గాంధీనగర్: మహిళల ఆర్థిక పురోగతితో దేశాభివృద్ధి సాధ్య మని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మహి ళల నేతృత్వంలో అభివృద్ధి కార్య క్రమాలు చేపడితే మహిళా సాధికారత కూడా సాధ్యప డుతుందన్నారు. మహిళలు సంపన్నులైతే ప్రపంచం సుసంపన్నంగా మారుతుందన్నారు. జీ–20 సన్నాహక సదస్సుల్లో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మహిళా సాధికారతపై మంత్రుల సదస్సునుద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. మహిళా పారిశ్రామికవేత్తలు మరింతగా రాణించడానికి ప్రభుత్వాలు చేయాల్సినదంతా చేయాలన్నారు.
‘‘మహిళలు వాణిజ్య రంగంలోనూ విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవడమే మనందరి లక్ష్యం కావాలి. మార్కెట్, గ్లోబల్ వాల్యూ చైన్, రుణాలు వంటివి వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకుల్ని అధిగమించాలి. అప్పుడే మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు’’ అని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని మోదీ కొనియాడారు. ఒక ఆదివాసీ మహిళ అయి ఉండి కూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ మహిళగా ఎదిగారని, త్రివిధ బలగాలకు నేతృత్వం వవహిస్తున్నారని చెప్పారు. స్థానిక ప్రభుత్వాల్లో 46% మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment