international investors
-
సంకీర్ణ ప్రభుత్వం.. తగ్గనున్న సంస్కరణల వేగం..
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుండటం వంటి పరిణామాలు భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా సంస్కరణల వేగం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల భూ, కారి్మక సంస్కరణలకు కళ్లెం పడవచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని ఆందోళన వ్యక్తపర్చాయి. 2014 తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ మెజారిటీని కోల్పోవడానికి సంబంధించిన ప్రభావాలపై ఫిచ్ రేటింగ్స్, మూడీస్ రేటింగ్స్ వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి.ఆర్థిక క్రమశిక్షణకు బ్రేక్.. పటిష్టమైన ఆర్థిక వృద్ధి సాధించే దిశగా మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెంచడం, దేశీయంగా తయారీ రంగానికి తోడ్పాటునివ్వడం వంటి పాలసీపరమైన విధానాలు ఇకపైనా కొనసాగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. అయితే, బీజేపీకి మెజారిటీ తగ్గడం వల్ల కీలకమైన ఆర్థిక, ద్రవ్యపరమైన సంస్కరణల అమల్లో జాప్యం జరగొచ్చని, ఆర్థిక క్రమశిక్షణ పురోగతికి విఘాతం కలగవచ్చని పేర్కొంది. 2025–26లో జీ20 కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక వృద్ధి సాధించగలదని భావిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలకు రిసు్కలు ఉన్నాయని తెలిపింది. ‘వివిధ రంగాల్లో నిరుద్యోగ యువత సంఖ్య భారీ స్థాయిలో ఉండటం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత వృద్ధి బలహీనంగా ఉండటం వంటి అంశాలు ప్రతికూల ప్రభావాలు చూపడాన్ని కొనసాగించవ చ్చు’అని మూడీస్ వివరించింది. ఇక ద్రవ్యలోటు విషయానికొస్తే 2024–25లో నిర్దేశించుకున్న విధంగా దీన్ని 5 శాతానికి తగ్గించుకోగలిగితే, 2025– 26లో 4.5% స్థాయిని సాధించవచ్చని పేర్కొంది. కాగా, ద్రవ్య, రుణపరమైన కొలమానాల విషయంలో ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయ్‌ల్యాండ్‌తో పోలిస్తే భారత్ బలహీనంగానే ఉన్నట్లు పేర్కొంది.ల్యాండ్, లేబర్ సంస్కరణల అమలు కష్టమే‘బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రధానిగా మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టినప్పటికీ మెజారిటీ తగ్గిపోవడమనేది, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న సంస్కరణల అజెండాకు సవాలుగా పరిణమించవచ్చు’ అని ఫిచ్ పేర్కొంది. పూర్తి మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాలపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల ‘వివాదాస్పద సంస్కరణలను, ముఖ్యంగా ల్యాండ్, లేబర్ సంస్కరణలను అమలు చేయడం కష్టంగా మారొచ్చు. దేశీ తయారీ రంగ పోటీతత్వాన్ని పెంచేందుకు ఇవే తమకు అత్యంత ప్రాధాన్య అంశాలంటూ బీజేపీ ఇటీవలే పేర్కొంది’ అని ఫిచ్ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వం తమ జీవనోపాధిని మెరుగుపర్చాలని సూచించేలా ప్రజలు తీర్పునిచి్చన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాదాన్ని పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ఫిచ్ గ్రూప్‌లో భాగమైన బీఎంఐ పేర్కొంది. అయితే, మధ్యకాలికంగా చూస్తే భారత్‌పై సానుకూల అంచనాలు పటిష్టంగానే ఉన్నాయని, ఈ దశాబ్దం ఆఖరు నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని బీఎంఐ ఏషియా హెడ్ (కంట్రీ రిస్క్) డారెన్ టే తెలిపారు. బీజేపీ ఎక్కడెక్కడైతే హిందుత్వ జాతీయవాదంపై గట్టిగా ప్రచారం చేసిందో ఆయా రాష్ట్రాలన్నీ దానికి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
Global Investors Summit 2023: భారత సౌభాగ్యంతోనే ప్రపంచ సౌభాగ్యం
లక్నో: ప్రపంచ సౌభాగ్యం భారతదేశ అభివృద్ధితో ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తే ప్రపంచ ఉజ్వల భవిష్యత్తుకు హామీ అని స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు శుక్రవారం అట్టహాసంగా ఆరంభమైంది. విదేశీ ప్రతినిధులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రపంచ ఆర్థిక ప్రగతి ఇండియాతో అనుసంధానమై ఉందని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని వివరించారు. ఇక్కడున్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులకు సూచించారు. ఇండియా ప్రగతికి ఉత్తరప్రదేశ్ కీలకమైన నాయకత్వాన్ని అందిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి సంక్షోభాల నుంచి భారత్ వేగంగా బయటపడిందని, దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. భారతీయుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. దేశంలో యువత ఆలోచనా ధోరణిలో, సమాజం ఆకాంక్షల్లో భారీ మార్పు కనిపిస్తోందని వివరించారు. సాధ్యమైనంత త్వరగా మరింత అభివృద్ధిని చూడాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటున్నాడని వెల్లడించారు. ఆరేళ్లలో యూపీకి సొంత గుర్తింపు భారత్‌లో సంస్కరణల పర్వం కొనసాగుతుందని మోదీ తెలియజేశారు. ఆధునిక భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ గతంలో ‘బీమారు’ రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేదని, ఇప్పుడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని వ్యాఖ్యానించారు. ఆరేళ్ల వ్యవధిలో సొంత గుర్తింపును సాధించిందని చెప్పారు. సుపరిపాలన, మెరుగైన శాంతి భద్రతలు, స్థిరత్వం వంటి వాటితో సంపద సృష్టికర్తలకు అవకాశాల గనిగా మారిందన్నారు. సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, ఎన్.చంద్రశేఖరన్ తదితరులు మాట్లాడారు. వివిధ కంపెనీలతో 18,000 ఎంఓయూ కుదుర్చుకుంటామని యోగి వివరించారు. మధ్యతరగతి బడ్జెట్ ముంబై: కేంద్రం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో మధ్యతరగతిని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. యూపీఏ పాలనలో ప్రజల ఆదాయంపై 20 శాతం దాకా పన్ను ఉండేదని, ఈ బడ్జెట్లో సున్నా శాతం పన్ను విధించినట్లు గుర్తుచేశారు. ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి షోలాపూర్, షిర్డీకి వందేభారత్ రైళ్లను మోదీ శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వేతన జీవులను, మధ్యతరగతి ప్రజలను బడ్జెట్ సంతోషపెట్టిందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. తమ నియోజకవర్గాల్లోని స్టేషన్లలో రైళ్లను ఒక ట్రెండు నిమిషాలపాటు ఆపాలని గతంలో లేఖలు రాసిన ఎంపీలు ఇప్పుడు వందేభారత్ రైళ్ల కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి నారాయన్ రాణే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. -
మహీంద్రా, బీఐఐ రూ.4,000 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహన విభా గం కోసం మహీంద్రా గ్రూప్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్(బీఐఐ) రూ.4,000 కోట్లు పెట్టు బడి చేయాలని నిర్ణయించాయి. మహీంద్రా ఈవీ విభా గం అయిన ఈవీ కో కంపెనీలో బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఇద్దరు భాగస్వాముల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్ర ణాళికాబద్ధమైన ఉత్పత్తులకు 2023–24 నుంచి 2026–27 మధ్య నూతన ఎలక్ట్రిక్ వాహన కంపెనీ మొత్తం రూ.8,000 కోట్ల మూలధనాన్ని కలిగి ఉంటుంది. వ్యాపారాన్ని పటిష్టం చేయడం కోసం ఈవీ కో కంపెనీలోకి మరింత మంది పెట్టుబడిదార్లను తీసుకు వస్తామని మహీంద్రా గ్రూప్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాటా 25 శాతం.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన ఎక్స్‌యూవీ 400 మోడల్‌ను మహీంద్రా ఇటీవలే ఆవిష్కరించింది. అయిదు రకాల ఈ–ఎస్‌యూవీలను భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం పరిచయం చేస్తామని యూకేలో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్స్‌యూవీతోపాటు బీఈ పేరుతో పూర్తి ఎలక్ట్రిక్ బ్రాండ్ శ్రేణి లో ఈ నూతన మోడళ్లను పరిచయం చేయనుంది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల విభాగంలో కంపెనీ ఇప్పటి వరకు లేదు. అయితే ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహ న విభాగంలో సంస్థకు ఏకంగా 70% వాటా ఉంది. 2027 నాటికి సంస్థ విక్రయించే అన్ని ఎస్‌యూవీల్లో ఎలక్ట్రిక్ వాటా 25% ఉంటుందని భావిస్తోంది. -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆసియాలోనే అతి పెద్ద ఎకానమీ అయిన భారత్‌లో పెట్టుబడులకు, వ్యాపారాల నిర్వహణకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘స్వేచ్ఛా వాణిజ్యానికి అత్యంత అనువైన ఎకానమీల్లో భారత్ ఒకటి. భారత్‌లోనూ కార్యకలాపాలు విస్తరించేలా అంతర్జాతీయ కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నాం. ప్రస్తుతం భారత్‌లో ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ఉన్నాయి‘ అని మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ నుంచి క్రమంగా బైటపడుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నంత మాత్రాన ప్రపంచంతో సంబంధాలను తెంచుకున్నట్లు కాదని ప్రధాని స్పష్టం చేశారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. సంస్కరణల బాట.. పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్పేస్, రక్షణ తదితర రంగాలన్నింటిలో ఇటీవల ప్రవేశపెట్టిన పలు సంస్కరణల గురించి ప్రధాని వివరించారు. ‘ఎకానమీలో ఉత్పాదకత, పోటీతత్వం మరింత పెరిగేలా పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు నెలకొనేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పలు రంగాల్లో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణలతో స్టోరేజీ, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు‘ అని ఆయన చెప్పారు. అలాగే పెద్ద పరిశ్రమలకు తోడుగా ఉండేలా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రంగంలోనూ సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు ప్రధాని వివరించారు. స్పేస్, రక్షణ రంగాలకు అవసరమయ్యే పరికరాల తయారీకి సంబంధించి కొన్ని విభాగాల్లో ప్రైవేట్ సంస్థలకు కూడా అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయా రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. దేశీ ఫార్మా సత్తా చాటుతోంది.. కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో భారతీయ ఫార్మా పరిశ్రమ కేవలం దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఎంతో విలువైన సంపద అన్న విషయం మరోసారి రుజువైందని ప్రధాని చెప్పారు. ‘ఔషధాల ధరలు దిగి వచ్చేలా చేయడంలో .. ముఖ్యంగా వర్ధమాన దేశాలకు తోడ్పడటంలో భారతీయ ఫార్మా కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని మూడింట రెండొంతుల మంది బాలల వ్యాక్సినేషన్‌కు భారత్‌లో తయారైన టీకాలనే ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్‌కి సంబంధించిన టీకా రూపకల్పన, తయారీలో కూడా దేశీ ఫార్మా సంస్థలు చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి. టీకా కనుగొన్న తర్వాత దాన్ని అభివృద్ధి చేయడంలోనూ, వేగంగా తయారీని పెంచడంలో భారత్ కచ్చితంగా కీలకపాత్ర పోషించగలదని విశ్వసిస్తున్నా‘ అని మోదీ తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి, అభివృద్ధికి భారత్ శాయశక్తులా కృషి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సంస్కరణలు చేపడుతూ, ఆచరణలోనూ చూపిస్తూ, రూపాంత రం చెందుతున్న భారత్ కొంగొత్త వ్యాపార అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని చెప్పారు. -
ఆధునిక పన్నుల వ్యవస్థను ఆవిష్కరిస్తాం..
ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన వాషింగ్టన్: ఆధునిక పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. తక్కువ స్థాయిలో... అంతర్జాతీయంగా పోటీపూర్వక పన్ను రేట్లను తీసుకువస్తామని అన్నారు. ఎటువంటి రెట్రాస్పెక్టివ్ (గత కాలపు డీల్స్‌ను తిరగదోడి పన్నులు విధించడం) చర్య గురించీ విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన పడనక్కర్లేదని హామీ ఇచ్చారు. ఆయా సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి కృషి జరుగుతుందన్నారు. పన్ను చెల్లింపుదారులకు ‘భాగస్వాములుగా’ పరిగణించడం జరుగుతుందని, వారిని ‘బందీలుగానో లేక బాధితులుగానో’ చూడబోమని అన్నారు. ట్యాక్స్ బేస్ పెంపు ద్వారా వసూళ్లు పెంపు లక్ష్యంతో వ్యూహరచన చేస్తామన్నారు. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఆర్థికమంత్రి వాషింగ్టన్ విచ్చేశారు. ఉద్దేశపూర్వక ఎగవేతలను ఉపేక్షించం... ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలను ఎట్టి పరిస్థితులోనూ ఉపేక్షించబోమని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వస్తువులు సేవల పన్నుకు సంబంధించి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లుకు రానున్న మూడు నెలల్లో పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో పన్ను-జీడీపీ నిష్పత్తిని పెంచడానికి కృషి చేస్తామన్నారు. నాలుగేళ్లలో కార్పొరేట్ పన్ను కోత... ఆసియా దేశాల్లో సగటు కార్పొరేట్ పన్ను రేటు 21 నుంచి 22 శాతంగా ఉందని, దేశంలో వచ్చే నాలుగేళ్లలో ఈ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి తగ్గించనున్నట్లు తెలిపారు. 2016 నుంచీ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. స్టాక్‌లు మినహా ఇతర పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్మెంటుకు అవకాశం కల్పించే ప్రత్యామ్నాయ పెట్టుబడుల ఫండ్స్లె విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ను జైట్లీ ప్రస్తావించారు. ఇందుకు వీలుగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
21,000 పాయింట్ల నుంచి క్షీణత
రెండు రోజుల నుంచి స్తబ్దుగా వున్న స్టాక్ వూర్కెట్లో గురువారం ట్రేడింగ్ తొలిదశలో హఠాత్తుగా మొదలైన ర్యాలీకి అవ్ముకాల సెగ తగలడంతో వెనువెంటనే చెదిరిపోయింది. తొలుత విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్ 272 పాయింట్లు పెరిగి కీలకమైన 21,000 పాయింట్లు స్థాయిని అధిగమించి, 21,039 పాయింట్లు గరిష్టస్థాయికి చేరింది. 2010 నవంబర్ 5 తర్వాత సెన్సెక్స్ 21,000 స్థాయిని దాటడం ఇదే ప్రధవుం. అయితే వుధ్యాహ్న సెషన్లో కొన్ని బ్లూచిప్ షేర్లను దేశీయు సంస్థలు విక్రయించడంతో సూచీ గరిష్టస్థాయి నుంచి 480 పాయింట్లు కుపైగా క్షీణించి 20,657 పాయింట్లు వద్దకు పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 42 పాయింట్లు నష్టంతో 20,725 పాయింట్లు వద్ద క్లోజయియంది. అదేబాట లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,252పాయింట్లు గరిష్టస్థాయి వరకూ ఎగిసి, అటుతర్వాత 6,143 పాయింట్లు వద్దకు క్షీణించింది. చివరకు 14 పాయింట్లు నష్టంతో 6,164 పాయింట్లు వద్ద ముగిసింది. ఈ నెల 29న రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్ష వున్నందున, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు వురో 5 రోజుల్లో ముగియునున్నందున, ఈ నెలలో బాగా పెరిగిన షేర్లలో విక్రయూలు జరిగినట్లు ఆ వర్గాలు వివరించాయి. పీఎస్యుయి కౌంటర్లలో షార్ట్ బిల్డప్... కోల్ ఇండియూ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 9,000 కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధపడటంతో కొన్ని ప్రభుత్వ రంగ షేర్ల ఫ్యూచర్ కాంట్రాక్టులో తాజాగా షార్ట్ బిల్డప్ జరిగింది. డిజిన్వెస్ట్‌మెంట్ వార్తలతో ఈ నెలలో ఇప్పటికే 15 శాతం క్షీణించిన కోల్ ఇండియూ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 4.28 లక్షల షేర్లు (9.6 శాతం) యూడ్ అయ్యూయి. మొత్తం ఓఐ 49 లక్షల షేర్లకు పెరిగింది. బీహెచ్ఈఎల్ కౌంటర్లో 19.60 లక్షల షేర్లు (5.7 శాతం) యూడ్‌కాగా, మొత్తం ఓఐ 3.63 కోట్ల షేర్లకు చేరింది. ఈ షేరుకు సంబంధించిన రూ. 140 స్ట్రరయిక్ వద్ద కాల్ రైటింగ్, పుట్ కవరింగ్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్ ఓఐలో 62 వేల షేర్లు యూడ్‌కాగా, పుట్ ఆప్షన్ నుంచి 1.32 లక్షల షేర్లు కట్ అయ్యూయి. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 140 దిగువన బలహీనంగా వుండవచ్చని ఆప్షన్ యూక్టివిటీ సూచిస్తున్నది.