మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడాల్సి రావడమే కారణం
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీల అంచనాలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుండటం వంటి పరిణామాలు భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా సంస్కరణల వేగం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.
దీనివల్ల భూ, కారి్మక సంస్కరణలకు కళ్లెం పడవచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని ఆందోళన వ్యక్తపర్చాయి. 2014 తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మెజారిటీని కోల్పోవడానికి సంబంధించిన ప్రభావాలపై ఫిచ్ రేటింగ్స్, మూడీస్ రేటింగ్స్ వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి.
ఆర్థిక క్రమశిక్షణకు బ్రేక్..
పటిష్టమైన ఆర్థిక వృద్ధి సాధించే దిశగా మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచడం, దేశీయంగా తయారీ రంగానికి తోడ్పాటునివ్వడం వంటి పాలసీపరమైన విధానాలు ఇకపైనా కొనసాగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. అయితే, బీజేపీకి మెజారిటీ తగ్గడం వల్ల కీలకమైన ఆర్థిక, ద్రవ్యపరమైన సంస్కరణల అమల్లో జాప్యం జరగొచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని పేర్కొంది. 2025–26లో జీ20 కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక వృద్ధి సాధించగలదని భావిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు రిసు్కలు ఉన్నాయని తెలిపింది.
‘వివిధ రంగాల్లో నిరుద్యోగ యువత సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత వృద్ధి బలహీనంగా ఉండటం వంటి అంశాలు ప్రతికూల ప్రభావాలు చూపడాన్ని కొనసాగించవ చ్చు’అని మూడీస్ వివరించింది. ఇక ద్రవ్యలోటు విషయానికొస్తే 2024–25లో నిర్దేశించుకున్న విధంగా దీన్ని 5 శాతానికి తగ్గించుకోగలిగితే, 2025– 26లో 4.5% స్థాయిని సాధించవచ్చని పేర్కొంది. కాగా, ద్రవ్య, రుణపరమైన కొలమానాల విషయంలో ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్‌తో పోలిస్తే భారత్ బలహీనంగానే ఉన్నట్లు పేర్కొంది.
ల్యాండ్, లేబర్ సంస్కరణల అమలు కష్టమే
‘బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రధానిగా మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టినప్పటికీ మెజారిటీ తగ్గిపోవడమనేది, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న సంస్కరణల అజెండాకు సవాలుగా పరిణమించవచ్చు’ అని ఫిచ్ పేర్కొంది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల ‘వివాదాస్పద సంస్కరణలను, ముఖ్యంగా ల్యాండ్, లేబర్ సంస్కరణలను అమలు చేయడం కష్టంగా మారొచ్చు. దేశీ తయారీ రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు ఇవే తమకు అత్యంత ప్రాధాన్య అంశాలంటూ బీజేపీ ఇటీవలే పేర్కొంది’ అని ఫిచ్ తెలిపింది.
మరోవైపు, ప్రభుత్వం తమ జీవనోపాధిని మెరుగుపర్చాలని సూచించేలా ప్రజలు తీర్పునిచి్చన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాదాన్ని పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఫిచ్ గ్రూప్‌లో భాగమైన బీఎంఐ పేర్కొంది. అయితే, మధ్యకాలికంగా చూస్తే భారత్‌పై సానుకూల అంచనాలు పటిష్టంగానే ఉన్నాయని, ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని బీఎంఐ ఏషియా హెడ్ (కంట్రీ రిస్క్) డారెన్ టే తెలిపారు. బీజేపీ ఎక్కడెక్కడైతే హిందుత్వ జాతీయవాదంపై గట్టిగా ప్రచారం చేసిందో ఆయా రాష్ట్రాలన్నీ దానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment