెర్ గ్రాండే వంటి ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొన్న సమస్యలు... చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త్రీ రెడ్ లైన్ పాలసీపై, ప్రైవేట్ రంగంపై ప్రభుత్వ వైఖరి, దాని ఉద్దేశాలపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. చైనా స్థూల దేశీయోత్పత్తిలో 60 శాతం, సాంకేతిక ఆవిష్కరణల్లో 70 శాతాన్ని ప్రైవేట్ రంగమే అందిస్తోంది. 1995లో ప్రైవేట్ రంగం చైనాలో 18 శాతం ఉద్యోగా లను కల్పించగా 2018లో అది 87 శాతానికి పెరిగింది. చైనా ఎగు మతులు ఇదే కాలానికి గాను 34 శాతం నుంచి 88 శాతానికి పెరి గాయి. పై ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందు చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్మాణమైందో మనం అర్థం చేసుకోవడానికి అయిదు అంశాలను పరిశీలించాలి. మొదటిది: 1950లు, 60లలో మావో సేటుంగ్ పాలనలో నిఖా ర్సైన కమ్యూనిస్టు సైద్ధాంతిక పునాదిపై, అటు సోవియట్ సహాయం, ఇటు స్వావలంబనకు పిలుపివ్వడం అనే రెండింటి సమ్మేళనంతో, దేశంలో పారిశ్రామిక పునాదిని నిర్మించడంపై చైనా గట్టిగా కృషి చేసి మరీ విజయం సాధించింది. అయితే 1970లు, 80లలో డెంగ్ జియాంవో పింగ్ అంతర్జాతీయ సహకారంతో ఆర్థికాభివృద్ధిపై ఎక్కు వగా దృష్టిపెట్టారు. 1990లలో నాటి దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ సైద్ధాంతిక, ఆర్థిక రంగాల్లో సంస్కరణలతో చైనాను అత్యధిక వృద్ధి స్థాయికి తీసుకెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, ఈ మేరకు రాజ్యాం గంలో కూడా మార్పులు తీసుకోవడం ద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ యాజమాన్యానికి పలు హక్కులు కల్పిస్తూ ఒక నిబంధనను చేర్చారు. ప్రైవేట్ వ్యాపారులు కమ్యూనిస్టు పార్టీ నియం త్రణలో పనిచేయాల్సి ఉందని, పార్టీ పాలనకు వారు బేషరతుగా లోబడి ఉండాలని షరతు కూడా విధించారు. రెండు: ఈ విధానాల ఫలితంగా, 1978 నుంచి 2003 నాటికి ఎగుమతుల పరిమాణం 28 రెట్లకు పెరిగింది. 1952 నుంచి 1978 కాలంలో ఎగుమతుల్లో సాధించిన రెండు రెట్ల వృద్ధితో పోలిస్తే ఇది భారీ స్థాయి వృద్ధి అని చెప్పాలి. 1978–2003 కాలంలో సంస్కరణలు అమలు చేసి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించడానికి సుంకాలు, పన్నులు, వాణిజ్య ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తూ నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పారు. ఎగుమతులను, అత్యున్నత టెక్నాల జీని దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించడమే వీటి లక్ష్యం. దీంతో 1952లో చైనా జీడీపీలో పారిశ్రామిక రంగ వాటా 8 శాతం మాత్రమే ఉండగా, 2003 నాటికి 52 శాతానికి పెరిగింది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 1952లో 4.6 శాతం ఉండగా 2003 నాటికి 15 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామికోత్పత్తిలో విదేశీ మదుపు సంస్థల వాటా 1990లో 2.3 శాతం ఉండగా 2003 నాటికి అది 35.9 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. మూడు: 2003 నుంచి 2013 వరకు ఒక దశాబ్ది కాలంలో చైనా వార్షిక వృద్ధి రేటు 10.3 శాతంగా నమోదైంది. 2007 నాటికి 14.2 శాతం నమోదుతో ప్రపంచంలోనే అత్యన్నత వృద్ధి రేటును చైనా సాధించింది. 2008–2019 దశాబ్దంలో ఆర్థిక మాంద్య కాలంలో చైనా సగటు వృద్ధి రేటు 7.99 శాతానికి నమోదైంది. ఇది ఆ దశాబ్దంలో ఏ దేశమూ సాధించినంత అధిక వృద్ధి రేటు. 2004లో చైనా వస్తుతయారీ రంగం 625 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేయగా 2019 నాటికి అది 3,896 బిలియన్లకు అమాంతంగా పెరిగింది. ఈ అసాధా రణమైన వృద్ధిరేటు వల్ల చైనా 2011లోనే ప్రపంచ తయారీరంగ కార్ఖానాగా మారింది. ఆ నాటికి ప్రపంచ తయారీరంగ ఉత్పత్తిలో చైనా వాటా 28.4 శాతంగా నమోదైంది. 2010లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. నాలుగు: ఆర్థిక రంగ సంస్కరణలు ప్రైవేట్ భాగస్వామ్యానికి చోటు కల్పించినప్పటికీ, చైనా ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం జీడీపీలో 23 నుంచి 27 శాతం వాటాను సాధించాయి. ఇవి పారి శ్రామిక రంగంలో 21 శాతం వాటాను కలిగి ఉండగా, నిర్మాణ రంగంలో 38.5 శాతం, హోల్‌సేల్, రిటైల్ రంగంలో 39 శాతం వాటాను, రవాణా, నిల్వ రంగంలో 77 శాతం వాటాను సాధించాయి. ఇక మొత్తం ద్రవ్యరంగంలో 88 శాతం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో 24.6 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ సంస్థలకు చోటు దక్కగా చైనా నుంచి 9 సంస్థలు స్థానం సంపాదించాయి. 2017 నాటికి ఈ జాబితాలో మొత్తం 102 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 77 సంస్థలు చైనాకు సంబంధించినవే ఉండటం గమనార్హం. చైనా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు 2017లో 22,310 బిలియన్ డాలర్లతో రికార్డు సృష్టించాయి. కాగా మొత్తం 7,676 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సరకులను అమ్మగలిగాయి. ప్రత్యేకించి బొగ్గు, ఇనుము పెద్దగా లేని లోహాలు, ఉక్కు, విద్యుత్తు, నిర్మాణ పరి శ్రమ వంటి రంగాల్లోకి చైనా భారీ పెట్టుబడులను తరలించింది. వీటిలో కొన్ని పరిశ్రమలను అధికోత్పత్తి సామర్థ్యతతో నిర్మించారు. చైనా 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరింది. అప్పటినుంచి 2015 నాటికి 15 సంవత్సరాల వ్యవధిలో ఏటా 13 శాతం సగటు ఉత్పత్తి రేటుతో చైనా ఉక్కు ఉత్పత్తిని అతి భారీ స్థాయిలో కొనసాగించింది. ఒక్క ఉక్కు రంగంలోనే 2018లో 8.1 శాతం వృద్ధి రేటుతో 928 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని, సిమెంట్ రంగంలో 895 మిలియన్ టన్నుల అధికోత్పత్తి సామర్థ్యాన్ని చైనా సాధించింది. ఇది ప్రపంచ అధికోత్పత్తి సామర్థ్యంలో 45 శాతా నికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయిదు: చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థ 2016 నాటికి యూరో పియన్ యూనియన్ బ్యాంకింగ్ వ్యవస్థకంటే పెద్దదిగా మారింది. చైనా బ్యాంకుల సొంత ఆస్తుల విలువ 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది చైనా జీడీపీకి 3 రెట్లు ఎక్కువ. 2001 నుంచి చైనా బ్యాంకులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారీ స్థాయి మౌలిక వస తుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు అందించాయి. దీంతో అధికోత్పత్తి సామర్థ్యం కలిగిన చైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లు నిర్మాణ రంగ సామగ్రిని ఈ దేశాలకు భారీగా పంపించగలిగాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ 2017లో నిర్వహించిన 19వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మార్క్సిస్ట్ దృక్పథం, వైధానికం తోడుగా 2049 నాటికి చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా మలుద్దామని పిలుపు నిచ్చింది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, గత మూడు దశాబ్దాల్లో పట్టణ–గ్రామీణ, తీరప్రాంత–మైదాన ప్రాంతాల మధ్య విభజనలు పెరి గాయి. 2019 నాటికి ఈ విభజన భారీ స్థాయికి చేరుకుంది. తీర ప్రాంతాల్లో నివసించే ఒక శాతం జనాభా దేశ మొత్తం సంపదలో 13 శాతాన్ని అదుపులో ఉంచుకున్నది. దీంతో చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాం తానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయ త్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యా సాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపి స్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు చైనా ఆర్థిక వ్యవస్థ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితితో అయితే లేదు. డా. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ ‘ మొబైల్: 79089 33741 -
Power Sector: భారీ సంస్కరణలు.. అమ్మకానికి ‘లైన్లు’!
సాక్షి, హైదరాబాద్/అమరావతి: దేశంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలకు రంగం సిద్ధం చేసింది. ‘ఎలక్ట్రిసిటీ (ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్) రూల్స్–2021’ను అమల్లోకి తెచ్చినట్టు కేంద్ర విద్యుత్ శాఖ ఆదివారం ప్రకటించింది. రాష్ట్రాలు తమ అధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌లను అమ్ముకోవడానికి, ఇతరుల నుంచి కొనుక్కోవడానికి.. పంచుకోవడానికి కూడా దీనితో అవకాశం ఉండనుంది. ఈ వెసులుబాట్లు రాష్ట్రాలతోపాటు విద్యుదుత్పత్తి కంపెనీలకూ వర్తించనున్నాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్ల విక్రయానికి వీలు కల్పిస్తూ కేంద్రం ఇటీవలే మార్గదర్శకాలు ఇచ్చింది. తాజాగా విద్యుత్ సంస్థల యాజమాన్యంలోని ట్రాన్స్మిషన్ లైన్ల విక్రయానికి వీలు కల్పించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక రీజియన్ నుంచి మరో రీజియన్‌కు విద్యుత్ సరఫరాకు సరిపడా ట్రాన్స్మిషన్ వ్యవస్థ లభ్యత ఉండేలా చూడటం కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు కేంద్రం పేర్కొంది. తెరపై కొత్త యాక్సెస్ విధానం విద్యుదుత్పత్తి కంపెనీలు తాము ఉత్పత్తి చేసే కరెంటును అమ్ముకోవడానికి ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘పవర్‌గ్రిడ్ కార్పొరేషన్’దేశవ్యాప్తంగా అంతర్రాష్ట ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను నిర్మించి నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను ఆధారంగా చూపి ఈ అంతర్రాష్ట ట్రాన్స్మిషన్ వ్యవస్థను వినియోగించుకోవడం కోసం (లాంగ్ టర్మ్ యాక్సెస్) పవర్‌గ్రిడ్‌కు దరఖాస్తు పెట్టుకుంటున్నాయి. అయితే కేంద్రం తాజాగా లాంగ్‌టర్మ్ యాక్సెస్‌కు బదులు జనరల్ నెట్వర్క్ యాక్సెస్(జీఎన్ఏ) అనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనితో విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని పొందడం, బదిలీ చేయడం వంటివి చేయొచ్చు. స్వల్ప, మధ్యకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోలుకు వెసులుబాటు కలగనుంది. దీనికోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చూపాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధానం ద్వారా ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్వహణ, చార్జీల వసూళ్లలో హేతుబద్దత వస్తుందని కేంద్రం తెలిపింది. వసూళ్ల బాధ్యతలు పవర్‌గ్రిడ్‌కు.. ట్రాన్స్మిషన్ వ్యవస్థల కోసం జరిగిన ఒప్పందాలన్నీ కొత్త విధానం కింద జీఎన్‌ఏలుగా మారనున్నాయి. అంతేకాదు నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వారి నుంచి ట్రాన్స్మిషన్ చార్జీల వసూలు, బిల్లింగ్, కలెక్షన్, పంపిణీ బాధ్యతలన్నీ పవర్‌గ్రిడ్‌కు వెళ్లనున్నాయి. ఒప్పంద సామర్థ్యానికి మించి అధిక విద్యుత్ తీసుకున్నా, సరఫరా చేసినా 25 శాతంచార్జీలను అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. జీఎన్‌ఏల అమలుపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుంది. కొనుగోళ్లలో రోల్‌మోడల్‌గా ఏపీ చౌక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఏపీలో విద్యుత్ సంస్థలు అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. ఒక రోజు ముందే విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించగలుగుతున్నాయి. ఈ విషయంలో ఏపీ విద్యుత్ సంస్థలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. 2019–20, 2020–21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్ పవర్ ఎక్ఛేంజీల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ.2,342 కోట్లు ఆదా చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ రాష్ట్రాన్ని అభినందిస్తూ ఏపీని రోల్ మోడల్‌గా తీసుకుంటామని ప్రకటించాయి. ఈ క్రమంలోనే దేశమంతటా తాజా నిబంధనలను కేంద్రం ప్రకటించింది. ఎందుకీ కొత్త విధానం? ట్రాన్స్మిషన్ వ్యవస్థ కోసం పెట్టిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడం, అదే సమయంలో ప్రణాళికాబద్ధంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్వహణ, అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. దీనివల్ల ట్రాన్స్మిషన్, జనరేషన్ రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అందని ప్రాంతాలు అభివృద్ధికి దూరమవుతాయని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా వ్యవస్థను నిర్వహించడానికి కొత్త నిబంధనలు దోహదపడతాయని తెలిపింది. కొత్తగా నిర్మించే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్మిషన్ వ్యవస్థ అభివృద్ధికి అవకాశం ఉంటుందని, ప్లాంట్లపై పెట్టిన పెట్టుబడులు వృథా కావని పేర్కొంది. -
అర్బన్ ప్లానింగ్ బలోపేతం కావాలి: నీతిఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: అర్బన్ ప్లానింగ్ సామర్థ్యం పెంపునకు కీలక సంస్కరణలు అవసరమని నీతిఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ‘అర్బన్ ప్లానింగ్ సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వర్ రావు గురువారం ఇక్కడ విడుదల చేశారు. 9 నెలల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, పట్టణ ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళికల నిపుణులతో చర్చించి నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ‘రానున్న కాలంలో పట్టణ భారతదేశం దేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇస్తుంది. పట్టణ ప్రణాళిక సహా పట్టణ సవాళ్లు అధిగమించేందుకు అత్యున్నత విధానాలపై శ్రద్ధ అవసరం. పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో ఉన్న అంతరాలను పూడ్చాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగవంతమైన, సుస్థిరమైన, సమానమైన వృద్ధికి గల భారీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది..’ అని డాక్టర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో దేశంలోని నగరాలు మరింత నివాసయోగ్యంగా, సుస్థిర నగరాలుగా మారుతాయి..’ అని సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశంలోని 52 శాతం నగరాలకు మాస్టర్ ప్లాన్ లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 3,945 టౌన్ ప్లానర్ పోస్టులకు గాను 42 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 12 వేలకు పైగా టౌన్ ప్లానర్ పోస్టులు అవసరమని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాల టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ విభాగాల్లో సగటున నగరానికి ఒక ప్లానర్ కూడా లేరని నివేదిక పేర్కొంది. నివేదిక సిఫారసులు ► ఆరోగ్యకరమైన 500 నగరాలు: 2030 నాటికి ప్రతి నగరం అందరికీ ఆరోగ్యవంతమైన నగరం కావాలని ఆకాంక్షించాలి. ఈ దిశగా 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్‌ను ఐదేళ్ల పాటు అమలు చేసేలా కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయాలి. ప్రాధాన్యత గల నగరాలు, పట్టణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించాలి. ► ప్రతిపాదిత హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని నగరాలు, పట్టణాల్లో భూమి లేదా ప్రణాళిక ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన అభివృద్ధి నియంత్రణ నిబంధనలు బలోపేతం చేయాలి. ► ప్రభుత్వ రంగంలో అర్బన్ ప్లానర్ల కొరత తీర్చేందుకు రాష్ట్రాలు టౌన్ ప్లానర్ల ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే మరో 8,268 పోస్టులను లాటరల్ ఎంట్రీ పొజిషన్స్గా కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ఉండేలా మంజూరు చేయడం ద్వారా కొరతను తీర్చాలి. ► పట్టణం, దేశ ప్రణాళిక విభాగాలు టౌన్ ప్లానర్ల కొరత ఎదుర్కొంటున్నందున రాష్ట్రాలు నియామక నిబంధనల్లో సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ► పట్టణాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించేందుకు ప్రస్తుత పట్టణ ప్రణాళికా పాలనా నిర్మాణాన్ని రీ–ఇంజినీరింగ్ చేయాలి. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీ రూపొందించాలి. ► పట్టణ, దేశ ప్రణాళిక చట్టాలను సమీక్షించి నవీకరించాలి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ► మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో వివిధ దశల్లో పౌరులను భాగస్వాములను చేయాలి. ► సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు సహా పలు అంశాల్లో ప్రయివేటు రంగం పాత్రను బలోపేతం చేయాలి. ► కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు దశల వారీగా ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు అందించాలి. ► కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థగా ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ను నెలకొల్పాలి. ‘నేషనల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా టౌన్ ప్లానర్స్ రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు కలి్పంచాలి. -
సునీల్ మిట్టల్ ప్రయత్నాలు.. ఏకతాటిపైకి టెల్కోలు
న్యూఢిల్లీ: టెలికం రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో భారత డిజిటల్ లక్ష్యాలను సాకారం చేసేందుకు టెల్కోలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతి ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్‌తో మాట్లాడినట్లు గురువారం ఆయన తెలిపారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కూడా మాట్లాడనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలను గట్టిగా తోసిపుచ్చారు. పరిశ్రమ పరిస్థితులు, మార్కెట్ పంపిణీ వ్యవస్థ వంటి అంశాలపైనే తాము చర్చిస్తామని, టారిఫ్‌ల గురించి ప్రస్తావన ఉండదని మిట్టల్ చెప్పారు. కాగా, టెలికం టారిఫ్‌లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఒక వర్చువల్ సమావేశంలో మిట్టల్ తెలిపారు. -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
గనుల రంగంలో విప్లవాత్మక సంస్కరణలు!
న్యూఢిల్లీ: గనుల రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మరో వారంలో సంబంధిత వర్గాల సలహాలను ఆహా్వనిస్తుందని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో మైనింగ్ చట్టాలకు కేంద్రం సవరణలు తీసుకువస్తుందని కూడా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 100 జీ4 ఖనిజ క్షేత్రాల బదలాయింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రహ్లాద్ మాట్లాడారు. గనులు, ఖనిజాల అంశాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఖనిజ క్షేత్రాలను వేలానికి తీసుకురావాలని రాష్ట్రాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు 100 ఖనిజ క్షేత్రాల కేటాయింపు వల్ల దేశంలో సంబంధిత సరఫరాలు నిరంతరం పెరుగుతాయని, ఖనిజ క్షేత్రాల వేలం ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తుందని తెలిపారు. -
సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలను ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ప్రశంసించారు. 11వ వర్శిటీ డిస్టింగ్విష్ లెక్చర్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణల పట్ల ఆయన అభినందించారు. వర్చువల్ ద్వారా పాల్గొన్న కస్తూరి రంగన్‌కు సీఎం జగన్ నాయకత్వంలో జరుగుతున్న విద్యా సంస్కరణలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఏపీలో అమలవుతున్న విద్యా పథకాలపై సీఎం వైఎస్ జగన్‌ను కస్తూరి రంగన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఈపీ 2020 అమలులో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో సమర్థవంతంగా విద్యా సంస్కరణలు అమలవుతున్నాయని అభినందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిధులు, ఖర్చుకు వెనుకాడకుండా పలు విద్యా పథకాల అమలుపై కస్తూరి రంగన్ ప్రశంసలు కురిపించారు. -
నాటి సంస్కరణలే గుర్తుకొస్తున్నాయ్..!
భారత ఆర్థిక వ్యవస్థను మూలమలుపు తిప్పిన తీవ్ర సంస్కరణలు దేశంలో మొదలై నేటికి 30 ఏళ్లయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయి. కానీ, మూడు దశాబ్దాల తర్వాత కూడా దేశ ఆర్థికవృద్ధిపై నిరాశ అలుముకుంటోంది. 1991 నాటి తీవ్ర సంస్కరణలను పునఃసృష్టి చేయాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జీడీపీ పతనం, కోవిడ్–19 కలిగించిన ఉత్పాతం మళ్లీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. పీవీ, మన్మోహన్‌ల సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం. భారతదేశంలో 1991 సంస్కరణలు మొదలై నేటికి 30 ఏళ్లు. దేశ ఆర్థిక విధానాలను మూల మలుపు తిప్పిన ఆ గొప్ప దశ గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏదైనా ఒక విశిష్ట ఘటనను తర్వాతి కాలక్రమంలో రజిత, స్వర్ణ, ప్లాటినమ్, శతాబ్ది వార్షికోత్సవాలతో గుర్తుంచుకోవడం కద్దు. వీటితో పోల్చి చూస్తే ముప్ఫై సంవత్సరాలకు అంతగా ప్రాధాన్యత లభించకపోవచ్చు. కానీ 1991 నాటి సంస్కరణలను ఇప్పుడు ఇంత విస్తృతంగా గుర్తించు కోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణం ఆర్థికవృద్ధికి సంబంధించి ప్రస్తుతం అలుముకుంటున్న నిరాశా దృక్పథమే. దేశంలో సంస్కరణలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ అసలు పని చేస్తున్నాయా లేదా అనే అంశంపై సందేహాలు తలెత్తుతున్న సందర్భ మిది. మనకు ఆర్థికవృద్ధికి సంబంధించి ఒక వ్యూహం కానీ విధానం కానీ ఉందా అనే ప్రశ్న రేగుతోంది. 1991లో చేపట్టిన ఉదారవాద, సరళీకరణ క్రమం ఇప్పుడు వెనకపట్టు పడుతున్న సూచనలు కనిపిస్తు న్నాయి. అందుకనే 1991లో జరిగినట్లుగా ఆర్థిక స్తబ్దతను బద్దలు గొట్టడానికి ఏదైనా నాటకీయ చర్యను తప్పకుండా చేపట్టాలని ఆర్థిక రంగ నిపుణులు పిలుపునిస్తున్నారు. అప్పట్లో మారకద్రవ్య విలువను తగ్గించడం, పారిశ్రామిక లైసెన్స్ రాజ్‌ను ఎత్తివేయడం వంటి చర్యలు వనరుల సమీకరణలో కీలకమైన మార్పులు తీసుకొచ్చాయి. రెండేళ్లక్రితమే మోదీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్– 19 నేపథ్యంలో ఆనాటి సంస్కరణలను గుర్తుచేసుకోవడం మరింతగా పెరిగింది. 1991లో దేశం చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు తీవ్ర చర్యలు చేపట్టినట్లే, ప్రస్తుత సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. రెండేళ్లకు ముందు చమురుధరలు కుప్పగూలడంతో భారత ఆర్థిక వృద్ధికి చెందిన అడ్డం కులు తొలిగిపోయినట్లయింది. ప్రైవేట్ పెట్టుబడులకు డిమాండ్ కొరత కొనసాగింది. ఈ కొరతను ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలతో భర్తీ చేయసాగారు. దీనికి చమురుపై పన్ను ద్వారా పెరిగిన రాబడులు దేవుడిచ్చిన బహుమతిగా ఉపయోగపడ్డాయి. అదే సమయంలో అంటే 2016–17 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు సగటు ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రతికూల ప్రభావం చూపింది. రాజకీయ ఇచ్ఛ లోపించడం కారణంగా పెండింగులో ఉండిపో యిన ఉత్పత్తి–మార్కెట్ సంస్కరణలకు సంబంధించిన డిమాండ్ ఈ సమయంలోనే వేగం పుంజుకుంది. నిజానికి మొదలుపెట్టకుండా నిలిపివేసిన సంస్కరణలకు కొత్త దారి చూపేందుకు, 2014లో బల మైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇదే రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన తొలి హయాంలో వస్తుసేవల పన్నును 2017 జూలైలో ప్రవేశపెట్టడం ద్వారా తీవ్రమైన ఆర్థిక సంస్క రణలకు దారితీసింది. 2016లో బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాల నుంచి చాలాకాలంగా పేరుకుపోయి ఉన్న మొండిబకాయిల పరి ష్కారం కోసం దివాలా కోడ్‌ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, స్థూలదేశీయోత్పత్తి తదుపరి రెండేళ్లలో పతనాన్ని చవిచూసింది. 2018–2019 సంవత్సరాల్లో మన జీడీపీ వరుసగా 6.8 శాతం, 6.5 శాతాన్ని మాత్రమే నమోదు చేసింది. దీంతో 1991 తరహా సంస్కరణలకు అనుకూలంగా ప్రైవేట్ రంగం గొంతు విప్పసాగింది. 2019 మధ్యనాటికి కేంద్రంలో గత ప్రభుత్వమే మళ్లీ అధికారానికి వచ్చినప్పటికీ ఆర్థిక వృద్ధి విషయంలో నిరాశాతత్వం మరింత పెర గడం కాకతాళీయమే కావచ్చు. ఆర్థిక సంస్కరణల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిందిగా పరిశ్రమ నుంచి అభ్యర్థనలు పెరి గాయి. అంతవరకు కొనసాగిన సంస్కరణలు అనుకున్నంత ప్రయో జనం కలిగించలేదని, ప్రభుత్వ మదుపు.. వాణిజ్య రంగానికి అవస రమైనంతమేరకు లభ్యం కావడం లేదని అభిప్రాయాలు బలపడ్డాయి. దీంతో ప్రైవేట్ మదుపును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం వేగంగా స్పందించి 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్నులపై కోత పెట్టింది. ప్రతివారం అనేక ఇతర చర్యలు కూడా చేపట్టింది. కానీ జీడీపీ 5 శాతానికి దిగువకు పడిపోయింది. 2019 జూలై–సెప్టెంబర్‌లో 4.6 శాతానికి, అక్టోబర్–డిసెంబర్లో 3.3 శాతానికి 2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3 శాతానికి మన స్థూల దేశీయోత్పత్తి దిగ జారిపోయింది. గత సంవత్సరం దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ వెన్నెముక విరిగినంత పనయింది. ఈ సంక్షోభాన్ని అవ కాశంగా మలచాలంటూ పిలుపులు మొదలైపోయాయి. దీంతో కార్మిక, వ్యవ సాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర మార్పులు తీసుకొచ్చింది. అలాగే ఆత్మనిర్భర్ సిరీస్‌లో కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చారు. కానీ, వ్యవసాయ మార్కెట్లు, సంస్థలలో తీసుకొచ్చిన కీలక మార్పులు ఎదురుతన్నడంతో ఈ రంగంలో భవిష్యత్ ప్రయో జనాలను ఊహించడం కష్టసాధ్యమవుతోంది. చరిత్ర గతిని మార్చిన ఆ వందరోజులు ముప్ఫై ఏళ్ల క్రితం పార్లమెంటు సభ్యుడు కూడా కాని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ క్రమాన్నే నాటకీయంగా మార్చివేసిన సాహ సోపేతమైన సంస్కరణలకు నాంది పలికారు. ద్రవ్య, చెల్లింపుల సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు నాటి ప్రభుత్వం తన తొలి వంద రోజుల పాలనలోనే వరుస సంస్కరణలకు తెరతీసింది. దీనికి బలమైన నేపథ్యం ఉంది. 1991 జూలై తొలి వారంలో భారత విదేశీమారక ద్రవ్య నిల్వలు కేవలం ఒక బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ప్రవాస భారతీ యులు తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం మొదలెట్టడంతో పరి స్థితి మరింత తీవ్రమైంది. దీంతో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ తమ తొలి వందరోజుల పాలన లోనే దేశ ఆర్థికక్రమాన్ని మలుపుతిప్పిన కఠిన చర్యలకు పూనుకున్నారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తొలి పక్షం రోజుల్లోనే అంటే 1991 జూలై 2న అమెరికా డాలర్‌తో పోల్చినప్పుడు భారత కరెన్సీ విలువను 9.5 శాతానికి తగ్గించివేసింది. ఆ తర్వాత ఒక్క రోజు వ్యవధిలో రూపాయి విలువను మరో 12 శాతం మేరకు తగ్గించి షాక్ కలిగించింది. అదేరోజున నాటి వాణిజ్యమంత్రి పి. చిదంబరం ఎగుమతిదారులకు నగదు ప్రోత్సాహా న్నందిస్తున్న సబ్సిడీలను రద్దుచేశారు. కొన్ని రకాల సరకుల దిగుమతిపై ప్రభుత్వ రంగ సంస్థలు చలాయిస్తున్న గుత్తాధిపత్యాన్ని ఎత్తివేశారు. మార్కెట్‌కు స్వేచ్ఛకలిగించే ఎగ్జిమ్ చట్టాన్ని తీసుకువస్తూ సుంకం లేని దిగుమతులకు అవకాశమిచ్చే లైసెన్సులను రద్దు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించి పది కీలకరంగాల్లో ప్రైవేట్ సంస్థలకు అనుమతించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను క్రమంగా ఉపసంహరించుకునే విధానాన్ని ప్రకటించారు. గడిచిన ముప్ఫై ఏళ్లుగా ద్రవ్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఇతర సంస్కరణలను ఎన్నింటినో తీసుకువచ్చారు. కానీ ఆరోజు పీవీ ప్రభుత్వం చేపట్టిన సంస్క రణల నమూనా తర్వాత గత ముప్ఫై ఏళ్లుగా కేంద్రంలో ఏర్పడిన ప్రభు త్వాలు, వాటి ఆర్థిక మంత్రులు అదే రీతిలో కొనసాగిస్తూ ఉండటం గొప్ప విషయంగానే చెప్పాలి. గత రెండేళ్లకుపైగా డీజీపీ రేటు పడిపోవడం, కోవిడ్– 19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలవడం నేపథ్యంలో నాటి పీవీ, సింగ్ సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు గత కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం. రేణు కోహ్లి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అభివృద్ధి పథంలో ఆర్మీ భూములు!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ భూముల విధానంలో (డిఫెన్స్ ల్యాండ్ పాలసీ) కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రక్షణ శాఖకు చెందిన భూములను ఇతర అవసరాలకు మళ్లించేందుకు సిద్ధమైంది. ప్రజా ప్రాజెక్టులు, సైనికేతర అవసరాల నిమిత్తం ఇకపై రక్షణ శాఖ భూములను సేకరించవచ్చు. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అయితే, సేకరించిన భూమికి ప్రతిఫలంగా సైనిక దళాలకు అంతే విలువ కలిగిన భూమిని మరోచోట ఇవ్వాలి. ఈక్వల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్–ఈవీఐ లేదా మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటిషర్లు భారత్‌లో తొలిసారిగా 1765లో పశ్చిమ బెంగాల్‌లోని బారక్పూర్లో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ భూములను సైనికేతర అవసరాలకు ఉపయోగించకుండా అప్పటి నుంచి నిషేధం కొనసాగుతోంది. కంటోన్మెంట్లలోని బంగ్లాలు, క్వార్టర్లను సైన్యంతో సంబంధం లేని వారికి విక్రయించడం లేదా వారు ఆక్రమించడం చెల్లదంటూ 1801లో అప్పటి ఈస్టిండియా కంపెనీ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ తర్వాత దాదాపు 200 ఏళ్ల తర్వాత దేశంలో రక్షణ భూముల విధానంలో సంస్కరణలు తేవడం ఇదే మొదటిసారి. కంటోన్మెంట్ జోన్లలో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కంటోన్మెంట్ బిల్లు–2020ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ఇందులో కొన్ని మార్పులు చేసింది. మెట్రో రైళ్లు, రోడ్లు, ఫ్లైఓవర్లు, రైల్వే వంటి పబ్లిక్ ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ నుంచి భూములను సేకరించవచ్చని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అయితే, సేకరించిన భూమికి గాను సమాన విలువ కలిగిన భూమిని ఇవ్వడం గానీ లేదా మార్కెట్ ధర చెల్లించడం గానీ చేయాలని పేర్కొన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి పూర్తయిన తర్వాతే భూమిని బదలాయించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కంటోన్మెంట్లలోని భూమి విలువను స్థానిక సైనిక ఆథారిటీ నేతృత్వంలోని కమిటీ నిర్ధారిస్తుంది. కంటోన్మెంట్ల వెలుపల గల భూమి విలువను జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) ఖరారు చేస్తారు. దేశంలో ప్రధాన నగరాల్లో కీలకమైన ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములున్నాయి. పబ్లిక్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆయా భూములు కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. -
విద్యా విప్లవానికి నాందీవాచకం
పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహిం చడం ఒక్కటే సరైన పద్ధతి. దేశంలోని రైతులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేసిన మనోభావాల లింకును వైఎస్ జగన్ తుంచేశారు. ప్రాథమిక విద్యపై, కళాశాల విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో సీఎంని మనం చూడలేం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. 2019 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. దీనికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఇంగ్లిష్‌ని విద్యా మాధ్యమంగా చేసింది. వీటిని చేపట్టడానికి రాష్ట్ర యువ, ఆశావహ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు యుద్ధాలు చేయవలసి వచ్చింది. తమ పిల్లలను మాత్రం అతి ఖరీదైన ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివి స్తున్న ఏపీలోని కపట మేధావి–రాజకీయ వర్గం జగన్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ దాన్ని మాతృభాషా సమస్యగా మార్చేసింది. తల్లి భాష అంటే తల్లి పాలు అంటూ వీరు గొంతు చించుకున్నారు. తమ గావుకేకలు వైఎస్ జగన్‌ని కదిలించకపోవడంతో తర్వాత వీరు న్యాయస్థానం ముందు సాగిలపడ్డారు. రాష్ట్ర కుహనా మేధావివర్గాల, ప్రతిపక్షాల ఈ కపటత్వాన్ని ఎండగడుతూ, వీరి వీధి పోరాటాలతో, మీడియాలో యుద్ధాలతో తలపడటానికి ఏపీ ముఖ్యమంత్రి తమ యువ కేడర్ని, పార్టీ నాయకులను మోహరించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీతోపాటు వామపక్షాలు కూడా జగన్ చర్యను వ్యతిరేకిస్తూ ఆయన తెలుగు వ్యతిరేకి అని ఆరోపించారు. అయితే ఇంగ్లిష్ మీడియంలో విద్య అనేది తన నవరత్నాలు పథకంలో భాగం కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో ఈమేరకు వాగ్దానం చేశారు కాబట్టి వైఎస్ జగన్ తన మాటకు చివరివరకు కట్టుబడ్డారు. అదే సమయంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిగా బోధించాలని జగన్ ఆదేశిం చారు. అన్ని పాఠ్యపుస్తకాలను ద్విభాషా పద్ధతిలో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించి ఇవ్వాలని కూడా ఆదేశించారు. అంటే అన్ని సబ్జెక్టుల్లోని పాఠాలు ఒక వైపు పేజీలో ఇంగ్లిష్‌లో, దాని పక్కపేజీలో తెలుగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. దీంతో విమర్శకులకు మౌనం పాటించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు వీరి పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా రెండు భాషల్లో విద్య నేర్చుకోవచ్చు. ఇంతవరకు ఏపీలోని ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు తెలుగులో విద్య నేర్చుకోవడాన్ని అనుమతించలేదు. విద్యలో జగన్ సమూల మార్పులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనకు గ్రామీణ, రైతు, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రుల మద్దతును వైఎస్ జగన్ పొందారు. తాము ఎంచుకున్న మీడియంలో విద్య పొందాలనుకునే పిల్లల హక్కును ఏ కోర్టూ వ్యతిరేకించదు. ఈ విషయాన్ని భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఎత్తిపట్టింది. ఇంగ్లిష్ మీడియంలో విద్యా హక్కు ప్రైవేట్ రంగానికి మాత్రమే పరిమితమైంది కాదు. పిల్లలంటే పిల్లలే. ప్రైవేట్ లేదా ప్రభుత్వ.. ఇలా వారు ఏ పాఠశాలలో చదివినా వారి హక్కు వారికే చెందుతుంది. వైఎస్ జగన్ తన ఇంగ్లిష్ మీడియం ఎజెండాను అమ్మ ఒడి పథకంతో మేళవించారు. పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా విద్యా ఖర్చుల కోసం రూ. 15,000ల నగదును అందించే పథకమిది. దీంతోపాటు కాలేజీలో చదువుకునేవారి ఫీజు మొత్తం రీయింబర్స్ చేస్తున్నారు. దీనికి తోడుగా నాడు–నేడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మౌలిక వసతులను సమూలంగా మార్చడానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న పథకం కంటే నాడు–నేడు మరింత నిర్దిష్టమైనది, గుణాత్మకమైనది కావడం విశేషం. పైగా ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం కూడా. ఏపీ ముఖ్యమంత్రి ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్ వాడీలను కూడా ప్రాథమిక పాఠశాలలతో మిళితం చేశారు. పైగా స్కూల్ సిబ్బందిని, వసతి సౌకర్యాలను పెంచారు. ప్రతి రోజు స్థిరమైన మెనూతో ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అనేక రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఈ పథకం కింద పిల్ల లకు మంచి ఆహారం లభిస్తూండటం గమనార్హం. పిల్లలున్న ప్రతి ఇంటి నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్ ప్రకటించారు. అలాగే మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక హైస్కూలును, ఏడు కిలోమీటర్ల పరిధిలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పర్చనున్నారు. ఈ అన్ని విద్యా సంస్థల్లో ఒక సబ్జెక్టులో తెలుగును తప్పనిసరి చేస్తూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. పైగా ఇంగ్లిష్, తెలుగు రెండింటిలో టీచర్లు బోధించేలా తీర్చిదిద్దడానికి భారీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్య అనేది ప్రతి పాప, బాబుకి చెందిన గౌరవనీయమైన ఆస్తిగా పాలకులు భావించనంతవరకు ఏ పాలకుడైనా విద్యపై ఇంత శ్రద్ధ పెట్టలేరు. వైఎస్ జగన్ 48 ఏళ్ల యువకుడు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. నిజానికి దేశంలో అధికారంలో ఉంటున్న ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల్లో జగన్ అత్యంత యువ ముఖ్యమంత్రి కావడం విశేషం. భవిష్యత్తులోనూ ఒక రాజకీయనేతగా తన ఈ విద్యా ఎజెం డాను జగన్ కొనసాగించినట్లయితే దేశంలోని ప్రభుత్వ రంగ విద్యావిధానంలో గణనీయ ముద్రను వేయడం ఖాయం. సమానత్వానికి నమూనా ఎవరి జీవితంలోనైనా విద్య అత్యంత విలువైన సంపద అనేది తెలిసిన విషయమే. ఇది బంగారం కంటే ఉత్తమమైనది. దళితులకు, ఆదివాసీలకు, శూద్రులకు ఇంగ్లిష్ విద్య అనేది తమ ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకుని మోసే బంగారు గనిలాంటిది. పదే పదే ఇది రుజువవుతోంది కూడా. అయితే స్వాతంత్య్రానంతర భారత పాలకులు ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాష, ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ భాష అనే రెండు వేర్వేరు రంగాలను నెలకొల్పడం ద్వారా దేశ ప్రజలకు సమానమైన మీడియం విద్యను తిరస్కరించారు. దేశంలోని ఆహార ఉత్పత్తిదారులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేశారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు ఈ సెంటిమెంటును తోసిపుచ్చి, ఇంగ్లిష్ కులీన విద్యావంతుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ వచ్చాయి. ఇలాంటి సెంటిమెంటల్ లింకును జగన్మోహన్ రెడ్డి తెంచివేసారు. తన నూతన విద్యా ప్రాజెక్టులను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వస్తున్నారు. విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో ముఖ్యమంత్రిని మనం చూడలేం. విద్యకోసం తన ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు కూడా చాలావరకు మెరుగ్గా ఉన్నాయి. తన విద్యాపథకాల కోసం ఇతర పథకాలను కూడా ఆయన ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం మెరుగైన విద్యా నమూనాపై కృషి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ భాషా విధానం.. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించలేని గ్రామీణ, పేద ప్రజానీకానికి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయి విద్యను అందించడంలో తోడ్పడలేదు. పైగా బీజేపీ హయాంలో విద్యారంగంలో ఒక సరికొత్త వైరుధ్యం ఆవిర్భవించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలో పాఠశాల విద్య విషయంలో మొండిగా వ్యవహరిస్తూనే, మరోవైపున ఇంగ్లిష్ మీడియం కొనసాగించడానికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను అనుమతిస్తోంది. పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహించడం ఒక్కడే సరైన, ఏకైక మార్గం. వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
Narendra Modi: సహకారంతోనే సంస్కరణలు
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం బలంగా ఉండడం వల్లనే కరోనా సమయంలో కీలక సంస్కరణలు, ప్రోత్సాహకాలు తీసుకురాగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో అన్నింటికీ ఒకే మంత్రం అనకుండా, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో అవసరానికి తగినట్లు ఆర్థిక విధానాలను రూపొందించడం జరిగిందని వివరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డిన్‌పై ‘‘రిఫామ్స్ బై కన్విక్షన్ అండ్ ఇన్సెంటివ్స్’’ పేరిట ఆయన సంస్కరణల గురించి వివరిస్తూ పోస్టు చేశారు. ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో భారత రాష్ట్రాలు గతంలో కన్నా ఎక్కువగా రుణాలు తీసుకోగలిగాయన్నారు. ‘‘2020–21లో రాష్ట్రాలు అదనంగా రూ. 1.06 లక్షల కోట్లను సమీకరించడం ముదావహం. ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం వల్లనే సాధ్యమైంది’’అని ప్రధాని చెప్పారు. ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలకు విధాన నిర్ణయాల పరంగా కరోనా కొత్త సవాళ్లు విసిరిందని ప్రధాని గుర్తు చేశారు. భారత్ ఇందుకు మినహాయింపు కాదని, ఒకవైపు ప్రజాసంక్షేమం కుంటుపడకుండా మరోవైపు ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా నిధులు సమీకరించడం మనం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలని చెప్పారు. సమాఖ్య వ్యవస్థలో అన్నింటికీ ఒకే సూత్రం వర్తించలేమన్నది గుర్తించి ఆయా రాష్ట్రాల సంస్కరణలను ప్రోత్సహించేలా జాతీయస్థాయిలో విధాన నిర్ణయాలు తీసుకోవడం కూడా సవాలేనన్నారు. అయితే మన సమాఖ్య వ్యవస్థపై ఉన్న నమ్మకంతో, కేంద్రరాష్ట్రాల మధ్య సహకారంతో ముందుకు సాగామని చెప్పారు. రాష్ట్రాలు వాటి స్థూలోత్పత్తి(జీఎస్డీపీ)లో 2 శాతం వరకు రుణాలు సేకరించే అనుమతినిచ్చామని, అయితే కొన్ని సంస్కరణలు అమలు చేస్తేనే ఇందులో ఒక్క శాతానికి అనుమతి లభిస్తుందని వివరించారు. ఈ కారణంగా పలు రాష్ట్రాలు పలు సంస్కరణలు అమలు చేసాయని తెలిపారు. దీనివల్ల వచ్చిన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, అలాగే కొందరే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తారన్న అపవాదుకు భిన్నంగా ఫలితాలున్నాయని చెప్పారు. చదవండి: ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట -
Model Tenancy Act: వారు 2 నెలల అద్దె ముందే చెల్లించాలి!
న్యూఢిల్లీ: యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రూపొందిన చట్టం... ‘మోడల్ టెనన్సీ యాక్ట్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక సంస్కరణలతో కూడిన ఈ నమూనా చట్టానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో గ్రీన్ సిగ్నల్ లభించింది. వివాదాల సత్వర పరిష్కారం కోసం జిల్లాల్లో ప్రత్యేక రెంట్ అథారిటీలు, రెంట్ కోర్టులు, రెంట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యథాతథంగా అమలు చేసుకోవచ్చు. లేదా ఇప్పటికే తమ వద్ద అమల్లో ఉన్న సంబంధిత చట్టాలకు అవసరమైన మార్పులు చేసి, అమలు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆస్తులను అద్దెకు ఇవ్వడానికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో ఈ కొత్త చట్టం ద్వారా సమూల మార్పులు వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి తెలిపారు. ఈ చట్టం రెంటల్ హౌజింగ్‌ను ఒక వ్యాపార మోడల్‌గా నిర్వహించే అవకాశం కల్పిస్తుందని, తద్వారా దేశంలో రెంటల్ హౌజింగ్ మార్కెట్ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాల వారికి అందుబాటులో, సమస్యలు లేని విధంగా అద్దె వసతి లభించేలా చట్టం రూపొందిందని వెల్లడించింది. 2011 జనగణన ప్రకారం దేశవ్యాప్తంగా, నగరాలు, పట్టణాల్లో దాదాపు కోటి గృçహాలు ఖాళీగా ఉన్నాయని హరిదీప్ సింగ్ పూరి వెల్లడించారు. కిరాయిదారులు ఖాళీ చేయరేమోనని, లేదా ఆక్రమించుకుంటారేమోనని, లేదా ఖాళీ చేయడానికి ఇబ్బంది పెడ్తారేమోనని భయంతో యజమానులు తమ ఆస్తులను అద్దెకు ఇవ్వడం లేదని గృహ నిర్మాణశాఖకు చెందిన ఒక అధికారి వివరించారు. ఈ తాజా చట్టంలో కిరాయిదారు, యజమానుల పాత్రను, హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించినందున ఇకపై వారిలో ఈ భయాందోళనలు తొలగిపోతాయని భావిస్తున్నామన్నారు. ఈ చట్టం ప్రకారం.. ► నివాస సముదాయాల్లో కిరాయిదారు యజమానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా గరిష్టంగా రెండు నెలల అద్దె ముందే చెల్లించాలి. అదే, వాణిజ్య సముదాయాలైతే ఆరునెలల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ► అన్ని కొత్త అద్దె ఒప్పందాలు ఇకపై కచ్చితంగా లిఖితపూర్వకంగా ఉండాలి. అలాగే, వాటిని సంబంధిత జిల్లా ‘రెంట్ అథారిటీ’కి సమర్పించాలి. ► ఇప్పటికే అమల్లో ఉన్న రెంటల్ అగ్రిమెంట్‌పై కొత్త చట్టం ప్రభావం ఉండదు. ► అద్దె, కాలవ్యవధులను పరస్పర అంగీకారంతో కిరాయిదారు, యజమాని నిర్ణయించుకోవాలి. లిఖిత పూర్వక ఒప్పందంలో ఆ విషయాన్ని పొందుపర్చాలి. ► యజమాని, లేదా ప్రాపర్టీ మేనేజర్ కిరాయిదారుల నివాసాలకు నిత్యావసర సదుపాయాలను నిలిపివేయకూడదు. ► అద్దె ఒప్పందం అమలులో ఉన్న సమయంలో కిరాయిదారును ఖాళీ చేయించకూడదు. ఒకవేళ ఒప్పందంలో సంబంధిత నిబంధన ఉంటే ఖాళీ చేయించవచ్చు. ► కిరాయిదారు నష్టపరిచినవి మినహా మిగతా నిర్మాణ మరమ్మతులు, రంగులు వేయించడం, పాడైన ప్లంబింగ్ పైప్‌ల మార్పు, విద్యుత్ వైరింగ్ తదితరాలను యజమానే చేయించాలి. ► డ్రైనేజ్ క్లీనింగ్, విద్యుత్ స్విచ్‌లు, సాకెట్ల మరమ్మతులు, కిచెన్‌లో అవసరమైన రిపేర్లు, మరమ్మతులు, ధ్వంసమైన కిటికీలు, ద్వారాల గ్లాస్ ప్యానెళ్ల మార్పు, గార్డెన్ నిర్వహణ.. మొదలైనవాటిని కిరాయిదారు చేయాల్సి ఉంటుంది. ► కిరాయిదారు ఆక్రమణలో ఉన్న చోట యజ మాని ఏదైనా అదనపు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, దాన్ని కిరాయిదారు వ్యతిరేకిస్తే.. యజమాని జిల్లా రెంట్ కోర్టును ఆశ్రయించాలి. ► యజమాని ముందస్తు అనుమతి లేకుండా, కిరాయిదారు తాను అద్దెకు ఉన్న ప్రాంగణంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు. ► ప్రతీ జిల్లాలో రెంట్ ట్రిబ్యునల్‌గా జిల్లా జడ్జిని కానీ, జిల్లా అదనపు జడ్జీని కానీ హైకోర్టు సూ చనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. ► రెంట్ కోర్ట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ను కాని, తత్సమాన హోదా ఉన్న అధికారిని కానీ నియమించాలి. ► రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో డిప్యూటీ కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని ‘రెంట్ అథారిటీ’గా జిల్లా కలెక్టర్ నియమించాలి. ► యజమానికి, కిరాయిదారుకు మధ్య వివాదం తలెత్తినప్పుడు.. మొదట రెంట్ అథారిటీని ఆశ్రయించాలి. అక్కడి పరిష్కారంతో సంతృప్తి చెందనట్లయితే, తరువాత రెంట్ కోర్టును, ఆ తరువాత రెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ► కిరాయిదారులను ఖాళీ చేయించే విషయంలో ఇబ్బంది పడే యజమానుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. అద్దె ఒప్పందంలో పేర్కొన్న మేరకు ముందస్తు నోటీసు ఇవ్వడం సహా అన్ని నిబంధనలను పాటిస్తూ ఖాళీ చేయాలని యజమాని కోరినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. అలాగే, ఒప్పందం కాలపరిమితి ముగిసినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. యజమాని నెలవారీ అద్దెను మొదట రెండు నెలల పాటు రెండింతలు, ఆ తరువాత ఖాళీ చేసేంతవరకు నాలుగు రెట్లు చేయవచ్చు. ► కిరాయిదారుకు చెల్లించాల్సిన రీఫండ్‌ను యజమాని సమయానికి ఇవ్వనట్లయితే.. సాధారణ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. -
సాగు చట్టాల ప్రయోజనాలు ప్రచారం చేయండి
న్యూఢిల్లీ: ‘దేశమే ప్రథమం’ అన్న భావన స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. దేశం కోసం, దేశాభివృద్ధి కోసం పని చేయడమే పార్టీ కార్యకర్తల లక్ష్యం కావాలన్నారు. పార్టీ మౌలిక సూత్రం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ భావనేనని వివరించారు. ఈ సూత్రం అధారంగానే ప్రభుత్వం జీఎస్టీ సహా పలు సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ‘అధికారం సాధించడం మన ఉద్దేశ్యం కాకూడదు.. దేశాభివృద్ధి కోసం ప్రజాసేవ చేయడమే మన లక్ష్యం కావాలి’ అని వివరించారు. పార్టీ కొత్త ఆఫీస్ బేరర్ల తొలి సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ఆదివారం ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చినందుకు, కోవిడ్–19 నియంత్రణ దిశగా సమర్ధవంతమైన నాయకత్వం అందించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. బడ్జెట్ ప్రతిపాదనలను, గరీబ్ కళ్యాణ్ యోజనను, సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలను ఎదుర్కొన్న తీరును కూడా తీర్మానంలో ప్రశంసించారు. ‘రైతు ప్రయోజనాలు కేంద్రంగా ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకువచ్చింది. వారి వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించడం, వారి ఆదాయం రెట్టింపు కావడం, తమ ఉత్పత్తులను నచ్చినచోట అమ్ముకునే వెసులుబాటు వారికి లభించడం.. అనే లక్ష్యాల సాధన కోసం ఈ చట్టాలు రూపొందాయి’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్ ప్రవేశపెట్టిన ఆ తీర్మానంలో పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్తతల సమయంలో వెనక్కు తగ్గకుండా, అదే సమయంలో, అనవసరంగా దూకుడుగా వెళ్లకుండా, సంయమనంతో వ్యవహరించి, సానుకూల పరిష్కారం సాధించారని మోదీపై ప్రశంసలు కురిపించింది. సరిహద్దుల్లో పొరుగుదేశాల విస్తరణ వాదాన్ని భారత్ సహించబోదని, ఈ విషయాన్ని మోదీ నాయకత్వంలో భారత్ పలుమార్లు రుజువు చేసిందని వివరించింది. మోదీ నాయకత్వంలో భారతదేశం స్పష్టమైన విధానంతో బలమైన దేశంగా రూపుదిద్దుకుందని పేర్కొంది. కోవిడ్–19పై పోరులో భారత్‌ను విజయవంతమైన దేశంగా నిలిపారని ప్రశంసించింది. సాగు చట్టాల విషయంలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆ తీర్మానం పేర్కొంది. నూతన విద్యా విధానం, కార్మిక సంస్కరణలు సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను తీర్మానంలో ప్రశంసించారు. పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేయాలని పార్టీ శ్రేణులను కోరింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వివరాలను బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సాగు చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అలాగే, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై, ఆత్మనిర్భర్ భారత్‌పై, సాగు చట్టాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వెల్లడించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. -
కాలం చెల్లిన చట్టాలు మనకొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయొచ్చని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి కేంద్ర, రాష్ట్రాలు మరింత సన్నిహితంగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగస్వామిగా మారడానికి ప్రైవేట్ రంగానికి పూర్తి అవకాశం ఇవ్వాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపుపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి ఆరో సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని గుర్తుచేశారు. దేశాన్ని పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లించేందుకు మేధోమథనం చేయడమే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి వల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం అధిగమించగలిగిందని గుర్తు చేశారు. దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నీతి ఆయోగ్ సమావేశ ఎజెండాను ఎంపిక చేసినట్లు వెల్లడించా రు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. పేదలకు పక్కా ఇళ్లు ‘దేశంలో ప్రతి పేద పౌరుడికీ పక్కా గృహ వసతి కల్పించే ఉద్యమం కొనసాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 2014 నుంచి ఇప్పటివరకు 2.40 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. జల్‌జీవన్ మిషన్ ప్రారంభించాక 18 నెలల్లో∙3.5 లక్షల గ్రామీణ నివాసాలకు నల్లా ద్వారా తాగునీరు అందుబాటులోకొచ్చింది. ఇంటర్నెట్తో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ఉద్దేశించిన ‘భారత్ నెట్’ పథకం పెను మార్పులకు మాధ్యమం కానుంది. ప్రైవేట్ రంగం శక్తిని గౌరవించాలి : ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌పై సానుకూల ప్రతిస్పందన వ్యక్తమయ్యింది. ఇది దేశం మనోభావాలను బహిర్గతం చేసింది. ఇక సమయం వృథా చేయకుండా వేగంగా ముందడుగు వేయాలన్న దృఢ నిర్ణయానికి దేశం వచ్చింది. ఇండియా ప్రారంభించిన ఈ ప్రగతి ప్రయాణంలో భాగస్వామ్యానికి ప్రైవేట్ రంగం కూడా ఉత్సాహంతో ముందుకువస్తోంది. ఈ నవ్యోత్సాహాన్ని, ప్రైవేట్ రంగం శక్తిని ప్రభుత్వం తనవంతుగా గౌరవిస్తూ స్వయం సమృద్ధ(ఆత్మ నిర్భర్) భారత్ ఉద్యమంలో వీలైనంత ఎక్కువ అవకాశాలు సృష్టించాలి. దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచం కోసం కూడా ఉత్పత్తి చేయగలిగేలా భారత్ అభివృద్ధి చెందాలి. ఇందుకు స్వయం సమృద్ధ భారత్ ఉద్యమం ఒక మార్గం. ఆవిష్కరణలకు ప్రోత్సాహం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ఆకాంక్షల దృష్ట్యా ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా చేపట్టాలి. నవీన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి. విద్యా, నైపుణ్య రంగాల్లో మెరుగైన అవకాశాల కల్పన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువగా వాడుకోవాలి. దేశంలో వ్యాపారాలు, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), అంకుర సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని వివిధ జిల్లాల్లో వాటికే ప్రత్యేకమైన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నాం. ఈ విధానాన్ని మండలాల స్థాయికి విస్తరించాలి. వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాల నుంచి ఎగుమతులను పెంచాలి. వివిధ రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులు భారీగా పెరుగుతున్నాయి. స్థానిక పరిపాలన సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోపాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. ప్రపంచ దేశాలకు మన ఉత్పత్తులు విదేశాల నుంచి వంటనూనెల దిగుమతికి ప్రతిఏటా రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వాస్తవానికి ఈ సొమ్మంతా మన రైతులకు దక్కాల్సి ఉంది. నూనె గింజల ఉత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి. అనేక వ్యవసాయ ఉత్పత్తులను దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేయాలి. ఇది జరగాలంటే ఉత్పత్తులను భారీగా పెంచాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ప్రాంతీయ వ్యవసాయ–వాతావరణ ప్రణాళిక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. లాభార్జన కోసం కేవలం ముడి ఆహార పదార్థాలను కాకుండా, వాటి నుంచి రూపొందించిన ఉత్పత్తులను ఎగుమతి చేయాలి’ అని మోదీ అన్నారు. మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎల్జీలు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్‌గా ప్రధాని మోదీ నీతి ఆయోగ్ పాలక మండలిని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. పాలక మండలి చైర్మన్‌గా ఇకపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రతినిధులు పాలక మండలిలో ఫుల్‌టైమ్ సభ్యులుగా ఉంటారు. అండమాన్ నికోబార్ దీవులు, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తారు. ప్రతిభ మనది.. ఉత్పత్తి మనది కాదు ‘నేను ఇటీవల ఐటీ రంగంలోని వ్యక్తులతో మాట్లాడా. తమలో 95 శాతం మంది ఇప్పుడు ఇంటినుంచే పని చేస్తున్నారని, ఉత్పాదకత పెరిగిందని చెప్పారు. నిబంధనల్లో సంస్కరణలు తేవడం వల్లే ఇది సాధ్యమైంది. జియో స్పేషియల్ డేటాకు సంబంధించిన నియమాలను కూడా సరళీకృతం చేశాం. పదేళ్ల క్రితమే చేయగలిగితే.. బహుశా గూగుల్ వంటివి భారతదేశం వెలుపల నిర్మితమయ్యేవి కావు. మన ప్రజలకు ప్రతిభ ఉంది, కానీ వారు తయారు చేసిన ఉత్పత్తి మనది కాదు’ అని అన్నారు. -
రెవెన్యూ కాదు.. ‘భూ పరిపాలన’ శాఖ!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖ స్వరూపంలో మార్పు వచ్చినందున.. విధులు, బాధ్యతలు మారనున్నందున ఆ శాఖ పేరును మారుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. భూరికార్డుల ప్రక్షాళన నుంచి తహశీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతల అప్పగింత వరకు రెవెన్యూ శాఖలో పూర్తిస్థాయి సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. రెవెన్యూకు కొత్తపేరు పెడతామని కేసీఆర్ స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఈ శాఖ పేరును ‘భూపరిపాలన శాఖ’ గా మారుస్తారనే చర్చ జరుగుతోం ది. ఈ మేరకు గతంలోనే తమతో సీఎం కేసీఆర్ చర్చించారని, ఆ సందర్భంలోనే రెవెన్యూ శాఖ పేరు మార్పును ఆయన ధ్రువీకరించారని రెవెన్యూ ఉద్యోగ సంఘాలంటున్నాయి. రెవెన్యూ ఉన్నతాధికారుల వద్ద రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. భూపరిపాలన లేదంటే భూనిర్వహణ శాఖగా మార్చే ప్రతిపాదనలను రెవెన్యూ శాఖ పరిశీలిస్తోందని, దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. పైలట్ ప్రాజెక్టుగా ఓ గ్రామంలో సర్వే ధరణి పోర్టల్‌పై సమీక్ష సందర్భంగా సీఎం ప్రకటించిన విధంగా త్వరలోనే రాష్ట్రంలోని వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే ప్రారంభించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే భూముల సర్వే పూర్తిచేసిన రాష్ట్రాల పరిస్థితిని అధ్యయనం చేసిన రెవెన్యూ వర్గాలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సర్వే తీరును కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సర్వేపై ఓ నివేదికను కూడా సీఎం కేసీఆర్‌కు అందజేసినట్టు సమాచారం. అయితే, రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న భూములు సెడెస్టల్ (మరఠ్వాడా) సర్వే ప్రకారం ఉన్నాయని, ఈ విధానంలో ఉన్న భూముల సర్వేను కదిలించడం అంత సులభం కాదనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందువల్ల పైలట్ ప్రాజెక్టుగా తొలుత రాష్ట్రంలోని ఓ గ్రామం యూనిట్‌గా సర్వేను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ శాఖ ఉన్నతాధికారులున్నారు. ఈ గ్రామంలోని భూములను సర్వే చేసి అన్ని వ్యవసాయ భూములకు కోఆర్డినేట్లు ఇవ్వాలని, ఈ ప్రక్రియను పూర్తిగా పరిశీలించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా భూముల డిజిటల్ సర్వేకు ముందుకెళ్లాలనే ఆలోచనలో రెవెన్యూ వర్గాలున్నాయి. మరోవైపు ప్రస్తుతం భూముల సర్వేలో అమలవుతోన్న గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను డిజిటలైజ్ విధానంలో ఉపయోగించుకోవడం ద్వారా భూముల అక్షాంశాలు, రేఖాంశాలు గుర్తించి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డ్రోన్ సర్వే చేపడితే ఎలా ఉంటుందనేది కూడా రెవెన్యూ శాఖ పరిశీలిస్తోంది . ‘భూముల సర్వే ద్వారా ప్రగతిశీల ఫలితాలు వస్తాయన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అనుభవాలు చెపుతున్నది కూడా ఇదే. అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, జీపీఎస్ లేదా డ్రోన్ సర్వే పద్ధతుల్లోని సాధ్యాసాధ్యాలు, అవసరమయ్యే సిబ్బంది, పట్టే కాలపరిమితి, అయ్యే ఖర్చు, ఈ విధానాల ద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో వచ్చిన ఫలితాలు, సమస్యలు... తదితర అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంది. వీటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. త్వరలోనే దీనిపై పకడ్బందీ కార్యాచరణ పూర్తవుతుంది’అని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఏదిఏమైనా భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను సర్వే చేపట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని, అందుకు అనుగుణంగానే వీలున్నంత త్వరలో ప్రణాళిక ప్రారంభమవుతుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. -
రెవెన్యూకు కొత్త పేరు!
సాక్షి, హైదరాబాద్: ‘మారిన పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ స్వరూపం కూడా మారింది. విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయి. గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయి. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతు బంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేల సాయం అందిస్తు న్నది. కాబట్టి రెవెన్యూ అనే పేరు ఇప్పుడు సరిపోదు. పేరు మారే అవకాశం ఉంది. ధరణి పోర్టల్, డిజిటల్ సర్వే తదితర కారణాల వల్ల భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికా రుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. రైతులు తహశీల్దార్ కార్యా లయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యం. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యం. రెవెన్యూ శాఖలో ఎవరే పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్ చార్టు రూపొందిస్తుంది. ఆర్ఐ ఏం చేయాలి? తహశీల్దార్ ఏం చేయాలి? ఆర్డీవో ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తాం. రెవెన్యూ అధికారులను పనిచేయగలిగే, పని అవ సరం ఉండే చోట ప్రభుత్వం వాడుకుం టుంది’ అని సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రెనెన్యూ సంస్కర ణలు, ధరణి పోర్టల్ పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురు వారం ప్రగతిభవన్‌లో సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో డిజిటల్ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూము లకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ, రేఖాంశాలు) ఇస్తామని ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ‘ఏమైనా సమ స్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్లు ఆ దరఖాస్తులను పరిశీలించాలి. సీఎస్ నుంచి వచ్చే మార్గదర్శ కాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలి’అని సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ వంద శాతం విజయవంతమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి.. ‘ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసు పుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. అసెంబ్లీలో ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. ప్రతి భూమికి కో–ఆర్డినేట్స్ ఇస్తాం. వాటిని ఎవరూ మార్చలేరు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదు. ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ– ప్రభుత్వ భూముల మధ్య, అటవీ–ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుంది. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మూడు, నాలుగు నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయి’అని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూలో అవినీతి అంతమైంది.. ‘ధరణి పోర్టల్‌తో రెవెన్యూలో అవినీతి అంతమైంది. నోరులేని, అమాయక రైతులకు న్యాయం జరిగింది. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగింది. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగింది. డాక్యుమెంట్లు గోల్మాల్ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా జరిగిపోతున్నాయి. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. బయోమెట్రిక్, ఆధార్ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నది. ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిఫ్ట్ డీడ్ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో వేలుపెట్టి మార్పులు చేసే అవకాశం లేదు. చివరికి సీసీఎల్ఏ, సీఎస్ కూడా రికార్డులను మార్చలేరు. అంతా వ్యవస్థానుగతంగా మానవ ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొందమందికి మింగుడు పడుతలేదు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారే అపోహలు సృష్టించి గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు తికమక పడొద్దు. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలి. సందేహాలను నివృత్తి చేయాలి’అని సీఎం చెప్పారు. -
పేదలపై భారం మోపలేం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్ భారం వేసేందుకు తాము ఎంతమాత్రం సిద్ధంగా లేమని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుకు శాశ్వత ఉచిత విద్యుత్‌ను అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపింది. విద్యుత్ ఉద్యోగుల భద్రతకు నష్టం కలిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని పేర్కొంది. విద్యుత్ సంస్కరణలపై రాష్ట్రాలతో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చట్ట సవరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి రాష్ట్ర వాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. విద్యుత్ సంస్కరణల దిశగా అడుగేసిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే ముసాయిదా ప్రతిని రాష్ట్రాలకు పంపింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం దీనిపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో ముసాయిదాలో మార్పులు చేసిన కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది. ఉచిత విద్యుత్ అందాల్సిందే: ‘పేదల గృహ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం భారీగా సబ్సిడీ ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా పేదలకు యూనిట్ రూ.1.45కే (50 యూనిట్లలోపు) ఇస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం గత ఏడాది రూ.1,700 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు డిస్కమ్‌లకు ప్రభుత్వం రూ.9 వేల కోట్ల వరకు సబ్సిడీ ఇస్తోంది. మరోవైపు రైతు కోరినన్ని కనెక్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సబ్సిడీ విషయంలోనూ వెనకాడబోం. రైతుల కోసమే 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రారంభించింది. వారికి ఉచిత విద్యుత్ అందాల్సిందే..’ అని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. కేంద్రం విద్యుత్ సంస్కరణలు చేపడితే. వ్యవసాయ విద్యుత్ లైన్లు ఎవరు వేయాలి? ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఎవరు కొత్తవి బిగించాలి? అనే అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాల్లో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని, కచ్చితమైన విధివిధానాలు ఉండాల్సిన అవసరం ఉందని, రైతు ప్రయోజనాలు కాపాడాలని కోరారు. మా ఉద్యోగులకు కష్టం రావొద్దు కేంద్రం ఏ సంస్కరణలు చేపట్టినా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర విద్యుత్ రంగం బలోపేతం దిశగా వారు ప్రభుత్వంతో మమేకమై పని చేశారని శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. పవన, సౌర విద్యుత్‌ను జాతీయ స్థాయిలో లెక్కించి, రాష్ట్రం వాటా కేటాయిస్తే బాగుంటుందని సూచించగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పోటీ ఆపరేటర్లు వచ్చినా డిస్కమ్‌లు యథాతథంగా పనిచేస్తాయని చెప్పారు. డిస్కమ్‌ల లైన్లనే ప్రైవేటు ఆపరేటర్లు వాడుకుంటారని, ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ చౌర్యం, మీటర్ల బిగింపు, రీడింగ్‌తో పాటు అనేక అంశాలపై చర్చ జరిగింది. కాగా దక్షిణాది ప్రాంతంలో వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ఏర్పాటును కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. చదవండి: అభిమానికి సీఎం జగన్ ఆత్మీయ ఆలింగనం చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ -
ఆందోళన ఆపండి.. రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇకనైనా విరమించాలని రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కొత్త సాగు చట్టాలకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఆందోళనలో భాగస్వాములైన సిక్కు రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. మన రైతులను మనమే కించపర్చుకోవడం దేశానికి ఏమాత్రం మంచి చేయదని పేర్కొన్నారు. కొత్త చట్టాలను కొందరు రాజకీయ అంశంగా మార్చేశారని విమర్శించారు. రైతుల ఆందోళన వెనుక ఉన్న అసలైన కారణాలపై ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌డీఐకి (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) మరో నిర్వచనం ఇచ్చారు. విదేశీ విధ్వంసకర సిద్ధాంతం(ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ) అనే కొత్త ఎఫ్‌డీఐ దేశంలో ఆవిర్భవించిందని అన్నారు. ఈ సిద్ధాంతం నుంచి దేశాన్ని రక్షించుకొనేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. వారంతా ఆందోళన్ జీవులు ‘‘దేశంలో ఆందోళన్ జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చింది. నిష్ణాతులైన నిరసనకారులు ప్రతి ఆందోళనలో కనిపిస్తున్నారు. వారంతా ఆందోళనల నుంచి లాభం పొందాలనుకునే పరాన్నజీవులు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి లేకపోతే వారు బతకలేరు. రైతుల ఆందోళనలో పాల్గొంటున్న సిక్కులను ఖలిస్తాన్ ఉగ్రవాదులు అని సంబోధించడం తగదు. సిక్కుల సేవలు దేశానికి గర్వకారణం. పంజాబ్‌లో ఏం జరిగిందో మనం మర్చిపోకూడదు. దేశ విభజన వల్ల పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. 1984లో జరిగిన అల్లర్లలో సిక్కులు బాధితులయ్యారు. సంస్కరణలతో తోడ్పాటు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ), మండీ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలుగదు. ఈ చట్టాలతో మండీలు మరింత ఆధునికంగా మారుతాయి. కనీస మద్దతు ధర భవిష్యత్తులోనూ కచ్చితంగా కొనసాగుతుందని నేను హామీ ఇస్తున్నా. దేశంలో 80 కోట్ల మందికి రేషన్ సరుకులు ఎప్పటిలాగే అందుతాయి. దయచేసి తప్పుడు ప్రచారం సాగించకండి. కొత్త వ్యవసాయ చట్టాలతో వారు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకొనే స్వేచ్ఛ లభిస్తుంది. తద్వారా మంచి ధర పొందుతారు. పంటల సేకరణ విధానంలో సంస్కరణలు అవసరమని గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ చెప్పారు. రైతన్నలు కొత్త చట్టాలను అర్థం చేసుకోవాలి. రైతులు ఆందోళన ఆపేయాలి. చర్చల కోసం అన్ని ద్వారాలు తెరుద్దాం. చర్చల కోసం మిమ్మల్ని మరోసారి ఈ సభ నుంచే ఆహ్వానిస్తున్నా. కొత్త సాగు చట్టాలకు ప్రతిపక్షాలు, ప్రభుత్వం, ఆందోళనకారులు ఒక అవకాశం ఇవ్వాలి. రైతులకు మేలు చేస్తాయో లేదో చూడాలి. లోపాలుంటే తొలగించడానికి సిద్ధం. కశ్మీర్లో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషకరం. దీన్ని కాంగ్రెస్ నాయకులు ‘జి–23 సలహా’గా చూడొద్దు’’ అని ప్రధాని మోదీ కోరారు. తేదీ, సమయం మీరే నిర్ణయించండి: సంయుక్త కిసాన్ మోర్చా కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో తదుపరి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు శివ్‌కుమార్ కక్కా సోమవారం ప్రకటించారు. చర్చల తేదీ, సమయాన్ని మీరే నిర్ణయించండి అని కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆందోళన జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చిందన్న ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆందోళనకు ముఖ్యమైన పాత్ర ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలను తాము ఎప్పుడూ నిరాకరించలేదని చెప్పారు. ప్రభుత్వం పిలిచినప్పుడల్లా తాము వెళ్లామని, కేంద్ర మంత్రులతో చర్చించామని వెల్లడించారు. ‘‘కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వందల సార్లు చెప్పింది. అలాంటప్పుడు దానికి చట్టబద్ధత కల్పించడానికి అభ్యంతరం ఏమిటి?’’ అని రైతు సంఘం నేత అభిమన్యు కోహర్ ప్రశ్నించారు. చర్చలకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం రావాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహన్) పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ విమర్శించారు. ఆకలితో వ్యాపారమా? దేశంలో ఆకలితో వ్యాపారం సాగించాలనుకుంటే సహించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎంఎస్పీపై ప్రధాని మోదీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆందోళన విరమించాలన్న ప్రధానమంత్రి వినతిపై రాకేశ్ తికాయత్ సోమవారం ప్రతిస్పందించారు. ‘‘దేశంలో ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటే అంగీకరించే ప్రసక్తే లేదు. ఆకలి పెరిగితే పంటల ధరలు పెరుగుతాయి. ఆకలితో వ్యాపారం చేయాలనుకుంటున్న వారిని దేశం నుంచి తరిమికొట్టాలి’’ అని అన్నారు. ఎంఎస్పీ ఉండదని రైతులు కూడా చెప్పడం లేదని, దానికి చట్టబద్ధత కావాలని మాత్రమే ఆశిస్తున్నారని గుర్తుచేశారు. మూడు సాగు చట్టాలను రద్దు చేసి, ఎంఎస్పీ కోసం కొత్త చట్టం చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు. రైతుల పోరాటం రాజకీయ ప్రేరేపితం అన్న మోదీ వ్యాఖ్యలను తికాయత్ తప్పుపట్టారు. రైతుల్లో కులం, మతం ఆధారంగా చీలిక తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. సింఘు వద్ద తాత్కాలిక స్కూల్ ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద రైతుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక పాఠశాల దాదాపు 15 రోజుల తర్వాత పునఃప్రారంభమైంది. పంజాబ్‌లోని ఆనంద్ సాహిబ్‌కు చెందిన రైతులు ఈ పాఠశాలను డిసెంబర్లో ఏర్పాటు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న రైతుల పిల్లలు చదువుకునేందుకు ఈ స్కూల్‌ను ఒక టెంట్లో నెలకొల్పారు. జనవరి 24న ఈ స్కూల్‌ను మూసివేశారు. ఫిబ్రవరి 5న మళ్లీ తెరిచారు. 1 నుంచి 7వ తరగతి వరకు బోధిస్తున్నారు. -
విద్యుత్ సంస్కరణలు: రెండో రాష్ట్రంగా ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: నిర్దేశిత మూడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి, మధ్యప్రదేశ్ తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తద్వారా జీఎస్డీపీలో 0.15 శాతం మేర.. అంటే రూ.1,515 కోట్ల మేర అదనపు రుణాలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి పొందింది. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా జీఎస్డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునేందుకు పరిమితిని పెంచింది. అయితే ఇందులో 1 శాతానికి షరతులు విధించింది. పౌర కేంద్రీకృత సంస్కరణలు అమలు చేస్తే ఈ 1 శాతం రుణ పరిమితినీ వాడుకోవచ్చని పేర్కొంది. (చదవండి: టీడీపీ దౌర్జన్యం.. కర్రలతో దాడి..) రేషన్ కార్డు దేశంలో ఎక్కడైనా వినియోగించుకునేలా వ్యవస్థను రూపొందించడం, సులభతర వాణిజ్య సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు, విద్యుత్ సంస్కరణల్లో ఒక్కో సంస్కరణ అమలు చేస్తే జీఎస్డీపీలో 0.25 శాతం మేర అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు వీలు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మూడు సంస్కరణలు అమలు చేసి తాజాగా విద్యుత్ సంస్కరణల అమలు పూర్తి చేసింది. (చదవండి: అపహాస్యం: మాజీ మంత్రి సైతం పచ్చ కండువాతోనే..) విద్యుత్ సంస్కరణలు మూడింటిలో ఒకటైన విద్యుత్ సబ్సిడీల ప్రత్యక్ష నగదు బదిలీని 2020 డిసెంబర్ 31లోపు ఒక్క జిల్లాలోనైనా పూర్తి చేస్తే జీఎస్డీపీలో 0.15 శాతం మేర అదనపు రుణాలకు అర్హత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్కరణను అమలు చేసింది. 2020 సెప్టెంబర్ నుంచి విద్యుత్ రాయితీలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 కల్లా అన్ని జిల్లాల్లో ఇలాగే అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అమలు చేసిన సంస్కరణల కారణంగా రూ.9,190 కోట్ల మేర అదనపు రుణాలకు అర్హత లభించింది. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై గురువారం రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని, తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులతో చర్చల పేరుతో ఏకపాత్రాభినయం చేస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యుల విమర్శలపై ప్రభుత్వం దీటుగా స్పందించింది. రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. రైతులను శత్రువులుగా చూస్తున్నారని, వారి నిరసన కేంద్రాలను దుర్బేధ్య కోటలుగా మారుస్తున్నారని విపక్ష సభ్యులు విమర్శించగా, రైతుల సంక్షేమం కోసం తాము చేపట్టిన చర్యలను ప్రభుత్వం ఏకరువు పెట్టింది. రైతుల దేశభక్తిని ప్రశ్నించే హక్కు ప్రభుత్వానికి లేదని, ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి వారే కారణమని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో గురువారం పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు దీపిందర్‌సింగ్ హూడా వ్యాఖ్యానించారు. విపక్షాల విమర్శలను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన నేత జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం రైతుల కోసం, వారి ఆదాయాన్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించిందని వివరించారు. అంతకుముందు, జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లును హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. లక్ష కోట్ల అదనపు ఆదాయం రైతులకు అదనంగా లక్ష కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభకు తెలిపారు. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా అది సాధ్యం చేస్తామన్నారు. త్వరలోనే ఘాజీపూర్ వద్ద పోగుబడిన వ్యర్థాలను కూడా తరలించి, ఇంధనంగా మారుస్తామన్నారు. ‘గోబర్ ధన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పశువుల పేడ, వ్యవసాయ వర్థాలు, నగరాల్లోని చెత్త, అటవీ వ్యర్థాలు.. వీటన్నింటిని ఇంధనంగా మారుస్తాం. అలా సమకూర్చుకునే దాదాపు లక్షకోట్ల రూపాయలను రైతులకు అందజేస్తాం. తద్వారా రైతుల ఆదాయం పెంచుతాం’అని వివరించారు. లోక్‌సభ మళ్లీ వాయిదా లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు గురువారం సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగానే, సాగు చట్టాలను రద్దు చేయాలంటూ విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. 5 గంటలకు సభ మళ్లీ సమావేశమైన తరువాత కూడా విపక్షాలు నిరసన, నినాదాలు కొనసాగించాయి. నిరసనల మధ్యనే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆర్బిట్రేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత సభను స్పీకర్‌స్థానంలో ఉన్న మీనాక్షి లేఖ 6 గంటల వరకు వాయిదా వేశారు. -
2021–22లో ఆర్థిక వ్యవస్థ ‘వి’ షేప్ జోరు..
‘‘మరిన్ని సంస్కరణలు దేశానికి అవసరం. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడమే కాదు.. వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భరిస్తున్న ఆహార సబ్సిడీ బిల్లును తగ్గించుకోక తప్పని పరిస్థితి. పీడీఎస్ రేట్లను పెంచాల్సిందే. ప్రజారోగ్యంపై మరిన్ని నిధులను వెచ్చించడం ద్వారా.. ఆరోగ్యం, వైద్యం కోసం ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించాల్సిన అవసరం ఉంది. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలంగా పురోగతి సాధిస్తుంది. 2021–22లో 11 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుంది. ఇందుకు క్రమబద్ధమైన చర్యల మద్దతు కూడా ఉండాలి’’ అంటూ 2020–21 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంటు ముందుంచారు. ఏటా బడ్జెట్‌కు ముందు విడుదల చేసే ఆర్థిక సర్వే ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిఫలిస్తుంటుంది. న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నామినల్ జీడీపీ 15.4 శాతంగా ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020–21లో జీడీపీ మైనస్ 7.7 శాతానికి పడిపోవచ్చన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరంలో వీ షేప్ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని పేర్కొంది. కరోనా నివారణ వ్యాక్సిన్ల కార్యక్రమం ఇందుకు చేదోడుగా నిలుస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. జీడీపీ చివరిగా 1979–80 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5.2 శాతం వృద్ధిని చవిచూసింది. వ్యవసాయ రంగం ఒక్కటీ ఆశాకిరణంగా కనిపిస్తోందంటూ.. సేవలు, తయారీ, నిర్మాణరంగాలు లాక్డౌన్లతో ఎక్కువగా ప్రభావితమైనట్టు ఆర్థిక సర్వే పేర్కొంది. సంస్కరణలు, నియంత్రణల సరళీకరణ, మౌలిక రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ రంగానికి ఊతమివ్వడం, వ్యాక్సిన్లతో విచక్షణారహిత వినియోగం పుంజుకోవడం, తక్కువ వడ్డీ రేట్లతో రుణాల లభ్యత పెరగడం వంటివి వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. 17 ఏళ్ల తర్వాత కరెంటు ఖాతా మిగులును చూపించబోతున్నట్టు తెలిపింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ ద్రవ్యపరమైన చర్యలు చిన్నగానే ఉన్నాయి. కానీ, ఆర్థిక రికవరీకి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. దీంతో భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని ద్రవ్యపరమైన ప్రోత్సాహక చర్యలను ప్రకటించేందుకు వెసులుబాటు ఉంది’’ అని సర్వే పేర్కొంది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. సాగు.. సంస్కరణల బాట వ్యవసాయ రంగాన్ని ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన అవసరం ఉందని.. స్థిరమైన, నిలకడైన వృద్ధి కోసం ఈ రంగంలో సత్వరమే సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ‘‘వ్యవసాయరంగంలో పురోగతి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తక్కువ ఆదాయ వర్గాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అందుకే గ్రామీణ ఉపాధి హామీ రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా వ్యవసాయ రంగాన్ని చూడాల్సిన అవసరం ఉంది’’ అని విశదీకరించింది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ వ్యవసాయ రంగం తన బలాన్ని చాటుకుంటుందని పేర్కొంది. జీడీపీలో భాగమైన ఇతర రంగాలు కరోనాతో నేలచూపులు చూసిన వేళ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఒక్కటే ఆశాకిరణంలా నిలిచాయని తెలిపింది. రుణ, మార్కెట్ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ కింద ఆహార శుద్ధికి తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి పెరిగిందని వివరించింది. దేశంలో సమ్మిళిత వృద్ధి అన్నది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లేకుండా సాధ్యం కాదంటూ.. ఇది వ్యవసాయరంగంపైనే ప్రధానంగా ఆధారపడి ఉందని పేర్కొంది. ‘‘నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. హైబ్రిడ్, ఇతర మెరుగుపరిచిన విత్తనాల వాడకం, భిన్నమైన వంగడాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదే విధంగా విత్తన పరీక్షా కేంద్రాలను పెంచడం వంటివి తక్కువ ఉత్పాదకత ఆందోళనలను తగ్గిస్తుంది’’ అంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాగు రంగం విషయమై సర్వే తన విస్తృతాభిప్రాయాలను తెలియజేసింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామస్థాయి కొనుగోళ్ల కేంద్రాలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్, గ్రామీణ మార్కెట్ల అభివృద్ధి, ఏపీఎమ్‌సీ మార్కెట్లకు బయట విక్రయించుకునే అవకాశం, గోదాముల నవీకరణ, రైల్వే రవాణా సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలియజేసింది. ఈ చర్యలు ఉత్పత్తి అనంతరం నష్టాలను తగ్గించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కూడా సాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది. మరింత పరిజ్ఞానంతో సాగు చేస్తే ఫలితాలు అధికమవుతాయని సూచిస్తూ.. ఇందుకోసం గ్రామీణ వ్యవసాయ పాఠశాలల ఏర్పాటును ప్రస్తావించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు (అటవీ, మత్స్య) దేశ ఉపాధిలో సగం వాటా ఆక్రమిస్తుండగా.. జీడీపీలో 18 శాతాన్ని సమకూరుస్తున్నాయి. కొత్త చట్టాలతో రైతులకు స్వేచ్ఛ నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో బలంగా సమర్థించుకుంది. నూతన తరహా మార్కెట్ స్వేచ్ఛకు నూతన వ్యవసాయ చట్టాలు తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దీర్ఘకాలంలో మెరుగుపరుస్తాయని తెలిపింది. మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించినట్టు వివరించింది. వీటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలపై తన వాదనను సమర్థించుకుంది. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీల (ఏపీఎమ్‌సీ) విషయంలో సంస్కరణల అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కిచెప్పింది. మౌలిక రంగానికి ప్రాముఖ్యత.. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్తమ మార్గంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. మొత్తం మీద ఆర్థికాభివృద్ధికి, స్థూల ఆర్థిక స్థిరత్వానికి మౌలిక రంగం కీలకమైనదిగా పేర్కొంది. అన్‌లాక్ తర్వాత ఆర్థిక వ్యవస్థ, మౌలిక రంగాలు వృద్ధి దిశగా పయనిస్తున్నాయంటూ, రోడ్ల నిర్మాణం తిరిగి కరోనా ముందు నాటి వేగాన్ని సంతరించుకుంటుందని అంచనా వేసింది. సంక్షోభానంతర సంవత్సరంలో (2021–22) క్రమబద్ధమైన చర్యల ద్వారా ఆర్థిక రికవరీకి వీలు కల్పించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి దీర్ఘకాలిక వృద్ధి క్రమంలోకి కుదురుకునేలా చూడాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. 2020–25 కాలంలో రూ.111 లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల నిధి అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేదిగా అభివర్ణించింది. ఇన్ఫ్రాలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం పీపీపీ అప్రైజల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు.. ఈ కమిటీ రూ.66,600 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టులను సిఫారసు చేసినట్టు తెలియజేసింది. ‘రేషన్’ రేట్లను పెంచాల్సిందే ఆహార సబ్సిడీ నిర్వహించలేని స్థితికి చేరిందంటూ స బ్సిడీలను తగ్గించుకోక తప్పని పరిస్థితి ఉందంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 80 కోట్ల మందికి పైగా విక్రయిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ప్రభుత్వం పెంచాలంటూ సూచించింది. రేషన్ షాపుల్లో బియ్యం కిలో ధర రూ.3, గోధుమలు కిలో రూ.2, ముతక ధాన్యాల ధరలు కిలో రూ.1గా ఉన్నట్టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం చెబుతోంది. పీడీఎస్ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020–21 బడ్జెట్లో కేంద్రం రూ.1,15,569 కోట్లను కేటాయించడం గమనార్హం. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ప్రజారోగ్యం కోసం జీడీపీలో కేటాయింపులను ఒక శాతం నుంచి 2.5–3 శాతానికి పెంచాలంటూ ఆర్థిక సర్వే ముఖ్యమైన సూచన చేసింది. దీనివల్ల ప్రజలు తమ జేబుల నుంచి చేసే ఖర్చును తగ్గించడం సాధ్యపడుతుందని తెలిపింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయాలు పెరిగితే.. అది ప్రస్తుతమున్న ఖర్చులు 65 శాతం నుంచి 30 శాతానికి తగ్గేందుకు తోడ్పడుతుందని వివరించింది. లాక్డౌన్ విధానం కరోనా కేసులను నివారించడంతోపాటు లక్షమంది ప్రాణాలను కాపాడిందని సర్వే పేర్కొంది. సంక్షోభాలను తట్టుకునేవిధంగా ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయాలని.. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్య సేవల కోసం టెలీమెడిసిన్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని సర్వే సూచించింది. గ్రామీణ విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల జోరు గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లను కలిగిన విద్యార్థులు 36 శాతం నుంచి 2020–21లో 61 శాతానికి పెరిగినట్టు ఆర్థిక సర్వే ప్రస్తావించింది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, విద్యా పరంగా అసమానతలను తగ్గించొచ్చని సూచించింది. ‘‘డేటా నెట్వర్క్, కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, స్మార్ట్ఫోన్ల సేవలకు ప్రాధాన్యం పెరిగింది. డిస్టెన్స్ లెర్నింగ్, గ్రామీణ ప్రాంతాల నుంచి పనిచేసే అవకాశం ఇందుకు కారణం’’ అని సర్వే తెలిపింది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను ఇందులో ప్రస్తావించింది. దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది వృద్ధి రుణ స్థిరత్వానికి దారితీస్తుంది. ఒకవేళ భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2023–2029 మధ్య 3.8% కనిష్ట రేటు నమోదైనా కానీ, దేశ రుణ భారం కచ్చితంగా దిగొస్తుంది. భారత్ తప్పకుండా వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో మరింత మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యపడుతుంది. వృద్ధి 85% పేదరికాన్ని తగ్గించగలదు. జీడీపీలో ప్రజారోగ్యంపై ఖర్చును 2.5%కి పెంచితే.. అది ఒక సాధారణ కుటుంబం ఆరోగ్యం కోసం చేసే ఖర్చును 65% నుంచి 35%కి తగ్గిస్తుంది. – కేవీ సుబ్రమణియన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.. ► ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వంద సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే సంక్షోభంగా ఆర్థిక సర్వే అభివర్ణించింది. ► ప్రభుత్వ వినియోగం, ఎగుమతులు వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020–21 ద్వితీయార్ధంలో ఎగుమతులు 5.8% తగ్గొచ్చు. దిగుమతులు సైతం 11.3 శాతం తగ్గొచ్చు. ► 2020–21లో కరెంటు ఖాతాలో 2% మిగులు. ► రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదు. ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ► 2014–15 లో ప్రతీ రోజూ 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018–19 నాటికి 30 కిలోమీటర్లకు పెరిగింది. 2020–21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా రోజువారీ 22 కిలోమీటర్లకు పడిపోయింది. అన్‌లాక్‌తో తిరిగి ఇది పుంజుకోనుంది. ► కరోనా మహమ్మారి సవాళ్లలోనూ భారత ఏవియేషన్ పరిశ్రమ నిలదొక్కుకుని, దీర్ఘకాలంలో బలంగా పుంజుకోగలదని నిరూపించింది. ► 2019 జూలై నుంచి 2020 అక్టోబర్ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగర్మాల ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. ► రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ► కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రకటించగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీ సంతరించుకున్న వెంటనే వీటిని ఉపసంహరించుకోవడంతోపాటు, ఆస్తుల నాణ్యత మదింపు చేపట్టాలి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ఇప్పటికీ స్వర్గధామం. 2020 నవంబర్‌లో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 9.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్‌పీఐలను ఆకర్షించింది భారత్ ఒక్కటే. ► భారత కంపెనీలు 2020–21లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.92,000 కోట్లను సమీకరించాయి. ఇది అంతక్రితం సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం అధికం. ► 9–12 తరగతుల విద్యార్థులకు దశల వారీగా వొకేషనల్ కోర్సులు. ► సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2020–21లో రూ.17.16 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ► కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎమ్–జేఏవై)ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో, అమలు చేయని రాష్ట్రాలతో పోలిస్తే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి, శిశు, చిన్నారుల మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతోంది. ► పన్నుల వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచేందుకు పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని పటిష్టం చేయాలి. ఇందుకోసం స్వతంత్ర వ్యవస్థ. ► ఐటీ–బీపీఎమ్ రంగం 2019–20లో 7.9 శాతం వృద్ధిని సాధించింది. ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ ఎంతో వేగాన్ని సంతరించుకుంది. డేటా వ్యయం తగ్గి మరింత అందుబాటులోకి వచ్చింది. నెలవారీ సగటున ఒక చందాదారు వైర్లెస్ డేటా వినియోగం 2019లో మార్చి నాటికి 9.1జీబీగా ఉంటే 2020లో 12.2 జీబీకి పెరిగింది. ► ద్రవ్యోల్బణం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చూసేందుకు ఆహారోత్పత్తులకు ఉన్న వెయిటేజీలో మార్పులు చేయాలి. కోవిడ్–19 మహమ్మారిపరమైన గడ్డుకాలం గట్టెక్కామని, ఎకానమీ తిరిగి వేగంగా కోలుకుంటుందన్న ఆశాభావం సర్వేలో వ్యక్తమైంది. టీకాల లభ్యత, సేవల రంగం రికవరీ వంటి అంశాలు వృద్ధికి మరింతగా ఊతమివ్వగలవు. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఎకానమీ ప్రస్తుత అవసరాలకు తోడ్పడే పలు కీలక అంశాలను సర్వేలో పొందుపర్చారు. రాబోయే బడ్జెట్లోనూ ఇవి ప్రతిఫలించగలవని ఆశిస్తున్నాం. మరిన్ని రంగాలు పటిష్టమైన వృద్ధి బాట పట్టాలంటే 2021 ఆసాంతం ప్రభుత్వం నుంచి నిరంతరం సహాయ, సహకారాలు అవసరం. – ఉదయ్ శంకర్, ప్రెసిడెంట్, ఫిక్కీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలతో సర్వే ఆశావహ దృక్పథంతో రూపొందింది. కోవిడ్–19 వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించగలిగితే 2021–22లో మరింత అధిక స్థాయిలోనూ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉంది. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం -
సెన్సెక్స్ @ 50000
భారత స్టాక్ మార్కెట్లో గురువారం ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్ల చరిత్రలో తొలిసారి 50 వేల మైలురాయిని అందుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో హర్షద్ మెహతా, కేతన్ పరేష్, సత్యం కుంభకోణాలను చూసింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం, కోవిడ్–19 సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొంది. అలాగే ఆర్థిక సంస్కరణలు, జీఎస్టీ అమలు, నోట్ల రద్దు నిర్ణయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. తన ఒడిదుడుకుల ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టిస్తూ.., వాటిని తానే తిరగరాస్తూ ముందుకు సాగింది. పతనమైన ప్రతిసారీ అంతే వేగంగా కోలుకుని ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలుబెట్టుకుంది. 1979 ఏప్రిల్ 1న ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్ ఇప్పటివరకు 16 శాతం వార్షిక సగటు రాబడి (సీఏజీఆర్)ని అందించింది. కోవిడ్ ముందు... తర్వాత..! కోవిడ్ వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాటు డిమాండ్ సన్నగిల్లడంతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలో çసరిగ్గా 10 నెలల సెన్సెక్స్ కిత్రం(మార్చి 24న) సెన్సెక్స్ 25,638 స్థాయికి దిగివచ్చింది. ఈ కరోనా కాలంలో సెన్సెక్స్ ప్రపంచ ఈక్విటీ సూచీల్లోకెల్లా అత్యధికంగా 80 శాతం నష్టపోయింది. ఒకవైపు సంక్షోభం దిశగా కదులుతున్న ఆర్థిక వ్యవస్థ, మరోవైపు రోజురోజుకూ దిగివస్తున్న ఈక్విటీ సూచీలు.. వెరసి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే నిరాశావాదంతో బుల్ మార్కెట్ పుట్టి, ఆశావాదంతో పరుగులు పెడుతుందనే వ్యాఖ్యలను నిజం చేస్తూ భారత మార్కెట్ దూసుకెళ్లడం సెన్సెక్స్‌కు కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహ అంచనాలు, కోవిడ్–19 వ్యాక్సిన్‌కు ఆమోదం, డాలర్ బలహీనతతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో వెల్లువెత్తిన విదేశీ పెట్టుబడులు సెన్సెక్స్ సంచలన ర్యాలీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ మార్చి కనిష్టం నుంచి అంటే 208 రోజుల్లో 24,500 పాయింట్లు లాభపడింది. సూచీ 50 వేల స్థాయిని చేరుకొనే క్రమంలో గతేడాది మార్చి 13న 2,889 పాయింట్లను ఆర్జించి తన జీవిత చరిత్రలో అతిపెద్ద లాభాన్ని పొందింది. ఇదే 2020 మార్చి 23న 3,934 పాయింట్లను కోల్పోయి అతిపెద్ద నష్టాన్ని మూటగట్టుకుంది. మార్కెట్ విశేషాలు... ► ఫ్యూచర్ గ్రూప్‌తో వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు సెబీ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 2 శాతం లాభపడింది. ► క్యూ3 ఫలితాల ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో హిందుస్థాన్ జింక్ 4 శాతం నష్టపోయింది. ► హావెల్స్ ఇండియా షేరు 11 శాతం ర్యాలీ చేసి ఏడాది గరిష్టాన్ని తాకింది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ► బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.196.50 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. కొత్త గరిష్టాల నుంచి వెనక్కి... ♦ రెండురోజుల రికార్డుల ర్యాలీకి విరామం ♦ ముగింపులో 50 వేల దిగువకు సెన్సెక్స్ సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ మార్కెట్ రెండు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. చివరి గంటలో బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 49,624 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 14,590 వద్ద స్థిరపడింది. ఆర్థిక వృద్ధిపై ఆశావహ అంచనాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఇంట్రాడే సెన్సెక్స్ 392 పాయింట్లు పెరిగి 50 వేల మైలురాయిని అధిగమించి 50,184 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇండెక్స్ సైతం 108 పాయింట్లు పెరిగి 14,753 వద్ద ఆల్‌టైం హైని అందుకుంది. డాలర్ మారకంలో రూపాయి మూడోరోజూ బలపడటం కూడా కలిసొచ్చిందని చెప్పొచ్చు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. దేశీయ పరిణామాలు కలిసిరావడంతో గురువారం సెన్సెక్స్ 305 పాయింట్ల లాభంతో చరిత్రాత్మక స్థాయి 50000 స్థాయిపైన 50,097 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 14,731 వద్ద మొదలైంది. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. సెన్సెక్స్ప్రెస్పై నిపుణులు ఏమన్నారంటే... గడిచిన రెండు దశాబ్దాల్లో సెన్సెక్స్ 5000 పాయింట్ల నుంచి 50,000 పాయింట్ల వరకు చేసిన ప్రయాణం చిరస్మరణీయం. ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలే స్టాక్ సూచీలకు సోపానాలుగా మారుతాయి. మున్మందు.., పైపైకే... అనే సూత్రాన్ని విశ్వస్తున్నాను. – రాధాకృష్ణ ధమాని, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అతిపెద్ద బుల్ మార్కెట్ ఇప్పుడే ప్రారంభమైంది. భవిష్యత్తులో మార్కెట్ పెరిగేందుకు అనేక కారణాలు మున్ముందు రానున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది. – రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, స్టాక్ మార్కెట్ బిగ్బుల్ 50 వేల పాయింట్ల మైలురాయిని అందుకోవడం అనేది సెన్సెక్స్‌కు కేవలం ఒక ప్రయాణం మాత్రమే. ఇది గమ్యంæ కాదు. మరో పదేళ్లలో లక్ష పాయింట్లకు చేరుకుంటుందని భావిస్తున్నాము. – విజయ్ కేడియా, కేడియా సెక్యూరిటీసీ చీఫ్ ఏప్రిల్ 1, 1979 సెన్సెక్స్ – 100 పాయింట్లు జూలై 25, 1990 సెన్సెక్స్ – 1000 పాయింట్లు ఫిబ్రవరి 7, 2006 సెన్సెక్స్ – 10,000 పాయింట్లు డిసెంబర్ 11, 2007 సెన్సెక్స్ – 20,000 పాయింట్లు మార్చి 4, 2015 సెన్సెక్స్ – 30,000 పాయింట్లు మే 23, 2019 సెన్సెక్స్ 40,000 జనవరి 21, 2021 సెన్సెక్స్ 50,000 -
మధ్యప్రదేశ్, ఏపీలకు కేంద్రం రివార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం రివార్టును ప్రకటించింది. పౌర సేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకుగాను రివార్డును అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలను అమలు చేయడంలో ఏపీ ముందంజలో నిలిచింది. కాగా రివార్డులో భాగంగా కేంద్రం స్పెషల్ అసిస్టేన్స్ కింద ఈ రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1004 కోట్ల రివార్డును అందించింది. ఇందులో ఏపీ వాటా 344 కోట్ల రూపాయలు ఉండగా.. మధ్యప్రదేశ్ వాటా 660 కోట్లు. -
అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు
న్యూఢిల్లీ/కోల్‌కతా: కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను తాము ఎప్పుడో తిరస్కరించామని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఒక సరైన ప్రతిపాదనతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. సవరణలను రైతులు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని రైతు సంఘం నేత శివకుమార్ కక్కా బుధవారం చెప్పారు. మరిన్ని సంస్కరణలు తథ్యం వ్యవసాయ రంగంలో సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం చెప్పారు. ఈ రంగంలో చాలా అంశాల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడు కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ చట్టాలపై రైతులు తదుపరి చర్చల కోసం ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని గుర్తుచేశారు. తదుపరి చర్చల కోసం తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. నూతన సాగు చట్టాలపై ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య ఇప్పటిదాకా ఐదుసార్లు చర్చలు జరగ్గా, అవన్నీ విఫలమయ్యాయి. మరోవైపు కొన్ని రైతు సంఘాలు కొత్త చట్టాల విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఆఫ్ రూరల్ ఇండియా సదస్సులో తోమర్ పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ ఇప్పటిదాకా 3,13,363 మంది రైతుల సంతకాలతో తనకు లేఖలు వచ్చాయని తెలిపారు. వీరిలో పంజాబ్, హరియాణా రైతులు సైతం ఉన్నారని చెప్పారు. రైతన్నలకు అండగా ఉంటాం: మమతా బెనర్జీ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఐదుగురు టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓ బ్రెయిన్, శతాబ్ది రాయ్, ప్రసూన్ బెనర్జీ, ప్రతిమా మండల్, నదీమ్ ఉల్ హక్ ఢిల్లీలో రైతులను స్వయంగా కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. నేడు రాష్ట్రపతితో కాంగ్రెస్ ఎంపీల భేటీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో నేడు భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు, నేతలు గురువారం విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం రామ్నా«థ్ కోవింద్‌తో సమావేశమై, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో పాటు మెమోరాండం సమర్పించనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ సంతకాలను సేకరించింది. 25న రైతులతో మోదీ సమావేశం ప్రధాని మోదీ డిసెంబర్ 25న దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ఉపన్యసించనున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోమారు వెల్లడించనున్నారు. ఆన్లైన్లో జరిగే ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు పాల్గొంటారు. వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
భారత్ ఎందుకొద్దు?
న్యూఢిల్లీ : ఆరేళ్లుగా కీలక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గతంలో ఇండియా ఎందుకు? అని ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని అడుగుతున్నారని చెప్పారు. తాము చేపట్టిన సంస్కరణ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని శనివారం ‘అసోచామ్ ఫౌండేషన్ వీక్–2020’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. వ్యవసాయ సంస్కరణలు, కొత్త చట్టాలతో రైతన్నలు ప్రయోజనం పొందడం మొదలైందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఎందుకు’ నుంచి ఎందుకొద్దు దాకా.. ‘మనం చేపట్టిన సంస్కరణలు పారిశ్రామిక రంగం ఆలోచనా ధోరణిని మార్చాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ ఎందుకు? నుంచి భారత్ ఎందుకొద్దు? అనే దాకా పరిస్థితి మారిపోయింది. గతంలో పారిశ్రామికవేత్తలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సందేహించేవారు. సంస్కరణలు, వాటి ప్రభావం వల్ల వారు ఉత్సాహం ముందుకొస్తున్నారు. 1,500 పాత, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. పెట్టుబడుల అంశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ముందుచూపునకు ఇదొక ఉదాహరణ. గతంలో పెట్టుబడిదారులు ఇండియాలో ఉన్న అధిక పన్ను రేట్లను ప్రస్తావించేవారు. ఇండియా ఎందుకు? అని ప్రశ్నించేవారు. మన ప్రభుత్వం పన్ను రేట్లను సరళీకరించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. గతంలో భారత్‌లోని కఠిన నిబంధనలు, నియంత్రణలను చూసి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గేవారు. మన ప్రభుత్వం అలాంటి నిబంధనలు, నియంత్రణల భారాన్ని తొలగించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అంటున్నారు’. మా మద్దతును విజయంగా మార్చండి ‘అన్ని రంగాల్లో లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగాలి. ఇందుకోసం మిషన్ మోడ్‌లో పని చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకునే భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం వేగంగా ప్రతిస్పందించాలి. గ్లోబల్ సప్లై చైన్ విషయంలో జరిగే మార్పులను పసిగట్టడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం అందించే మద్దతును ఒక విజయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలదే. భారత ఆర్థి క వ్యవస్థను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అత్యుత్తమ కార్పొరేట్ పరిపాలనా విధానాలు, లాభాలు పంచుకొనే విధానాలను పారిశ్రామిక రంగం అందిపుచ్చుకోవాలి. ఇక పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)లోనూ పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం చొరవ తీసుకోవాలి’. రైతుల పోరాటం మరింత ఉధృతం న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు. తమ పోరాటాన్ని మరింత ఉధృత చేస్తామన్నారు. తదుపరి కార్యాచరణను వచ్చే రెండు–మూడు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. కొత్త చట్టాలు, పోరాటంపై న్యాయ సలహా తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు శివకుమార్ కక్కా శనివారం చెప్పారు. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తామన్న కమిటీలో చేరాలా? వద్దా? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం విరమించే ప్రసక్తే లేదని మరో నేత బల్బీర్‌సింగ్ తేల్చిచెప్పారు. వేలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలోనే గత 23 రోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ పోరాటంలో పాల్గొంటున్నవారిలో ఇప్పటిదాకా 23 మంది రైతులు మరణించారని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) వెల్లడించింది. -
రైతుల వాదనకే మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతుల వాదనకే మద్దతిస్తున్నానని ప్రఖ్యాత జర్నలిస్ట్ పి.సాయినాథ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే ఏ కమిటీలోనూ సభ్యుడిగా ఉండాలనుకోవడం లేదని శుక్రవారం స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలపై రైతుల అభ్యంతరాలను అధ్యయనం చేయడంతో పాటు, వారిని ఆందోళనల నుంచి విరమింపచేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ కమిటీలో ఉండే సభ్యుల పేర్లలో తన పేరును సుప్రీంకోర్టు ప్రస్తావించడంపై సాయినాథ్ స్పందించారు. కమిటీ సభ్యుడిగా తన పేరు రావడంపై ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ‘ఒకవేళ ప్రభుత్వం సంప్రదిస్తే.. కమిటీ ఏర్పాటు హేతుబద్ధతపై ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలుసుకుంటాను. కమిటీ ఉద్దేశం, లక్ష్యాలేమిటో కనుక్కుంటాను. కమిటీ ప్రాతినిధ్యం వివరాలు, ఆ కమిటీ నివేదికను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసేదీ లేనిదీ కనుక్కుంటాను’ అని వివరించారు. రైతులు వెలిబుచ్చిన 14, 15 అభ్యంతరాల్లో 12 అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందంటేనే, చట్టాల్లో తీవ్ర లోపాలున్నాయని అర్థమవుతోందన్నారు. రైతులకు ఆల్ ఇండియా కిసాన్ సభ మద్దతు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతిస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రకటించింది. ఏఐకేఎస్ నాయకులు అజిత్ నవాలే, అశోక్ ధవాలే, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ నేతలు డీఎం దరార్, సునీల్ మాలుసరె మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ ప్రకటన చేశారు. ‘రైతుల కష్టంతో కార్పొరేట్లు లాభాలు ఆర్జించేందుకే ఈ చట్టాలు ఉపయోగపడ్తాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలో పాల్గొనేందుకు వేలాది మంది రైతులతో కలిసి డిసెంబర్ 21న ఢిల్లీకి బయల్దేరుతాం’ అని వెల్లడించారు. -
నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం
భోపాల్: వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం దేశంలో సాగు సంస్కరణల అవసరం ఎంతో ఉందన్నారు. కొత్త సాగు చట్టాలు ఎన్నాళ్లుగానో రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు కోరుతున్నవేనని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఈ సంస్కరణలు తీసుకువచ్చిన పేరు మోదీకి దక్కుతుందనే బాధతోనే విపక్ష పార్టీలు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలకు గతంలో ఆయా పార్టీలు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రైతులను ఉద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు గత 23 రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఈ చట్టాలపై ఎవరికైనా, ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా.. తలవంచి, చేతులెత్తి దండం పెడ్తూ చర్చలు జరిపేందుకు, వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చట్టాలు రాత్రికి రాత్రి రూపొందించినవి కావు. ఎప్పటినుంచో రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలు కోరుతున్నవే ఈ సంస్కరణలు’ అని పేర్కొన్నారు. ‘సాగు రంగం, రైతులు ఇంకా వెనకే ఉండిపోవడానికి వీల్లేదు. వారు అన్ని సదుపాయాలతో ఆధునికతను సంతరించుకోవాలి. ఈ విషయంలో ఇంకా ఆలస్యం కూడదు. సమయం ఎవరికోసం ఆగదు’ అని ప్రధాని ఉద్ఘాటించారు. గతంలో సాగు సంస్కరణలు తీసుకువస్తామని మేనిఫెస్టోల్లో పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మర్చిపోయిన వారిని రైతులు ప్రశ్నించాలన్నారు. నాడు అధికారంలో ఉన్నవారికి అది ప్రధాన విషయం కాదని విమర్శించారు. ‘ఇది మోదీ ఎలా చేయగలిగారు? ఈ మంచిపేరంతా మోదీకే వస్తే ఎలా? అనేదే వారి ప్రధాన సమస్య. ఈ విషయంలో మంచిపేరు నాకు అక్కర్లేదు. ఆ క్రెడిట్ మీ మేనిఫెస్టోలకే ఇవ్వండి. ఈ సంస్కరణలు మీ మేనిఫెస్టోల్లోనే ఉన్నాయి. నాకు కావల్సింది రైతుల అభివృద్ధి మాత్రమే. ఇకనైనా రైతులను తప్పుదోవ పట్టించడం ఆపేయండి’ అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘కొత్త చట్టాలపై మీ అభ్యంతరాలేమిటో చెప్పమని పదేపదే అడుగుతున్నాం. వారి వద్ద సమాధానం లేదు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతున్న వారే.. ఇప్పుడు కొత్త చట్టాలతో భూమిని కోల్పోతారని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏళ్లకేళ్లు అధికారంలో గడిపారు’ అని విపక్ష కాంగ్రెస్‌పై మండిపడ్డారు. 25, 30 ఏళ్ల క్రితమే తీసుకురావాల్సిన సంస్కరణలను తాము ఇప్పుడు తీసుకువచ్చామన్నారు. రైతన్నలను తాము అన్నదాతలుగా భావిస్తామని, ఇప్పటికే ఎమ్మెస్పీ ద్వారా దిగుబడి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు ఆదాయం రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడచిపోయాయి. కోవిడ్–19 సమయంలోనూ వ్యవసాయ ఉత్పత్తులను, గతంలో వారు తమ ఉత్పత్తులను అమ్ముకునే మండీల్లోనే, కనీస మద్దతు ధరకే కొనుగోలు చేశాం’ అని గుర్తు చేశారు. ‘ఎమ్మెస్పీ విధానాన్ని రద్దు చేస్తారంటే తెలివైన వ్యక్తి ఎవరూ నమ్మరు. ఇంతకంటే పెద్ద కుట్ర, అబద్ధం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ మార్కెట్ల విషయంలోనూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ‘కొత్త చట్టం ప్రకారం, వ్యవసాయ మార్కెట్ సహా ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు’ అని వివరించారు. గత ఆరు నెలల్లో ఒక్క మండీ కూడా మూతపడలేదని, మండీల ఆధునీకరణకు రూ. 500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. సాగు చట్టాలపై 25న రైతులతో మళ్లీ మాట్లాడుతానన్నారు. -
రైతుల ఆదాయం పెంచడానికే
న్యూఢిల్లీ: దేశంలో రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి నూతన వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశామని తెలిపారు. అడ్డంకులను తొలగించడంతోపాటు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను పెంచడానికి సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆ దిశగానే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చామని పేర్కొన్నారు. తన విధానాలు, చర్యల ద్వారా అన్నదాతల ప్రయోజనాలను కాపాడడానికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ శనివారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) 93వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కొత్త సాగు చట్టాలపై రైతుల భయాందోళనలను దూరం చేసే ప్రయత్నం చేశారు. రైతాంగం సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతులకు డిజిటల్ వేదికలు వ్యవసాయ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావడానికి, రైతులకు లబ్ధి చేకూరడానికి సంస్కరణలు దోహదపడతాయి. అన్నదాతలను సంపన్నులను చేయడమే ప్రభుత్వ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఈ చట్టాలతో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయి. వారు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి నిర్దేశిత మార్కెట్లలోనే కాకుండా వెలుపల కూడా అదనపు వెసులుబాటు లభిస్తుంది. రైతులు ప్రస్తుతం మార్కెట్లలో లేదా దళారులకు పంటలను విక్రయించుకోవాల్సి వస్తోంది. కొత్త చట్టాలతో మార్కెట్లను ఆధునీకరిస్తారు. రైతులకు డిజిటల్ వేదికలు అందుబాటులోకి వస్తాయి. విక్రయం, కొనుగోలు మరింత సులభ తరం అవుతుంది. ఇవన్నీ రైతుల ఆదాయం పెంచడం కోసమే. ఆదాయం పెరిగితే రైతులు ధనవంతులవుతారు. తద్వారా ఇండియా ధనిక దేశంగా మారుతుంది. కొత్త మార్కెట్లు... కొత్త అవకాశాలు నూతన సంస్కరణల అమలుతో రైతాంగానికి కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు. కోల్డ్ స్టోరేజీల్లో సదుపాయాలు మెరుగవుతాయి. వీటన్నింటితో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. ఈ సంస్కరణలో చిన్న, సన్నకారు రైతులు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రంగం వెలుగులీనుతోంది. రైతులకు మేలు చేకూర్చే చర్యలు ప్రారంభించాం. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలుపుతున్నారు. దీంతో విదేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోగలుగుతున్నాం. చెరకు పండించే రైతులకు మంచి ధర లభిస్తోంది. అడ్డుగోడలను కూల్చేస్తున్నాం... వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ వంటివి వేర్వేరుగా పని చేస్తున్నాయి. ఈ విధానం సరైంది కాదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం కావాలి. వివిధ రంగాల మధ్య వారధులు ఉండాలి తప్ప అడ్డుగోడలు కాదు. ఈ అడ్డుగోడలను కూల్చడానికి కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లోనూ ప్రజలకు బ్యాంకు ఖాతా, విశిష్ట గుర్తింపు సంఖ్య, తక్కువ ధరకే మొబైల్ డేటా అందుతున్నాయి. వీటితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ మన దేశంలో అవతరించింది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం వ్యవసాయ రంగంలో పారిశ్రామికవేత్తల పాత్ర పరిమితంగానే ఉంది. వారు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి. కోల్డ్ స్టోరేజీలు, ఎరువుల తయారీలో ప్రైవేట్ రంగం పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. పెట్టుబడిదారులకు గ్రామీణ ప్రాంతాలు మంచి ఎంపిక. ఇంటర్నెట్ వినియోగం నగరాల కంటే గ్రామాల్లో అధికంగా ఉంది. 98 శాతం గ్రామాలు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో అనుసంధానం అయ్యాయి. వారు సామాజిక, ఆర్థిక చైతన్యం కోరుకుంటున్నారు. పల్లె ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలకు వైఫై సేవలు అందించేందుకు ఇటీవల ‘ప్రధానమంత్రి వాణి’ ప్రాజెక్టును ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచడానికి ఉద్దేశించిన ఈ వేదికను పారిశ్రామిక రంగం ఉపయోగించుకోవాలి. 21వ శతాబ్దపు పురోగతికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అందించే సహకారమే కీలకం. అందుకే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. ఈ అవకాశం వదులుకోవద్దు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు గ్రామాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే ధ్యేయంగా ప్రభుత్వ విధానాలను రూపొందించాం. కనిష్ట స్థాయికి సర్కారు నియంత్రణలు కరోనా మహమ్మారి అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే సంకేతాలను ఆర్థిక సూచికలు ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ నియంత్రణలను కనిష్ట స్థాయికి తగ్గించి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. కరోనా మహమ్మారి మొదలైన ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడానికి గత ఆరేళ్లుగా పలు కార్యక్రమాలు చేపట్టాం. వీటి ఫలితంగా కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. పన్నుల్లోనూ సంస్కరణలు తెచ్చాం. దీంతో ట్యాక్స్ టెర్రరిజం, ఇన్స్పెక్టర్రాజ్ అంతమయ్యాయి. 20–20 క్రికెట్ మ్యాచ్‌లో పరిణామాలు శరవేగంగా మారుతుండడం మన చూస్తుంటాం. అదే తరహాలో 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. -
పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం
లక్నో: దేశ అభివృద్ధి కోసం కీలక సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గత శతాబ్దంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొన్ని చట్టాలు దేశానికి పెద్ద భారంగా పరిణమించాయని చెప్పారు. అభివృద్ధే ధ్యేయంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నికల ఫలితాల్లోనూ అవి ప్రతిఫలిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని తేల్చిచెప్పారు. ప్రజలకు కొత్త సౌకర్యాలు కల్పించాలంటే సంస్కరణలు తప్పవన్నారు. భారంగా మారిన చట్టాలను వదిలించుకోవాలన్నారు. వారి మద్దతు కొత్త బలాన్ని ఇస్తోంది ఇటీవల తాము తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగిందని మోదీ చెప్పారు. తమ ప్రయత్నాలను జనం ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా పేద, మధ్య తరగతి ప్రజల్లో తమకు ఆదరణ ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. కొత్త ప్రాజెక్టులకు నిధులు గత ప్రభుత్వాల హయాంలో మౌలిక వసతుల రంగంలో ప్రధాన సమస్య ఏమిటంటే.. కొత్త ప్రాజెక్టులను ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప నిధులు సమకూర్చడంపై శ్రద్ధ చూపలేదని ప్రధాని మోదీ ఆక్షేపించారు. తమ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1,000 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైల్ లైన్ల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సైనికుల సంక్షేమానికి చేయూతనివ్వండి మన సైనికుల నిస్వార్థమైన సేవ, సాహసాలు, త్యాగం పట్ల దేశం గర్విస్తోందని ప్రధాని అన్నారు. సైనిక దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సైనికులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలపాల్సిన రోజు ఇది అని చెప్పారు. సైనిక సంక్షేమానికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1949 నుంచి ఏటా డిసెంబర్ 7వ తేదీని ఫ్లాగ్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. టీకా కోసం ఎక్కువ కాలం నిరీక్షించలేం కరోనా వ్యాక్సిన్ రాక కోసం దేశం ఎక్కువ కాలం వేచి చూడలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. తాను కొన్ని వారాలుగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమైన శాస్త్రవేత్తలతో మాట్లాడుతూనే ఉన్నానని గుర్తుచేశారు. -
కార్పొరేట్ బ్యాంకులతో చిక్కులు
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై మూడు దశాబ్దాలు కావస్తుండగా ఇన్నాళ్లకు అసలు సిసలైన బ్యాంకింగ్ సంస్కరణలకు తెరలేచింది. ఈమధ్యే భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం కార్పొరేట్ సంస్థలు ప్రైవేటు బ్యాంకుల్ని తెరిచేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సిఫార్సు చేసింది. వారు సమర్పించిన నివేదికపై వచ్చే ఏడాది జనవరి 15లోపు అన్ని వర్గాల అభిప్రాయాలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ అంటోంది. ఎన్డీఏ ప్రభుత్వం తొలి అయిదేళ్లలోనూ, ఈమధ్యకాలంలోనూ ఆర్థిక రంగ సంస్కరణలపై చూపిస్తున్న శ్రద్ధను గమ నించినవారికి తుది నిర్ణయం ఎలా వుండగలదో ఇప్పటికే అర్థమైంది. ఇది చివరకు బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణకు కూడా దారితీయొచ్చన్నది కొందరు నిపుణుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో అయిదు దశాబ్దాలక్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒకేసారి 14 బ్యాంకుల్ని జాతీయం చేయడానికి దారితీసినప్పటి పరిస్థితులను మాత్రమే కాదు... రెండేళ్లక్రితం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్)కు, పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కి, నిరుడు యస్ బ్యాంకుకు, ఈమధ్య లక్ష్మీ విలాస్ బ్యాంకుకు ఏమైందో కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తీసుకున్న రూ. 91,000 కోట్ల రుణాలకు అది కనీసం వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకుని చతికిలబడినప్పుడు ఆ పరిణామాన్ని ‘మినీ లేమాన్ బ్రదర్స్ సంక్షోభం’గా నిపుణులు అభివర్ణించారు. ఇక యస్ బ్యాంకు కథ కూడా ఇలాంటిదే. 2004లో ప్రారం భమైన ఆ బ్యాంకు చకచకా ఎదిగింది. రేటింగ్ సంస్థల నుంచి ఎప్పటికప్పుడు మంచి మార్కులు కొట్టేసింది. çపదిహేనేళ్లు గడిచేసరికి అంతా తారుమారయింది. దాని పారుబాకీలు రూ. 17,134 కోట్లకు చేరుకున్నాయి. అది మునుగుతూ పలు సంస్థలనూ, బాండ్లు కొన్నవారిని, డిపాజిట్‌దార్లను ముంచేసింది. ఇక నీరవ్ పుణ్యమా అని పీఎన్బీ భారీ స్కాంలో కూరుకుపోయింది. తగిన హామీలేమీ లేకుండానే అతగాడికి రూ. 11,357 కోట్లు సమర్పించుకుంది. కనుక ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటు విషయంలో అతి జాగ్రత్తగా అడుగులేయాలన్నది నిపుణుల హెచ్చరిక. ఆర్బీఐ ఇంతక్రితం 2001లోనూ, 2013లోనూ ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పర్యవసానంగా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీవంటి ప్రైవేటు బ్యాంకులొచ్చాయి. అయితే కార్పొరేట్ దిగ్గజాలు ఈ రంగంలోకి రాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు విధించారు. ఇందుకు కారణం కూడా చెప్పారు. పారిశ్రామిక సంస్థలు బ్యాంకులు ప్రారంభిస్తే అవి సులభంగా ఆ బ్యాంకులనుంచి రుణాలు తీసుకోగలవు. ఎందుకు తీసుకుంటున్నారని వాళ్లను ప్రశ్నించేవారుండరు. పారిశ్రామికవేత్తే తమ యజమాని అయినప్పుడు బ్యాంకు నిర్వాహకులు వారిని ప్రశ్నించే సాహసం ఎలా చేస్తారు? ఈ ప్రశ్నలు గాల్లోంచి పుట్టుకురాలేదు. స్వాతంత్య్రానంతరం కొన్ని భారీ పారిశ్రామిక సంస్థలు ఇలాగే కావలసినప్పుడల్లా తమ సొంత బ్యాంకుల నుంచి తరచుగా రుణాలు తీసుకుని ఆ బ్యాంకుల్ని దివాళా తీయించాయి. ఇప్పుడు తాజాగా ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకున్న దాఖలా కనిపించడం లేదు. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్యలు దీనిపైనే ప్రశ్నలు సంధించారు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరే అన్నదాంతో వారు ఏకీభవించలేదు. ఇప్పుడు అంతకన్నా ప్రమా దకర పరిస్థితులున్నాయన్నది వారి అంచనా. వారి దృష్టిలో కేవలం ఆ సంస్థలు జనం దగ్గరనుంచి సేకరించే డిపాజిట్ల మొత్తంనుంచి సొంతానికి రుణాలు తీసుకోవడం ఒక్కటే సమస్య కాదు. వాటి రాకడ పెత్తందారీ ఆశ్రిత పెట్టుబడిదారీ పోకడలకు దారితీస్తుందన్నది వారి ఆందోళన. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే సకాలంలో గుర్తించి సరిచేయడానికి నియంత్రణ వ్యవస్థ అమల్లో వుంటుందన్న వాదనతో వారు ఏకీభవించలేదు. రాజన్, ఆచార్యల వాదనలు కొట్టివేయదగ్గవి కాదు. అందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలే ఉదాహరణ. ప్రతి బ్యాంకు బోర్డు లోనూ రిజర్వ్‌బ్యాంకు ప్రతినిధి వుంటారు. ఏ బ్యాంకు కార్యకలాపాలు ఏవిధంగా వున్నాయన్నది వారు గమనిస్తూ వుండాలి. కానీ బ్యాంకుల రుణ వితరణలో రాజకీయ జోక్యం పెరుగుతున్నా, పర్యవసానంగా బ్యాంకు నిండా మునిగే పరిస్థితి ఏర్పడినా ఆర్బీఐ రంగంలోకి దిగి అడ్డుకున్న దాఖలా లేదు. పారు బాకీలు పెరిగిపోయి, మూలధన కొరత, విస్తరణ సాధ్యపడక అవి నీరసిం చాయి. ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా ఆదుకోవడమే తప్ప, వాటంతటవి నిలబడిన ఆచూకీ లేదు. గత కొన్నేళ్లుగా పారు బాకీల లెక్కలు పక్కనపడేసి, ఆ ఏడాది ఆర్థిక కార్యకలాపాలను మాత్రమే చూపి బ్యాంకులకు లాభాలొచ్చినట్టు అంకెలు చూపుతున్నారు. వాస్తవానికి ఆ పారు బాకీలన్నీ బహిరంగపరిస్తే దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో వున్న వైనం కళ్లకు కడుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే బ్యాంకులను పర్యవేక్షించే నియంత్రణ వ్యవస్థ అందుకు భిన్నంగా ఏం చేయగలుగుతుంది? ఎన్ని లోటుపాట్లున్నా మన బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి పేరే వుండేది. కానీ అదంతా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, మరో నాలుగు బ్యాంకులు చతికిలబడటానికి ముందు. బ్యాంకుల వైఫల్యం అంతకంతకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ కొత్త మార్గం ఎంతవరకూ శ్రేయస్కరమో పాలకులు ఆలోచించాలి. కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకులు ప్రారంభిస్తే మొదట్లో అవి జనాన్ని ఆకర్షిస్తాయి. డిపాజిట్లు వెల్లువలా వస్తాయి. కానీ రకరకాల రూపాల్లో నియంత్రణ వ్యవస్థల కన్నుగప్పి సొంత ప్రయోజనాలకు భారీ మొత్తాలు మళ్లించుకుంటే...ఆనక ఆ బ్యాంకులు దివాళా తీస్తే ప్రజానీకం తీవ్రంగా నష్టపోతారు. కనుక ఈ విషయంలో ఆచితూచి అడుగేయడమే ఉత్తమమని కేంద్రం, ఆర్బీఐ గుర్తిస్తే మంచిది. -
‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!
న్యూఢిల్లీ: త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’ను ఏర్పాటు చేయడం సైనిక సంస్కరణల్లో తదుపరి కీలక నిర్ణయం అవుతుందని బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వెల్లడించారు. సైనిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. థియేటర్ కమాండ్స్ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఐక్యంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని ‘కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్’లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో సాయుధ దళాల విలీనం తప్పని సరిగా చోటు చేసుకునే విషయమని, త్రివిధ దళాల మధ్య సమన్వయానికి, వనరుల అత్యుత్తమ వినియోగానికి అది తప్పదని జనరల్ నరవణె వ్యాఖ్యానించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఒక కమాండర్ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా, ఐకమత్యంగా ఉమ్మడి మిలటరీ లక్ష్యం కోసం సమర్ధవంతంగా, సమన్వయంతో పనిచేసేందుకు ఏర్పాటు చేసేవే ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’. -
అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో సంస్కరణలు
మైసూర్: ఈ దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడం, దేశ పురోభివృద్ధే లక్ష్యంగా అన్ని రంగాల్లో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి, మన యువతలో పోటీతత్వాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సోమవారం మైసూర్ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. గత 7 నెలలుగా సంస్కరణల్లో వేగం పెరగడాన్ని మీరు గమనించే ఉంటారని అన్నారు. వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, విమానయానం, కార్మిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలు ఊపందుకున్నాయని, ఈ ప్రయత్నమంతా దేశ ప్రగతి కోసమేనని ఉద్ఘాటించారు. కోట్లాది మంది యువత ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. మన పునాదులను పటిష్టంగా మార్చుకుంటేనే ఈ దశాబ్దం భారతదేశ దశాబ్దంగా మారుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత దశాబ్దం దేశంలోని యువతకు అపారమైన అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లో అమలవుతున్న సంస్కరణలు గతంలో ఎప్పుడూ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏదో ఒక రంగానికే పరిమితం అయ్యేవని, ఇతర రంగాలను పక్కన పెట్టేవారని చెప్పారు. ఇండియాలో గత ఆరేళ్లుగా బహుళ రంగాల్లో బహుళ సంస్కరణలు అమలయ్యాయని వివరించారు. ఆరోగ్య రక్షణలో కేంద్ర స్థానంలో భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దేశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశంలో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. శాస్త్రీయ పరిశోధనా సంస్థలే భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని చెప్పారు. ఆరోగ్య రక్షణ విషయంలో ఇండియా ప్రపంచంలోనే కేంద్ర స్థానంలో నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. వైద్య రంగంలో భారత్ అనుభవం, పరిశోధనల్లో నైపుణ్యాలే ఇందుకు కారణమని వివరించారు. వైద్య రంగంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న మొత్తం టీకాల్లో 60 శాతానికిపైగా టీకాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పరిశోధకులను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కనిపెట్టడమే చాలెంజెస్ లక్ష్యం. -
ఆహార భద్రతకు ఆ రెండూ కీలకం
న్యూఢిల్లీ: రైతులు పండించిన పంటలను మద్దతు ధరతో సేకరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టం చేశారు. దేశ ఆహార భద్రతకు ఈ రెండు అంశాలు ముఖ్యమైనవని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా కనీస మద్దతు ధర విధానం శాస్త్రీయమైన పద్ధతిలో కొనసాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రపంచ ఆహార భద్రత విషయంలో భారత్ నిబద్ధతకు ఇటీవలి వ్యవసాయ సంస్కరణలే నిదర్శనమని ఆయన వివరించారు. అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోదీ రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో మండీల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూ.2,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సాగును విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకూ ఉద్దేశించినవని వివరించారు. ఎసెన్షియల్ కమాడిటీస్ చట్టంలో చేసిన మార్పులతో మండీల మధ్య పోటీతత్వం ఏర్పడుతుందని, తద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు ఆహార వృథాను అరికట్టవచ్చునని ప్రధాని చెప్పారు. ‘‘ఇప్పుడు మార్కెట్లే చిన్న, సన్నకారు రైతుల ఇంటి ముందుకు వచ్చేస్తాయి. అధిక ధరలు అందేలా చేస్తాయి. దళారులు లేకుండా పోతారు’’అని వివరించారు. కోవిడ్–19 కాలంలో భారత ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల విలువైన తిండిగింజలను 80 కోట్ల మందికి అందించిందని మోదీ తెలిపారు. ఈ ఉచిత రేషన్ అనేది యూరప్, అమెరికాలోని జనాభా కంటే ఎక్కువ మందికి అందించామని అన్నారు. పోషకాహార లోపాలను అధిగమించేందుకు కేంద్రం సిద్ధం చేసిన ఎనిమిది పంటల 17 బయో ఫోర్టిఫైడ్ వంగడాలను మోదీ విడుదల చేశారు. 2023 సంవత్సరాన్ని ‘‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ఆచరించేందుకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంగీకరించడం అధిక పోషక విలువలున్న ఆహారానికి ప్రోత్సాహమివ్వడంతోపాటు చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. వంగడాలతో కొత్త వెరైటీలు ప్రధాని జాతికి అంకితం చేసిన 17 కొత్త వంగడాల్లో ప్రత్యేకతలు ఎన్నో. కొన్ని పోషకాలు సాధారణ వంగడాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. స్థానిక వంగడాలు, రైతులు అభివృద్ధి చేసిన వంగడాల సాయంతో కొత్త వెరైటీలను సిద్ధం చేశారు. ► ఇనుము, జింక్, కాల్షియం, ప్రొటీన్, లైసీన్, ట్రిప్టోఫాన్, విటమిన్లు ఏ, సీ, యాంథోసైనిన్, ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ల వంటి పోషకాలను వీటితో పొందవచ్చు. ► సాధారణ వంగడాల్లో పోషకాలకు వ్యతిరేకంగా పనిచేసే యురుసిక్ ఆసిడ్, ట్రిప్సిన్ నిరోధకం తదితరాలు కొత్త వంగడాల్లో తక్కువగా ఉంటాయి. ► కొత్త వంగడాల్లో రెండింటిని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) అభివృద్ధి చేసింది. గిర్నార్ –4, గిర్నార్ –5 అని పిలుస్తున్న ఈ రెండు వేరుశనగ వంగడాల్లో ఓలిక్ ఆసిడ్ మోతాదు ఎక్కువ. సబ్బులు, ఫార్మా, వస్త్ర పరిశ్రమల్లో ఓలిక్ ఆసిడ్‌ను ఉపయోగిస్తారు. ► జాతికి అంకితం చేసిన వాటిల్లో గోధుమ వంగడాలు ఐదు ఉండగా.. మొక్కజొన్న వంగడాలు మూడు, రాగులు, వేరుశనగ రెండు చొప్పున ..వరి, సామలు, ఆవాలు, కంద వంగడాలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇంకో వంగడం వివరాలు తెలియాల్సి ఉంది. ఆడపిల్లల వివాహ వయో పరిమితిపై త్వరలో నిర్ణయం ఆడపిల్లల కనీస వివాహ వయో పరిమితిపై కేంద్రం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వివాహానికి తగిన వయసు ఏమిటన్న విషయంపై ముఖ్యమైన చర్చలు జరుగుతున్నాయని, కనీస వయో పరిమితిని సవరించేందుకు ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆరేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా బాలికలు ఎక్కువ సంఖ్యలో బడిలో చేరుతున్నారని ఫలితంగా స్థూల నమోదు నిష్పత్తిలో తొలిసారి బాలికలు పై చేయి సాధించారని వివరించారు. స్వాతంత్య్ర దినో త్సవ ప్రసంగంలో భాగంగా మోదీ ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆడపిల్లల వివాహ కనీస వయో పరిమితి 18 ఏళ్లు కాగా, పురుషుల విషయంలో ఇది 21 ఏళ్లుగా ఉంది. -
మున్సిపాలిటీల్లో స్వయం సమృద్ధి
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదు. ఆ డబ్బును అక్కడే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఖర్చు చేయాలి. ఈ సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) సాధించే దిశగా అడుగులు వేయాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి, మరింత అభివృద్ధి జరిగేలా ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ►మున్సిపాలిటీల ఉద్యోగుల జీత భత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్ నిర్వహణ పక్కాగా ఉండాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి. వీధులను శుభ్రం చేయాలి. డ్రైనేజీలను తరుచూ క్లీన్ చేయాలి. ►ఇందుకోసం స్వల్ప మొత్తంలో యూజర్ చార్జీలు వసూలు చేసుకోవచ్చు. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్‌కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్ ఎం) మాత్రమే చార్జీలుగా వసూలు చేయాలి. ఎస్ఓపీ రూపొందించాలి ►మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వ్యయం ఎంత? జీతాల కోసం, అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? తదితర విషయాలన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్ఓపీ రూపొందించండి. ►ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడంతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా ఎస్ఓపీ ఉండాలి ►ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అసమాన పెట్టుబడి కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ఇటీవల చేపట్టిన కార్మిక, వ్యవసాయ సంస్కరణలు భారత్‌లో వ్యాపారం చేయడాన్ని మరింత సులభతరం చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మార్కెట్‌ను ఎంచుకోవడానికి రైతులకు హక్కు కల్పిస్తోందని, అలాగే ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా–2020 సదస్సులో ఆయన వీడియో ద్వారా కీలకోపన్యాసం చేశారు. భారత్–కెనడా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. శక్తివంతమైన ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత్వం, వ్యాపారానికి అనుకూలమైన విధానాలతో విదేశీ వ్యాపారులకు భారత్ అసమాన పెట్టుబడి కేంద్రంగా నిలిచిందని ప్రధాని అన్నారు. పెద్ద ఎత్తున సంస్కరణలు.. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకే విద్య, వ్యవసాయం, కార్మిక వంటి ప్రధాన రంగాల్లో సంస్కరణలు చేపట్టామని మోదీ తెలిపారు. ‘కార్మిక చట్టాల సంస్మరణలతో లేబర్ కోడ్స్ తగ్గుతాయి. ఇవి సంస్థలకు, ఉద్యోగులకు స్నేహపూర్వకంగా ఉంటాయి. అలాగే ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి దోహదం చేస్తాయి. విద్యా రంగంలో సంస్కరణలతో యువత నైపుణ్యం మెరుగవుతుంది. విదేశీ యూనివర్సిటీలు భారత్‌కు వస్తాయి. విద్య, తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడి, సహకారానికి భారత్ సరైన వేదిక’ అని వివరించారు. అవకాశాలను అందుకున్నాయి.. మౌలిక రంగ పెట్టుబడిలో ఉన్న పెద్ద సంస్థలకు కెనడా కేంద్రంగా ఉందని ప్రధాని గుర్తు చేశారు. ‘కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్స్ తొలుత ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. హైవేస్, ఎయిర్‌పోర్టులు, లాజిస్టిక్స్ రంగాల్లో కెనడా సంస్థలు ఇక్కడి అవకాశాలను అందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ నేడు బలంగా ఉంది. రేపు మరింత శక్తివంతమవుతుంది. ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, హైవేలు, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్‌లో ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నాం. ఎఫ్‌డీఐ విధానాలను సరళీకరించాం. సార్వభౌమ సంపద, పెన్షన్ ఫండ్స్ విషయంలో స్నేహపూర్వక పన్నుల విధానం అనుసరిస్తున్నాం. కోవిడ్–19 నేపథ్యంలో ప్రత్యేక విధానాన్ని అమలుచేశాం. పేదలు, చిన్న వ్యాపారుల కోసం ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చాం. నిర్మాణాత్మక సంస్కరణలకు దీనిని అవకాశంగా తీసుకున్నాం’ అని చెప్పారు. ఔషధ కేంద్రంగా భారత్.. ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ నిలిచిందని నరేంద్ర మోదీ తెలిపారు. ‘150కిపైగా దేశాలకు భారత్ మందులు అందించింది. 2019లో అంతర్జాతీయంగా ఎఫ్‌డీఐల రాక 1 శాతం తగ్గితే, భారత్ విషయంలో ఇది 20 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ పట్ల నమ్మకం కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 20 బిలియన్ డాలర్లకుపైగా ఎఫ్‌డీఐలను భారత్ స్వీకరించింది. అంతర్జాతీయంగా కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఇది సాధించాం’ అని వివరించారు. కాగా, భారత్‌లో విదేశీ పెట్టుబడుల్లో కెనడా 20వ స్థానంలో ఉంది. 600లకుపైగా కెనడా కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవి 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు చేశాయి. -
టెక్ దిగ్గజాలకు ఊహించని షాక్?
వాషింగ్టన్ : అమెరికాలో టెక్ దిగ్గజ కంపెనీలకు భారీ షాక్ తగలనుంది. ఆపిల్, అమెజాన్ లాంటి దిగ్గజాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నియంత్రణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా హౌజ్ కమిటీ తన నివేదకను రూపొందించింది. టెక్నాలజీ రంగంలో పోటీని పరిశీలిస్తున్న డెమొక్రాట్ల నేతృత్వంలోని హౌస్ ప్యానెల్, ఆపిల్, అమెజాన్ ఆపిల్ ఇంక్ వంటి దిగ్గజాలు మార్కెట్ స్థలాలను సొంతం చేసుకోవడం, వారి వారి స్వంత ఉత్పత్తుల విక్రయాలకే పరిమితం కావడంలాంటి పద్ధతులకు చెక్ పెట్టేందుకు భారీ సంస్కరణలను ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోటీ వాతావరణంలో మార్కెట్లో ఆధిపత్యం కోసం ఇవి అమలు చేస్తున్న వ్యూహాల దృష్టి పెట్టింది. డెమొక్రాటిక్ ప్రతినిధి డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని హౌస్ యాంటీట్రస్ట్ ప్యానెల్ దర్యాప్తు అనంతరం ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. అంతేకాదు టెక్ కంపెనీలు తమ డేటాను ఒక వెబ్సైట్ నుండి మరొక వెబ్సైట్లోకి సులభంగా తరలించడానికి అనుమతించే చట్టాన్ని కూడా ఇది సిఫారసు చేసినట్టు సమాచారం. పోటీదారులను అణిచివేసేందుకుఈ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సిపిలిన్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఈ నివేదిక ఈ వారంలోనే బహిర్గతం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నివేదికను అమోదిస్తే అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు ఊహించని పరిమాణాలు తప్పవని నిపుణుల అంచనా. అయితే ఈ నివేదికను ఎంతమంది కమిటీ సభ్యులు ఆమోదిస్తారనేది అస్పష్టం. కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అమెరికా హౌజ్ కమిటీ ప్రత్యేక ఉప కమిటీ విచారణకు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల హాజరైన సంగతి తెలిసిందే. -
సంస్కరణలతో దీర్ఘకాలంలో స్థిరవృద్ధి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల బలోపేతానికి సాయపడతాయని.. తద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ‘‘విధానపరమైన వాతావరణానికితోడు భాగస్వాములు అందరూ కలసి తీసుకున్న చర్యలు.. అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన నెలవారీ ఆర్థిక నివేదిక తెలియజేసింది. కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉండడం అన్నది స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి రేటుకు ప్రతికూలంగా మారుతుందని.. అయితే ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు దీన్ని అధిగమించేలా చేస్తాయంటూ వివరించింది. సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 మధ్య దేశంలో కరోనా కేసులు గరిష్టాలకు చేరినట్టు తెలుస్తోందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో తాజాగా చేపట్టిన సంస్కరణలు ఎప్పుడో సాకారం కావాల్సినవిగా అభిప్రాయపడింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఆర్థిక వ్యవస్థను క్రమంగా తెరవడం అన్నవి దేశ ఆర్థిక రికవరీకి తోడ్పడ్డాయంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన నివేదికలో పేర్కొంది. -
ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్లైన్ లోనే..
సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకుని రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పానికి అనుగుణంగా, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యంగా నిర్మాణ రంగం పురోభివృద్ధి సాధించేందుకు దోహదం చేసేలా టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు సంస్కరణలు తీసుకుని వస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు. భవన నిర్మాణాల అనుమతుల జారీ, కొత్త లే అవుట్లు నెలకొల్పడంలో ప్రస్తుతమున్న నిబంధనలను సరళీకృతం చేయడం, టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరులో జవాబుదారీ తనం పెంచడం వంటి అంశాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆయన ఆమోదం తెలిపారు. పూర్తి పారదర్శకతతో, అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా సామాన్య ప్రజలు భవన నిర్మాణపు అనుమతులను పొందేట్లుగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: సంక్షేమ హాస్టళ్లు.. మన పిల్లలు చదివేలా ఉండాలి) ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలకు భూములు ఇచ్చిన వారికి పరిహారంగా ఇచ్చే టిడిఆర్ ల జారీని సులభతరం చేయడంతోపాటు, నిబంధనలను సరళీకృతం చేయడం, భవన నిర్మాణపు అనుమతులు, లే అవుట్ల జారీ నిబంధనల్లో సవరణలు, ఇంపాక్ట్ ఫీజు చెల్లింపు, ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే నిర్వహించేట్లుగాను, పర్యవేక్షక తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించడం తదితర విషయాల్లో నిర్దిష్టమైన మార్గదర్శకాలతో మూడు ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో నెంబర్లు 178,179,180) జారీ అయ్యాయి. ఇకపై అక్రమ కట్టడాలు, లే అవుట్ల పై కఠినంగా వ్యవహరిస్తూ, అటువంటి వాటిపై ఉక్కుపాదం మోపనున్ననట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. (చదవండి: కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం) ఈ సంస్కరణలు అమలులోనికి తీసుకొచ్చే ముందు స్టేక్ హోల్డర్లతోనూ, రియిల్ ఎస్టేట్ రంగం ప్రతినిధులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపామని, ఆ వర్గాల వారు వెలిబుచ్చిన సమస్యలు, అభిప్రాయాలను క్రోడీకరించి, విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇలా అనేక విధాలుగా, అధ్యయనం చేసి టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ప్రభుత్వానికి చెందిన అన్ని పనులు గడప ముంగిట నుంచే జరిగేలా చూస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రజలకిచ్చిన మాటను అమలు చేసేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు మేలు చేసేలా, ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ రంగానికి చేయూత నిస్తూ, ముఖ్యంగా అన్ని రకాల ఇళ్ల నిర్మాణపు పనులు మరింత జోరందుకునేందుకు ప్రభుత్వ నిర్ణయాలు దోహదం చేస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. జీవోల్లోని ముఖ్యాంశాలు: ►సిటీ లెవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీ: స్టేక్ హోల్డర్ల విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకుని ఇంపాక్ట్ ఫీజును 6 వాయిదాల్లో 3సంవత్సరాల కాలపరిమితిలో అనుమతినివ్వడంతోపాటు, ఈ ఫీజు మొత్తాన్ని ప్రస్తుతమున్న దానికంటే సుమారు 50 శాతం మేర తగ్గించడం జరిగిందని మంత్రి వివరించారు. ►భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియ లో పోస్ట్ వెరిఫికేషన్ తొలగింపు: భవన నిర్మాణపు ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్న, పిదప సిస్టం దానిని పరిశీలించి నిర్దేశిత ఫీజు / చార్జీలు చెల్లించిన అనంతరం సిస్టం ద్వారా ఆమోదం పొందిన, ప్లాను, ఉత్తర్వులు జనరేట్ అవుతాయి. ఇప్పటి వరకు ఉన్న పోస్ట్ వెరిఫికేషన్ ను మరియు మల్టీస్టోరీడ్ బిల్డింగ్ కమిటీలను తొలిగించి, వీటి స్థానంలో పర్యవేక్షణ తనిఖిలు మరింత పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఆన్ లైన్ వెరిఫికేషన్ లో అనవసరమైన మానవ జోక్యం నివారిస్తూ సరళకృతం చేయడమైనది. ►టిడిఆర్‌ల జారీ , వినియోగం, పర్యవేక్షణ లపై నిర్ణయాలు.. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల విస్తరణ, ఇతరత్రా ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాల నిమిత్తం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా ఇచ్చే అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్ బ్యాక్ ల లో సడలింపులకు వీలు కల్పిస్తూ జారీ చేసే ట్రాన్సఫర్ బుల్ డెవలప్ మెంట్ రైట్స్ (టిడిఆర్) లను ప్రస్తుతం మాన్యువల్ గా జారీ చేస్తున్నారు. ఈ టిడిఆర్లను రాష్ట్రంలోని ఏప్రాంతంలోనైనా వినియోగించుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మాన్యువల్ గా జారీ చేసే ప్రక్రియలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలన్నిటిని అధ్యయనం చేసిన తరువాత ఇకపై వీటి జారీ, బదలాయింపు, వినియోగం వంటి అంశాలన్నీ పూర్తి పారదర్శకతతో ఆన్ లైన్ లోనే జరగాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. అంతే కాకుండా, ఇంతవరకు టిడిఆర్ లను, భవన నిర్మాణపు అనుమతుల జారీ చేసేందుకు చెల్లించాల్సిన ఫీజుల రూపంలో సర్దుబాటు చేస్తున్నారు. ఇకపై టిడిఆర్ లను ఫీజుల రూపంలో సర్దుబాటు చేయడమనే ప్రక్రియను నిలిపివేస్తున్నారు. అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్ ల సడలింపుల నిమిత్తం వినియోగించే టిడిఆర్ ల ను కూడా అగ్నిమాపక భద్రతా చర్యలకు లోబడే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా ఉపయోగం నిమిత్తం, పేదల గృహ నిర్మాణాలకు కూడా టిడిఆర్ ను వర్తింప చేయనున్నారు. ఏదైనా నిర్దేశిత ప్రజోపయోగం నిమిత్తం (గృహ నిర్మాణాలు, నీటి సరఫరా, డ్రైనేజి, విద్య, ఆరోగ్యం తదితర టికి) వినియోగించే భూములకు 400 శాతం టిడిఆర్ ను వర్తింపచేస్తారు. అలాగే ఏదైనా స్లమ్ ఏరియా కు సంబంధించి, దాని పునర్నిర్మాణానికి ప్రతిపాదించిన సందర్భాల్లో ప్రభుత్వ అనుమతితో టిడిఆర్ ను వర్తింప చేస్తారు. ►పారిశ్రామిక ప్రతిపాదనలకు కొన్ని సడలింపులు: పారిశ్రామిక పేరిఫరల్ రోడ్డు (ప్రాజెక్ట్ స్థలములో వెనుకవైపు స్థలముకు రహదారి నిమిత్తం వదలవలసిన రోడ్డు), ఓపెన్ స్పేస్ ల అంశాల్లో పరిశ్రమలకు రాకపోకలు సాగించేందుకు , అంతర్గత రహదారుల వెడల్పు, వదలవలసిన ఖాళీ స్థలాల విషయంలో, క్షేత్ర స్థాయిలో ఆచరణ యోగ్యంగా ఉండే విధంగా నిబంధనల్లో కొన్ని సవరణలు తీసుకుని వచ్చినట్లు మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు. ►అనధికార కట్టడాలు లే అవుట్లపై చర్యలు: భవన అనుమతితో పాటు వేకేంట్ ల్యాండ్ టాక్స్ (విఎల్ టి) ఇంటిగ్రేషన్ ద్వారా, భవన నిర్మాణపు అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేసేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నాము. గతంలో ఉన్న విధానం ప్రకారం విఎల్ టి గణన, చెల్లింపు ప్రక్రియకు 2-3 నెలల సమయం పట్టేది, కానీ ప్రస్తుత నిర్ణయంతో ఈ సమయం ఆదా అవుతుంది. ►రిజిస్ట్రేషన్ విభాగంతో ఆన్ లైన్ పోర్టల్ ల అనుసంధానం: పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఇది ఒకటి. భవన నిర్మాణపు అనుమతుల సమయంలో తనఖా గా ఉంచిన వాటి విడుదల లో అనవసర జాప్యాన్ని నివారించేలా, అవినీతికి ఆస్కారం కలగకుండా, దరఖాస్తు దారు నుంచి నిర్దేశిత ఫీజు వసూలు అవ్వడంతోపాటు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల విడుదల వేగవంతం అవుతుంది. తద్వారా భవన నిర్మాతలకు మేలు కలుగుతుంది. చట్ట విరుద్దమైన భవనాలు, లే అవుట్లలో రిజిస్ట్రేషన్ ల ను నిలుపుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రణాళిక బద్దమైన పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాము. నిబంధనలను అతిక్రమిస్తూ వెలిసే నిర్మాణాలు, లే అవుట్లను నిర్మూలించే చర్యలను ముమ్మరంగా నిర్వహించనున్నారు. ►ఇకపై భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీ, టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా అందుతున్న సేవలన్నిటిపై పర్యవేక్షక తనీఖీలను సమర్థవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాము, అలాగే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ పనితీరును మెరుగు పరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం నిర్మాణ రంగంలో భాగస్వామ్యులైన వారితోనూ, ప్రజలతోనూ ప్రజా ప్రతినిధులతోనూ సంప్రదించి తీసుకున్న ఈ నిర్ణయాలతో రాష్ట్రంలోని నిర్మాణ రంగం పురోభివృద్ధి సాధిస్తుందని, పట్టణ స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ వార్డుల్లోనూ వార్డు సెక్రటేరియట్ లు ఉన్న నేపథ్యంలో అక్రమ కట్టడాలు, అక్రమ లే అవుట్లు రాకుండా చూసే బాధ్యతలను ఆ వార్డులోని ప్లానింగ్ సెక్రటరి పర్యవేక్షిస్తారని మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై నిరంతర పర్యవేక్షణ, ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. -
కరోనా కన్నా ఎక్కువగా దీనికే భయపడుతున్నాను
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులతో రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా కాంగ్రెస్ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో ఈ బిల్లులపై సంభాషించారు. ఈ చట్టాల వల్ల రైతులు దోపిడీకి గురవుతారని.. వీటిని ‘నల్ల చట్టాలు’ అంటూ విమర్శించారు. ‘కిసాన్ కి బాత్’ పేరిట జరిగిన ఈ వర్చువల్ సంభాషణలో పంజాబ్, హరియాణా, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుంచి పది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సంభాషణలో రాహుల్ గాంధీ ఈ చట్టం రైతులకు ఏ విధంగా హాని కలిగిస్తుందో చెప్పాలని వారిని కోరారు. దాంతో బిహార్‌కు చెందిన ధీరేంద్ర కుమార్ అనే రైతు మాట్లాడుతూ.. ‘ఈ చట్టాలు పూర్తిగా నల్ల చట్టాలు. వీటి వల్ల రైతులు దోపిడీకి గురవుతారు. ఆత్మహత్యలు పెరుగుతాయి’ అని తెలిపారు. కనీస మద్దతు ధర విషయం గురించి రైతులు ఎందుకు భయపడుతున్నారని రాహుల్ ప్రశ్నించిగా.. దీన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటారు. రైతులను మోసం చేస్తున్నారు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: కొత్త సాగు చట్టాలు వద్దు) మహారాష్ట్రకు చెందిన గజనన్ కాశీనాథ్ అనే రైతు మాట్లాడుతూ.. ‘నేను కరోనా వైరస్ కంటే ఎక్కువగా ఈ చట్టాలకు భయపడుతున్నాను. నా భూమి నా తరువాతి తరం వారికి ఉంటుందా అనే అనుమానం తలెత్తుతుంది’ అన్నారు. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన మొదటి పెద్ద పోరాటం భూ సేకరణపై జరగిందని 2011 ఉత్తరప్రదేశ్ భట్టా పార్సౌల్‌లో అరెస్ట్ చేయడాన్ని ప్రస్తావించారు. నాటి ఘటనలో తనపై దాడి జరిగిందని.. అయితే తాను దాన్ని ఎదుర్కున్నాను అని తెలిపారు. ఇక కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు, నోట్ల రద్దు, జీఎస్టీకి పెద్ద తేడా లేదన్నారు. ఈ చట్టాలు రైతు హృదయంలో కత్తిపోటు లాంటివంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
కొత్త సాగు చట్టాలు వద్దు
న్యూఢిల్లీ/ఖట్కార్‌కలాన్: కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులతో రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా కాంగ్రెస్ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసనకారులు ఓ ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న పంజాబ్ యూత్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, తెలంగాణ, గుజరాత్, గోవా, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రైతులు వీధుల్లోకి వచ్చి, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బిల్లులను సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన కోరారు. తమిళనాడులో జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఎండీఎంకే చీఫ్ వైగో, పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, డీఎంకే నేతలు టీఆర్ బాలు, దయానిధి మారన్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో రైతు సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజాస్వామ్యం మరణించింది: రాహుల్ ఎన్డీయే ప్రభుత్వం రైతన్నల గొంతులను పార్లమెంట్ లోపల, బయట కర్కశంగా అణచి వేసిందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం మరణించింది అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులు రైతుల పాలిట మరణ శాసనమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ తేల్చిచెప్పారు. ధాన్య సేకరణ ప్రారంభమైంది కనీస మద్ధతు ధరతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు దేశమంతా ప్రారంభమైందని కేంద్రం తెలిపింది. 48 గంటల్లో హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని 390 మంది రైతుల నుంచి రూ. 10.53 కోట్ల విలువైన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని సోమవారం ప్రకటించింది. 2020–21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 495.37 లక్షల టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఆదివారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020. వీటిలో.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు అమల్లోకి వస్తే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రాల ఆధీనంలోని మండీలకు వెలుపల విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల చట్టంతో కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు తెరుచుకుం టాయి. మూడోది.. నిత్యావసరాల(సవరణ) బిల్లు. దీని ద్వారా బంగాళా దుంపలు, ఉల్లిగడ్డలు, వంటనూనెలు, చిరుధాన్యాల సరఫరా, ఉత్పత్తి, పంపిణీపై నియంత్రణలు తొలిగిపోతాయి. ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో కూడా ప్రతిపక్షం నిరసనలు తెలిపింది. ఈ బిల్లులను నిరసిస్తూ అధికార ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ బయటకు వచ్చింది. కశ్మీరీ, డోంగ్రీ, హిందీ.. జమ్మూకశ్మీర్‌లో ఉర్దూ, ఇంగ్లిష్‌తోపాటు కశ్మీరీ, డోంగ్రీ, హిందీలకు అధికార భాషల హోదా కల్పించే బిల్లును కూడా రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లు–2020ను ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది. బీజేపీని నిలదీయండి: కాంగ్రెస్ వ్యవసాయ రంగం, రైతుల పాలిట కేన్సర్‌లా మారిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలనీ, ఈ విషయంలో ఎన్డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఇలా ఉండగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్సర్– ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ నేతృత్వంలో రైతులు బుధవారం నుంచి రైలు రోకోలు జరుపుతున్న విషయం తెలిసిందే. -
నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు ?
ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ను ఐక్యరాజ్యసమితి (యూఎన్) భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి దూరంగా ఇంకా ఎన్నాళ్లు ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. సమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని గట్టిగా నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కోసం భారత్ వైపు చూస్తున్నాయని, అందరి అవసరాలు తీర్చే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సర్వప్రతినిధి సభలో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా మోదీ తన ప్రసంగాన్ని వినిపించారు. మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా యూఎన్‌లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ‘‘ఐక్యరాజ్య సమితిలో నిర్ణయాధికారం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి ? ప్రపంచ జనాభాలో 18 శాతం కంటే ఎక్కువగా ఉన్న అతి పెద్ద దేశానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్న దేశానికి భద్రతామండలిలో నిర్ణయాధికారాన్ని కల్పించరా ? ’’అని మోదీ నిలదీశారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా గండి కొడుతున్న విషయం తెలిసిందే. తాత్కాలిక సభ్య దేశంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు భారత్ కొనసాగనుంది. ఇదే సమయంలో మోదీ ఈ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి పరిస్థితులు వేరు. ఈ నాటి ప్రపంచ దేశాల పరిస్థితులు వేరు. సమస్యలు, వాటికి పరిష్కారాలు అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. చాలా దీర్ఘకాలంగా సంస్కరణల కోసం వేచి చూస్తున్నాం’’అని ప్రధాని చెప్పారు. మారాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మారకపోతే, ఆ తర్వాత మార్పు వచ్చినా అది బలహీనంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం గత 75 ఏళ్ల కాలంలో ప్రపంచ దేశాల్లో ఎన్నో ఉగ్రవాదుల దాడులు జరిగాయని, రక్తపుటేరులు ప్రవహించాయన్న ప్రధాని దానిని దీటుగా ఎదుర్కోవాలంటే యూఎన్‌లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం, ఆయుధాల సరఫరా, డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి వాటికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తన గళాన్ని గట్టిగా వినిపించాలని, శాంతి భద్రతలు, సయోధ్య అంశాలకు మద్దతు పలకాలన్నారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఇప్పటివరకు భారత్ 50 వరకు శాంతి మిషన్లను ప్రపంచం నలుమూలలకి పంపించిందని, జగతి సంక్షేమమే భారత్ ఆకాంక్ష అని మోదీ అన్నారు. కరోనాపై పోరాటంలో ఐరాస పాత్ర ఏది ? గత తొమ్మిది నెలల నుంచి ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూ ఉంటే, కలసికట్టుగా పోరాడేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలేంటని మోదీ ప్రశ్నించారు. కరోనాపై యూఎన్ నుంచి గట్టి ప్రతిస్పందన కూడా కరువైందని అన్నారు. కరోనా కష్ట కాలంలో భారత్‌లో ఫార్మా రంగం అద్భుతమైన పనితీరుని ప్రదర్శించిందని, 150కి పైగా దేశాలకు వివిధ రకాలైన ఔషధాలను సరఫరా చేశామన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో అతి పెద్ద దేశమైన భారత్ అందరి అవసరాలు తీర్చేలా కరోనా టీకా డోసుల్ని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలను సంక్షోభం నుంచి బయటపడేయగలదని హామీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌పై భారత్ మూడో దశ ప్రయోగాల్లో ఉందని తెలిపారు. -
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
-
భూ ఫిర్యాదులపై సమగ్ర విచారణ..
సాక్షి, అమరావతి: రెవెన్యూ భూముల సంస్కరణల మంత్రి వర్గ ఉప సంఘం భేటీ గురువారం జరిగింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. సీసీఎల్ఏ నీరబ్‌కుమార్, రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రెవెన్యూ సంబంధిత సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూ సమస్యలు తగ్గించేలా అందరికీ ఆమోదయోగ్యమైన సూచనలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలన,సూచనలు చేయడమే లక్ష్యంగా చర్చ సాగింది. (చదవండి: పరిటాల సునీత ఫ్యామిలీ భూబాగోతం!) 22ఏ కింద ఉన్న భూములపై అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఎస్టేట్, ఇనాం భూములపై సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూములను అతి తక్కువగా నామినల్ రుసుము చెల్లించి కన్వెర్ట్ చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారనే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు నెల రోజులపాటు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. -
సంస్కరణల అమలు పెద్ద సమస్య
ముంబై: సంస్కరణల అమలు భారత్‌కు ప్రధాన సవాల్ అని అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్ సీఈవో చార్లెస్ కేయ్ తెలిపారు. సహజంగా అవకాశాలతోపాటే సవాళ్లూ ఉన్నాయని చెప్పారు. వ్యవసాయం, కార్మికులకు సంబంధించి భారత్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బుధవారం జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘అధిక వృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు భారత్‌కు జనాభా వంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు జనాభా ఒక్కటే సరిపోదు. ఈ స్థాయి వృద్ధికి నిరంతర చర్యలు, నిఘా ఉండాలి. 1995లో భారత్‌లో తొలిసారిగా హెచ్‌డీఎఫ్‌సీలో పెట్టుబడి చేశాం. నాటి నుంచి పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది పరిస్థితి. అయితే సంస్కరణల అమలే సవాల్. సవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి భారత్‌కు బహిరంగ ప్రశ్నలు. ప్రస్తుత మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిన తీరు ఆహ్వానించదగ్గది. ప్రభుత్వం సరిగా స్పందించలేదంటూ దేశీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను బ్యాంకింగ్ రంగానికి వదిలేశారు. ఆర్బీఐ, మారటోరియం ద్వారా వ్యవస్థకు మద్ధతు ఇచ్చారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి’ అని అన్నారు. ‘‘లాక్డౌన్ ముందుగానే విధించడం వల్ల ఆరోగ్య రంగం బలపడింది. దీంతో కేసులు పెరుగుతున్నా ఈ రంగం నిలబడింది’’ అని ఆయన విశ్లేషించారు. -
21వ శతాబ్దపు ఆవశ్యకాలు!
న్యూఢిల్లీ: తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. తాజా సంస్కరణలతో రైతులు తాము కోరుకున్న ధరకు, కోరుకున్న చోట తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు లభిస్తుందన్నారు. వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులని, అవి రైతులను నాశనం చేస్తాయని విపక్ష పార్టీలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులపై విమర్శలను ప్రధాని తిప్పికొడుతూ.. ‘చాన్నాళ్లు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన నిబంధనల సంకెళ్లలో రైతులను ఉంచి, వారికి అన్యాయం చేసి, వారిని దోపిడీ చేసిన కొందరు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నార’న్నారు. ‘వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల కొందరు ఆ రంగంపై పట్టు కోల్పోతున్నారు. వాళ్లే ఇప్పుడు కనీస మద్దతు ధరపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఏళ్లకేళ్లు గడిపిన వారే ఇప్పుడు మా నిర్ణయాలను విమర్శిస్తున్నారు’ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు తాజా బిల్లులు వ్యతిరేకం కాదని, ఆ మండీల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో 9 హైవే ప్రాజెక్టులకు సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రికార్డు స్థాయిలో గోధుమలను ప్రభుత్వం సేకరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూనె ధాన్యాల సేకరణ 24 రెట్లు పెరిగిందని వివరించారు. -
ఆ ఎనిమిదినీ అంతం చేయాలి
‘‘మన భారతీయ చిత్రసీమల్లో హిందీ పరిశ్రమ మాత్రమే పెద్దది అనుకోవడం పొరపాటు. తెలుగు పరిశ్రమ కూడా టాప్ ప్లేస్‌లో ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడాలో ఫిల్మ్ సిటీ నిర్మించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘యోగి ఆదిత్యనాథ్‌గారి నిర్ణయం అభినందించదగ్గది. సినిమా పరిశ్రమలో ఇలాంటి సంస్కరణలు చాలా జరగాలి. అయితే భారతీయ సినిమా అంటే హిందీ మాత్రమే కాదు. తెలుగు మేకర్స్ ప్యాన్ ఇండియా సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఒక్కో ఇండస్ట్రీగా మనందరం ఉన్నప్పటికీ మన పరిశ్రమలన్నీ కలసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారాలి. మనందరం ఇలా విడివిడిగా ఉండటం డబ్బింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు ఉపయోగకరంగా మారింది. ఉత్తమమైన ప్రాంతీయ చిత్రాలకు దేశవ్యాప్త గుర్తింపు లభించదు. కానీ హాలీవుడ్ సినిమాకు దేశవ్యాప్త విడుదలలు ఏంటి? హిందీ సినిమాల్లో కరువవుతున్న నాణ్యత, మోనోపోలీ వల్లే ఇదంతా. మనందరం సినిమా పరిశ్రమను వివిధ టెర్రరిజమ్‌ల నుండి కాపాడాలి. వాటిని అంతం చేయాలి. అవేంటంటే... ► నెపోటిజమ్ టెర్రరిజమ్ ► డ్రగ్స్ మాఫియా టెర్రరిజమ్ ► సెక్సిజమ్ టెర్రరిజమ్ ► ప్రాంతీయ మరియు మతపరమైన టెర్రరిజమ్ ► విదేశీ సినిమాల టెర్రరిజమ్ ► పైరసీ టెర్రరిజమ్ ► శ్రమ దోపిడీ టెర్రరిజమ్ ► ప్రతిభను దోచుకునే టెర్రరిజమ్.. ఈ ఎనిమిది టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి’’ అని ట్వీట్ చేశారు కంగనా. -
వ్యవసాయం ఇక పాఠ్యాంశం
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020లో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనా లను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి, వంట నూనె దిగుమతులు తగ్గించి ఫుడ్ ప్రాసెసింగ్‌ను పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ‘‘వ్యవసాయ రంగానికి సంబంధించిన విజ్ఞానం ప్రతీ విద్యార్థికి ఉండాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో మాధ్యమిక స్థాయిలో వ్యవసాయాన్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడతాం’’అని ప్రధాని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల దేశంలో వ్యవసాయ రంగంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుందని వ్యవసాయం, దాని మార్కెటింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివి చిన్నప్పట్నుంచి ప్రతీ ఒక్కరూ నేర్చుకుంటే వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయం, పరిశోధనల అనుసంధానం వచ్చే ఆరేళ్లలో వ్యవసాయాన్ని, పరిశోధనల్ని అనుసంధానం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. గ్రామాల స్థాయిలో చిన్న, సన్నకారు రైతులకి కూడా వ్యవసాయ రంగం పరిశోధనలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ఈ అంశంలో యూనివర్సిటీ విద్యార్థులు విస్తృత పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మాధ్యమిక విద్య స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడితే ఆచరణలో ఎవరైనా బాగా రాణించడానికి ఉపయోగపడుతుందన్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. 30 ఏళ్ల తర్వాత భారత్‌పై దాడి చేసిన మిడతల దండుని తరిమి కొట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామన్నారు. వివిధ నగరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, డ్రోన్లు తదితర ఆధునిక పరిజ్ఞానం సాయంతో మిడతలపై మందులు పిచికారీ చేయడంతో పంటలకు నష్టం జరగలేదన్నారు. -
పారదర్శక పన్ను విధానం
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల వసూళ్ల విషయంలో అవినీతిని గణనీయంగా తగ్గించే దిశగా సిద్ధం చేసిన పలు సంస్కరణలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. పన్నుల మదింపు, వివాదాలపై అప్పీళ్లు అంశాల్లో వ్యక్తుల ప్రమేయం (ఫేస్‌లెస్ అసెస్మెంట్, అప్పీల్స్) లేకుండా చేయడం వీటిల్లో ఒకటి. పారదర్శక, నీతివంతమైన, ఉచితంగా అందుబాటులో ఉండే పన్ను సేకరణ విధానం కోసం పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తెలిపారు. ‘‘పారదర్శక పన్ను విధానం– నిజాయితీపరుల గుర్తింపు’’ పేరుతో సిద్ధం చేసిన ఓ వేదికను ఆన్లైన్ పద్ధతిలో ఆవిష్కరించిన మోదీ మాట్లాడుతూ దేశ జనాభాలో అతితక్కువ మంది అంటే కేవలం 1.5 కోట్ల మంది మాత్రమే పన్నులు కడుతున్నారని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిన వారు స్వచ్ఛందంగా ఆ పనిచేయాలని పిలుపునిచ్చారు. . వచ్చే నెల నుంచి ఫేస్‌లెస్ అసెస్మెంట్.. ప్రత్యక్ష పన్నుల విధానంలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా పన్ను చెల్లింపుదారుల చార్టర్, వ్యక్తుల ప్రమేయం లేని పన్ను మదింపును అమలు చేయడం ద్వారా పన్ను చెల్లింపులను అధికం చేయడంతో పాటు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ప్రోత్సహించడం వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త సంస్కరణల ఫలితంగా పన్ను చెల్లింపుదారులు ఏ పనికోసమైనా ఐటీ కార్యాలయాన్ని, అధికారిని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడదు. చార్టర్ కూడా గురువారం నుంచే అమల్లోకి రానుండగా ఫేస్‌లెస్ అసెస్మెంట్ అనేది సెప్టెంబర్ 25 నుంచి అమలు కానుంది. వ్యక్తుల పన్ను చెల్లింపులు, అప్పీళ్లు, పరిశీలన అన్నీ ఇప్పటివరకూ ఆయా వ్యక్తులున్న నగరాల్లోనే జరుగుతూండగా ఇకపై కేంద్రీకృత కంప్యూటర్ వ్యవస్థ ఐటీ రిటర్న్స్ స్వీకరిస్తుందని, నిశిత పరిశీలన అవసరమైన వాటిని తనంతట తానే యాదృచ్ఛికంగా అధికారులకు కేటాయిస్తుందని ప్రధాని వివరించారు. ఈ అధికారులు నిర్వహించే స్క్రూటినీపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏ నగరంలోని అధికారికి ఎవరి పన్ను రిటర్న్‌లు స్క్రూటినీకి వస్తాయో? ఏ అధికారి పర్యవేక్షిస్తారో తెలియదని చెప్పారు. కేంద్రీకృత కంప్యూటర్ వ్యవస్థ మాత్రమే వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తుందని, వాటికి వివరణ కూడా వ్యక్తిగతంగా కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలోనే ఇవ్వవచ్చన్నారు. నిష్పాక్షికత పెరుగుతుంది: ఆర్థిక మంత్రి వ్యక్తుల ప్రమేయం లేకుండా పన్నుల స్క్రూటినీ, అప్పీళ్లు వంటి సంస్కరణలతో పన్ను చెల్లింపుదారుపై నిబంధనల పాటింపు భారం తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే పన్ను వ్యవస్థలతో నిజాయితీ, నిష్పాక్షికత పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పన్నుల వ్యవస్థలో ఇది చరిత్రాత్మక రోజని ఆమె అభివర్ణించారు. పన్ను చెల్లింపుదారులకు సాధికారతనివ్వడం, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గౌరవించడం అన్నది ప్రధాని విజన్ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ అభియోగాలకు మినహాయింపు.. అంతర్జాతీయ స్థాయి కేసులు, తనిఖీ .. జప్తు చేయాల్సిన కేసులు మినహా స్క్రూటినీకి ఎంపిక చేసిన వాటన్నింటికీ ఫేస్‌లెస్ విధానం కింద మదింపు ప్రక్రియ వర్తిస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. అసెస్మెంట్ ఆర్డర్లన్నీ ఇకపై ఫేస్‌లెస్ అసెస్మెంట్ స్కీమ్ 2019 కింద జాతీయ ఈ–అసెస్మెంట్ సెంటర్ ద్వారా జారీ అవుతాయని వివరించింది. స్క్రూటినీ అసెస్మెంట్కు సంబంధించిన వివరాల సేకరణ కోసం జరిపే సర్వేలను ఇకపై ఇన్వెస్టిగేషన్ విభాగం, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) డైరెక్టరేట్ మాత్రమే నిర్వహిస్తాయని సీబీడీటీ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరం ఫేస్‌లెస్ అసెస్మెంట్, ఫేస్‌లెస్ అప్పీలు తదితర భారీ సంస్కరణలన్నీ పన్ను చెల్లింపుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రధాని ఆకాంక్షిస్తున్నట్లుగా స్వావలంబన సాధించేందుకు ఈ విధానం మరింతగా తోడ్పడగలదు. – ఉదయ్ కోటక్, ప్రెసిడెంట్, సీఐఐ మైలురాయి.. వ్యవస్థాగత సంస్కరణలకు సంబంధించి ఇది మరో మైలురా యి. ఇది పన్ను చెల్లింపుదారుల్లో మరింతగా విశ్వాసాన్ని పెంపొం దించగలదు. – సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ సరైన దిశగా సంస్కరణలు ప్రభుత్వం, పన్ను చెల్లింపుదారుల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం పెంపొందించేవిగా, భయాందోళనలను కలిగించని విధంగా ఉండాలి. ఆ దిశగా ఈ–అసెస్మెంట్ మొదలైనవి సరైన సంస్కరణలు. – దీపక్ సూద్, సెక్రటరీ, అసోచాం చరిత్రాత్మకం ప్రత్యక్ష పన్నుల విధానంలో తీసుకువచ్చిన మార్పులు చరిత్రాత్మకమైనవి. నిజాయితీగా పన్ను చెల్లించే వారిని గౌరవించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఫేస్‌లెస్ అసెస్మెంట్, ట్యాక్స్‌పేయర్స్ చార్టర్ వంటివి భారతీయ పన్ను విధానాన్ని మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకు ఉంది. – అమిత్ షా, హోంశాఖ మంత్రి -
అన్నదాతకు అండగా.. రూ.లక్ష కోట్లతో నిధి
న్యూఢిల్లీ: చిన్న రైతుల సాధికారతే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగంలో భారీగా సంస్కరణలు తీసుకువస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం లక్ష కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేశారు. రైతులకు అత్యంత పవిత్రదినమైన బలరామ్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించారు. ఇదేరోజు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కర్షకులు తమకు మంచి రోజులు రావాలని నాగళ్లకు పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. వ్యవసాయంలో దిగుబడులు పెంచడంలో ఇబ్బందుల్ని అధిగమించామని, పండిన పంటల్ని కాపాడుకోవడంలో ఎదురయ్యే సమస్యల్ని ఈ నిధి తీరుస్తుందని మోదీ చెప్పారు. ఈ నిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఆధునిక సౌకర్యాల కల్పన జరిగేలా పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ నిధి ద్వారా రుణాలు అందించడానికి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలుత రైతులకు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశారు. చట్టపరమైన అడ్డంకులు అధిగమించాం నిత్యావసర సరుకుల (ఈసీ) చట్టం కారణంగా ఇన్నాళ్లూ వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవరోధాలు ఉండేవి. ఇప్పుడు ఆ అవరోధాలన్నీ తొలగిపోయి వ్యవసాయ మౌలిక నిధి దేశంలో ప్రతీ రైతుకి ఉపయోగపడేలా కేంద్రం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చింది. దీని వల్ల రైతులు తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, లేదంటే ఫుడ్ ప్రాసెస్ కంపెనీలకు అమ్మడానికి నేరుగా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ‘‘దేశంలో ఆహార నిల్వలు డిమాండ్‌కి మించి ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎసన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అవరోధంగా మారింది. మనలాంటి మిగులు ఉత్పత్తి దేశానికి ఇక ఆ చట్టంతో పనిలేదు’’అని మోదీ చెప్పారు. ఒకే దేశం, ఒకే మండీ విధానం ద్వారా రైతులు పండిన పంటల్ని ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తున్నామని తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.17 వేల కోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దళారుల ప్రమేయం లేకుండా, కమీషన్ అన్న మాటకి చోటు లేకుండా ఒక్క క్లిక్‌తో ఒక్కో రైతు ఖాతాలో నేరుగా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ అయిందని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ప్రతీ ఏడాది మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం వ్యవసాయ మౌలిక నిధి ప్రారంభం కార్యక్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరోవిడత ని«ధుల విడుదల కార్యక్రమం కూడా జరిగింది.ఈ పథకం ప్రారంభించిన తర్వాత 10 వేల కోట్ల మందికిపైగా రైతులకు 90 వేల కోట్ల వరకు నిధులు అందాయి. ఏమిటీ వ్యవసాయ మౌలిక నిధి పండిన పంటను నిల్వ చేసుకునే సామర్థ్యం లేక రైతులు పంటల్ని రోడ్ల మీద పారబోసే దృశ్యాలను మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. అలాంటి వృథాని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసింది. ఈ నిధితో రైతులు సొంతంగా తమ గ్రామాల్లోనే పంటల్ని నిల్వ చేసుకోవడానికి ఆధునిక సదుపాయాలను కల్పించుకోవడానికి వీలు కలుగుతుంది. గ్రామాల్లోనే పంట సేకరణ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు వ్యవసాయం పండుగలా మారుతుంది. అంతేకాదు వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపడడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది. మొత్తం 10 వేల ఆహార శుద్ధి కేంద్రాలు, 350 అగ్రీ స్టార్టప్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పంట దిగుబడుల్ని కాపాడుకుంటే మంచి ధర వచ్చేవరకు వేచి చూసే అవకాశం కూడా రైతులకు ఈ నిధి ద్వారా లభిస్తుంది. రైతు సంఘాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, అగ్రీ స్టార్టప్‌లు వంటి వారందరికీ ఈ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకు క్రెడిట్ గ్యారంటీ ఈ నిధి ద్వారా రైతులకు లభిస్తుంది. మొత్తం నాలుగేళ్ల పాటు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాది 10వేల కోట్లు, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 30 వేల కోట్ల రూపాయల చొప్పున రుణాలు పంపిణీ చేస్తారు. -
పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: నూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా, 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పాఠశాల, కళాశాల విద్యను 21వ శతాబ్దపు అవసరాలకు అనువైనదిగా తీర్చిదిద్దడంపై ఈ విధానం ప్రధానంగా దృష్టి పెట్టింది. సామాజికంగా, ఆర్ధికంగా అణగారిన వర్గాల వారిపై ఈ విధానంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. జీడీపీలో విద్యారంగ కేటాయింపులు కనీసం ఆరు శాతానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు ప్రమాణాలు: ళి విద్యా సంబంధ, విధాన నిర్ణయాలకు సంబంధించి స్పష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఈ విధానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠశాల ప్రమాణాల రాష్ట్ర అథారిటీ(ఎస్ఎస్ఎస్ఏ)ని ఏర్పాటు చేసుకుంటాయి. 2035 నాటికి 50 శాతానికి జీఈఆర్: ళి ఉన్నత విద్యలో దేశంలో స్థూల ఎన్రోల్మెంట్ నిష్పత్తి (జీఈఆర్)ని 26.3 శాతం( 2018) నుంచి 2035 నాటికి 50 శాతానికి చేర్చాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొత్తగా 3.5 కోట్ల సీట్లను జత చేయనున్నారు. ఎంఫిల్ కోర్సులను తొలగించాలని నిర్ణయించారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ► ఉన్నత విద్యా వ్యవస్థ పాలన అవసరాల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య, న్యాయ విద్యకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీనికి నాలుగు స్వతంత్ర విభాగాలు ఉంటాయి. అవి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (జిఇసి), హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్. ► ఉపాధ్యాయ విద్యకు సంబంధించి, సమగ్రమైన నూతన జాతీయ కరికులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌ను 2021 నాటికి రూపొందించనున్నారు. 2030 నాటికి బోధనకు నాలుగు సంవత్సరాల బీఈడీ డిగ్రీ కనీస అర్హత అవుతుంది. నాసిరకం ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలుంటాయి. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్దులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌ను విస్తరింపచేసి స్కాలర్షిప్ పొందిన విద్యార్ధుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఎక్కువ ఫ్రీషిప్, స్కాలర్షిప్లను తమ విద్యార్థులకు అందించేలా చూస్తారు. ముఖ్యాంశాలు.. ► ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలి. వినూత్న విద్యా కేంద్రాలు, మౌలికసదుపాయాల మద్దతుతో మధ్యలోనే బడి మానేసిన దాదాపు 2 కోట్లమందిని మళ్లీ బడిబాట పట్టించాలి. ► పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టిపెడుతూ 10+2 విద్య స్థానంలో 5+3+3+4 సంవత్సరాల విద్యను తీసుకురానున్నారు. 3–8, 8–11, 11–14, 14–18 సంవత్సరాల విద్యార్ధులు దీనిపరిధిలోకి వస్తారు. ► పిల్లల మానసిక వికాసానికి అనువైన దశగా అంతర్జాతీయంగా గుర్తించిన నేపథ్యంలో ఇకపై 3–6 సంవత్సరాల వయసుగల వారు పాఠశాల విద్యా ప్రణాళిక కిందికి వస్తారు. ఈ విధానంలో మూడు సంవత్సరాలు అంగన్ వాడీ లేదా ప్రీ స్కూల్‌తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుంది. ► పాఠశాల స్థాయిలో విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని 21 వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలక అంశాలను నేర్చుకునేందుకు పాఠ్యాంశాలను తగ్గిస్తారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి దానిపై దృష్టిపెడతారు. సబ్జెక్టుల ఎంపికలో విద్యార్ధులకు స్వేచ్చ ఉంటుంది. ఆర్ట్స్, సైన్సు మధ్య కఠిన విభజన ఏదీ ఉండదు. వృత్తి విద్యను 6 వ గ్రేడ్ నుంచే ఇంటర్న్‌షిప్‌తో పాటు ప్రారంభిస్తారు. ► కొత్త సమగ్రమైన నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఎస్ఈ– 2020–21)ను ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేయనుంది. ళీ మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా కనీసం 5వ తరగతి వరకు ఉంచాలని, 8వ తరగతి, ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించారు. సంస్కృతాన్ని పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు ఐచ్ఛికంగా మూడు భాషల విధానంలో భాగంగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. ► ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. 6–8 గ్రేడ్ ల మధ్య ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం కింద విదేశీ భాషలను సెకండరీ విద్యాస్థాయిలో నేర్చుకోవచ్చు. ళీ వెనుకబడిన ప్రాంతాలు, వర్గాల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్లను, జెండర్ ఇంక్లూజన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులైన పిల్లలు రెగ్యులర్ పాఠశాల ప్రక్రియలో ఫౌండేషన్ స్థాయి నుంచి ఉన్నత విద్యవరకు పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. హెచ్చార్డీ కాదు.. విద్యా శాఖ మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ పేరును మళ్లీ విద్యా శాఖగా మారనుంది. సంబంధిత ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన విద్యా విధానం సిఫారసుల్లో మంత్రిత్వ శాఖ పేరు మార్పు కూడా ఒకటి. 1985లో రాజీవ్ గాంధీ హయాంలో విద్యా శాఖ పేరును హెచ్చార్డీ శాఖగా మార్చరు. -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. భారత్ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. ‘‘నేడు భారత్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆశావాదం నెలకొంది. ఎందుకంటే భారత్ ఎన్నో అవకాశాలను, ఎంపికలను కల్పించడంతోపాటు తలుపులు తెరుస్తోంది’’ అంటూ అమెరికా–భారత్ వాణిజ్య కౌన్సిల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ పేర్కొన్నారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎన్నో సంస్కరణలు చేపట్టడంతోపాటు ఎన్నో రంగాల్లోకి పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు వివరించారు. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ప్రాముఖ్యతను కరోనా మహమ్మారి చూపించిందన్నారు. దేశీయంగా బలమైన ఆర్థిక సామర్థ్యాలతో భారత్ బలంగా నిలిచిందన్నారు. భారత్ అవకాశాల కేంద్రంగా మారుతోందంటూ ఒక ఉదాహరణను తెలియజేశారు. పట్టణల్లో కంటే గ్రామీణం గానే ఇంటర్నెట్ వినియోగదారులు అధికంగా ఉన్నారన్న ఆసక్తికరమైన నివేదికను ప్రస్తావించారు. -
పోలీసు సంస్కరణలకు ట్రంప్ ఓకే
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో కొద్ది వారాల పాటు జాతి వివక్షకు వ్యతిరేకంగా అగ్రరాజ్యం నిరసనలతో హోరెత్తిపోవడంతో ట్రంప్ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ సంస్కరణలను చేపట్టింది. అమెరికా పోలీసులు మరింత బాధ్యతా యుతంగా ప్రవర్తించేలా సంస్కరణలు తెస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై రోజ్ గార్డెన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జాతి వివక్ష అంశంపై అందులో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ సంతకం చేసే కార్యక్రమానికి ముందు పోలీసుల దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుల కుటుంబాలను ట్రంప్ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల మరణాల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని కలుసుకున్న ట్రంప్ తన స్వరం మార్చారు. ప్రజలందరినీ సురక్షితంగా ఉంచడానికి రేయింబగళ్లు కష్టపడుతున్న పోలీసులకి గౌరవం ఇవ్వాలన్నారు. పోలీసు అధికారుల్లో అత్యధికులు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తారంటూ కొనియాడారు. -
పోలీస్ విభాగం రద్దుకు ఓటు
హ్యూస్టన్/వాషింగ్టన్: ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలిప్పుడు శాంతియుత ప్రదర్శనలుగా మారిపోయాయి. పోలీసు సంస్కరణలే ప్రధాన డిమాండ్‌గా ఈ ప్రదర్శనలు జరుగుతూండటంతో పోలీసులు కూడా దుడుకు చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాయిడ్‌తో పోలీసు అధికారి వ్యవహరించిన తీరును నిరసిస్తూ మినియాపోలిస్ సిటీకౌన్సిల్ సభ్యులు పోలీస్ విభాగం మొత్తాన్ని రద్దు చేయాలని తీర్మానించారు. దీని స్థానంలో సరికొత్త పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రజలను సురక్షితంగా ఉంచేలా పనిచేసే కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామని సిటీ కౌన్సిల్ అధ్యక్షుడు లిసా బెండర్ తెలిపారు. ప్రస్తుత వ్యవస్థ సమాజానికి ఏమాత్రం రక్షణ కల్పించడం లేదన్నారు. పోలీస్ విభాగం రద్దుకు సిటీ కౌన్సిల్ సభ్యులు అత్యధికం మద్దతిస్తున్నారని కౌన్సిలర్ అలోండ్రా కానో తెలిపారు. గత నెల 25న మినియాపోలిస్ పోలీస్ అధికారి డెరెక్ చావెన్ దాష్టీకం కారణంగా ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే చర్చిలో ప్రజల సందర్శనార్థం జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. హ్యూస్టన్‌లో తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్ మృతదేహాన్ని మంగళవారం ఖననం చేయనున్నట్లు కుటుంబం తరఫు మీడియా ప్రతినిధి ఒకరు ప్రకటించారు. హిల్‌క్రాఫ్ట్ అవెన్యూలోని ‘ద ఫౌంటేన్ ఆఫ్ ప్రెయిస్’చర్చిలో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారని, ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిసింది. అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న జో బైడెన్ ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలుస్తారని ఆయన సహాయకుడొకరు తెలిపారు. సియాటెల్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు సీసాలు, రాళ్లతో దాడులకు దిగారు. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతూ తన వాహనాన్ని ఆందోళనకారులపైకి నడిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో ఒకరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇలా ఉండగా ఫ్లాయిడ్ మరణానికి కారణమైన అధికారి డెరెక్ ఛావెన్ సోమవారం కోర్టు ముందు హాజరు కానున్నాడు. -
సంస్కరణలంటే కార్మిక చట్టాల రద్దు కాదు
న్యూఢిల్లీ: సంస్కరణలంటే కార్మిక చట్టాలను రద్దు చేయడం కాదనీ, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. కోవిడ్–19, లాక్డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వాణిజ్య కార్యకలాపాలు తిరిగి వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్మిక చట్టాల సవరణకు యత్నించడంపై ఆయన స్పందించారు. ‘అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్వో)లో భారత్ సభ్యదేశం అయినందున కార్మిక చట్టాలను రద్దు చేయడం కుదరదని కేంద్రం తన వైఖరిని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టం చేసింది. కార్మిక చట్టాల్లో సంస్కరణలు తేవడం అంటే పూర్తిగా ఆ చట్టాలను రద్దు చేయడం కాదు. ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను రక్షించేందుకు కట్టుబడి ఉంది’అని అన్నారు. -
ఆర్థిక వ్యవస్థపై రాజన్ కీలక వ్యాఖ్యలు
ముంబై: దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ వలస కార్మికుల ఉచిత ఆహార ధాన్యాలకు సరిపోతాయని.. ఉచిత నగదు సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజన్ స్పష్టం చేశారు. కార్మికులకు ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వివిద రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోకపోతే.. ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని రాజన్ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం రేటింగ్ ఏజన్సీలు ఇచ్చే నివేదికలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. బ్యాంక్‌లు, సూక్ష్మ మధ్యస్థాయి పరిశ్రమలకు ప్రభుత్వం భరోసా కల్పించే ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు. చదవండి: కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే! -
ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యం మదింపు!
సాక్షి, హైదరాబాద్: పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో మరిన్ని సంస్కరణలు తేవాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) కింద నడుస్తున్న ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి పెంచడం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఈ సంస్కరణలు తీసుకొస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 కేంద్రాలు మినీ అంగన్వాడీ కేంద్రాలు. ఈ కేంద్రాలన్నింట్లో ప్రీస్కూల్ తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఉన్న దాదాపు 2,450 కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రీస్కూళ్లుగా కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు, ప్రీస్కూళ్లకు వచ్చేవారిలో 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులకు ప్రీస్కూల్ తరగతుల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎల్కేజీ పిల్లలకు తంగేడు పువ్వు పేరిట నాలుగు పుస్తకాలు, యూకేజీ పిల్లలకు పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలను ఇస్తున్నారు. సామర్థ్యాల మదింపు.. ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు నిర్దేశించిన పాఠ్యాంశాన్ని ఏమేరకు అర్థం చేసుకున్నారనే దాన్ని తేల్చేందుకు వారి సామర్థ్యాల మదింపునకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. బడికి రావాలనే ఆసక్తిని వారిలో పెంచడంతో పాటు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని పెంచేలా వారిని ప్రోత్సహిస్తూనే చిన్నారుల సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఈమేరకు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా పుస్తకాలను సైతం రూపొందిస్తోంది. ఇందులో చిన్నారుల సామర్థ్యాలను గుర్తించే మెళకువలు, చిన్నారుల మానసిక స్థితి అభివృద్ధి చేసే కార్యక్రమాలపై సలహాలు, సూచనలుంటాయి. వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆ శాఖ భావిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే తదుపరి చర్యలు చేపట్టే అవకాశముంది. -
ఎన్నికల్లో సంస్కరణలు చేపట్టాలి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయి నుంచే ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా నివాసం ఉండేలా సర్పంచ్‌లకు నిబంధనలు రూపొందించాలని అలాగే డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల నియమావళిని రూపొందించాలని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు వేయాలని సూచించారు. అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఉగాది కల్లా పేదలందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వికేంద్రీకరణకు ప్రజలందరు మద్దతు తెలుపుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఎన్నికల్లో సంస్కరణలు చేపట్టాలి
-
పుతిన్: గతమా? శాశ్వతమా?
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ సుదీర్ఘకాలం కొనసాగాలనుకుంటున్నారా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా తెరమీదకు తెచ్చి న రాజ్యాంగ సంస్కరణలు అదే విషయాన్ని ఖరారు చేస్తున్నాయంటున్నాయి రష్యాలోని ప్రతిపక్షాలు. చట్టసభలనుద్దేశించి పుతిన్ చేసిన వార్షిక ప్రసంగం సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. నిజానికి పుతిన్ పదవీకాలం 2024 వరకు కొనసాగనుంది. తాజాగా పార్లమెం టు సాక్షిగా పుతిన్ తన ప్రసంగంలో తన ఆలోచనలను ప్రజల్లోకితీ సుకెళుతున్నట్టు ప్రకటించారు. నేషనల్ ఓటింగ్ ద్వారా తన ప్రతిపాదనలను ప్రజామోదానికి ఉంచనున్నట్టు కూడా తేల్చి చెప్పారు. దీనికి ప్రజామోదం లభిస్తే శాశ్వతంగా పుతిన్ అధ్యక్ష పదవిలో కొనసాగే వీ లుంటుంది. పుతిన్ ఆలోచనల కొనసాగింపుగానే ద్విమిత్రి మెద్వదేవ్ తన ప్రభుత్వమంతా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రష్యా ప్రధానిగా ఉన్న ద్విమిత్రి మెద్వదేవ్ పుతిన్‌కి కావాల్సిన వ్యక్తి కావడం, గతంలో రష్యా అధ్యక్షుడిగా ద్విమిత్రి పనిచేసినప్పుడు ఆయ న్ను వెనుకుండి నడిపించింది కూడా పుతిన్ కావడం గమనార్హం. కాగా, రష్యాలో జీవితకాలం ఏకఛత్రాధిపత్యం కొనసాగించేందుకే పుతిన్ ఈ సంస్కరణలను తెరపైకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పుతిన్ ప్రతిపాదించిన రాజ్యాంగ సంస్కరణలివే.. 1. రెండుసార్లకు మించి ఎవరూ అధ్యక్షుడిగా ఉండకూడదు. 2. అధ్యక్ష పదవిలో ఉండేవారికి కఠిన నిబంధనలు అమలు చేయడం.. ఉదాహరణకు ద్వంద్వ పౌరసత్వం ఉండేవారిని దీనికి అనర్హులుగా చేయడం, 25 ఏళ్లపాటు రష్యాలో నివసించినవారై ఉండడం. ఇతర దేశాల్లో శాశ్వత నివాసమేర్పర్చుకున్న వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించడం. 3. అంతర్జాతీయ చట్టాల ప్రభావాన్ని తగ్గిస్తూ రష్యా రాజ్యాంగానికే ప్రాధాన్యతనివ్వడం. 4. 2000 సంవత్సరంలో పుతిన్ తొలిసారి ఎన్నికైనప్పుడు అతను స్థాపించిన సలహా సంస్థ అధికారిక పాలకమండలిని బలోపేతం చేయడం. సలహామండలిగా వ్యవహరించే స్టేట్ కౌన్సిల్ (ప్రస్తుతం పుతిన్ దీనికి సారథ్యం వహిస్తున్నారు) పాత్రను, పరిధిని పెంచడం. 5. చట్టసభల సభ్యులు, క్యాబినెట్ మినిస్టర్స్, న్యాయమూర్తులు, ఇతర అధికారులు ద్వితీయ పౌరసత్వం కలిగి ఉండకూడదు. వీరికి విదేశాల్లో శాశ్వత నివాసం ఉండరాదు. 6. రష్యా దిగువ సభ ‘స్టేట్ డ్యూమా’కు ప్రధానిని, మంత్రివర్గాన్ని నియమించే ప్రత్యేక కీలక బాధ్యతలు అప్పగించడం. 7. అన్ని భద్రతా సంస్థల అధిపతులను నియమించడంలో అధ్యక్షుడి సలహాల మేరకు నిర్ణయం తీసుకునే అధికారాన్ని సెనేటర్స్కి అప్పగించడం. 8. అగౌరవప్రదమైన న్యాయమూర్తులను అధ్యక్షుడి సలహా మేరకు తొలగించే అధికారాన్ని సెనేటర్లకు ఇవ్వడం. 9. ముసాయిదా చట్టాలను ఆమోదించేముందు అధ్యక్షుడి కోరిక మేరకు వాటిని సమీక్షించే అధికారాన్ని న్యాయమూర్తులకు ఇవ్వడం. 10. రష్యాలోని కనీస వేతనాలను దారిద్య్రరేఖకన్నా అధికంగా ఉంచడం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా పెన్షన్లను సర్దుబాటు చేయడం. -
40,000 దాటిన సెన్సెక్స్
ఆదాయపు పన్ను విషయంలో, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన పన్ను అంశాల్లో కూడా ఊరటనిచ్చే నిర్ణయాలను కేంద్రం తీసుకోనున్నదన్న వార్తల కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. కంపెనీల సానుకూల క్యూ2 ఫలితాలు, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 40,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అప్రమత్తత నెలకొన్నా, మన మార్కెట్ మాత్రం ముందుకే దూసుకుపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పతనమై 70.91కు చేరినా, ఆ ప్రభావం కనిపించలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,052 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11,844 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఐటీ, ఆయిల్, గ్యాస్ షేర్లు పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఆల్‌టైమ్ హై స్థాయిలకు ఈ రెండు సూచీలు చెరో 250 పాయింట్ల దూరంలోనే ఉన్నాయి. ఈక్విటీ పన్ను సంస్కరణలు.. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ)ను రద్దు చేయనున్నారని, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ల్లో కూడా మార్పులు, చేర్పులు చేయనున్నారన్ని వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించుతుండటం, ప్రభుత్వ కంపెనీల్లో వాటా విక్రయం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు అంచనాలు.. ఇవన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. ► భారీ రుణభారంతో ఇప్పటికే కుదేలైన టెలికం కంపెనీలకు తాజాగా ఏజీఆర్ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కష్టాలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ రంగానికి బెయిలవుట్ ప్యాకేజీ నిమిత్తం కార్యదర్శుల సంఘాన్ని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో టెలికం షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఆరంభంలో 8.5% ఎగసిన వొడాఫోన్ ఐడియా షేర్ చివరకు 1% నష్టంతో రూ.3.81 వద్ద ముగిసింది. ఎయిర్టెల్ షేర్ 2.3% లాభంతో రూ.368 వద్ద ముగిసింది. -
వృద్ధికి మరిన్ని సంస్కరణలే కీలకం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కూడా కారణమని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలు, నవకల్పనలు భారత వృద్ధికి కీలకంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే.. ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అవసరమని డేవిడ్ తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించినా.. బ్యాంకింగ్ రంగం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ), క్యాపిటల్ మార్కెట్ల వంటి వాటి విషయంలో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ‘మూడు ప్రధాన రంగాల్లో పురోగతి సాధించాలి. ముందుగా ప్రైవేట్ రంగం సహా బ్యాంకింగ్ పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు అందించాలి. కార్పొరేట్ బాండ్ మార్కెట్, తనఖా రుణాల మార్కెట్ మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థతో పాటే ఎదిగిన ఎన్బీఎఫ్సీల్లో రిస్కులు ఉన్న నేపథ్యంలో వాటిని నియంత్రించాలి. సరైన నియంత్రణ చర్యలు తీసుకుంటే.. ఆర్థిక రంగం మరింత మెరు గుపడుతుంది’ అని డేవిడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో 97 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందిస్తోందని డేవిడ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం 24 బిలియన్ డాలర్లు అందించేందుకు ప్రపంచ బ్యాంకు కట్టుబడి ఉందన్నారు. -
బంకు ఓపెన్!
న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశీ ఇంధన రిటైలింగ్ రంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెరతీసింది. చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలను సడలించింది. దీంతో.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఇంధనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు తలుపులు తెరిచినట్లయింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ (సీసీఈఏ) బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయాలన్న లక్ష్య సాధనకు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కొత్త పాలసీ తోడ్పడనుంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగపడుతుంది. మరిన్ని రిటైల్ అవుట్‌లెట్స్ రాకతో పోటీ పెరిగి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి‘ అని సీసీఈఏ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న ఇంధన మార్కెటింగ్ నిబంధనలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2002లో అమల్లోకి వచ్చినవి. తాజాగా అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు వీటిని ప్రభుత్వం సవరించింది. ప్రస్తుత మార్పులతో పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనాల విక్రయానికీ ఊతం లభించనుంది. పెట్రోల్ బంకులపై సీసీఈఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై విడుదల చేసిన ప్రకటనలో ప్రధానాంశాలు.. ► పెట్రోల్ బంకు లైసెన్సులు పొందే సంస్థలు .. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా కొత్త తరం ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎల్ఎన్జీ, బయోఫ్యూయల్స్‌లో ఏదో ఒకదానికి అవుట్లెట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ► రూ. 250 కోట్ల నికర విలువ గల కంపెనీలు .. పెట్రోల్, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్స్‌కి అనుమతులు పొందవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంధన రిటైలింగ్ లైసెన్సు పొందాలంటే హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్స్ లేదా ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) టెర్మినల్స్ వంటి వాటిపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ఇంధనాల మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్న కంపెనీలకు.. ఈ నిబంధన ప్రతిబంధకంగా ఉంటోంది. ► ఇంధన విక్రయ కార్యకలాపాలు ప్రారంభించిన రిటైలర్లు.. అయిదేళ్లలోగా మొత్తం అవుట్‌లెట్స్‌లో 5% అవుట్‌లెట్స్‌ను నిర్దేశిత గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలి. లేదంటే ఒక్కో బంకుకు రూ. 3 కోట్ల మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. దిగ్గజాల ఎంట్రీకి మార్గం.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలు భారత ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్ ఎస్ఏ, సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో, బ్రిటన్ దిగ్గజం బీపీ, ప్యూమా ఎనర్జీ తదితర సంస్థలు భారత్‌లోని ఇంధన రిటైలింగ్ రంగంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌తో కలిసి టోటల్ .. 2018 నవంబర్లోనే సుమారు 1,500 పెట్రోల్, డీజిల్ విక్రయాల అవుట్‌లెట్స్ ఏర్పాటు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. పెట్రోల్ బంకుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో అటు బీపీ కూడా జట్టు కట్టింది. ప్యూమా ఎనర్జీ రిటైల్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోగా, ఆరామ్కో ఇంకా చర్చల్లో ఉంది. ప్రభుత్వ సంస్థల హవా... కంపెనీ బంకుల సంఖ్య ఐఓసీ 27,981 హెచ్‌పీసీఎల్ 15,584 బీపీసీఎల్ 15,078 రిలయన్స్ 1,400 నయారా 5,344 (గతంలో ఎస్సార్ ఆయిల్) షెల్ 160 -
పుర‘పాలన’లో సంస్కరణలు!
సాక్షి, తొర్రూరు: మునిసిపాలిటీల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకోనున్నాయి. మునిసిపాలిటీల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు, పారదర్శక పాలన అందించేందుకు నూతన మునిసిపల్ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మునిసిపల్ నూతన చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. నూతన మునిసిపల్ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు వారి సలహాలు, సూచనలు తీసుకునేందుకు రెండు రోజుల పాటు కమిషనర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. స్టాండింగ్ కమిటీ రద్దు కలెక్టర్లకు కూడా మునిసిపాలిటీలపై ప్రత్యేకాధికారాలు కట్టబెట్టారు. కార్పొరేషన్లలో స్టాండింగ్ కౌన్సిల్‌ను రద్దు చేసి పాలకవర్గానికే అధికారాలు కట్టబెడుతున్నారు. ప్రతి¯నెలా విధిగా సమావేశాలు నిర్వహించాలని, సమావేశంలో చేసిన తీర్మానాలను 24 గంటల్లోనే చైర్మన్లు, మేయర్లు సంతకాలు చేసి ఆమోదించాలని, లేని పక్షంలో కమిషనర్లు తీర్మానాలపై సంతకాలు చేసే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రతినెలా సమావేశం ప్రతినెలా సర్వసభ్య సమావేశం నిర్వహించి అందులోనే కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ పని చేయడానికి వీలుండదు. ఒక్కసారి కౌన్సిల్ అభివృద్ధి పనుల టెండర్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తే ఇకపై కమిషనర్లే ఆ టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తారు. దీంతో టెండర్ల నిర్వహణలో జరిగే జాప్యం కొంత మేరకు తగ్గుతుందని, తద్వారా పనులు వేగంగా సాగే అవకాశాలున్నాయి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు చట్టంలో పలు అంశాలను పొందుపరిచారు. తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలను పెంచడంతో పాటు వాటిని పరిరక్షించేందుకు మునిసిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి ఏడాదికి 10 శాతం నిధులు కేటాయించనున్నారు. ఆన్లైన్లో ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ రకరకాల కారణాలతో అనుమతి ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. డబ్బులు ఇవ్వనిదే అనుమతి ఇవ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలకు చెక్ పెడుతూ చట్టంలో రూపొందించిన నిబంధనల మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి విధిగా 21 రోజుల్లోనే అనుమతి ఇవ్వాలి. లేని పక్షంలో దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి ఇచ్చినట్లుగానే భావించవచ్చు. ఆస్తిపన్ను మదింపు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి ఎవరికి వారుగా పన్నులను మదింపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఓ వైపు పరిపాలనలో మార్పులు, మౌళిక వసతులు మెరుగుపరచడం, అవినీతికి అడ్డుకట్ట వేయడం కోసం ప్రభుత్వం రూపొందించిన కొత్త మునిసిపల్ చట్టం అమలుతో ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. -
రైల్వే బోర్డులో సంస్కరణలు
న్యూఢిల్లీ: రైల్వే బోర్డు త్వరలో పలు సంస్కరణలు చేపట్టనుంది. దీనిలో భాగంగా బోర్డు సభ్యుల సంఖ్యకు కోత విధించనుంది. బోర్డులో డైరెక్టర్, ఆపై స్థాయి అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేయాలని భావిస్తోంది. రైల్వేల నిర్వహణ తీరును మెరుగుపరచడం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వే బోర్డులో 200 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో డైరెక్టర్, ఆపై స్థాయి అధికారులుగా ఉన్న 50 మందిని (25 శాతం) రైల్వే జోన్లకు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు ఓ అధికారి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం బోర్డులో చాలా మంది సభ్యులు ఉన్నారని వీరంతా దాదాపు ఒకేలాంటి పనులు చేస్తున్నారని తెలిపారు. జోన్లలో సీనియర్ ఆఫీసర్ల కొరత కూడా ఉండటంతో వీరిని అక్కడికి బదిలీ చేయాలని భావిస్తున్నామన్నారు. వంద రోజుల ఎజెండాలో భాగంగా ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్వే బోర్డు చైర్మన్‌కు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. -
యూఏఈలో ఆర్థిక సంస్కరణలు
ఎన్.చంద్రశేఖర్,మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) :యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం ప్రవాస భారతీయుల పాలిట వరంగా మారింది. లైసెన్స్ పొంది వ్యాపారం నిర్వహించాలనుకునేవారికి యూఏఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ఎంతో మందికి సొంతంగా కంపెనీలను ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఫలితంగా రెండు మూడేళ్ల కాలంలో తెలంగాణ జిల్లాలకు చెందిన వారి సప్లయింగ్ కంపెనీల సంఖ్య 500కు పైగా మించిపోయింది. ఒకప్పుడు తెలంగాణ వాసుల కంపెనీలు పదుల సంఖ్యలో ఉండగా.. ఇప్పుడు పెరిగిపోయాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో కార్మికులుగా పనిచేసిన వారు సొంతంగా చిన్న కంపెనీలను స్థాపించే స్థాయికి ఎదగడానికి యూఏఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. టెక్నికల్ లైసెన్స్, క్లీనింగ్ లైసెన్స్‌లు పొంది సొంత కంపెనీలను నిర్వహిస్తున్నారు. యూఏఈకి వచ్చే వలస కార్మికులతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన కార్మికులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కంపెనీల నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించడం విశేషం. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితోనే.. యూఏఈ ప్రభుత్వం సంస్కరణలను అమలు చేసి కంపెనీల ఏర్పాటుకు నిబంధనలను సవరించింది. దీంతో తక్కువ పెట్టుబడితోనే యూఏఈలో కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. లైసెన్స్ ఫీజు, కంపెనీ కార్యాలయం, ఇమిగ్రేషన్ ఇతర ఖర్చులు తగ్గిపోవడంతో కొత్త కంపెనీలను ప్రారంభించడానికి అవకాశాలు విస్తృతమయ్యాయి. దీనికి తోడు కార్మికులను దిగుమతి చేసుకోవడానికి జారీచేసే వీసాలకు డిపాజిట్ చెల్లించే అవసరం కంపెనీల నిర్వాహకులకు తప్పింది. కేవలం రూ.10లక్షల పెట్టుబడితోనే కంపెనీ ఏర్పాటు చేయడానికి యూఏఈ సంస్కరణలు ఎంతో దోహదపడ్డాయి. ఈ కారణంగా కొత్త కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఎంతో మంది ఔత్సాహికులు ముందుకు వచ్చారు. అలా రెండు, మూడేళ్లలోనే యూఏఈ పరిధిలో కార్మికులను సరఫరా చేసే కంపెనీలు అనేకం ఏర్పాటయ్యాయి. కేరళ వాసులకు దీటుగా తెలంగాణ వాసులు సప్లయింగ్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కార్మికులను పనులు చేసే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు బస్సులు, వ్యాన్లు సైతం కొనుగోలు చేయడం గమనార్హం. గతంలో నెలకు మన కరెన్సీలో రూ.50వేల వేతనం పొందిన వారు ఇప్పుడు కంపెనీలను నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీలకు కార్మికులను పనిలోకి పంపించడమే కాకుండా చిన్న కాంట్రాక్టులను సైతం చేపడుతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కొందరు తమ స్వగ్రామాల్లో స్థిరాస్తులను సైతం కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలను విదేశాల్లో ఉన్నత చదువులను చదివించే స్థాయికి ఎదుగుతున్నారు. గతంలో గల్ఫ్ దేశాల్లో పని కోసం వెళ్లిన వారు తమ పిల్లలకు తాము పనిచేసే కంపెనీలోనే ఏదో ఒక ఉద్యోగం చూసి వారికి కూడా తమ వద్దనే ఉండేలా చూసుకున్నారు. గతంలో పెట్టుబడి ఎక్కువ.. యూఏఈ పరిధిలోని దుబాయి, అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లో సప్లయింగ్ కంపెనీలను నిర్వహించడానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. కంపెనీ లైసెన్స్ ఫీజు, ప్రభుత్వంతో ఒప్పందం, కార్మికులకు వీసాలను జారీచేయడంపై డిపాజిట్ చెల్లించడం, కంపెనీ కార్యాలయం, లైసెన్స్ జారీకి అవకాశం ఇచ్చిన షేక్‌కు కమీషన్‌ను ఎక్కువ మొత్తంలో చెల్లించే వారు. ఒక కంపెనీ ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.40లక్షల పెట్టుబడి అవసరం అయ్యేది. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం కావడంతో కొంత మందికి మాత్రమే కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. సొంత కంపెనీలు ఏర్పాటు చేయడానికి మంచి అవకాశం యూఏఈ ప్రభుత్వం సప్లయింగ్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి నిబంధనలు మార్చడంతో కొత్తగా సొంత కంపె నీలను ఏర్పాటు చేయడానికి నాలాంటి వారికి అవకాశం లభించింది. కొంత మంది రెండు, మూడు కంపెనీలను కూడా నిర్వహిస్తున్నారు. స్వదేశీ, విదేశీ కార్మికులకు ఉపాధి కల్పించడానికి అవకాశం కలిగింది. సొంత కంపెనీలను నిర్వహించడం సంతోషంగా ఉంది. – స్వామిగౌడ్, దుబాయి(వెల్లుట్ల, జగిత్యాల జిల్లా ) -
రికార్డుస్ధాయిలో ఎఫ్‌డీఐ వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐ విధానాన్ని సరళీకరించడంతో పాటు సంస్కరణల వేగంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి అత్యధికంగా రూ 4.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయి. పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐటీ) నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐ రూ 4.2 లక్షల కోట్లుగా నమోదైంది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎఫ్‌డీఐ భారత్‌కు తరలివచ్చిందని, గత ఐదేళ్లుగా భారత్ రూ 18 లక్షల కోట్ల ఎఫ్‌డీఐని ఆకర్షించిందని డీపీఐటీ 2018-19 వార్షిక నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీఐ పాలసీని సరళీకరించడంతో పాటు సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా దేశంలోకి పెద్ద ఎత్తున ఎఫ్‌డీఐ వెల్లువెత్తుతోందని చెబుతున్నారు. మెరుగైన వృద్ధి రేటు సాధించేందుకు, వివిధ రంగాల్లో ఉత్తేజం నింపేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉపకరిస్తాయి. -
ఉన్నతవిద్య పరీక్షల్లో తెలంగాణ సర్కార్ సంస్కరణలు
-
ఉన్నత విద్య పరీక్షల్లో సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నతవిద్య పరీక్షల్లో సంస్కరణలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పొరపాట్ల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అప్రమత్తమైంది. డిగ్రీ, పీజీ, ఇతర వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు దొర్లకుండా చూడటంతోపాటు ఫలితాల్లో పొరపాట్లు దొర్లకుండా పకడ్బందీ చర్యలు చేట్టాలని నిర్ణయించింది. అలాగే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను పక్కాగా అమలు చేయడంతోపాటు డిగ్రీ కోర్సుల్లో ఒకే రకమైన గ్రేడింగ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది. పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ విధానం అమలు చేయడంతోపాటు పరీక్షల మూల్యాంకన కేంద్రాల్లో సెల్ఫోన్లను నిషేధించాలని యూనివర్సిటీల వీసీలకు స్పష్టం చేసింది. మరోవైపు పరీక్షల నిర్వహణ, వ్యాల్యుయేషన్, ఫలితాల ప్రాసెసింగ్ వంటి అంశాలపై యూనివర్సిటీలు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకొని ముందుకు సాగాలని పేర్కొంది. వ్యాల్యుయేషన్‌లో పొరపాట్లు చేస్తే సంబంధిత లెక్చరర్లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా నిబంధనలను రూపొందించి అమలు చేయాలని పేర్కొంది. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన వీసీలతో పరీక్షల సంస్కరణలపై సమీక్ష సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, వీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను పాపిరెడ్డి విలేకరులకు తెలియజేశారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిదాల ఘటన తర్వాత యూనివర్సిటీల్లో పరీక్షల విధానంపై సమీక్షించినట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు పలు సంస్కరణలు తేవడంతోపాటు భవిష్యత్తులో మరింత పక్కాగా ఉండేందుకు కార్యాచరణపై నివేదిక అందజేసేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాయన్న, మహత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్‌లతో కమిటీని ఒకట్రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందజేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు... పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలి. జవాబుపత్రాల మూల్యాంకనానికి యూనివర్సిటీలవారీగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకొని అమలు చేయాలి. రోజుకు ఎన్ని పేపర్లు దిద్దాలి అన్న దానిపైనా స్పష్టత ఇవ్వాలి. అధ్యాపకులు వ్యాల్యుయేషన్ సరిగ్గా చేస్తున్నారా లేదా? అన్న దానిపై పర్యవేక్షణ ఉండాలి. వ్యాల్యుయేషన్ కేంద్రాల్లో సెల్ఫోన్లను నిషేధించాలి. కాన్ఫిడెన్షియల్ వర్క్‌లో పాల్గొనే వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. బాధ్యతలను అప్పగించాలి. వ్యాల్యుయేషన్‌లో పొరపాట్లు చేస్తే క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవాలి. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. పరీక్ష కేంద్రాల కేటాయింపులో జంబ్లింగ్ విధానం అమలు చేయాలి. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే అవసరమైతే సెల్ఫ్ సెంటర్లు ఇవ్వాలి. పరీక్షల సమయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ల ద్వారా పర్యవేక్షణను కొనసాగించాలి. అన్ని యూనివర్సిటీలు... విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే వారి జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. వాటి అమలు, పర్యవేక్షణ కోసం ప్రతి యూనివర్సిటీలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలి. వైస్ చాన్సలర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ప్రక్రియలను పర్యవేక్షించాలి. తద్వారా పరీక్షల నియంత్రణాధికారులు, సహాయక పరీక్షల నియంత్రణాధికారులపై భారం పడుకుండా చూడాలి. ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ సరిగ్గా ఉన్నాయా? లేదా? సర్వీసు ప్రొవైడర్ సరిగ్గా చేస్తున్నారా? లేదా? ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఫలితాలు ఇవ్వాలి. ప్రథమ సంవత్సరంలో మార్కులు ఎక్కువ వచ్చి ద్వితీయ సంవత్సరంలో బాగా తగ్గితే వాటిని క్రాస్‌చెక్ చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవాలి. వ్యవస్థపై నమ్మకం పోకుండా పిల్లలకు నష్టం కలగకుండా చూసుకోవాలి. ఫలితాల్లో పొరపాట్లు దొర్లితే వెంటనే సవరించుకునేలా చర్యలు చేపట్టాలి. -
రాచపుండులా లంచం
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులు కావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లు పడాలి? ప్రజలు లంచాలు ఎందుకివ్వాలి? లంచాలు లేని వ్యవస్థ కోసం పటిష్టమైన రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు రూపొందించాలి’అని ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. వాస్తవానికి అవినీతి మన వ్యవస్థలో వేళ్లూనుకుపోయింది. చేయి తడపనిదే ప్రభుత్వ శాఖల్లో పనులు జరగడం లేదు. ప్రజల నిరంతర అవసరాలు ముడిపడి ఉన్న రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులోనూ ముఖ్యంగా భూముల వ్యవహారాలు, పట్టణాల్లో ఉండే ప్రజల అవసరాలు చాలా కీలకమైనవి. ప్రతి వ్యక్తి పుట్టుక నుంచి మరణం వరకు ధ్రువీకరించడం, సొంతింటి కలసాకారం చేసుకోవడం దగ్గర్నుంచి.. వ్యాపారం చేసుకునేందుకు లైసెన్స్‌లు ఇవ్వడం వరకు మున్సిపల్ వర్గాల ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు కీలకం. చట్టాల ప్రకారం అయితే సామాన్యుడికి అవసరమైన ఏ పనైనా.. ఉచితంగా నిర్దిష్ట కాలపరిమితిలోపు చేసి పెట్టాల్సిన బాధ్యత అధికార వర్గాలది. కానీ, ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, పైస్థాయి అధికారుల ధన దాహం.. పేదోడి జేబు చమురు వదిలిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆవేదన, అభిప్రాయంతో ఈ అవినీతి, లంచాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో వృద్ధ దంపతుల భిక్షాటన, మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు పెట్టిన ఫేస్బుక్ పోస్టు.. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష జరగడంతో.. రాష్ట్రంలో ఎలాంటి సంస్కరణలు వస్తాయోననే ఆసక్తి అందరిలో నెలకొంది. రెవెన్యూ, మున్సిపల్ వర్గాలపై రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, అపవాదు, వారు విమర్శలకు గురవుతున్న తీరుపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. పైసలిస్తేనే పనయ్యేది! రెవెన్యూ శాఖలో అవినీతి తీవ్రంగా ఉంది. ఇందుకు వ్యవస్థీకృతమైన లోపాలతో పాటు అడ్డగోలు సంపాదనపై అధికారుల అత్యాశే కారణాలుగా కనిపిస్తున్నాయి. పనిని బట్టి, మనిషిని బట్టి, అవసరాన్ని బట్టి, స్థాయిని బట్టి రెవెన్యూ శాఖలో వసూళ్లు జరుగుతుంటాయనేది బహిరంగ సత్యమే. అందిన కాడికి గుంజుతారంటూ అధికారులపై చాలాసార్లు ఫిర్యాదులొచ్చాయి. అడిగినంత ఇవ్వకపోతే తిప్పించుకోవడం, సమయానికి ఇవ్వకపోవడం, ఉన్నతాధికారులను అడగాలని, కంప్యూటర్లు పనిచేయడం లేదని, పైనే అలా ఉంటే కింద మేమేం చేస్తామని, సర్వర్ డౌన్ ఉందని, పాసుపుస్తకాలు ప్రింటింగ్‌కు వెళ్లాయని, ఎమ్మార్వో లేడని, ఆర్డీవో పంపలేదని, జేసీ డిజిటల్ సంతకం కాలేదని రకరకాల సాకులు చెప్పటం పరిపాటిగా మారింది. అనుకున్నంత వసూలు చేసిన తర్వాతే.. పనిచేసి పెడతారనే విమర్శలున్నాయి. 50 పైసల ఫామ్‌కు 10రూపాయలు తీసుకోవడం, ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే నిర్దేశిత రుసుము ఎక్కువ వసూలు చేస్తారనే అభియోగమూ రెవెన్యూ శాఖపై ఉంది. భూరికార్డుల ప్రక్షాళనతో.. రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. 2017 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో ఇది తారస్థాయికి చేరింది. భూ–రికార్డులను పరిశీలించి రైతులకు కొత్త పాసుపుస్తకాలివ్వాల్సిన ఈ కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా సంపాదించారనే ఆరోపణలు, విమర్శలున్నాయి. రైతుకు ఇవ్వాల్సిన యాజమాన్య హక్కుల కోసం ఎకరానికి 5 నుంచి 10వేల వరకు వసూలు చేశారని ఎన్నో ఫిర్యాదులొచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై.. రెవెన్యూ శాఖకు వ్యతిరేకంగా నిరసనలు, సిబ్బందిపై దాడులు చేసేంతవరకు కూడా వెళ్లింది. రైతుకు భూమే జీవనాధారం. ఆ భూమిపై తనకు హక్కు ఉంటేనే రైతుకు మనుగడ ఉంటుంది. తరాలుగా భూమితో రైతు పెంచుకుంటున్న మమకారాన్ని ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది.. ఉన్నతాధికారుల పేరు చెప్పి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడడం గమనార్హం. ఎలుకలు పడ్డాయని..: రెవెన్యూ సంఘాలు ఇటీవల మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన ఓ యువకుడు భూమి పట్టాకోసం లంచం అడుగుతున్నారంటూ పెట్టిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయి.. సీఎం దృష్టికెళ్లింది. ఈ పోస్టింగ్‌కు స్పందించిన సీఎం నేరుగా ఆ యువకునితో మాట్లాడి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని, అప్పుడు ప్రజలంతా తనకు అండగా నిలబడాలని కోరారు. దీంతో రెవెన్యూశాఖను రద్దు చేస్తారనే ప్రచారం మొదలయింది. భూముల వ్యవహారాలన్నింటినీ రెవెన్యూ శాఖ నుంచి తప్పిస్తారనే చర్చ మొదలయింది. ఇందులో నిజానిజాలను పక్కనపెడితే.. ఈ చర్చపై రెవెన్యూ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. కొందరు చేసిన పనిని అందరికీ ఆపాదించడం.. ఏకంగా శాఖనే రద్దు చేయాలనే ఆలోచనపై మండిపడుతున్నాయి. ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? అని ప్రశ్నిస్తున్నాయి. రెవెన్యూ సేవలతో పాటు ఇతర శాఖలకు పనిభారాన్నీ తామే మోస్తున్నామని.. సమగ్ర కుటుంబ సర్వే, భూ–రికార్డుల ప్రక్షాళన లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన తమపై అపవాదు వేయడం సరికాదంటున్నాయి. రెవెన్యూ వ్యవస్థ జవాబుదారీతనం కోసం రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపట్టాలని, ధరణి ప్రాజెక్టును తహశీల్దార్లకు అనుకూలంగా ఉండేలా మార్చాలని, అర్థరహితమైన ఆదాయ, కుల, తదితర ధ్రువపత్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పురపాలికల్లో అవినీతి జాఢ్యం పురపాలికలు ‘అవినీతి’కి అడ్డాగా మారిపోయాయి. దశాబ్దాలుగా పట్టిన అవినీతి కంపు మున్సిపాలిటీలను వదలడం లేదు. అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం నూతన సంస్కరణలు, విధానాలను ప్రవేశపెట్టినా పరిస్థితిలో మార్పురావడం లేదు. నగర, పుర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, ఇతర సేవలందించాల్సిన పురపాలికలు.. కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతిధులు, అధికారుల అక్రమార్జనకు కేరాఫ్ అడ్రస్‌లుగా మారాయి. చేతులు తడపందే.. సామాన్యులకు కనీస అనుమతులు కూడా లభించడం లేదు. ఏ ధ్రువీకరణ పత్రం జారీ కాదు. ఏటా నగరపాలికలు, మునిసిపాలిటీల్లో జరిగే.. వందల కోట్ల విలువైన అభివద్ధి పనుల్లో ఏ మాత్రం నాణ్యత ఉండదు. ఎందుకంటే.. అక్కడ బినామీల ముసుగులో కీలకమైన పనులు, కాంట్రాక్టులు దక్కించుకునేది స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులే. రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, మునిసిపాల్టీలో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులే కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ఆస్తి పన్నులు, ఇతరాత్ర పన్నులు, చార్జీలతో ఏటా పురపాలికలకు కోట్లలో ఆదాయం వస్తోంది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వందల కోట్ల రూపాయలు వివిధ గ్రాంట్ల రూపంలో వస్తున్నాయి. వీటితో చేపట్టే ప్రతి అభివద్ధి పనిలో 25–30% కమీషన్లు వాటాల రూపంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలైతే.. తమ పరిధిలోని మునిసిపాలిటీల్లో జరిగే ప్రతిపనిలో 5% కమీషన్‌ను దర్జాగా దండుకున్నారు. పురపాలికల్లో కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరు కావాలంటే మునిసిపల్ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కమిషనర్లు, ఇంజనీర్లు, అకౌంటెంట్లకు కలిపి మొత్తం 25% కమీషన్లు ఇవ్వాల్సిందే. కాదు,కుదరదంటే.. ఏళ్లు గడిచినా ఆ కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు కావు. పుట్టినా.. చచ్చినా! జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి గృహ నిర్మాణ అనుమతుల జారీ వరకు ప్రతి పనికీ యథేచ్చగా లంచాలు వసూలు చేస్తున్నారు. భవనాలు, లేఔట్ల నిర్మాణ అనుమతుల్లో అవినీతి నిర్మూలనకు మూడేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం’(డీపీఎమ్మెస్) కొద్దిరోజులకే నీరుగారిపోయింది. డీపీఎంఎస్ కింద ఇంటి నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే, 14 రకాల చార్జీలను విధించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఇంటి స్థాయిని బట్టి 10వేల నుంచి 25 వేల రూపాయల వరకు మామూళ్లు తప్పవు. డీపీఎంఎస్ వచ్చిన తర్వాత కూడా ఇళ్ల అనుమతుల జారీకి లంచాలు స్వీకరిస్తూ కొందరు మునిసిపల్ అధికారులు ఏసీబీకి పట్టుబడడం ఇందుకు నిదర్శనం. ఇక ఆస్తుల మ్యుటేషన్లు, వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు, నల్లా కనెక్షన్, అడ్డగోలుగా పెరిగిన ఆస్తి పన్నులపై పునఃసమీక్ష వంటి సేవలకు సైతం వందలు, వేలల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారు. టెండర్ వేయాలంటే భయం! జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వింత పరిస్థితి నెలకొని ఉంది. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కమీషన్ల వాటా ముట్టజెప్పనిదే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడానికి వీల్లేదు. కాంట్రాక్టర్ అయితే వారి బినామీ ఉండాలి.. లేదా వారికి కోరినంత పర్సెంటేజీని ముట్టజెప్పాలి. కొన్ని పురపాలికల్లో బినామీలు తప్ప ఇతర కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయడానికి వీల్లేదు. బయటి వ్యక్తులు టెండరు వేయడానికి వస్తే బెదిరింపులు, దాడులకు దిగుతారు. ఎవరైనా కొత్త కాంట్రాక్టర్లు వచ్చి పనులు ప్రారంభించినా, క్షణాల్లో స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రంగంలో దిగి.. మాకేంటి? అని వేధింపులకు గురిచేస్తున్నారు. తమ కమీషన్ వాటా లభించకపోతే పనిని సజావుగా జరిగే ప్రసక్తే ఉండదు. ఇక పురపాలికల్లో చేపట్టే పనుల్లో నాణ్యత డొల్లగా మారింది. కోట్ల ఖర్చుతో వేసిన సీసీ రోడ్లు, మురికి కాల్వలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో వేసిన చోటే పదేపదే రోడ్లు వేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లయితే వాటాల కోసం ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, భవన నిర్మాణాలను సైతం అడ్డుకుంటున్నారు. మామూళ్లు ఇవ్వకుంటే అనుమతి లేకుండా భవన నిర్మాణం జరుపుతున్నారని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి పనులను నిలుపుదల చేయిస్తారు. దీంతో బాధితులు ఎంతోకొంత సెటిల్మెంట్ చేసుకుని పనిచేసుకుంటున్నారు. కాగ్ నివేదికలు బుట్టదాఖలు! మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల అవినీతిపై కాగ్ సమర్పించిన నివేదికలు బుట్టదాఖలయ్యాయి. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కాగ్ నిర్థారించినా బాధ్యులపై చర్యలు చేపట్టలేదు. అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలున్న అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ చేసి శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలోని పురపాలక శాఖ పరిధిలో పనిచేసే ఉద్యోగుల్లో వందల మందిపై విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నా ఇటీవల కాలంలో కొందరికి పదోన్నతులు రావడం విమర్శలకు దారితీసింది. తీవ్ర ఆరోపణలున్న ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని కేసులనుంచి తప్పిస్తున్నారని పురపాలక శాఖ ఉన్నతాధికారులపై ఆరోపణలున్నాయి. మునిసిపాలిటీల్లో అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తున్న నేపథ్యంలో, అవినీతి ఆరోపణలపై నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకువస్తే కొంత వరకు పరిస్థితిలో మార్పు రావచ్చు. రెండేళ్లుగా పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా ‘జాల గ్రామంలోని 330 సర్వే నెంబర్లో 20 గుంటల భూమి తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చింది. కొంతకాలం సేద్యం చేసిన. కానీ వర్షాలు రాకపోవడంతో ఉపాధి కోసం పదేళ్లు హైదరాబాద్‌లో ఉండి వచ్చిన. 2017 నవంబర్‌లో రెవెన్యూ అధికారులు నాకు 1–బీ ఫారం ఇచ్చిండ్రు. కానీ, ఇప్పటిదాకా పాసుపుస్తకం ఇయ్యలేదు. వీఆర్వోను అడిగితే.. నాకు భూమి లేదని.. వేరేవాళ్లకు అమ్ముకున్నానని అంటున్నడు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రేపు, ఎల్లుండి అనుకుంట చెబుతున్నరు’– కోటగిరి మాలమణి, జాల గ్రామం, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా భూమి ఒకరిది.. పరిహారం మరొకరికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–10లో భూసేకరణలో భాగంగా విద్యుత్ సబ్‌స్టేషన్ కోసం అవారి లచ్చవ్వ అనే మహిళ భూమిని సేకరించారు. ఆమెకు సర్వే నంబరు 227లో 20 గుంటల భూమి ఉంది. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల్లో ఈ మొత్తం భూమి పోయింది. లచ్చవ్వకు పరిహారంగా రూ.3.25 లక్షలు రావాల్సి ఉంది. కానీ.. ఆ డబ్బులను ఈ భూమితో ఏమాత్రం సంబంధం లేని మేచినేని మనోహర్‌రావు పేరుతో రెవెన్యూ అధికారులు చెక్కు జారీ చేశారు. లచ్చవ్వ రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తే పొరపాటు జరిగిందని చెప్పారు. కానీ.. ఇంతవరకు పరిహారం రాలేదు. డబ్బులు అడిగితే ప్రామిసరీ నోటు చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు రొడ్డరాజం. ఈయనది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, వేంపల్లి. తన భూమిని పట్టాచేయాలని రెండేళ్ల కిందట వీఆర్వో ఆంజనేయులును కలిశాడు. పట్టాచేయాలంటే రూ.32,000 ఇవ్వాలని వీఆర్వో డిమాండ్చేశాడు. భూమి పట్టా చేతికొస్తుందని ఆశతో రొడ్డరాజం అడిగినంతా ముట్టజెప్పాడు. నెలలు గడుస్తున్నా పట్టా కాకపోవడంతో వీఆర్వోను నిలదీశాడు. తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరాడు. దీంతో వీఆర్వో 32 వేలకు ప్రామీసరి నోటు రాసిచ్చి చేతులు దులుపుకోవడంతో రైతు లబోదిబోమన్నాడు. ఇలాగా ఆ గ్రామంలోని దాదాపు వందమంది రైతుల నుంచి సదరు వీఆర్వో లక్షలు దండుకున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో కలెక్టర్ ఇతన్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. పైసలు ముడ్తెనే పాస్‌పుస్తకం! ‘వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామం మాది. మా మామయ్య మేక నారాయణ రెడ్డి పేరుతో 1.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మామయ్య కొద్దిరోజుల క్రితం మరణించడంతో అత్తమ్మ మేక రాజమ్మ పేరుమీదకి మార్చి పాసుపుస్తకం ఇవ్వాలి. కానీ, వీఆర్వో ఆర్నెల్లు తప్పించుకున్నడు. కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరకు డబ్బులు ఇస్తెనే.. పాసుపుస్తకం, రైతు బంధు చెక్ ఇచ్చారు’– రవీందర్‌రెడ్డి, రైతు, వరంగల్ అర్బన్ జిల్లా అనుమతుల కోసం వసూలు ‘నాకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్డులో 126గజాల స్థలముంది. అక్కడ ఇల్లు కట్టేందుకు అన్ని అనుమతులు తీసుక్నున్నాను. అయితే ఇల్లు కడుతుండంగనే.. ఆ స్థలానికి 3–5–55, 3–5–56 ఇంటి æనెంబర్లతో పన్నులు చెల్లించాలని నోటీసులు పంపారు. నిర్మాణ దశలో ఉండగా ఇంటిపన్ను ఎలా ఇస్తారని అడిగితే గతంలో ఇక్కడ ఇల్లు ఉందని, 3–5–55 ఇంటి నెంబర్ మీద రూ.6,244 పన్ను వసూలు చేశారు. అది చెల్లించిన తర్వాతే ఇల్లు కట్టుకునేందుకు అనుమతించారు’– మందుల వెంకట్రాంనర్సయ్య, మహబూబాబాద్. సైనికుడినీ వదల్లేదు ఈ ఫోటోలో కనిపిస్తున్నది జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామానికి చెందిన బాలగాని ప్రవీణ్‌కుమార్. 63 రాష్ట్ర రైఫిల్స్, కాలకూట్, జమ్మూలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి పేరు మీద విస్నూరు గ్రామంలోని 4 సర్వేనంబర్లలో 12.17 ఎకరాల భూమి ఉంది. భూమి విస్తీర్ణం తక్కువగా ఉందని కొలత కోసం మండల సర్వేయర్‌కు దరఖాస్తు చేస్తే డబ్బులు ఇస్తేనే చేస్తానని డిప్యూటీ సర్వేయర్ నాంపల్లి శ్రీనివాస్ తెగేసి చెప్పాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో సర్వేయర్‌కు బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్న ఆ జవాను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సర్వేయర్ అడిగిన రూ.10 వేలు తీసుకుని జనగామ జిల్లా కేంద్రంలో ఇస్తుండగా ఏసీబీకి అప్పగించాడు. శ్రీనివాస్ మీద కేసు నమోదైంది. ఫొటోలో కన్పిస్తున్న ఈ దంపతుల పేరు దేవేంద్రప్ప, శకుంతల. వీరిది జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామం. మాచర్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 246లో దేవేంద్రప్ప పేరున 2.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఇప్పటికీ వీళ్లే సాగు చేస్తున్నారు. అయితే 2013లో ఈ భూమిని పట్టాదారులతో సంబంధం లేకుండా.. అప్పటి తహసీల్దార్ అదే గ్రామానికి చెందిన జానకమ్మ పేరున మార్పు చేస్తూ, ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న దేవేంద్రప్ప తన భూమిని తనకు తెలియకుండా జానకమ్మ పేరున ఎలా మార్చుతారంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో భార్యతో కలిసి గట్టు తహసీల్దార్ కార్యాలయం ఎదుట న్యాయపోరాటానికి దిగినా ఫలితం లేకుండాపోయింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది లంచం తీసుకునే జానకమ్మ పేరిట ప్రొసీడింగ్ జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. -
సైనిక సంస్కరణలు
రెండేళ్ల నుంచి సాగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మన సైనిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురాబోతున్నట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన సైన్యం పరిమాణంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వివిధ క్యాడర్లలో 49,631మంది అధికారులతోసహా దాదాపు13 లక్షలమంది సిబ్బంది ఉన్నారు. అధికారుల్లో ఎక్కువమంది సైనిక ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్‌లను కోరుకుంటున్నారన్న విమర్శలున్నాయి. శరవేగంతో మారుతున్న ప్రపంచంతోపాటే సైనిక రంగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడంతా వేగంగా ముగిసిపోయే మెరుపు యుద్ధాలు, పరిమిత కాలంపాటు కొనసాగే ఘర్షణలే ఉంటాయి తప్ప దీర్ఘకాలిక యుద్ధాలకు కాలం చెల్లింది. స్వల్పకాలిక యుద్ధాల్లో కూడా కీలకపాత్ర సాంకేతిక నైపుణ్యానిదే. అమెరికా, చైనాలు ఇప్పటికే ఆ విషయంలో చాలా ముందుకెళ్లాయి. అమెరికా రిమోట్ కంట్రోల్ ఆయుధాలు, ద్రోన్ల ద్వారా లక్ష్యాల ఛేదన, కృత్రిమ మేధతో పనిచేసే స్వయంచాలిత ఆయుధాల రూపకల్పన వంటివి అమల్లోకి తెచ్చింది. ఆమేరకు పదాతి సైనికుల సంఖ్యను తగ్గి స్తోంది. బ్రిటన్ తన సైన్యాన్ని 20 శాతం మేర తగ్గించుకుంటున్నట్టు 2012లో తెలిపింది. రష్యా సైన్యం భారీ స్థాయిలో ఉన్న డివిజనల్ కార్యాలయాల సంఖ్యను కుదించటం మొదలుపెట్టింది. చైనా సైతం మూడేళ్లక్రితం సైనిక సంస్కరణలు మొదలుపెట్టింది. త్రివిధ దళాల్లో మొత్తంగా ఉన్న 20 లక్షలమంది సంఖ్యను సగానికి తగ్గించటమే లక్ష్యమని చైనా సైనిక వ్యవహారాల పత్రిక ‘పీఎల్ఏ డైలీ’ నిరుడు ప్రకటించింది. పదాతి దళాల్లో 10 లక్షలమందిని... వైమానిక, నావికా దళాల్లోనూ గణనీయంగా సిబ్బందిని తగ్గించాలని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆలోచన. నిజానికి 1980 నుంచే ఈ విషయంలో చైనా నాయకత్వం శ్రద్ధ పెట్టింది. సైన్యాన్ని పరిమాణంలో కాకుండా గుణాత్మకంగా మిన్నగా ఉండేలా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు సాయుధ దళాల్లోని అన్ని విభాగాలనూ పర్యవేక్షించే సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) 2016 జనవరిలో ప్రకటించింది. ఆ తర్వాత కొన్నాళ్లకే మన దేశం కూడా ఆ దిశగా అడుగులేయడం ప్రారంభించింది. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇందుకోసం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీబీ షెకత్కార్ నేతృత్వంలో 12మందితో ఒక కమిటీని నియమించారు. సైన్యం, త్రివిధ దళాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించి పటిష్టపరచడానికి, నిర్వహణా వ్యయాన్ని అదుపు చేయడానికి ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయాలని అప్పట్లో సూచించారు. సాంకేతికత విస్తరించటం, రంగంలోకి ఎప్పటికప్పుడు కొత్త ఉపకరణాలు రావటం వగైరాల వల్ల అధిక సంఖ్యలో సైనిక సిబ్బంది ఉండాల్సిన అవసరం తగ్గిపోయింది. పైగా ఉన్న సిబ్బంది సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను అందుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఉపగ్రహాలు అందించే డేటా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్లు, కృత్రిమ మేధస్సు వినియోగం వంటివి నానాటికీ పెరుగుతున్నాయి. సైబర్ సంగ్రామంలో మెరికల్ని తయారు చేస్తే తప్ప వర్తమాన యుద్ధాలను గెలవటం అసాధ్యం. మన రక్షణ రంగ వ్యయంలో సింహభాగం సిబ్బందికే వ్యయమవుతోంది. ఆయుధాలు, ఇతర అత్యాధునిక ఉపకరణాల కొనుగోలుకు 20 శాతంమించి ఖర్చుచేయటం సాధ్యపడటం లేదు. మూడేళ్లక్రితం త్రివిధ దళాల కమాండర్ల సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ అగ్ర రాజ్యాలన్నీ తమ దళాలను తగ్గించుకుని సాంకేతికతపై ఆధారపడుతుంటే మనం మాత్రం సైనిక దళాల సంఖ్యను విస్తరించాలనుకుంటున్నామని, ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. మన సైనిక దళాలు గత దశాబ్దకాలంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. డిజిటలైజేషన్ పెరిగింది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు సమర్ధవంతంగా వినియోగించగల విద్యావంతులైన యువకుల్ని తీసుకోవటం ప్రారంభించారు. దానికి తగినట్టుగా దళాల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయంలో అవసరమైన కన్నా అధిక సంఖ్యలో అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారని... అక్కడ వృథాగా ఉన్నవారిని కార్యనిర్వహణ క్షేత్రాల్లోకి మార్చవలసిన అవసరం ఉన్నదని సైనిక డాక్యుమెంటు చెబుతోంది. అలాగే బ్రిగేడియర్ ర్యాంకును పూర్తిగా రద్దు చేసి ఏకీకృత బ్రిగేడ్లు ఏర్పాటు చేయాలని, ఆ బ్రిగేడ్లకు మేజర్ జనరల్ స్థాయి అధి కారి నాయకత్వంవహించాలన్న ప్రతిపాదన ఉంది. ఇప్పుడున్న సాధారణ బ్రిగేడ్ వ్యవస్థలో దరిదాపు మూడు బెటాలియన్లు ఉంటాయి. ఒక్కో బెటాలియన్‌లో 900 నుంచి 1,100మంది సిబ్బంది ఉంటారు. ఏకీకృత బ్రిగేడ్‌లో ఇలాంటి బెటాలియన్ల సంఖ్యను నాలుగు నుంచి అయిదుకు పెంచాలని పత్రం ప్రతిపాదించింది. సరిహద్దుల్లో డివిజన్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఈ ఏకీకృత బ్రిగేడ్లు నేరుగా సైనిక దళ ప్రధాన కార్యాలయానికి జవాబుదారీగా ఉండేలా రూపొందించాలన్న ఆలోచన ఉంది. ప్రస్తుతం ఒక సైనిక దళ ప్రధాన కార్యాలయం కింద మూడు డివిజన్లు, ఒక్కో డివిజన్ కింద మూడు బ్రిగేడ్లు ఉంటున్నాయి. ఏ దేశమైనా శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తూనే యుద్ధం వచ్చే పక్షంలో సమర్థవంతంగా తలపడేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఎందు కంటే యుద్ధాన్ని చాలాసార్లు శత్రువే నిర్ణయిస్తాడు. శాంతి అంటే రెండు యుద్ధాల మధ్య ఏర్పడే అయోమయ వాతావరణమేనని ఒక యుద్ధ తంత్ర నిపుణుడి అభిప్రాయం. దాంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సైనికంగా పదును పెట్టుకోవాలి. వర్త మాన కాలానికి అనువైన స్మార్ట్ సైనికుల్ని రూపొందించుకోవాలి. సిబ్బందికి పెనుభారంగా ఉండే కాలం చెల్లిన పరికరాల వినియోగానికి స్వస్తి పలికి చేతుల్లో అమరే, సులభంగా ఎక్కడికైనా మోసు కుపోగలిగే ఉపకరణాలను పెంచుకోవాలి. దూరదృష్టితో, వివేకంతో ముందడుగేస్తే సమర్థవంత మైన సైనిక వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. -
అభివృద్ధికి ‘బాట’సారి.. అటల్ జీ!
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలను జాతీయ రహదారులతో మరింత మెరుగ్గా అనుసంధానించిన దార్శనికుడు... దేశీయంగా చమురు, సహజవాయువు ఉత్పత్తి పెంపుతోపాటు, విదేశాల్లో కొనుగోళ్ల ద్వారా ఇంధన భద్రత దిశగా అడుగులు వేసిన మార్గదర్శి. ఆయనే అటల్ బిహారీ వాజ్‌పేయి. 93ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన వాజ్‌పేయిని, ఆయన దేశ ప్రధానిగా సేవలు అందించిన సమయంలో చేపట్టిన కార్యక్రమాలను మననం చేసుకోవడం సందర్భోచితం. ఆధునిక భారత్‌కు వాజ్‌పేయి బలమైన విధాన సంస్కరణలు చేపట్టారు. అందుకే రెండో తరం ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా వాజ్‌పేయిని పేర్కొంటారు. 1990 దశకంలో తొలిసారి ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును సంస్కరణల పితామహుడిగా పేర్కొనే విషయం విదితమే. జాతీయ రహదారుల విస్తరణ 2001లో స్వర్ణ చతుర్భుజి పేరుతో, ఉత్తర–దక్షిణ, తూర్పు–పశ్చిమ కారిడార్ ప్రాజెక్టులను వాజ్ పేయి ఆరంభించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా మెట్రో నగరాలను 4, 6 లేన్ల రహదారులతో అనుసంధానం... శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు, పోర్బందర్ నుంచి సిల్చార్ వరకు జాతీయ రహదారులతో అనుసంధానించడమే ఈ కార్యక్రమాల లక్ష్యం. అమెరికా అభివృద్ధికి రహదారుల నెట్వర్క్ ఎలా తోడ్పడిందో, మన దగ్గరా అభివృద్ధికి మౌలిక సదుపాయాల అవసరాన్ని గుర్తించి చేపట్టిన కార్యక్రమం ఇది. తర్వాత ప్రభుత్వాలు సైతం వాజ్‌పేయి చూపిన బాటలోనే కొనసాగుతూ జాతీయ రహదారుల విస్తరణ దిశగా చర్యలు తీసుకున్నాయి. ప్రైవేటీకరణ మరో ముఖ్య కార్యక్రమం ప్రభుత్వరంగ సంస్థల పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ. వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 32 ప్రభుత్వరంగ కంపెనీలు, హోటళ్లను ప్రైవేటు సంస్థలకు అమ్మేశారు. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రత్యేకంగా ‘పెట్టుబడుల ఉపసంహరణ విభాగం’ను, పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు కేబినెట్ కమిటీ ఏర్పాటు వాజ్‌పేయి పాలనలోనే చోటుచేసుకున్నాయి. మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్‌ను 1999–2000లో హిందుస్తాన్ యూనిలీవర్‌కు విక్రయించడంతో అమ్మకాల పరంపర మొదలైంది. ఆ తర్వాత భారత్ అల్యూమినియం (బాల్కో), హిందుస్తాన్ జింక్‌లో మెజారిటీ వాటాలను అనిల్ అగర్వాల్‌కు చెందిన స్టెరిలైట్ ఇండస్ట్రీస్ (ప్రస్తుత వేదాంత)కు కట్టబెట్టారు. ఐటీ సంస్థ సీఎంసీ, టెలికం కంపెనీ విదేశ్ సంచార్ నిగమ్ (వీఎస్ఎన్ఎల్)ను టాటాలకు, పెట్రోల్ రిటైలింగ్ సంస్థ ఐబీపీని ఐవోసీకి, ఐపీసీఎల్ను రిలయన్స్‌కు కట్టబెట్టారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయంలో వాజ్‌పేయి సర్కారు ఎంతో వ్యతిరేకత చవిచూసింది. ముఖ్యంగా బాల్కో ప్రైవేటీకరణ సుప్రీంకోర్టు వరకు వెళ్లగా, ప్రభుత్వానికి అనుకూల తీర్పు వెలువడింది. అయితే, హెచ్‌పీసీఎల్‌ను సైతం ప్రైవేటీకరించాలనుకోగా, కేబినెట్ సహచరుల నుంచే వ్యతిరేకత రావడంతో అది వెనక్కు వెళ్లిపోయింది. విదేశీ చమురు నిక్షేపాలపై కన్ను దేశాభివృద్ధికి ఇంధన భద్రత అవసరాన్ని గుర్తించి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుని తన దార్శనికతను వాజ్‌పేయి నిరూపించుకున్నారు. రష్యాలోని సఖాలిన్–ఐ చమురు, గ్యాస్ క్షేత్రాల్లో 20 శాతం వాటాను 1.7 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో భారత్ తరఫున ఒకానొక అతిపెద్ద పెట్టుబడి ఇది. దీని తర్వాత సుడాన్‌లోని చమురు క్షేత్రంలోనూ 25 శాతం వాటాను 720 మిలియన్ డాలర్లతో కొనుగోలుకు నిర్ణయం జరిగింది. రిస్క్‌తో కూడిన దేశాల్లో ఇంత భారీ పెట్టుబడులు ఏమిటన్న విమర్శలను వాజ్‌పేయి ఎదుర్కొన్నారు. కానీ, ఆ తర్వాత ఇవి సరైనవిగా రుజువయ్యాయి. నాడు వాజ్‌పేయి హయాంలో విదేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో పెట్టుబడుల ద్వారా ఇంధన భద్రతకు చేపట్టిన విధానం ఆ తర్వాత కూడా ఆగలేదు. ప్రస్తుతం 20 దేశాల్లోని చమురు, గ్యాస్ నిల్వల్లో భారత కంపెనీలకు వాటాలున్నాయి. విదేశాలతో భారత సంబంధాల్లో ఇంధన దౌత్యం కూడా నేడు ప్రముఖమైనది కావడం గమనార్హం. ఇక, పెట్రోల్ దిగుమతి భారాన్ని కొంత వరకైనా తగ్గించేందుకు చెరకు నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కొంత వరకు కలిపి విక్రయించే విధానాన్ని వాజ్‌పేయి ప్రభుత్వంలోనే ప్రారంభించారు. దీని ద్వారా చెరకు రైతులకు అదనపు ఆదాయ మార్గాన్ని కూడా చూపించారు. సామాన్యులకూ మొబైల్ యోగం.. నేడు మొబైల్ ఫోన్ సేవలు సామాన్యులను చేరుకోవడం వెనుక 1999లో వాజ్‌పేయి సర్కారు తీసుకొచ్చిన నూతన టెలికం విధానం కీలకమని చెప్పుకోవాలి. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ ఆదాయ పంపిణీ విధానానికి కొత్త విధానం దారితీసింది. దీంతో కాల్ రేట్లు తగ్గి, మొబైల్ ఫోన్ సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. వాజ్‌పేయికి కార్పొరేట్ల ఘన నివాళి మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని, దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన దార్శనికునిగా ఆయన్ను ప్రస్తుతించారు. వాజ్‌పేయి మరణ వార్త బాధాకరం. దయ, హాస్యచతురత ఉన్న గొప్ప నేత. మనలో చాలా మంది అభిమానించే వ్యక్తిగా ఆయన గుర్తుండిపోతారు. – రతన్ టాటా, టాటాట్రస్ట్ చైర్మన్ అటల్ జీ జాతికి వెలుగు చూపించారు. మార్కెట్ సంస్కరణల ద్వారా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడిన వ్యక్తి. తన దార్శనిక నాయకత్వంలో ప్రవేశపెట్టిన రెండో తరం సంస్కరణలు పెట్టుబడుల వాతావరణానికి తోడ్పడ్డాయి. ఫలితంగా భారత్ వేగంగా వృద్ధి సాధించేందుకు దోహదపడింది. – రాకేశ్ భారతి మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ గొప్ప ఆర్థిక సంస్కరణలవాది. సరళీకరణ అన్నది దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలు వాస్తవ రూపం దాల్చేందుకు, అంతర్జాతీయ మార్కెట్‌కు తలుపులు తెరిచి మరింత పోటీయుత, బలమైన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు తోడ్పడుతుందని నమ్మిన వ్యక్తి. – సునీల్ భారతి మిట్టల్, భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు స్వర్ణ చుతుర్భుజి ప్రాజెక్టు, నూతన టెలికం విధానం, సర్వశిక్షా అభియాన్, ఫిస్కల్ రెస్పాన్స్‌బులిటీ యాక్ట్ వంటి చర్యల ద్వారా దేశాన్ని వేగవంతమైన మార్గం వైపు వాజ్‌పేయి నడిపించారు. భవిష్యత్తు ప్రభుత్వాలు కూడా ఈ దిశలో నడిచేలా మార్గం వేశారు. – ప్రతాప్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ వాజ్‌పేయి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారు. జాతి నిర్మాణం పట్ల ముందు చూపు కలిగిన వారు. ప్రస్తుత తరానికే కాక రాబోయే తరాలకూ స్ఫూర్తినీయులు. – సందీప్ జజోదియా, అసోచామ్ ప్రెసిడెంట్ ఈ దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది. వాజ్‌పేయి ఈ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. గొప్ప దార్శనికత, ప్రజాకర్షణ ఉన్న వ్యక్తి. – కిరణ్మజుందార్ షా, బయోకాన్ చైర్పర్సన్ భారత కార్పొరేట్ రంగం ఓ నిజమైన భతరమాత బిడ్డను కోల్పోయింది. కీలక సమయంలో దేశాన్ని నడిపించిన వ్యక్తి. గొప్ప వక్త, ప్రజానేత. – అనిల్ అగర్వాల్, వేదాంత గ్రూప్ చైర్మన్ -
‘విజయ’ పథంలో నడిచేనా!
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీలో ఏడాదిగా అమలు చేస్తున్న పలు సంస్కరణలను రద్దు చేస్తూ యాజమాన్యం సంచలన నిర్ణ యం తీసుకుంది. విజయ డెయిరీ ఎండీగా 10 రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసరావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పాల విక్రయాలు పడిపోవడానికి ప్రధాన కారణమైన డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను రద్దు చేశారు. దానిస్థానంలో 40 ఏళ్లు ఉనికిలో ఉన్న ఏజెంట్ల వ్యవస్థను పునరుద్ధరించారు. హైదరాబాద్‌లో 1,650 మంది ఏజెంట్లు ఉన్నారు. తాజా నిర్ణయంతో వారంతా తిరిగి డెయిరీలో భాగస్వామ్యం కానున్నారు. దీంతో విజయ డెయిరీకి పూర్వ వైభవం వస్తుందని డెయిరీ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్లో విజయ పాల విక్రయాలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం పాల విక్రయాలు 4 లక్షల లీటర్లుండగా, ఇప్పుడు రెండున్నర లక్షల లీటర్లకు పడిపోయాయి. దీంతో సంస్థ టర్నోవర్‌లో రూ.240 కోట్లు తగ్గిందని డెయిరీ వర్గాలు వెల్లడించాయి. 4 లక్షల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్లకు పాల విక్రయాలు పెంచుతామంటూ గతేడాది అనేక సంస్కరణలకు తెరలేపిన సంస్థ చివరకు ఉన్న విక్రయాలనే కాపాడుకోలేని దుస్థితికి చేరింది. రాన్రాను డెయిరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేలా కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు వచ్చాయి. ఏజెంట్ల వ్యవస్థ రద్దుతో తిరోగమన బాట ఏడాది క్రితం వరకు విజయ డెయిరీ నుంచి వినియోగదారులకు పాలను ఏజెంట్లే చేరవేసేవారు. వారే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసి డెయిరీకి చెల్లించేది. రాష్ట్రంలో విజయ డెయిరీకి పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లోనే పాల విక్రయాలు జరుగుతుంటాయి. నగరంలో 1,650 మంది ఏజెంట్లు పాలను సరఫరా చేస్తుండేవారు. కానీ డెయిరీ యంత్రాంగం వెనుకాముందు ఆలోచించకుండా ఈ ఏజెంట్ల వ్యవస్థను గతేడాది రద్దు చేసింది. వారి స్థానే సుమారు 150 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పింది. ఏజెంట్ల వ్యవస్థను పర్యవేక్షించడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం కోసం నగరంలో 18 జోన్ కార్యాలయాలుండగా.. వాటినీ రద్దు చేశారు. పూర్తిగా డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే పాల విక్రయాలు ఆధారపడేలా చేశారు. అయితే ఈ నిర్ణయంతో మెరుగవుతుందనుకున్న పరిస్థితి మరింత దిగజారింది. ఓ వైపు ఏజెంట్లు.. మరోవైపు ఉద్యోగులు గతంలో ఏజెంటు కమీషన్ లీటరుకు రూ.2.50 ఇచ్చేవారు. రవాణాకు అయ్యే ఖర్చుకు డెయిరీ 70 పైసలు చెల్లించేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ ఏకంగా రూ.3.90కు పెంచేశారు. రవాణా ఖర్చు 70 పైసలు ఇస్తున్నారు. పైగా డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థకు ఎలాంటి అనుభవం లేదు. రాజకీయ అండదండలున్న వారికి డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ఏజెంట్లుగా పనిచేసిన వారంతా ఆందోళనలు చేశారు. ఉద్యోగులు కూడా సహాయ నిరాకరణకు దిగే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త ఎండీ శ్రీనివాసరావు పాత సంస్కరణలకు చరమగీతం పాడారు. మరోవైపు ప్రైవేటు డెయిరీల నుంచి ఐదు వేల లీటర్ల పాలను విజయ డెయిరీ యాజమాన్యం తీసుకోవడానికి నిరాకరించింది. నాణ్యత లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. -
సంస్కరణల అమలు అంతంతే...!
పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు సక్రమంగా అమలుకావడం లేదన్నది చర్చనీయాంశమైంది. డీజీపీల నియామకం విషయంలో రాష్ట్రాలు స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని, మూడునెలల ముందుగానే సీనియర్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపించి అందులోంచే ఒకరిని డీజీపీగా లేదా నగర కమిషనర్‌గా నియమించాలంటూ నిర్దేశించింది.1861లో బ్రిటీష్హయాంలో రూపొందించిన చట్టంలోని మౌలిక ఆలోచనలు ప్రతిబింబించే విధంగానే ఇప్పటికీ దేశంలోని మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్‌చట్టాలు కొనసాగుతున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి పోలీస్ వ్యవస్థలో నూతన సంస్కరణల అమలు ఆవశ్యకత మరోసారి ప్రస్తావనకు వచ్చింది. మనదేశ పోలీస్‌వ్యవస్థలో నేటికీ పాతవాసనలు, అలవాట్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరమరుగుకాలేదు. సుప్రీంకోర్టు తాజాగా పోలీస్ సంస్కరణలు పాటించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్కరణల అమలు అవసరాన్ని ఎత్తిచూపుతున్నాయి. 2006 తీర్పులో చెప్పిన అంశాలేమిటీ ? ప్రతిభ ఆధారంగా, పారదర్శక పద్ధతుల్లో సీనియర్ అధికారులను డీజీపీ / ఎస్పీలుగా నియమించాలి వారు కనీసం రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగేలా పదవీకాలాన్ని ఖరారుచేయాలి ప్రస్తుత డీజీపీ పదవీ విరమణ మూడునెలలకు ముందుగానే యూపీఎస్సీకి అర్హులైన సీనియర్ అధికారుల జాబితా పంపించాలి యూపీఎస్సీ సూచించిన ముగ్గురు అధికారుల జాబితాలోంచే ఒకరిని ఆ పదవుల్లో నియమించాలి కేసుల దర్యాప్తు, శాంతి,భద్రతల పరిరక్షణ విధులను విభజించి పోలీసులకు దేనికదే ఉండేలా ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలి డీఎస్పీ అంత కంటే తక్కువ హోదా ఉన్న పోలీసు అధికారుల బదలీలు, పోస్టింగ్‌లు, పదోన్నతులు, ఇతర సర్వీసు సంబంధిత విషయాల్లో సిఫార్సులు చేసేందుకు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్బోర్డ్ను ఏర్పాటు చేయాలి పోలీసు కస్టడీలో అత్యాచారం, తీవ్రగాయాలు, లాకప్ మరణం వంటి తీవ్రమైన కేసుల్లో ఎస్పీ కంటే పై హోదాలో ఉన్న అధికారులపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీని ఏర్పరచాలి కేంద్ర పోలీస్ సంస్థ (సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్)ల అధిపతుల ఎంపిక,నియమాకం, వారికి కనీసం రెండేళ్ల పదవీకాలం ఉండేలా జాతీయస్థాయిలో నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటుచేయాలి పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం అనవసర ఒత్తిళ్లు, ప్రభావం చూపకుండా ఉండేందుకు స్పష్టమైన మార్గదర్శకాలతో రాష్ట్ర భద్రతా కమిషన్(ఎస్ఎస్సీ) ఏర్పాటుచేయాలి. రాష్ట్ర పోలీసు పనితీరు మధింపు చేయాలి. ఆచరణలో అమలు ఎంత ? పోలీసుల పనితీరు మెరుగు పరిచేందుకు ఉపకరించే దిశలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. పన్నెండేళ్ల తర్వాత కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలుచేయలేదు. 2006 తర్వాత 18 రాష్ట్రాలు మాత్రమే కొత్త పోలీస్ చట్టాలు ఆమోదించాయి. మిగతా రాష్ట్రాలు జీవోలు /నోటిఫికేషన్లకే పరిమితమైనట్టు కామన్వెల్త్ హ్యుమన్‌రైట్స్ ఇనిషియేటివ్ (సీహేచ్ఆర్ఐ) అధ్యయనంలో వెల్లడైంది. జమ్మూ,కశ్మీర్, ఒడిశా మినహా అన్ని రాష్ట్రాలు స్టేట్ సెక్యూరిటీ కమిషన్లు (ఎస్ఎస్సీలు) ఏర్పాటుచేశాయి. మొత్తం 29 రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ మాత్రమే ఎస్ఎస్సీ వార్షికనివేదికలను ఆ రాష్ట్ర అసెంబ్లీల ఎదుట ఉంచాయి. అయితే ఇందులో ఆరు రాష్ట్రాలు ఎస్ఎస్సీ మార్గదర్శకాల ప్రకారం ప్రతిపక్షనేతను చేర్చలేదు. 18 రాష్ట్రాలు నియామకాలకు సంబంధించిన స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయలేదు. డీజీపీ నియామక మార్గదర్శకాలను 23 రాష్ట్రాలు పట్టించుకోలేదు. దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు విభజించి, దేనికదీగా పోలీసులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలన్న ఆదేశాలను 12 రాష్ట్రాలు అమలు చేయలేదు. పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులపై 12 రాష్ట్రాలు మాత్రమే రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీని (పీసీఏ) ఏర్పాటుచేశాయి. అయితే ఏ ఒక్క రాష్ట్రం కూడా సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ, నిర్వహణ, కూర్పు విషయంలో పీసీఏ నియమ,నిబంధనలు పాటించడం లేదని ఈ పరిశీలనలో తేలింది. -
నరేంద్రమోదీ ధైర్యం.. ప్రభుత్వం కొత్త ప్రయోగం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాలనా వ్యవస్థను మరింత మెరగు పర్చేందుకు ఐఏఎస్‌ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ ఎంతో కాలంగా ప్రతిపాదనలు వస్తున్నా గత ప్రభుత్వాలు అందుకు ధైర్యం చేయలేక పోయాయి. ఉన్నతాధికార పాలనా వ్యవస్థలోకి బయటి వారిని ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే సాధ్యమైంది. ఇక్కడ బయటి వారంటే దేశ, విదేశాల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నత చదువులు చదవడమే కాకుండా దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన కలిగిన విద్యావేత్తలు. భారతీయ అధికార వ్యవస్థను మనం ‘ఉక్కు కవచంగా’ వర్ణిస్తాం. ‘అసియాస్ మోస్ట్ ఇనెఫిషెంట్ (ఆసియాలోనే అత్యంత అసమర్థ వ్యవస్థ)’గా హాంకాంగ్‌లోని ‘పొలిటికల్ అండ్ ఎకనామిక్ రిస్ట్ కన్సల్టెన్సీ’ అభివర్ణిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ ఉన్నతాధికార యంత్రాంగంలోకి బయటి వారిని ఆహ్వానించడం సముచిత నిర్ణయమే. కాని దాన్ని అమలు చేసే విధానంలోని దాని జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఎలాంటి విధానం అమలు చేయాలో తెలియాలంటే ముందుగా ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను గ్రహించాలి. ఐఏఎస్‌లకు వృత్తిరీత్యా, ఆర్థికంగా సరైన రాయతీలు కల్పించక పోవడం ప్రధాన లోపం. సీనియారిటీ పరంగా కాకుండా నైపుణ్యం, పోటీతత్వం ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలి. ఆర్థిక రాయతీలు కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. భారతీయ అమెరికన్ సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థకు 43వ ఏటనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమితులయ్యారంటే అమెరికాలో అలాంటి వ్యవస్థ ఉండడమే కారణం. ఆయనే కనుక భారత్‌లో ఉండి ఉంటే మన అధికార యంత్రాంగంలో మధ్యస్థాయి జాయింట్ సెక్రటరీ అయ్యేవారు. సివిల్స్‌లో దేశమంతా సీనియర్లకు పదోన్నతి అవకాశాలను మెరగుపరుస్తూనే వారే తమ జూనియర్లను ప్రోత్సహించే విధంగా రాయతీలు ఉండాలి. మంచి సమర్థత కలిగిన, ఐఏఎస్ కాని అధికారులను కూడా ఐఏఎస్ క్యాటగిరీలోకి తీసుకోవాలి. అలా కూడా అధికారుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. ఐఏఎస్‌ల విధుల నిర్వహణలో రాజకీయ జోక్యం అసలు ఉండకూడదు. రాజకీయ జోక్యాన్ని కూడా పట్టించుకోకుండా నిజాయితీయిగా, సమర్థంగా అక్కడక్కడా పని చేస్తున్న జిల్లా కలెక్టర్ల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. వారి ప్రమోషన్ల కోసం జిల్లా వార్షికాభివృద్ధి సూచికలను పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి సూచికల పరిధిలోకి సామాజిక, ఆర్థికాభివృద్ధి అంశాలు వస్తాయన్న విషయం తెల్సిందే. ఐఏఎస్‌లోకి అభ్యర్థులను ఆకర్షించడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తరహాలోనే ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’ కాలేజీలు ఉండాలి. వారికి అమెరికాలోని ‘కొలంబియా యూనివర్శిటీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’లో మాస్టర్ డిగ్రీ చేసే అవకాశం ఉండాలి. మన ఐఏఎస్‌లకు సాధారణ శిక్షణకు పరిమితమైన ‘లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ను అన్ని విధాల లోతుగా అధ్యయనం చేసే అకాడమీగా తీర్చిదిద్దాలి. -
చేతికి స్టీరింగ్
ఆదివారం, 24. జూన్ 2018. సౌదీలో వీధులన్నీ కోలాహలంతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. న్యూ ఇయర్‌లా! అంతకన్నా ఎక్కువే. ఓ కొత్త శకంలా. అసలు శనివారం అర్ధరాత్రి గడియారం ముళ్లు 12 మీదకు రాగానే, వీధులన్నీ హర్షాతిరేకపు జల్లులతో నిండిపోయాయి. రియాద్, జెడ్డా, దమ్మమ్లలో మహిళలంతా దీపాలు పట్టుకుని తిరిగారు. ‘‘నేను మా వారి కారును ఈ రోజు ఉపయోగించుకున్నాను. త్వరలోనే నా కారు నేను కొనుక్కుందామనుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ అంతా వింతగా, కొత్తగా కనిపిస్తోంది. ఇది నిజంగానే సౌదీ మహిళలకు పండుగరోజు’’ అన్నారు సౌదీ మహిళ బయన్. సౌదీ మీడియా వీరిని అనుసరించి ప్రపంచానికి వీరి ఆనందాన్ని పంచింది. స్టీరింగ్ తమ చేతికి రావడాన్ని స్వాతంత్య్రానికి తొలి అడుగు పడినట్లు భావిస్తున్నారు సౌదీ మహిళలు. సుమారు 30 సంవత్సరాల తరవాత నిషేధాన్ని ఎత్తివేయడమే ఇంత ఆనందానికీ కారణం. 1990లో పోలీసులు, లైసెన్స్ ఏజెన్సీలు కలిసి మహిళల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసి, మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించిన రోజు నుంచి అక్కడి మహిళలు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. ఇటీవలే పట్టాభిషిక్తుడైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీలో సంస్కరణలకు నడుం బిగించారు. సాంఘిక, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగానే మహిళలు స్వేచ్ఛగా వాహనాలు నడుపుకునేలా చట్టం తీసుకొచ్చారు. ‘‘ఇక్కడ జీవితం ఒక్కోసారి దుర్భరంగా అనిపిస్తుంది’ అంటారు బయాన్. సిరియాకి చెందిన బయాన్, డమస్కస్‌లో చదువుకుంటున్న రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు.‘‘సూపర్ మార్కెట్‌కి వెళ్లడానికి కూడా ఇతరుల మీద ఆధారపడటం చాలా చిరాకుగా ఉండేది. కనీసం పది నిమిషాల దూరానికి కూడా స్వేచ్ఛగా ప్రయాణించ లేకపోవడం బాధాకరం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడటం ఎంతో ఆనందంగా ఉంది. పురుషాధిక్యం ఉన్న సౌదీ అరేబియాలో మహిళలు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ, సెకండ్ క్లాస్ సిటిజన్‌గా, నిర్ణయాలు తీసుకోలేని వారిగా ఉండటం మాకు ఎంతో బాధగా ఉంటుంది’’ అంటున్నారు బయాన్. – రోహిణి ఎక్కడికైనా వెళ్లగలను రైడ్ హెయిలింగ్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకున్న మొట్టమొదటి సౌదీ అమ్మాయిని నేనే. ఈ రోజు నాకు స్వేచ్ఛ లభించింది. ఏ సమయంలోనైనా ఎక్కడికైనా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే హక్కును సాధించాను. నేను డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టాను. సౌదీలో మహిళా కాల్ సెంటర్ కూడా స్థాపించాను. ఇక్కడ ఇదే ఏకైక మహిళా కాల్ సెంటర్. త్వరలోనే 20 వేల మంది మహిళా డ్రైవర్లు వచ్చేలా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – కరీమ్, సౌదీ మహిళ నా జీవితంలో మంచిరోజు ఆర్థికంగా స్వేచ్ఛగా బతకడానికి, సంఘంలో నిలదొక్కుకోవడానికి డ్రైవింగ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను హాయిగా నాకు కావలసినవారిని కలవడానికి స్వేచ్ఛగా వెళ్లగలుగుతాను. నా జీవితంలో ఇంత మంచి అవకాశం వచ్చినరోజు మరొకటి లేదేమో. – ఈనామ్ ఘాజీ అల్ అస్వాద్, సౌదీ మహిళ -
సంస్కరణలకు తక్షణ తరుణం
కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్‌సభ సభ్యులు 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంతవరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ‘భారత రాజ్యాం గంలో సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం మసకబారుతూ ఉండడంతో న్యాయస్థానం విశ్వసనీయత హరించుకుపోతుంది.’ – ఫ్రంట్‌లైన్, 25–5–2018 (హిందూ గ్రూపు) ‘భావితరాల కోసం న్యాయ వ్యవస్థ హోదాను సంరక్షించుకుని కాపాడుకోవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ దృఢంగా, తగినంత స్వతంత్ర ప్రతిపత్తితో మెలగుతూ వర్తమాన సామాజిక సమస్యల పట్ల బాధ్యతతో ఉండాలి. ఈ దేశంలో ఎవరికీ భద్రత లేదు. ఈ పరిస్థితులలో పరిపాలనలో ఉన్న స్త్రీపురుషులను అదుపాజ్ఞలలో పెట్టగల యంత్రాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ మాత్రమే. పదవులలో ఉన్నవారిని అధికారం అవినీతి పాల్జేస్తుందని మానవచరిత్ర నిరూపించింది. అధికారంలో ఉన్న పార్టీలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను దుర్వినియోగం చేస్తున్నాయి.’ – జస్టిస్ చలమేశ్వర్ (నాగ్‌పూర్ సభలో, 17–4–18) ఇటీవల దేశ పరిపాలన క్రమంలో గొలుసుకట్టుగా సాగిన పరిణామాలు గణతంత్ర రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలకే ప్రమాదకరంగా పరిణమించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు దారితీసిన పరిణామాలు నాలుగు: 1. ఒక వైద్య కళాశాల ప్రవేశాల వ్యవహారంలో జరిగిన కుంభకోణంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఒకరికి సంబంధం ఉన్న అంశాన్ని పరిశీలించాలని ఒక ఎన్జీవో (ప్రభుత్వేతర సంస్థ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సిద్ధపడలేదు. దీనితో పిటిషనర్ నుంచి మరో పిటిషన్ దాఖలైంది. ఈసారి జస్టిస్ దీపక్ మిశ్రా లేని ధర్మాసనానికి తన దరఖాస్తును నివేదించాలని పిటిషనర్ (ఎన్జీవో) కోరడం జరిగింది. ఆపై అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వేరే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. 2. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం (న్యాయ పాలనా నిర్వహణ వ్యవస్థ) సిఫారసు చేయడం. 3. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా సొహ్రా బుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయా ఆకస్మికంగా మరణించారు. ఈ కేసులో ఒక బీజేపీ ప్రముఖ నేత అభియోగాలను ఎదుర్కొంటున్నారు. లోయా మరణం గురించి న్యాయవాదులు, పౌర సంఘాల ప్రతినిధులు, లోయా తోబుట్టువులు అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు కేసు సుప్రీం కోర్టుకు చేరినా సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి అంగీకరించక, కొట్టివేయడం జరిగింది. ఇంకొక అంశం– జస్టిస్ దీపక్ మిశ్రా మీద రాజ్యసభలో విపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడు ఏకపక్షంగా తోసిపుచ్చడం. 4. సుప్రీంకోర్టుకు వచ్చిన పిటిషన్లను సంబంధిత ధర్మాçసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి సోదర న్యాయమూర్తులతో సంప్రతించడం అనివార్యమా అన్న ప్రశ్న తలెత్తింది. దీనిపైన న్యాయమూర్తులలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇంత పెద్ద దేశాన్ని వారే శాసించాలా? కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పిం చింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్‌సభ సభ్యులే 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంత వరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ఏడు దశాబ్దాలుగా పాలకవర్గ ఆచరణ దీనిని నిరూపిస్తూనే ఉంది. అలాంటి వాతావరణంలో మనం నిర్వహించుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో న్యాయస్థానాలు కూడా తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేవని (తొలి రెండు దశాబ్దాల నాటి భారత న్యాయమూర్తుల తీర్పులను మినహాయిస్తే) నేటి చరిత్ర మరింత స్ఫుటంగా హెచ్చరిస్తున్నది. అనేక సందర్భాలలో సాక్ష్యాలు ఉన్నా వాటిని ‘నిర్దిష్టంగా లేవు’ అన్న సాకుతో నీరుగారుస్తున్నారు. బీజేపీ హయాంలో 2002లో గుజరాత్లో మైనారిటీల మీద జరిగిన దాడులు కావచ్చు, ఇప్పుడు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏదో ఒక పేరుతో దళితులు, మైనారిటీల మీద జరుగుతున్న దాడుల విషయంలో గానీ సాక్ష్యాలను, సాక్షులను మాయం చేస్తున్న ఘటనలు మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు సభ్యుల ధర్మాసనం 1964లోనే (కొలీజియంకు మచ్చలేని రోజులు) అన్ని కేసులలోను అన్ని సాక్ష్యాలను నమ్మలేకపోయినా సాక్ష్యాన్ని పూర్తిగా విచారించి బేరీజు వేయడంలో న్యాయస్థానం జాగరూకతతో మెలగాలని ఒక తీర్పులో పేర్కొన్నది. ‘ఇచ్చిన సాక్ష్యంలో కొన్ని వైరుధ్యాలు ఉన్నా, లేకపోయినా లేదా సాక్ష్యం సబబైనదేనని కోర్టుకు అనిపించినా లేదా సాక్ష్యం వల్ల బహిర్గతమై గాథ నిజమైనా లేకున్నా – ఇవన్నీ తప్పనిసరిగా గణనలోనికి తీసుకోవలసిందే. కానీ సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలు సాక్షికమైనవీ, ప్రయోజనాలు ఆశించినవీ కాబట్టి, వాటిని సాక్ష్యాలుగా పరిగణించరాదన్న భావన మాత్రం హేతు విరుద్ధం. కేవలం ఫలానా సాక్ష్యాన్ని అది పాక్షికమైనదన్న కారణంగా యాంత్రికంగా (మెకానికల్ రిజెMý‡్షన్) తోసిపుచ్చడమంటే తరచూ అన్యాయానికే దారితీస్తుంది’’(మసల్తీ వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీం తీర్పు). న్యాయ నిపుణుడు జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ఒక సందర్భంలో చెప్పినట్టు ‘‘న్యాయమూర్తులు వివాదాలపై తీర్పులు చెబుతూంటారు. కానీ, సమాజాన్ని మార్చడం కూడా న్యాయమూర్తుల కర్తవ్యం కాగలిగినప్పుడు అసలైన మార్పుకు దోహ దం చేయగలుగుతారు!’’ సంస్కరణలకు తొందరపడాలి ఈ అనుభవాలన్నింటిని రంగరించి, క్రోడీకరించుకున్న జస్టిస్ కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థకు ఆరోగ్యకరమైన ఒక ‘సంస్కరణ పత్రాన్ని’(రిఫార్మ్ ఎజెండా) 1980లోనే అందజేశారు: అందులో: ‘‘మన న్యాయస్థానాలు నేడు క్లిష్ట దశలో ఉన్నాయి, మన జడ్జీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన న్యాయ పాలనా వ్యవస్థ ఎంత గోప్యంగా, ఎంత ఆటంకంగా తయారైందంటే– అది సామాన్య ప్రజల నుంచి దూరంగా జరిగిపోయింది. అందుకనే ఈ మౌలికమైన లోటును సవరించాలి. ఇందుకు న్యాయ ప్రక్రియలోనే సంస్కరణ, కూలంకషమైన మార్పులు రావాలి. మన న్యాయ వ్యవస్థ రాజ్యాంగ దార్శనిక దృష్టి స్పష్టంగా, ప్రకాశమానంగా ఉండాలి. దాని లక్ష్యం రాజ్యాంగం ముందుమాటలో నిర్వచించిన ప్రజానుకూల విలువలకు కట్టుబడి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయి శాసన వేదికలు నేడు సమాజంలోని మోతుబరులకే అనుకూల వ్యవస్థలు. శ్రామిక ప్రజా బాహుళ్యంతో సంబంధం లేని వర్గాలు న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల్ని నడిపిస్తున్నాయి. వీరి ఎంపిక ఆశ్రిత పక్షపాతం ఆదాయ వనరులపై ఆధారపడి జరుగుతుంటుంది. జడ్జీల ఎంపిక ప్రక్రియలో, సుప్రీం బెంచ్‌కి సోదర న్యాయమూర్తులను ఎంచుకోవడంలో చర్యలు కొన్ని సందర్భాలలో సెలక్షన్ తీరుకు విరుద్ధంగా ఉంటున్నాయి. చివరికి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సహితం పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడుతున్నారు’’అన్నారు (ఫ్రం బెంచ్ టు బార్’ జస్టిస్ కృష్ణయ్యర్). ఎన్నికైన ప్రతినిధులూ, శాసనకర్తలూ ఎంతగా వంకర పద్ధతుల్లో ధన ప్రయోగానికీ అవి నీతికీ పాల్పడుతుంటారో ఇంటర్నెట్ ద్వారా ఒకరు తనకు ‘ఈ–మెయిల్’లో పంపిన వ్యంగ్య సందేశాన్ని జస్టిస్ కృష్ణయ్యర్ ప్రస్తావించారు. అందులో పేర్కొన్న ‘కంపెనీ’ ఏదో కాదు సుమా! ప్రభుత్వమే. ‘‘ఈ కంపెనీ కింద పనిచేసే ‘ఉద్యోగులు’ 500 మంది పైచిలుకు ఉంటారు. అందులో 29 మంది భార్యల్ని వేధించేవారని ఆరోపణ. మరి ఏడుగురు మోసాల కారణంగా అరెస్టయినవారు. 19 మంది పైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 117 మంది మీద హత్య, రేప్‌లు, దాడులు, దోపిడీ నేరాల మీద విచారణ సాగుతోంది. 71 మంది తీసుకున్న రుణాలు/అప్పులున్నందున పరపతి పుట్టనివారు. 21 మంది అనేక కోర్టు దావాల్లో ఇరుక్కున్నవారు. 84 మంది దాడుల కేసుల్లో జరిమానాలు చెల్లించారు. ఇంతకూ ఇంతటి ‘బడా కంపెనీ’ ఏదై ఉంటుందో ఊహించండి. ఆ ‘కంపెనీ’ భారత దిగువ సభ, ఇది నీ కోసం, నా కోసమే పనిచేస్తుంది సుమా! దిగువ సభలోని 545 మంది సభ్యులు నీ కోసం నా కోసమే పనిచేస్తారు. ఇదే ‘గ్రూపు’ మనల్నందర్నీ ఒక వరసలో నిలబెట్టి వందలాదిగా చట్టాలు చేస్తుంది. ఇంతటి భారీ ‘కంపెనీ’ గురించి మనమేమైనా చేయగలమా?!’’. ఆ ప్రశ్నార్థకంతో ఆ ఈ–మెయిల్ సందేశాన్ని జస్టిస్ ముగించారు. -ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అరకొర సంస్కరణలు
రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఖర్చు నిమిత్తం విరాళాలు ఇచ్చే పద్ధతిలో మార్పు తేవలసిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పలు సందర్భాలలో ఉద్ఘాటించారు. నిరుడు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెం టులో సమర్పించిన సందర్భంలో ఆర్థిక మంత్రి కొన్ని సూచనలు సైతం చేశారు. నగదు విరాళాలు రూ. 2,000 నుంచి రూ. 20,000లకు మించరాదనే నిబంధన విధించాలని ప్రతిపాదించారు. ఎలక్టొరల్ బాండ్లు జారీ చేసే విధానం ప్రవేశపెట్టా లని అనుకున్నట్టు కూడా చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారా నికి చేస్తున్న ఖర్చుపైన ఎటువంటి పరిమితి లేదు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి చేసే ఖర్చుపైన మాత్రం పరిమితి ఉంది. విరాళాలన్నీ నగదు రూపంలోనే రాజకీయ పార్టీలు స్వీకరిస్తున్నాయి. దాతల పేర్లు గుట్టుగానే ఉంచుతున్నాయి. పాలకులు రూపొందించే విధానాలను గమనిస్తే ఏ కార్పొరేట్ సంస్థ అధికార పార్టీకి అధికంగా విరాళం ఇచ్చిందో ఊహించుకోవడం కష్టం కాదు. కానీ ఆ విధానాన్ని చట్ట ప్రకారం ప్రశ్నించే అవకాశం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం ద్వారా కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినట్లయితే విరాళాల విషయంలో పారదర్శకత ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. ఏదైన వ్యవస్థను సంస్కరించే సమయంలో లోపాలు లేకుండా, తప్పుకునే అవకాశాలు లేకుండా పకడ్బందీగా చేయాలి. ఇప్పటి కంటే కొంత మెరుగైన విధానం ప్రవేశపెట్టాలని తలపోస్తున్నారే తప్ప ఆదర్శవంతమైన పక్కా విధానం రూపొందించే ప్రయత్నం జరగడం లేదు. జైట్లీ ప్రతిపాదిస్తున్న సంస్కరణల ప్రకారం 1934 నాటి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ను సవరించి ఎలక్టొర ల్బాండ్స్ జారీకి అవకాశం కల్పిస్తారు. కడచిన ఎన్నికలలో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు సంపాదించిన పార్టీకి ఎలక్టొరల్బాండ్ ద్వారా విరాళాలు స్వీకరించే అర్హత ఉంటుంది. కొర్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాలలో ప్రతి మాసంలోనూ పది రోజుల పాటు కొను గోలు చేయవచ్చు. ప్రతి రాజకీయ పార్టీ ఒక బ్యాంకు అకౌంట్ వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. ఆ ఖాతాలో దాత ఇచ్చే ఎలక్టొరల్బాండ్ను సొమ్ము చేసుకోవచ్చు. ఇందుకు 15 రోజుల గడువు ఉంటుంది. స్వీకర్త పేరు బ్యాంకులో నమోదు అవుతుంది. దాత పేరు కూడా బ్యాంకుకు తెలుస్తుంది. ఇతరులకు మాత్రం తెలియదు. ఈ సంస్కరణలో ఉన్న ఇబ్బంది ఏమంటే ఎవరు ఎవరికి ఎంత విరాళం ఇస్తున్నారో బ్యాంకులకు, వాటి ద్వారా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకు ఏ కార్పొరేట్ సంస్థ ఎంత విరాళం ఇస్తున్నదో తెలుసుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీకి ఏ సంస్థ ఎంత విరాళం ఇస్తున్నదో తెలుసుకునే వీలు ప్రతిపక్షాలకు ఉండదు. అధికార పార్టీ తెలుసుకునే అవకాశం ఉన్నదనే ఎరుకే కార్పొరేట్ సంస్థలను ప్రతి పక్షాలకు దూరంగా ఉంచుతుంది. అధికార పార్టీకి వచ్చే విరాళాల కంటే ప్రతి పక్షాలకు చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. మార్చి 9న పార్లమెంటు బడ్జెట్ సమావేశం ద్వితీయార్థం ఆరంభం అవుతుంది. అప్పుడు ఆర్థిక బిల్లుపైన చర్చ జరిగే క్రమంలో ఈ అంశాలు పరిశీలనకు వస్తాయి. అన్ని పక్షాలు అన్ని కోణాలనూ సాకల్యంగా పరిశీలించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసు కుంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. సాధారణ పౌరులు సైతం ఎన్నికల బరిలో నిలబడి గెలిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంస్కరణలపైన సుదీర్ఘమైన అధ్య యనం చేసిన దినేశ్ గోస్వామి కమిటీ, ఇంద్రజిత్‌గుప్తా కమిటీ సిఫార్సులను అమలు చేసే ప్రయత్నం ఎన్డీఏ సర్కార్ చేయడం లేదు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఈ రెండు కమిటీలూ సిఫార్సు చేశాయి. అభ్యర్థులకు లేదా పార్టీలకూ ఉన్న ప్రజాదరణ ప్రకారం ఎన్నికల ఖర్చు కింద ఎంత మొత్తం ఇవ్వవచ్చునో నిర్ణయించేందుకు ఒక సూత్రాన్ని రూపొందించడం కష్టం కాదు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఎన్నికల విరాళాలను ప్రభుత్వానికి అందజేయాలి. ఆ విధంగా జమ అయిన మొత్తానికి ప్రభుత్వ నిధులు జోడించి అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కింద నిర్ణీత నిధిని అందించాలి. ఈ పద్ధతి జర్మనీలో అమలు చేస్తున్నారు. జైట్లీ ప్రతిపాదించినవి అరకొర సంస్కరణలు. అవి సైతం నిజాయితీగా అమలు జరుగుతాయన్న భరోసా ప్రజలకు లేదు. అధికార, ప్రతిపక్షాలకు ఈ విష యంలో చిత్తశుద్ధి లేదని అనేక సందర్భాలలో రుజువైంది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు సంబంధించిన (ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్)యాక్ట్‌ను ఉల్లం ఘించి బీజేపీ, కాంగ్రెస్‌లు బ్రిటన్‌కు చెందిన వేదాంత కార్పొరేషన్ నుంచి 2014 ఎన్నికలలో భారీ విరాళం అందుకున్నాయి. లోగడ కూడా రూ. 20,000కు మించి ఎన్నికల విరాళం ఇచ్చినట్లయితే ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలనే నిబంధన 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 29 (సి) సెక్షన్లో ఉంది. ఎవరైనా లక్ష రూపాయల నగదు విరాళంగా ఇస్తే ఆ మొత్తానికి ఆరు రసీదులు ఇచ్చి ప్రతి రసీ దులోనూ రూ. 20 వేల కంటే తక్కువ మొత్తం ముట్టినట్టు బొంకుతారు. సంస్క రణలు చేయడం, చట్టాలను సవరించడం, కొత్త చట్టాలు చేయడంతో సరిపోదు. వాటిని మనస్ఫూర్తిగా అమలు జరపాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంత దివ్యంగా అమలు జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ఈ చట్టాన్ని అన్ని పార్టీలూ కనికరం లేకుండా కుళ్ళ బొడు స్తుంటే అడిగే నాథుడు లేడు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా నిష్కర్షగా శిక్షించే వ్యవస్థ లేనంత వరకూ రాజకీయ పార్టీలు బుద్ధిగా వ్యవహరించవు. ‘మీ కంటే మేము పవిత్రులం’ అంటూ అతిశయానికి పోకుండా ఎన్నికలలో నల్లధనం పాత్రను అరికట్టేందుకు అన్ని పార్టీలూ, అందరు నాయకులూ కలసిరావాలంటూ నిరుడు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రధాని సహా రాజకీయ నేతలందరూ ఈ వాక్కును శిరసావహించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించగలిగితే చరితార్థుల వుతారు. -
మహిళా ఖైదీలకు శుభవార్త..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో మహిళా ఖైదీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శాఖ పలు మార్పులు చేయనుంది. జాతీయ మహిళా కమిషన్‌తో కలిసి కొత్త జైలు సంస్కరణలను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి మేనకా గాంధీ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. జైళ్లలో మహిళల స్థితిగతులపై చాలా ఆందోళనకరమైన, అవాంఛనీయ నివేదికలు వచ్చాయని మేనకా గాంధీ చెప్పారు. ఈ నేపథ్యంలో వారు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక కమిటీ ఉండాల్సి అవసరం ఉందన్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సహకారంతో మంత్రిత్వ శాఖ తయారు చేసిన ప్రొ ఫార్మాను దేశవ్యాప్తంగా 144 సెంట్రల్ జైళ్లకు పంపిణీ చేసినట్టు చెప్పారు. చాలా జైళ్లలో అధిక సంఖ్యలో మహిళా ఖైదీలు ఉండడంతో కనీస సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా వైద్య సదుపాయాలు, శానిటరీ నాప్కిన్లు, విద్యా సౌకర్యాలతోపాటు చట్టబద్దమైన అవగాహన వంటి ప్రాథమిక అవసరాలు కూడా అందడం లేదని మంత్రి పేర్కొన్నారు. మహిళా ఖైదీలకోసం కొత్త జైలు నిబంధనావళిని సిద్ధం చేయటానికి తమ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీని కూడా సంప్రదించినట్టు మేనకా గాంధీ చెప్పారు. మరోవైపు వీరికి జైళ్లలో నైపుణ్యం అభివృద్ధి మరియు ఔత్సాహిక విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొన్ని నైపుణ్యం ఆధారిత శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఇంతకుముందు అనేక సిఫార్సులు అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ వీటి అమలు విషయంలో అధికారులు సీరియస్‌గా తీసుకోలేదన్నారు. తాజాగా వీటిని కచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నామని ఎన్సీడబ్ల్యు యాక్టింగ్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ప్రకటించారు. -
నాకు పవర్ లేకుండా చేశారు
సాక్షి, అమరావతి: పవర్ సెక్టార్లో తాను అనేక సంస్కరణలు తీసుకొచ్చా.. కానీ 2004లో మీరు నాకు పవర్ లేకుండా చేశారని ప్రజలనుద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ లేబొరేటరీకి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్రంలో రౌడీలకు, దొంగలకు స్థానం లేదని, దొంగల వేలిముద్రలు సేకరించడం వల్ల తక్కువ సమయంలో కేసులు చేధిస్తున్నామన్నారు. ఏపీలో రాబోయే రోజుల్లో ఎలాంటి క్రైం జరగడానికి అవకాశం లేదని, గట్టిగా శిక్ష వేస్తేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్యానించారు. కోర్టులో ఏదో ఒకచోట తప్పించుకుంటామనే భావనతోనే నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆరునెలల్లో అమరావతి ఒక రూపు సంతరించుకుంటుందని, పీపీపీ విధానంలో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పోలీసు అధికారులందరికి స్కిల్ ట్రైనింగ్ తప్పనిసరి అని అన్నారు. ఎన్ని కేసులు బుక్ చేశామనేది కాదు, ఎన్ని ఛేదించామనేదే ముఖ్యమన్నారు. కేసుల పరిష్కారంలో కాస్త వెనుకబడి ఉన్నామని, టెక్నాలజీ వాడకంలో పోలీసులు కూడా వెనుకబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా తప్పు చేసేవాడిని ముందుగానే గుర్తించవచ్చునని తెలిపారు. కన్విక్షన్ రేటు పెరగాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు నియంత్రించాలని సూచించారు. శాంతికి మారుపేరుగా రాష్ట్రం ఉండాలని కోరారు. -
సంస్కరణలకు బై..సంక్షేమానికి జై..?
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠ నడుమ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని విజయం వరించినా కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. హోరాహోరీ పోరులో బీజేపీ గట్టెక్కినా సొంత రాష్ట్రంలో విపక్షం నుంచి గట్టి పోటీ ఎదురైన క్రమంలో మోదీ సర్కార్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది. గుజరాత్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడటం బీజేపీ శ్రేణులను ఆలోచనలో పడవేస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి మోదీ సర్కార్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపినట్టు గుజరాత్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయనే అంచనాలూ వెల్లడవుతున్నాయి. గుజరాత్లో బీజేపీ 150 సీట్లలో గెలుపొందాలనే టార్గెట్ నిర్ధేశించుకుంది.ఈ అంకెకు బీజేపీ చాలా దూరంగా నిలిచింది. గుజరాత్ ఫలితాల నేపథ్యంలో మోదీ తన సంస్కరణల వ్యూహన్ని పునఃసమీక్షిస్తారని భావిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు మిగిలి ఉన్న ఏడాదిన్నర వ్యవధిలో సంస్కరణల దూకుడును తగ్గించి ప్రజాకర్షక విధానాలకు తెరలేపుతారనే అంచనాలూ వ్యక్తమవుతున్నాయి. తదుపరి లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో నోట్ల రద్దు, జీఎస్టీ వంటి భారీ సంస్కరణలకు దిగడం ప్రధాని మోదీకి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే అవుతుంది. ఓట్ల వేటలో భాగంగా సంస్కరణలను పక్కనపెట్టి సంక్షేమ పథకాలు, సామాజిక కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తారనే ప్రచారం సాగుతోంది. కొత్త సంస్కరణలకు పదును పెట్టడం కన్నా ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేయడం, పాలనా సంస్కరణలు చేపట్టడానికే ప్రదాని ప్రాధాన్యత ఇస్తారని బార్క్లేస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ సిద్ధార్ధ సన్యాల్ అంచనా వేశారు. -
కీలక నిర్ణయాలకు వెనుకాడం
సాక్షి,దహేజ్(గుజరాత్): ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నక్రమంలో కీలక నిర్ణయాలు కొనసాగుతాయని ప్రధాని పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్టీ అమలు పట్ల గుర్రుగా ఉన్న వ్యాపార వర్గాలకు చేరువయ్యేందుకు ప్రధాని ప్రయత్నించారు. జీఎస్టీలో నమోదైన వ్యాపారులను పాత రికార్డులకు సంబంధించి పన్ను అధికారులు ఇబ్బంది పెట్టబోరని తేల్చిచెప్పారు. సంస్కరణలు కొనసాగించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలపైకి ఎక్కిందని, మెరుగైన దిశలో సాగుతున్నదని ప్రధాని చెప్పుకొచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయిందన్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని పలువురు ఆర్థిక వేత్తలు అంగీకరించారన్నారు. దేశంలో బొగ్గు, విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, విదేశీ పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. విదేశీ ద్రవ్య నిల్వలు సైతం రికార్డుస్థాయిలో 30,000 కోట్ల డాలర్ల నుంచి 40,000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయన్నారు. జీఎస్టీలో చేరే వ్యాపారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదన్నారు. రాష్ట్రాల చెక్‌పోస్ట్‌ల వద్ద జీఎస్టీతో అవినీతికి చెక్ పడిందని అన్నారు. -
ఆర్మీలో భారీ సంస్కరణలు
న్యూఢిల్లీః సైనిక బలగాల బలోపేతమే లక్ష్యంగా భారత ఆర్మీలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లెఫ్టినెంట్ జనరల్ డీబీ షెకాట్కార్ కమిటీ చేసిన 65 సిఫార్సులకు ఆమోదం తెలిపింది. దీంతో పలు సైనిక విభాగాల్లో 57,000 మంది సైనిక సిబ్బందికి రీఎంట్రీ కల్పించనున్నారు. ఈ సూచనలకు 2019 సంవత్సరాంతానికి అమల్లోకి వస్తాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.ఆర్మీలో సంస్కరణలపై రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం కేబినెట్‌కు నివేదించామని చెప్పారు. భారత సైన్యంలో స్వాతంత్య్రానంతరం ఇది అతిపెద్ద సంస్కరణని, సైన్యంతో సంప్రదింపులు జరిపి ఈ కసరత్తు కార్యాచరణపై ముందుకెళతామని అన్నారు. షెకాట్కార్ కమిటీ సిఫార్సుతో 57,000 మంది అధికారులు, జేసీఓలు, ఇతర ర్యాంకుల్లో సిబ్బందిని తిరిగి సైన్యంలో సేవలందించేందుకు తీసుకుంటామన్నారు. -
ఈవోడీబీలో 265 సంస్కరణలు పూర్తి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సులభ వ్యాపారం (ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్/ ఈవోడీబీ) సంస్కరణలలో భాగంగా ఇప్పటివరకు 265 సంస్కరణలు పూర్తి చేసినట్లు వివిధ శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్‌కు తెలిపారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల ప్రగతిపై ఆయనæ మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లా డుతూ, వివిధ శాఖల వద్ద ఇంకా 140 సంస్క రణలు పూర్తి కావాల్సి ఉందన్నారు. జూన్ 15లోగా మిగిలిన సంస్కరణల అమలును పూర్తి చేస్తామన్నారు. -
'తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది'
-
'తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది'
హైదరాబాద్: ఎన్నో రంగాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో ఎన్నోమైలురాళ్లు అధిగమించామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సులభతర వాణిజ్యంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం సంతోషమని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నవ తెలంగాణ పురోగామిస్తోందన్నారు. తొమ్మిది నెలల్లో స్వల్ప వ్యవధిలోనే గణనీయ ప్రగతి సాధించామని చెప్పారు. 26 చట్టాలను సవరించి కొత్త విధానాలు తీసుకొచ్చామన్నారు. 113 ఆన్ లైన్ సర్వీసులు ప్రారంభించామని, కార్మిక శాఖలోనే 22 సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. 22 మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేశాయడం వల్లే ఇదంతా సాధ్యమైందని స్పష్టం చేశారు. సమూలమైన మార్పు, సమగ్రమైన ఆలోచనావిధానంతో సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అవినీతి ఆస్కారంలేని విధానాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమల తనిఖీల్లోనూ కీలక మార్పులు చేశామన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో ముందు ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. -
విద్యా వ్యవస్థలో లోటుపాట్లను సరిచేస్తాం
► ప్రతి పాఠశాలలో ఫిజికల్ లిటరసీ పిరియడ్ ► డీఎస్సీ ద్వారా కూచిపూడి, భరతనాట్యం అధ్యాపకుల నియామకం ► రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్-2016 ప్రారంభ్సోవంలో మంత్రి గంటా వెల్లడి విజయవాడ (గుణదల) : విద్యార్థులకు నైతిక విలువలు కలిగిన విద్యను అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు విద్యా నైపుణ్యాలతోపాటు ఫిజికల్ లిటరసీని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గుణదలలోని బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్-2016ను బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అనేది జీవితమని.. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోటుపాట్లను సరిచేసి నూతన విద్యావిధానాన్ని అందించేందకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పిల్లల్లో సృజనాత్మకత, అకడమిక్ స్కిల్స్(విద్యా నైపుణ్యాలు)ను పెంచటానికి ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ఫిజికల్ లిటరసీ ఏర్పాటు చేసి, ఒక పిరియడ్‌ను కేటాయిస్తామన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి కళలపై మక్కువను పెంచటానికి కళా సంస్కృతి విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లతో బడ్జెట్ కేటాయించామని, ఆ విభాగానికి కూచిబొట్ల ఆనంద్‌ను చైర్మన్‌గా నియమించామని తెలిపారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భాగస్వాములను చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ అధికారిక కార్యక్రమాల్లో కూచిపూడి, భరతనాట్యం వంటి కళలను ఏర్పాటు చేసి, విద్యార్థులను ప్రోత్సహిస్తామని వివరించారు. త్వరలో డీఎస్సీ ద్వారా కూచిపూడి, భరతనాట్యం అధ్యాపకులను కూడా నియమిస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మర్ గద్దె అనూరాధ మాట్లాడుతూ కళల ద్వారా విద్యార్థులకు ఉత్తిడి దూరమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, నగర మేయర్ కోనేరు శ్రీధర్, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి సత్యనారాయణ, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభయాన్ డెరైక్టర్ డాక్టర్ ప్రభాకరరావు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం రిసోర్స్ పర్సన్ రామకృష్ణ, ఎస్ఈఆర్ఈటీ డెరైక్టర్ ఎం.రాజ్యలక్ష్మీ, డీఈవో ఎ.సుబ్బారెడ్డి, డీవైఈవోలు రవికుమార్, రవిసాగర్, గిరికుమార్, స్థానిక కార్పొరేటర్ దాసరి మల్లేశ్వరి పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
సంస్కరణలను పట్టించుకోకపోవడం సరికాదు
మూడీస్ రేటింగ్ విధానాన్ని తప్పుబట్టిన కేంద్రం న్యూఢిల్లీ: రేటింగ్ విషయంలో మూడీస్ అనుసరిస్తున్న పరిశోధనా పద్దతి తగిన విధంగా లేదని కేంద్ర ఆర్థికశాఖ గురువారం పేర్కొంది. కేంద్రం ప్రారంభించిన సంస్కరణలను మూడీస్ పట్టించుకోవడం లేదని, వాటి ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంటుందన్న ఆ సంస్థ అభిప్రాయం తగదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ గురువారం పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి స్వేచ్ఛగా ఒక అంచనాకు రేటింగ్ ఏజెన్సీలు రావచ్చని ఆయన అంటూనే... అయితే మూడీస్ రేటింగ్ పరిశోధనా విధానం సరికాదన్నదే తమ అభిప్రాయమని వివరించారు. దేశంలో సంస్కరణల అమలు తీరును సందేహించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని పేర్కొన్నారు. గత పలు సంవత్సరాలుగా ప్రత్యేకించి రెండేళ్లుగా సంస్కరణలు ఎటువంటి అడ్డంకులూ లేకుండా కొనసాగుతున్నాయని వివరించారు. ‘అలాంటి పరిస్థితుల్లో వీటికి వెయిటేజ్ ఇప్పుడు ఏమీ ఇవ్వబోమని మీరు (మూడీస్) చెప్పడం సరికాదు’ అని ఆయన అన్నారు.