millar
-
భారత ఎన్నికల ప్రక్రియపై అమెరికా ప్రశంసలు
వాషింగ్టన్: భారత్‌లో మంగళవారంవ వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత దేశ పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదని అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.‘‘ భారత ప్రభుత్వం, దేశంలోని ఓటర్లు అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారు?. ఎవరు ఓడిపోయారు? అనే అంశంపై మాకు ప్రాధాన్యం కాదు. వాటి మేము వ్యాఖ్యలు చేయటం లేదు. గత ఆరు వారాలను నుంచి ప్రజాస్వామ్య చరిత్రలోనే చాలా పెద్దదైన ఎన్నికలు ప్రక్రియ భారత్‌లో జరగటం చూశాం. అదే మాకు చాలా ముఖ్యం’ అని మాథ్యూ మిల్లర్ అన్నారు. ఇక.. ఏడు విడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫతితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ 242 స్థానాలు గెలుపొందింది. ఇక.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేటమి 294 స్థానాలు విజయం సాధించింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో మూడోసారి అధికారం చేపట్టనుంది. మరోవైపు.. ప్రతిపక్షాల ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అమెరికా స్పందన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉగ్రవాదులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉగ్రవాదులను హతమార్చేందుకు సరిహద్దులు దాటేందుకు భారత్ వెనుకాబోదని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం స్పందించారు. ‘ఈ విషయంలో ఇప్పటికే ఒకసారి స్పష్టత ఇచ్చాను. అమెరికా ఈ విషయంలో అస్సలు జోక్యం చేసుకోదు. కానీ భారత్, పాకిస్తాన్ దేశాలు సమరస్యంగా చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలి’ అని మిల్లర్ అన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు భారతదేశంలో చాలా దృఢమైన ప్రభుత్వం ఉంది. ప్రధాని మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వారి ఇళ్ల వద్ద హతమార్చడానికి కూడా వెనకాడబోము’ అని అన్నారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘భారత దేశంలోని శాంతికి భంగం కల్గిస్తే.. ఉగ్రవాదలు పాకిస్తాన్లో ఉన్నా అంతం చేస్తాం’ అని అన్నారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది.‘భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది’ అని పేర్కొంది. అంతకుముందు.. పాకిస్తాన్లో ఉగ్రవాదల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందని బ్రిటన్‌కు చెందిన దీ గార్డియన్ పత్రిక ఓ నివేదిక విడుదల చేసింది. 2019 పుల్వావా దాడుల అనంతరం విదేశాల్లో ఉండే ఉగ్రవాదులను హతమార్చే విధానాలను భారత్ పాటిస్తోందని పేర్కొంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత విదేశి ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ సుమారు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపణలు చేసింది. భారత్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారాలు ఇచ్చిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక వెల్లడించామని గార్డియన్ పత్రిక పేర్కొనటం గమనార్హం. -
శతకాలతో మెరిసిన డు ప్లెసిస్, మిల్లర్
హొబార్ట్: డేవిడ్ మిల్లర్ (108 బంతుల్లో 139; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ డు ప్లెసిస్ (114 బంతుల్లో 125; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత శతకాలతో చెలరేగారు. దీంతో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఆసీస్ గడ్డపై 2009 అనంతరం దక్షిణాఫ్రికాకు ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మిల్లర్, డుప్లెసిస్ దూకుడుతో 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 252 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఏ వికెట్‌కైనా నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. చివరి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏకంగా 174 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టొయినిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్ 9 వికెట్లకు 280 పరుగులు చేసి ఓడింది. షాన్ మార్‡్ష (106; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి తోడు స్టొయినిస్ (63; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో అలెక్స్ క్యారీ (42), మ్యాక్స్‌వెల్ (35) పోరాడినా లాభం లేకపోయింది. సఫారీ బౌలర్లలో స్టెయిన్, రబడ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
రైతు నెత్తిన కి’రాయి’
ధాన్యం రవాణా సొమ్ము మిల్లర్ల ఖాతాల్లోకి తేమ శాతం ఎక్కువగా చూపి మద్దతు ధరలోనూ కోత భీమవరం : ఓ వైపు పెద్దనోట్ల రద్దు ప్రభావం.. మరోవైపు ఇన్పుట్ సబ్సిడీ, బ్యాంకు రుణాలు అందక అవస్థ పడుతున్న రైతులు ధాన్యం అమ్మకం విషయంలోనూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేవలం కమీషన్ల కోసమే పనిచేయడం.. అధికారులు పట్టించుకోకపోవడంతో అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించిన రైతులకు అందాల్సిన రవాణా చార్జీ (కిరాయి)లను మిల్లర్లు తన్నుకుపోతున్నారు. మరోవైపు ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించి రైతులకు చెల్లించాల్సిన సొమ్ములో కోత విధించి దోపిడీ చేస్తున్నారు. సాగిపోతోంది నిబంధనల ప్రకారం ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి ఆ తరువాత మిల్లర్లకు ఇవ్వాలి. ధాన్యం సొమ్ముతోపాటు బస్తాలను కొనుగోలు కేంద్రానికి తరలించినందుకు గాను రవాణా చార్జీలను ప్రభుత్వమే రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు అప్పగించిందుకు గాను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్ చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో రవాణా చార్జీలను ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే రైతులకు చెల్లించి.. అనంతరం ప్రభుత్వం నుంచి వారు పొందేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా భిన్నంగా నడుస్తోంది. కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించగా, కొన్నిచోట్ల దళారుల సాయంతో మిల్లర్లే వ్యవసాయ క్షేత్రాల నుంచి నేరుగా ధాన్యం సేకరించారు. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై.. ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలే రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు, అక్కడి నుంచి మిల్లులకు చేరవేసినట్టు రికార్డుల్లో నమోదు చేయిస్తున్నారు. ఆ ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తూ.. ఒక శాతానికి రూ.30 చొప్పున కోత వేస్తున్నారు. ఇలా ప్రతి రైతు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు నష్టపోతున్నారు. ఇలా చేయడం వల్ల ధాన్యం తరుగు రూపంలో రైతులకు నష్టం కలుగుతుండగా, ఆ మేరకు మిల్లర్లు లాభపడుతున్నారు. ఉదాహరణకు రైతు నుంచి 100 బస్తాల ధాన్యాన్ని మిల్లర్ నేరుగా తీసుకెళ్లి.. ఒక శాతం ఎక్కువ తేమ ఉన్నట్టు చూపిస్తే, ఆ ధాన్యం ఆరిన తరువాత సుమారు 50 కేజీల బరువు తగ్గిందనుకుంటే.. దానిని తరుగుగా నమోదు చేస్తారు. నిజానికి 17 శాతం తేమ శాతం ఉంటే ధాన్యం తరుగు ఉండదు. అంటే ఒక శాతం తేమ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తే మిల్లర్‌కు 50 కేజీల ధాన్యం (అంచనా మాత్రమే) మిగులుతుంది. ఒక శాతం తేమ ఎక్కువ ఉన్నందుకు రైతు క్వింటాల్‌కు రూ.30 నష్టపోతాడు. మరోవైపు రైతుల నుంచి నేరుగా తాము ధాన్యం కొనుగోలు చేసి బస్తాకు రూ.60 చొప్పున ఎక్కువ ధర చెల్లిస్తున్నట్టు మిల్లర్లు చెబుతున్నప్పటికీ.. తేమ శాతం 17కంటే ఎక్కువ ఉన్నట్టు చూపించి ధరలో కోత వేస్తున్నారు. మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లలకు తరలించినందుకు తమకు రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉందంటూ.. మొత్తం సొమ్మును మిల్లర్లే కాజేస్తున్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలకు నేరుగా ధాన్యం తరలించిన రైతులకు రవాణా చార్జీలు అందటం లేదు. ఆ మొత్తాన్ని కూడా మిల్లర్ల ఖాతాలోనే అధికారులు జమ చేస్తున్నారు. జిల్లాలో సార్వా సీజన్లో సుమారు 5.94 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించగా, సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 161 ఐకేపీ కేంద్రాలు, 96 వ్యవసాయ సహకార పరపతి సంఘాల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సుమారు 75వేల మంది రైతుల నుంచి సహకార సంఘాలు సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు, ఐకేపీ కేంద్రాలు సుమారు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. తేమ పేరుతో రూ.30 వేలు నష్టపోయా నాకు 8 ఎకరాల సొంత భూమి ఉంది. వరి సాగు చేయగా ఎకరాకు 25 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. మొత్తం ధాన్యాన్ని మిల్లుకు తోలాను. తేమ శాతం ఎక్కువగా ఉందని బస్తాకు కేవలం రూ.950 మాత్రమే చెల్లించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చేతికి అందకపోవడం వల్ల దాదాపు రూ.30 వేలు నష్టపోయాను. కాగిత దాననాగేశ్వరరావు, రైతు, రాయకుదురు