Sajid
-
సాజిద్ మాయాజాలం
రావల్పిండి: ఇంగ్లండ్ బ్యాటర్ల బలహీనతపై పాకిస్తాన్ దెబ్బ కొట్టింది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను రూపొందించి మూడో టెస్టులో శుభారంభం చేసింది. గురువారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 68.2 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్లు సాజిద్ అలీ, నోమన్ అలీ తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. రావల్పిండిలోనూ ఈ ఇద్దరు మరోసారి ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెట్టారు. ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ 128 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మరో వికెట్ లెగ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్‌కు లభించింది. ఒకదశలో ఇంగ్లండ్ జట్టు 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జేమీ స్మిత్ (119 బంతుల్లో 89; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగ చకచకా పరుగులు చేశాడు.గుస్ అట్కిన్సన్ (39; 5 ఫోర్లు)తో కలిసి జేమీ స్మిత్ ఏడో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. ఓపెనర్లు బెన్ డకెట్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్రాలీ (29; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 56 పరుగులు జత చేశారు. క్రాలీని నోమన్ అలీ అవుట్ చేశాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అబ్దుల్లా షఫీఖ్ (14; 1 ఫోర్), సయీమ్ అయూబ్ (19; 1 ఫోర్), కమ్రాన్ గులామ్ (3) అవుటయ్యారు. షాన్ మసూద్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
‘మోదీ పాక్‌తో వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా’
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా శక్తిమంతమైన నాయకుడని ప్రముఖ పాక్ అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ప్రసంశలు కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ.. భారత్‌ను చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన మూడోసారి కూడా ప్రధాని అవుతారు. ప్రధాని మోదీ భారత్‌కే కాకుండా ప్రపంచానికి కూడా మంచి చేస్తున్నారు. అందుకే మోదీ వంటి నాయకుడు పాకిస్తాన్‌కు కావాలి. పాక్‌తో మోదీ వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా.ప్రశాంతంగా ఉండే పాకిస్తాన్ భారత్‌కు కూడా మంచిదే. ఎక్కడ చూసిన మోదీ మళ్లీ ప్రధాని అవుతారని వినిపిస్తోంది. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మోదీ ప్రజాదరణ చాలా అద్భుతం. భవిష్యత్తులో భారత్ ప్రజాస్వామ్యం నుంచి చాలా నేర్చుకుంటారు.పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక.. పీఓకేలో విద్యుత్ చార్జీల పెరగుదల కారణంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను పాక్ వెతకటం లేదు. ఎగుమతులను పెంచటం. ఉగ్రవాదాన్ని నియంత్రణ చేయటం. శాంతి భద్రతలను మెరుగుపరటంలో చొరవ చూపటం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి సరైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నా’అని సాజిద్ తరార్ తెలిపారు. -
ఫలక్‌నూమాలో చిన్నారి అదృశ్యం
ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారీ పాప తప్పిపోయిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.....కర్నాటక బీదర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సాజిద్ ఈ నెల 18వ తేదీనా ఫలక్‌నుమాలోని జహనుమా ల్యాన్సర్ ప్రాంతానికి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రంజాన్ మాసం సందర్భంగా వచ్చాడు. కాగా ఈ నెల 20వ తేదీనా ఉదయం 8 గంటలకు తన చిన్న కుమార్తె నజ్మా(2) బంధువుల చిన్నారులతో కలిసి తిను బండారాల కోసం స్థానికంగా కిరాణ దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మేరకు సాజిద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ చిన్నారీ ఆచూకీ తెలిసిన వారు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616512 నంబర్లో గాని సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోరుతున్నారు. -
కట్నం తీసుకురాలేదనే అక్కసుతో..
హైదరాబాద్: కట్నం కోసం కట్టుకున్న భార్యపైనే యాసిడ్ పోశాడో భర్త. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. రెండేళ్ల క్రితం సాజిద్ అనే వ్యక్తికి ఉజ్మతో వివాహమైంది. అయితే పెళ్లయినప్పటి నుంచే సాజిద్ కట్నం డిమాండ్ చేయటం మొదలుపెట్టాడు. కట్నం ఇవ్వకుంటే పుట్టింటికి వెళ్లిపోవాలని భార్యను తరచూ బెదిరించాడు. దీంతో దిక్కుతోచని ఉజ్మ కన్నవారింటికి వచ్చేసింది. అయితే భార్య కట్నంతో తిరిగి రాలేదనే కోపంతో సాజిద్ తన సోదరులతో కలిసి నిద్రిస్తున్న ఉజ్మపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఉజ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యాసిడ్ దాడితో 30 నుంచి 50 శాతం వరకు శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషయంగా వైద్యులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడ్డ సాజిద్ పరారీ అయ్యాడు. ఉజ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సాజిద్ సోదరులు మజిద్, రిజ్వాన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సాజిద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది
* కేక్ కట్ చేయాలని పిలిచి.. భవనంపై నుంచి తోసేసిన ప్రియుడు హైదరాబాద్: ప్రేమోన్మాదుల దాడికి యువతులు బలవుతూనే ఉన్నారు. తనను ప్రేమించడం లేదని సోమవారం ఓ ఉన్మాది రవళిని కత్తితో దాడి చే సిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమె పుట్టినరోజు నాడే హతమార్చేందుకు కుట్ర చేశాడు. కేక్ కట్ చేయాలంటూ భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా తోసేశాడు. అదృష్టవశాత్తు సిమెంట్ రేకులపై పడడంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకలగూడ చింతబావికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గడ్డం శ్రీశైలం పెద్దకుమార్తె రూప (21). పదవ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. జీడిమెట్ల గాజులరామారానికి చెందిన మహ్మద్ సాజిద్ (24)తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. సాజిద్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం వచ్చి... మంగళవారం రూప పుట్టిన రోజు కావడంతో అదేరోజు ఆమెను హతమార్చేందుకు సాజిద్ పథకం సిద్ధం చేసుకున్నాడు. అందులో భాగంగా సాయంత్రం రూప ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలని ఆమెను అపార్ట్మెంట్(మూడంతస్తుల భవనం)పైకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తనను నిర్లక్ష్యం చేస్తున్నావని ఆగ్రహించిన సాజిద్.. రూప ను బలవంతంగా అక్కడి నుంచి నెట్టివేశాడు. రేకుల షెడ్‌పై పడడంతో రూప తల, మెడకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, సాజిద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రస్తుతం రూపకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న తనను నిర్లక్ష్యం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉండడం భరించలేకే రూపను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు సాజిద్ పోలీసులకు తెలిపాడు. కాగా, సోమవారం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బీటెక్ విద్యార్థిని రవళి కూడా సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. -
స్కూల్ కు వెళ్లలేదని కొడుకుని చంపిన తండ్రి!
స్కూల్ కు వెళ్లడం లేదని ఆగ్రహించిన తండ్రి తన పదేళ్ల కుమారుడిని చంపేసిన సంఘటన థానేలో సంచలనం రేపింది. థానే జిల్లాలోని అంబర్ నాథ్ పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా స్కూల్ కు ఎందుకు వెళ్లడం లేదని, ఎందుకు చదవడం లేదని పదేళ్ల సాజిద్ ను తండ్రి అజిత్ మజిద్ ఖాన్ ప్రశ్నించినట్టు సమాచారం. అయితే కుమారుడు నుంచి ఎంతకు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన మజిద్ ఖాన్ కర్రతో సాజిద్ తలపై పలుమార్లు కొట్టినట్టు పోలీసులు తెలిపారు. తలకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత పరిస్థితి విషమించడంతో థానే సివిల్ ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా తుది శ్వాస విడిచారని శివాజీ నగర్ ఇన్స్ పెక్టర్ డీఎస్ గెవాడే తెలిపారు. నిందితుడు మజిద్ ఖాన్ ఐదుగురు భార్యలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడు సాజిద్ తల్లి ఐదేళ్ల క్రితమే భర్తకు దూరంగా ఉంటున్నట్టు స్థానికులు వెల్లడించారు. కాని సాజిద్ తన తండ్రితోనే ఉంటున్నట్టు తెలిసింది. సాజిద్ మృతికి కారణమైన మజిద్ ఖాన్ పై సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు.