country development
-
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
బయోఎకానమీ విలువ జూమ్
దేశీయంగా బయోఎకానమీ గతకొన్నేళ్లలో భారీగా పురోగమించినట్లు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్(బైరాక్) తాజా నివేదిక పేర్కొంది. దీంతో 2023 చివరికల్లా దేశీ బయోఎకానమీ విలువ 151 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 12,66,900 కోట్లు)కు చేరుకున్నట్లు తెలియజేసింది. జాతీయ పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషించినట్లు ప్రస్తావిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ)లో4.25 శాతం వాటా సమకూర్చుతున్నట్లు వివరించింది. దీంతో ప్రపంచంలోని టాప్–5 బయోఎకానమీలలో భారత్ ఒకటిగా అవతరించినట్లు నివేదిక పేర్కొంది. బయోటెక్నాలజీ ఆధారిత ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(ఏబీఎల్‌ఈ) సహకారంతో బైరాక్(బీఐఆర్ఏసీ) రూపొందించిన నివేదికను గ్లోబల్ బయోఇండియా 2024 సదస్సు( 4వ ఎడిషన్)లో విడుదల చేసింది. నివేదిక వివరాలు చూద్దాం..వృద్ధికి దన్నుఇలా బయోఎకానమీ వృద్ధికి బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇన్నొవేషన్, హెల్త్‌కేర్, బయోమ్యాన్యుఫాక్చరింగ్ తదితరాలలో ఆధునిక పరివర్తన వంటి అంశాలు తోడ్పాటునిచ్చాయి. ఈ నేపథ్యంలో 2014కల్లా 10 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేసిన దేశీ బయోఎకానమీ 2023 చివరికల్లా 151 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఈ పురోగతి జాతీయాభివృద్ధిలో కీలకపాత్రను పోషించింది. దేశ జీడీపీలో 4.25 శాతం వాటాను సమకూరుస్తోంది. గ్లోబల్ బయోఎకానమీల టాప్–5 జాబితాలో భారత్‌కు చోటు కల్పించింది. బయోఈ3(ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉద్యోగితలకు బయోటెక్నాలజీ) పాలసీ ప్రధానంగా ఇందుకు తోడ్పాటునిచి్చంది. బయో ఆధారిత రసాయనాలు, ప్రెసిషన్ బయోథెరప్యూటిక్స్, వాతావరణానుకూల వ్యవసాయం, సముద్రం, అంతరిక్ష సాంకేతికతలలో ఆధునిక పరిశోధనలపై ప్రధానంగా పాలసీ దృష్టిపెట్టింది. వ్యాక్సిన్లు, బయోఫార్మాస్యూటికల్స్కు పెరుగుతున్న డిమాండ్ దేశీ బయోఎకానమీ వృద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు డీబీటీ సెక్రటరీ, బైరాక్ చైర్మన్, డీజీ–బ్రిక్ రాజేష్ ఎస్.గోఖలే పేర్కొన్నారు. కొత్త బయోఈ3 పాలసీ ద్వారా ఈ పరిస్థితులకు మరింత ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. వెరసి 2030కల్లా దేశీ బయోఎకానమీ విలువ 300 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. బయోమ్యాన్యుఫాక్చరింగ్లో ఏఐ వినియోగాన్ని బలపరచడంతోపాటు.. బయో ఏఐ కేంద్రాల ఏర్పాటుకు తెరతీయవలసి ఉన్నట్లు తాజా నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం..ఉపాధి అవకాశాలు ఏఐ వినియోగం, ఆధునిక తయారీ తదితరాల ద్వారా బయోఎకానమీని మరింత పరుగు పెట్టించడంతో ఉద్యోగ అవకాశాలు ఊపందుకుంటాయి. వివిధ పరిశ్రమలలలో బయోటెక్నాలజీని మిళితం చేయడం ద్వారా ప్రధానంగా టైర్–2, టైర్–3 నగరాలలో ఉపాధికి ఊతం లభిస్తుంది. బయోఇండ్రస్టియల్ రంగం దేశీ బయోఎకానమీలో అతిపెద్ద పాత్ర పోషిస్తోంది. మొత్తం మార్కెట్ విలువలో 48 శాతం అంటే దాదాపు 73 బిలియన్ డాలర్ల విలువను ఆక్రమిస్తోంది. బయోఇంధనాలు, బయోప్లాస్టిక్స్సహా.. టెక్స్టైల్స్, డిటర్జెంట్స్ పరిశ్రమలలో వినియోగించే ఎంజైమాటిక్ అప్లికేషన్లు ఈ విభాగంలోకి చేరతాయి. వీటిలో బయోఇంధనాలు భారీ వృద్ధిని సాధిస్తున్నాయి. 2023కల్లా ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 13.8 బిలియన్ లీటర్లకు చేరింది. దీంతో భారత్ ప్రపంచంలోనే ఇథనాల్ తయారీకి మూడో పెద్ద దేశంగా ఆవిర్భవించింది. ఇక బయోఫార్మా రంగం సైతం బయోఎకానమీలో 36 శాతం వాటాను ఆక్రమిస్తోంది. విలువ దాదాపు 54 బిలియన్ డాలర్లుకాగా.. దేశీయంగా వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యం ప్రపంచంలోనే నాయకత్వస్థాయిలో కొనసాగుతోంది. -
దేశ పునర్నిర్మాణానికి ఊపిరి
అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక విప్లవ సిద్ధాంతం భారతీయ సామాజిక పునర్నిర్మాణానికీ, దళితజాతుల విముక్తి పోరాటానికీ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. తరతరాలుగా భారతీయ సంస్కృతి కోల్పోయిన మానవతను, సమతను ఆయన విముక్తి పోరాటం పునరుజ్జీవింప జేసింది. నేడు భారత దేశంలో సమసమాజ నిర్మాణానికి ఉద్యుక్తులవుతున్న వారందరూ అంబేడ్కర్‌ను అధ్యయనం చేయకుండా, సమన్వయ పర్చుకోకుండా వారి పోరాటాల్లో విజయం సాధించటం అసాధ్యం. అంబేడ్కర్‌ను విస్మరించినవారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో వైఫల్యం చెందుతూ ఆ వైఫల్యానికి కారణాలు గుర్తెరగలేక తిరోగమిస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా పునాదులతో సహా మార్పు తేవాలన్నప్పుడు, ఆ సామాజిక వ్యవస్థను శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలి.వికసిత భారత నిర్మాణం ద్వారా మన ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం కావా లని ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన తన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉద్ఘాటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒక ప్రధాని చేసిన సుదీర్ఘ ప్రసంగం ఇది. మోదీ ఇప్పటికి ఎర్రకోట మీద 11 సార్లు జెండా ఎగురవేసి, ఎక్కువసార్లు ఎగురవేసిన మూడో ప్రధానిగా నిలిచారు.భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీద 17 సార్లు జెండా ఎగురవేశారు. ఆయన ప్రసంగాలు ప్రపంచ దేశా లను ఆకట్టుకున్నాయి. నెహ్రూ తన ప్రసంగాలలో భారత భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలతో పాటు ఆర్థిక అంశా లను, అంతర్జాతీయ అంశాలను ఉటంకించేవారు. నెహ్రూ గొప్ప చదువరి. స్వతహాగా పండితుడు. ప్రపంచ దేశాల ప్రధాన మంత్రులతో విస్తృతమైన స్నేహం ఉన్నవారు. ఆ తరువాత ఇందిరా గాంధీ 16 సార్లు ఎర్రకోట మీద పతాకను ఎగురవేశారు. ఇందిర ప్రసంగాలలో కూడా విస్తృతమైన అంశాలు చర్చలకు వచ్చేవి. పేదరిక నిర్మూలన, బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణల వంటి అనేక అంశాల్ని ఆమె పేర్కొన్నారు. భారత దేశ మౌలిక స్వభావాన్ని మార్చే భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ పెద్ద చర్చనీయాంశాలుగా మారాయి. స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశ జనాభా 40 కోట్ల లోపే. ఇందిరాగాంధీ పాలన వరకు అది సుమారు 80 కోట్లు. ఇప్పుడు 140 కోట్లకు పెరిగింది. జనాభా ఇంతగా పెరిగిన ఈ సందర్భంలో ప్రజలందరూ ప్రధాని ఉపన్యాసంలో వచ్చే ముఖ్యమైన అంశాల కోసం ఎదురు చూడటం సహజం. ఇప్పటి జనాభాలో ప్రధానమైన శక్తిగా యువత 40 కోట్ల మందిగా ఉన్నారు. దగ్గర దగ్గర 67 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. భారత సమాజంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు. 20 కోట్ల మంది కోటీశ్వరులు ఉంటే, పేదలు 70 కోట్ల మంది ఉన్నారు. సమాజం ఇంకా సామాజిక అసమానతలతోనూ, స్త్రీల అణచివేతల తోనూ, నిరుద్యోగ భారతంగానూ ఉన్న సందర్భమిది. అందుకే ప్రధాని ప్రసంగంలోని నిర్మాణాత్మకమైన అంశాల కోసం ప్రజలు ఎదురుచూశారు. ప్రధాని యువతకు నూత్న ఉపాధి అంశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. దేశాభివృద్ధికి మరిన్ని నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామన్నారు. దేశాన్ని గ్లోబల్ మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడానికి ఇది సువర్ణావకాశం అని కూడా అన్నారు. ఇవన్నీ దేశ ప్రజలను ఉత్తేజితం చేసే మాటలే అయినప్పటికీ రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం కనుమరు గైనట్టేనని అనిపించింది. నిజానికి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న రైల్వేలు, టెలిఫోన్లు, విద్యుత్, ఇంధన, అనేక భారీ పరిశ్రమలు కార్పొరేట్ చేతుల్లోకి వెళుతున్న సందర్భమిది. భారత రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తేనే భారత ఆర్థిక సంపద ఇతర దేశాల ఆర్థిక సంపదకు దీటుగా పెరుగుతుందని చెప్పారు.ఇకపోతే మోదీ గ్లోబల్ కంపెనీలను భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలనీ, వాటిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభు త్వాలు తమలో తాము పోటీ పడాలనీ సూచించారు. నిజానికి మోదీ లక్ష్యం చేసిన 2047వ సంవత్సరానికి భారత జనాభా 170 కోట్లను దాటవచ్చును. ఇప్పటికే 70 కోట్ల మంది ప్రజలకు ఇళ్ళ స్థలాలు లేవు. 170 కోట్లకు జనాభా పెరిగినప్పుడు, విదేశీ కంపెనీలకు స్థలాలు యిచ్చుకుంటూపోతే 2047 కంతా భారతదేశ ప్రజలకు ఇళ్ళ స్థలం దొరక్కపోగా, కొన్ని దేశాలవలే మనమూ సముద్రాల పైన ఇళ్ళు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని భౌగోళిక శాస్త్రవేత్తలు అంటున్నారు. నరేంద్ర మోదీ ప్రసంగంలో దేశంలో సాంకేతిక రంగంలో ప్రధాన భూమికను వహిస్తున్న మైనారిటీలకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల విషయంలో మార్పులు తేవాలనే భావన కనిపిస్తుంది. ఈ విషయా లను హ్యూమన్ రైట్స్ వాచ్ ఖండించింది. ప్రధాని సహజంగా మతా తీత భావనలో ప్రసంగిస్తేనే దేశంలో సామరస్యత, శాంతి, క్రాంతి కలుగుతాయని లౌకికవాదుల భావన. నిజానికి సాంస్కృతిక లౌకిక వాదం అంటే చర్చనీయాంశం అవుతుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, వి.పి. సింగ్... వీరంతా భారతదేశం లౌకిక ప్రజాస్వామ్యదేశం అని చెప్పారు. ఇకపోతే రాజ్యాంగ సభ సమయంలో అంబేడ్కర్ మతాతీత లౌకిక భావనతో పాలకవర్గం ఉన్నప్పుడు దేశంలో సామరస్యం నెల కొంటుందనీ, ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు, జైనులుగా చెప్పబడు తున్న ప్రజలంతా భారతీయులేననీ నొక్కి వక్కాణించారు. మైనారిటీలు, దళితుల వెనుకబాటుతనాన్ని గూర్చి, వారి అభ్యున్నతికి పాటు పడాల్సిన అంశాలను గూర్చి అంబేడ్కర్ ఇలా చెప్పారు: సాంఘిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో మనలో మనకు తీవ్రమైన భేదాభిప్రా యాలున్నవని నేనేరుగుదును. అయినప్పటికీ మనమంతా కలిసి వివిధ ధోరణులనన్నింటిని సమన్వయింపజేసికొని ఒక దేశం, ఒకే ప్రజలు అనిపించే జాతీయ భావంతో మెలగ్గలిగే రోజులు రాగలవనే విశ్వసిస్తున్నాను. ఇకపోతే అనుక్షణం మారుతున్న ఆధునాతన యుగంలో విద్యకున్న విలువ మరి దేనికీ లేదు. అందులోనూ సాంఘిక గౌరవాన్ని పెంపొందించుకోవాల్సివున్న నిమ్న జాతుల్లో విద్య చాలా అవసరం.ఇకపోతే అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక విప్లవ సిద్ధాంతం భారతీయ సామాజిక పునర్నిర్మాణానికీ, దళితజాతుల విముక్తి పోరాటానికీ లక్ష్యాన్ని, గమ్యాన్ని నిర్దేశించింది. తరతరాలుగా భారతీయ సంస్కృతి కోల్పోయిన మానవతను, సమతను ఆయన విముక్తి పోరాటం పునరుజ్జీవింప జేసింది. నేడు భారతదేశంలో సమసమాజ నిర్మాణానికి ఉద్యుక్తులవుతున్న వారందరూ అంబేడ్కర్‌ను అధ్యయనం చేయకుండా, సమన్వయ పర్చుకోకుండా వారి పోరాటాల్లో విజయం సాధించటం అసాధ్యం. అంబేడ్కర్‌ను విస్మరించినవారు, అంబేడ్కర్‌ను అధ్యయనం చేయనివారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో నిరంతర వైఫల్యం చెందుతూ ఆ వైఫల్యానికి కారణాలు గుర్తెరగలేక తిరోగమిస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా పునా దులతో సహా మార్పు తేవాలన్నప్పుడు, ఆ సామాజిక వ్యవస్థను మొత్తం శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని విస్మరించిన ఏ వాదమూ సజీవమైనది కాదు. ఈ వాస్తవాన్ని హిందూ కర్మవాదులు, కులవాదులు నిరంతరం విభేది స్తూనే ఉంటారు. అంబేడ్కర్ వారసులుగా వారితో మన యుద్ధం సాగుతూనే ఉంటుంది.ఇకపోతే భారతదేశాన్ని పాలించే పాలకులకు తప్పక కొన్ని అభ్యుదయ భావాలు ఉంటాయి, కాదనలేము, స్త్రీలపై జరిగే అత్యాచారాల విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును అందరూ స్వీకరించాల్సిందే. ప్రతిపక్ష నాయకుణ్ణి మొదటి వరుసలో కూర్చో బెడితే బాగుండేది. ఎందుకంటే నెహ్రూ, వాజ్‌పేయి ఈ సంప్రదా యాన్ని పాటించారు. నిజానికి తన సుదీర్ఘమైన ప్రసంగంలో రాజ్యాంగ కర్తను బహుదా ప్రస్తావించటం ఆయన ధర్మం. అస్పృశ్యతా నివారణ, కులనిర్మూలన, దళితుల రక్షణ, పౌరహక్కుల రక్షణ, విశ్వ విద్యాలయాల్లో శాస్త్రీయభావాల పెంపునకు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తి కలిగి ఉండటం ఒక చారిత్రక అవసరం. ఏమైనా అంతిమంగా అంబేడ్కర్ రాజ్యాంగమే స్వాతంత్య్ర దినోత్సవ ఆశయాలకు దిక్సూచి. అంబేడ్కర్ మార్గమే భారతదేశ అభివృద్ధికి ప్రధాన భూమిక. ఆ మార్గంలో పయనిద్దాం!డా‘‘ కత్తి పద్మారావువ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
విస్మరిస్తే చంపెయ్యాలి: ధన్‌ఖడ్
జైపూర్: దేశం కంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని చంపేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను పరమోన్నతంగా భావించని వారు వెల్లడించే అభిప్రాయం దేశ వ్యతిరేకంగానే ఉంటుందని పేర్కొన్నారు. దేశం ముందుకు సాగాలంటే ఇటువంటి వారిని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అయినా వారు జాతి అభివృద్ధికి హానికరమైన తమ చర్యలను కొనసాగిస్తున్న పక్షంలో చంపేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానన్నారు. విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండటం ప్రజాస్వామ్యమనే పుష్పగుచ్ఛంలో పరిమళాలన్న ఉపరాష్ట్రపతి.. వ్యక్తిగత, రాజకీయ లాభం కంటే జాతి ప్రయోజనాలను మిన్నగా చూసుకునే వారికే ఇది వర్తిస్తుందన్నారు. మన గుర్తింపు భారతీయత, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదన్నారు. ఆదివారం జైపూర్‌లో అవయవదాతలతో ఏర్పాటైన సమావేశంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మాట్లాడారు. -
మూలవాసుల అభివృద్ధా? మూలాల విధ్వంసమా?
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దేశ అభివృద్ధి నమూనా మారడం లేదు. అభివృద్ధి ఫలాలు కొందరి దగ్గరే పోగుబడడం అంతకంతకూ పెరిగిపోతోంది. సాంస్కృతిక హననంతోపాటు మూలవాసుల పేదరికమూ హెచ్చవుతోంది.భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలయెత్తుకొని నిలబడగలిగిన ప్రాకృతిక సంపదను కలిగి ఉంది. దాన్ని పరిరక్షించుకుంటూ, దేశ అభివృద్ధిని నిరంతరం పెంచి పోషించుకునే సూత్రాలు, అధికరణాలు రాజ్యాంగంలో ఎల్లెడలా పరచుకొని ఉన్నాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగం మానవ హక్కుల పరిరక్షణలో బలమైన సూత్రాలను మనకు అందించింది. అధికరణం 46లో ‘బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బలహీన వర్గాలకు చెందిన ప్రజల (ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రజలు) ఆర్థికాభివృద్ధికి, వారిలో విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా వారిని కాపాడాలి. వారికి సామాజికంగా అన్యాయం జరగకుండా చూడాల’ని ఉంది.కానీ, ఇవాళ అర్థికాభివృద్ధి పేరుతో సహజవనరులు, సాంస్కృతిక సంపద హననానికి గురవు తోందనేది వాస్తవం. దక్షిణ భారత దేశం పారిశ్రామికంగా మిగతా ప్రాంతాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ అభివృద్ధి క్రమంలో... వేల ఏళ్ల పాటు తరతరాలు వారసత్వంగా మనకు అందించిన సాంస్కృతిక సంపద ధ్వంసమవుతోంది. దక్షిణ భారతదేశ నవీన రాతియుగ సంస్కృతి మూలాలు అంతరించే పరిస్థితులు వచ్చాయని చరిత్రకారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సమాజ పరిణామక్రమంలో కొంత కాలానికి ప్రభుత్వాలేర్పడ్డాయి. చాలాకాలం వరకు అప్పటి ప్రభుత్వాలు భూమి పైన శిస్తు వసూలుకే పరిమితమయ్యాయి. కాని, భూమిపై హక్కును ఏర్పరచుకొనలేదు. కాలక్రమంలో భారతదేశాన్ని అనేక స్వదేశీ, విదేశీ తెగలు పరిపాలించాయి. మొగలాయీ చక్రవర్తుల కాలంలో భూమిశిస్తు వసూలు బాధ్యత ప్రభుత్వ అధికారుల నుండి ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయింది. వారే జమీందారు లయ్యారు. బ్రిటీష్ వారి పాలనలో జమీందారులకు వారి అజమాయిషీలోని ఎస్టేటు లపై 1793లో లార్డ్ కారన్వాలిస్ ఆస్తి హక్కు నిచ్చారు. భూమి కాస్తా అమ్మకపు సరుకైంది. కరవు కాటకాల సమయాల్లో నిర్బంధపు శిస్తులు కట్టలేక భూమిని అమ్ముకున్న రైతులు భూమిలేని పేదలయ్యారు. హెచ్చుగా భూములను కొన్నవారేమో... వడ్డీ వ్యాపా రులు, భూస్వాములయ్యారు. భూమిని పోగొట్టుకున్న వారిలో చాలామంది కౌలు దారులయ్యారు. క్రమంగా భూస్వాముల నిర్బంధపు కౌలు వసూలును కౌలుదార్లు భరించలేని స్థితికి చేరారు. ఆ క్రమంలో వారు భూమిలేని గ్రామీణ పేదలయ్యారు. తిరిగి భూమిని పేదలకు పంచాలనే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, 1947 తర్వాత స్వతంత్ర భారతంలో ఈ ఉద్యమాలు ఊపందుకున్నాయి.1948లో జమీందారీ వ్యవస్థ రద్దు కాక పూర్వం మామూలు భూస్వాములకు సగటున 100 ఎకరాలుండేది. 1938లో వచ్చిన ప్రకాశం కమిటీ రిపోర్టు ఆధారంగా తయారుచేసిన ‘మద్రాసు ఎస్టేట్ రద్దు – రైత్వారీకి మార్పు బిల్లు’ 1949 ఏప్రిల్ 19న శాసనసభ ఆమోదం పొంది, 1950లో రాష్ట్రపతి ఆమోదముద్ర పడి చట్టమైంది. ఈ చట్టం ప్రకారం పర్మనెంట్ సెటిల్మెంట్ ఎస్టేటు భూములు, అడవులు, గనులు, ఖనిజాలు గల భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయి. జమీందారులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లిస్తూ, వారి సొంత సేద్యానికి సారవంతమైన వేలాది ఎకరాలు వదిలి వేయబడ్డాయి. దీనితో జమీందారులు బడా భూస్వాములయ్యారు.ప్రధానమైన వనరులన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళాక... దేశంలో కరవు, అవిద్య, అనారోగ్యం, దురాక్రమణలతో కూడిన పాలనా విధానాలు పెరుగుతున్నాయి. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే దక్షిణ భారత అస్తిత్వాన్ని గురించీ, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల అస్తిత్వాల గురించి అనేక సూత్రాలు మనకు అందించారు. ముఖ్యంగా దక్షిణ భారత భూభాగంలో... స్థానిక భాషలు,సంస్కృతి, చరిత్ర, పురాతత్వ భావనలను పెంపొందించాలన్నారు. అంతేకాని వాటిని ఇతరులకు తాకట్టు పెట్టే విధానాలను అవలంబించరాదనీ, అందువల్ల భారతదేశం అంతర్గతంగా తాకట్టులోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ చెప్పారు. నిజానికి ప్రస్తుత పాలకవర్గ నిష్క్రియాపర్వాన్ని అలా ఉంచితే... కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ‘ఇండియా’ కూటమి కూడా దేశాన్ని తాకట్టు నుంచి విముక్తి చేసే విధంగా పార్లమెంటులో వాదించలేకపోతోంది. ఆ మాట ఒప్పుకోవాల్సిందే! కొన్ని కార్పొరేట్ శక్తులు వీరి వెనక కూడా ఉండడమే ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇదే సమయంలో రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే విషయంలో పార్లమెంటులోని దళిత బహుజన ఎం.పీలు నోరు మెదపకపోవడం వారి బానిసత్వాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి ఈ దేశం ఇలా కార్పొరేట్ శక్తుల, అగ్రవర్ణ భూస్వామ్య శక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం పూనా ప్యాక్ట్ ద్వారా ఉమ్మడి నియోజక వర్గాల్లో గెలిచిన దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఈ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు దళిత హక్కుల కోసం ఎలుగెత్తి మాట్లాడలేకపోతున్నారు అనేది స్పష్టమైన అంశం. అలాగే వామపక్షాలు కూడా అనేక సందర్భాల్లో దళిత బహుజనుల భూమి హక్కు మీద, కౌలుదార్ల హక్కుల మీద మాట్లాడటం తగ్గించారు.మరోపక్క సెంటు భూమి కూడా లేని వారు భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. బ్యాంకులో అప్పుల్లో ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ప్రజలకు ఉత్పత్తి క్రమాన్ని నేర్పటం లేదు. ప్రజల్లో జీవశక్తినీ, ఆత్మ విశ్వాసాన్నీ, ఆత్మ గౌరవ స్ఫూర్తినీ, స్వీయ జీవన ప్రమాణాన్నీ పెంచినప్పుడే దేశం ఇతర దేశాలకు అప్పులు ఇవ్వగలిగిన స్థాయికి ఎదుగుతుంది. ఈనాడు దేశీయ భావన, జాతీయ భావన, రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో పెంచాల్సిన బాధ్యత లౌకికవాద ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో ఉంది. రాజకీయ పార్టీల కన్నా ... ఎప్పుడూ ప్రజా ఉద్య మాలే దేశాన్ని మేల్కొలుపుతాయి. నిద్రావస్థలో మునిగిన సమాజాన్ని చైతన్యవంతం చేసి, అంబేడ్కర్ మార్గంలో ఈ దేశ సాంస్కృతిక వికాసానికి అందరం పాటుపడుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
దేశాభివృద్ధి కోసమే మూడోసారి
సిమ్లా: బీజేపీని వరుసగా మూడోసారి గెలిపించాలని, దేశ అభివృద్ధి కోసమే తప్ప ఈ గెలుపు తన కోసం, తన కుటుంబం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో దేవాలయాలకు వెళ్లి, దేవుళ్లను ప్రారి్థంచి ఆశీస్సులు పొందాలని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి అధికారం అప్పగిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు బలవంతంగా లాక్కొని ఓటు బ్యాంక్‌కు కట్టబెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం పడుతుందని అన్నారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లోని నాహన్, మండీ, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, జలంధర్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. మందిర నిర్మాణానికి తాము పూనుకుంటే తేదీ చెప్పండి అంటూ ఎగతాళి చేశారని అన్నారు. తేదీ ప్రకటించడమే కాకుండా ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రాణప్రతిష్ట సైతం జరిపించామని గుర్తుచేశారు. ఓటు బ్యాంక్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిందని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో 2.50 లక్షల జనాభా ఉన్న హట్టీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా కలి్పస్తామని హామీ ఇచ్చారు. ఓడిపోయే కాంగ్రెస్‌కు ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. -
Lok sabha elections 2024: పదేళ్ల అభివృద్ధి.. ట్రైలర్ మాత్రమే: మోదీ
త్రిసూర్/తిరువనంతపురం/తిరునల్వేలి: గత దశాబ్దాకాలంగా ఎన్డీఏ పాలనాకాలంలో దేశం చవిచూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాకారంకానుందని ఆయన ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఆ హామీలను పునరుద్ఘాటించారు. కేరళలోని కున్నమ్కులమ్, కట్టకడ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మోదీ ప్రసంగించారు. రాహుల్‌గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కాంగ్రెస్ యువరాజుకు ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా తమ కుటుంబ గౌరవం(అమేథీ ఎంపీ స్థానం)ను కాపాడే సత్తాలేదుగానీ కేరళకు వచ్చి ఓట్లడుగుతారు. కేరళీయుల ఓట్లడిగే ఆయన సీపీఐ(ఎం) ఏలుబడిలో కరువన్నూర్ సహకార బ్యాంక్‌లో వెలుగుచూసిన కుంభకోణంపై నోరు మెదపరెందుకు? నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు కాంగ్రెస్‌కు ఉంది. ఈ రెండింటి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్‌కు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఈ మోసంపై నేనే ఈడీ దర్యాప్తు నకు ఆదేశించా’’ అని అన్నారు. లెఫ్ట్ ఉంటే అంతా లెఫ్ట్ అయినట్లే ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి, అధికార ఎల్డీఎఫ్ కూటములు కేరళలో అభివృద్ధికి ప్రతిబంధకాలుగా తయా రయ్యాయి. త్రిపుర, పశ్చిమబెంగాల్, కేరళ ఈ రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉందీ అంటే అక్కడ అంతా పోయినట్లే(లెఫ్ట్ అయినట్లే). అక్కడ మంచి అనేదే జరగదు. పశ్చిమబెంగాల్, త్రిపురలో ఏం చేశారని, కొత్తగా కేరళకు చేయడానికి?’ అంటూ ధ్వజమెత్తారు. కచ్ఛతీవు ఉదంతాన్ని 4 దశాబ్దాలు దాచారు తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన సభలోనూ మోదీ ప్రసంగించారు. కచ్ఛ తీవు ను శ్రీలంకకు ఇచ్చేసి కాంగ్రెస్, డీఎంకే ఈ ఉదంతాన్ని 40 ఏళ్లు దాచిపెట్టాయని మోదీ ఆరోపించారు. అక్కడ తమిళ మత్స్య కారులు తరచూ అరెస్ట్ అవుతున్నారని, ఈ పాపం ఆ పార్టీలదేనన్నారు. -
PM Narendra Modi: భారీ ప్లాన్ అనగానే భయపడొద్దు
న్యూఢిల్లీ: భారత్ కోసం బృహత్ ప్రణాళికలు ప్రకటించిన ప్రతిసారీ భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన క్షణాన దేశవ్యాప్తంగా జనంలో ఒకింత ఆందోళన, పాత నోట్ల మార్పిడిపై భయాలు నెలకొన్న ఘటనను ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఏఎన్ఐ వార్తాసంస్థతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ పెద్ద ప్రణాళిక ఉంది అన్నంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఎవరినీ ఆందోళనకు గురిచేసేలా నా నిర్ణయాలు ఉండవు. దేశ సమగ్రాభివృద్దే లక్ష్యంగా నా నిర్ణయాలుంటాయి. సాధారణంగా ప్రజా సంక్షేమం కోసం అంతా చేశామని ప్రభుత్వాలు ప్రకటించుకుంటాయి. అంతా నేనే చేశానంటే నమ్మను. సవ్యపథంలో ప్రజాసంక్షేమానికి శాయశక్తులా కృషిచేస్తా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా దేశం సాధించాల్సింది ఇంకా ఉంది. ప్రతి కుటుంబం కలను నెరవేర్చేది ఎలాగ అనేదే నా ఆలోచన. అందుకే గత పదేళ్లలో చేసింది ట్రైలర్ మాత్రమే అంటున్నా’’ అని మోదీ చెప్పారు. 100 రోజుల ప్లాన్ ముందే సిద్ధం ‘‘ నా ధ్యాసంతా 2047 విజన్ మీదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలుగా పనిచేసిన అనభవం ఉంది. ఆ రోజుల్లో ఎన్నికలొచ్చినపుడు ఓ 40 మంది సీనియర్ ఉన్నతాధికారులు ఎన్నికల పర్యవేక్షక విధుల్లోకి వెళ్లిపోయేవారు. అలా దాదాపు 50 రోజులు కీలక అధికారులు లేకుండా రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి అనేదే సమస్యగా ఉండేది. తరచూ ఎన్నికలు జరిగే దేశంలో ఇలాంటి సమస్యలు అనివార్యం. వాళ్లు లేని ఆ 50 రోజులు నాకు విరామం ఇచ్చినట్లు కాదని నిర్ణయించుకున్నా. పూర్తిచేయాల్సిన పనులను ముందే వాళ్లకు పురమాయించేవాడిని. రాబోయే ప్రభుత్వం కోసమే ఈ పనులు చేయండని ఆదేశించేవాడిని. అలా 100 రోజుల ముందస్తు ప్రణాళిక పద్ధతి ఆనాడే అలవాటైంది నాకు. అదే మాదిరి ఇప్పుడూ మూడోసారి ప్రధాని అయితే తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికలను ముందే సిద్ధంచేసి పెట్టుకున్నా. 2047 వికసిత భారత్ కోసం చేయాల్సిన పనులపై గత రెండు సంవత్సరాలుగా కస రత్తు చేస్తున్నాం’’ అని మోదీ వెల్లడించారు. విఫల కాంగ్రెస్‌కు, సఫల కమలానికి పోటీ ‘‘ వైఫల్యాల కాంగ్రెస్ విధానానికి, అభివృద్ధిని సాకారం చేసిన బీజేపీ విధానాలకు మధ్య పోటీ ఈ ఎన్నికలు. కాంగ్రెస్ ఐదారు దశాబ్దాలు పాలించింది. మాకు ఈ పదేళ్లే పనిచేసే అవకాశమొచ్చింది. అందులోనూ కోవిడ్ వల్ల రెండేళ్లకాలాన్ని కోల్పోయాం. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో కనిపిస్తున్న అభివృద్ధిని, నాటి కాంగ్రెస్, నేటి ఎన్డీఏ పాలనతో పోల్చి చూడండి. అభివృద్ది విస్తృతి, వేగాన్ని లెక్కలోకి తీసుకుని ఓటరు ఎటువైపు నిలబడాలో తేల్చుకోవాల్సిన తరుణమిది. వచ్చే ఐదేళ్లకాలంలో అభివృద్ధిని పరుగుపెట్టిస్తాం. దేశాన్ని పాలించే బాధ్యతలు మనకు అప్పగించినప్పుడు ఒక్కటే లక్ష్యం కళ్ల ముందు కదలాడుతుంది. అదే దేశ ప్రజల అభ్యున్నతి’’ అని మోదీ అన్నారు. గాంధీల కుటుంబంపై మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ ఒక్క కుటుంబ ప్రయోజనాలే పరమావధిగా నాడు రాజకీయ సంస్కృతి కొనసాగింది. కుటుంబ పునాదులు కదలకుండా అంతా కాపుగాశారు. దేశ పునాదులను పటిష్టపరిచే సదుద్దేశంతో పనిచేస్తున్నా. నిజాయితీతో మేం చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి’’ అని అన్నారు. తొలి 100 రోజుల్లో చేసినవే అవి.. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే 100 రోజుల ప్లాన్ సిద్దంచేశాం. గెలిచి రాగానే ఒక్క నిమిషం కూడా వృథాచేయకుండా వాటి అమ లుపై దృష్టిపెట్టా. 2019లో గెలిచిన 100 రోజుల్లోపే ఆర్టికల్ 370ని రద్దుచేశా. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దుచే యడంతో ముస్లిం సోదరీమణులకు స్వేచ్ఛ లభించింది. ఇది కూడా తొలి 100 రోజుల్లోనే అమలుచేశా. విశ్వాసమనేది కొండంత బలాన్ని ఇస్తుంది. భారతీయులు నా మీద పెట్టుకున్న నమ్మకం నాపై వాళ్లు ఉంచిన బాధ్యతగా భావిస్తా. భరతమాత ముద్దుబిడ్డగా నేను చేస్తున్న సేవ ఇది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. 20 లక్షల మంది నుంచి సలహాలు ‘వచ్చే పాతికేళ్లలో దేశం ఎలాంటి అభివృద్ధి దిశలో పయనిస్తే బాగుంటుందో చెప్పాలని లక్షలాది మందిని సలహాలు అడిగా. వారి నుంచి సూచనలు స్వీకరించా. విశ్వవిద్యాలయాలు, వేర్వేరు రంగాల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు ఇలా దాదాపు 15–20 లక్షల మంది నుంచి సలహాలు తీసుకున్నా. కృత్రిమ మేథ సాయంతో సలహాలను రంగాలవారీగా విభజించా. ప్రతి మంత్రిత్వశాఖ, డిపార్ట్మెంట్లో అంకితభావంతో పనిచేసే అధికారులకు ఈ పని అప్పగించా. ఈసారి ఐదేళ్ల ఎన్డీఏ హయాంలో చేయగలిగిన అభివృద్ధి ఎంత అని బేరీజువేసుకున్నా. 2047నాటికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. ఇలాంటి మైలురాయిని చేరుకున్నపుడు గ్రామమైనా, దేశమైనా కొత్త సంకల్పంతో ముందడుగు వేయాలి. నా గ్రామనికి నేనే పెద్ద అయినపుడు 2047కల్లా సొంతూరుకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటాను కదా. దేశవ్యాప్తంగా ఇలాంటి స్ఫూర్తి రగలాలి. వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు అనేవి ప్రతి ఒక్కరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయి’’ అని మోదీ అన్నారు. -
North East Sammelan: గ్రోత్ ఇంజిన్ ఈశాన్య రాష్ట్రాలే: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ది చెందకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి ఈశాన్య రాష్ట్రాలే గ్రోత్ ఇంజిన్ అని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషల్ సెంటర్లో నిర్వహించిన ‘నార్త్ ఈస్ట్ సమ్మేళన్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యే దృష్టి సారించారని చెప్పారు. పదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. స్థిరమైన ప్రభుత్వం, నాయకుడి వల్లే నార్త్ ఈస్ట్‌లో శాంతి నెలకొందని, అభివృద్ధి సాధ్యం అవుతోందన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధితో పురోగతి
గాంధీనగర్: మహిళల ఆర్థిక పురోగతితో దేశాభివృద్ధి సాధ్య మని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మహి ళల నేతృత్వంలో అభివృద్ధి కార్య క్రమాలు చేపడితే మహిళా సాధికారత కూడా సాధ్యప డుతుందన్నారు. మహిళలు సంపన్నులైతే ప్రపంచం సుసంపన్నంగా మారుతుందన్నారు. జీ–20 సన్నాహక సదస్సుల్లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మహిళా సాధికారతపై మంత్రుల సదస్సునుద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా రాణించడానికి ప్రభుత్వాలు చేయాల్సినదంతా చేయాలన్నారు. ‘‘మహిళలు వాణిజ్య రంగంలోనూ విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవడమే మనందరి లక్ష్యం కావాలి. మార్కెట్, గ్లోబల్ వాల్యూ చైన్, రుణాలు వంటివి వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకుల్ని అధిగమించాలి. అప్పుడే మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు’’ అని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని మోదీ కొనియాడారు. ఒక ఆదివాసీ మహిళ అయి ఉండి కూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ మహిళగా ఎదిగారని, త్రివిధ బలగాలకు నేతృత్వం వవహిస్తున్నారని చెప్పారు. స్థానిక ప్రభుత్వాల్లో 46% మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. -
యువశక్తే చోదక శక్తి: ప్రధాని నరేంద్ర మోదీ
కొచ్చి: దేశ అభివృద్ధి ప్రయాణానికి యువ శక్తే చోదక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా భారత్ మారడం వెనుక యువత భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. భారత్ ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా యువత కృషి వల్ల సాధ్యమవుతోందని పేర్కొన్నారు. వారిపై తనకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. కేరళలోని కొచ్చిలో సోమవారం ‘యువం–2023’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. 21వ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతటా అందరూ చెబుతున్నారని, యువ శక్తి మన దేశానికి ఒక పెన్నిధి అని వివరించారు. తాము సంస్కరణలు తీసుకొస్తున్నామని, యువత వాటి ఫలితాలను తీసుకొస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అవినీతిగా మారుపేరుగా ఉండేవని, బీజేపీ ప్రభుత్వం యువత కోసం నూతన అవకాశాలను సృష్టిస్తోందని నరేంద్ర మోదీ చెప్పారు. స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. యువత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నామని తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. భారత్ ఎప్పటికీ మారబోదని గతంలో ప్రజలు భావించేవారని, ఇప్పుడు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి భారత్‌కు ఉందని మోదీ వ్యాఖ్యానించారు. నేటి ఆత్మనిర్భర్ భారత్ డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతోందని అన్నారు. మోదీకి ఘన స్వాగతం మోదీకి సోమవారం సాయంత్రం కేరళలోని కొచ్చిలో ఘన స్వాగతం లభించింది. ఐఎన్ఎస్ గరుడ నావల్ ఎయిర్ స్టేషన్ నుంచి యువం సదస్సు వేదిక దాకా రెండు కిలోమీటర్ల మేర రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ దుస్తులను ధరించారు. కాసేపు నడిచి, తర్వాత వాహనం నుంచి అభివాదం చేశారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలపై సవతి తల్లి ప్రేమ రేవా: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పల్లెలపై సవతి తల్లి ప్రేమ చూపాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందని, గ్రామ సీమల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిందని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోమవారం మధ్యప్రదేశ్‌లోని రేవాలో బహిరంగ సభలో ఆయన అన్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిధుల్లో కోత పెట్టి, ఎన్నికలను వాయిదా వేస్తోంది బీజేపీ ప్రభుత్వమేనంటూ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. -
మైనింగ్‌కు ప్రభుత్వ మద్దతు కావాలి
కోల్‌కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్‌పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్‌కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు. కోల్‌కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్‌దేబ్ పేర్కొన్నారు. -
మూసధోరణికి తెర
బెంగళూరు: దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగాలంటే భౌతిక, సామాజికపరమైన మౌలిక సదుపాయాలను రెండింటినీ బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ సాధిస్తున్న అద్భుతాలను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. మేడ్ ఇన్ ఇండియా, 5జీ టెక్నాలజీ 2014కు ముందు ఊహకందని విషయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వాలు పాత ఆలోచనా ధోరణిని పట్టుకొని వేలాడాయని, దేశ ఆకాంక్షల్లో వేగాన్ని విలాసంగా, గొప్ప స్థాయికి చేరుకోవడాన్ని రిస్క్‌గా భావించాయని విమర్శించారు. ఈ అభిప్రాయాన్ని తమ ప్రభుత్వం మార్చేసిందన్నారు. స్టార్టప్‌ల హబ్‌గా భారత్ పెట్టుబడులకు భారత్ ఒక నమ్మకమైన దేశంగా మారిందని మోదీ ఉద్ఘాటించారు. ‘‘కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మూడేళ్లలో కర్ణాటక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఎఫ్‌డీఐ రాబట్టడంలో గతేడాది తొలి స్థానంలో నిలిచింది. ఐటీ, రక్షణ తయారీ, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో దూసుకెళ్తోందని కొనియాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కర్ణాటక బలం అని స్టార్టప్ అంటే కేవలం ఒక కంపెనీ కాదని, కొత్తగా ఆలోచించడానికి, సాధించడానికి భావోద్వేగ అంశమని వివరించారు. విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నగర వ్యవస్థాపకుడు నాదప్రభు కెంపేగౌడ 108 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. విగ్రహం బరువు 218 టన్నులు. ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్వాంజీ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. విమానాశ్రయంలో .5,000 కోట్ల వ్యయంతో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ పర్యావరణ హితంగా నిర్మించిన నూతన టెర్మినల్–2ను మోదీ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరులోని క్రాంతివీరా సంగోలీ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మైసూరు నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి రాకపోకలు సాగిస్తుంది. వందేభారత్ రైలుతో మైసూరు–బెంగళూరు–చెన్నై అనుసంధానం మరింత మెరుగవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని మోదీ చెప్పారు. ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకొనేవారి కోసం ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలును సైతం ప్రధానమంత్రి ప్రారంభించారు. ‘భారత్ గౌరవ్’ పథకంలో భాగంగా రైల్వే శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తాయి. ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలుతో కర్ణాటక, కాశీ సన్నిహితమవుతాయని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నేటి సవాళ్లకు గాంధీజీ బోధనలే సమాధానం: మోదీ దిండిగల్: సంఘర్షణల నుంచి వాతావరణ సంక్షోభాల వరకూ.. నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు జాతిపిత మహాత్మా గాంధీ బోధనలే సమాధానాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాగడానికి మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నామన్నారు. శుక్రవారం తమిళనాడులోని గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్‌లో పట్టభద్రులైన నలుగురు విద్యార్థులకు ప్రధాని బంగారు పతకాలు అందజేశారు. -
India Ideas Summit: వృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయం
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ► కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ► రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ► చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మారుస్తుంది. ► భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ► అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్‌తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ ఏడాదే ‘పైలెట్ బేసిస్’తో ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీల మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి సమయం, వ్యయం రెండూ తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2022–23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయికి సమానమైన డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుందని చెప్పారు. ‘‘జీ–20, అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలతో ఇప్పుడు ఎదుర్కొంటున్న చెల్లింపుల సమస్యను పరిష్కరించడానికి సీబీడీసీ అంతర్జాతీయీకరణ చాలా కీలకమని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఇండియా ఐడియాస్ సమ్మిట్‌లో టీ రబీ శంకర్ అన్నారు. -
అభివృద్ధి పథంలో ఆకాంక్ష జిల్లాలు
న్యూఢిల్లీ: ప్రజల జీవన విధానం మరింత సౌకర్యంగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును నిర్దేశించిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ప్రజలకి నూటికి నూరు శాతం సేవలు అందించడం, సదుపాయాలను కల్పించడమే మన ముందు లక్ష్యమని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ డిజిటల్ సమావేశానికి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. కేంద్ర పథకాల అమలు సరిగా జరగాలంటే జిల్లా స్థాయిలో ప్రజలకి, అధికారులకి మధ్య ప్రత్యక్షంగా భావోద్వేగ బంధం ఏర్పాటు కావాలని ప్రధాని చెప్పారు. ఆశావహ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల సమష్టి కృషితో సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. అభివృద్ధి పథంలో దూసుకువెళుతున్న ఆకాంక్ష జిల్లాలు దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతున్నాయని వెల్లడించారు. ‘‘దేశాభివృద్ధికి గల ఆటంకాలను ఆకాంక్ష జిల్లాలు తొలగిస్తున్నాయి. మీ అందరి కృషితో ఆ జిల్లాలు పురోగతి సాధిస్తున్నాయి’’ అని కలెక్టర్లను ప్రశంసించారు. వనరుల్ని అత్యధికంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న అవరోధాలను అధిగమించడం వల్ల ఈ జిల్లాలు తమని తాము నిరూపించుకునే స్థాయికి ఎదిగాయన్నారు. రెండేళ్లలో మరో 142 జిల్లాల అభివృద్ధి వెనుకబడిన జిల్లాలను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 2018 జనవరిలో ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 112 జిల్లాలను ఎంపిక చేసి అభివృద్ధి బాట పట్టించారు. ఇప్పుడు కొన్ని రంగాల్లో వెనుకబడిన మరో 142 జిల్లాలను ఎంపిక చేశామని, ఆ జిల్లాల్లో కూడా అభివృద్ధికి అందరూ కలసికట్టుగా కృషి చెయ్యాలని ప్రధాని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. జిల్లాల్లో అన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం, అర్హులైన లబ్ధిదారులకి ఆయుష్మాన్ భారత్ కార్డులు, ప్రతీ ఒక్కరికీ బ్యాంకు అకౌంట్, ప్రతీ కుటుంబానికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఇవన్నీ నిర్దేశిత కాలవ్యవధిలోగా పూర్తి చేయాలని చెప్పారు. రెండేళ్లలో ఈ 142 జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశంలో డిజిటల్ విప్లవం చాలా నిశ్శబ్దంగా జరిగిపోతోందని, పల్లె పల్లెలోనూ డిజిటల్ సదుపాయాల కల్పన జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్లని ఆదేశించారు. -
గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
ఉంగుటూరు: గ్రామీణ ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో విద్యార్థులతో ఆయన మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు నిపుణులైన యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు విద్యాసంస్థలు, కార్పొరేట్, వ్యాపారసంస్థలు చొరవ తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు నైపుణ్యాభివృద్ధిని అందించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించాలేగానీ ఉచితాలను అలవాటు చేయడం వలన ప్రయోజనం ఉండదని చెప్పారు. సంతోషమయ జీవనానికి సేవే అత్యుత్తమ సాధనమని, ఆధ్యాత్మికతలోని అంతరార్థం సాటివారికి సేవచేయడమేనని పేర్కొన్నారు. మాతృభాషను, సంస్కృతిని పరిరక్షించుకుని ముందుతరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. తొలుత చేతన ఫౌండషన్, రామినేని ఫౌండేషన్ సంయుక్తంగా మహిళలకు అందజేసిన కుట్టుమిషన్లు, బాలబాలికలకు సైకిళ్లు, చిరు వ్యాపారులకు తోపుడు బళ్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెనిగళ్ల రవి, ఉపాధ్యక్షుడు మోదుకూరి నారాయణరావు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, రామినేని ఫౌండేషన్ నిర్వాహకుడు రామినేని ధర్మప్రచారక్, ట్రస్ట్ ట్రస్టీలు, డైరెక్టర్ పరదేశి, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం
లక్నో: దేశ అభివృద్ధి కోసం కీలక సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గత శతాబ్దంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొన్ని చట్టాలు దేశానికి పెద్ద భారంగా పరిణమించాయని చెప్పారు. అభివృద్ధే ధ్యేయంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నికల ఫలితాల్లోనూ అవి ప్రతిఫలిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని తేల్చిచెప్పారు. ప్రజలకు కొత్త సౌకర్యాలు కల్పించాలంటే సంస్కరణలు తప్పవన్నారు. భారంగా మారిన చట్టాలను వదిలించుకోవాలన్నారు. వారి మద్దతు కొత్త బలాన్ని ఇస్తోంది ఇటీవల తాము తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగిందని మోదీ చెప్పారు. తమ ప్రయత్నాలను జనం ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా పేద, మధ్య తరగతి ప్రజల్లో తమకు ఆదరణ ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. కొత్త ప్రాజెక్టులకు నిధులు గత ప్రభుత్వాల హయాంలో మౌలిక వసతుల రంగంలో ప్రధాన సమస్య ఏమిటంటే.. కొత్త ప్రాజెక్టులను ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప నిధులు సమకూర్చడంపై శ్రద్ధ చూపలేదని ప్రధాని మోదీ ఆక్షేపించారు. తమ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1,000 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైల్ లైన్ల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సైనికుల సంక్షేమానికి చేయూతనివ్వండి మన సైనికుల నిస్వార్థమైన సేవ, సాహసాలు, త్యాగం పట్ల దేశం గర్విస్తోందని ప్రధాని అన్నారు. సైనిక దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సైనికులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలపాల్సిన రోజు ఇది అని చెప్పారు. సైనిక సంక్షేమానికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1949 నుంచి ఏటా డిసెంబర్ 7వ తేదీని ఫ్లాగ్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. టీకా కోసం ఎక్కువ కాలం నిరీక్షించలేం కరోనా వ్యాక్సిన్ రాక కోసం దేశం ఎక్కువ కాలం వేచి చూడలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. తాను కొన్ని వారాలుగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమైన శాస్త్రవేత్తలతో మాట్లాడుతూనే ఉన్నానని గుర్తుచేశారు. -
అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో సంస్కరణలు
మైసూర్: ఈ దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడం, దేశ పురోభివృద్ధే లక్ష్యంగా అన్ని రంగాల్లో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి, మన యువతలో పోటీతత్వాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సోమవారం మైసూర్ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. గత 7 నెలలుగా సంస్కరణల్లో వేగం పెరగడాన్ని మీరు గమనించే ఉంటారని అన్నారు. వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, విమానయానం, కార్మిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలు ఊపందుకున్నాయని, ఈ ప్రయత్నమంతా దేశ ప్రగతి కోసమేనని ఉద్ఘాటించారు. కోట్లాది మంది యువత ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. మన పునాదులను పటిష్టంగా మార్చుకుంటేనే ఈ దశాబ్దం భారతదేశ దశాబ్దంగా మారుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత దశాబ్దం దేశంలోని యువతకు అపారమైన అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లో అమలవుతున్న సంస్కరణలు గతంలో ఎప్పుడూ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏదో ఒక రంగానికే పరిమితం అయ్యేవని, ఇతర రంగాలను పక్కన పెట్టేవారని చెప్పారు. ఇండియాలో గత ఆరేళ్లుగా బహుళ రంగాల్లో బహుళ సంస్కరణలు అమలయ్యాయని వివరించారు. ఆరోగ్య రక్షణలో కేంద్ర స్థానంలో భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దేశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశంలో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. శాస్త్రీయ పరిశోధనా సంస్థలే భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని చెప్పారు. ఆరోగ్య రక్షణ విషయంలో ఇండియా ప్రపంచంలోనే కేంద్ర స్థానంలో నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. వైద్య రంగంలో భారత్ అనుభవం, పరిశోధనల్లో నైపుణ్యాలే ఇందుకు కారణమని వివరించారు. వైద్య రంగంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న మొత్తం టీకాల్లో 60 శాతానికిపైగా టీకాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పరిశోధకులను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కనిపెట్టడమే చాలెంజెస్ లక్ష్యం. -
పన్ను చెల్లింపును బాధ్యతగా భావించండి
న్యూఢిల్లీ: పన్ను వ్యవస్థలో మార్పులు చేసేందుకు గత ప్రభుత్వాలు జంకాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పన్ను వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకువచ్చామని, పన్ను చెల్లింపుదారుడు కేంద్రంగా ఆ వ్యవస్థను మార్చామని వివరించారు. ఆంగ్ల వార్తాచానెల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహించిన ఒక సదస్సులో బుధవారం ప్రధాని ప్రసంగించారు. దేశాభివృద్ధికి పన్ను ఆదాయం అవసరమని, అందువల్ల పన్ను పరిధిలో ఉన్నవారంతా తమ పన్నులను చెల్లించాలని కోరారు. పన్ను చెల్లింపును ఒక బాధ్యతగా, గౌరవంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. పన్ను ఎగ్గొట్టేందుకు కొందరు చేసే ప్రయత్నాల వల్ల నిజాయితీగా పన్ను చెల్లించేవారు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘పన్ను చెల్లింపుదారుల హక్కులను స్పష్టంగా పేర్కొన్న అత్యంత పారదర్శక పన్ను చట్టం అమల్లో ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్‌లో పన్ను చెల్లింపుదారులను వేధింపులకు గురి చేసే కాలం త్వరలోనే అంతరించిపోతుందని మీకు హామీ ఇస్తున్నా’ అన్నారు. పన్నులు చెల్లించకుండా ఉండేందుకు దారులు వెతికే కొందరివల్ల నిజాయితీగా తమ పన్నులను చెల్లిస్తున్నవారిపై అదనపు భారం పడుతోందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కోటి రూపాయల వార్షికాదాయం చూపిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా కేవలం 2200 మాత్రమే అన్నది నమ్మశక్యం కాని నిజం’ అన్నారు. -
రాష్ట్రాలు బలపడితేనే దేశాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమై అభివృద్ధిలో ముందువరుసలో నిలిచినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, కేంద్రం అనుసరిస్తున్న అధికార కేంద్రీకృత విధానాల్లో మార్పురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రాధమ్యాలను నిర్ధారించుకుని అమలు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని ఆయన కోరారు. గతనెల్లో రాష్ట్రంలో పర్యటించిన 15వ ఆర్థిక సంఘానికి ఓ నివేదిక రూపంలో తన అభిప్రాయాలను, జాతీయ ఆలోచనా విధానాన్ని వెల్లడించారు. ఆదివారం కరీంనగర్ వేదికగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. దేశరాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే తమ లక్ష్యం, కసరత్తు ఇప్పటిది కాదని, చాలా కాలంగా జరుగుతోందని చెప్పారు. ‘విశాల జాతీయ ప్రయోజనాలు– నా ఆందోళన’ అనే పేరుతో 15వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్ నివేదిక ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలు.. ‘ఇప్పటివరకు దేశాభివృద్ధి కోసం తీసుకున్న అరకొరచర్యలు సరిపోవని నేను అభిప్రాయపడుతున్నాను. మన వ్యవస్థ కోసం, ఒక రూపావళి తయారుచేసుకోవాలి. దేశంలో 40 కోట్ల వ్యవసాయ యోగ్యభూమి, 70 వేల టీఎంసీల ఉపరితల నీరు అందుబాటులో ఉంది. కేవలం 40వేల టీఎంసీలతోనే దేశంలోని ప్రతి ఎకరానికి నీరందించవచ్చు. డ్రిప్, స్ప్రింక్లర్, పైపుల తో నీటి సౌకర్యం కల్పించడం ద్వారా తక్కువ నీటితో సేద్యం చేయవచ్చు. ఇప్పటివరకు దేశంలో తీసుకున్న అనేక చర్యల ద్వారా 14% అంటే 5.5కోట్ల ఎకరాల భూమికే కాల్వల ద్వారా నీరు అందించగలుగుతున్నాం. అంతరాష్ట్ర సమస్యలు, న్యాయ వివాదాలు, భూసేకరణలో జాప్యం, పునరావస కల్పన, ప్రణాళిక– ఆచరణలోని లోపాలు నీటి ప్రాజెక్టులకు ప్రధాన ఆటంకాలుగా భావిస్తున్నాను. అంతర్ర్రాష్ట్ర నదీజలా ల వివాదాలపై తీర్పులిచ్చేందుకు ట్రిబ్యునళ్లు దశా బ్దాల సమయం తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా ఏం చేయగలదు? అసమర్థులైన వ్యక్తులు, సంస్థలు, విధానాల వల్ల ఏ దేశమైనా తన వనరులను వృధా చేసుకుంటుందా? వ్యక్తులతో కూడిన ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయడం కంటే.. దేశంలో నదీజలాల వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. మరొక ప్రధాన అవరోధం ప్రజాప్రయోజన వాజ్యాల రూపంలో ఎదురవుతోంది. అంతులేని, కళ్లెం వేయలేని, పనికిమాలిన ఈ వాజ్యాలను నిరోధించగలిగే మార్గాన్ని కనుగొనగలిగామా? పేద దేశాలూ పరపతి పెంచుకుంటున్నాయి మనకంటే పేద దేశాలు కూడా ఆర్థిక పరపతి పెంచుకుంటూ అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయి. 1979వ సంవత్సరం నుంచి చైనా దేశం సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. ఆ అభివృద్ధి 1992 తర్వాత మరింత పుంజుకుంది. 1971 కంటే ముందు మన జీడీపీ కంటే చైనా జీడీపీ తక్కువ ఉండేది. ఇప్పుడు మన కన్నా 4 రెట్లు ఎక్కువ జీడీపీని చైనా సాధించింది. మనమెందుకు ఇది సాధించలేము? గత 4 దశాబ్దాలుగా చైనా సాధిస్తున్న అభివృద్ధి అక్కడి ప్రభుత్వ విజన్‌కు అద్దం పడుతోంది. ఇక దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్లతో పాటు మలేసియా, ఇండోనే షియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైౖన్స్ లాంటి దేశాలు మానవాతీతమైన అభివృద్ధిని సాధిస్తున్నా యి. హిరోషిమా దాడుల తర్వాత బూడిద స్థాయి నుంచి జపాన్ దేశం ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశంగా ఎదిగింది. మన దేశ అంతర్గత శక్తి, ఆర్థిక వ్యవస్థల పరపతిని మనం పెంచుకోలేమా? ఈ విషయంలో మనల్ని అడ్డుకుంటున్నదేంటి? ఇది అధిగ మించలేని సమస్య కూడా కాదు. సమస్యల్లా మన ఆలోచనా విధానమే. 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కనీస అవసరాల కోసం పోరాడాల్సిన పరిస్థితి నుంచి మనం బయటపడడానికి ఓ దిశ కావాలి. దేశంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగం, పేదరికం ఉంది. మంచి విధానాల గురించి ఆలోచించడం కన్నా తదుపరి విధానమేంటనే దానిపై దృష్టి పెట్టాలి. మూస పద్ధతులు మాని భారీ ప్రణాళికలు రూపొందించాలి. రాష్ట్రాలకు సాధికారత అవసరం జాతీయ ఎజెండా మారాలి. ఏటా బడ్జెట్లు పెట్టడం, సాధారణ పద్ధతుల్లో ముందుకెళ్లడం, సంప్రదాయ విధానాలను అనుసరించడంలో మార్పు రావాలి. పేదరికం అనే ఆలోచన నుంచి విముక్తి పొందడానికి భారీ ప్రణాళికలు అవసరం. మూస ఆలోచనా విధా నం నుండి బయటపడటం తక్షణావసరం. దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు సాధికారత పొందాలి. అభివృద్ధి కేంద్రీకృత జాతీయ ఎజెండా ద్వారా కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోవాలి. అధికార కేంద్రీకరణ నుంచి బయటపడాలి. రాష్ట్రాలు ముందుండే కొత్త ఆర్థిక మోడల్ ఈ దేశానికి అవసరం. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి. దేశంలో గరిష్టంగా 8–10 రాష్ట్రా లు మాత్రమే అభివృద్ధి దిశలో ఉన్నాయి. మిగిలిన దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఏమీ లేదు. ఇతర రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు వాటి వనరులు, సామర్థ్య పరపతిని పెంచుకోగలగాలి. రాష్ట్రాలు వాటి స్థాయిలోనే ప్రాధామ్యాలను నిర్ధారించుకునే అవకాశం పెరగాలి. రాష్ట్రాల జాబి తాలో ఉన్న అంశాల్లో కూడా చాలా కేంద్ర ప్రాయో జిత పథకాలు అమలవుతున్నాయి. సర్కారియా కమిషన్ చర్చల్లో కూడా ఉమ్మడి జాబితా అంశాలను రద్దు చేయాలని రాష్ట్రాలు ప్రతిపాదించాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలు గుత్తాధిపత్య ధోరణితో కేం ద్రం ఏకపక్షంగా అమలు చేస్తోందని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. క్రిమినల్ లా, అడవులు, దివాళా సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంక్షేమం, న్యాయ, ౖవైద్య, ఇతర వృత్తులు తదితర ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు చేసింది. గతంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య, అడవులు, తూనికలు, కొలతలు, వన్యప్రాణులు, పక్షుల సంరక్షణ, న్యాయపాలన లాంటి అంశాలను కూడా ఉమ్మ డి జాబితాలో చేర్చారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో ముందస్తు సంప్రదింపులు జరపాలని, ఆ తర్వాత సంయుక్తంగా అంతర్రాష్ట్ర కౌన్సిల్లో చర్చిం చాలని సిఫారసు చేసింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మా ణం, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా, శిశు సంక్షే మం లాంటి ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అంశాలను రాష్ట్రాలకు వదిలేయడమే మంచిది. ఈ విషయంలో కేంద్రం పునఃపరిశీలన చేయాలి. ఆయా రంగాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, ప్రాధాన్యాలను నిర్ణయించే అధికారాలను స్థానిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలకు ఇచ్చేయాలి. కేంద్రానికి లభించే పన్ను ఆదాయంలో 42% రాష్ట్రాలకు సంక్రమింపజేయడం ఇప్పటివరకు జరగలేదు. సెస్సుల రూపంలో మళ్లీ తీసుకుంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విదేశీ పెట్టుబడుల ఆకర్షణతో పాటు అభివృద్ధిని వెనక్కునెట్టే సమస్యలను పరిష్కరించుకునే దిశలో ఆర్థిక సంస్కరణలు భారతదేశానికి అవసరం. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అపార అభివృద్ధి సాధించడం వల్ల మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావితమైన దేశంగా తయారుచేయవచ్చని నేను నమ్ముతున్నాను’అని 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో కేసీఆర్ తన జాతీయ ఆలోచనా విధానాన్ని, గుణాత్మక మార్పు నకు అవసరమైన పరిస్థితిని వివరించారు. చేసి చూపించాం రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయొ చ్చని మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా మేము చేసి చూపించాం. రాబోయే ఐదారేళ్లలో దేశంలోని ప్రతీ గ్రామానికి నీటిసరఫరా చేసే లక్ష్యంతో ముందుకు సాగాలి. దీనికి 8–10 లక్షల కోట్లు ఖర్చు కావొచ్చు. కనీస మద్దతు ధరను రూ.500 లేదా ప్రస్తుతమున్న ఎమ్మెస్పీకి మూడోవంతు పెంచడమో చేయాలి. ఉద్యోగుల డీఏలో మాదిరిగా ధరల సూచీకి అనుగు ణంగా ఈ ఎమ్మెస్పీని ఏటా పెంచాలి. వ్యవసాయరంగంలో లాభాలు, ఉత్పాదకత తక్కువగా ఉన్నందున రైతులు–వినియోగదారుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు రైతులకు అందిస్తున్నాం. సాగునీటి రంగంలో మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉన్న పలు విభేదాలను సంప్రదింపులతో అధిగమిం చగలిగాం. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టే ఓ సజీవ సాక్ష్యం’ అని ఆ నివేదికలో కేసీఆర్ పేర్కొన్నారు. -
అక్షర చైతన్యంతోనే అభివృద్ధి
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్: దేశం అభివృద్ధి చెందాలంటే అక్షర చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శి, స్వేరోస్ ఫౌండర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన స్వేరోస్ 4వ జాతీయ సదస్సుకు తెలంగాణ తోపాటు, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి గురుకులాల పూర్వ విద్యార్థులు (స్వేరోలు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు మాత్రమే సరిపోవని, ప్రతి ఇల్లు ఒక పాఠశాల కావాలని, అప్పుడే విద్యావ్యాప్తి జరుగుతుందన్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే.. దేశంలో పేదరిక నిర్మూలన కోసం విద్య ఎంతో అవసరమని, ఇందులో భాగంగానే అమెరికా విద్యా విధానాన్ని అమలు చేయాలని పురావస్తు శాఖ డైరెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రంలో విద్యాభ్యున్నతిని పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. ఫలితంగా అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలను నిషేధించడం ద్వారా అనుకున్న ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక గంట కూడా విద్య కోసం కేటాయించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల రద్దు కోసం రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సులో సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, ఇన్‌కంటాక్స్ కమిషనర్ డాక్టర్ ప్రీతిహరిత్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్ఐఆర్డీ రాధిక రస్తోగి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రతన్‌లాల్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణయాలలో ఆమె గొంతు!
ప్రపంచంలో 50 శాతం మహిళలే. అయితే మహిళలకు అవకాశాలు మగవారితో పోలిస్తే సమానంగా ఉండటం లేదు. దీనికి కారణం... ప్రతి రంగంలో ఆడవాళ్లకంటే మగవాళ్లు ఎక్కువగా ఉండటమే. ఒక సంస్థను నడిపించడానికి తీసుకునే నిర్ణయాలలో గానీ, చట్టాలు, విధానాలను సూత్రీకరించడంలో కానీ ఆడవాళ్ల ఇన్‌పుట్స్‌ను ఆహ్వానించడం తక్కువగా ఉంటోంది. ఆడవాళ్ల దృష్టి కోణం వాళ్లు మాట్లాడినప్పుడే వస్తుంది. మగవాళ్లు ఎంత విశాలంగా ఆలోచించినా ఆడవాళ్లలాగ ఆలోచించలేరు. ఆడవాళ్లకు ఏమి అవసరమో ఊహించి చట్టాలు, విధానాలు చేయలేరు మగవాళ్లు. ఆడవాళ్ల అవసరాల గురించి వాళ్లకు అర్థమైనట్లు తోచినట్లు సమకూర్చుకుంటారు. ఆ చట్టాలు, విధానాలకు అనుగుణంగానే ఆడవాళ్లు మెలగాల్సి వస్తోంది. ఆడపిల్లలు చాలా బాగా చదువుకుంటారు. కానీ... అనేక కారణాల వల్ల ఉద్యోగరంగంలో, విభిన్న రంగాలలో పై స్థాయికి ఎదగలేక పోయేసరికి మగవారితో సమాన ఆర్థిక పరమైన వ్యవస్థ సొంతంగా కలిగించుకోలేకపోతున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి మహిళలు కూడా ఆ బాధ్యత మగవాళ్లకే వదిలేశారు. అందుకే ఇప్పుడు పరిస్థితి ఇలాగ ఉంది. ఇక మీదట కూడా వాళ్లకే వదిలేస్తే మనదేశం ముందుకి వెళ్లదు. దేశం అభివృద్ధి చెందలేదు. ‘ఆడపిల్లలకు కూడా ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది’... అనుకోవాలి, నేర్పించాలి కూడా. ఊరికే డిగ్రీలు సంపాదిస్తే చాలదు. మహిళల తెలివితేటలు, సమర్థతలు దేశాభివృద్ధికి దోహదం చేయాలి. అలాగే ప్రతి ఒక్క మహిళ... ఏదో ఒక విషయంలో సాటి మహిళను ప్రభావితం చేయగలగాలి. మహిళాలోకానికి దిక్సూచి కావాలి. మునుపటి రోజుల్లో ఏ దేశానికి భౌతిక వనరులు సమృద్ధిగా ఉండేవో ఆ దేశాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉండేది. నేటికాలంలో ఏ దేశానికి మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయో ఆ దేశం ముందుకి వెళ్లటానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. మనదేశానికి ఉన్న పెద్ద ప్రయోజనం మన మానవ వనరులే. అందులో సగభాగం మహిళలే. మహిళాశక్తిని వినియోగించుకుంటే దేశం త్వరితంగా వృద్ధి చెందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఉపయోగించుకుంటేనే మహిళాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమవుతాయి. అప్పుడే ఈ తరం మహిళలు భవిష్యత్తు తరాల మహిళలకు చక్కటి దారిని వేసినట్లవుతుంది. ఆడ, మగ సమానత్వం గురించి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. ఆపైన స్వావలంబన, సాధికారత అనే మాటల అవసరమే ఉండదు. -
2050కి నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ: సీఎం
సాక్షి, రాజమహేంద్రవరం: మూడు విజన్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. 2022 నాటికి దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో, 2050 నాటికి ప్రపంచంలో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిపేందుకు విజన్‌తో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కన్నా రాష్ట్ర అభివృద్ధి 5.57 శాతం అధికంగా ఉందని చెప్పారు. వ్యవసాయంలో బాగా అభివృద్ధి సాధించామన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. త్వరలో రెండు లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా రుణాల్ని ఎంపీడీవో కార్యాలయానికి పిలిపించి ఇస్తామన్నారు. రానూపోనూ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. -
దేశాభివృద్ధిలో వచ్చే పదేళ్లు కీలకం: వెంకయ్య
న్యూఢిల్లీ: భారత దేశ ప్రగతి కథను తిరిగి లిఖించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వచ్చే పదేళ్ల కాలం కీలకం కానుందని చెప్పారు. మంగళవారం ఇక్కడ అఖిల భారత మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) 41వ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ‘మారుతున్న కాలం-భారత ప్రగతి పునరుద్ధరణ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. దేశ పూర్వపు వైభవం తిరిగి తెచ్చేందుకు వాణిజ్య దృక్పథంలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. పట్టణాభివృద్ధికి జపాన్ సాయం: దేశంలో పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి జపాన్ ఆసక్తి చూపుతున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలోని వివిధ నగరాల్లో మల్టీమోడల్ రవాణా వ్యవస్థ పరిష్కారాలను చూపేందుకు ఆసక్తి చూపుతోందని చెప్పారు. జపాన్ మౌలిక వసతులు, రవాణా, పర్యాటక శాఖ మంత్రి అకిహిరో ఓతా సహా 20 మంది ఉన్నతాధికారుల బృందం మంగళవారం వెంకయ్యనాయుడితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ మెట్రో రైలు మార్గాలకు జపాన్ సాయాన్ని కోరారు. -
పల్లెల ప్రగతితోనే దేశ పురోగతి
జవహర్‌నగర్ : పల్లెలు ప్రగతిపథంలో పయనిం చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పేర్కొన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవహర్‌నగర్ పాఠశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. భానిస సంకెళ్ల విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన జాతీయ నేతల ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపుని చ్చారు. మహాత్ముడి కలల సాకారానికి ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాల న్నారు. విద్యాపరంగా పల్లెలు పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనతోనే గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని, ఇందుకు అవసరమైన సహాయసహకారాలు ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా, చైనా తది తర దేశాలకన్నా భారత్ వేగంగా అభివృద్ధి చెంది భవిష్యత్‌లో ప్రపంచ దేశా ల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. రామకృష్ణమఠం అధ్యక్షుడు బోదోదయానంద మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు, విన్యాసాలు ఆహూతులను అలరించాయి.