వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా శక్తిమంతమైన నాయకుడని ప్రముఖ పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ప్రసంశలు కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘మోదీ.. భారత్‌ను చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన మూడోసారి కూడా ప్రధాని అవుతారు. ప్రధాని మోదీ భారత్‌కే కాకుండా ప్రపంచానికి కూడా మంచి చేస్తున్నారు. అందుకే మోదీ వంటి నాయకుడు పాకిస్తాన్‌కు కావాలి. పాక్‌తో మోదీ వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా.
ప్రశాంతంగా ఉండే పాకిస్తాన్ భారత్‌కు కూడా మంచిదే. ఎక్కడ చూసిన మోదీ మళ్లీ ప్రధాని అవుతారని వినిపిస్తోంది. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మోదీ ప్రజాదరణ చాలా అద్భుతం. భవిష్యత్తులో భారత్ ప్రజాస్వామ్యం నుంచి చాలా నేర్చుకుంటారు.
పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక.. పీఓకేలో విద్యుత్ చార్జీల పెరగుదల కారణంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను పాక్ వెతకటం లేదు. ఎగుమతులను పెంచటం. ఉగ్రవాదాన్ని నియంత్రణ చేయటం. శాంతి భద్రతలను మెరుగుపరటంలో చొరవ చూపటం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి సరైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నా’అని సాజిద్ తరార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment