21,000 పాయింట్ల నుంచి క్షీణత
రెండు రోజుల నుంచి స్తబ్దుగా వున్న స్టాక్ వూర్కెట్లో గురువారం ట్రేడింగ్ తొలిదశలో హఠాత్తుగా మొదలైన ర్యాలీకి అవ్ముకాల సెగ తగలడంతో వెనువెంటనే చెదిరిపోయింది. తొలుత విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 272 పాయింట్లు పెరిగి కీలకమైన 21,000 పాయింట్లు స్థాయిని అధిగమించి, 21,039 పాయింట్లు గరిష్టస్థాయికి చేరింది. 2010 నవంబర్ 5 తర్వాత సెన్సెక్స్ 21,000 స్థాయిని దాటడం ఇదే ప్రధవుం. అయితే వుధ్యాహ్న సెషన్లో కొన్ని బ్లూచిప్ షేర్లను దేశీయు సంస్థలు విక్రయించడంతో సూచీ గరిష్టస్థాయి నుంచి 480 పాయింట్లు కుపైగా క్షీణించి 20,657 పాయింట్లు వద్దకు పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 42 పాయింట్లు నష్టంతో 20,725 పాయింట్లు వద్ద క్లోజయియంది. అదేబాట లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,252పాయింట్లు గరిష్టస్థాయి వరకూ ఎగిసి, అటుతర్వాత 6,143 పాయింట్లు వద్దకు క్షీణించింది. చివరకు 14 పాయింట్లు నష్టంతో 6,164 పాయింట్లు వద్ద ముగిసింది. ఈ నెల 29న రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్ష వున్నందున, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు వురో 5 రోజుల్లో ముగియునున్నందున, ఈ నెలలో బాగా పెరిగిన షేర్లలో విక్రయూలు జరిగినట్లు ఆ వర్గాలు వివరించాయి.
పీఎస్‌యుయి కౌంటర్లలో షార్ట్ బిల్డప్...
కోల్ ఇండియూ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 9,000 కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధపడటంతో కొన్ని ప్రభుత్వ రంగ షేర్ల ఫ్యూచర్ కాంట్రాక్టులో తాజాగా షార్ట్ బిల్డప్ జరిగింది. డిజిన్వెస్ట్‌మెంట్ వార్తలతో ఈ నెలలో ఇప్పటికే 15 శాతం క్షీణించిన కోల్ ఇండియూ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 4.28 లక్షల షేర్లు (9.6 శాతం) యూడ్ అయ్యూయి. మొత్తం ఓఐ 49 లక్షల షేర్లకు పెరిగింది. బీహెచ్‌ఈఎల్ కౌంటర్లో 19.60 లక్షల షేర్లు (5.7 శాతం) యూడ్‌కాగా, మొత్తం ఓఐ 3.63 కోట్ల షేర్లకు చేరింది. ఈ షేరుకు సంబంధించిన రూ. 140 స్ట్రరయిక్ వద్ద కాల్ రైటింగ్, పుట్ కవరింగ్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్ ఓఐలో 62 వేల షేర్లు యూడ్‌కాగా, పుట్ ఆప్షన్ నుంచి 1.32 లక్షల షేర్లు కట్ అయ్యూయి. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 140 దిగువన బలహీనంగా వుండవచ్చని ఆప్షన్ యూక్టివిటీ సూచిస్తున్నది.