సైనిక బలగాల బలోపేతమే లక్ష్యంగా భారత ఆర్మీలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీః సైనిక బలగాల బలోపేతమే లక్ష్యంగా భారత ఆర్మీలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లెఫ్టినెంట్ జనరల్ డీబీ షెకాట్కార్ కమిటీ చేసిన 65 సిఫార్సులకు ఆమోదం తెలిపింది. దీంతో పలు సైనిక విభాగాల్లో 57,000 మంది సైనిక సిబ్బందికి రీఎంట్రీ కల్పించనున్నారు. ఈ సూచనలకు 2019 సంవత్సరాంతానికి అమల్లోకి వస్తాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.ఆర్మీలో సంస్కరణలపై రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం కేబినెట్‌కు నివేదించామని చెప్పారు.
భారత సైన్యంలో స్వాతంత్య్రానంతరం ఇది అతిపెద్ద సంస్కరణని, సైన్యంతో సంప్రదింపులు జరిపి ఈ కసరత్తు కార్యాచరణపై ముందుకెళతామని అన్నారు. షెకాట్కార్ కమిటీ సిఫార్సుతో 57,000 మంది అధికారులు, జేసీఓలు, ఇతర ర్యాంకుల్లో సిబ్బందిని తిరిగి సైన్యంలో సేవలందించేందుకు తీసుకుంటామన్నారు.