NEP Chairman Kasturi Rangan Praises CM YS Jagan Education Reform - Sakshi
Sakshi News home page

CM YS Jagan: సీఎం జగన్‌ను ప్రశంసించిన కస్తూరి రంగన్‌

Published Sat, Jul 24 2021 2:58 PM | Last Updated on Sat, Jul 24 2021 4:25 PM

NEP Chairman Kasturi Rangan Praises CM YS Jagan Education Reform - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా సంస్కరణలను ఎన్‌ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్‌ ప్రశంసించారు. 11వ వర్శిటీ డిస్టింగ్విష్‌ లెక్చర్‌ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణల పట్ల ఆయన అభినందించారు. వర్చువల్‌ ద్వారా పాల్గొన్న కస్తూరి రంగన్‌కు సీఎం జగన్ నాయకత్వంలో జరుగుతున్న విద్యా సంస్కరణలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

ఏపీలో అమలవుతున్న విద్యా పథకాలపై సీఎం వైఎస్ జగన్‌ను కస్తూరి రంగన్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఈపీ 2020 అమలులో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో సమర్థవంతంగా విద్యా సంస్కరణలు అమలవుతున్నాయని అభినందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిధులు, ఖర్చుకు వెనుకాడకుండా పలు విద్యా పథకాల అమలుపై కస్తూరి రంగన్ ప్రశంసలు కురిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement