మాజీ ప్రధాని మన్మోహన్ హయాంలో మార్కెట్ల దూకుడు
5 రెట్లు ఎగసిన బీఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్.. సెన్సెక్స్
దశాబ్దకాలంపాటు దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ హయాంలో స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్మురేపాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు 400 శాతం దూసుకెళ్లింది. వెరసి 10 ఏళ్లలో 8 సంవత్సరాలు లాభాలు పంచింది. 2006–07లో 47 శాతం జంప్‌చేయగా.. 2009లో మరింత జోరు చూపుతూ 81 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం..
పలు కీలక నిర్ణయాలు
ఆర్థిక మంత్రిగా (1991–96) ఉన్నప్పటి నుంచే క్యాపిటల్ మార్కెట్లలో సంస్కరణలకు బీజం వేశారు మన్మోహన్ సింగ్. భారతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేసే విధానాలకు రూపకల్పన చేసారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 1988లోనే ఏర్పాటైనప్పటికీ 1992లో సెబీ చట్టం ద్వారా దానికి చట్టబద్ధమైన అధికారాలు అందించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పారదర్శకతను పెంపొందించేందుకు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ ఒక పటిష్టమైన నియంత్రణ సంస్థగా మారేందుకు ఇది తోడ్పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశం కలి్పంచడం ద్వారా మార్కెట్లో లిక్విడిటీకి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మన్మోహన్ సంస్కరణలు దోహదపడ్డాయి.
బుల్ పరుగుకు దన్ను
మన్మోహన్ సింగ్ దేశానికి ఆర్థిక స్వేచ్చను కలి్పంచిన గొప్ప శిల్పి. 1991లో సంస్కరణలతో దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్‌కు తెరతీశారు. వ్యాపారాలు భారీగా విస్తరించాయి. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,000 పాయింట్ల స్థాయి నుంచి జోరందుకుంది. 780 రెట్లు ఎగసి ప్రస్తుతం 78,000 పాయింట్లకు చేరుకుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రిటర్నులు అందించింది.
– వీకే విజయకుమార్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్
సంస్కరణల జోష్
ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ 1991లో చేపట్టిన సంస్కరణలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో చెప్పుకోదగ్గ మార్పులకు కారణమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిచ్చాయి. ఆధునిక భారత్‌కు బాటలు వేశాయి. లైసెన్స్ రాజ్‌కు చెక్ పెట్టడంతోపాటు, స్వేచ్చా వాణిజ్యం, స్టాక్ మార్కెట్లలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఆయన దారి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
– పల్కా అరోరా చోప్రా, డైరెక్టర్, మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్
4,961 నుంచి 24,693కు
మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదవిలో ఉన్న 2004 నుంచి 2014వరకూ పరిగణిస్తే సెన్సెక్స్ 4,961 పాయింట్ల నుంచి 24,693 వరకూ దూసుకెళ్లింది. ఈ కాలంలో మూడేళ్లు మినహా ప్రతీ ఏటా ఇండెక్స్ లాభాల బాటలో నే సాగడం గమనార్హం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో ఇండెక్సులు పతనంకాగా.. 2011, 2014లోనూ మార్కెట్లు వెనకడుగు వేశాయి. 2011లో సెన్సెక్స్ అత్యధికంగా 27% క్షీణించింది. ఆరి్థక మంత్రిగా మన్మోహన్ 1991లో చేపట్టిన సంస్కరణలు ఆరి్థక వ్యవస్థకు జోష్‌నివ్వడంతో టర్న్‌అరౌండ్ అయ్యింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. బక్కచిక్కిన రూపాయి బలోపేతమైంది. ప్రధానంగా విదేశీ మారక నిల్వలు భారీగా ఎగశాయి.
సెన్సెక్స్ పరుగు
ఏడాది లాభం(%)
2004 33
2005 42
2006 47
2007 47
2009 81
2010 17
2012 26
2013 9
Comments
Please login to add a commentAdd a comment