గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు: ప్రధాని మోదీ
సిమ్లా: బీజేపీని వరుసగా మూడోసారి గెలిపించాలని, దేశ అభివృద్ధి కోసమే తప్ప ఈ గెలుపు తన కోసం, తన కుటుంబం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో దేవాలయాలకు వెళ్లి, దేవుళ్లను ప్రారి్థంచి ఆశీస్సులు పొందాలని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి అధికారం అప్పగిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు బలవంతంగా లాక్కొని ఓటు బ్యాంక్‌కు కట్టబెడతారని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం పడుతుందని అన్నారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లోని నాహన్, మండీ, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, జలంధర్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. మందిర నిర్మాణానికి తాము పూనుకుంటే తేదీ చెప్పండి అంటూ ఎగతాళి చేశారని అన్నారు.
తేదీ ప్రకటించడమే కాకుండా ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రాణప్రతిష్ట సైతం జరిపించామని గుర్తుచేశారు. ఓటు బ్యాంక్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిందని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో 2.50 లక్షల జనాభా ఉన్న హట్టీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా కలి్పస్తామని హామీ ఇచ్చారు. ఓడిపోయే కాంగ్రెస్‌కు ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment