వాషింగ్టన్: భారత్‌లో మంగళవారంవ వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత దేశ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదని అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.
‘‘ భారత ప్రభుత్వం, దేశంలోని ఓటర్లు అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారు?. ఎవరు ఓడిపోయారు? అనే అంశంపై మాకు ప్రాధాన్యం కాదు. వాటి మేము వ్యాఖ్యలు చేయటం లేదు.
గత ఆరు వారాలను నుంచి ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదైన ఎన్నికలు ప్రక్రియ భారత్‌లో జరగటం చూశాం. అదే మాకు చాలా ముఖ్యం’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు.
ఇక.. ఏడు విడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫతితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ 242 స్థానాలు గెలుపొందింది. ఇక.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేటమి 294 స్థానాలు విజయం సాధించింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో మూడోసారి అధికారం చేపట్టనుంది. మరోవైపు.. ప్రతిపక్షాల ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment