పనితీరు.. పారదర్శకత
ఇదే భారత్ అభివృద్ధి మంత్రం
రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ సమ్మిట్‌లో మోదీ వ్యాఖ్యలు
జైపూర్: సంస్కరణలు, పనితీరు, పారదర్శ కతలను పాటిస్తూ భారత్ సాధించిన అభివృద్ధి ఇప్పుడు ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం జైపూర్‌లోని ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో మొదలైన ‘రైజింగ్ రాజస్తాన్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రధాని ప్రసంగించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు, నిపుణుడు భారత్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు.
గత పదేళ్లలో భారత్ పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. సంక్షోభాల సమయంలోనూ నిరాటంకంగా ఉత్పత్తిని కొనసాగించే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం కోరుకుంటోంది. అలాంటి భారీ ఉత్పత్తి క్షేత్రంగా భారత్ ఎదగాలి. భారత్ వంటి వైవిధ్యభరిత దేశంలో ప్రజా స్వామ్యం పరిఢవిల్లడం కలిసొచ్చే అంశం. ప్రజాస్వామ్యయుతంగా మానవాళి సంక్షేమం కోసం పాటుపడటం భారత విధానం.
ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్నే ఎన్నకుంటున్నారు. ఈ సంస్కృతిని యువశక్తి మరింత ముందుకు తీసుకెళ్తోంది. యువభా రతంగా మనం ఇంకా చాన్నాళ్లు మనం కొనసా గబోతున్నాం. భారత్‌లో అత్యంత ఎక్కువ మంది యువత, అందులోనూ నైపుణ్యవంతులైన యువత అందుబాటులో ఉన్నారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాస్వామీకరణ చేయడం ద్వారా ప్రయోజనాలు ప్రజలందరికీ దక్కుతాయని భారత్ నిరూపించింది. ఈ శతాబ్దిని టెక్నాలజీ, డేటాలే ముందుకు నడిపిస్తాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment