stock markets rally
-
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(US Index) 109.7 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు లాభపడి 23,204కు చేరింది. సెన్సెక్స్(Sensex) 49 పాయింట్లు ఎగబాకి 76,581 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 76.56 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.47 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.51 శాతం దిగజారింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23 వేల మార్కు కిందకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు నష్టపోయి 22,993కు చేరింది. సెన్సెక్స్(Sensex) 305 పాయింట్లు దిగజారి 75,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.74 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.29 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.5 శాతం దిగజారింది.డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి కొత్త ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల నడకను పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.శనివారం ట్రేడింగ్కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 1) స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడింగ్‌ను నిర్వహించనుండటంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆరు రోజులపాటు లావాదేవీలకు వేదిక కానున్నాయి. అయితే బడ్జెట్ సెంటిమెంటుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్ల ట్రెండ్‌కు దిక్సూచిగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకుంటున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు లాభపడి 23,320కు చేరింది. సెన్సెక్స్(Sensex) 285 పాయింట్లు ఎగబాకి 77,006 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.04 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.34 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.83 శాతం లాభపడింది. నాస్డాక్ 2.45 శాతం ఎగబాకింది.రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:55 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు లాభపడి 23,855కు చేరింది. సెన్సెక్స్(Sensex) 373 పాయింట్లు ఎగబాకి 78,873 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్(Barrel Crude) ధర 74.92 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్(Nasdaq) 0.9 శాతం దిగజారింది.కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో స్వాగతం పలికింది. మెటల్, రియల్టీ(Realty) మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం ఇండెక్సులు అరశాతం మేర లాభపడ్డాయి. కొత్త సంవత్సరం రోజున ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పట్టిందల్లా బంగారమే!
మురిపించిన బంగారం.. రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించిన స్టాక్ మార్కెట్లు. డాలర్ విలువతో బక్కచిక్కిన రూపాయి.. 2024లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందని విధంగా వీటి ప్రయాణం సాగిపోయింది. రష్యా–ఉక్రెయిన్; ఇజ్రాయెల్–హమాస్–పాలస్తీనా–ఇరాన్ మధ్య ఘర్షణలు; కొండెక్కిన ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్ రేట్ల కోతలు, డోనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో టారిఫ్‌ల భయాలు.. ఇలాంటి ఎన్నో పరిణామాలు, అనిశ్చితులు బంగారానికి డిమాండ్ పెంచాయి. దీంతో ఈ ఏడాది ఈక్విటీ, డెట్‌కు మించి బంగారం సూపర్ ర్యాలీ చేసింది. డాలర్ బలోపేతం, అమెరికా డెట్‌లో మెరుగైన రాబడులతో విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యం చూపించారు. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది 3 శాతం వరకు క్షీణించింది. స్థానిక రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు ఒకింత ఈక్విటీ మార్కెట్లను ఆదుకున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం మీద ఈక్విటీలు నికర రాబడులను అందించాయి. బంగారం తర్వాత ఇన్వెస్టర్లు వెండికి ప్రాధాన్యం ఇచ్చారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పెరిగిన డిమాండ్‌తో వెండి కూడా ర్యాలీ చేసింది. స్టాక్ మార్కెట్లు రికార్డులే రికార్డులుఅంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, (ఎఫ్ఐఐలు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలు చేపట్టినప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి. దీనికి దేశీ పెట్టుబడులే అండగా నిలిచాయని చెప్పుకోవాలి. ఏడాది చివర్లో స్టాక్స్ మరోసారి దిద్దుబాటులోకి వెళ్లినప్పటికీ.. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 9 శాతం (6,459 పాయింట్లు), ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.58 శాతం (2,082 పాయింట్లు) మేర లాభాలను (డిసెంబర్ 27 నాటికి) ఇచ్చాయి. ‘‘దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అసాధారణ అమ్మకాలకు దిగడంతో గత రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి దిద్దుబాటుకు గురైంది. 2020 కరోనా విపత్తు తర్వాత ఇది మూడో గరిష్ట దిద్దుబాటు’’అని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ వెల్లడించింది. రెండు అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలను ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్–ఇరాన్ నేరుగా దాడులకు దిగాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్న ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా సమసిపోలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కార్పొరేట్ ఫలితాలు బలంగా ఉండడం, దేశీ పెట్టుబడుల ప్రవాహం, జీడీపీ పటిష్ట వృద్ధితో.. బీఎస్ఈ సెన్సెక్స్ 85,978 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట రికార్డును సెపె్టంబర్ 27న నమోదు చేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ అదే రోజున 26,277 గరిష్టాన్ని తాకింది. ఈ స్థాయిల నుంచి చూస్తే సెన్సెక్స్ డిసెంబర్ 27 నాటికి 8.46 శాతం, నిఫ్టీ 9.37 శాతం చొప్పున నష్టపోయాయి. → నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డు: 26,277 (సెప్టెంబర్ 27) → ఈ ఏడాది నికర రాబడి: 2,082 పాయింట్లు (9.58%) → సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు: 85,978 (సెపె్టంబర్ 27) → ఈ ఏడాది నికర రాబడి: 6,459 పాయింట్లు (9%) → విదేశీ ఇన్వెస్టర్ల నికర ఈక్విటీ పెట్టుబడులు: రూ.1,655 కోట్లు (ప్రైమరీ, సెకండరీ) → విదేశీ ఇన్వెస్టర్ల నికర డెట్ పెట్టుబడులు: రూ.1,12,409 కోట్లుడిసెంబర్ 27 చివరికి సెన్సెక్స్ ముగింపు 78,699 కాగా, నిఫ్టీ ముగింపు 23,813 పాయింట్లు. ‘‘2024 బుల్స్, బేర్స్ మధ్య నువ్వా–నేనా అన్నట్టుగా యుద్ధం నడిచింది అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకుని మరీ భారత మార్కెట్లు చక్కని రాబడులు ఇచ్చాయి. దీంతో మన మార్కెట్ల విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదుగా మారింది. దీనికితోడు అధిక లిక్విడిటీ (నిధుల ప్రవాహం) మార్కెట్ల వ్యాల్యూషన్‌ను గరిష్టాలకు చేర్చింది. దీంతో ఫండమెంటల్స్ కూడా పక్కకుపోయాయి. ఇదే అంతిమంగా మార్కెట్లో కరెక్షన్ను ఆహా్వనించినట్టయింది’’అని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సే వివరించారు. జీడీపీ వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4 శాతానికి సెపె్టంబర్ త్రైమాసికంలో క్షీణించడం, ఇదే త్రైమాసికానికి సంబంధించి బలహీన కార్పొరేట్ ఫలితాలు, ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం చివరికి మార్కెట్లో దిద్దుబాటుకు దారితీశాయి. ద్రవ్యోల్బణం 6 శాతం దాటిపోవడంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత కట్టడి దిశగా ఆర్బీఐ తీసుకున్న చర్యలు కూడా వినియోగం క్షీణించి, వృద్ధిపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాదిలో అధిక భాగం ద్రవ్యోల్బణం 5 శాతానికి పైనే చలించింది. వరుసగా 9వ ఏట భారత ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచగా, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ అయితే మరింత రాబడులతో మురిపించాయి.పసిడి మెరుపులు ఈ ఏడాది ఇన్వెస్టర్లు ఊహించినదానికి మించి బంగారం రాబడులు పంచింది. వెండి కూడా మెరిసింది. ఈ ఏడాది ఆరంభంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.63,000 స్థాయిలో ఉండగా, రూ.78,000–79000కు వృద్ధి చెందింది. రూపాయి మారకంలో 24 శాతం ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో అయితే 29 శాతం పెరిగింది. ఇక వెండి కిలో ధర రూ.78,600 స్థాయి నుంచి 16 శాతానికి పైగా పెరిగి రూ.91,000కు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు, అంతకంతకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఈ ఏడాది పసిడికి బలాన్నిచ్చాయి. బంగారం అంతర్జాతీయంగా చూస్తే అక్టోబర్‌లో నమోదైన 2,670 డాలర్ల (ఔన్స్‌కు) నుంచి 4 శాతం నష్టపోయింది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, డాలర్ ర్యాలీ, ద్రవ్యోల్బణం ఆందోళనలు కొంత శాంతించడం పసిడి చల్లబడడానికి కారణాలుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో ప్రస్తావించింది. అయినప్పటికి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగడం, ఆర్బీఐ సహా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు పసిడి నిల్వలను పెంచుకుంటూ పోవడం ధరలకు మద్దతునిచ్చాయి. పండుగల సీజన్లో తప్పించి ఈ ఏడాది బంగారం ఆభరణాల కొనుగోళ్లు సాధారణంగానే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అనుసరించారు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం కొనుగోళ్లు మాత్రం వృద్ధి చెందాయి. ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి ఉన్న గుర్తింపు సానుకూల సెంటిమెంట్‌కు దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు), సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (సిల్వర్ ఈటీఎఫ్‌లు) ఈ ఏడాది 20 శాతం వరకు నికర రాబడిని అందించాయి. బంగారం ఈటీఎఫ్‌లు సగటున 20 శాతం పెరగ్గా, సిల్వర్ ఈటీఎఫ్‌ల ధర 19.66 శాతంగా పెరిగింది. ఈ రెండు విభాగాల్లోనూ మొత్తం 31 ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. 2023లో గోల్డ్ ఈటీఎఫ్‌లు 13 శాతం రాబడిని, సిల్వర్ ఈటీఎఫ్‌లు సగటున 4 శాతం రాబడిని అందించాయి. భారత గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం భౌతిక బంగారం గడిచిన నాలుగేళ్లలో రెట్టింపై 2024 అక్టోబర్ చివరికి 54.5 టన్నులకు చేరినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు గతేడాదితో పోలి్చతే రెట్టింపై రూ.7367 కోట్లకు చేరాయి. 2023లో 2,919 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. ఆర్బీఐ కొనుగోళ్లు.. ఈ ఏడాది బంగారం ధరల ర్యాలీకి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు సైతం ప్రేరణగా నిలిచాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 11 నెలల్లో ఆర్బీఐ 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 9 శాతం పెరిగి 876 టన్నులకు చేరాయి. 2023లో 16 టన్నులు, 2022లో 33 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం నిల్వలు పెంచుకున్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మొదటి 11 నెలల్లో భారత్ దిగుమతి చేసుకున్న బంగారం 800 టన్నులను మించి ఉంటుందని అంచనా వేసింది. 2023 ఏడాది మొత్తం దిగుమతులు 689 టన్నులుగా ఉన్నట్టు.. విలువ పరంగా చూస్తే దిగుమతులు 48 శాతం పెరిగినట్టు (ధరల పెరుగుదలతో) డబ్ల్యూజీసీ తెలిపింది. సావరీన్ గోల్డ్ బాండ్లు కనుమరుగు! బంగారంపై పెట్టుబడులను ఎల్రక్టానిక్ రూపంలోకి మళ్లించే ఉద్దేశ్యంతో 2015లో మోదీ సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఏటా నాలుగు విడతలుగా వీటిని జారీ చేయడం ద్వారా నిధులు సమకరిస్తూ వచ్చింది. ఇన్వెస్టర్లకు ఇవి మెరుగైన రాబడులు ఇచ్చాయి. ‘‘2024లో కేవలం ఒక్క విడతే ఎస్జీబీని ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేసింది. 2023లో నాలుగు ఇష్యూలు చేపట్టింది. 2.5 శాతం వడ్డీ హామీకితోడు పన్ను మినహాయింపు ప్రయోజనాలతో బంగారంపై పెట్టుబడులకు ప్రాధాన్య సాధనంగా ఇది మారిపోయింది. దీంతో డిమాండ్–సరఫరా మధ్య తీవ్ర అంతరానికి దారితీసింది. ఫలితంగా ఇన్వెస్టర్ల ఆసక్తి గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు మళ్లింది’’ అని ఫిన్‌ఎడ్జ్ కో ఫౌండర్ మయాంక్ భటా్నగర్ తెలిపారు. పసిడి బలమైన ర్యాలీ, దీనికితోడు వడ్డీ చెల్లింపులు భారంగా మారడంతో ఎస్‌బీజీలను కేంద్రం నిలిపివేసినట్టు తెలుస్తోంది. → గోల్డ్ ఈ ఏడాది ఆల్‌టైమ్ గరిష్టం: 82,000 (అక్టోబర్ 30న హైదరాబాద్) → వెండి ఈ ఏడాది ఆల్‌టైమ్ గరిష్టం: రూ.1,01,900 (అక్టోబర్ 30) → ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు: 73 టన్నులు (నవంబర్ నాటికి) → బంగారం దిగుమతులు: 800 టన్నులు (నవంబర్ నాటికి) → గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు: 7,367 కోట్లు (అక్టోబర్ నాటికి) ఎఫ్ఐఐలు నికర పెట్టుబడిదారులేఅక్టోబర్, నవంబర్ నెలల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ.1.4 లక్షల కోట్ల అమ్మకాలకు పాల్పడడం గమనార్హం. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 16 శాతానికి దిగొచ్చింది. 12 ఏళ్ల కనిష్ట స్థాయి ఇది. రిటైల్, దేశీ ఇనిస్టిట్యూషన్లు, హెచ్ఎన్ఐల వాటా 32 శాతానికి చేరింది. ఈ ఏడాది డిసెంబర్ 27 నాటికి ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,19,277 కోట్ల మేర స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల ద్వారా (సెకండరీ మార్కెట్) అమ్మకాలు నిర్వహించారు. అదే సమయంలో ప్రైమరీ మార్కెట్ ద్వారా (ఐపీవోలు) వీరు రూ.1,20,932 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఎన్ఎస్డీఎల్ డేటా స్పష్టం చేస్తోంది. అంటే ఈక్విటీల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,655 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఈ ప్రకారం ఎఫ్ఐఐలు ఈ ఏడాది ఇంత వరకు నికర పెట్టుబడిదారులుగానే ఉన్నారు. ఎక్సే్ఛంజ్‌ల ద్వారా అమ్మకాలన్నవి అధిక వ్యాల్యూషన్ల వల్లే. అదే సమయంలో సహేతుక విలువలు ఉండడంతో ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డీకే విజయ్‌కుమార్ తెలిపారు. డెట్ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఈ ఏడాది మొత్తం మీద రూ.1,12,409 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు ఎన్ఎస్డీఎల్ డేటా ఆధారంగా తెలుస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్టాక్ మార్కెట్ మన్మోహనుడు
దశాబ్దకాలంపాటు దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ హయాంలో స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్మురేపాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు 400 శాతం దూసుకెళ్లింది. వెరసి 10 ఏళ్లలో 8 సంవత్సరాలు లాభాలు పంచింది. 2006–07లో 47 శాతం జంప్‌చేయగా.. 2009లో మరింత జోరు చూపుతూ 81 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. పలు కీలక నిర్ణయాలుఆర్థిక మంత్రిగా (1991–96) ఉన్నప్పటి నుంచే క్యాపిటల్ మార్కెట్లలో సంస్కరణలకు బీజం వేశారు మన్మోహన్ సింగ్. భారతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేసే విధానాలకు రూపకల్పన చేసారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 1988లోనే ఏర్పాటైనప్పటికీ 1992లో సెబీ చట్టం ద్వారా దానికి చట్టబద్ధమైన అధికారాలు అందించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పారదర్శకతను పెంపొందించేందుకు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ ఒక పటిష్టమైన నియంత్రణ సంస్థగా మారేందుకు ఇది తోడ్పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశం కలి్పంచడం ద్వారా మార్కెట్లో లిక్విడిటీకి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మన్మోహన్ సంస్కరణలు దోహదపడ్డాయి.బుల్ పరుగుకు దన్ను మన్మోహన్ సింగ్ దేశానికి ఆర్థిక స్వేచ్చను కలి్పంచిన గొప్ప శిల్పి. 1991లో సంస్కరణలతో దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్‌కు తెరతీశారు. వ్యాపారాలు భారీగా విస్తరించాయి. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,000 పాయింట్ల స్థాయి నుంచి జోరందుకుంది. 780 రెట్లు ఎగసి ప్రస్తుతం 78,000 పాయింట్లకు చేరుకుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రిటర్నులు అందించింది. – వీకే విజయకుమార్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్సంస్కరణల జోష్ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ 1991లో చేపట్టిన సంస్కరణలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో చెప్పుకోదగ్గ మార్పులకు కారణమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిచ్చాయి. ఆధునిక భారత్‌కు బాటలు వేశాయి. లైసెన్స్ రాజ్‌కు చెక్ పెట్టడంతోపాటు, స్వేచ్చా వాణిజ్యం, స్టాక్ మార్కెట్లలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఆయన దారి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. – పల్కా అరోరా చోప్రా, డైరెక్టర్, మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ 4,961 నుంచి 24,693కు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదవిలో ఉన్న 2004 నుంచి 2014వరకూ పరిగణిస్తే సెన్సెక్స్ 4,961 పాయింట్ల నుంచి 24,693 వరకూ దూసుకెళ్లింది. ఈ కాలంలో మూడేళ్లు మినహా ప్రతీ ఏటా ఇండెక్స్ లాభాల బాటలో నే సాగడం గమనార్హం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో ఇండెక్సులు పతనంకాగా.. 2011, 2014లోనూ మార్కెట్లు వెనకడుగు వేశాయి. 2011లో సెన్సెక్స్ అత్యధికంగా 27% క్షీణించింది. ఆరి్థక మంత్రిగా మన్మోహన్ 1991లో చేపట్టిన సంస్కరణలు ఆరి్థక వ్యవస్థకు జోష్‌నివ్వడంతో టర్న్అరౌండ్ అయ్యింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. బక్కచిక్కిన రూపాయి బలోపేతమైంది. ప్రధానంగా విదేశీ మారక నిల్వలు భారీగా ఎగశాయి.సెన్సెక్స్ పరుగు ఏడాది లాభం(%) 2004 33 2005 42 2006 47 2007 47 2009 81 2010 17 2012 26 2013 9 -
మిశ్రమ ఫలితాల్లో స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 0.39 పాయింట్లు లేదా 0.00050 శాతం నష్టంతో 78,472.48 వద్ద, నిఫ్టీ 22.55 పాయింట్లు లేదా 0.095 శాతం లాభంతో 23,750.20 వద్ద నిలిచాయి.అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, JSW స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాలను చవి చూశాయి.స్థిరమైన గ్లోబల్ సూచనలు, ఆసియా మార్కెట్ల ఉత్తేజం నేపథ్యంలో ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ 50 (Nifty) గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి, సెన్సెక్స్ 238.27 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 78,711 వద్ద, నిఫ్టీ 56.45 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 23,784.10 వద్ద ఉన్నాయి.ఓపెనింగ్ బెల్ తర్వాత ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా స్టాక్‌లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతుండగా, మిగిలినవి లాభాల్లో పయనిస్తున్నాయి. వీటిలో బ్యాంక్ స్టాక్‌లు ముందు వరుసలో ఉన్నాయి. లాభాల్లో అగ్రగామిగా ఎస్బీఐ (SBI) ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.నిఫ్టీ50లో ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ట్రెంట్, టీసీఎస్‌లతో సహా ఐదు స్టాక్‌లు మాత్రమే దిగువన ట్రేడింగ్‌లో ఉన్నాయి. బిపిసిఎల్, ఎస్బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మారుతీ సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్స్.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market).. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 85.93 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 78,454.24 వద్ద, నిఫ్టీ 23.85 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టంతో 23,729.60 వద్ద నిలిచాయి.టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఐషర్ మోటార్స్, ఐటీసీ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి నష్టాలను చవిచూశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు పుంజుకుని 78,611 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.92 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. రేపు క్రిస్మస్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు. తిరిగి గురువారం యథావిధిగా స్టాక్‌మార్కెట్లు పని చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లు సోమవారం కాస్త పుంజుకోవడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల మార్కెట్ నుంచి భారీగా అమ్మకాలు చేస్తున్న విదేశీ సంస్థగత పెట్టుబడిదారుల సరళిని గమనించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. జొమాటో, మారుతీసుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, నెస్లే కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 705.11 పాయింట్లు లేదా 0.89 శాతం లాభంతో.. 79,748.85 వద్ద, నిఫ్టీ 208.20 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,122.35 పాయింట్ల వద్ద నిలిచాయి.భారతి ఎయిర్టెల్, సిప్లా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, అపోలో హాస్పిటల్, నెస్లే వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 23,973కు చేరింది. సెన్సెక్స్ 154 పాయింట్లు ఎగబాకి 79,177 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.6 శాతం దిగజారింది.మార్కెట్ ఒడిదొడుకులకు కొన్ని కారణాలుఅమెరికాలో అక్టోబర్ వినియోగదారుల వ్యయం అంచనాలకు (0.3%) మించి 0.4% పెరిగింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని రెండుశాతం దిగువకు తీసుకొచ్చే లక్ష్యానికి ఆటంకం నెలకొంది.డిసెంబర్లో మూడో దఫా వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఫెడ్ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇటీవలి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశ వివరాల్లో వెల్లడైంది. దీంతో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లపై కోతపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 106.39 స్థాయికి చేరింది. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్‌లాంటి వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. డాలర్ బలంతో విదేశీ పెట్టుబడుదారులకు వ్యయాలు పెరుగుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీగా పడుతున్నాయి. ఉదయం 11:25 నిమిషాల సమయం వరకు ఏకంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైనట్లు తెలిసింది. మార్కెట్లు పడిపోతుండడంపై నిపుణులు కొన్ని అంతర్జాతీయ అంశాలు కారణమని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.అమెరికా ఎన్నికలుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు(మంగళవారం 5న) జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.యూఎస్ ఫెడ్ సమావేశంమరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధ, గురువారాల్లో(6–7వ తేదీన) మానిటరీ పాలసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నాయి. 7న యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం(2.4 శాతం), అక్టోబర్ ఉపాధి గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్లలో సవరణలకు తెరతీయనుంది. గత సమావేశంలో నాలుగేళ్ల తదుపరి ఎఫ్‌వోఎంసీ తొలిసారి 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతంగా అమలవుతున్నాయి.క్యూ2 ఫలితాలుఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ వేడెక్కింది. పలు దిగ్గజాలు పనితీరును వెల్లడిస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మార్కెట్లు కింది చూపులు చూస్తున్నాయి. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాల జాబితాలో డాక్టర్ రెడ్డీస్, టైటన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. దేశ, విదేశీ గణాంకాలను ఈ వారం స్టాక్ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నాయి.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్దేశీ స్టాక్స్‌లో ఉన్నట్టుండి గత నెలలో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త చరిత్రకు తెరతీశారు. అక్టోబర్‌లో నికరంగా రూ.94,000 కోట్ల(11.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నెలవారీగా దేశీ స్టాక్ మార్కెట్లలో ఇవి అత్యధిక అమ్మకాలుకాగా..కొవిడ్–19 ప్రభావంతో ఇంతక్రితం 2020 మార్చిలో ఎఫ్‌పీఐలు రూ.61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీయంగా ఒక నెలలో ఇవి అత్యధిక విక్రయాలుగా నమోదయ్యాయి. ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌లో రూ.57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇవి గత 9 నెలల్లోనే గరిష్టంకావడం గమనార్హం. అయితే చైనాలో ఆకర్షణీయ ఈక్విటీ విలువలు, ప్రభుత్వ సహాయక ప్యాకేజీలు ఎఫ్‌పీఐలను అమ్మకాలవైపు ఆకర్షిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
గ్లోబల్ ట్రెండ్, గణాంకాలపై కన్ను
ముంబై: ప్రపంచ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు తదితర అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం(అక్టోబర్ 2న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆటోరంగ అమ్మకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇవికాకుండా అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక అనిశి్చతులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. త్రైమాసికవారీగా కంపెనీలు వెల్లడించే తాజా వార్తలు వివిధ కౌంటర్లలో యాక్టివిటీకి కారణంకానున్నట్లు తెలియజేశారు. బ్లూచిప్ కంపెనీలలో నెలకొన్న సానుకూల పరిస్థితులు మార్కెట్లను మరింత ముందుకు నడిపించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. దేశీ గణాంకాలు ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించే తయారీ, సరీ్వసుల రంగాలకు చెందిన హెచ్ఎస్బీసీ ఇండియా పీఎంఐ ఇండెక్స్ గణాంకాలు వెలువడనున్నాయి. వీటితోపాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరును ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. అయితే దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ పరిణామాలే మార్కెట్లకు కీలకంకానున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. కాగా.. ఇకపై రెండో త్రైమాసిక(జులై–సెపె్టంబర్) కార్పొరేట్ ఫలితాలవైపు ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. ఇన్వెస్టర్లలో కంపెనీల లాభార్జన మెరుగుపడనున్న అంచనాలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 0.5 శాతం వడ్డీ రేటు తగ్గింపు కారణంగా గత వారం మార్కెట్లు బలపడ్డాయి. ఆర్థిక గణాంకాలలో స్థిరత్వం, విదేశీ పెట్టుబడులు దేశీయంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు నాయిర్ వివరించారు. చైనా ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటన సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచి్చనట్లు పేర్కొన్నారు. ఇది ఆసియా మార్కెట్లలో మరిన్ని పెట్టుబడులకు దారి చూపవచ్చని అంచనా వేశారు. కమోడిటీల ధరలు, యూఎస్ డాలర్ ఇండెక్స్, కీలక గణాంకాలు మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2020 మార్చి తదుపరి యూఎస్ ఫెడ్ తొలిసారి వడ్డీ రేటును తగ్గించింది. దీంతో ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి చేరాయి. సోమవారం(30న) ఫెడ్ చీఫ్ జెరోమీ పావెల్ ప్రసగించనున్నారు. గత వారం రికార్డ్స్ గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,028 పాయింట్లు ఎగసింది. 85,572 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా 85,978కు చేరింది. నిఫ్టీ 388 పాయింట్లు జమ చేసుకుని 26,179 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్టంగా 26,277ను తాకింది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో సరికొత్త గరిష్ట రికార్డులను సాధించాయి. మార్కెట్ విలువరీత్యా బీఎస్ఈలో టాప్–10 కంపెనీలలో 8 కౌంటర్లు లాభపడ్డాయి. దీంతో టాప్–10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఉమ్మడిగా రూ.1.21 లక్షల కోట్లకుపైగా బలపడింది. వీటిలో ప్రధానంగా ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.53,653 కోట్లు పెరిగి రూ. 20,65,198 కోట్లయ్యింది. ఎస్బీఐ విలువ రూ.18,519 కోట్లు పుంజుకుని రూ. 7,16,334 కోట్లను తాకింది. ఎయిర్టెల్ విలువ రూ. 13,095 కోట్లు బలపడి రూ.9,87,905 కోట్లకు, ఐటీసీ విలువకు రూ.9,927 కోట్లు జమయ్యి రూ. 6,53,835 కోట్లకు చేరింది. ఈ బాటలో టీసీఎస్ విలువ రూ. 8,593 కోట్ల వృద్ధితో రూ. 15,59,052 కోట్లుగా నమోదైంది. పెట్టుబడులు @ 9 నెలల గరిష్టం సెపె్టంబర్లో ఎఫ్‌పీఐల స్పీడ్ ఇటీవల దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి(27)వరకూ నికరంగా రూ. 57,359 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇది గత 9 నెలల్లో అత్యధికంకాగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇందుకు ప్రధాన కారణ మైంది. దీంతో 2024లో దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించాయి. ఇంతక్రితం 2023 డిసెంబర్లో ఎఫ్‌పీఐలు రూ. 66,135 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ జూన్ నుంచి చూస్తే ఎఫ్‌పీఐలు నెలవారీగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. -
పుంజుకున్న మార్కెట్లు.. కొత్త గరిష్టాలకు సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం పుంజుకున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 ప్రారంభ నష్టాలను తిప్పికొట్టాయి. ట్రేడింగ్ సెషన్‌ను రికార్డ్ హై ముగింపు స్థాయిలలో ముగించే ముందు కొత్త గరిష్టాలను తాకాయి.సెన్సెక్స్ 255.83 పాయింట్లు లేదా 0.30 శాతం పుంజుకుని 85,169.87 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయి 85,247.42కి చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా 63.75 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 26,004.15 వద్ద సెషన్‌ను ముగించే ముందు 26,032.80 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.నిఫ్టీ లిస్టింగ్‌లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటర్స్, టైటాన్ టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిన్నటి ముగింపు వద్దే ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 25,947కు చేరింది. సెన్సెక్స్ 26 పాయింట్లు లాభపడి 84,927 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.49 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.74 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం, నాస్డాక్ 0.56 శాతం లాభపడ్డాయి.ఇదీ చదవండి: రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!ఫెడ్ కీలక వడ్డీరేట్లను కట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నవారిలో దాదాపు 93 శాతం మంది నష్టాల్లోనే ఉంటున్నట్లు పలు సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ ట్రేడింగ్ చేస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, కొత్తగా ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నవారు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎంచుకోకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:11 సమయానికి నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 25,907కు చేరింది. సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 84,817 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.72 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.74 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్పల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.19 శాతం, నాస్డాక్ 0.36 శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: కస్టమర్లకు సకల సౌకర్యాలు!ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ గురువారం (22న) నిఫ్టీ సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెప్టెంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ.342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (24న) స్టాక్ లిస్ట్ కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 25,471కు చేరింది. సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 83,378 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.69 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.72 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.7 శాతం, నాస్డాక్ 2.51 శాతం లాభపడ్డాయి.ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు చెబుతున్నారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేస్తున్నారు. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనుంది.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ నిర్ణయాలపై దృష్టి.. స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు తగ్గి 25,398కు చేరింది. సెన్సెక్స్ 92 పాయింట్లు నష్టపోయి 82,995 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.93 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం, నాస్డాక్ 0.2 శాతం లాభపడ్డాయి.ఇదీ చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దుకీలకంగా మారనున్న ఫెడ్ నిర్ణయాలువడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీరేట్లను 25 లేదా 50 బేసిస్ పాయింట్లు మేర ఫెడ్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు సెప్టెంబర్ 17న మొదలయ్యాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం(18న) రాత్రి ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెల్లడించనున్నారు. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ద్రవ్య కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@25,388
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 25,388కు చేరింది. సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 83,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.66 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం, నాస్డాక్ 0.65 శాతం లాభపడ్డాయి.క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చని అంటున్నారు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ నిఫ్టీ.. భళా
మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 58 పాయింట్లు బలపడి 23,323 వద్ద నిలిచింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇంట్రాడేలోనూ 177 పాయింట్లు పురోగమించి 23,442 వద్ద సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలి సెషన్లో సెన్సెక్స్ 594 పాయింట్లు జంప్ చేసింది. ఇంట్రాడే రికార్డ్ 77,079కు చేరువగా 77,050ను అధిగమించింది. చివరికి 150 పాయింట్లు జమ చేసుకుని 76,607 వద్ద ముగిసింది. ముంబై: ఎంపిక చేసిన బ్లూచిప్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజంతా ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో లాభాలమధ్యే కదిలాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. రూ. 429.32 లక్షల కోట్లను(5.14 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. కాగా.. ఎన్ఎస్ఈలో మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, హెల్త్‌కేర్ రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. చిన్న షేర్లు జూమ్ బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతానికిపైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,518 లాభపడితే.. 1,376 మాత్రమే డీలాపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 427 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 234 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఫెడ్‌పై దృష్టి దేశీయంగా జీడీపీ పురోగతిపై ఆర్బీఐ ఆశావహ అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురానున్న తుది బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బలహీనపడినట్లు తెలియజేశారు. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 83 డాలర్లకు చేరగా, డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా 3 పైసలు బలపడి 83.56(ప్రొవిజినల్) వద్ద ముగిసింది. ఇక్సిగో ఐపీవో బంపర్ సక్సెస్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో మాతృ సంస్థలే ట్రావెన్యూస్ టెక్నాలజీ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్‌ను సాధించింది. షేరుకి రూ. 88–93 ధరలో బుధవారం ముగిసిన ఇష్యూ 98 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను అందుకుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించింది.డీ డెవలప్మెంట్ @ రూ. 193–203పైపింగ్ సొల్యూషన్స్ కంపెనీ డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 193–203 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 418 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవాలన్నది సంస్థ ప్రణాళిక. -
Stock market: మార్కెట్ యూటర్న్..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఖరారు కావడంతో నేలక్కొట్టిన బంతిలా దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రా డేలో 2,456 పాయింట్ల ‘పోల్’వాల్ట్ చేసింది. నిఫ్టీ సైతం 786 పాయింట్లు జంప్‌చేసింది. దీంతో సెన్సెక్స్ తిరిగి 74,530 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 22,670ను దాటేసింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 13 లక్షల కోట్లకుపైగా బలపడింది! ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున గత నాలుగేళ్లలోనే అత్యధిక స్థాయి పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టే వీలుండటంతో సెంటిమెంటు బలపడింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉపక్రమించడంతో ఇండెక్సులు లాభాల పరుగు అందుకున్నాయి. సెన్సెక్స్ 2,303 పాయింట్లు జంప్‌చేసి 74,382 వద్ద నిలిచింది. నిఫ్టీ 736 పాయింట్లు పురోగమించి 22,620 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్కు రూ. 13.22 లక్షల కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 408 లక్షల కోట్ల(4.89 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది!ఎఫ్‌పీఐ అమ్మకాలు బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 4.4%, 3% చొప్పున ఎగశా యి. కాగా.. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) తాజాగా రూ. 5,656 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 4,555 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 12,436 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 3,319 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. దీంతో బీఎస్ఈ మా ర్కెట్ విలువలో రూ. 31 లక్షల కోట్లకుపైగా తగ్గింది. బ్లూ చిప్స్ దన్ను...ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 6–2 శాతం మధ్య ఎగశాయంటే కొనుగోళ్ల జోరును అర్ధం చేసుకోవచ్చు! ప్రధానంగా మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ 4 శాతంపైగా బలపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాలలో దాదాపు అన్ని షేర్లూ లాభపడ్డాయి. అదానీ షేర్లు అప్మార్కెట్ల బౌన్స్‌బ్యాక్‌తో ఒక్క అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మినహా (–2.6%) అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అత్యధికం మళ్లీ లాభపడ్డాయి. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 15.57 లక్షల కోట్లను అధిగమించింది. మేలో ‘సేవలు’ పేలవంన్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మేనెల్లో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ నెల్లో 60.8 వద్ద ఉన్న హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మే లో 60.2కు తగ్గింది. కాగా, కొత్త ఎగుమతుల ఆర్డర్లు 10 సంవత్సరాల గరిష్టానికి చేరడం హర్షణీయ పరిణామం. -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
Stock Market: 75,000 @ రూ. 400 లక్షల కోట్లు
ఒక్క రోజు గ్యాప్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 75,000 పాయింట్లపైన నిలవగా.. నిఫ్టీ 22,754 వద్ద ముగిసింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. తాజా ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి కట్టుతప్పడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచనకు చెక్పడే వీలుంది. దీంతో యూఎస్ మార్కెట్లు 1.3 శాతం డీలాపడి ట్రేడవుతున్నాయి. ముంబై: ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్‌చేసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 75,038 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల వృద్ధితో కొత్త గరిష్టం 22,754 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 75,105 వద్ద, నిఫ్టీ 22,776 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ప్రభావంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1–0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 2,27,025 కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 402 లక్షల కోట్ల(4.83 ట్రిలియన్ డాలర్లు) ఎగువకు చేరింది. ఫార్మా మినహా.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్, చమురు, ఎఫ్ఎంసీజీ, మెటల్ 1.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐషర్, టెక్ఎం, ఆర్ఐఎల్ 3.6–1% మధ్య లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–1% మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో 1,904 లాభపడితే.. 1,939 బలహీనపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 2,778 కోట్లు, దేశీ ఫండ్స్ సైతం రూ. 163 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మూడోరోజూ మెరిసిన పసిడి, వెండి పసిడి, వెండి ధరలు న్యూఢిల్లీలో వరుసగా మూడవ రోజు బుధవారం కూడా రికార్డుల ర్యాలీ చేశాయి. పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒక దశలో లైఫ్‌టైమ్ హై రూ.72,000 తాకింది. అటు తర్వాత క్రితం ముగింపుతో పోలి్చతే రూ.200 లాభంతో రికార్డు స్థాయి రూ.71,840 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీకి రూ.200 ఎగసి రూ.84,700 వద్ద ముగిసింది. పసిడి ధర గడచిన మూడు రోజుల్లో రూ.690 పెరగ్గా, వెండి ధర ఇదే కాలంలో రూ.1,500 పెరిగింది. కాగా, అంతర్జాతీయ బులిష్ ధోరణులు ఈ రెండు మెటల్స్ తాజా పెరుగుదలకు కారణంకాగా, బుధవారం వెలువడిన అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని భయాలతో బంగారం, వెండి తక్షణ ర్యాలీకి బ్రేక్ పడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లు క్రితం ముగింపుతో పోల్చితే మైనస్‌లో ట్రేడవుతుండడం ఇక్కడ గమనార్హం. నకిలీ వీడియోలతో తస్మాత్ జాగ్రత్త! ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్టాక్ రికమండేషన్లు ఇస్తున్నట్లు అవాస్తవ(డీప్‌ఫేక్) వీడియోల సృష్టి జరిగినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం తాజాగా పేర్కొంది. ఆధునిక సాంకేతికతను తప్పుడు మార్గంలో వినియోగించడం ద్వారా ఎన్ఎస్ఈ లోగోసహా.. ఆశిష్‌కుమార్ ముఖం లేదా గొంతుతో షేర్ల సిఫారసులు చేస్తున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని హెచ్చరించింది. -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం మునుపటి ముంగింపు దగ్గరే ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 వరకు నిఫ్టీ 8 పాయింట్లు పుంజుకుని 22,064కు చేరింది. సెన్సెక్స్ 4 పాయింట్లు లాభపడి 72.602 వద్ద ట్రేడవుతోంది. అమెరికాలోని నాస్డాక్ 0.3శాతం నష్టాల్లో ముగిసింది. వరుసగా మూడోరోజు ఈ సూచీ నష్టాలభాట పట్టినట్లు తెలిసింది. ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రధానంగా మార్చి 2024లో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు సెంట్రల్ బ్యాంక్‌లు అచితూచి వ్యవహరించనున్నాయని తెలుస్తుంది. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు 4.8 పాయింట్లు పెరిగి 4.32 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.08శాతం నష్టపోయి 103.97కు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.284.66 కోట్ల విలువ చేసే స్టాక్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.411.57 కోట్లు విలువైన స్టాక్లను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ర్యాలీతో రికార్డుల మోత
ముంబై: ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ దిగ్గజాలలో కొనుగోళ్ల మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో మరోసారి మార్కెట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 75 పాయింట్లు ఎగసి 22,197 వద్ద ముగిసింది. దీంతోపాటు ఇంట్రాడేలో 22,216కు చేరడం ద్వారా మళ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మరోపక్క సెన్సెక్స్ 349 పాయింట్లు జంప్‌చేసి 73,057 వద్ద నిలిచింది. తద్వారా 73,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించడంతోపాటు.. చరిత్రాత్మక గరిష్టం 73,328ను అధిగమించే బాటలో సాగుతోంది. సోమవారం సైతం నిఫ్టీ 22,122 వద్ద రికార్డ్ సృష్టించిన విషయం విదితమే. అయితే మార్కెట్లు తొలుత వెనకడుగుతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 22,046 దిగువన, సెన్సెక్స్ 72,510 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. తిరిగి మిడ్ సెషన్ నుంచీ జోరందుకున్నాయి. దీంతో ఆరు రోజుల్లో నిఫ్టీ 580 పాయింట్లు, సెన్సెక్స్ 1,984 పాయింట్లు జమ చేసుకున్నాయి. ప్రయివేట్ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్(1%) జోరు చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎన్టీపీసీ, కొటక్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, ఇండస్ఇండ్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్, నెస్లే, హెచ్‌యూఎల్ 4.4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరోమోటో, బజాజ్ ఆటో, ఐషర్, కోల్ ఇండియా, టీసీఎస్, సిప్లా, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ 4–1% మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు వీక్ అధిక విలువల కారణంగా ఇన్వెస్టర్లు చిన్న షేర్లలో అమ్మకాలు చేపట్టారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,967 నీరసించగా.. 1,876 బలపడ్డాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 1,336 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 1,491 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్.. ► ఇష్యూ ధర రూ. 151తో పోలిస్తే వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ 179% లాభంతో రూ. 421 వద్ద లిస్టయ్యింది. 193% (రూ.291) బలపడి రూ. 442 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 838 కోట్లను దాటింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 23.3 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీవో భారీ స్థాయిలో 300 రెట్లు సబ్‌్రస్కయిబ్ అయ్యింది. ► ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల్లో రూ. 656 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించడంతో పవర్‌గ్రిడ్ షేరు 4.2% ఎగసి రూ. 288 వద్ద క్లోజైంది. వరుసగా ఆరో రోజూ ర్యాలీతో దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డును సాధించగా.. సెన్సెక్స్ 73,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. త ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకునే బాట లో సాగుతోంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 391.5 లక్షల కోట్ల(4.72 ట్రిలియన్ డాలర్లు)ను తాకింది. వర్ల్‌పూల్ వాటా విక్రయం.. రూ. 4,090 కోట్ల సమీకరణ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రమోటర్ సంస్థ వర్ల్‌పూల్ మారిషస్ బ్లాక్‌డీల్స్ ద్వారా దేశీ అనుబంధ కంపెనీ వర్ల్‌పూల్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించింది. యూఎస్ హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం వర్ల్‌పూల్ కార్పొరేషన్ మారిషస్ సంస్థ ద్వారా 75 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. బ్లాక్‌డీల్స్ ద్వారా రూ. 4,090 కోట్ల విలువైన 3.13 కోట్ల షేర్లు విక్రయించినట్లు బీఎస్ఈకి వర్ల్‌పూల్ ఇండియా వెల్లడించింది. రుణ చెల్లింపుల కోసం వర్ల్‌పూల్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించనున్నట్లు గతేడాది వర్ల్‌పూల్ కార్ప్ వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వర్ల్‌పూల్ ఇండియా షేరు 3.25 శాతం క్షీణించి రూ. 1,288 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 21,527కు చేరింది. సెన్సెక్స్ 786 పాయింట్లు తగ్గి 71,183 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.15 శాతం పెరిగి 82.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ)’ సోమవారం రూ.110 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ)’ సైతం రూ.3,221.34 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: శనివారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. సోమవారం సెలవు
దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలు శనివారం ఓపెన్లోనే ఉన్నాయి. ముందుగా ఈరోజు కొద్ది సమయమే మార్కెట్లు పని చేస్తాయని ప్రకటించిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు రోజంతా మార్కెట్ ఓపెన్లోనే ఉండనున్నట్లు తెలిపాయి. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ జరగదని ఒక అధికారి తెలిపారు. దేశీయ మార్కెట్లు శనివారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 21698కు చేరింది. సెన్సెక్స్ 754 పాయింట్లు పుంజుకుని 71,941 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.3689.68 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.2638.46 కోట్లు షేర్లు కొనుగోలు చేశారు. అమెరికాలోని నాస్డాక్ 1.7 శాతం లాభాల్లో ముగిసింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్ఈల్డ్ 2 బేసిస్పాయింట్లు తగ్గి 4.13 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.29 శాతం తగ్గి 103.24 వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.88 యూఎస్ డాలర్ల వద్ద ఉంది. మిచిగాన్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వెల్లడైంది. ఇది మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశంగా ఉంది. మార్కెట్లో ఇప్పటికే ఐటీస్టాక్ల ర్యాలీ కనబతుతోంది. దీనికితోడు బ్యాంకింగ్‌రంగ స్టాక్‌లు తోడ్పాటునందిస్తే మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇటీవల విడుదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు మదుపర్లకు కొంత నిరాశ కలిగించాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇవాళ రాబోయే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫలితాలను అనుసరించి మార్కెట్ ర్యాలీ ఉండనుందని సమాచారం. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 21,614కు చేరింది. సెన్సెక్స్ 580 పాయింట్లు పుంజుకుని 71,766 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు గడిచిన రెండురోజుల్లో భారీగా షేర్లను విక్రయించారు. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూ.9,901.56 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.5,977.12 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డాలర్ ఇండెక్స్ 103.38కు చేరింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 79.01 డాలర్లుగా ఉంది. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ గురువారం 1.35 శాతం పెరిగింది. 10 కాలవ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్‌లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 4.14 శాతానికి చేరాయి. అమెరికాలోని జాబ్స్ డేటా ఆశించిన దానికంటే తక్కువగా నమోదైంది. పాకిస్థాన్ ఇరాన్ వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎర్ర సముద్రంలో చేలరేగుతున్న అల్లర్లతో అంతర్జాతీయంగా వాణిజ్యంపరంగా కొంత అనిశ్చితులు నెలకొన్నాయి. దానికితోడు పాకిస్థాన్ అంశం తోడైతే మార్కెట్లు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య సంబంధాలపై కొమ్‌జాంగ్‌ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల సంబంధాలపై కిమ్ భిన్న వైఖరి అవలంబించబోతున్నట్లు చెప్పారు. మిస్సైల్‌ల్ల పరీక్ష, లైఫ్ ఫైర్ ఎక్సర్‌సైజ్‌లను చేయబోతున్నట్లు తెలిపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: దేశీయ మార్కెట్లో బుల్‌రన్
దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ ఉదయం 9:20 వరకు 88 పాయింట్లు లాభపడి 21,739 వద్దకు చేరింది. సెన్సెక్స్ 332 పాయింట్లు పుంజుకుని 72,050 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారతిఎయిర్టెల్, ఎం అండ్ ఎం, నెస్లే, పవర్‌గ్రిడ్, టైటాన్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి డిసెంబర్ నెలకు సంబంధించి అమెరికా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ) డేటా విడుదలైంది. మార్కెట్ భావించిన దానికంటే కొంత అధికంగా సీపీఐ సూచీలున్నాయి. మార్కెట్లు 0.2 శాతంగా ఉంటుందని భావించాయి. కానీ 0.3శాతంగా నమోదైంది. క్రూడ్‌ఆయిల్ ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్లుగా ఉంది. ఎర్రసముద్రం అనిశ్చితుల నేపథ్యంలో ఇరాన్ ఒమన్ కోస్ట్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్ చేస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లపై దాని ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ 102.3కు చేరింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఐపీవో రష్.. లాభాల జాతర
గత క్యాలండర్ ఏడాది(2023)లో పబ్లిక్ ఇష్యూల హవా నడిచింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు కొత్త కంపెనీల లిస్టింగ్స్‌తో కళకళలాడాయి. వీటిలో అత్యధిక శాతం ఇష్యూలు ఇన్వెస్టర్లను మెప్పించడం విశేషం! ముంబై: స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్సులలో సెన్సెక్స్(బీఎస్ఈ) 72,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నూతన చరిత్రకు తెరతీసింది. ఈ బాటలో నిఫ్టీ(ఎన్ఎస్ఈ) సైతం తొలిసారి 22,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ఈ ప్రభావంతో 2023లో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు తెరతీశాయి. ఇందుకు అనుగుణంగా కొద్ది నెలలనుంచి పెట్టుబడుల దూకుడు చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేయడంలో క్యూ కట్టారు. వెరసి 2023లో మార్కెట్లను తాకిన 59 ఐపీవోలలో ఏకంగా 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ద్వారా రికార్డు నెలకొల్పాయి. 4 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూ ధరలకంటే దిగువన కదులుతున్నాయి. రూ. 82 లక్షల కోట్లు గతేడాది(జనవరి–డిసెంబర్) దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు 20 శాతం ర్యాలీ చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 82 లక్షల కోట్లమేర(ఒక ట్రిలియన్ డాలర్లు) బలపడింది. ఫలితంగా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 370 లక్షల కోట్లకు(4.3 ట్రిలియన్ డాలర్లు) చేరింది. 2022తో పోలిస్తే 30 శాతం వృద్ధి! తద్వారా గ్లోబల్ టాప్–5 విలువైన మార్కెట్ల జాబితాలో భారత్ చోటు సాధించింది. సగటున 45 శాతం ప్లస్ గతేడాది స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన 59 కంపెనీలు ఉమ్మడిగా రూ. 54,000 కోట్లు సమీకరించాయి. వీటిలో 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి. ఇవి సగటున 45 శాతం బలపడ్డాయి. అయితే 4 కంపెనీలు ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడవుతున్నాయి. 59 ఇష్యూలలో లిస్టింగ్ రోజు లాభాలు సగటున 26 శాతంకాగా.. డిసెంబర్ 29కల్లా సగటున 45 శాతం పురోగమించాయి. 4 ఇష్యూలు మాత్రమే బలహీనంగా ట్రేడవుతున్నాయి. లిస్టింగ్ నుంచి 23 కంపెనీలు 50 శాతానికిపైగా రిటర్నులు అందించాయి! 9 ఇష్యూలు రెట్టింపునకుపైగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) నుంచి 182 ఐపీవోలు నమోదయ్యాయి. ఇది 56 శాతం వృద్ధికాగా.. ప్రపంచంలోనే అత్యధికం!! టాప్‌లో పీఎస్‌యూ ఐపీవోలలో ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఇరెడా) అత్యధికంగా 205 శాతం దూసుకెళ్లి రిటర్నుల జాబితాలో టాప్ ర్యాంకును అందుకుంది. ఈ బాటలో సైయెంట్ డీఎల్ఎమ్ 155 శాతం, నెట్వెబ్ టెక్నాలజీస్ 141 శాతం చొప్పున జంప్‌చేసి తదుపరి స్థానాల్లో నిలిచాయి. టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ లిస్టింగ్‌లో మూడు రెట్లు ఎగసి ప్రస్తుతం 136 శాతం లాభంతో కదులుతోంది. ఇక రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ 128 శాతం ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో 240 ఇష్యూల ద్వారా 60 బిలియన్ డాలర్లు సమీకరించిన చైనా తదుపరి భారత్ అత్యధిక ఐపీవోల మార్కెట్‌గా నిలిచింది. కారణాలున్నాయ్ బలమైన స్థూల ఆర్థిక మూలాలు, రాజకీయ నిలకడ, ఆశావహ కార్పొరేట్ ఫలితాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ పెంపు నిలుపుదల తదితర అంశాలు స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణమైనట్లు పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి రూ. 1.7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు దేశీ మార్కెట్లలోకి ప్రవహించాయి. మరోపక్క గతేడాది సుమారు 2.7 కోట్లమంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలో ప్రవేశించడం గమనార్హం! మధ్య, చిన్నతరహా కంపెనీలు దూకుడు చూపడంతో ఐపీవో ఇండెక్స్ 41 శాతం జంప్‌చేసింది. గతేడాది మార్చిలో నమోదైన కనిష్టం 57,085 పాయింట్ల నుంచి సెన్సెక్స్ డిసెంబర్ 28కల్లా 72,484 పాయింట్లకు పురోగమించింది! -
ఆర్బీఐ పాలసీ, ప్రపంచ పరిణామాలు కీలకం
న్యూఢిల్లీ: వడ్డీరేట్లపై ఆర్బీఐ వెల్లడించే పాలసీ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. కాగా, బుధవారం మహావీర్ జయంతి అలాగే శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లు పని చేయవు. ట్రేడింగ్ మూడు రోజులకు మాత్రమే పరిమితం కానుంది. ఆర్బీఐ పాలసీపై ఫోకస్... ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఏప్రిల్ 6న వెలువడనుంది. దీనిపై ఈ వారం మార్కెట్ ప్రధానంగా దృష్టి పెడుతుందని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారుతున్న ఎఫ్‌పీఐల పెట్టుబడులపై అలాగే దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ)పై కూడా ఫోకస్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక గతేడాది రికార్డు స్థాయి వాహన విక్రయాలను సాధించిన ఆటోమొబైల్ రంగంపైగా మార్కెట్ దృష్టి సారిస్తుందన్నారు. ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పీఎంఐ గణాంకాలు.. ఆర్బీఐ చర్యలతో పాటు ఏప్రిల్3న ఎస్అండ్పీ గ్లోబల్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్ 5న సేవల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ‘దేశీయ అంశాలకు తోడు ప్రపంచ పరిణామాలు, విదేశీ నిధుల ప్రవాహ ధోరణులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. సమీప కాలంలో చూస్తే మార్కెట్ దృష్టి అంతా ఆర్బీఐ పాలసీపైనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఆర్బీఐ నిర్ణయం, పీఎంఐ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్‌హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,462 పాయింట్లు (2.54%) దూసుకెళ్లింది. శుక్రవారం ఒక్కరోజే 1,031 పాయింట్లు ఎగబాకడం విశేషం. బ్యాంకింగ్ సంక్షోభ భయాలు నెమ్మదిగా సద్దుమణుగుతుండటంతో ఆసియా, యూరప్, అమెరికా సూచీలు సైతం గత శుక్రవారం సానుకూలంగా ముగిశాయి. -
బడ్జెట్ ఎఫెక్ట్ : నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
పలు జాతీయ అంతర్జాతీయ అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సింగపూర్ స్టాక్ ఎక్ఛేంజ్ నిఫ్టీ (ఎస్‌జీఎక్స్) నిరాశజనకంగా కొనసాగుతుంటే..వచ్చే వారం ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో యూఎస్ మార్కెట్లో ఓవర్‌నైట్ ట్రేడ్‌లో మిక్స్డ్ ఫలితాలు వెలువరించాయి. దీనికి తోడు దేశీయంగా ప్రస్తుత నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ గడువు ఈరోజు ముగియనుండడంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను మార్చుకునేందుకు మక్కువ చూపడం, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో దేశ ప్రజల చూపంతా ఈ బడ్జెట్ వైపే ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతున్నారు. బుధవారం ఉదయం 9.37గంటలకు సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 60697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95.25 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్,హిందాల్కో,బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం,టాటా మోటార్స్,హెచ్‌యూఎస్,ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అదానీ పోర్ట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్,అపోలో హాస్పిటల్స్,ఎస్బీఐ, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది ప్రారంభ రోజు ఫ్లాటుగా ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి. నిఫ్టీ 18100 పాయింట్లకు పైకి ఎగబాకింది.సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 60,959 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 18,145 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. కానీ కొద్ది సేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 60798 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ అత్యల్పంగా 9 పాయింట్లు నష్టాలవైపు పయనమవుతున్నాయి. నిఫ్టీ -50లో టాటా స్టీల్, హిందాల్కో, టాటామోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఎస్బీఐలు నష్టాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ -50లో టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్,ఓఎన్జీసీ,బీపీసీఎల్ షేర్లు లాభాల వైపు మొగ్గుచూపుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఐరోపాలో తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం, ఐరోపా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయం,అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. అయినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.35గంటల సమయంలో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 59138 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 17629 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. హిందాల్కో,జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఐసీఐసీఐ బ్యాంక్,అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెసీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే, శ్రీ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అథేర్ మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్,అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ, బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవున్నాయి. -
స్టాక్ మార్కెట్: ఆరో రోజుల ర్యాలీకి ‘రిలయన్స్’ బ్రేక్
ముంబై: ఇంధన, ఆటో, టెలికం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బుల్స్ ఆరురోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మూడుశాతానికి పైగా క్షీణించి స్టాక్ సూచీల పతనాన్ని శాసించింది. సెన్సెక్స్ 306 పాయింట్ల తగ్గుదలతో 56వేల దిగువన 55,766 వద్ద స్థిరపడింది. ఈ సూచీ కోల్పోయిన మొత్తం పాయింట్లలో ఒక్క రిలయన్స్ షేరు వాటాయే 252 పాయింట్లు కావడం గమనార్హం. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 16,631 వద్ద నిలిచింది. మరోవైపు మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.845 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.72 కోట్ల షేర్లను అమ్మేశారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ రేపు (బుధవారం) ద్రవ్య పరపతి విధానాలను వెల్లడించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు నీరసంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గడచిన ఆరు సెషన్ల నుంచి సూచీల భారీ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలి సెషన్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 535 పాయింట్లు క్షీణించి 55,537 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 16,564 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్ నుంచి మెటల్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీలు కొంతమేర నష్టాలను తగ్గించుకోగలిగాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్ ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు మూడు శాతం క్షీణించి రూ.2,420 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 4% పతనమై రూ.2,404 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ రూ.55,981 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. ఎక్సే్ఛంజీలో 4.66 లక్షల షేర్లు చేతులు మారాయి. ► ప్రమోటర్లు, ఇన్వెస్టర్ల ఏడాది లాక్–ఇన్ పీరియడ్ గడువు(జూలై 23న) ముగియడంతో జొమాటో షేరు భారీ పతనాన్ని చవిచూసింది. 14%కి పైగా క్షీణించి రూ.46 వద్ద కొత్త జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% నష్టంతో రూ.47.55 వద్ద నిలిచింది. ►క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఇన్ఫీ షేరుకు డిమాండ్ కరువైంది. అరశాతం క్షీణించి రూ.1,502 వద్ద నిలిచింది. చదవండి: Income Tax Day 2022: రూ.14 లక్షల కోట్లు వసూళ్లు చేశాం: నిర్మలా సీతారామన్ -
ఈ వారం స్టాక్ మార్కెట్లు: ఇన్వెస్టర్లు జాక్‌పాట్ కొడతారా? లేదంటే నష్టపోతారా?
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, క్రూడాయిల్ ధరలపై దృష్టి పెట్టొచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సీజన్ ఆరంభం నేపథ్యంలో అప్రమత్తతకు అవకాశం లేకపోలేదంటున్నారు. జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా షార్ట్స్ కవర్ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 179 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్లు స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్లైయితే బుల్స్ రిలీఫ్ ర్యాలీకి అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నా.., గతవారంలో అమ్మకాల ఉధృతి తగ్గడం శుభసూచకం. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి కదలికలు ట్రెండ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ నష్టాల్లో ముగిసినా.., సాంకేతికంగా కీలకమైన మద్దతు 15,750 స్థాయిని నిలుపుకొంది. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,500 వద్ద మద్దతు లభించొచ్చు. ఎగువస్థాయిలో కొనుగోళ్ల జరిగితే 15,900 వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. అటు పిదప 16,170–16,200 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. 1. ఆర్థిక ఫలితాల సీజన్ ఆరంభం టీసీఎస్ శుక్రవారం జూన్(8న) క్వార్టర్ ఆర్థిక గణాంకాలను వెల్లడించి కార్పొరేట్ ఫలితాల సీజన్‌కు తెరతీయనుంది. ‘‘అట్రిషన్ రేటు పెరగడంతో ఐటీ రంగం, మందగమనంతో మౌలికరంగం., సైక్లికల్స్ సెక్టార్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశ కలిగించవచ్చు. అయితే ఆటో, ఎఫ్ఎంసీజీ కంపెనీల గణాంకాలు మెప్పించవచ్చు. కార్పొరేట్ ఫలితాల ప్రకటనకు ముందు స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది’’ అని నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్‌తో పాటు పీటీసీ ఇండియా, జీఎం బేవరీజెస్, మైసూర్ పేపర్ మిల్స్, వక్రంజీ, కోహినూర్ ఫుడ్స్ తదితర కంపెనీలు ఈ వారంలో ఆర్థిక పలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. 2. ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జూన్ ఎస్అండ్పీ గ్లోబల్ తయారీ, సేవారంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. ఇదేవారంలో మంగళవారం యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ, బుధవారం కన్స్ట్రక్షన్ పీఎంఐ, మే మాసపు రిటైల్ అమ్మకాలు వెల్లడి కానున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. రష్యా – ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. -
దూకుడుకు బ్రేకులు.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు బ్రేకులు పడ్డాయి. బుధవారం మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.డాలర్ స్థిరపడటంతో బంగారం ధరలు తగ్గాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా కొనసాగినా..పెట్టుబడి దారులు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. బుధవారం ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 553 పాయింట్లు నష్టపోయి 51979 వద్ద నిఫ్టీ 174 పాయింట్లు నష్ట పోయి 15464 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ఇక మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, హిందాల్కో,ఓఎన్‌సీజీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
కోలుకునేది ఎప్పుడో, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్బీఐ ఆకస్మిక రెపోరేటు పెంపుతో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 927 పాయింట్లు భారీగా నష్టపోయి 54774 వద్ద నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 16401 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.బ్లూడార్ట్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్, అంబీర్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజికీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ తగిలింది. గురువారం ప్రకటించిన అమెజాన్ క్యూ1 ఫలితాలతో గంటల వ్యవధిలో బెజోస్ బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గురువారం అమెజాన్ క్యూ1 ఫలితాల్ని ప్రకటించింది. ఈ ఫలితాల్లో 2015 తర్వాత ఈ ఏడాదిలో అత్యధికంగా 3.84 బిలియన్ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. దీంతో అప్రమత్తమైన షేర్ హోల్డర్లు అమ్మకాలు జరిపారు. ఫలితంగా గంటల వ్యవధిలో ఆ సంస్థ బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఒక్క మార్చి నెలలోనే అత్యంత దారుణంగా ట్రేడింగ్ జరిగిన టెక్నాలజీ షేర్ల విభాగంగా అమెజాన్ షేర్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. బ్లూం బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అమెజాన్ క్యూ1 ఫలితాలు ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ సంపదపై ప్రభావం చూపాయి. గురువారం రోజు అమెజాన్ 14.05 శాతం నష్టపోవడంతో జెఫ్ బెజోస్ గంటల వ్యవధిలో 20.5 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.1.56లక్షల కోట్లు) నష్టపోయారు. కాగా, బ్లూం బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో బెజోస్ సంపద తగ్గి 148.4 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు. చదవండి👉ఫెస్టివల్ సీజన్: ఆన్లైన్ షాపింగ్‌లో ఆఫర్లే ఆఫర్లు! ఇక 'పండగ' చేస్కోండి! -
మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
మార్కెట్ పతనంలో పెట్టుబడులకు అనుకూలమైన స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – శ్వేత మార్కెట్లలో కరెక్షన్ మొదలైన తర్వాత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలను అన్వేషించకూడదు. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు ఎంతో విస్తృతమైన పరిశోధన, కసరత్తు కావాలి. కంపెనీ ఎప్పటికప్పుడు వ్యాపారంలో వృద్ధి నమోదు చేస్తోందా? అని చూడాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ మంచి రేషియోలో ఉందా? అని చూడాలి. రుణభారంతో నెట్టుకొస్తూ ఉండకూడదు. అంటే ఎక్కువ రుణాలు తీసుకుని ఉండకూడదు. కంపెనీని నడిపించే యాజమాన్యం నిధులు పక్కదారి పట్టించకుండా నిజాయతీగా, సమర్థవంతంగా పనిచేసేదై ఉండాలి. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీ డబ్బులను వేరే వారికి అప్పగిస్తున్నట్టుగా భావించాలి. అందుకే కంపెనీని నడిపించే వ్యక్తులు విశ్వసనీయత కలిగి ఉండాలి. ఇవన్నీ ఒక కంపెనీలో గుర్తిస్తే ఆకర్షణీయమైన ధర వద్ద షేరులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు గుర్తించింది గొప్ప కంపెనీ అవుతుంది. అయితే, సహేతుక ధర వద్దే కానీ, ఖరీదైన ధరలో కొనుగోలు చేస్తే రాబడులు కష్టం కావచ్చు. ఇలాంటి నాణ్యత అంశాలతో కూడిన కంపెనీలను గుర్తించినప్పుడు వాటిని వాచ్ లిస్ట్ (పరిశీలన జాబితా)లో పెట్టుకోవాలి. వాల్యూరీసెర్చ్ పోర్టల్‌పై వాచ్‌లిస్ట్ పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే మంచి ఫలితాలనిస్తుందని నేను భావిస్తున్నాను. విజయవంతమైన ఇన్వెస్టర్లలో నేను గుర్తించిన అసాధారణ అంశం ఇది. కానీ, ఇందుకు ఎంతో ఓపిక ఉండాలి. మీరు గుర్తించిన కంపెనీలు ఖరీదైన వ్యాల్యూషన్లలోనే ఎక్కవ రోజుల పాటు ట్రేడ్ కావచ్చు. కానీ, మీరు అనుకున్న ధరకు దిగొచ్చే వరకు వేచి చూడాలి. మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – నవీన్ మార్కెట్లలో ఇప్పుడు అస్థిరతలు కనిపిస్తున్నాయి. ముందు కూడా అస్థిరతలు ఉన్నాయి. భవిష్యత్తులో మరింత ఎక్కువగానూ ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టొచ్చు. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో రక్షణ కల్పించుకోవాలి. సమీప కాలంలో మార్కెట్లపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు, ఏడేళ్ల వరకు అవసరం కానివి అయి ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ అమల్లో పెట్టిన తర్వాత, క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారు అయి ఉండి, పెట్టుబడులు పెట్టాలనుకునే సమయంలో మార్కెట్లలో అస్థిరతలు ఉంటే వాటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి?– రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమాకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విషయానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి?– రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమాకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విషయానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పడిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా
ముంబై: విదేశీ ఇనిస్టిట్యూషన్స్ భారత స్టాక్స్‌లో పెట్టుబడులను గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గించుకున్నాయి. 2020–21లో 23 బిలియన్ డాలర్లు (రూ.1.72 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయగా.. 2021–22లో కేవలం 3.7 బిలియన్ డాలర్లు (రూ.27,750 కోట్లు) పెట్టుబడులకే పరిమితమయ్యాయి. దీంతో ఎన్ఎస్ఈ 500 కంపెనీల్లో వాటి మొత్తం మొత్తం వాటాలు 19.9 శాతానికి, 582 బిలియన్ డాలర్ల విలువకు (రూ.43.65 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ వారం ఆరంభం వరకు చూస్తే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల ఉపసంహరణ 14.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో మార్చి నెలలోనే 5.4 బిలియన్ డాలర్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో 4.7 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. మరింత వివరంగా.. ► 2022 మార్చి 15 నాటికి ఎఫ్‌పీఐల హోల్డింగ్స్ విలువ 582 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021 సెప్టెంబర్‌లో ఇది 667 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ► ఐటీ రంగంలో ఎఫ్‌పీఐల వాటాలు 0.87 శాతం పెరిగి 15 శాతానికి, ఇంధన రంగ కంపెనీల్లో 0.44 శాతం పెరిగి 15.5 శాతానికి, హెల్త్‌కేర్ రంగంలో 0.22 శాతం పెరిగి 4.9 శాతానికి చేరాయి. ► ఫైనాన్షియల్ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల పెట్టుబడులు 1.07 శాతం తగ్గి 31.5 శాతానికి పరిమితం అయ్యాయి. డిస్క్రీషనరీ కంపెనీల్లో 0.49 శాతం తగ్గి 9.1 శాతం మేర ఉన్నాయి. ► దేశీ ఇనిస్టిట్యూషన్స్ ఎన్ఎస్ఈ కంపెనీల్లో 2022 ఫిబ్రవరి నాటికి 265 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కలిగి ఉన్నాయి. 13.1 బిలియన్ డాలర్లను తాజాగా కేటాయించాయి. ► ఎఫ్‌పీఐల వాటాల విలువ 2021–22 మొదటి త్రైమాసికం నాటికి 667 బిలియన్ డాలర్లుగా ఉంటే, అక్కడి నుంచి 112 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. ► దేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చురుగ్గా పెట్టుబడులు పెడుతుండడం వల్లే మార్కెట్లు మరీ పతనాన్ని చూడలేదని బ్యాంకు ఆప్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. ► 2022 మార్చిలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల నుంచి 5.4 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. వరుసగా ఆరో నెలలోనూ వారు పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించారు. దీంతో మొత్తం మీద ఆరు నెలల్లో 14.6 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ► దేశీ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటాలు 2020 డిసెంబర్లో 21.4 శాతం స్థాయిలో ఉన్నాయి. అక్కడి నుంచి 19.9 శాతానికి దిగొచ్చాయి. -
కనక వర్షం కురిపిస్తున్న ఆ టాటా కంపెనీ షేర్లు..!
స్టాక్ మార్కెట్ అనేది ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామం. కలలో కూడా ఊహించని లాభాలని నిజజీవితంలో తెచ్చిపెడతాయి. ఓపిక, తెలివి ఉండాలగానే కొద్ది కాలంలోనే కరోడ్ పతి కావచ్చు. అయితే, ఇలాంటి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో కొన్ని స్టాక్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలుస్తున్నాయి. ఊహించని రీతిలో రిటర్నులను అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో చెప్పినట్టు ఒక్క ఏడాదిలో కోటీశ్వరుడు కావడానికి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. అయితే, ఇందులో ఏదైనా తేడా జరిగిన కూడా బికారి అవ్వడం కూడా ఖాయం. ఇది అలా ఉంటే.. ఒక కంపెనీ షేర్లు మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. వాళ్లు ఊహించని రీతిలో లాభాలు తెచ్చిపెడుతుంది. ఆ కంపెనీ పేరు వచ్చేసి టాటా ఎలెక్సి లిమిటెడ్(Tata Elxsi stock). ఈ కంపెనీ షేరు ధర నేడు బీఎస్ఈలో 7.55 శాతం పెరిగి రూ.9,078 వద్ద తాజా గరిష్టాన్ని తాకింది. గత రెండు రోజుల్లో లార్జ్ క్యాప్ స్టాక్ 17.18 శాతం లాభపడింది. కేవలం ఇవ్వాళ ఒక్కరోజే ఈ షేర్ విలువ రూ.571 పైగా లాభపడింది. టాటా ఎలెక్సి నేడు రూ.9,010 వద్ద ఉంది. అయితే, కరోనా వచ్చిన ఏడాది మార్చి నెలలో దీని స్టాక్ ధర మీరు షాక్ అవ్వాల్సిందే. 2020 మార్చి 27 తేదీన దీని ధర అప్పుడు రూ.639.10లుగా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ కంపెనీ షేర్ విలువ 14 రేట్లకు పైగా పెరగడం విశేషం. అంటే.. 2020 మార్చిలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.14 లక్షలుగా మారనుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు విలువ 52.19 శాతం లాభపడగా, ఏడాదిలో 237.07 శాతం పెరిగింది. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.55,812 కోట్లకు పెరిగింది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. పెరగనున్న గృహ ధరలు!) -
ఉక్రెయిన్- రష్యా యుద్ధం: ఈ వారం స్టాక్ మార్కెట్ల దారెటు?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు తేదీ, మార్చి వాహన విక్రయాలు గణాంకాలు, కీలక ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. ఇక అంతర్జాతీయంగా ఉక్రెయిన్–రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, నిరంతర పెరుగుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్‌పైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘గత కొన్ని ట్రేడింగ్ సెషన్ల నిఫ్టీ 17,000–17,450 పాయింట్ల రేంజ్లో కదలాడుతోంది. ఈ శ్రేణిని చేధిస్తేనే తదుపరి స్థాయిలను అంచనా వేయవచ్చు’’ అని నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 502 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లను నష్టాలను చవిచూశాయి. దీంతో సూచీల రెండువారాల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు.... రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. శాంతి చర్చలు క్లిష్టం గా సాగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. జీ–20 కూటమి నుండి రష్యాను బహిష్కరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతామని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కాల్పుల విరమణ చర్చల సఫలవంతం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కీలకంగా ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఫిబ్రవరి ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల మధ్య బేధం) గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. అదేరోజున మౌలిక రంగాల వృద్ధిగా పిలిచే ఎనిమిది రంగాల ఉత్పత్తి(ఫిబ్రవరి)డేటా వెల్లడి అవుతుంది. దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం మార్చి నెలతో గతేడాది పాటు 2021 ఆర్థిక సంవత్సరపు వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. ఈ కీలకమైన ఈ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(మార్చి 31న) నిఫ్టీ సూచీకి చెందిన మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు ఆటంకం కలుగవచ్చనే అంచనాల నడుమ ఇప్పటికే క్రూడాయిల్ ధర భారీ పెరిగాయి. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వినియోగ విశ్వాస, నిరుద్యోగ, చమురు నిల్వల డేటాతో పాటు కీలకమైన క్యూ4 జీడీపీ గణాంకాలు ఈ వారంలో విడుదల అవుతాయి. జపాన్ నిరుద్యోగ గణాంకాలు మంగవారం, యూరోజోన్ పారిశ్రామిక డేటా బుధవారం వెల్లడికానున్నాయి. వీటితో పాటు ఆయా దేశాలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కదలాడవచ్చు. మూడు నెలల్లో రూ.లక్ష కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి.. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో భారత మూలధన మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన మూడునెలల్లో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎఫ్ఐఐలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా రూ.28,526 కోట్లు, రూ.38,068 కోట్లు, రూ.48,261 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాం కాలు వెల్లడించాయి. ‘‘ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతులు తక్కువగా ఉంటడంతో యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పరిమితంగానే ఉంది. అయితే అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఇంధన, మెటల్స్, వ్యవసాయ తదితర కమోడిటీ ఉత్పత్తుల ధరలు దేశీయ కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయి’’ కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ సుబానీ కురియన్ తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పదిశాతం పెరిగితే దేశీయ కరెంట్ అకౌంట్ ద్రవ్యలోటు 30 బేసిస్ పాయింట్ల, సీపీఐ ద్రవ్యోల్బణం 40 బేసిస్ పాయింట్లు మేర పెరగవచ్చని కురియన్ పేర్కొన్నారు. -
యుద్ధం, కోవిడ్–19పై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ అంశాలపై అధికంగా ఆధారపడనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అధిక శాతం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశమున్నట్లు అత్యధికులు అంచనా వేశారు. దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడం దీనికి కారణంకాగా.. రష్యా– ఉక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న యుద్ధం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క ఇటీవల చైనాలో తలెత్తిన కోవిడ్–19 కొత్త వేరియంట్ కొన్ని యూరోపియన్ దేశాలకూ విస్తరించనున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయవచ్చని తెలియజేశారు. ఈ నెల 14న ప్రారంభమైన బడ్డెట్ రెండో దశ చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు. ఎఫ్‌పీఐల ఎఫెక్ట్ గత కొద్ది రోజులుగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపనున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం మార్కెట్లు ర్యాలీ బాటలో సాగవచ్చని చెబుతున్నారు. దేశీయంగా ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ సంకేతాలే మార్కెట్లను నడిపించవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరోనా పరిస్థితులు, చమురు ధరల కదలికలు వంటివి కీలకమని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితులు ముదరడం, కోవిడ్–19 సవాళ్లు పెరగడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చని తెలియజేశారు. చమురు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నెల మొదటి వారంలో 130 డాలర్లను అధిగమించి 2008 తదుపరి గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. 75.5–76 స్థాయిలో కదులుతోంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను దేశీ ఇండెక్సులు అనుసరించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. దేశీ ఆర్థిక పరిస్థితులను చమురు ధరలు ప్రభావితం చేయగలవని, దీంతో వీటి కదలికలను ఇన్వెస్టర్లు సునిశితంగా పరిశీలించే వీలున్నదని వివరించారు. భారత్ భేష్ వర్థమాన మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ చేశాయని, దీంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లవైపు దృష్టిపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లు మరింత పురోగమించేందుకు దారిచూపవచ్చని విశ్లేషించారు. అంతేకాకుండా మార్కెట్లు ఇప్పటికే యుద్ధ భయాలను డిస్కౌంట్ చేశాయన్నారు.. కాగా.. సమీపకాలంలో దేశీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చన్నది కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఈక్విటీ హెడ్ హేమంత్ అంచనా. గత వారం స్పీడ్ గత శుకవ్రారం(18న) హోలీ సందర్భంగా సెలవుకావడంతో 17తో ముగిసిన వారంలో దేశీ స్టాక్ మార్కెట్లు 4 శాతం జంప్‌చేశాయి. సెన్సెక్స్ 2,314 పాయింట్లు దూసుకెళ్లి 57,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 657 పాయింట్లు జంప్‌చేసి 17,287 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 2 శాతంపైగా ఎగశాయి. -
ఆరంభం అదిరింది
ముంబై: కొత్త ఏడాది తొలిరోజు కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. దీంతో సూచీలు ఈ ఏడాది(2022)కి లాభాలతో స్వాగతం పలికాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మన మార్కెట్లు సానుకూలతలను అందిపుచ్చుకున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. దేశీయంగా డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు, నెలవారీ వాహన విక్రయ గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి రికవరీ కలిసొచ్చింది. దేశంలో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈ పరిణామాలతో ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా.., ఇన్వెస్టర్లు రిస్క్ వైఖరి ప్రదర్శిస్తూ కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 929 పాయింట్లు పెరిగి డిసెంబర్ 13వ తేదీ తర్వాత తొలిసారి 59వేల స్థాయి పైన 59,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు ర్యాలీ చేసి 17,626 వద్ద నిలిచింది. తద్వారా మూడు వారాల్లో సూచీలు అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. అలాగే సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న బ్యాంకింగ్ షేర్లలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగాయి. చిప్ కొరత కష్టాలను అధిగమిస్తూ వాహన కంపెనీలు పరిశ్రమ అంచనాలకు మించి అమ్మకాలను సాధించడంతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.903 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడే నష్టాలను రికవరీ చేసుకొని రూపాయి మూడు పైసలు బలపడి 74.26 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఆర్థిక రివకరీ ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఏడాది తొలి సెషన్లో లాభాల బాటపట్టాయి. బ్రిటన్, చైనా, జపాన్ ఆస్ట్రేలియా మార్కెట్లకు సెలవు. గతేడాదిలో 27 శాతం లాభాల్ని పంచిన అమెరికా మార్కెట్లు అదే జోష్‌ను కనబరుస్తూ లాభాలతో కదలాడుతున్నాయి. రోజంతా లాభాలే... స్టాక్ సూచీలు 2022 ఏడాది తొలి రోజు ట్రేడింగ్‌ను లాభాలతో మొదలుపెట్టాయి. సెన్సెక్స్ 56 పాయింట్ల లాభంతో 58,310 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 17,387 వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విస్తృత కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,012 పాయింట్లు ర్యాలీ చేసి 59,266 వద్ద, నిఫ్టీ 293 పాయింట్లు దూసుకెళ్లి 17,647 వద్ద గరిష్టాల తాకాయి. ఇవి సూచీలకు ఆరు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చివరిదాకా కొనుగోళ్లకే కట్టబడటంతో సూచీలు ఏ దశలో వెనకడుగు వేయలేదు. రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో కొత్త ఏడాది తొలి రోజు రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.269 లక్షల కోట్లుగా నమోదైంది. ‘వ్యాక్సిన్ వేగవంతం చర్యల నుంచి బుల్ జోష్‌ను అందిపుచ్చుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. కోవిడ్ సంబంధిత వార్తలు, ప్రపంచ మార్కెట్ల తీరు రానున్న రోజుల్లో సూచీ ల గమనాన్ని నిర్దేశిస్తాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ వరుసగా మూడో రోజూ బలపడటం ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీ సాంకేతికంగా అప్‌ట్రెండ్‌లో 17,750 స్థాయి వద్ద కీలక నిరోధం ఉండొచ్చు’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు n డిసెంబర్లో ఉత్పత్తి పెరిగిందనే కంపెనీ ప్రకటనతో కోల్ ఇండియా షేరు ఆరు శాతానికి పైగా లాభపడి రూ.155 వద్ద స్థిరపడింది. n ఎన్సీడీల ద్వారా రూ.456 కోట్లను సమీకరించడంతో ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ షేరు ఐదుశాతం పెరిగి రూ.75 వద్ద ముగిసింది. n ఐటీ షేర్లలో భాగంగా టీసీఎస్ షేరు రాణించింది. బీఎస్ఈలో రెండు శాతం లాభపడి రూ.3,818 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రెండున్నర ర్యాలీ చేసి రూ.3829 వద్ద 13 వారాల గరిష్టాన్ని అందుకుంది. -
షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు
ముంబై: స్టాక్ సూచీలు నవంబర్ సిరీస్‌కు లాభాలతో వీడ్కోలు పలికాయి. డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల జరగడంతో గురువారం సెన్సెక్స్ 454 పాయింట్లు పెరిగి 58,795 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 17,536 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు ఆరుశాతం రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. మూడీస్‌తో సహా పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ రేటింగ్‌కు సవరించడంతో సెంటిమెంట్ మరింత బలపడింది. ఇంధన, ఫార్మా, ఐటీ, మీడియా, మెటల్, రియల్టీ, షేర్లు లాభపడ్డాయి. నవంబర్ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ట్రేడర్లు తమ పొజిషన్లను మార్చుకోనే (స్క్యేయర్ ఆఫ్, రోలోవర్) క్రమంలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2300 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1368 కోట్ల షేర్లను కొన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో షేర్లు నష్టపోయాయి. వీలైనంత తొందర్లో ఉద్దీపన ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్‌లో తెలపడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు బలపడి 74.52 వద్ద స్థిరపడింది. తడబడినా.., నిలబడ్డాయ్..! ఒకరోజు నష్టం తర్వాత స్టాక్ మార్కెట్ ఉదయం స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్ ఉదయం 23 పాయింట్ల లాభంతో 58,364 వద్ద, నిఫ్టీ రెండు పాయింట్ల పెరిగి 17,417 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని బలహీనతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో తొలి అరగంటలోనే సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 198 పాయింట్లును కోల్పోయి 58,143 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు పతనమైన 17,352 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. మిడ్‌సెషన్ నుంచి రిలయన్స్ షేరు జోరు కనబరచడంతో పాటు ట్రేడర్లు షార్ట్ కవరింగ్ చేపట్టడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మార్కెట్ ముగిసే వరకు ట్రేడర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సూచీలు లాభాల్లో ముగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు... సౌదీ ఆరాంకో ఒప్పంద రద్దుతో ఈ వారం ఆరంభం నుంచి నష్టాలను చవిచూస్తున్న రిలయన్స్ షేరు గురువారం భారీగా పెరిగింది. షార్ట్ కవరింగ్ జరగడంతో షేరు ఇంట్రాడేలో ఆరున్నర శాతం ర్యాలీ చేసి రూ.2503 స్థాయిని అందుకుంది. చివరికి 6% లాభపడి రూ.2,494 వద్ద ముగిసింది. గ్యాసిఫికేషన్ అండర్‌టేకింగ్‌ను పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థకి బదిలీ చేసేందుకు బోర్డు నిర్ణయించుకోవడం కూడా షేరు ర్యాలీకి కలిసొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► యాంకర్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పేటీఎం షేరు మూడోరోజూ ర్యాలీ చేసింది. బీఎస్ఈలో రెండుశాతం ర్యాలీ చేసి రూ.1797 వద్ద ముగిసింది. ► బైబ్యాక్ ప్రణాళికకు బోర్డు ఓకే చెప్పొచ్చనే అంచనాలతో వేదాంత షేరు ఆరుశాతం లాభపడి రూ.368 వద్ద స్థిరపడింది. ► సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడంతో సీమైన్స్ షేరు ఐదున్నర శాతం నష్టంతో రూ.2152 వద్ద నిలిచింది. -
7వ రోజూ భలే దూకుడు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో అలుపెరుగకుండా రంకెలేస్తున్న బుల్ మరోసారి విజృంభించింది. సూచీలు వరుసగా 7వ రోజూ హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు ఎగసి 61,766 వద్ద నిలవగా.. నిఫ్టీ 139 పాయింట్లు ఎగసి 18,477 వద్ద ముగిసింది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 61,963కు చేరగా.. నిఫ్టీ 18,543 పాయింట్లను అధిగమించింది. వెరసి అటు ముగింపు, ఇటు ఇంట్రాడేలోనూ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి! విదేశీ మార్కెట్లలో కనిపిస్తున్న నిరుత్సాహకర ట్రెండ్‌ను సైతం లెక్కచేయకుండా సరికొత్త గరిష్టాలను చేరాయి. ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 4 శాతం జంప్‌చేయగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ నేపథ్యంలో ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా ఇండెక్సులు 0.7% బలహీనపడ్డాయి. ఇన్ఫోసిస్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఇన్ఫోసిస్ 5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, మారుతీ, యాక్సిస్, ఎస్బీఐ 3.3–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటో, సిప్లా, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా 2–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. ఈ ఏడాది క్యూ3(జులై–సెప్టెంబర్)లో చైనా జీడీపీ గణాంకాలు నిరాశపరచినప్పటికీ ఎంపిక చేసిన రంగాలలోని బ్లూచిప్ కౌంటర్లలో పెట్టుబడులు సెంటిమెంటుకు బలాన్నిచి్చనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. క్యూ3లో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతమే పుంజుకుంది. ఇందుకు పారిశ్రామికోత్పత్తి అంచనాలను అందుకోకపోవడం ప్రభావం చూపింది. బేస్ మెటల్ ధరలు బలపడటంతో మెటల్ షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. చిన్న షేర్లు ఓకే... బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం స్మాల్ క్యాప్ 0.7 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,758 లాభపడగా.. 1,696 నీరసించాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 512 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ఇతర విశేషాలు.. ► పారస్ డిఫెన్స్ షేరు టీ గ్రూప్ నుంచి రోలింగ్ విభాగంలోకి బదిలీ కావడంతో 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 125 జమ చేసుకుని రూ. 750 వద్ద ముగిసింది. ► ఈ ఏడాది క్యూ2లో రెట్టింపు నికర లాభం ప్రకటించిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) షేరు తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 5,900ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివర్లో లాభాల స్వీకరణ ఊపందుకుని చతికిలపడింది. 7.6% పతనమై రూ. 4,920 వద్ద స్థిరపడింది. ► కార్లయిల్ గ్రూప్‌నకు ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చుకునే ప్రతిపాదనను విరమించుకోవడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్‌కు చేరింది. ఎన్ఎస్ఈలో రూ. 32 కోల్పోయి రూ. 607 వద్ద నిలిచింది. ► ఏడు వరుస సెషన్లలో మార్కెట్లు బలపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 12.49 లక్షల కోట్లమేర ఎగసింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,74,69,607 కోట్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం! ► గత ఏడు రోజుల్లో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,576 పాయింట్లు(4.4 శాతం) దూసుకెళ్లింది. -
9 నెలల్లో రెండు దశాబ్దాల రికార్డ్
న్యూఢిల్లీ: బుల్లిష్‌గా ఉన్న ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రతిబింబిస్తూ దేశీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఈ కేలండర్ ఏడాది(2021) తొలి 9 నెలల్లో 72 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా జనవరి– సెపె్టంబర్ మధ్య కాలంలో 970 కోట్ల డాలర్ల(రూ. 72,500 కోట్లు)ను సమీకరించాయి. వెరసి రెండు దశాబ్దాల తదుపరి అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రోత్సాహకర పరిస్థితులు దోహదం చేసినట్లు కన్సలి్టంగ్ కంపెనీ ఈవై తాజాగా రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ ట్రెండ్ మద్దతుతో దేశీయంగా క్యూ3(జులై–సెపె్టంబర్)లో లావాదేవీల సంఖ్య మరింత జోరందుకుంది. 72 ఐపీవోలలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల విభాగం నుంచి 15, కన్జూమర్ ప్రొడక్ట్స్ రిటైల్ విభాగం నుంచి 11 చొప్పున కంపెనీలు నిధులను సమీకరించాయి. 31 ఐపీవోలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 31 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా 5 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వీటిలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల నుంచి 8 కంపెనీలు, టెక్నాలజీ విభాగం నుంచి 5 సంస్థలు పెట్టుబడులను సమీకరించాయి. ఈ రంగాల నుంచి జొమాటో, నువోకో విస్టాస్ కార్ప్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ భారీ ఇష్యూలను చేపట్టాయి. 2017 నాలుగో త్రైమాసికం తదుపరి దేశీ మార్కెట్లో ఈ క్యూ3 అత్యధిక లావాదేవీలకు నెలవైనట్లు ఈవై నిపుణులు ప్రశాంత్ సింఘాల్ తెలియజేశారు. కాగా.. ఇంతక్రితం 2018 తొలి 9 నెలల్లో ప్రైమరీ మార్కెట్ ద్వారా 130 కంపెనీలు నిధులను అందుకున్నాయి. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లోనూ కొత్తతరం, టెక్నాలజీ ఆధారిత కంపెనీలు ఐపీవోలకు రానున్నట్లు సింఘాల్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల సెన్సెక్స్ 60,000 పాయింట్ల మార్క్‌ను సైతం అధిగమించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జులై–సెపె్టంబర్లో 2020 క్యూ3తో పోలిస్తే డీల్స్ 11 శాతం అధికమయ్యాయి. 2007లో నమోదైన గరిష్ట డీల్స్‌తో పోలిస్తే మరింత అధికంగా 18 శాతం పుంజుకున్నాయి. 2021 క్యూ3లో 547 ఐపీవోల ద్వారా కంపెనీలు 106.3 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్నాయి. తొలి 9 నెలల్లో చూస్తే 1,635 కంపెనీలు 331 బిలియన్ డాలర్ల విలువైన పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది కంపెనీలలో 87 శాతం, పెట్టుబడుల సమీకరణలో 99 శాతం వృద్ధి. తొలి 9 నెలల్లో ప్రపంచవ్యాప్త ఐపీవో సమీకరణ నిధుల్లో 3 శాతం(9.7 బిలియన్ డాలర్లు) వాటాను దేశ మార్కెట్ ఆక్రమించింది. ఐపీవోల సంఖ్యలో అయితే 4.4 శాతానికి చేరింది. ఇక గ్లోబల్ మార్కెట్లలోనూ 2020 పూర్తి ఏడాదితో పోలిస్తే క్యూ3లో డీల్స్తోపాటు, నిధుల సమీకరణ అత్యధికంగా నమోదుకావడం విశేషం! -
ఆర్బీఐ అండతో 60 వేల పైకి..
ముంబై: ఆర్థిక వృద్ధికి కట్టుబడుతూ ఆర్బీఐ కమిటీ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌ను మెప్పించాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 60 వేల స్థాయిపైన 60,059 వద్ద ముగిసింది. నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 17,895 వద్ద నిలిచింది. తాజా ముగింపు నిఫ్టీ సూచీకి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు నాలుగు శాతానికి పైగా రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు టెక్నాలజీ షేర్లు దుమ్ములేపాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో షేర్ల కౌంటర్లూ కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.64 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు 168 కోట్ల షేర్లను అమ్మారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1293 పాయింట్లు, నిఫ్టీ 363 పాయింట్లు పెరిగాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడికి ముందు(శుక్రవారం) అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయి. రెండు రోజుల్లో రూ.4.16 లక్షల కోట్లు... స్టాక్ మార్కెట్లో గడిచిన రెండో రోజుల్లో రూ.4.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.266.36 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 869 పాయింట్లు, నిఫ్టీ 249 పాయింట్లు పెరిగింది. రిలయన్స్ నాలుగు శాతం జంప్... అమెరికాకు చెందిన 7–లెవెన్ కనీ్వనియెన్స్ తొలి స్టోర్‌ను అక్టోబర్ 9న ముంబైలో ప్రారంభించనున్నట్లు అనుబంధ సంస్థ ఆర్ఆర్వీఎల్ ప్రకటనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు నాలుగు శాతం లాభపడి రూ.2,671 వద్ద ముగిసింది. -
కంపెనీల్లో మోసాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయ్
ముంబై: ఇటీవల ఓవైపు ఈక్విటీలలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుంటే.. మరోపక్క కంపెనీలలో మోసాలు సైతం అధికంగా బయటపడుతున్నట్లు సెబీ అధికారి ఎస్కే మొహంతీ పేర్కొన్నారు. ఇది ప్రమాదకర ట్రెండ్ అంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ మొహంతీ వ్యాఖ్యానించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో భాగంగా ప్రసంగిస్తూ వీటికి చెక్ పెట్టవలసిన అవసరమున్నదని స్పష్టం చేశారు. క్రోల్ పాయింట్స్ నిర్వహించిన ఒక సర్వేను ప్రస్తావిస్తూ ఈ ఏడాది 65 శాతం కంపెనీలలో మోసాలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో 1.5 కోట్లమంది కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు ప్రవేశించినట్లు తెలియజేశారు. రిటైలర్లు పెట్టుబడుల కొనసాగింపులో సహనంతో వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే మోసాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు చాలా చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. దీంతో ఇన్వెస్టర్లలో చైతన్యం, అవగాహన, విజ్ఞానం వంటి అంశాలను పెంపొందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. మోసాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయడంతోపాటు, పెట్టుబడుల విలువనూ దెబ్బతీస్తాయని మొహంతీ వివరించారు. షేర్ల ధరలపై ప్రభావం చూపగల సమాచారాన్ని పొందడం ద్వారా కొంతమంది తమకు సంబంధించిన వ్యక్తులు లబ్ది పొందేందుకు సహకరిస్తుంటారని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు ఇకముందు మరింత పెరిగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. అయితే మోసాలకు పాల్పడేవారికి చెక్ పెట్టే బాటలో సెబీ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగానే సాధారణ దర్యాప్తు విభాగం నుంచి గతేడాది కార్పొరేట్ మోసాల పరిశోధన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐబీ వెంచర్స్‌కు జరిమానా ఇండియాబుల్స్ వెంచర్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఒక సంస్థతోపాటు.. కంపెనీ సీఈవోసహా నలుగురికి సెబీ జరిమానా విధించింది. కంపెనీ షేర్లకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల కేసు సెటిల్మెంట్ చార్జీల కింద రూ. 5 కోట్ల జరిమానా చెల్లించమంటూ ఆదేశించింది. సెటిల్మెంట్కు దరఖాస్తు చేసుకున్నవారిలో కంపెనీ సీఈవో దివ్యేష్ బి.షాతోపాటు మరో ముగ్గురు బంధువులున్నారు. అంతేకాకుండా విక్రమ్ ఎల్ దేశాయ్ హెచ్‌యూఎఫ్ సైతం దరఖాస్తు చేసింది. 2018 ఏప్రిల్ 2–23 మధ్య కంపెనీ ఆర్థిక ఫలితాలు, డివిడెండ్ అంశంలో సమాచారాన్ని దుర్వినియోగ పరచినట్లు దర్యాప్తు వెల్లడించింది. సెలిబ్రస్ కమోడిటీస్‌కు షాక్ జాతీయ స్పాట్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈఎల్)లో చట్ట విరుద్ధంగా కాంట్రాక్టులు చేపట్టేందుకు క్లయింట్లను అనుమతించిన కేసులో సెలిబ్రస్ కమోడిటీస్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. కాంట్రాక్టులను అనుమతించడంలో నిబంధనలకు నీళ్లొదిలి అవకతవకలకు పాల్పడటంతో రిజిస్ట్రేషన్ రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్ఎస్ఈలో సభ్యత్వం కలిగిన బ్రోకింగ్ సంస్థ సెలిబ్రస్ కమోడిటీస్ పెయిర్డ్ కాంట్రాక్టుల నిర్వహణకు అనుమతులు పొందింది. -
మరో సంచలనం.. బాహుబుల్ 60000
ముంబై: స్టాక్ మార్కెట్లో శుక్రవారం మరో సంచలనం చోటుచేసుకుంది. సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్లలో సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. కొంతకాలంగా దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. ఆర్బీఐ సరళతర ద్రవ్య విధానానికి కట్టుబడింది. ప్రపంచ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్‌తో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం అన్ని రంగాలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. దీంతో దలాల్ స్ట్రీట్ కొన్ని వారాలుగా కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ కొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. మార్కెట్లో పండుగ వాతావరణం... దేశీయ మార్కెట్లోని సానుకూలతలతో స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 60 వేలపైన 60,159 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 17,897 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలు ఆరంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించడంతో స్టాక్ మార్కెట్లలో పండుగ వాతావరణం కనిపించింది. ఆటో, ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ మిడ్‌సెషన్‌లో కొంతసేపు మినహా రోజంతా 60 వేల స్థాయిపైనే ఉంది. ఇంట్రాడేలో 448 పాయిం ట్లు పెరిగి వద్ద 60,315 జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. చివరికి 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 వేల స్థాయిని అందుకునే ప్రయత్నం చేసినా... గరిష్టాల వద్ద నిరోధం ఎదురవడంతో ఈ స్థాయిని అందుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్‌లో 125 పాయింట్లు పెరిగి 17,948 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు ఆరంభలాభాల్ని కోల్పో యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.422 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సూచీలకు ఐదోవారామూ లాభాలే... బుల్ రన్లో భాగంగా సూచీలు ఐదోవారమూ లాభాలను గడించాయి. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% చొప్పున ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1033 పాయింట్లు, నిఫ్టీ 268 పాయింట్లు ఎగిశాయి. సెన్సెక్స్ 60,000 స్థాయిని అందుకోవడమనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కోవిడ్ సమయంలో సంపన్న దేశాలు అనుసరించిన సరళీకృత ద్రవ్యపాలసీ విధాన వైఖరి, వడ్డీరేట్ల సడలింపు తదితర అవకాశాలను అందిపుచ్చుకున్న భారత్ ప్రపంచంలో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది. – అశిష్‌కుమార్ చౌహాన్, బీఎస్ఈ ఎండీ, సీఈవో -
మార్కెట్‌కు ఫెడ్ బూస్ట్
ముంబై: దలాల్ స్ట్రీట్ గురువారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొనుగోళ్ల అండతో ట్రేడింగ్ ఆద్యంతం ఉత్సాహాంగా ఉరకలేసింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో స్టాక్ సూచీలు నాలుగు నెలల్లో అత్యధిక లాభాల్ని ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ 23 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల కౌంటర్లకు డిమాండ్ నెలకొనడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 1030 పాయింట్లు పెరిగి 59,957 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ 297 పాయింట్లు ఎగసి 17,844 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 276 పాయింట్ల లాభంతో 17,823 వద్ద స్థిరపడింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ షేర్లు వంటి లార్జ్‌క్యాప్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,173 కోట్ల షేర్లను కొన్నారు. డాలరు మారకంలో రూపాయి విలువ 73.64 వద్ద నిలిచింది. రాకెట్లా దూసుకెళ్లిన సూచీలు... ఆసియా మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న దేశీయ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 59,358 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 17,671 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బుల్ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ వంటి కీలక రంగాల షేర్లకు డిమాండ్ లభించడంతో సూచీలు రాకెట్లా దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1030 పాయింట్లు, నిఫ్టీ 297 పాయింట్లను ఆర్జించగలిగాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీల లాభాలకు కారణాలివే... చైనా ఎవర్ గ్రాండే సంక్షోభంపై గ్రూప్ చైర్మన్ హుయి కా యువాన్ వివరణ ఇచ్చారు. ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చైనా పీపుల్స్ బ్యాంక్ 17 బిలియన్ డాలర్లను చొప్పించింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లే యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బాండ్ల కొనుగోళ్లను నవంబర్ నుంచి తగ్గిస్తామనే ఫెడ్ నిర్ణయాన్ని ఈక్విటీ మార్కెట్లు అప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితిని తొలగించి సానుకూలతలను నెలకొల్పాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇటీవల కేంద్రం పలు రంగాల్లో సంస్కరణల పర్వానికి తెరతీయడం మార్కెట్‌కు జోష్ నిచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపుతుండటం మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుంది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బీఎస్ఈలో ఐదున్నర శాతం నష్టపోయి రూ.318 వద్ద ముగిసింది. ► యూఎస్ సంస్థ బ్లింక్ను కొనుగోలు చేయడంతో ఎంఫసిస్ షేరు మూడు శాతం ర్యాలీ చేసి రూ.3,339 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.3392 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి 500 సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి ఆర్డర్లను దక్కించుకోవడంతో జేఎంబీ ఆటో షేరు 12 శాతం లాభపడి రూ.516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 17 శాతం ర్యాలీ చేసి రూ.537 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ఒక్క రోజులో రూ.3.16 లక్షల కోట్లు ప్లస్ సూచీలు నాలుగునెలల్లో అతిపెద్ద ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.3.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.261.73 లక్షల కోట్లకు చేరింది. -
ఈ వారం స్టాక్ మార్కెట్.. ప్రపంచ పరిణామాలే కీలకం
ముంబై: దేశీయంగా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం సూచీలకు ప్రపంచ పరిణామాలే దిశా నిర్ధేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశం మంగళవారం(సెప్టెంబర్ 21న) మొదలై బుధవారం ముగిస్తుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వైపు నుంచి చూస్తే ఎఫ్ఓఎంసీ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. అలాగే బ్యాంక్ జపాన్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఈ బుధవారమే వెల్లడికానున్నాయి. దేశంలో కోవిడ్ మూడో దశకు సంబంధించిన వార్తలను మార్కెట్ వర్గాలు పరిశీలించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గత వారంలో కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఈ వారమూ కొనసాగే అవకాశం ఉంది. బ్యాడ్‌బ్యాంక్ రూపకల్పనకు కేబినేట్ ఆమోదం తెలపడంతో బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కొనసాగవచ్చు. ఆటో రంగానికి రూ.26,058 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) కేటాయింపుతో కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్న ఆటో షేర్లు లాభాల బాట పట్టొచ్చు. అలాగే ప్రభుత్వ కంపెనీలకు చెందిన షేర్లు రాణించే వీలుంది. ‘‘స్టాక్ సూచీలు అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారాన్ని లాభాల స్వీకరణతో ప్రారంభించవచ్చు. స్థిరీకరణ కోసం జరిగే ప్రయత్నంలో భాగంగా ఒడిదుడుకులతో పరిమిత శ్రేణిలో కదలాడవచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి తక్షణ నిరోధ స్థాయి 17,900 వద్ద ఉంది. ఒకవేళ లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే 17,400 తక్షణ మద్దతు స్థాయికి దిగిరావచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 17,200 వద్ద మరో కీలక తక్షణ మద్దతు ఉంది’’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. పీఎల్ఐ పథకం, బ్యాడ్‌బ్యాంక్, టెలికాం రంగానికి ప్రోత్సాహకాల కేటాయింపుతో గతవారంలో సెన్సెక్స్ 710 పాయింట్లు, నిఫ్టీ 216 పాయింట్లు లాభపడ్డాయి. 21న పరాస్ ఐపీఓ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ మంగళవారం(సెప్టెంబర్ 21) మొదలై గురువారం ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణిని రూ.165 – 175 గా నిర్ణయించారు. అప్పర్ బ్యాండ్ ధర ప్రకారం పబ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థ రూ.170.70 కోట్లు సమీకరించనుంది. గురువారం సన్సార్ ఇంజనీరింగ్ లిస్టింగ్... బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆటో ఉపకరణల తయారీ సంస్థ సన్సార్ ఇంజనీరింగ్ షేర్లు గురువారం ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ కానున్నాయి. గతవారంలో రూ.1283 కోట్ల నిధుల సమీకరణకు వచ్చిన ఈ ఐపీఓ మొత్తం 11.47 రెట్ల సబ్‌స్క్రైబ్షన్‌ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.21 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. నికర కొనుగోలుదారులుగా ఎఫ్ఐఐలు దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. సెప్టెంబర్ 1–17 తేదిల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ.16,305 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,018 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.16,305 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దేశీయ ఈక్విటీలపై ఎఫ్ఐఐల బుల్లిష్ ట్రెండ్ కొనసాగితే రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చు. ఎన్ఆర్ఎల్ రికార్డ్ ప్రభుత్వ రంగ సంస్థ నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్(ఎన్ఆర్ఎల్) చరిత్రలోనే అత్యధికంగా 375 శాతం డివిడెండును ప్రకటించింది. అంటే రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరుకీ రూ. 37.5 చొప్పున మధ్యంతర డివిడెండుగా ఇప్పటికే చెల్లించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్సీ మిశ్రా తెలియజేశారు. 2020–21లో నికర లాభాల్లో సైతం 120 శాతం పురోగతి సాధించింది. ఈ విలువ రూ. 3,036 కోట్లు. ఆదాయం 32 శాతం వద్ధితో రూ. 18,544 కోట్లకు చేరింది. çకంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ప్రభుత్వానికి రికార్డు డివిడెండ్ అందించినట్లు ఆయన వెల్లడించారు. చదవండి: స్టాక్ మార్కెట్, ఇకపైనా టెక్ కంపెనీల ఐపీవోల జోరు -
సెన్సెక్స్ @ 59,000
స్టాక్ మార్కెట్లో బుల్ దూకుడు కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో గురువారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఆయా రంగాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఐటీసీ, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర లార్జ్‌క్యాప్ షేర్లు లాభపడి సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. సెన్సెక్స్ తొలిసారి 59,000 శిఖరాన్ని అధిరోహించి 417 పాయింట్ల లాభంతో 59,141 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 481 పాయింట్లు ర్యాలీ చేసి 59,204 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 125 పాయింట్లు ర్యాలీ చేసి 17,645 వద్ద కొత్త తాజా గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 110 పాయింట్ల లాభంతో 17,629 వద్ద నిలిచింది. గడచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 963 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లను ఆర్జించాయి. ఐటీ, మెటల్, మీడియా షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1622 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.168 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండు పైసలు బలహీనపడి 73.52 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించిన వార్తతో బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లు రాణించడంతో ఎన్ఎస్ఈలోని నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ ఐదున్నర శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3%, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రెండుశాతం ర్యాలీ చేశాయి. రెండోరోజూ టెలికం షేర్ల లాభాల మోత టెలికాం రంగానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలతో ఈ రంగ షేర్లు రెండురోజూ రాణించాయి. వోడాఫోన్ ఇంట్రాడేలో 28 శాతం లాభపడి రూ.11.47 స్థాయికి చేరింది. చివరికి 26 శాతం లాభంతో రూ.11.25 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ షేరు ట్రేడింగ్‌లో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.744 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి ఒకశాతం శాతంతో రూ.718 వద్ద స్థిరపడింది. మార్కెట్ క్యాప్‌లో ఐదో స్థానానికి భారత్ సూచీలు వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.4.46 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టస్థాయి రూ.260 లక్షల కోట్లకు చేరింది. విలువపరంగా భారత స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే ఐదోస్థానానికి చేరినట్లు బీఎస్ఈ సీఈవో అశిష్ చౌహాన్ తెలిపారు. సన్సార్ ఐపీఓకు మంచి స్పందన... ఆటో ఉపకరణాల తయారీ సంస్థ సన్సార్ ఇంజనీరింగ్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరిరోజు నాటికి 11.47 రెట్ల సబ్స్రై్కబ్షన్ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా... 13.88 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 26.47 రెట్లు, నాన్ – ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 11.37 రెట్లు, రిటైల్ విభాగంలో 3.15 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎక్చ్సేంజీ గణాంకాలు తెలిపాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.382 కోట్లను సమీకరించింది. సెపె్టంబర్ 21న పరాస్ డిఫెన్స్ ఐపీఓ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ సెపె్టంబర్ 21న ప్రారంభం కానుంది. ఇదే నెల 23న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణిని రూ.165 – 175 గా నిర్ణయించారు. సెన్సెక్స్ 57వేల నుంచి 58వేల స్థాయికి చేరేందుకు మూడురోజుల ట్రేడింగ్ సమయాన్ని తీసుకోగా.., 58 వేల నుంచి 59 వేల స్థాయికి చేరుకొనేందుకు ఎనిమిది ట్రేడింగ్ సమయాన్ని తీసుకుంది. -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.సోమవారం ఉదయం 9.38గంటల సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు నష్టపోయి 58,115 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ 56.70 పాయింట్లతో స్వల్పంగా నష్టపోయి 17,312 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, టీసీఎస్,హెచ్డీఎఫ్సీ, మారుతీ, టీసీఎస్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. రిలయన్స్,ఇండస్ఇండ్ బ్యాంక్,బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. -
మళ్లీ బుల్ పరుగులు
ముంబై: ఒకరోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్ సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లలో చెప్పుకోదగ్గ కొనుగోళ్లు జరిగాయి. లార్జ్‌క్యాప్ షేర్లైన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ షేర్లు మూడు శాతం వరకు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఫలితంగా సెన్సెక్స్ 514 పాయింట్లు ఎగసి 57,853 వద్ద ముగిసింది. ఒక దశలో 554 పాయింట్ల వరకు ర్యాలీ చేసి 57,892 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 17,234 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 169 పాయింట్లు ర్యాలీ చేసి 17,246 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఆల్‌టైం హై ముగింపులు కావడం విశేషం. అంతకు ముందు(బుధవారం) ట్రేడింగ్‌లో పతనమైన షేర్లకు అధిక డిమాండ్ నెలకొంది. సూచీలు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లను కొనేందుకు అధికాసక్తి చూపారు. సెమికండక్టర్ కొరతతో ఆగస్టు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటో రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.349 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.382 కోట్ల ఈక్విటీలను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లోనూ రూపాయి 2 పైసలు బలపడి 73.06 వద్ద స్థిరపడింది. అమెరికా ఉద్యోగ గణాంకాల విడుదలకు ముందు అప్రమత్తతతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బుల్ జోరుతో ఇన్వెస్టర్లకు రూ.2.5 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.252.66 లక్షల కోట్లకు చేరింది. ‘‘జీడీపీతో సహా ఇటీవల విడుదలైన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించగలిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందనే ఆశావాదంతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ ఈక్విటీ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 17100 కీలక నిరోధాన్ని ఛేదించిన తర్వాత మరింత దూసుకెళ్లింది. ప్రస్తుత ట్రేడింగ్ స్థాయి(17200–17250)ని నిలుపుకోగలిగితే మూమెంటమ్ కొనసాగి 17,400 – 17450 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని ఆనంద్ రాఠి ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేందర్ సోలంకీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు ► నిధుల సమీకరణ అంశంపై బోర్డు సమావేశాని(శుక్రవారం)కి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ షేరు ఎనిమిది శాతం ఎగసి రూ.776 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 6% లాభంతో రూ.759 వద్ద ముగిసింది. ► మధ్యంతర డివిడెండ్ ప్రకటన తర్వాత వేదాంత షేరుకు డిమాండ్ నెలకొంది. మూడు శాతం ర్యాలీ చేసి రూ. 306 వద్ద స్థిరపడింది. ► కెనడా దేశంలోని స్థానిక ఫార్మా మార్కెట్లోకి రెవెలిమిడ్ జనరిక్ ఔషధాన్ని విడుదల చేయడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేరు రెండు శాతం లాభపడి రూ.4,857 వద్ద నిలిచింది. ► రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వడంతో కైటెక్స్ గార్మెంట్స్ షేరు పదిశాతం లాభంతో రూ.164 వద్ద ముగిసింది. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లు సరికొత్త రికార్డ్ లను కొనసాగిస్తున్నాయి. ఆ రికార్డ్ల పరంపర కొనసాగిస్తూ గురువారం ఉదయం మార్కెట్లు 9.38 గంటల సమాయానికి నిఫ్టీ 54.05 పాయింట్ల లాభంతో 17,125.10 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 144.77 పాయింట్ల లాభంతో 57,482.98 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. కాగా, మారుతి సుజికి,డీఆర్ఎల్,బజాజ్ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మార్కెట్లు లాభాల్ని గడిస్తుండగా.. వోల్టాస్,బాటా ఇండియా, గోద్రెజ్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. -
అదే జోరు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ లాభాల్ని మూటగట్టుకుంటున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు, క్యూ1లో జీడీపీ ఫలితాల ప్రభావంతో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9.30గంటల సమయానికి నిఫ్టీ 47.65 పాయింట్లు లాభపడి 17,179 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఇక సెన్సెక్స్ 159.67 పాయింట్లు లాభపడి 57,712.06 వద్ద అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్యాస్, అదానీ పవర్, యాక్సెస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాస్ ఫైనాన్స్, జేకే సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్, మారుతి సుజికి, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
బుల్ పరుగులు..3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి
లాభాల జడివానతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. సూచీల వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.3.58 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.247 లక్షల కోట్లకు చేరింది. ముంబై: దలాల్ స్ట్రీట్ సోమవారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొంతకాలంగా పరిమిత శ్రేణిలో కదలాడుతున్న పావెల్ వ్యాఖ్యలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 833 పాయింట్లు పెరిగి 56,958 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 765 పాయింట్ల లాభంతో 56,890 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 247 పాయింట్లు ఎగసి 16,952 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 226 పాయింట్ల లాభంతో 16,931 వద్ద స్థిరపడింది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ సూచీ ఐదు కొత్త రికార్డు ముగింపులను నమోదుచేసింది. ధరల నియంత్రణకు చైనా నిల్వల విక్రయానికి సిద్ధమవడంతో మెటల్ షేర్ల ర్యాలీ కొనసాగింది. ఎన్ఎస్ఈలోని సెక్టార్ ఇండెక్స్‌ల్లోకెల్లా నిఫ్టీ మెటల్ సూచీ అత్యధికంగా రెండున్నర శాతం లాభపడింది. కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడవుతున్న ఆర్థిక, బ్యాంకింగ్ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. ఆగస్ట్‌లో వాహన విక్రయాలు ఊపందుకొని ఉండొచ్చనే అంచనాలతో ఆటో షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,208 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.689 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల దూకుడుకు కారణాలివే... అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం జాక్సన్ హోల్ సదస్సులో మాట్లాడుతూ.., వడ్డీ రేట్ల పెంపు 2023 ఏడాది నుంచి ఉండొచ్చన్నారు. బాండ్ల కొనుగోళ్ల కోత ఈ సంవత్సరాంతం ప్రారంభం అవుతుందని స్పష్టతనిచ్చారు. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికాతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల బాటపట్టా యి. అలాగే పావెల్ ప్రకటనతో యూఎస్ డాలర్ బలహీనపడడంతో, ట్రెజరీ ఈల్డ్స్ కూడా తగ్గాయి. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 1.312 శాతం నుంచి 1.305 శాతానికి దిగింది. డాలర్ ఇండెక్స్ కూడా రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 40 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఈ వారంలో వెలువడనున్న దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదుకావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి కేంద్రం చేపట్టిన సంస్కరణలతో క్యూ1లో రికార్డు స్థాయిలో 17.57 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌లోకి వచ్చాయి. నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత ఈ ఆగస్టులో ఎఫ్ఐఐ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరిన్ని విశేషాలు... భారతీ ఎయిర్టెల్ బీఎస్ఈలో నాలుగున్నర శాతం లాభపడి రూ.620 వద్ద ముగిసింది. కంపెనీ బోర్డు రూ.21వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలపడం షేరు ర్యాలీకి కారణం. పలు కార్ల రేట్లు ఈ సెప్టెంబర్ నుంచి పెంచనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించడంతో బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు మూడు శాతం పెరిగి రూ.6,797 వద్ద ముగిసింది. భారత్‌లో టెస్లా కంపెనీకి విడిభాగాలను సరఫరా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో సోనా కామ్స్టార్, సంధార్ టెక్, భారత్ ఫోర్జ్ షేర్లు తొమ్మిదిశాతం ర్యాలీ చేశాయి. -
రికార్డ్ల వేట, భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుంది. ప్రధాన సూచీలు గరిష్టస్థాయిలో సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం 9.36 గంటల సమయానికి సెన్సెక్స్ సరికొత్త రికార్డ్ లను నమోదు చేసింది. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 56119 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 16683 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్,హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా,మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ) కార్యక్రమం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
మంగళవారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు..రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. దీంతో మంగళవారం ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్సె 71.30 పాయింట్ల లాభంతో 55,653 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 10.50 స్వల్ప లాభంతో 16,573 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. మాస్ ఫిన్ సర్వీస్, డీసీఎం శ్రీరామ్, అపోలో హాస్పిటల్, eClerx సర్వీసెస్, పెట్రో నెట్ ఎల్ఎన్జీ స్టాక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
కొనసాగిన రికార్డులు
ముంబై: స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర సోమవారమూ కొనసాగింది. మెటల్, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు రాణించడంతో సూచీలు మూడోరోజూ ఇంట్రాడే, ముగింపులో సరికొత్త గరిష్టాలను నమోదుచేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 244 పాయింట్లు ఎగసి 55,681 వద్ద ఆల్‌టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 145 పాయింట్ల లాభంతో 55,583 వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 60 పాయింట్లు పెరిగి 16,589 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదుచేసింది. మార్కెట్ ముగిసే సరికి 34 పాయింట్ల లాభంతో 16,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది ఆరోరోజూ, సెన్సెక్స్ మూడోరోజూ లాభాల ముగింపు. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు అరశాతానికి పైగా నష్టపోయాయి. జూన్ త్రైమాసికపు ఫలితాలు మెప్పించడంతో పాటు ప్రపంచ మార్కెట్లోనూ ధరలు స్థిరంగా ఉండటంతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ లాభపడింది. ఆటో, ఐటీ, మెటల్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రభుత్వరంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ గణాంకాలు నిరాశపరచడంతో పాటు కోవిడ్ వైరస్ విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పార్శీ నూతన సంవత్సరం సందర్భంగా ఫారెక్స్ మార్కెట్ పని చేయలేదు ఆరంభ నష్టాలు రికవరీ... దేశీయ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 55,480, నిఫ్టీ 11 పాయింట్ల పతనంతో 16,518 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకోవడంతో పాటు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు మరింత అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లను కోల్పోయాయి. ఈ సమయంలో జూన్ టోకు ధరల ద్రవ్యోల్బణ దిగివచ్చినట్లు కేంద్ర గణాంకాల శాఖ ప్రకటనతో సూ చీల నష్టాలకు అడ్డుకట్ట పడింది. మిడ్‌సెషన్ నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకొని క్రమంగా లాభాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► రిలయన్స్ – సౌదీ ఆరామ్కో వ్యాపార ఒప్పంద చర్చలు సఫలవంతం దిశగా సాగుతున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఆర్ఐఎల్ షేరు ఒకటిన్నర శాతం లాభంతో రూ.2174 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.2203 వద్ద గరిష్టాన్ని తాకింది. ► ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ భాగంగా హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు రాణించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు అరశాతం లాభంతో రూ.1529 వద్ద, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేరు ఒకశాతం పెరిగి రూ.2,733 వద్ద స్థిరపడ్డాయి. ► వొడాఫోన్ ఐడియా షేరు ఆరుశాతం క్షీణించి రూ.6 వద్ద ముగిసింది. కంపెనీ రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేయడం షేరు పతనానికి కారణమైంది. ► పలు బ్రోకరేజ్ సంస్థలు షేరు టార్గెట్ ధరను పెంచడంతో టాటా స్టీల్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.1519 వద్ద ముగిసింది. ► జూన్ క్వార్టర్లో రూ.729 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడంతో స్పైస్‌జెట్ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.69 వద్ద స్థిరపడింది. -
NSE NIFTY 50: మళ్లీ రికార్డుల బాట
ముంబై: ఒకరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ కదంతొక్కాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గురువారం ఇంట్రాడే, ముగింపుల్లో సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులకు లోనైన సూచీలు.., వెంటనే తేరుకొని మార్కెట్ ముగిసే వరకు ఎలాంటి తడబాటు లేకుండా స్థిరమైన ర్యాలీ చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 348 పాయింట్లు ఎగసి 54,874 వద్ద ఆల్‌టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 318 పాయింట్ల లాభంతో 54,845 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 93 పాయింట్లు పెరిగి 16,375 వద్ద సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. మార్కెట్ ముగిసే సరికి 82 పాయింట్ల లాభంతో 16,364 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఈ వారం ఆరంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లలో విరివిగా కొనుగోళ్లు జరిగాయి. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు రెండుశాతం వరకు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో తొమ్మిది షేర్లు మాత్రమే నష్టపోయాయి. సూచీల రికార్డు ర్యాలీతో ఒకేరోజులో ఇన్వెస్టర్లు రూ.2 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్క్యాప్ రూ.239 లక్షల కోట్లకు చేరింది. రికార్డు ర్యాలీ ఎందుకంటే..? అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెలువడటంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను ఇప్పట్లో పెంచకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. డిమాండ్ ఊపందుకోవడంతో రెండో క్వార్టర్లో బ్రిటన్ మెరుగైన జీడీపీ వృద్ధిని సాధించింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఇక జాతీయంగా ఫారెక్స్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు అందాయి. డాలర్ మారకంలో రూపాయి 19 పైసలు ఎగసి 74.25 వద్ద స్థిరపడింది. గత మూడురోజుల ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా పతనాన్ని చవిచూసిన నాణ్యమైన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ప్యాసింజర్ వాహన విక్రయాలకు సంబంధించి జూలైలో వార్షిక ప్రాతిపదికన 45% వృద్ధి నమోదైనట్లు ఆటో పరిశ్రమ సంఘం సియామ్ తెలిపింది. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్ భావించే ఈక్విటీల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ‘మార్కెట్ ముందుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ జరగవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్ మంచిది. గురు వారం విడుదలైన జూలై రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించనున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ 16300 స్థాయిపై ముగిసింది. తదుపరి 16500 వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. దిగువ స్థాయిలో 16250 వద్ద తక్షణ మద్దతు ఉంది’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఆప్టాస్ అదుర్స్.. కెమ్‌ప్లాస్ట్ ఓకే ముంబై: చెన్నైకి చెందిన ప్రత్యేక రసాయనాల కంపెనీ కెమ్‌ప్లాస్ట్ సన్మార్ ఐపీఓకు ఓ మోస్తరు స్పందన లభించింది. చివరి రోజు నాటికి 2.17 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3.99 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా.. మొత్తం 8.66 కోట్లు బిడ్లు దాఖలైనట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.29 రెట్లు ఎక్కువ దరఖాస్తులు లభించాయి. ఆప్టాస్ వేల్యూ 17 రెట్లు... ఆప్టాస్ వేల్యూ హౌసింగ్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. మూడో రోజు నాటికి 17.20 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 5.51 కోట్ల షేర్లను జారీ చేసింది. మొత్తం 94.82 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 71.35 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. -
ఆర్థిక, ఐటీ షేర్ల అండతో లాభాలు
ముంబై: మిడ్‌సెషన్ నుంచి ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు వారం ప్రారంభంలోనే లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 54,403 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 16,258 వద్ద ముగిసింది. ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, మీడియా షేర్లూ స్వల్పంగా లాభపడ్డాయి. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియలీ్ట, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 460 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 142 పాయింట్ల శ్రేణిలో కదలాడాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అయితే లార్జ్‌క్యాప్ షేర్లు రాణించి సూచీలకు అండగా నిలిచాయి. డెల్టా కేసుల పెరుగుదల భయాలు, కమోడిటీ ధరల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ నాలుగు గరిష్టానికి చేరుకుంది. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు పతమైన 74.26 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా... దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 54,386 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 16,281 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపడంతో మార్కెట్ మొదలైన అరగంటకే సెన్సెక్స్ 312 పాయింట్లు ఎగసి 54,585 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు ర్యాలీ చేసి 16,321 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. రోలెక్స్ రింగ్స్ లిస్టింగ్ సూపర్... ఆటో విడిభాగాల తయారీ సంస్థ రోలెక్స్ రింగ్స్ ఐపీఓ లిస్టింగ్‌లో అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.900తో పోలిస్తే ఈ షేరు బీఎస్ఈలో 39% ప్రీమియంతో రూ.1250 వద్ద లిస్ట్ అయింది. ఒకదశలో 40% లాభపడి రూ.1263 వద్ద గరిష్టాన్ని అందుకుంది. చివరికి 30% లా భంతో రూ.1167 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,176.90 కోట్లుగా ఉంది. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు! ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ద్వారా సాకారం న్యూఢిల్లీ: ఎంపిక చేసిన అమెరికన్ స్టాక్స్‌లో ట్రేడింగ్ చేసే సదుపాయాన్ని తమ ప్లాట్‌ఫాం ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్సే్చంజీ (ఐఎఫ్ఎస్సీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడి సాధనాన్ని దేశీ ఇన్వెస్టర్లకు అందించే దిశగా డిపాజిటరీలు, బ్యాంకులు, బ్రోకర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్ సిటీ)లో తీసుకున్న డీమ్యాట్ ఖాతాల్లో వీటిని హోల్డ్ చేయొచ్చని పేర్కొంది. ఈ విధానంతో దేశీ రిటైల్ ఇన్వెస్టర్లకు అమెరికన్ స్టాక్స్ లభించగలవని ఎన్ఎస్ఈ ఎండీ విక్రమ్ లిమాయే తెలిపారు. -
బుల్ జోరు, భారీ లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లో బుల్‌రన్ కొనసాగుతుంది. బుధవారం మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజీలో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం 9.40 నిమిషాల సమయంలో 422.36 పాయింట్ల లాభంతో 54246 పాయింట్లతో ట్రేడింగ్ కొనసాగుతుండగా.. నిఫ్టీ 115.95 పాయింట్ల లాభాలతో 16246 వద్ద ట్రేడ్ అవుతుంది. కాగా, కరోనా మహమ్మారితో కుంటుపడ్డ ఆర్ధిక వ్యవవస్థ వేగంగా కోలుకునేలా సంకేతాలివ్వడం, కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక పలితాలు,ఐపీఓల సందడి, జీఎస్టీ వసూళ్లు పెరగడం, తయారీ రంగం ఊపందుకోవడం వంటి సానుకూల అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో మార్కెట్లు భారీ లాభాల్ని చవి చూస్తున్నాయి. -
లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో మంగళవారం ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 53,264.33 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా..నిఫ్టీ 66 పాయింట్లతో 15,963.85 వద్ద లాభాలతో ట్రేడింగ్ కొనసాగుతుంది. కాగా, టాప్ టెన్ స్టాక్స్ లో ఏషియన్ పెయింట్స్, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్, అదానీ పోర్ట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కో లిమిటెడ్, టెక్ మహీంద్రా, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో లిమిటెడ్, బజాస్ ఫిన్ సర్వ్, టాటా కన్సెల్టెన్సీ సర్వీస్‌లు లాభాల్ని మూటగట్టుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌సీఎల్,శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గ్రసీమ్ ఇండస్ట్రీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మిశ్రమ పరిస్థితుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం సెన్సెక్స్ 52,653 పాయింట్లతో క్లోజవగా ఈ రోజు ఉదయం 52,792 పాయింట్లతో ప్రారంభమయ్యింది. ఉదయం 9:45 గంటల సమయంలో కేవలం పది పాయింట్ల లాభపడి 52,663 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ఉదయం 9:45 గంటల సమయానికి ఏడు పాయింట్లు లాభపడి 15,785 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టెక్ మహీంద్రా షేర్లు ఏకంగా 7 శాతం పెరిగాయి. ఈ రోజు మార్కెట్లో అధిక లాభాలు అందించిన షేర్‌గా టెక్‌మహీంద్రా నిలిచింది. ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం చూపడంతో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 252 పాయింట్ల లాభాలతో 52,695.58 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా నిఫ్టీ 74 పాయింట్లను నమోదు చేసి 15783.80 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, టెక్ మహేంద్ర, బ్లూ చిప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వచ్చే వారం నుంచి టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఆ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా నెస్ట్లే, ఐచర్ మోటార్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా షేర్లు నష్టాల బాట పట్టాయి. -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపడంతో సెన్సెక్స్ 130.66 పాయింట్ల స్వల్ప లాభాలతో 52,9067 పాయింట్లతో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 32.80 పాయింట్ల లాభంతో 15,856 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇక, ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, ఫెడరల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, ఎస్ బ్యాంక్, ఆర్ట్సన్ ఇంజనీరింగ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్ల కొనుగోలుతో పాటు, రిలయన్స్ ఇండిస్ట్రీస్ 44వ యాన్యువల్ జనరల్ మీటింగ్ మార్కెట్‌పై అనుకూల ప్రభావం పడింది. ఐపీఓ తర్వాత తొలిసారి రిలయన్స్ నిర్వహిస్తున్న మీటింగ్‌లో కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఏం చెబుతారా' అని షేర్ హోల్డర్లు ఆసక్తిగా ఎదురు చూస్తుడడంతో 9.24గంటల సమయానికి మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 52,472 వద్ద ట్రేడ్ అవ్వగా నిఫ్టీ 36 పాయింట్లతో 15,722 కొనసాగుతుంది. ఐటీ స్టాక్స్ జోరు సెన్సెక్స్ సూచీల్లో ఐటీ స్టాక్స్ జోరందుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా తో పాటు ఎల్ అండ్ టీ, యాక్సిక్ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక అత్యధికంగా జేఎస్‌డబ్ల్యూస్టీల్ స్టాక్ ప్రైస్ 1.34శాతం పెరిగింది. జాతీయస్థాయిలో పలు ఆటో మొబైల్ సంస్థలు వాహనాల ధరల్ని పెంచడంతో వాటి ప్రభావం మార్కెట్‌పై ప్రభావం చూపి 0.6శాతం తగ్గింది.హీరో మోటర్ కార్ప్,టాటా మోటార్స్ నష్టపోయాయి. చదవండి: మళ్లీ పెరిగిన పెట్రో ధరలు -
ఆదాయం 40వేల కోట్లు, పవర్ గ్రిడ్ లాభం 6% ప్లస్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఐఎల్) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 6% పుంజుకుని రూ. 3,526 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో దాదాపు రూ. 3,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,508 కోట్ల నుంచి రూ. 10,816 కోట్లకు బలపడింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది. మధ్యంతర డివిడెండు కింద ఈ ఏడాది జనవరి 8న రూ. 5, తిరిగి మార్చి 30న రూ. 4 చొప్పున చెల్లించిన సంగతి తెలిసిందే. పూర్తి ఏడాదికి: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి పవర్ గ్రిడ్ రూ. 12,036 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 11,059 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 38,671 కోట్ల నుంచి దాదాపు రూ. 40,824 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా.. తుది డివిడెండుతోపాటు 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను సైతం జారీ చేసేందుకు బోర్డు నిర్ణయించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 3 షేర్లకుగాను 1 షేరుని ఉచితంగా కేటాయించనుంది. ఫలితాల నేపథ్యంలో పవర్ గ్రిడ్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ. 240 వద్ద ముగిసింది. చదవండి: మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు -
మార్కెట్లో రికార్డుల మోత
ముంబై: జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం తమ పాత రికార్డుల్ని తిరగరాశాయి. మెటల్, ఐటీ, ఫార్మా, ఆటో షేర్లు రాణించడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 324 పాయింట్లు పెరిగి 52,642 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఈ ఏడాదిలో ఫిబ్రవరి 16న నమోదైన 52,517 ఆల్‌టైం హై స్థాయి కనుమరుగైంది. చివరికి 174 పాయింట్ల లాభంతో 52,475 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు కూడా సూచీకి కొత్త ఆల్‌టైం హై కావడం విశేషం. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 96 పాయింట్లు ర్యాలీ చేసి 15,836 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. 62 పాయింట్ల్ల లాభంతో 15,799 వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంటలోపే రికార్డు స్థాయిలను అందుకున్న సూచీలు తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి లాభాల బాటపట్టాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు అరశాతం చొప్పున ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.18 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.666 కోట్ల షేర్లను కొన్నారు. ఇక వారం మొత్తం మీద సెన్సెక్స్ 375 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లను ఆర్జించాయి. సూచీలకిది నాలుగో వారమూ లాభాల ముగింపు. యూఎస్ సూచీలు జీవితకాల గరిష్టస్థాయిని అందుకోవంతో సహా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు రిస్క్‌కు అధిక ప్రాధాన్యత ఉంటే ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఇన్వెస్టర్ల సంపద@రూ.213 లక్షల కోట్లు సూచీల రికార్డులతో ఇన్వెస్టర్ల సంపద కూడా కొత్త గరిష్టానికి ఎగసింది. ఇన్వెస్టర్లు సంపద భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం గురు, శుక్రవారాల్లో రూ.3.26 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్ మైలురాళ్లు ఈ 2021 ఏడాదిలో ఇప్పటి వరకు సెన్సెక్స్ మొత్తం 4,723 పాయింట్ల(9.89%)ను ఆర్జించింది. ఇదే ఏడాదిలో మొత్తం 18 సార్లు కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేసింది. తేదీ సాధించిన ఘనత జనవరి 21 తొలిసారి 50వేల స్థాయిని అందుకుంది. ఫిబ్రవరి 3 తొలిసారి 50వేల పైన ముగిసింది ఫిబ్రవరి 5 తొలిసారి 51వేల స్థాయిని అందుకుంది. ఫిబ్రవరి 8 తొలిసారి 51 వేల స్థాయి పైన ముగిసింది ఫిబ్రవరి 15 తొలిసారి 52 స్థాయిని అందుకుంది. జూన్ 11 52,641 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు జూన్ 11 52,474 వద్ద ఆల్‌టైం హై ముగింపు -
మళ్లీ రికార్డుల ర్యాలీ..!
ముంబై: ఒకరోజు విరామం తర్వాత స్టాక్ మార్కెట్లో మళ్లీ కొత్త రికార్డులు నమోదయ్యాయి. మిడ్‌సెషన్ నుంచి ఇంధన, ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారం సూచీలు సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడి 52,328 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి జీవితకాల గరిష్టస్థాయి. అంతకు ముందు సెన్సెక్స్‌కు (జూన్ 03న) జీవితకాల గరిష్ట ముగింపు స్థాయి 52,232గా ఉంది. ఇక నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 15,752 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 103 పాయింట్లు ర్యాలీ చేసి 15,773 స్థాయిని అందుకుంది. ముగింపు, ఇంట్రాడే స్థాయిలు నిఫ్టీకి జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో మూడేళ్ల తర్వాత నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్‌టైం హైని నమోదు చేయగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మరోసారి జీవితకాల గరిష్టం వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. సూచీల రికార్డు ర్యాలీ తిరిగి మొదలవడంతో సోమవారం ఒక్కరోజే రూ.1.81 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రికార్డు స్థాయి రూ.229 లక్షల కోట్లకు చేరింది. గత శుక్రవారం విడుదలైన అమెరికా నిరుద్యోగ గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరుత్సాహపరచడంతో ప్రపంచ మార్కెట్లు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి. ‘‘దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను సడలించడం కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ర్యాలీ కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. నిఫ్టీకి 15,500–15,600 స్థాయిలో బలమైన మద్దతు ఉంది. అందుకే ట్రేడింగ్ ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కలిగినా తట్టుకోగలిగింది. మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉన్నందున నిఫ్టీ 16,000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు’’ అని దీన్ దయాళ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ నిపుణుడు మనీష్ హతీరమణి తెలిపారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ జరిగిందిలా! ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో 52,231 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 15,725 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఉదయం లాభాలన్నీ కోల్పోయాయి. అయితే మిడ్ సెషన్లో యూరో మార్కెట్ల లాభాల ప్రారంభం సూచీలకు ఉత్సాహాన్నిచ్చింది. అలాగే సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని వార్తలు వెలువడటంతో తిరిగి కొనుగోళ్లు మొదలయ్యాయి. ద్వితీయార్థంలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో ఒక దశలో నిఫ్టీ 103 పాయింట్లు ర్యాలీ చేసి 15,773 స్థాయిని అందుకుంది. సెన్సెక్స్ 279 పాయింట్లు లాభపడి 52,379 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. -
రికవరీ ఆశలతో.. రికార్డులు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఆశలతో స్టాక్ మార్కెట్ సోమవారం ఒక శాతం లాభంతో ముగిసింది. మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ రికార్డుల పర్వం కొనసాగింది. ఇంట్రాడేలో 268 పాయింట్లు ఎగసి 15,606 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టస్థాయిని నమోదుచేసింది. చివరికి 147 పాయింట్ల లాభంతో 15,583 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి నిఫ్టీకి ఆల్‌టైం హై కావడం విశేషం. మరో సూచీ సెన్సెక్స్ 515 పాయింట్లు లాభపడి 51,937 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 52 వేల మార్కును అధిగమించి 52,013 స్థాయిని తాకింది. సెన్సెక్స్‌కిది నాలుగోరోజూ లాభాల ముగింపు కాగా నిఫ్టీ సైతం ఏడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. ఆసియా మార్కెట్లలో ప్రతికూలతతో ఉదయం సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికిలోనైనా.., దేశీయంగా నెలకొన్న సానుకూలతలతో తిరిగి లాభాల బాటపట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మీడియా, ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,412 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.180 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. ‘‘కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో ఆశావాదం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ తగినంత మద్దతు లభించింది. ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికపు జీడీపీ గణాంకాలు మెప్పించకపోయినా.., లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో వేగవంతమైన రికవరీ జరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగిన వృద్ధి జరగవచ్చు. ఆర్థిక వృద్ధి ఆశలతో మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, ఇంధన రంగాలకు చెందిన హెవీ వెయిట్స్ షేర్లు రాణించడంతో సూచీలు భారీ లాభాల్ని ఆర్జించగలిగాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 4 రోజుల్లో రూ.3.93 లక్షల కోట్లు అప్... నాలుగు రోజుల వరుస ర్యాలీలో బీఎస్ఈలో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.223 లక్షల కోట్లకు చేరుకుంది. సోమవారం సూచీల 1% ర్యాలీతో రూ.1.82 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. రూపాయి మూడురోజుల ర్యాలీకి బ్రేక్..! రూపాయి విలువ సోమవారం 17 పైసలు నష్టపోయి 72.62 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటం రూపాయి కరిగిపోయేందుకు కారణమైనట్లు ఫారెక్స్ నిపుణులు తెలిపారు. రూపాయి పతనంతో మూడురోజుల ర్యాలీకి ముగింపుపడినట్లైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 72.38 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72.65 – 72.34 శ్రేణిలో కదలాడింది. ఈ మే నెలలో డాలర్ మారకంలో రూపాయి 149 పైసలు(2.01 శాతం) బలపడింది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు 3% లాభంతో రూ.2,160 వద్ద స్థిరపడింది. గత 4 రోజుల్లో ఈ షేరు 10% ర్యాలీ చేయడం విశేషం. ► నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబ్ షేరు 4% లాభపడి రూ.4,284 వద్ద ముగిసింది. ► మార్కెట్ ర్యాలీలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 6% నష్టపోయి రూ.79 వద్ద స్థిరపడింది. -
Nifty: సరికొత్త శిఖరాలకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు రాణించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభంతో ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం కూడా కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 308 పాయింట్లు లాభపడి 51,423 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 51,259 – 51,529 పాయింట్ల మధ్యలో ట్రేడైంది. మరో ఇండెక్స్ నిఫ్టీ మూడు నెలల విరామం తర్వాత ఇంట్రాడేలో 15,469 వద్ద సరికొత్త రికార్డును లిఖించింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,436 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి కూడా నిఫ్టీకి రికార్డు గరిష్టం. అలాగే ఆరోరోజూ లాభాలను గడించినట్లైంది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.914 కోట్ల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు రూ.661 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 882 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు పెరిగాయి. ‘‘దేశంలో కోవిడ్ వ్యాధి సంక్రమణ రేటు క్షీణించడంతో పాటు డాలర్ ఇండెక్స్ పతనం భారత ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడుతూ ర్యాలీకి మద్దతుగా నిలుస్తోంది. ఆర్థిక రికవరీ ఆశలు, మెరుగైన క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో మార్కెట్ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ తెలిపారు. సూచీలకు మద్దతుగా రిలయన్స్ ర్యాలీ... అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు చాలాకాలం తరువాత లాభాల బాట పట్టింది. జెఫ్పారీస్‌తో సహా బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు బుల్లిష్ రేటింగ్‌ను కేటాయించాయి. ఇన్వెస్టర్లు ఈ షేరును కొనేందుకు ఆసక్తి చూపారు. ఎన్ఎస్ఈలో 6% లాభంతో రూ. 2,095 వద్ద స్థిరపడింది. -
Nifty: నాలుగో రోజూ లాభాలే
ముంబై: కరోనా సంబంధిత ప్రతికూలతలను విస్మరిస్తూ స్టాక్ మార్కెట్ నాలుగోరోజూ ముందడుగేసింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు అండగా నిలిచాయి. ఫలితంగా దేశీయ మార్కెట్ సోమవారం లాభాలను మూటగట్టుకుంది. అన్ని రంగాలకు షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సెన్సెక్స్ 296 పాయింట్లు ఎగసి 49,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు ర్యాలీ చేసి 14,942 వద్ద నిలిచింది. కార్పొరేట్ కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పిస్తున్నాయి. కోవిడ్ వేళ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చాయి. ప్రపంచ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు అందా యి. ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా రంగాల షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ ఒక శాతం ర్యాలీ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 49,412– 49,617 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 14,892 – 14,967 శ్రేణిలో ట్రేడైంది. గతవారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.584 కోట్ల విలువైన షేర్లను కొ న్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.476 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 4 రోజుల్లో రూ.6.4 లక్షల కోట్లు అప్... మార్కెట్ వరుస ర్యాలీతో గడిచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,249 పాయింట్లు, నిఫ్టీ 446 పాయింట్లను ఆర్జించాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది. నాలుగు రోజుల్లో ఏకంగా రూ.6.44 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేష¯Œ రూ. 213 లక్షల కోట్లను తాకింది. ఇంట్రాడేలో ట్రేడింగ్ జరిగిందిలా.., ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న మన మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 49,496 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 14,928 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో బలహీనత కారణంగా సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొని ఉన్న సానుకూలతో సూచీలు వెంటనే రికవరీ అయ్యి తిరిగి ఆరంభ లాభాల్ని పొందగలిగాయి. మిడ్‌సెషన్‌లో మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనప్పటికీ.., యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో మళ్లీ కొనుగోళ్లు జరిగాయి. ఇలా పతనమైన ప్రతిసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► కోవిడ్ ఔషధ తయారీకి అనుమతులు లభిం చడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు మూడు శాతం లాభపడి రూ.5328 వద్ద ముగిసింది. ► మార్చి క్వార్టర్లో నికర లాభం 17 రెట్లు పెరగడంతో సీఎస్బీ బ్యాంక్ షేరు ఆరు శాతం ర్యాలీ చేసి రూ.272 వద్ద స్థిరపడింది. ► 2020–21 క్యూ4లో రిలయన్స్ పవర్ టర్న్అరౌండ్ సాధించడంతో కంపెనీ షేరు రూ.6.65 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకి ఫ్రీజ్ అయ్యింది. ► ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో అల్ట్రాటెక్ షేరు ఒక శాతం నష్టపోయి రూ.6403 వద్ద నిలిచింది. -
Stock Market: నష్టాల్లోంచి.. లాభాల్లోకి..!
ముంబై: దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు గురువారం ఆరంభ నష్టాలను పూడ్చుకొని లాభాల్లో ముగిశాయి. కరోనా కేసుల కట్టడికి వచ్చే నెల(మే) ఒకటవ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాలను మెప్పించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా ఉదయం సెషన్లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 375 పాయింట్ల లాభంతో 48,081 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 110 పాయింట్ల లాభాన్ని మూటగట్టుకొని 14,406 వద్ద నిలిచింది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని చూపారు. మెటల్ షేర్లు కూడా రాణించి సూచీల ర్యాలీకి సహకరించాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభా ల్లో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 909 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.850 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఆరుపైసలు క్షీణించి 74.94 వద్ద స్థిరపడింది. ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి... కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలను దాటడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు మొగ్గు చూపడంతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది.సెన్సెక్స్ 204 పాయింట్ల నష్టంతో 47,502 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లను కోల్పోయి 14,219 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు దూకుడు మీదున్నా.., దేశీయంగా పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో విక్రయాల ఉధృతి మరింత పెరిగింది. దీంతో సెన్సెక్స్ 501 పాయింట్లు మేర నష్టపోయి 47,204 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లను కోల్పోయి 14,424 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఆర్థిక, బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు మిడ్‌సెషన్ కల్లా నష్టాలను పూడ్చుకోగలిగాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో సూచీలు క్రమంగా లాభాలను ఆర్జించుకోగలిగాయి. ► హెచ్‌డీఎఫ్‌సీతో వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 7% లాభంతో రూ.176 వద్ద ముగిసింది. ► నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఏడు శాతం పెరిగి రూ.453 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల విడుదల ముందు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 4% లాభపడి రూ.579 వద్ద నిలిచింది. నిఫ్టీ @ సిల్వర్ జూబ్లీ ... ఎన్ఎస్ఈలోని ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గురువారం అరుదైన ఘనతను సాధించింది. 1995 బేస్ ఇయర్ ప్రతిపాదికన 1996 ఏప్రిల్ 22 తేదీన 1,107 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన నిఫ్టీ దిగ్విజయంగా 25 వసంతాలను పూర్తి చేసుకుంది. కాంపౌండెడ్‌గా ప్రతి ఏటా 11 శాతం వృద్ధి చెందుతూ గడిచిన పాతికేళ్లలో 14 రెట్లు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న 15 వేల మార్కును అధిగమించింది. ఈ పాతికేళ్ల ప్రయాణంలో నిఫ్టీ ఇండెక్స్‌లో అనేక మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ.., హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, గ్రాసీం, హీరో మోటోకార్ప్, హిందాల్కో షేర్లు మాత్రం ఈ రోజుకు కొనసాగుతున్నాయి. -
స్టాక్ మార్కెట్లో ‘ఆక్సిజన్’ పరుగులు...!
ముంబై: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఆర్థిక రంగంపై మరోసారి తన ప్రభావాన్ని కచ్చితంగా చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా స్టాక్ మార్కెట్లో పలు కంపెనీల షేర్లు నేలకేసి చూస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల భయంతో స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ విధింపు చర్యలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను ప్రకటిస్తుండగా, ఇప్పటికే ముంబై, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. నిన్న ఒక్కరోజే సూచీల రెండు శాతం పతనమవ్వడంతో రూ.3.53 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయాయి. ప్రముఖ ఫార్మా కంపెనీల షేర్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లోని కొన్ని కంపెనీలు ఇందుకు విరుద్ధంగా లాభాలను గడిస్తున్నాయి. ఆక్సిజన్‌ను సరఫరా చేసే కంపెనీల షేర్లు ఏప్రిల్ మొదటి వారం నుంచి గణనీయంగా పెరిగాయి. బాంబే ఆక్సిజన్, నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్, భాగవతి ఆక్సిజన్ లిమిటెడ్ కంపెనీల షేర్లు ఏప్రిల్ నెలలో సుమారు 47 శాతం కంటే ఎక్కువగా లాభాలను గడించాయి. దీనికి కారణం కోవిడ్-19 దృష్ట్యా దేశంలో ఆక్సిజన్ ఉపయోగం గణనీయంగా పెరగడంతో కంపెనీల షేర్లు పెరిగాయి. కాగా దేశంలో ఆక్సిజన్ సిలిండర్ ధరలు రెట్టింపయ్యాయి. విచిత్రమేమిటంటే కంపెనీ పేరులో ఆక్సిజన్ ఉన్న కంపెనీల షేర్లు అమాంతం నింగికేగిసాయి. నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్, భాగవతి ఆక్సిజన్ లిమిటెడ్ కంపెనీలు ఆక్సిజన్, ఇతర వాయువులను ఉత్పత్తి చేస్తున్నాయి. బాంబే ఆక్సిజన్ లిమిటెడ్ ఆక్సిజన్ ఉత్పత్తిని 2019లో నిలిపివేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ గా తన పేరు మార్చింది. ఈ కంపెనీ షేర్లు ఏప్రిల్ నెలలో సుమారు 112 శాతం వరకు ఎగబాకాయి. కాగా కొవిడ్-19 తీవ్రత తగ్గిన వెంటనే కంపెనీల షేర్లు సాధారణ స్థాయికి వస్తాయని కోటక్ సెక్యురిటిస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రుస్మిక్ ఓజా తెలిపారు. చదవండి: మార్కెట్.. లాక్‘డౌన్’! -
మార్కెట్‌కు మూడోరోజూ లాభాలే..
ముంబై: ఆరంభ లాభాలను కోల్పోయినా.., మార్కెట్ మూడురోజూ లాభంతో ముగిసింది. ఇంట్రాడేలో 456 పాయింట్లు ర్యాలీ చేసిన సెన్సెక్స్ చివరికి 84 పాయింట్ల లాభంతో 49,746 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 165 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 55 పాయింట్లకు పరిమితమై 14,873 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్లు మెటల్ షేర్లను కొనేందుకు అధిక ఆసక్తి చూపారు. ఉక్కు ఉత్పత్తితో పాటు ధరలు కూడా పెరుగుతుండటంతో ఈ రంగ షేర్లకు డిమాండ్ నెలకొంది. దీంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నాలుగుశాతం ర్యాలీ చేసింది. రూపాయి 11 పైసల పతనం కావడం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. వీటితో పాటు రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు కూడా రాణించాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లతో పాటు ఆర్థిక, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆర్బీఐ సర్దుబాటు వైఖరికి మద్దతుగా ఉదయం సెషన్లో కొనుగోళ్లు జరిగాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 111 కోట్ల పెట్టుబడులు పెట్టగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.553 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. వడ్డీరేట్లపై మరిన్ని రోజులు సానుకూల వైఖరినే ప్రదర్శించాల్సి ఉంటుందని ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశపు మినిట్స్‌లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పరిమితి లాభాలతో కదలాడుతున్నాయి. మిడ్‌సెషన్ నుంచి అమ్మకాలు... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 223 పాయింట్ల లాభంతో 49,885 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగిన 14,875 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మెటల్, ఐటీ, రియల్టీ రంగాల షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 50 వేల స్థాయి అందుకుంది. గరిష్టంగా 456 పాయింట్లు ఎగసి 50,118 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 14,984 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మిడ్ సెషన్ సమయంలో యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో కదలాడటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సూచీలు కొంతమేర ఉదయం లాభాల్ని కోల్పోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► రేటింగ్ అప్‌గ్రేడ్‌తో టాటా స్టీల్ షేరు రూ.956 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 5% లాభంతో రూ.918 వద్ద ముగిసింది. ► క్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మెరుగైన ఉత్పత్తిని సాధించడంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు తొమ్మిది శాతం లాభంతో రూ.614 వద్ద స్థిరపడింది. ► బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ షేరు వరుసగా రెండోరోజూ 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.705 వద్ద ముగిసింది. -
తొలుత జూమ్.. తుదకు ఫ్లాట్
ముంబై: రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమయ్యాయి. అయితే విదేశీ మార్కెట్ల ప్రభావంతో చివర్లో అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడి 50,441 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 14,956 వద్ద స్థిరపడింది. రోజంతా స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు కదిలాయి. తొలి గంటలో సెన్సెక్స్ 667 పాయింట్లు జంప్‌చేసి 50,986ను తాకింది. తదుపరి ఆసియా మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్స్ బలహీనపడటంతో వెనకడుగు వేసింది. చివరి అర్ధగంటలో నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 50,318 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 15,111–14,920 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. కాగా.. 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర వేయడంతో తొలుత సెంటిమెంటుకు జోష్‌వచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఎంసీజీ డీలా ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, మెటల్, ఐటీ, ఫార్మా రంగాలు 1.6–0.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే రియల్టీ 1 శాతం, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, గెయిల్, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, ఐవోసీ, యాక్సిస్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ 7–1.5 శాతం మధ్య ఎగిశాయి. ఈ బాటలో పవర్‌గ్రిడ్, బీపీసీఎల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఆర్ఐఎల్, సిప్లా సైతం 1.2–0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్, టైటన్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, బ్రిటానియా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.2–0.5 శాతం మధ్య క్షీణించాయి. ఎఫ్‌అండ్‌వో ఇలా... డెరివేటివ్ విభాగంలో పీఎఫ్సీ, ఐఆర్సీటీసీ, గ్లెన్‌మార్క్, ఎన్ఎండీసీ, నాల్కో, భెల్, టొరంట్ పవర్, సెయిల్, ఎల్అండ్టీ టెక్నాలజీ, జీ, కమిన్స్ ఇండియా 4.6–3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క అపోలో టైర్, టీవీఎస్ మోటార్, ముత్తూట్ ఫైనాన్స్, బెర్జర్ పెయింట్స్, పిడిలైట్, జూబిలెంట్ ఫుడ్, ఇండిగో, పేజ్, ఎంఫసిస్, బాటా 3.2–1.8 శాతం మధ్య నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.3–0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. వారాంతాన సైతం ఎఫ్‌పీఐలు రూ. 2,014 కోట్ల అమ్మకాలు చేపట్టడం గమనార్హం! -
ఐపీఓ జోష్ భద్రం బాస్!
గడిచిన పది నెలలుగా స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీ చేస్తుండడం.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్‌కు జోష్‌నిస్తోంది. కొత్త కొత్త కంపెనీలు బుల్ మార్కెట్ అండతో, భారీగా నిధులు సమీకరించుకునేందుకు... స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయ్యేందుకు ఐపీవో బాట పడుతున్నాయి. లిస్టింగ్‌తోనే రెట్టింపునకు పైగా లాభాలు కురిపిస్తుండడంతో (కొన్ని ఇష్యూలు) రిటైల్ ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ, ప్రతీ ఐపీవో లాభాలు కురిపిస్తుందన్న ఆశతో వెళితే చేతులు కాలే ప్రమాదం ఉందని గత అనుభవాలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తగిన అధ్యయనం తర్వాతే ఐపీవోల్లో పాల్గొనడం ద్వారా ఆశించిన లాభాలను కళ్ల చూడగలరని అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్లకు బుట్టెడు లాభాలను పంచినవే కాదు.. పెట్టుబడిని ఆసాంతం హరించేసిన ఇష్యూలు కూడా ఉన్నాయి. కనుక ఐపీవో మార్కెట్లో చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయడంపై అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది... 2020 రెండో అర్ధభాగంలో 14 ఐపీవోలు ప్రజల నుంచి సుమారు రూ.16,272 కోట్లను సమీకరించాయి. ఇక ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఐదు ఐపీవోలు మార్కెట్‌ను పలకరించాయి. మరెన్నో సంస్థలు త్వరలో ఐపీవోలకు వచ్చేందుకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తుండగా.. ఇంకొన్ని సంస్థలు ఐపీవో ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఐపీవోల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత వేలంవెర్రిగా ఉన్నారంటే.. ఇటీవలే ముగిసిన నురేకా ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటాకు ఏకంగా 166 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. కానీ, అన్ని ఐపీవోలు ఇన్వెస్టర్లకు రాబడులు కురిపిస్తాయన్న గ్యారంటీ లేదనే విషయాన్ని ఎక్కువ మంది పట్టించుకోవడం లేదు. 2015 నుంచి 2021 జనవరి వరకు 142 ఐపీవోలు ప్రజల నుంచి నిధులు సమీకరించగా.. అందులో 55 స్టాక్స్ ఇప్పటికీ వాటి ఐపీవో జారీ ధర కంటే తక్కువలోనే ట్రేడవుతున్నాయి. అయితే, ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఎన్నో రెట్లు వృద్ధి చేసిన ఇష్యూలు కూడా ఉన్నాయి. అందుకే ఆణిముత్యాల్లాంటి ఐపీవోలను ఇన్వెస్టర్లు గుర్తించగలగాలి. అప్పుడే వారి కష్టార్జితాన్ని కరిగిపోకుండా చూసు కోవచ్చు. 49 ఇష్యూలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు అంతకు మించి వృద్ధి చేశాయి. వాటిల్లో ఐఆర్సీటీసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సీడీఎస్ఎల్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్‌మొబైల్ ఉన్నాయి. ముఖ్యంగా డిక్సన్ టెక్, అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్), ఐఆర్సీటీసీ అయితే వాటి ఐపీవో ధరలతో పోలిస్తే.. ఐదింతల కంటే ఎక్కువే ఇప్పటి వరకు పెరిగాయి. మరి ఇన్వెస్టర్ల పెట్టుబడులను కరిగించేసిన వాటిల్లో ఆర్టెల్ కమ్యూనికేషన్స్, యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ తదితర కంపెనీలు కూడా ఉన్నాయని మర్చిపోవద్దు. ఈ రెండూ 2015లో ఐపీవో ముగించుకోగా, నాటి నుంచి నేటి వరకు ఇన్వెస్టర్ల పెట్టుబడులను 95 శాతం తుడిచిపెట్టేశాయి. ఇక మన్‌పసంద్ బెవరేజెస్ తదితర కొన్ని కంపెనీలు ట్రేడింగ్ నుంచి కనుమరుగైపోయాయి. కారణం కార్పొ రేట్ గవర్నెన్స్ అంశాలే. అందుకే మెరుగైన ఇష్యూలను గుర్తించగలిగితేనే ఇన్వెస్టర్లు ఆశించిన లక్ష్యాలను చేరుకోగలరు. అనుకరించడం తెలియాలి.. ఇటీవలి బర్గర్ కింగ్, ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూలకు సంస్థాగత ఇన్వెస్టర్లు (ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు), అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్ల (హెచ్ఎన్ఐ) నుంచి అధిక స్పందన లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లూ వీరికేమీ తీసిపోలేదు లేండి. కానీ, తెలివిగా మసలుకోకపోతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా పరిస్థితి మారుతుంది. ఎందుకంటే ఇనిస్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐల స్పందన ఆధారంగా ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు.. వారికి మాదిరే ఆయా కౌంటర్ల నుంచి ఎప్పుడు బయటపడాలన్నది తప్పకుండా తెలిసి ఉండాలి. ఉదాహరణకు.. 2017లో వచ్చిన కెపాసిట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఐపీవోను చెప్పుకోవాలి. నాడు ఈ ఐపీవో 130 రెట్లు అధికంగా స్పందన అందుకుంది. క్యూఐబీ, ఎఫ్ఐఐల కోటా 52 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. ఇష్యూ ధరపై 37 శాతం అధిక స్థాయిలో లిస్ట్ అయింది. కానీ, మూడు నెలల్లోనే ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులు తమ వాటాలను సగం మేర తగ్గించేసుకున్నారు. దీనికి రియల్ ఎస్టేట్ పరిస్థితులు కూడా కారణం. 2017 సెప్టెంబర్ నాటికి 26.9 శాతంగా ఉన్న వాటా.. అదే ఏడాది డిసెంబర్ చివరికి 13.2 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాతి సంవత్సరంలో ఈ స్టాక్ 30 శాతానికి పైగా నష్టపోయింది. ఇప్పటికీ ఈ స్టాక్ ధర నాటి ఐపీవో ధరతో పోలిస్తే 13 శాతం తక్కువలోనే ట్రేడవుతోంది. హడ్కో ఇష్యూ కూడా ఇదే పాఠం చెబుతోంది. హడ్కో ఐపీవోకు ఇనిస్టిట్యూషనల్ (క్యూఐబీ) విభాగం నుంచి 50 రెట్ల కంటే అధిక స్పందన వచ్చింది. లిస్టింగ్ రోజే స్టాక్ ధర 20% లాభపడడంతో ఇనిస్టిట్యూషన్స్ లాభాల స్వీకరణ చేశాయి. కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం హడ్కో మరింత రాబడులు ఇస్తుందని కొనసాగగా.. ఐపీవో ధరతో పోలిస్తే ఇప్పటికీ షేరు ధర దిగువనే ట్రేడవుతోంది. బర్గర్ కింగ్ ఐపీవోలోనూ పెద్ద ఎత్తున పాల్గొన్న హెచ్ఎన్ఐలు, క్యూఐబీలు లిస్టింగ్ తర్వాత కొంతమేర లాభాలను తీసుకున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నియంత్రణ అంశాల ప్రభావం ప్రభుత్వం ఆదేశాలు, నియంత్రణ సంస్థల ఆదేశాలూ కొన్ని కంపెనీల భవిష్యత్తును మార్చేయగలవు. వీటి పట్ల కూడా ఇన్వెస్టర్లు అవగాహనతో ఉండాలి. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల పరంగా బ్యాంకుల స్టాక్స్ కదలికలు ఉంటుంటాయి. 2015లో ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు లైసెన్స్‌లను 10 ఎన్‌బీఎఫ్‌సీలకు జారీ చేసినప్పుడు.. రూ.500 కోట్ల నికర విలువ సంతరించుకున్న మూడేళ్లలోగా పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలన్న నిబంధన విధించింది. ఈ ఆదేశాల కారణంగానే గడిచిన ఐదేళ్లలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐపీవోలకు రావాల్సి వచ్చింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గతేడాది ఐపీవోకు ముగించుకుంది. ఈ తరహా నిబంధన మాతృ సంస్థ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ హోల్డింగ్స్ షేర్లపై ప్రభావం చూపించింది. బంధన్ బ్యాంకు కూడా ఆర్బీఐ ఆదేశాల కారణంగా ప్రభావితమైనదే. ప్రమోటర్ల వాటాలను నిబంధనల మేరకు తగ్గించుకోవాల్సి రావడం స్టాక్ ధరలపై ప్రభావం పడేలా చేసింది. లిస్ట్ అయిన ఏడాదిలోనే ప్రమోటర్లు తమ వాటాలను 40%కి తగ్గించుకోవాల్సి వచ్చింది. తమ వాటాలు తగ్గించుకునేందుకు అదనపు సమయం ఇవ్వాలని బంధన్ బ్యాంకు ప్రమోటర్లు కోరగా, ఆర్బీఐ తిరస్కరించడంతోపాటు జరిమానాలను విధించి, బ్యాంకు శాఖల విస్తరణపై కొంత కాలం పాటు ఆంక్షలను కూడా అమలు చేసింది. కనుక విధానపరమైన నిర్ణయాల ప్రభావం స్టాక్స్‌పై ఉంటుందని అర్థం చేసుకోవాలి. కనుక ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేసిన వారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి కంపెనీ మూలాలు, స్టాక్స్ విలువలు వచ్చిన ప్రతీ నూతన ఇష్యూకు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకోవడం కాకుండా.. ఆ కంపెనీ బలా, బలాలు, విలువను తెలుసుకోవడం ద్వారా సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2017 బుల్ మార్కెట్ సమయంలో ప్రతాప్ స్నాక్స్ ఐపీవోకు వచ్చింది. 2016–17 ఆర్థిక సంవత్సరం లాభాలతో పోలిస్తే ఇష్యూ ధరను 200 రెట్లు అధిక స్థాయిల వద్ద నిర్ణయించింది. లిస్టింగ్ రోజు అయితే 25 శాతం లాభం ఇచ్చింది కానీ, ఏడాది కాలంలో స్టాక్ ధర నికరంగా 12.6 శాతం తక్కువకు పడిపోయింది. ఇప్పటికీ ఈ షేరు ధర నాటి ఇష్యూ ధరతో పోలిస్తే 29 శాతం తక్కువకు లభిస్తోంది. అంటే మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను ఈ కంపెనీ ప్రమోటర్లు క్యాష్ చేసుకోవడంలో సఫలమైనట్టు తెలుస్తోంది. 2016 మేలో వచ్చిన పరాగ్ మిల్క్ ఫుడ్ ఐపీవో కూడా మరో ఉదాహరణ. 2015–16 సంవత్సరపు లాభాల కంటే ఒక్కో షేరును 44 రెట్ల అధిక విలువకు కంపెనీ ఆఫర్ చేసింది. కానీ, లిస్టింగ్ రోజు 15% లాభాలను చూపించిన ఈ షేరు.. తర్వాతి సంవత్సరంలో పతనమైంది. ఎందుకంటే కంపెనీ లాభాలు 2016–17లో 80% క్షీణించడమే కారణం. నాడు ఐపీవోలో షేర్లను పొంది, అలాగే కొనసాగి ఉంటే ఇప్పటికి పెట్టుబడి నికరంగా 50% తగ్గిపోయి ఉంటుంది. ఆర్బీఎల్ బ్యాంకు కూడా ఇందుకేమీ తీసిపోలేదు. గతేడాది కరోనా తర్వాత ఎన్పీఏలు పెరిగిపోతాయంటూ బ్యాంకు యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు, రుణ ఆస్తుల నాణ్యత, వసూళ్ల సామర్థ్యాలు క్షీణించడం వల్ల షేరు ధర ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి భారీగా పతనమైంది. తర్వాత కోలుకున్నప్పటికీ.. ఐపీవో ధర కంటే ఇంకా దిగువనే ట్రేడవుతోంది. కనుక కంపెనీల ఆర్థిక మూలాలు, అంతకుముందు కొన్నేళ్లలో వాటి పనితీరు, మేనేజ్మెంట్ సామర్థ్యం, రంగం, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, పనితీరులో పురోగతి వీటన్నింటినీ చూసి ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. షేర్ల ఎంపికే లాభాలను నిర్ణయించగలవని ఈ నిదర్శనాలు తెలియజేస్తున్నాయి. పరిస్థితులు మారిపోనూవచ్చు.. ఆయా రంగాల్లో ఒక్కసారిగా వచ్చిన మార్పుల కారణంగా కంపెనీల లాభాలు దూసుకుపోవచ్చు. అందుకే కంపెనీ వ్యాపార మూలాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మోదీ సర్కారు మొదటి విడతలో మౌలిక రంగ కంపెనీల్లో జోరు కనిపించింది. భారత్ మాల, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఇందుకు మద్దతునిచ్చాయి. దీంతో 2015–17 కాలంలో ఇన్ఫ్రా కంపెనీల ఐపీవోల్లో కదలికలు పెరిగాయి. అదే సమయంలో వచ్చిన కెపాసిట్ ఇన్ఫ్రా ఇష్యూ అయితే భారీ స్పందనను దక్కించుకుంది. 2015లో పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, 2016లో దిలీప్‌బిల్డ్‌కాన్ పబ్లిక్ ఇష్యూలకు వచ్చి జారీ ధరతో పోలిస్తే రెట్టింపునకు పైగా ఇన్వెస్టర్లకు లాభాలను తినిపించాయి. కానీ, ఇప్పుడు చూస్తే.. వాటిల్లో కెపాసిట్ ఇన్ఫ్రా, సద్బావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, భారత్ రోడ్ నెట్వర్క్, పవర్‌మెక్ కంపెనీలు ఐపీవో ధర కంటే 13–84 శాతం తక్కువలో కోట్ అవుతున్నాయి. 2020లో చైనా వ్యతిరేక సెంటిమెంట్ కూడా కెమికల్, ఫార్మా కంపెనీలకు బాగా కలిసొచ్చింది. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్, రోసారి బయోటెక్ సంస్థల ఐపీవోలకు మంచి స్పందన రావడమే కాకుండా, లిస్టింగ్‌తో గణనీయంగా లాభపడ్డాయి కూడా. కాకపోతే ఈ తరహా ధోరణలు స్వల్పకాలమా.. లేక దీర్ఘకాలం పాటు కొనసాగుతాయా అన్న అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. -
రోజుకు ఈ కార్పొరేట్ కపుల్ సంపాదన ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: భారీ పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ ఝన్ వాలా పెట్టుబడులు గురించి స్టాక్ మార్కెట్లో తెలియని వారుండరు. ఇండియన్ వారెన్ బఫెట్‌గా పిల్చుకునే రాకేష్ తన భార్య రేఖాతో కలిసి సంయుక్తంగా రోజుకు ఎంత ఆదాయాన్ని సాధిస్తారో తెలిస్తే షాక్ అవ్వకమానరు. తాజా గణాంకాల ప్రకారం స్టాక్ మార్కెట్లో ఈ దంపతులు రోజుకు రూ.18.4కోట్లు సంపాదించారు. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎన్సీసీ లిమిటెడ్ షేర్లు భారీగా పుంజుకోవడం ఝన్ ఝన్ వాలా దంపతుల ఆదాయం కూడా అదే రేంజ్లో ఎగిసింది. 11 ట్రేడింగ్ సెషన్లలోఎన్సీసీ 202.49 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో వీరు 7.83 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. నికర ఎన్సిసి షేర్లలో 12.84 శాతం వాటాను ఈ జంట సొంతం. జనవరి 29న రూ .58.95 వద్ద ముగిసిన ఎన్సిసి స్టాక్ ఫిబ్రవరి 15 నాటికి 43.85 శాతం పెరిగి రూ .84.80 వద్ద ముగిసింది. తద్వారా ఈ దంపతుల షేర్ల విలువ 664.26 కోట్ల రూపాయలకు పెరిగింది. 11 రోజుల్లో మొత్తం లాభం రూ.202.49 కోట్లుగా నమోదైంది. అంటే రోజుకు రూ.18.4 కోట్లు రాకేష్, రేఖా ఖాతాల్లో చేరినట్టన్నమాట. మరోవైపు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న బుధవారం (ఫిబ్రవరి 17న) నాటి మార్కెట్లో కూడా ఎన్సీసీ షేరు ధర రూ.89.15 గా ఉండటం విశేషం. -
మళ్లీ బుల్ పరుగు..!
ముంబై: జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో స్టాక్ మార్కెట్ సోమవారం మళ్లీ రికార్డుల బాట పట్టింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త శిఖరాలపైన ముగిశాయి. సెన్సెక్స్ 610 పాయింట్లు లాభపడి తొలిసారి 52 వేల శిఖరంపైన 52,154 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు ర్యాలీ చేసి 15,314 వద్ద నిలిచింది. మార్కెట్ రికార్డు ర్యాలీలోనూ ఐటీ, మెటల్, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 692 పాయింట్లు లాభపడి 52,236 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 15,340 వద్ద కొత్త జీవికాల గరిష్టాలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.1.22 లక్షల కోట్లను ఆర్జించగలిగారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.205.14 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 72.68 వద్ద స్థిరపడింది. ఏడు ట్రేడింగ్ సెషన్‌ల్లో 1154 పాయింట్లు... ఈ ఫిబ్రవరి 5న సెన్సెక్స్ సూచీ తొలిసారి 51000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే సూచీ 1154 పాయింట్లను ఆర్జించి సోమవారం 52,154 వద్ద ముగిసింది. ఇదే ఏడాది జనవరి 07న సెన్సెక్స్ 50000 స్థాయిని అధిగమించింది. కాగా 50వేల నుంచి 51 వేల స్థాయికి చేరుకునేందుకు 11 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్ల అనూహ్య ర్యాలీతో ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ మూడు శాతానికి పైగా లాభపడి జీవితకాల రికార్డు స్థాయి 37306 వద్ద ముగిసింది. ► నిఫ్టీ–50 ఇండెక్స్‌లో మొత్తం ఏడు స్టాకులు ఏడాది గరిష్టాన్ని తాకగా.., అందులో ఐదు స్టాక్‌లు ఆర్థిక రంగానికి చెందినవి కావడం విశేషం. ► యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు షేర్లు నాలుగు నుంచి ఆరు శాతం ర్యాలీ చేశాయి. ► మెరుగైన క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో అపోలో హాస్పిటల్ షేరు 12 శాతం లాభపడి ఏడాది గరిష్టానికి ఎగసింది. ► ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో అమరరాజా బ్యాటరీస్ ఆరు శాతం పతనమై, రూ.928 వద్ద ముగిసింది. మార్కెట్ ఉత్సాహానికి కారణాలు... ► మెరుగైన ఆర్థిక గణాంకాలు... గత వారాంతంలో వెలువడిన డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ను మెప్పించాయి. పారిశ్రామికోత్పత్తి ఆశించిన స్థాయిలో నమోదుకాగా., రిటైల్ ద్రవ్యోల్బణమూ దిగివచ్చింది. అలాగే సోమవారం విడుదలైన జనవరి హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఆర్థికవేత్తల అంచనాలకు తగ్గట్లు 2.03 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఆర్బీఐ ఇక ఇప్పట్లో కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ► కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. యూఎస్ బాండ్ ఈల్డ్ గతేడాది మార్చి తర్వాత పెరిగింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆమోదానికి దాదాపు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఫలితంగా గత శుక్రవారం అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగిశాయి. ఒక సోమవారం జపాన్ ఇండెక్స్ నికాయ్ రెండు శాతం లాభపడి 1990 తర్వాత తొలిసారి 30వేల స్థాయిని తాకింది. సింగపూర్, థాయిలాండ్, దక్షిణ కొరియా దేశాలు అరశాతం నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు సైతం రెండుశాతం ఎగిశాయి. ► మెప్పించిన కార్పొరేట్ ఫలితాలు... కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకటన అంకం ముగిసింది. ఆర్థిక పురోగతిపై ఆశలు, పండుగ సీజన్లో నెలకొన్న డిమాండ్ లాంటి అంశాలు కలిసిరావడంతో ఈ క్యూ3 లో కంపెనీలు రెండింతల వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఈ క్యూ3లో సుమారు 3087 కంపెనీల సరాసరి నికరలాభం 69 శాతం పెరిగినట్లు ఓ సర్వే తెలిపింది. ► కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు... భారత మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) బుల్లిష్ వైఖరిని కలిగి ఉండటం కూడా సూచీల రికార్డు ర్యాలీకి కొంత తోడ్పడింది. దేశీయ మార్కెట్లో ఈ ఫిబ్రవరి 15 నాటికి ఎఫ్ఐఐలు రూ.20,700 కోట్ల ఈక్విటీ షేర్లను కొన్నారు. కేంద్ర బడ్జెట్ మెప్పించడం, వడ్డీరేట్లపై ఆర్బీఐ సులభతర వైఖరి, లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ప్రపంచ దేశాల్లోకెల్లా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ అవుతుండటం, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండటం తదితర కారణాలతో ఎఫ్ఐఐలు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. -
మార్కెట్‌కు రిలయన్స్ అండ
ముంబై: అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు నాలుగు శాతానికి పైగా లాభపడటంతో సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు కూడా సూచీల లాభాలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 51,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 15,173 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు ఆల్‌టైం హై కావడం విశేషం. కన్జూమర్, ఐటీ, మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటో, ఆర్థిక, మీడియా, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 435 పాయింట్ల పరిధిలో 51,157 – 51,592 శ్రేణిలో కదలాడగా.., నిఫ్టీ 123 పాయింట్ల రేంజ్లో 15,065 –15,188 స్థాయిల మధ్య ట్రేడైంది. ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప జేసే డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), జనవరి రిటైల్ ధరల(సీపీఐ) ఆర్థిక గణాంకాలు నేడు (శుక్రవారం) విడుదల అవుతాయి. ఇన్వెస్టర్లు ఈ స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి సారించనున్నారు. మార్కెట్లో మూమెంటమ్ ఇలాగే కొనసాగితే నిఫ్టీ తనకు కీలక నిరోధంగా ఉన్న 15,250 స్థాయిని ఛేదించవచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నాలుగు శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్ ... ఫ్యూచర్ రిటైల్‌లో రిలయన్స్ వాటా కొనుగోలు ఒప్పందానికి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించడంతో గత కొన్ని రోజులుగా నష్టాన్ని చవిచూస్తున్న రిలయన్స్ షేరు గురువారం రాణించింది. ఈ షేరు బీఎస్ఈలో రూ.1,980 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 4.55 శాతం ఎగిసి రూ.2064 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4.13 శాతం లాభంతో రూ.2056 వద్ద స్థిరపడింది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,718 కోట్ల ఒప్పందం విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై మంగళవారం ఢిల్లీ డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ మార్కెట్లకు పావెల్ వ్యాఖ్యల జోష్... అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు, కొత్త ఉద్యోగాల సృష్టి ఆశించిన స్థాయికి చేరుకునే వరకు అవసరమైతే భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లను మరింత తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ జెరోమ్ పావెల్ వెల్లడించారు. పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, జపాన్, సౌత్ కొరియా మార్కెట్లకు గురువారం సెలవు రోజు. మార్కెట్లో మరిన్ని సంగతులు... 1. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించడంతో హిందా ల్కో షేరు ఆరు శాతం లాభపడింది 2. రూట్ మొబైల్ షేరు ఇంట్రాడేలో 20 శాతం ఎగసి రూ.1,527 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ అయ్యింది. 3. డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు మెప్పించినా ఎంఆర్ఎఫ్ షేరు ఏడు శాతం పతనమై రూ.90,084 వద్ద స్థిరపడింది. 4. ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఐటీసీ షేరు అరశాతం క్షీణించి రూ.227 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్–నిఫ్టీ.. రేసు గుర్రాలు
ముంబై: కోవిడ్–19 నేపథ్యంలోనూ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధిస్తుండటం, వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రకటించడం వంటి అంశాలతో దేశీ స్టాక్ మార్కెట్లు రేసు గుర్రాల్లా పరుగెడుతున్నాయి. వీటికి జతగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్ 617 పాయింట్లు జంప్‌చేసి 51,349 వద్ద ముగిసింది. నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 15,116 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 51,523 వద్ద, నిఫ్టీ 15,160 వద్ద సరికొత్త రికార్డులను అందుకున్నాయి. విదేశీ మార్కెట్లలోనూ బుల్లిష్ ట్రెండ్ నెలకొనడంతో దేశీయంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, మెటల్, ఐటీ, రియల్టీ 3.2–2 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ 1–0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, హిందాల్కో, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, గెయిల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ 7.4–2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బ్రిటానియా, హెచ్‌యూఎల్, కొటక్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ 2–0.4 శాతం మధ్య నీరసించాయి. ఎఫ్‌అండ్‌వోలో డెరివేటివ్ కౌంటర్లలో కంకార్, రామ్‌కో సిమెంట్, ఎక్సైడ్, అదానీ ఎంటర్, నౌకరీ, సెయిల్, కోఫోర్జ్, మదర్సన్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, భారత్ ఫోర్జ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, అమరరాజా 7–5 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. మరోపక్క భెల్, పీఎన్బీ, మణప్పురం, ఐడియా, గోద్రెజ్ సీపీ, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బీవోబీ 3.7–1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. నేటి ట్రేడింగ్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో దాదాపు రూ. 1,877 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 505 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. 2.5 లక్షల కోట్లు ప్లస్ మార్కెట్ల తాజా ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు రూ. 2.5 లక్షల కోట్లు జమయ్యింది. గత 6 రోజుల్లో రూ. 16.7 లక్షల కోట్లు బలపడింది. దీంతో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ. 202.82 లక్షల కోట్లకు చేరింది. ఇది కూడా రికార్డు కావడం విశేషం! స్టాక్స్ విశేషాలివీ n బడ్జెట్లో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచడంతో బజాజ్ ఫిన్సర్వ్ వరుసగా ఆరో రోజు ర్యాలీతో 52 వారాల గరిష్టానికి చేరింది. n క్యూ3లో నిర్వహణ లాభం 28% పెరగడంతో శ్రీ సిమెంట్ షేరు కొత్త గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.01 లక్షల కోట్లకు చేరింది. 6 రోజుల్లో ఈ షేరు 23% ర్యాలీ చేసింది. n క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఎంఅండ్ఎం, బజాజ్ ఎలక్ట్రికల్స్, గుజరాత్ గ్యాస్, అఫ్లే ఇండియా కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. n ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 23.5% వాటాను సొంతం చేసుకోవడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ 52 వారాల గరిష్టానికి చేరింది. -
నిఫ్టీ @ 15000
ముంబై: ట్రేడింగ్‌లో ఒడిదుడుకులకు లోనైన సూచీలు శుక్రవారం చివరికి లాభాలతోనే ముగిశాయి. ఇంట్రాడేలో 51 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 50,732 వద్ద స్థిరపడింది. అలాగే తొలిసారి 15000 స్థాయిని తాకిన నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 14,924 వద్ద నిలిచింది. సూచీలకిది అయిదో రోజు లాభాల ముగింపు. ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటో, ఐటీ, మీడియా, ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. వరుస ర్యాలీతో జోష్ మీదున్న సూచీలు ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్ 51 వేల స్థాయిని, నిఫ్టీ 15 వేల మార్క్‌ను అందుకున్నాయి. అనంతరం... ఊహించినట్లుగానే ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో సూచీల గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 508 పాయింట్ల రేంజ్లో 50,565 – 51,073 శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ 150 పాయింట్ల పరిధిలో 14,865 – 15,015 స్థాయిలో ట్రేడైంది. ఈ వారంలో సెన్సెక్స్ 4446 పాయింట్లు, నిఫ్టీ 1289 పాయింట్లను ఆర్జించాయి. గతేడాది ఏప్రిల్ 10తో ముగిసిన వారం తర్వాత సూచీలు అత్యధికంగా లాభపడిన వారం ఇదే. ‘‘మంచి వ్యాల్యూమ్స్ మద్దతుతో మార్కెట్ పటిష్టమైన స్థితిలో ముగిసింది. నిఫ్టీకి 15,000 స్థాయి కీలక నిరోధంగా మారింది. ఇప్పటికీ బుల్లిష్ వైఖరినే కలిగి ఉన్నాము. త్వరలో నిఫ్టీ 15200 స్థాయికి చేరుకోవచ్చు. పతనమైన ప్రతిసారి కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేస్తే మంచింది.’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ నిపుణుడు రుస్మిక్ ఓజా సలహానిస్తున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► డిసెంబర్ క్వార్టర్లో ఆస్తుల నాణ్యత మెరుగుపడిందని ఎస్బీఐ ప్రకటించడంతో ఈ బ్యాంకు షేరు 11% లాభంతో రూ.393 వద్ద ముగిసింది. ► ఫిబ్రవరి 11న జరిగే బోర్డు సమావేశంలో మధ్యంతర డివిడెండ్ ప్రకటనపై చర్చిస్తామని ఐటీసీ ఎక్సే్చంజ్‌లకు సమాచారం ఇవ్వడంతో కంపెనీ షేరు రెండు శాతం లాభపడింది. ► క్యూ3 లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేరు 20% లాభపడింది. -
నాన్‌స్టాప్.. సెన్సెక్స్‌ప్రెస్!
ముంబై: స్టాక్ మార్కెట్లో బడ్జెట్ ర్యాలీ గురువారం కూడా కొనసాగడంతో సూచీలు నాలుగో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చనే ఆశలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి నికర కొనుగోలుదారులుగా మారారు. మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న కార్పొరేట్ కంపెనీల గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదవుతున్నాయి. ఈ సానుకూల పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 359 పాయింట్లు లాభపడి 50,614 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 106 పాయింట్లు ఎగసి 14,896 పాయింట్ల వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. నష్టాల్లోంచి లాభాల్లోకి...! ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పాటు మూడు రోజుల భారీ లాభాల నేపథ్యంలో ఉదయం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా సెన్సెక్స్ 330 పాయింట్లు కోల్పోయి 49,926 స్థాయికి, నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 14,715 వద్దకి చేరుకున్నాయి. అయితే మిడ్ సెషన్ తర్వాత బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలతో పాటు కీలక రంగాల షేర్లలో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో సూచీలు నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 50,688 వద్ద, నిఫ్టీ 14,914 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ చూపు ఆర్బీఐ ప్రకటన వైపు ... ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీ నిర్ణయాలు శుక్రవారం (ఫిబ్రవరి 5న) విడుదల అవుతాయి. ఈసారి కూడా ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే బడ్జెట్ 2021 పై, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం తదితర అంశాలపైన ఆర్బీఐ గవర్నర్ చేసే వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. మార్కెట్ తదపరి గమనం ఆర్బీఐ నిర్ణయంపైనా ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఐటీసీ షేరు 6% పైగా ఎగసి రూ.230 వద్ద ముగిసింది. ► జనవరిలో ట్రాక్టర్ అమ్మకాలు పెరగడంతో మహీంద్రా 4 శాతం ర్యాలీ చేసింది. ► డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు బాగుండటంతో బజాజ్ కన్జూమర్ షేరు 3 శాతం పెరిగింది. ► మెరుగైన ఫలితాలతో ప్రిన్స్ పైప్స్ 19% లాభపడింది. ఇన్వెస్టర్ల సంపద @ రూ.200 లక్షల కోట్లు కేంద్రం ప్రవేశపెట్టిన వృద్ధి ప్రోత్సాహక బడ్జెట్ ఈక్విటీ మార్కెట్‌ను మెప్పించడంతో బెంచ్‌మార్క్ సూచీలు రోజుకో సరికొత్త రికార్డును లిఖిస్తున్నాయి. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) గురువారం తొలిసారి రూ.200 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ ముగిసేసరికి రూ.200.47 లక్షల కోట్ల వద్ద నిలిచింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ విలువ 2014 నవంబర్ 28న తొలిసారి రూ.100 లక్షల కోట్లను అందుకుంది. బీఎస్ఈ ఎక్సే్చంజ్‌లో లిస్టయిన మొత్తం కంపెనీల సంఖ్య 3,128 ఉండగా, నమోదిత ఇన్వెస్టర్లు 6 కోట్ల మందికి పైగా ఉన్నట్లు బీఎస్ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశ సంపద సృష్టిలో బీఎస్ఈ ఎక్సే్చంజ్ ప్రధాన భూమిక పోషిస్తుండటం తమకెంతో సంతోషాన్నిస్తుందని ఎక్సే్చంజ్ సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ తెలిపారు. వర్ధమాన దేశాల ఎక్సే్చంజ్‌లు ఈ మార్కెట్ క్యాప్ విషయంలో బీఎస్ఈ దరిదాపుల్లో కూడా లేవని ఆయన పేర్కొనారు. నమోదిత కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ పరంగా ప్రపంచదేశాల ఎక్సే్చంజ్‌ల్లో బీఎస్ఈ ఎక్సే్చంజ్ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నట్లు ఆశిష్ పేర్కొన్నారు. -
50,000 శిఖరంపైకి సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడోరోజూ బడ్జెట్ సందడి కొనసాగడంతో సెన్సెక్స్ సూచీ తొలిసారి 50 వేల శిఖరస్థాయి పైన ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా జీవితకాల గరిష్ట స్థాయిపై స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరిని ప్రదర్శించడం లాంటి అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 458 పాయింట్లు లాభపడి 50,256 వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు పెరిగి 14,790 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఇంట్రాడేలో బ్యాంకింగ్, ఆర్థిక, ఫార్మా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్లు జరిగాయి. సిమెంట్, ఎఫ్ఎంసీజీ స్టాకుల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకొని నష్టాలను చవి చూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు కొంత నష్టాలను చవిచూసినప్పటికీ.., ఆ తర్వాత తమ జోరును కనబరిచాయి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా మార్కెట్ ముగింపు వరకు సూచీల ర్యాలీ సాఫీగా సాగింది. ఒక దశలో సెన్సెక్స్ 728 పాయింట్లు లాభపడి 50,526 వద్ద, నిఫ్టీ 222 పాయింట్లు పెరిగి 14,869 వద్ద తమ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు చరిత్రాత్మక మైలురాళ్లను అధిగమించిన నేపథ్యంలో బుధవారం ఇన్వెస్టర్లు రూ.1.84 లక్షల కోట్లను ఆర్జించారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.198.45 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక పైసా స్వల్ప లాభంతో ఫ్లాట్‌గా ముగిసింది. ‘‘బడ్జెట్లో మూలధన ప్రణాళికలకు అధిక వ్యయాన్ని కేటాయించారు. ఇవి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల మెరుగైన ఫలితాలు, ప్రపంచ మార్కెట్ల నుంచి మద్దతు లభిస్తోంది. శుక్రవారం వెలువడే ఆర్బీఐ పాలసీ నిర్ణయం రానున్న రోజుల్లో మార్కెట్‌కు కీలకం కానుంది’ అని రియలన్స్ సెక్యూరిటీస్ హెడ్ స్ట్రాటజీ బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. లిస్టింగ్‌లో మురిపించినా, ఫ్లాట్ ముగింపే..! హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ... లిస్టింగ్ లాభాలను నిలుపుకోవడంలో విఫలమైంది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.518)తో పోలిస్తే ఈ షేరు 18% ప్రీమియంతో రూ. 612 వద్ద లిస్ట్ అయ్యింది. ఇంట్రాడేలో 23.45 శాతం ర్యాలీ చేసి రూ. 639.50 స్థాయికి ఎగిసింది. షేరు దూసుకెళ్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు అనూహ్యంగా లాభాల స్వీకరణ జరిపారు. ఫలితంగా చివరికి 1.81% స్వల్ప లాభంతో రూ.527.40 వద్ద ముగిసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► రిలయన్స్ రిటైల్‌తో కుదుర్చుకున్న ఒప్పంద విషయంలో యథాస్థితిని కొనసాగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 5 శాతం నష్టపోయింది. ► క్యూ3 మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో హెచ్డీఎఫ్సీ షేరు 2 శాతం లాభపడింది. ► ఇండస్ఇండ్ బ్యాంకు 7 శాతం లాభపడి తొలిసారి రూ.1000పైన ముగిసింది. ► టాటా మోటార్స్ షేరు 3% లాభపడటంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్లను అధిగమించింది. ► మూడో త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు రూ.622 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 1.60 శాతం లాభంతో రూ.609 వద్ద స్థిరపడింది. -
మళ్లీ కొత్త శిఖరాలకు స్టాక్‌మార్కెట్
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో ఆరురోజుల తర్వాత సూచీలు ఇంట్రాడే, ముగింపులో మళ్లీ ఆల్‌టైం హై రికార్డులను నమోదుచేశాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకరణ తర్వాత ఏర్పడే కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. కోవిడ్–19 సంక్షోభంతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని కొత్తగా ఎన్నికైన యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జన్నెట్ యెల్లన్ ప్రకటన కూడా ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ బలపడటం, కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసికపు ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి దేశీయ పరిణామాలు మార్కెట్‌ను కూడా మెప్పించాయి. ఫలితంగా సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంతో 49,792 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 14,645 వద్ద ముగిశాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ప్రాధాన్యత ఇవ్వడంతో సూచీలు ర్యాలీ సాఫీగా సాగింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 49,874 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 14,666 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా ఆటో షేర్లు లాభపడ్డాయి. ‘పాశ్చాత్య మార్కెట్లలో నెలకొన్న ఆశావహ అంచనాలకు తోడు ఆటో, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లలో నెలకొన్న తాజా కొనుగోళ్లతో బెంచ్‌మార్క్ సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉండటంతో పాటు అవుట్‌లుక్ పట్ల యాజమాన్యాలు ధీమా వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు ప్రేరేపించింది. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకరణ సందర్భంగా భారీ ఉద్దీపన ప్యాకేజీ రావ చ్చన్న అంచనాలతో అమెరికా మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి’ అని జియోజిత్ ఫైనాన్సియల్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించవచ్చనే అంచనాలతో టైర్ల షేర్లు పరుగులు పెట్టాయి. జేకే టైర్ షేరు 18% లాభపడగా, ఎంఆర్ఎఫ్ షేరు 7% పెరిగి ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది. ► భారత్‌లో తయారయ్యే తన ఎస్యూవీ రకానికి చెందిన జిమ్ని మోడల్ ఉత్పత్తితో పాటు ఎగుమతులను ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు 3 శాతం పెరిగింది. ► క్యూ3 ఫలితాలకు ముందు ఎస్బీఐ కార్డ్స్ షేరు 3 శాతం లాభపడి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. -
49000 పైకి సెన్సెక్స్
ముంబై: కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు రాణించవచ్చనే ఆశలతో స్టాక్ మార్కెట్లో బుల్ జోష్ కొనసాగుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో తొలిసారి 49వేల స్థాయిపై 49,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 14,485 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ జనవరి 16వ తేదీ నుంచి కోవిడ్–19 టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుండటం, కొత్త అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో అమెరికా నుంచి భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వెలువడవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకుంటుందనే సంకేతాలు, దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభపడి 49,304 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 14,498 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. మరోవైపు లాభాల మార్కెట్లోనూ మెటల్, బ్యాంకింగ్, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కరోనా కేసుల రికవరీ రేటు పెరగడంతో పాటు కోవిడ్ –19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ వారాంతంలో మొదలు కానుండటం మార్కెట్‌కు అనుకూలించిందని రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో వేగవంతమైన రికవరీ సంకేతాల నేపథ్యంలో కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చని అన్నారు. త్రైమాసిక విడుదల సందర్భంగా కంపెనీలు వృద్ధి సహాయక చర్యల నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. ఈ సానుకూలాంశాలతో సూచీల రికార్డుల ర్యాలీ స్వల్పకాలం పాటు కొనసాగవచ్చని మోదీ వివరించారు. టీసీఎస్ షేరుకు క్యూ3 ఫలితాల జోష్... ఐటీ సేవల సంస్థ టీసీఎస్ షేరు సోమవారం బీఎస్ఈలో 2% లాభంతో రూ.3,175 వద్ధ ముగిసింది. క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో షేరు 3.32 శాతం ఎగసి రూ.3,224 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.09 లక్షల కోట్లను తాకింది. -
మళ్లీ రికార్డుల వేట..!
ముంబై: రెండురోజుల పాటు వెనకడుగు వేసిన బుల్స్ మళ్లీ పరుగును ప్రారంభించాయి. దీంతో స్టాక్ మార్కెట్లో తిరిగి రికార్డుల వేట మొదలైంది. టీసీఎస్ క్యూ3 ఫలితాలకు ముందు ఐటీ షేర్ల ర్యాలీ, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, రూపాయి రికవరీ వంటి అంశాలతో సూచీలు ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 48,782 వద్ద ముగిసింది. నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 14,347 వద్ద నిలిచింది. లాభాల మార్కెట్లోనూ మెటల్, ప్రభుత్వ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరంగా కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 761 పాయింట్లను ఆర్జించి 48,854 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు పెరిగి 14,367 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 73.24 వద్ద స్థిరపడింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 913 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 329 పాయింట్ల పెరిగింది. యూఎస్ తదుపరి అధ్యక్షుడిగా జో బెడెన్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఆర్థిక ఉద్దీపన ప్రకటన అంచనాలు మరింత పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. కోవిడ్ సహాయక చర్యల్లో భాగంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానానికే మొగ్గుచూపుతూ వడ్డీరేట్ల తగ్గింపునకే ఓటేస్తున్నాయి. ఫలితంగా వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి అది క్రమంగా ఈక్విటీ మార్కెట్లోకి ప్రవహిస్తుంది. దేశీయంగా డిసెంబర్ ఆర్థిక గణాంకాలు వ్యవస్థలో రికవరీ ప్రతిబింబిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ మరిన్ని విశేషాలు... ► మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ కంపెనీ టీసీఎస్ షేరు మూడుశాతం లాభపడి రూ.3,121 వద్ద ముగిసింది. ► మారుతి సుజుకీ, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు 6 శాతం చొప్పున పెరిగాయి. ► అనుబంధ సంస్థ బయోసిమిలర్లో అబుధాబీకి చెందిన ఏడీక్యూ ఇన్వెస్ట్మెంట్ రూ.555 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో బయోకాన్ షేరు రెండు శాతం లాభపడింది. ► వ్యక్తిగత, వాణిజ్య వాహనాలపై పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానుండటంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4% లాభపడి ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► క్యూ3 మెరుగైన ఫలితాలను సాధించవచ్చనే అంచనాలతో సన్ ఫార్మా షేరు 3 శాతం లాభపడటమే కాక రెండేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. -
48,000 పైకి సెన్సెక్స్
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే రెండు వ్యాక్సిన్లకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలపడంతో దేశీయ ఈక్విటీ సూచీలు తొమ్మిదోరోజూ లాభాలతో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి బలపడటం ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలూ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే ఇటీవల వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలు ఆశాజనకంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా సోమవారమూ సూచీల ఇంట్రాడే, ముగింపు రికార్డు ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 308 పాయింట్ల లాభంతో తొలిసారి 48 వేలపై 48,177 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 14,133 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నిఫ్టీ 194 పాయింట్లు, సెన్సెక్స్ 626 పాయింట్ల పరిధిలో ట్రేడయ్యాయి. ఒక్క ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. మెటల్, ఐటీ షేర్లు అత్యధికంగా లాభపడటమే కాకుండా సూచీలు రికార్డు ర్యాలీకి అండగా నిలిచాయి. ప్రధాన దేశాల్లో కోవిడ్–19 వ్యాక్సిన్‌కు అనుమతులు లభించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. విదేశీ పెట్టుబడులు వెల్లువలా కొనసాగుతుండటంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు బలపడి 73.02 వద్ద స్థిరపడింది. 626 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్... కోవిడ్–19 కట్టడికి భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఒకేసారి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు అనుమతులు లభించిన నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 48,000 పాయింట్లపైన, నిఫ్టీ 14,100 స్థాయిపైన మొదలయ్యాయి. కొద్దిసేపటికే ఇన్వెస్టర్లు గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. ఒక దశలో నిఫ్టీ 14వేల స్థాయిని కోల్పోయి 13,954 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ సైతం 48 వేల మార్కును కోల్పోయి 47,594 వద్దకు దిగివచ్చింది. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలకు డిసెంబర్ పీఎంఐ గణాంకాలు ఊరటనిచ్చాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ డిసెంబర్ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డాటా 56.4 పాయింట్లుగా నమోదైంది. మరోవైపు యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం నుంచి కూడా సూచీలు సానుకూల సంకేతాలను అందుకున్నాయి. దీంతో మిడ్‌సెషన్ నుంచి మళ్లీ కొనుగోళ్ల పర్వం మొదలవడంతో సూచీలు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ కనిష్టం నుంచి 626 పాయింట్లు లాభపడి 48,220 వద్ద, నిఫ్టీ ఇంట్రాడేలో నుంచి 194 పాయింట్లను ఆర్జించి 14,147 స్థాయి వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. 3.50% లాభపడ్డ బీఈఎంఎల్ షేరు రక్షణరంగానికి చెందిన ప్రభుత్వరంగ కంపెనీ బీఈఎంఎల్ షేరు బీఎస్ఈలో 3.50 శాతం లాభపడింది. ఈ కంపెనీలో 26 శాతం వాటా ఉపసంహరించడంతో పాటు మేనేజ్మెంట్ నియంత్రణ కూడా బదిలీ చేసేందుకు కేంద్రం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను (ఈఓఐ) ఆహ్వానించడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 8 శాతం లాభపడి రూ.1,050 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 3.50 శాతం లాభంతో రూ.1,008 వద్ద ముగిసింది. -
2021కి...లాభాలతో స్వాగతం...
ముంబై: స్టాక్ మార్కెట్ 2021 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికింది. ఐటీ, ఆటో, ఎఫ్ఎమ్సీజీ షేర్లు రాణించడంతో కొత్త ఏడాది తొలిరోజున రికార్డుల పర్వం కొనసాగింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ మార్కెట్లో జరిగిన విస్తృత స్థాయి కొనుగోళ్లతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారమూ లాభాలతో ముగిశాయి. జీఎస్టీ అమలు తర్వాత ఈ డిసెంబర్లో ఒక నెలలో అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్లు వసూళ్లను సాధించడంతో పాటు ఆటో కంపెనీలు వెల్లడించిన వాహన విక్రయ గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. అలాగే భారత్‌లో ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించవచ్చనే వార్తలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 47,869 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 14,018 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 229 పాయింట్లు లాభపడి 47,980 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 14,050 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సూచీలు నూతన గరిష్టాలను తాకిన తరుణంలోనూ ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఆర్థిక రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 895 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 269 పాయింట్లను ఆర్జించింది. ఆటో షేర్ల లాభాల పరుగులు... డిసెంబర్లో అంచనాలకు తగ్గట్టుగానే వాహన విక్రయాలు జరిగాయని ఆటో కంపెనీలు ప్రకటించాయి. దీనికి తోడు ఇటీవల పలు ఆటో కంపెనీలు తమ వాహనాలపై పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానుండటంతో ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ షేర్లు 4 నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి. ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ లిస్టింగ్ విజయవంతం... గతేడాదిలో చివరిగా ఐపీఓను పూర్తి చేసుకున్న ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ షేర్లు ఎక్ఛ్సేంజీల్లో లాభాలతో లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.315తో పోలిస్తే 36% ప్రీమియం ధరతో రూ. 436 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో 55 శాతానికి పైగా లాభపడి రూ.489.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరకు 29 శాతం లాభంతో రూ.407 వద్ద స్థిరపడ్డాయి. మునిసిపల్ సోలిడ్ వేస్ట్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గత నెల చివర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి 15 రెట్లు అధికంగా బిడ్లు లభించాయి. -
నయా జోష్- 48,000 చేరువలో సెన్సెక్స్
ముంబై, సాక్షి: కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయివైపు కదులుతుంటే.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 193 పాయింట్లు ఎగసి 47,944కు చేరగా.. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 14,031 వద్ద ట్రేడవుతోంది. వెరసి వరుసగా ఏడో రోజు మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. గత వారానికల్లా నిరుద్యోగ క్లెయిములు తగ్గడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. మరోసారి రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి. దీనికితోడు కోవిడ్-19 కట్టడికి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపును ఇవ్వడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,944కు చేరగా.. నిఫ్టీ 14,033ను తాకింది. ఇవి సరికొత్త గరిష్టాలు కావడం విశేషం! (ఈ కొత్త కుబేరుడు- ఆసియాలోనే టాప్) ఫార్మా, మెటల్ వీక్ ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్ 2.2 శాతం లాభపడగా.. మీడియా, ఐటీ, ఆటో 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మెటల్, ఫార్మా స్వల్ప వెనకడుగులో ఉన్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, యూపీఎల్, టీసీఎస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, శ్రీ సిమెంట్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్ ఫార్మా, హిందాల్కో, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, ఐషర్, గెయిల్, టాటా స్టీల్ 1-0.4 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఈఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో బీఈఎల్, లాల్‌పాథ్, పీఎన్బీ, బీవోబీ, ఎస్కార్ట్స్, ఎల్ఐసీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఇండిగో, గోద్రెజ్ ప్రాపర్టీస్, బంధన్ బ్యాంక్, సెయిల్, అరబిందో, వేదాంతా 1-0.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,607 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,136 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ, 1,825 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 587 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నిఫ్టీ భళా- 2020కు రికార్డ్స్‌తో వీడ్కోలు
ముంబై, సాక్షి: భారీ ఆటుపోట్లను చవిచూసిన 2020 ఏడాదికి దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగింపు పలికాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ చెప్పుకోదగ్గ లాభాలతో నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 16 శాతం స్థాయిలో బలపడ్డాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 47,000 పాయింట్లను అధిగమించడంతోపాటు.. 48,000 మార్క్‌కు చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఈ ఏడాది కరోనా వైరస్ కల్లోలంతో ఫార్మా రంగం అత్యధికంగా 61 శాతం దూసుకెళ్లగా.. లాక్‌డవున్ నేపథ్యంలో కొత్త అవకాశాలతో ఐటీ 55 శాతం జంప్‌చేసింది. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక రిటర్నులు అందించిన దిగ్గజాలలో దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ ముందునిలవగా.. ప్రయివేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ వెనకడుగు వేసింది. ఇదేవిధంగా పీఎస్‌యూ బ్లూచిప్స్ ఐవోసీ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా సైతం డీలా పడ్డాయి. (తొలిసారి.. 14,000 మైలురాయికి నిఫ్టీ) నేటి ట్రేడింగ్ ఇలా డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ చివరి రోజు స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 47,751 వద్ద నిలిచింది. నిఫ్టీ యథాతథంగా 13,982 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో 47,897 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,602 వరకూ డీలా పడగా.. నిఫ్టీ 14,025-13,936 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2-0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,766 లాభపడగా.. 1,244 నష్టపోయాయి. 2020లో జోష్ ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ ఊపందుకుంది. ఫలితంగా చౌకగా లభిస్తున్న ప్రపంచ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి వంటి సాధనాలలోకి ప్రవహించాయి. ఫలితంగా యూఎస్‌తోపాటు భారత్ మార్కెట్లు కూడా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. కోవిడ్-19 భయాలతో ఆగస్ట్‌లో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్‌లో పసిడి 10 గ్రాములు (ఎంసీఎక్స్) రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ మార్కెట్లోనే రికార్డ్‌కావడం విశేషం! (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) రికవరీ ఆశలు కోవిడ్-19 సంక్షోభం నుంచి నెమ్మదిగా యూఎస్, చైనా, భారత్ వంటి దేశాలు బయటపడుతుండటంతో ఆర్థిక రికవరీపై అంచనాలు పెరిగాయి. ఇది సెంటిమెంటుకు బలాన్నిచ్చింది. దీనికితోడు కొన్ని ఎంపిక చేసిన రంగాలలో కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తూ వచ్చాయి. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చింది. వీటికి జతగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు, వివిధ వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షల పలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ప్రధానంగా గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్లు జోష్‌నిచ్చాయి. దేశీయంగానూ భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్, జైడస్ క్యాడిలా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తదితర సంస్థలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తూ వచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. -
ఆరో రోజూ ర్యాలీ- 14,000 చేరువలో నిఫ్టీ
ముంబై, సాక్షి: ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ముందున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత తడబడినప్పటికీ చివరికి లాభాలతో నిలిచాయి. వెరసి వరుసగా ఆరు రోజూ ర్యాలీ బాటలో సాగాయి. సెన్సెక్స్ 133 పాయింట్లు పుంజుకుని 47,746కు చేరగా.. నిఫ్టీ 49 పాయింట్లు బలపడి 13,982 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. తొలుత 13,865 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరిన నిఫ్టీ చివర్లో 13,997 వరకూ ఎగసింది. వెరసి 14,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది. ఇక సెన్సెక్స్ సైతం 47,808-47,358 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నేటితో కలిపి 21 సెషన్లలో 15సార్లు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఫార్మా డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా మెటల్, ఆటో, రియల్టీ 1.3 శాతం చొప్పున పుంజుకోగా.. బ్యాంకింగ్, ఫార్మా 0.2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, గ్రాసిమ్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, యూపీఎల్, మారుతీ, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ 4.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్ఇండ్, సన్ ఫార్మా, యాక్సిస్, ఎస్బీఐ, ఎయిర్టెల్, టీసీఎస్, గెయిల్, సిప్లా, ఇన్ఫోసిస్ 1.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. సెయిల్ ప్లస్ డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, రామ్‌కో సిమెంట్, బాలకృష్ణ, జీఎంఆర్, అంబుజా, కెనరా బ్యాంక్, ఎన్ఎండీసీ, జిందాల్ స్టీల్ 7.5-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్ఈసీ, అదానీ ఎంటర్, పీఎఫ్సీ, పేజ్, బంధన్ బ్యాంక్, ఇండస్ టవర్స్, పీఎన్బీ, భారత్ ఫోర్జ్, సన్ టీవీ 2-1.2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,671 లాభపడగా.. 1,282 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,349 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,010 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
డీమ్యాట్ ఖాతాల జోరు
స్టాక్ మార్కెట్ రోజు రోజుకూ కొత్త శిఖరాలకు ఎగబాకుతుండటంతో షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్లకు మోజు, క్రేజు పెరుగుతోంది. అక్టోబర్‌లో కొత్తగా పదిలక్షలకు పైగా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. నెలకు పది లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు ఆరంభం కావడం ఇది వరుసగా ఐదో నెల. సెప్టెంబర్‌లో రికార్డ్ స్థాయిలో కొత్తగా 13 లక్షల డీమ్యాట్ ఖాతాలు జత అయ్యాయి. దీంతో అక్టోబర్ చివరినాటికి మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.76 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు జత కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు అరకోటి డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. గత దశాబ్దకాలంలో ఇదే అత్యధికం. కొత్తగా మొదలైన డీమ్యాట్ ఖాతాల్లో 90 శాతానికి పైగా యువజనులవే ఉండటం విశేషం. వరంలా వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనడానికి కేంద్రం లాక్‌డౌన్‌నును విధించడం తెలిసిందే. దీంతో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఇచ్చాయి. దీంతో పలువురు ఇంటివద్దే ఉండిపోవడంతో స్టాక్ మార్కెట్లో ఓ చేయి వేసి చూద్దామనే భావన పెరిగిపోయింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల లావాదేవీలు పెరిగాయి. మరోవైపు కరోనా కల్లోలం నుంచి స్టాక్ మార్కెట్ త్వరగానే కోలుకుంది. మార్చిలో కనిష్ట స్థాయి పతనం నుంచి చూస్తే దాదాపు 77 శాతం ఎగసింది. కొత్త ఇన్వెస్టర్ల జోరుతో మొబైల్ ట్రేడింగ్ కూడా బాగా పెరిగింది. మొత్తం ట్రేడింగ్ లావాదేవీల్లో మొబైల్ ట్రేడింగ్ లావాదేవీలు ఈ నవంబర్‌లో 18.5 శాతానికి పెరిగాయి. ఇది రికార్డ్ స్థాయి. మరింత ముందుకే తయారీ, సేవల రంగాల గణాంకాలు క్రమక్రమంగా పుంజుకోవడం, కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ గణాంకాలు అంచనాలను మించడం, కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సానుకూల వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం.. ఈ కారణాలన్నింటి వల్ల స్టాక్‌మార్కెట్ జోరుగా పెరిగింది. రానున్న నెలల్లో కూడా మార్కెట్ జోరు మరింతగా పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, ప్రభుత్వ, ఆర్బీఐ చర్యలు తదితర అంశాలు దీనికి కారణం. మార్కెట్ జోరు ఇలానే కొనసాగితే డీమ్యాట్ ఖాతాలు మరింతగా పెరుగుతాయని అంచనా. అమెరికాలో ఆ దేశ జనాభాతో పోల్చితే కనీసం 10% గా డీమ్యాట్ ఖాతాలుంటాయని, భారత్‌లో అర శాతం కూడా లేవని నిపుణులంటున్నారు. ఐదోరోజూ అదే పరుగు 13,900 పైన నిఫ్టీ ముగింపు ∙సెన్సెక్స్ లాభం 259 పాయింట్లు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో మార్కెట్ ఐదోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 259 పాయింట్లను ఆర్జించి 47,613 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 13,933 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, దేశీయ ఈక్విటీల్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సూచీల ర్యాలీకి మద్దతుగా నిలిచాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంజీసీ షేర్లు లాభపడ్డాయి. మెటల్, ఫార్మా, ఆటో, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 47,715 వద్ద, నిఫ్టీ 13,968 వద్ద కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేశాయి. బ్రెగ్జిట్ ఒప్పందం, యూఎస్ ఉద్దీపన ప్యాకేజీ అనుమతుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. రూపాయి విలువ 7 పైసలు బలపడి 73.42 వద్ద స్థిరపడింది. మార్కెట్ ప్రభావితం చేయగల అంతర్జాతీయ అంశాలేవీ లేకపోవడంతో త్వరలో విడుదల కానున్న కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, స్టాక్ ఆధారిత అప్డేట్స్పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. రూ.లక్ష కోట్ల క్లబ్‌లోకి బజాజ్ ఆటో... ఆటో దిగ్గజ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.లక్ష కోట్లను తాకింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటోమొబైల్ సంస్థగా బజాజ్ ఆటో రికార్డును సృష్టించింది. ఇంతకుముందు మారుతి సుజికీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. షేరు అరశాతం లాభంతో రూ.3,431 వద్ద స్థిరపడింది. -
అలుపులేని మార్కెట్లు- రికార్డ్స్ నమోదు
ముంబై, సాక్షి: ఇటీవల రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి జోరు చూపాయి. సెన్సెక్స్ 259 పాయింట్లు జంప్‌చేసి 47,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 13,933 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! ప్రెసిడెంట్ ట్రంప్ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో సోమవారం యూఎస్ మార్కెట్లు 0.7 శాతం బలపడ్డాయి. తద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,714 వద్ద, నిఫ్టీ 13,967 వద్ద చరిత్రాత్మక రికార్డులను అందుకున్నాయి. రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఐటీ రంగాలు 1.5-0.8 శాతం మధ్య బలపడగా.. మీడియా, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ 1.5-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐటీసీ, గెయిల్ 6-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో హిందాల్కో, నెస్లే, కోల్ ఇండియా, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఆర్ఐఎల్, సిప్లా 2-1 శాతం మధ్య నీరసించాయి. ఐజీఎల్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో ఐజీఎల్, జీఎంఆర్, ఎక్సైడ్, ఎంజీఎల్, పీఎన్బీ, ఎస్కార్ట్స్, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, అపోలో టైర్, నౌకరీ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, వేదాంతా, క్యాడిలా హెల్త్, ఎన్ఎండీసీ, మెక్‌డోవెల్, పిరమల్ 3- 1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్స్ 0.15 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1,559 లాభపడగా.. 1,464 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల జోరు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,589 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,387 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. డీఐఐలు మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
2020లో 10 పెన్నీ స్టాక్స్ బొనాంజా
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో దేశీ స్టాక్ మార్కెట్లు పలు ఆటుపోట్లను చవిచూశాయి. తొలుత జనవరిలో సరికొత్త గరిష్టాలవైపు నడక సాగించాయి. అయితే చైనాలోని వుహాన్‌లో ఊపిరిపోసుకుని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ ధాటికి మార్చికల్లా కనిష్టాలకు పడిపోయాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకున్న సహాయక చర్యలతో తిరిగి నెల రోజుల్లోనే రికవరీ బాట పట్టాయి. అంతేకాకుండా విదేశీ ఇన్వెస్టర్ల పెట్లుబడుల వెల్లువతో సరికొత్త గరిష్టా రికార్డులను సాధిస్తూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడేళ్లుగా పెద్దగా వృద్ధి చూపని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు మధ్య, చిన్నతరహా కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతూ వచ్చారు. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మార్కెట్లను మించి లాభపడుతూ సరికొత్త గరిష్టాలను చేరాయి. పెన్సీ స్టాక్స్ 2019లో పెన్నీ స్టాక్స్‌గా నిలిచిన 10 కంపెనీల షేర్లు ఈ ఏడాది(2020) లాభాల పరుగందుకున్నాయి. వెరసి ఇన్వెస్టర్లకు అత్యధిక శాతం రిటర్నులు అందించాయి. ఇందుకు రూ. 25 ధరకంటే తక్కువగా ఉన్న షేర్లను మాత్రమే పరిగణించినట్లు ఏస్ ఈక్విటీ పేర్కొంది. రూ. 100 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) మించని కంపెనీలను మాత్రమే మదింపులోకి తీసుకున్న్లట్లు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం.. (బోరోసిల్ -ఫైనోటెక్స్ కెమ్.. యమస్పీడ్) అలోక్ గెలాప్ సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 38 శాతం వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో అలోక్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగింది. ఫలితంగా అలోక్ ఇండస్ట్రీస్ షేరు 2020లో ఏకంగా 602 శాతం దూసుకెళ్లింది. 2019 డిసెంబర్ 31న రూ. 3.04గా నమోదైన ఈ షేరు వారాంతానికల్లా రూ. 21.4కు చేరింది. లాభాల బాట అలోక్ ఇండస్ట్రీస్ బాటలో టెక్నాలజీ సేవల కంపెనీ స్యుబెక్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో ఈ షేరు గతేడాది చివర్లో నమోదైన రూ. 5.90 నుంచి వారాంతానికల్లా రూ. 29.70కు ఎగసింది. వెరసి 403 శాతం ర్యాలీ చేసింది. ఈ జాబితాలో కర్దా కన్స్ట్రక్షన్స్ షేరు రూ. 23.74 నుంచి 376 శాతం జంప్‌చేసింది. వారాంతానికల్లా రూ. 113ను దాటేసింది. ఇక టెక్ సొల్యూషన్స్ అందించే కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేరు రూ. 18 నుంచి రూ. 72.40కు పురోగమించింది. ఇది 301 శాతం వృద్ధికాగా.. క్యాపిటల్ గూడ్స్ కంపెనీ సీజీ పవర్ ఇండస్ట్రియల్ షేరు రూ. 10.82 నుంచి రూ. 43.20వరకూ పెరిగింది. ఇది 299 శాతం లాభంకావడం గమనార్హం! ఇదేవిధంగా రతన్ ఇండియా ఇన్ఫ్రా స్టాక్ రూ. 1.87 నుంచి రూ. 6.60కు బలపడింది. వెరసి 253 శాతం వృద్ధి చూపింది. హెల్త్‌కేర్ కంపెనీ మార్క్‌శాన్స్ ఫార్మా రూ. 16.71 స్థాయి నుంచి రూ. 58కు ఎగసింది. 247 శాతం లాభపడింది. టెలికం సేవల కంపెనీ టాటా టెలీసర్వీసెస్ షేరు రూ. 2.25 నుంచి 237 శాతం ర్యాలీ చేసింది. రూ. 7.59ను తాకింది. దుస్తుల తయారీ కంపెనీ బాంబే రేయాన్ ఫ్యాషన్స్ రూ. 4.20 నుంచి 220 శాతం జంప్‌చేసింది. రూ. 13.44కు చేరింది. ఇక మౌలిక రంగ కంపెనీ జేపీ అసోసియేట్స్ షేరు రూ. 1.96 నుంచి రూ. 6.16కు పెరిగింది. ఇది 214 శాతం లాభం! -
అమెరికా ప్యాకేజీ జోష్..!
ముంబై: అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం లభించడంతో సోమవారం మార్కెట్ లాభాలతో ముగిసింది. బ్రెగ్జిట్ చర్చల విజయవంతం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 47,354 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,873 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు ఇవ్వడంతో ఒక సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 47,407 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 13,885 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. కరోనా వైరస్‌తో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ గతవారం 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లును ఆమోదించి.. సంతకం కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు పంపింది. ముందు బిల్లు ఆమోదానికి ట్రంప్ నిరాకరించారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆదివారం రాత్రి 2.3 ట్రిలియన్ డాలర్ల బిల్లుపై సంతకం చేశారు. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)–బ్రిటన్ల మధ్య ఎట్టకేలకు కీలక వాణిజ్య ఒప్పందం పూర్తవడంతో ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇక దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే ... కోవిడ్–19 వ్యాక్సిన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ట్రయల్ డ్రై–రన్‌ను మొదలుపెట్టడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలపడి 73.49 వద్ద స్థిరపడింది. రూ.11వేల కోట్లను తాకిన టీసీఎస్ మార్కెట్ క్యాప్... దేశీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.11 వేల కోట్లను తాకింది. రిలయన్స్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో దేశీయ కంపెనీగా టీసీఎస్ రికార్డుకెక్కింది. డాయిష్ బ్యాంక్ నుంచి పోస్ట్‌బ్యాంక్ సిస్టమ్‌ను చేజిక్కించుకోవడంతో పాటు ఈ డిసెంబర్ 18న ప్రారంభించిన రూ.16 వేల కోట్ల బైబ్యాక్ ఇష్యూతో టీసీఎస్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 1% పైగా లాభపడి రూ.2949.70 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. 4 రోజుల్లో 8.22 లక్షల కోట్లు! సూచీల నాలుగురోజుల ర్యాలీతో రూ.8.22 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.187 లక్షల కోట్లకు చేరుకుంది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,800 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 742 పాయింట్లను ఆర్జించింది. -
2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!
హైదరాబాద్, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020) ఏడాదిలో ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ పారిశ్రామిక రంగలో దేశీయంగా పలు సానుకూల పవనాలు వీచాయి. ఓవైపు ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీతోపాటు.. దేశీ బిలియనీర్ల సంపద సైతం పెరుగుతూ వచ్చింది. కరోనా వైరస్ కేసులు విస్తరిస్తుండటంతో మార్చిలో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు సైతం 70 శాతం ర్యాలీ చేశాయి. సరికొత్త గరిష్టాలకు చేరాయి. ఇక మరోపక్క మార్కెట్లతో పోటీ పడుతూ పసిడి సైతం మెరుస్తూ వచ్చింది. దేశీ రిటైల్ పరిశ్రమలో పేరున్న కిశోర్ బియానీ గ్రూప్ ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కోవడంతో ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రిటైల్ బిజినెస్‌లను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు నుంచి అమెజాన్ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. కాగా.. జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 14 శాతం బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 47,354కు చేరగా.. నిఫ్టీ 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలు కావడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. (2021లో బంగారం ధర ఎంత పెరగనుంది..?!) దేశీ కుబేరులు కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఈ ఏడాది దేశీ కుబేరుల సంపద 50 శాతం బలపడింది. తొలితరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లు పెరిగింది. వెరసి 32.4 బిలియన్ డాలర్లను తాకింది. ఇక 2020లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లయ్యింది. వ్యాక్సిన్ల కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైరస్ పూనావాలా సంపదకు 6.91 బిలియన్ డాలర్లు జమకావడంతో 15.6 బిలియన్ డాలర్లకు వ్యక్తిగత సంపద ఎగసింది. ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్, విప్రో అధినేత ప్రేమ్‌జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్లమేర పెరిగింది. దీంతో శివనాడార్ సంపద 22 బిలియన్ డాలర్లను తాకగా.. ప్రేమ్‌జీ వెల్త్ 23.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ బాటలో డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద సైతం 4.71 బిలియన్ డాలర్లు బలపడి 14.4 బిలియన్ డాలర్లయ్యింది. ఇదేవిధంగా హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పుంజుకుని 9.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముకేశ్ అంబానీ దేశీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సాధించారు. జులైకల్లా వ్యక్తిగత సంపద 77.4 బిలియన్ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో 5వ ర్యాంకుకు చేరుకున్నారు. తద్వారా సంపదలో ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్(86 బిలియన్ డాలర్లు) సమీపంలో ముకేశ్ నిలిచారు. ముకేశ్ గ్రూప్‌లోని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభపడటం ఇందుకు సహకరించింది. సాధారణంగా టాప్-5 ప్రపంచ కుబేరుల్లో అమెరికన్లు, తదుపరి యూరోపియన్లు, ఒక మెక్సికన్ చోటు సాధిస్తూ వచ్చే సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌కు ముకేశ్ చెక్ పెట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ముకేశ్ సంపదను 76.5 బిలియన్ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్ తెలియజేసింది. జియో, రిలయన్స్ రిటైల్ ఈ ఏడాది ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీ ర్యాలీ చేసింది. ఇందుకు డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 33 శాతం వాటా విక్రయం ద్వారా 1.5 లక్షల కోట్లను సమకూర్చుకోవడం సహకరించింది. దీంతోపాటు.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,000 కోట్లు సమీకరించడంతో రుణరహిత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. అంతేకాకుండా మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్లోనూ 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 47,000 కోట్లకుపైగా సమకూర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్, గూగుల్, సిల్వర్‌లేక్ తదితరాలు ఇన్వెస్ట్చేయడం విశేషం! పసిడి కోవిడ్-19 భయాలతో ఈ ఏడాది మధ్యలో న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్‌లో పసిడి 10 గ్రాములు ఎంసీఎక్స్‌లో రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ చరిత్రలోనే అత్యధికంకాగా.. తదుపరి ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్లపై ఆశలు కారణంగా పసిడి వెనకడుగు వేస్తూ వచ్చింది. ప్రస్తుతం కామెక్స్‌లో పసిడి 1,890 డాలర్లకు చేరింది. ఇక ఎంసీఎక్స్‌లోనూ రూ. 50,300కు దిగింది. అయినప్పటికీ 2020లో పసిడి 35 శాతంపైగా ర్యాలీ చేయడం గమనార్హం! వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల ప్రకారం 2019లో పసిడి 1,393 డాలర్ల సమీపంలో నిలిచింది. దేశీయంగా రూ. 38,200 స్థాయిలో ముగిసింది. రూ. 24,713 కోట్ల డీల్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ బిజినెస్‌లను విక్రయించేందుకు ఫ్యూచర్ రిటైల్ డీల్ కుదుర్చుకుంది. తద్వారా రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లతోపాటు.. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాలను ఆర్ఐఎల్ 3.4 బిలియన్ డాలర్ల(రూ. 24,713 కోట్ల)కు సొంతం చేసుకోనుంది. సూపర్ మార్కెట్ చైన్ బిగ్బజార్సహా.. ఫుడ్‌హాల్, క్లాతింగ్ చైన్ బ్రాండ్ ఫ్యాక్టరీలను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. అయితే ఈ డీల్ కుదర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ అమెజాన్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో తాత్కాలికంగా డీల్‌ను నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేటర్ అక్టోబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌ను ఆదేశించింది. గతేడాది ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్‌లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. -
19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్‌చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,407 సమీపంలోనూ, నిఫ్టీ 13,885 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ 19 ట్రేడింగ్ సెషన్లలో 13సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన భారీ ప్యాకేజీపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేయడంతో ఇన్వెస్టర్లు హుషారొచ్చినట్లు తెలియజేశారు. దీంతో మార్కెట్లు నిరవధిక ర్యాలీ చేస్తున్నట్లు వివరించారు. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో ఫార్మా(0.3 శాతం) మినహా అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ 2.6 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టైటన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎల్అండ్టీ, గెయిల్, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, టాటా స్టీల్, ఐవోసీ, కొటక్ బ్యాంక్, గ్రాసిమ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ 6-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, సిప్లా, శ్రీసిమెంట్, బ్రిటానియా అదికూడా 0.5-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో సెయిల్, ఐబీ హౌసింగ్, టాటా పవర్, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్సన్, నాల్కో, బెల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, యూబీఎల్, జిందాల్ స్టీల్, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 7.5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బయోకాన్ 3.5 శాతం పతనంకాగా.. ఎస్కార్ట్స్, ఇండస్ టవర్, అపోలో హాస్పిటల్, కమిన్స్, అమరరాజా, ఎంఆర్ఎఫ్, క్యాడిలా హెల్త్ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1-1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,021 లాభపడగా.. 997 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల జోరు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
నాలుగో రోజూ- రికార్డులతో షురూ
ముంబై, సాక్షి: క్రిస్మస్ సందర్భంగా వారాంతాన దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. వరుసగా నాలుగో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. వెరసి ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 47,354ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు జంప్‌చేసి 47,258కు చేరగా.. ఈ బాటలో నిఫ్టీ సైతం తొలుత 13,865 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని చేరింది. ప్రస్తుతం 90 పాయింట్లు ఎగసి 13,839 వద్ద ట్రేడవుతోంది. కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఆటో 3-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్, గెయిల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ అదికూడా 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) గోద్రెజ్ జూమ్ డెరివేటి స్టాక్స్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్, పీవీఆర్, డీఎల్ఎఫ్, ఇండిగో, ఫెడరల్ బ్యాంక్, మదర్సన్, శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, ఐబీ హౌసింగ్, జిందాల్ స్టీల్, అపోలో టైర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 4.3-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు వేదాంతా, బయోకాన్, ఇండస్ టవర్, జూబిలెంట్ ఫుడ్, అంబుజా, అపోలో హాస్పిటల్, ఏసీసీ 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ దాదాపు 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,697 లాభపడగా.. 586 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు శుక్రవారం మార్కెట్లకు సెలవుకాగా.. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,226 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,898 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
మార్కెట్ మూడోరోజూ ముందుకే..!
ముంబై: క్రిస్మస్కు ముందురోజు స్టాక్ మార్కెట్‌కు భారీగా లాభాలొచ్చాయి. హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందుకే కదిలింది. బ్రెగ్జిట్ ఒప్పందం సఫలీకృతమవచ్చనే ఆశలతో అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ బలపడటం, ఈక్విటీ మార్కెట్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 529 పాయింట్లు పెరిగి 46,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 13,749 వద్ద నిలిచింది. మూడురోజుల వరుస ర్యాలీతో సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో కోల్పోయిన భారీ నష్టాలన్నీ రికవరీ అయ్యాయి. ఆర్థిక, బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు ఈ వారం ఆరంభం నుంచి పరుగులు పెట్టిన ఐటీ షేర్ల జోరుకు బ్రేక్ పడింది. రూపాయి బలపడటం ఇందుకు కారణమైంది. అలాగే మీడియా, రియల్టీ రంగాల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈ వారంలో జరిగిన నాలుగురోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ స్వల్పంగా 13 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 12 పాయింట్లను నష్టపోయింది. సెంటిమెంట్ బలంగానే... డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు తేది దగ్గర పడుతున్న తరుణంలో సూచీలు స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, అయితే ఓవరాల్‌గా మార్కెట్ సెంటిమెంట్ బలంగానే ఉందని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐపీఓకు అనుపమ్ రసాయన్ స్పెషాలిటీ కెమికల్ రంగంలో సేవలు అందించే అనుపమ్ రసాయన్ ఐపీఓకు సిద్ధమైంది. ఐష్యూ ద్వారా కంపెనీ రూ.760 కోట్లను సమీకరించాలని భావిస్తుంది. ఇందు కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. సమీకరించిన నిధుల్లో అధిక భాగం అప్పులను తీర్చేందుకు వినియోగిస్తామని పేర్కొంది. ఐపీఓ భాగంగా కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకంగా షేర్లను కేటాయించనుంది. -
మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్
ముంబై, సాక్షి: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్ము రేపుతున్నాయ్. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మిడ్‌సెషన్‌కల్లా మార్కెట్లు భారీగా ఎగశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 584 పాయింట్లు జంప్‌చేసి 47,028కు చేరింది. వెరసి మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడింది. ఇక నిఫ్టీ సైతం 165 పాయింట్లు ఎగసి 13,766 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం సెన్సెక్స్ 47,056 సమీపంలో, నిఫ్టీ 13,778 సమీపంలోనూ సరికొత్త గరిష్ట రికార్డులను సాధించాయి. జీడీపీ అంచనాలకు మించి వేగమందుకున్నట్లు ఆర్బీఐ నివేదిక తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటుకు జోష్ లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. (రికవరీ అంచనాలను మించుతోంది: ఆర్బీఐ) బజాజ్ ఆటో చకన్లో రూ. 650 కోట్లతో మోటార్ సైకిళ్ల తయారీ ప్లాంటుకి మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. 2023కల్లా ఉత్పత్తిని ప్రారంభించగల ఈ ప్లాంటులో అత్యంత ఖరీదైన కేటీఎం బైకులు, హస్క్వర్నా, ట్రయంప్ మోటార్ సైకిళ్లను తయారు చేయనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తినీ చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు ఎన్ఎస్ఈలో తొలుత 3 శాతం ఎగసి రూ. 3,423ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 3,378 వద్ద ట్రేడవుతోంది. గత మూడు రోజుల్లో ఈ షేరు 6 శాతం పుంజుకుంది. టాటా కమ్యూనికేషన్స్ ఫ్రాన్స్‌కు చెందిన ఈసిమ్ టెక్నాలజీ కంపెనీ.. ఒయాసిస్ స్మార్ట్ సిమ్ యూరోప్‌ను కొనుగోలు చేసినట్లు టాటా కమ్యూనికేషన్స్ తాజాగా పేర్కొంది. ఈసిమ్, సిమ్ విభాగాలలో ఒయాసిస్ ఆధునిక టెక్నాలజీ సర్వీసులను అందిస్తున్నట్లు తెలియజేసింది. తద్వారా మూవ్టీఎం పేరుతో తాము అందిస్తున్న ఎండ్టుఎండ్ ఎంబెడ్డెడ్ కనెక్టివిటీ సర్వీసులు మరింత బలపడనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లింది. రూ. 1,145 వద్ద సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 1,067 వద్ద కదులుతోంది. ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ హెల్త్‌కేర్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ కంపెనీ పేషంట్మ్యాటర్స్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించాక జోరందుకున్న ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ తాజాగా మరోసారి బలపడింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 11 శాతం జంప్‌చేసి రూ. 89 సమీపానికి చేరింది. వెరసి 2008 తదుపరి గరిష్టానికి చేరింది. గత మూడు రోజుల్లోనూ ఈ షేరు 24 శాతం ర్యాలీ చేసింది. ఈ కౌంటర్లో మధ్యాహ్నానికల్లా నాలుగు రెట్లు అధికంగా 1.4 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 30కల్లా సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీలో 2.88 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఆర్పీ సంజీవ్ గోయెంకా కంపెనీ ఫస్ట్‌సోర్స్.. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీసులను అందించే విషయం విదితమే. -
మూడో రోజూ ర్యాలీ బాట.. బ్యాంక్స్ జోరు
ముంబై, సాక్షి: వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 309 పాయింట్లు జంప్‌చేసి 46,753కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 13,691 వద్ద ట్రేడవుతోంది. నిరుద్యోగ క్లెయిములు తగ్గడం, సహాయక ప్యాకేజీకి ఒప్పందం నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య మిశ్రమంగా ముగిశాయి. కాగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 46,780- 46,615 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక ఇంట్రాడేలో నిఫ్టీ 13,702-13,644 పాయింట్ల మధ్య ఊగిసలాటకు లోనైంది. ఐటీ మినహా ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, మీడియా, మెటల్, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఐటీ 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్జీసీ, టాటా మోటార్స్, గెయిల్, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, యాక్సిస్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఇండస్ఇండ్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ 4-1 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఇన్ఫోసిస్, విప్రో అదికూడా 1-0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. వేదాంతా జూమ్ డెరివేటివ్ స్టాక్స్‌లో వేదాంతా, అంబుజా, ఏసీసీ, ఎన్ఎండీసీ, సెయిల్, ఐసీఐసీఐ ప్రు, రామ్‌కో సిమెంట్, పీఎన్బీ, శ్రీరామ్ ట్రాన్స్, ఇండస్ టవర్, ఆర్ఈసీ 6.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా, భారత్ ఫోర్జ్, మ్యాక్స్ ఫైనాన్స్, మైండ్‌ట్రీ 2-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,544 లాభపడగా.. 300 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 536 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,327 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,153 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 662 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
రెండో రోజూ అదే జోరు
ముంబై: ఐటీ షేర్ల అండతో సూచీలు రెండోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 437 పాయింట్ల లాభంతో 46,444 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 13,601 వద్ద ముగిసింది. వరుస నష్టాలకు స్వస్తి పలుకుతూ రూపాయి బలపడటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అలాగే కొత్తగా వెలుగులోకి వచ్చిన స్ట్రైయిన్ వైరస్‌ను కోవిడ్–19 వ్యాక్సిన్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని దిగ్గజ ఫార్మా కంపెనీలు విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో సెంటిమెంట్ బలపడింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరంగా కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ ఒకదశలో 506 పాయింట్లు లాభపడి 46,513 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 291 పాయింట్ల ర్యాలీ చేసి 13,619 స్థాయిని తాకింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, అధికంగా ఐటీ షేర్లు లాభపడ్డాయి. రెండురోజులుగా జరిగిన కొనుగోళ్లతో సూచీలు సోమవారం కోల్పోయిన నష్టాలను దాదాపు తిరిగి పొందాయి. అలాగే మార్కెట్ పాజిటివ్ అవుట్‌లుక్ చెక్కుచెదరలేదని స్పష్టమైంది. దేశీయ ట్రేడింగ్ ప్రభావితం చేయగల ప్రపంచమార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. ఇక డాలర్ మారకంలో రూపాయి 8 పైసలు బలపడి 73.76 స్థాయి వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.537 కోట్ల విలువైన షేర్లను కొనగా, దేశీయ ఫండ్లు(డీఐఐలు) రూ.1326 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఐటీ షేర్లకు భలే గిరాకీ... అంతర్జాతీయ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ యాక్సెంచర్ ఫలితాల ప్రకటన నాటి నుంచి ఐటీ షేర్లకు మంచి డిమాండ్ నెలకొంది. యాక్సెంచర్ ఆర్థిక గణాంకాలు అంచనాలను మించడంతో పాటు మెరుగైన అవుట్‌లుక్‌ను ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఐటీ షేర్లు రాణిస్తున్నాయి. ఇక దేశీయంగా విప్రో, ఇన్ఫోసిస్ పెద్ద ఐటీ కంపెనీలు భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి విప్రో కంపెనీ 700 మిలియన్ డాలర్ల డీల్‌ను కుదుర్చుకుంది. అలాగే రూ.9,500 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుంది. ఈ సానుకూల పరిణామాలతో బుధవారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎమ్ఫసిస్, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. బ్రెగ్జిట్, లాక్డౌన్ ప్రభావాలే కీలకం... మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో కొత్త వైరస్ స్ట్రైయిన్ భయాలు, లాక్డౌన్ ఆందోళనలు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు వంటి ప్రతికూలతను విస్మరించి మార్కెట్ ముందుకు కదులుతుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. త్వరలో ఖరారు కానున్న బ్రెగ్జిట్ ఒప్పందాలు, లాక్డౌన్ వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ఏమేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు. 15 రెట్లు సబ్‌స్క్రైబైన ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ చివరి తేది నాటికి 15 రెట్ల సబ్‌స్క్రిబ్షన్‌ను సాధించింది. ఇష్యూ లో భాగంగా కంపెనీ జారీ చేసిన 66.66 లక్షల షేర్లకు గానూ.., 10.02 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 9.67 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 18.69 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 16.55 రెట్ల బిడ్లు దాఖలమైనట్లు ఎన్ఎస్ఈ గణాం కాలు తెలిపాయి. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.300 కోట్లను సమీకరించింది. ఇష్యూ ధర శ్రేణి రూ.313–315గా ఉంది. జనవరి 1న షేర్లు ఎక్సే్ఛంజీల్లో లిస్టు కానున్నాయి. -
ఆరో రోజూ లాభాలే..!
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు శుక్రవారం లాభాల్లోనే ముగిశాయి. చివరి అరగంటలో నెలకొన్న కొనుగోళ్లు సూచీలను నష్టాల నుంచి గట్టెక్కించాయి. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 46,961 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,761 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా ఆరురోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్, ఆర్థిక, ఆటో, రియల్టీ రంగ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 396 పాయింట్ల రేంజ్ లో కదలాడింది. నిఫ్టీ 114 పాయింట్ల్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో ఎఫ్ఐఐలు రూ.2,720 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఫండ్స్(డీఐఐ) రూ.2,424 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇక ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 862 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్లను ఆర్జించాయి. సూచీలకు ఇది ఏడోవారమూ లాభాల ముగింపు కావడం విశేషం. స్టాక్ మార్కెట్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సూచీలను నడిపిస్తున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలు, బ్రెగ్జిట్ పురోగతి, అమెరిక ఉద్దీపన ఆశలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ సంకేతాలతో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపుతున్నారని బినోద్ పేర్కొన్నారు. ఇంట్రాడేలో 47,000 స్థాయికి సెన్సెక్స్... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ తొలిసారిగా 47,000 పైన, నిఫ్టీ 13,750 పైన ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఉదయం సెషన్లో అనూహ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 260 పాయింట్లు నిఫ్టీ 82 పాయింట్లను కోల్పోయాయి. ఆదుకున్న ఐటీ షేర్లు... ఐటీ సేవల దిగ్గజం యాక్సెంచర్ నవంబర్‌తో ముగిసిన క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీంతో దేశీయ లిస్టెడ్ ఐటీ కంపెనీ షేర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈ ఐటీ ఇండెక్స్ ఇంట్రాడేలో 2% ఎగసి 23,408 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. -
మార్కెట్‌కు ఫెడ్ జోష్..!
ముంబై: కీలక వడ్డీరేట్లపై సరళతర ధోరణికే కట్టుబడి ఉన్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు రాణించడం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు వరుసగా ఐదురోజూ లాభాల్లో ముగిశాయి. అలాగే కొత్త రికార్డుల నమోదును కొనసాగించాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు లాభంతో 46,890 వద్ద సిర్థపడింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద నిలిచింది. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు కనిపించడం, పలు దేశాల్లో కోవిడ్–19 వ్యాక్సిన్‌కు అనుమతినివ్వడం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆర్థిక, ప్రైవేట్ రంగ బ్యాంక్, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెనెక్స్ ఇంట్రాడేలో 326 పాయింట్లు లాభపడి 46,992 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 90 పాయింట్లు ర్యాలీ చేసి 13,773 వద్ద నూతన ఆల్‌టైం హైని నమోదు చేసింది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా షేర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సూచీలు కొత్త రికార్డు సృష్టిస్తున్నప్పటికీ.., ఇటీవల మధ్య, చిన్న తరహా షేర్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు తెలిపారు. గురువారం రికార్డు ర్యాలీలో ఈ షేర్ల వాటా అత్యంత స్వల్పంగా ఉంది. ఈ తరుణంలో అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్ అవసరమని వారు సూచించారు. ప్రపంచ ఈక్విటీలకు ఫెడ్ రిజర్వ్ బూస్టింగ్... అమెరికా ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు బుధవారం రాత్రి వెలువడ్డాయి. కరోనాతో పూర్తిగా కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలిచే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేట్లను మార్చలేదు. నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ, ఉద్యోగ కల్పన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు సరళతరమైన విధానాలకే కట్టుబడి ఉంటామని ఫెడ్ తెలిపింది. వ్యవస్థలో ద్రవ్యతను పెంచేందుకు 12 బిలియన్ డాలర్ల విలువైన నెల బాండ్ల కొంటామని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫెడ్ సులభతరమైన ద్రవ్య పరపతి విధాన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు మరింత దూసుకెళ్లాయి. ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇందులో జపాన్‌కు చెందిన నికాయ్ సూచీ 29 ఏళ్ల గరిష్ట స్థాయి చేరువలో ముగిసింది. యూరప్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ ర్యాలీ చేశాయి. అమెరికా సూచీల్లో నాస్డాక్ ఇండెక్స్ బుధవారం సరికొత్త గరిష్టం వద్ద నిలిచింది. ఉద్దీపన ప్యాకేజీ ఆమోదం లభించవచ్చనే ఆశలతో అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ హాంఫట్ 198 రెట్ల బిడ్లు బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ కంపెనీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే 198 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 176.85 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 620.86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 29.28 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు ధర రూ.220గా పలుకుతోంది. ఐపీఓ ద్వారా రూ.540 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. -
ఐదో రోజూ లాభాలతో రికార్డుల హోరు
ముంబై, సాక్షి: ఈక్విటీలలో ఎఫ్‌పీఐల నిరవధిక పెట్టుబడుల కారణంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు ఎగసి 46,890 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద స్థిరపడింది. వెరసి నాలుగో రోజూ చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలిచాయి. బుధవారం వరుసగా రెండో రోజు నాస్డాక్ సైతం సరికొత్త గరిష్టంవద్ద నిలిచింది. దీనికితోడు కోవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 46,992 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,773 వద్ద సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం! ఎఫ్ఎంసీజీ సైతం ఎన్ఎస్ఈలో రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఫార్మా 0.5 శాతం చొప్పున బలపడగా.. మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో దివీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్, శ్రీసిమెంట్, ఇండస్ఇండ్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హిందాల్కో, కోల్ ఇండియా, మారుతీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్ 2.2-1.2 శాతం మధ్య నీరసించాయి. జూబిలెంట్ అప్ డెరివేటివ్స్‌లో జూబిలెంట్ ఫుడ్, పేజ్, కెనరా బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, బెర్జర్ పెయింట్స్, బీఈఎల్ 5.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు సెయిల్, బీవోబీ, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఆర్ఈసీ, జీ, జిందాల్ స్టీల్, నాల్కో, ఆర్బీఎల్ బ్యాంక్, హెచ్‌పీసీఎల్ 5-2.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.25 శాతం డీలాపడింది. ట్రేడైన షేర్లలో 1,387 లాభపడగా.. 1,584 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌ఫీఐల జోరు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,982 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,718 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
కొనసాగిన బుల్ రన్
ముంబై: స్టాక్ మార్కెట్లో విస్తృతస్థాయి కొనుగోళ్లు జరగడంతో బుధవారమూ బుల్ జోరు కొనసాగింది. ఒక్క ప్రభుత్వరంగ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరి కొత్త రికార్డులను నమోదుచేశాయి. ఇటీవల విడుదలైన మెరుగైన ఆర్థిక గణాంకాలు వ్యవస్థలో రికవరీని ప్రతిబింబింప చేయడం ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 403 పాయింట్లు లాభపడి 46,666 వద్ద ముగిసింది. నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 13,683 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. అత్యధికంగా రియల్టీ, మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,704 – 46,263 పాయింట్ల రేంజ్లో కదలాడగా, నిఫ్టీ 13,568 వద్ద కనిష్టాన్ని, 13,692 వద్ద గరిష్టాన్ని తాకాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ చర్చలు సఫలవంతమవుతాయనే ఆశలతో పాటు కోవిడ్–19 వ్యాక్సిన్ పంపిణీకి వేగవంతమైన చర్యలతో దేశీయ ఈక్విటీలు ఇప్పటికీ బుల్స్ గుప్పెట్లో ఉన్నట్లు రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ బినోద్ మోదీ వివరించారు. భారత మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉండడంతో సూచీలు రోజుకో రికార్డు నమోదవుతుందని ఆయనన్నారు. ప్రభుత్వరంగ షేర్లలో అమ్మకాలు... ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రభుత్వరంగ(పీఎస్‌యూ)బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.60 శాతం పతనమైంది. 10 నెలల గరిష్టానికి నిఫ్టీ రియల్టీ ... ప్రధాన నగరాల్లో నివాసయోగ్యమైన స్థలాల అమ్మకాలు పెరగినట్లు గణాంకాలు వెల్లడితో రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 5.1% ఎగసింది. బర్గర్ కింగ్ రయ్.. రయ్ బంపర్ లిస్టింగ్‌తో ఇన్వెస్టర్లకు భారీ లాభాలన్ని పంచిన బర్గర్ కింగ్ షేర్లు ట్రేడింగ్‌లోనూ రాణిస్తున్నాయి. వరుసగా రెండోరోజూ 20 % లాభపడి రూ.199.25 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఇష్యూ ధర రూ.60తో ఐపీఓను పూర్తి చేసుకొని ఈ వారం ఎక్సే్చంజ్‌ల్లో లిస్టై్టన షేర్లు కేవలం మూడు రోజుల్లో 232% లాభాల్ని పంచాయి. -
బుల్ జోరు- మార్కెట్లు ఖుషీ
ముంబై, సాక్షి: ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు, కోవిడ్-19 సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ వంటి అంశాలతో దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల దుమ్మురేపుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 403 పాయింట్లు జంప్‌చేసి 46,666 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115 పాయింట్లు ఎగసి 13,683 వద్ద స్థిరపడింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలిచాయి. మంగళవారం నాస్డాక్ సైతం సరికొత్త గరిష్టంవద్ద ముగియడం గమనార్హం! తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలతో నిలిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,705 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,692 వద్ద సరికొత్త గరిష్టాలను సాధించాయి. మెటల్, ఆటో.. ఎన్ఎస్ఈలో రియల్టీ 5 శాతం జంప్‌చేయగా.. మెటల్, ఆటో, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ మాత్రం 1.6 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, దివీస్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, టైటన్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ 3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, అల్ట్రాటెక్, గెయిల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. రియల్టీ అప్ డెరివేటివ్స్‌లో డీఎల్ఎఫ్ 10 శాతం దూసుకెళ్లగా.. ఐబీ హౌసింగ్, పేజ్, అశోక్ లేలాండ్, జిందాల్ స్టీల్, హావెల్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, జూబిలెంట్ ఫుడ్, నాల్కో, అపోలో టైర్, సెయిల్ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పీఎన్బీ 6 శాతం పతనంకాగా, జీఎంఆర్ ఇన్ప్రా, శ్రీరామ్ ట్రాన్స్, కెనరా బ్యాంక్, టాటా కెమ్, టొరంట్ పవర్, పెట్రోనెట్, కంకార్, ఎల్అండ్టీ ఫైనాన్స్, బీవోబీ 3.3-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో ఐబీ రియల్టీ 12 శాతం, శోభా, ఒబెరాయ్ 5 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,858 లాభపడగా.. 1,167 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఫీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
మార్కెట్ల దూకుడు- మళ్లీ రికార్డ్స్ ర్యాలీ
ముంబై, సాక్షి: వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ చేసింది. నిఫ్టీ సైతం సెంచరీ చేసింది. వెరసి మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 331 పాయింట్లు జంప్‌చేసి 46,594 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 89 పాయింట్లు బలపడి13,657 వద్ద కదులుతోంది. మంగళవారం యూఎస్ మార్కెట్లు ప్రధానంగా నాస్డాక్ రికార్డ్ గరిష్టం వద్ద నిలవడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,599 వద్ద, నిఫ్టీ 13,666 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. (దుమ్మురేపిన బజాజ్ ఫైనాన్స్) ప్రభుత్వ బ్యాంక్స్ వీక్ ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్(0.5 శాతం) మాత్రమే డీలాపడగా.. మెటల్, రియల్టీ, ఆటో రంగాలు 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఐవోసీ, కోల్ ఇండియా 3-1.3 శాతం మధ్య బలపడ్డాయి. అయితే టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, ఎస్బీఐ లైఫ్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.9-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. (మార్కెట్ డౌన్- ఈ షేర్లు జూమ్) ఐబీ హౌసింగ్ జూమ్ డెరివేటివ్స్‌లో ఐబీ హౌసింగ్, వేదాంతా, అపోలో టైర్, సెయిల్, అశోక్ లేలాండ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎన్ఎండీసీ, హెచ్‌పీసీఎల్, యూబీఎల్ 5-1.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పీఎన్బీ 6 శాతం పతనంకాగా.. జీఎంఆర్, టొరంట్ పవర్, కోఫోర్జ్, ఇన్ఫ్రాటెల్, టాటా కెమ్, పిరమల్ 1.5-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,685 లాభపడగా.. 589 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల జోరు నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
రికార్డుల హోరు
ముంబై: ఇంధన, మౌలిక, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఇంట్రాడేలో వెలువడిన అక్టోబర్ నెల టోకు, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లను మెప్పించగలిగాయి. అలాగే రూపాయి బలపడడం, కొనసాగిన విదేశీ పెట్టుబడుల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 154 పాయింట్ల లాభంతో 46,253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 13,558 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు సూచీలకు కొత్త జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. మరోవైపు ఆటో, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,373 వద్ద గరిష్టాన్ని, 45,951 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,597–13,472 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నగదు విభాగంలో సోమవారం ఎఫ్ఐఐలు రూ.2,264 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఫండ్స్ (డీఐఐ) రూ.1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీశారు. ఇక డాలర్ మారకంలో రూపాయి 9 పైసలు బలపడి 73.55 వద్ద స్థిరపడింది. అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి అనుమతులు లభించడంతో పాటు బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్‌పై బ్రిటన్–ఈయూల మద్య జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో సాను కూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లతో పాటు యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బర్గర్ కింగ్ బంపర్ లిస్టింగ్ ఫాస్ట్‌ఫుడ్ చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ షేర్లు స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో బంపర్ హిట్‌ను సాధించాయి. ఇష్యూ ధర రూ. 60తో పోలిస్తే బీఎస్ఈలో 92% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయ్యాయి. చివరకు 130% లాభంతో రూ.138 వద్ద స్థిరపడ్డాయి. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 5,282.10 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 191.55 లక్షలు, ఎన్ఎస్ఈలో 18.67 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. బర్గర్ కింగ్ కంపెనీ 2020 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 268 దుకాణాలను కలిగి ఉంది. -
నష్టాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్‌కు నష్టాలు ఒకరోజుకే పరిమితం అయ్యాయి. సూచీలు మళ్లీ రికార్డుల బాట పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఎఫ్ఎంజీసీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 139 పాయింట్లను ఆర్జించి 46 వేలపైన 46,099 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లను ఆర్జించి 13,514 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీ, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,579–13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,359 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 1019 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 255 పాయింట్లను ఆర్జించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 604 పాయింట్ల రేంజ్లో, నిఫ్టీ 176 పాయింట్ల పరిధిలో కదలాడాయి. ప్రభుత్వ రంగ కంపెనీ కౌంటర్లలో సందడి..: కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న ప్రభుత్వరంగ కంపెనీల కౌంటర్లో శుక్రవారం సందడి నెలకొంది. ఫలితంగా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, కోల్ ఇండియా షేర్లు 5 శాతం నుంచి 3 శాతం దాకా లాభపడ్డాయి. ఆరుశాతం పెరిగి స్పైస్‌జెట్... స్పైస్‌జెట్ కంపెనీ షేరు బీఎస్ఈలో ఆరుశాతం లాభపడింది. కోవిడ్–19 వ్యాక్సిన్ల సరఫరాకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం ర్యాలీ రూ.108 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6.52 శాతం లాభంతో రూ. వద్ద స్థిరపడింది. బర్గర్ కింగ్ లిస్టింగ్ సోమవారం: గతవారంలో పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న బర్గర్ కింగ్ షేర్లు సోమవారం స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
రికార్డులే హద్దుగా.. మార్కెట్లు షురూ
ముంబై, సాక్షి: రికార్డుల సాధనే లక్ష్యంగా దేశీ స్టాక్ మార్కెట్లు చెలరేగుతున్నాయి. దీంతో మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 284 పాయింట్లు ఎగసి 45,893కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు బలపడి 13,473 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నవార్తలతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం రికార్డ్ గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,926ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 13,484కు చేరింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. జోరుగా.. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మీడియా పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్ ఫార్మా, యూపీఎల్, హెచ్‌సీఎల్ టెక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గెయిల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, టీసీఎస్ 2.25-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, ఐషర్, శ్రీసిమెంట్, టైటన్, అల్ట్రాటెక్, బ్రిటానియా, బజాజ్ ఆటో మాత్రమే అదికూడా 0.5-0.2 శాతం మధ్య డీలాపడ్డాయి. పీఎస్‌యూ షేర్లు అప్ డెరివేటివ్స్‌లో బీఈఎల్ 7 శాతం దూసుకెళ్లగా.. ఆర్ఈసీ, భెల్, జీఎంఆర్, పీఎన్బీ, జీ, పీవీఆర్, బీవోబీ, పీఎఫ్సీ, గ్లెన్‌మార్క్ 4.2-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు రామ్‌కో సిమెంట్, అపోలో టైర్, ఏసీసీ, అంబుజా, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ 1- 0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,532 లాభపడగా.. 681 నష్టాలతో కదులుతున్నాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికార్డుల ర్యాలీ- ప్రభుత్వ బ్యాంక్స్ హవా
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్ల స్పీడ్ కొనసాగుతోంది. వెరసి మరోసారి రికార్డుల ర్యాలీ నమోదైంది. సెన్సెక్స్ 181 పాయింట్లు ఎగసి 45,608 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు బలపడి 13,393 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 45,742ను అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 13,435ను దాటేసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఆర్థిక రికవరీపై అంచనాలు, కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. నేటి ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్‌కు భారీ డిమాండ్ కనిపించడం గమనార్హం! చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) మీడియా వీక్ ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్ 7.15 శాతం దూసుకెళ్లగా.. రియల్టీ, ఐటీ 0.8 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే మెటల్, ఫార్మా, మీడియా 1 శాతం స్థాయిలో నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్, టీసీఎస్, ఆర్ఐఎల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, ఎస్బీఐ 3-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హిందాల్కో, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఇండస్ఇండ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఎయిర్టెల్ 2.3-1.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. బ్యాంకింగ్ జోష్ డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్ 19 శాతం, పీఎన్బీ 15 శాతం, బీవోబీ 10 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఇతర కౌంటర్లలో భెల్, వేదాంతా, గోద్రెజ్ ప్రాపర్టీస్, పీవీఆర్, చోళమండలం 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఆర్బీఎల్ బ్యాంక్, పెట్రోనెట్, లుపిన్, జిందాల్ స్టీల్, పీఎఫ్సీ, బంధన్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్ 2.6-1.8 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,498 లాభపడగా.. 1,460 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,792 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,767 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదితమే. -
మార్కెట్లు భల్లేభల్లే- మీడియా, బ్యాంక్స్ ఖుషీ
ముంబై, సాక్షి: జీడీపీ వృద్ధి అంచనాలు, వ్యాక్సిన్ల అందుబాటుపై ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో మరోసారి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్‌చేసి 45,427 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 97 పాయింట్లు జమ చేసుకుని 13,356 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో చివర్లో సెన్సెక్స్ 45,459 వద్ద, నిఫ్టీ 13,366 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి! అయితే తొలుత సెన్సెక్స్ 45,024 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,242 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసుకున్నాయి. రియల్టీ డౌన్ ఎన్ఎస్ఈలో రియల్టీ(0.35 శాతం) మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 2.8-1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, ఎయిర్టెల్, ఓఎన్జీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, గెయిల్, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ 4.6-2.5 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే ఎస్బీఐ లైఫ్, నెస్లే, కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్, టైటన్ 1.5-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఫైనాన్స్ జోష్ డెరివేటివ్స్‌లో శ్రీరామ్ ట్రాన్స్, కెనరా, గ్లెన్‌మార్క్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, సన్ టీవీ, బంధన్ బ్యాంక్, జీ, టాటా కెమికల్స్, లుపిన్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 6-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎస్కార్ట్స్, డీఎల్ఎఫ్, చోళమండలం, ఐడియా, వోల్టాస్, జూబిలెంట్ ఫుడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ 2.3-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్1-1.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,038 లాభపడగా.. 934 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,970 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. రూ. 1,972 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
రికవరీ బూస్ట్- మార్కెట్ల సరికొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టినట్లు ఆర్బీఐ తాజాగా అభిప్రాయపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 447 పాయింట్లు జంప్‌చేసి 45,080 వద్ద ముగిసింది. వెరసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 45,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ 125 పాయింట్లు ఎగసి 13,259 వద్ద నిలిచింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో జీడీపీ 5.6 శాతం క్షీణించవచ్చంటూ తొలుత వేసిన అంచనాలను తాజాగా 0.1 శాతం వృద్ధిగా ఆర్బీఐ సవరించడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు వచ్చే ఏడాది మొదట్లో కరోనా వైరస్ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న ఆశలు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. కాగా.. ఒక దశలో సెన్సెక్స్ 45,148 వద్ద, నిఫ్టీ 13,280 వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకడం విశేషం! బ్యాంకింగ్ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఫార్మా, మెటల్ 2-1.2 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, హిందాల్కో, అల్ట్రాటెక్, సన్ ఫార్మా, ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, గ్రాసిమ్, ఇండస్ఇండ్ 5-2.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. చదవండి: (80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు) టాటా కెమ్ జోష్ డెరివేటివ్స్‌లో టాటా కెమికల్స్, ఇండిగో, బంధన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, పేజ్, టాటా పవర్, గ్లెన్‌మార్క్ 8-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు అంబుజా, ఏసీసీ, శ్రీరామ్ ట్రాన్స్, జీఎంఆర్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్, ఐడియా, పిరమల్, ఐసీఐసీఐ లంబార్డ్, కోఫోర్జ్ 3.2-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,646 లాభపడగా.. 1,245 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,440 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
స్వల్ప లాభాల ముగింపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప లాభంతో ముగిసింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి క్షీణించడం వంటి అంశాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు పతనం కూడా సూచీల లాభాల్ని పరిమితం చేసింది. ఫలితంగా సెన్సెక్స్ 15 పాయింట్ల లాభంతో 44,633 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 13,134 వద్ద స్థిరపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మెటల్, ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మీడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మళ్లీ కొత్త శిఖరాలపై సూచీలు... మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ.., సూచీలు ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టస్థాయిలను అందుకోవడంతో పాటు సరికొత్త శిఖరాలపై ముగిశాయి. వ్యాక్సిన్‌పై సానుకూల వార్తలు, ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం ఇందుకు కారణం. ఈ క్రమంలో సెన్సెక్స్ 335 పాయింట్లు ఎగిసి 44,953 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు లాభపడి 13,217 వద్ద జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెనెక్స్ 44,633 వద్ద, నిఫ్టీ 13,134 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు జీవితకాల గరిష్టస్థాయిలు కావడం విశేషం. -
జీడీపీ జోష్- మార్కెట్లు గెలాప్
ముంబై, సాక్షి: కోవిడ్-19 నేపథ్యంలోనూ జులై- సెప్టెంబర్‌లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 506 పాయింట్లు జంప్‌చేసి 44,655 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 140 పాయింట్లు ఎగసి 13,109 వద్ద నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో ఒక్కసారిగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730ను అధిగమించగా, నిఫ్టీ 13,128 పాయింట్లను దాటింది. చదవండి: (సిమెంట్ షేర్లు.. భలే స్ట్రాంగ్) అన్ని రంగాలూ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఫార్మా, మెటల్ 3.3-1.7 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్ఎంసీజీ యథాతథంగా నిలిచింది. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యూపీఎల్, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ, జేస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీసిమెంట్ 8-2.3 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. నెస్లే, కొటక్ బ్యాంక్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ 2.6-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్‌అండ్‌వోలో డెరివేటివ్ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్, టాటా పవర్, అదానీ ఎంటర్, కెనరా బ్యాంక్, మదర్సన్, యూబీఎల్, భెల్, బీవోబీ, ఫెడరల్ బ్యాంక్, డీఎల్ఎఫ్ 6.7-4.3 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోపక్క శ్రీరామ్ ట్రాన్స్, చోళమండలం, మణప్పురం, ఐజీఎల్, అమరరాజా, నౌకరీ, ఎస్కార్ట్స్, జీఎంఆర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, కమిన్స్ 4.3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,927 లాభపడగా.. 973 మాత్రమే నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్ నెలలో ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం! -
ఎల్ఐసీ.. షంషేర్!
కరోనా కల్లోలం ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చేసింది. కానీ ఎల్ఐసీకి మాత్రం స్టాక్ మార్కెట్లో లాభాల పంట పండించింది. మార్చిలో కనిష్ట స్థాయికి పడిపోయిన స్టాక్ మార్కెట్ మెల్లమెల్లగా రికవరీ అయి ప్రస్తుతం జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లు సృష్టిస్తోంది. మార్కెట్ పతన సమయంలో కొని, పెరుగుతున్నప్పుడు విక్రయించే ‘కాంట్రా’ వ్యూహాన్ని అమలు చేసే ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ కూడా జీవిత కాల గరిష్ట స్థాయికి చేరాయి. కల్లోల కంపెనీల నుంచి వైదొలగడం, వృద్ధి బాటన ఉన్న కంపెనీల్లో వాటాలను పెంచుకోవడం ద్వారా ఎల్ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోంది. ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... భారత్‌లో అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ ఎల్ఐసీనే. ఈ జీవిత బీమా దిగ్గజం ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఈ ఆర్థిక సంవత్సరంలో జోరుగా పెరిగి రికార్డ్ స్థాయికి చేరింది. భారత్‌లోని టాప్ 200 కంపెనీల్లో ఎల్‌ఐసీకున్న వాటాల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 7,700 కోట్ల డాలర్లకు ఎగసిందని అంచనా. సెప్టెంబర్ నుంచి చూస్తే, మార్కెట్ 12 శాతం మేర పెరిగింది. దీంతో ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ కూడా ఆ రేంజ్‌లోనే పెరిగాయి. వీటి విలువ ప్రస్తుతం 8,600 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.6.45 లక్షల కోట్లు) పెరిగి ఉండొచ్చని అంచనా. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. దీంతో 2018 మార్చినాటి 8,400 కోట్ల డా లర్ల అత్యధిక ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ రికార్డ్ బ్రేక్ అయినట్లే. ఆర్నెల్లలో 40 శాతం అప్... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ బాగా నష్టపోయింది. దీంతో ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 5,500 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఆశాజనక వార్తలు రావడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో స్టాక్ మార్కెట్ రికవరీ బాట పట్టింది. ప్రస్తుతం స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ రికవరీ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి ఎల్ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 40 శాతం (2,200 కోట్ల డాలర్లు–లక్షన్నర కోట్లకు మించి)ఎగసి 7,700 కోట్ల డాలర్లకు(రూ.5.7 లక్షల కోట్లకు )చేరింది. కంపెనీల్లో ఎల్ఐసీ వాటా పెరగడం, కంపెనీల్లో ఉన్న ఎల్ఐసీ వాటాల విలువ కూడా పెరగడం దీనికి ప్రధాన కారణాలు. జూన్ 30 నాటికి ఎల్ఐసీకి దాదాపు 329 కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసిన మొత్తం షేర్లలో 96 శాతం సానుకూల రాబడులనిచ్చాయి. ఎల్ఐసీ...మంచి కాంట్రా ప్లేయర్! ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షేర్లలో ఇప్పటివరకూ రూ.55,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని ఎల్ఐసీ ఉన్నతాధికారొకరు చెప్పారు. గత ఏడాది ఇదే కాలానికి రూ. 32,800 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎల్ఐసీకి మంచి కాంట్రా ప్లేయర్ అనే పేరు ఉంది. అంటే మార్కెట్ పతనసమయంలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పెరుగుతున్న సమయంలో అమ్మేసి లాభాలు చేసుకుంటుంది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ 40% పతనం కావడం, వెంటనే రికవరీ కావడం కూడా ఎల్ఐసీకి కలసివచ్చింది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చూస్తే రూ.10,000 కోట్ల లాభం ఆర్జించామని ఎల్ఐసీ చైర్మన్ ఎమ్ఆర్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులోనే వెల్లడించారు. ఇక ఇప్పుడు స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతుండటంతో ఎల్ఐసీకి భారీ లాభాలు వచ్చి ఉంటాయని నిపుణుల అంచనా. బీమా కంపెనీలకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కీలకమని నిపుణుల అభిప్రాయం. అందుకే నాణ్యత గల షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోందని వారంటున్నారు. తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల నుంచి ఎల్ఐసీ తన వాటాలను తగ్గించుకుంటోంది. అధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతోంది. 1 శాతం కంటే తక్కువ వాటా ఉన్న 33 కంపెనీల నుంచి వైదొలగింది. గతంలో యస్‌బ్యాంక్‌లో ఎల్ఐసీ వాటా 8 శాతంగా ఉంది. ఎప్పుడైతే ఈ బ్యాంక్‌కు సంబంధించిన సమస్యలు వెలుగులోకి రావడం ఆరంభమైందో, ఆ బ్యాంక్‌లో తన వాటాను ఎల్ఐసీ 1.64%కి తగ్గించుకుంది. యస్‌బ్యాంక్‌లో ఎస్బీఐతో సహా మరిన్ని ప్రభుత్వ బ్యాంక్‌లు పెట్టుబడులు పెట్టడంతో మళ్లీ యస్‌బ్యాంక్‌లో వాటాను 4.99%కి పెంచుకుంది. మరోవైపు మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీల్లో తన వాటాలను పెంచుకుంటోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సూమర్, శ్రీ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్‌ల్లో తన వాటాను మరింతగా పెంచుకుంది. మెగా ఐపీఓకు రంగం సిద్ధం... భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్ఐసీ వాటా దాదాపు 76%. త్వరలో ఎల్ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఎల్ఐసీ ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఎల్ఐసీ విలువ రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్ల రేంజ్లో ఉం డొచ్చని భావిస్తున్నారు. -
మార్కెట్.. బౌన్స్‌బ్యాక్!
ముంబై: స్టాక్ మార్కెట్ నవంబర్ సిరీస్‌ను లాభాలతో ముగించింది. ఎఫ్అండ్ఓ ముగింపు నేపథ్యంలో ట్రేడింగ్ ఆద్యంతం ఆటుపోట్లకు లోనైనప్పటికీ.., మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల ర్యాలీ అండతో సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 44,260 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్ల ఆర్జించి 12,987 వద్ద నిలిచింది. మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్‌కు తగ్గట్లు ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ వంటి అంశాలు కొనుగోళ్లకు మద్దతునిచ్చాయి. పండుగ సీజన్లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పనితీరును కనబరిచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలూ ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 780 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ.2,027 కోట్ల షేర్లను కొనగా, దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ.3,400 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నవంబర్ సిరీస్‌లో సెన్సెక్స్ 4510 పాయింట్లను, నిఫ్టీ 1316 పాయింట్లు ఎగిశాయి. ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్.... లాభాల స్వీకరణతో బుధవారం నష్టాలను చవిచూసిన మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా మొదలైంది. ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు రోజు కావడంతో ఆరంభంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో ఉదయం సెషన్లో సూచీలు లాభ – నష్టాల మధ్య ట్రేడ్ అయ్యాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్ షేర్లలో కొనుగోళ్లు మొదలవడంతో లాభాల బాట పట్టాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో మరింత దూసుకెళ్లాయి. -
మళ్లీ రికార్డుల పరుగు..!
ముంబై: స్టాక్ మార్కెట్ మళ్లీ రికార్డుల బాటపట్టింది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 195 పాయింట్లు పెరిగి 44 వేల పైన 44,077 వద్ద స్థిరపడింది. నిప్టీ 67 పాయింట్లను ఆర్జించి 12900 ఎగువున 12,926 వద్ద నిలిచింది. కోవిడ్–19 కట్టడికి ఫార్మా కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ట్రయల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయనే వార్తలు ఈక్విటీలకు ఉత్సాహాన్నిచ్చాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రాజెనికాల సంయుక్త ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన వ్యాక్సిన్ సైతం తుది దశలో మెరుగైన ఫలితాలనిచ్చింది. అలాగే రిలయన్స్ – ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సీసీఐ ఆమోదం తెలపడంతో రిలయన్స్ షేరు 3 శాతం లాభపడి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి రివకరీ కలిసొచ్చింది. మార్కెట్లో జరిగిన విస్తృతస్థాయి కొనుగోళ్ల భాగంగా చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.25% లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 389 పాయింట్లు ఎగసి 44,271 వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 12,969 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు... ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితి 26 శాతానికి పెంచాలని ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) ప్రతిపాదనతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐసీఐసీఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.50 శాతం నుంచి 1% నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1% పతనమైంది. 3 శాతం లాభపడ్డ రిలయన్స్ షేరు... ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీఐఐ) ఆమోదం తెలపడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3 శాతం లాభపడి రూ.1,951 వద్ద ముగిసింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్, గిడ్డంగుల వ్యాపారాలను కొనుగోలు చేయాలన్న రిలయన్స్ రిటైల్ సంస్థ ప్రతిపాదనకు శుక్రవారం సీఐఐ ఆమోదం తెలిపింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆర్ఐఎల్ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించండంతో షేరు ఇంట్రాడేలో 4 శాతం ఎగసి రూ.1,970 స్థాయిని అందుకుంది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.34,892 కోట్లు పెరిగి రూ.13.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఫ్యూచర్ గ్రూప్ షేర్లలోనూ కొనుగోళ్లే... రూ.24,173 కోట్ల ఆర్ఐఎల్–ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు సీఐఐ అనుమతులు లభించడంతో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ షేర్లు పరుగులు పెట్టాయి. రిటైల్ ఫ్యూచర్ 10% లాభపడి రూ.70 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ షేరు 10% ఎగిసి రూ.90.30 స్థాయిని తాకింది. ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో 5% ర్యాలీతో రూ.10.45 స్థాయిని అందుకుంది. -
వ్యాక్సిన్‌పై ఆశలే నడిపిస్తాయ్!
ముంబై: వ్యాక్సిన్‌పై ఆశలు, అంతర్జాతీయ పరిణామాలే ఈ వారం స్టాక్ మార్కెట్‌ను నడిపిస్తాయని నిపుణులంటున్నారు. అలాగే నవంబర్ 26న డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు, పుంజుకుంటున్న కరోనా కేసులు, ఎఫ్ఐఐల పెట్టుబడులు తదితర అంశాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, కరోనా వైరస్ నిర్మూలనకు ఆయా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు మెరుగైన ఫలితాలను ఇవ్వడం, బ్యాంకింగ్ రంగం ప్రీ–కోవిడ్ స్థాయికి చేరుకోవడం లాంటి సానుకూలాంశాలతో గతవారంలో సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లను ఆర్జించాయి. సెన్సెక్స్ 44,230 వద్ద, నిఫ్టీ 12,963 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. కీలకాంశంగా ఎఫ్ఐఐల పెట్టుబడులు... దేశీయ ఈక్విటీల కొనుగోళ్లకు విదేశీ పోర్ట్‌ఫోలియో (ఎఫ్ఐఐ)లు అధిక ఆసక్తిని చూపుతున్నారు. ఈ నవంబర్‌లో వారు నికరంగా రూ. 42,378 విలువైన పెట్టుబడులు పెట్టారు. గడిచిన 20 ఏళ్లలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి. ఫెడ్ రిజర్వ్, ఈయూ కేంద్ర బ్యాంకుతో పాటు అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లపై ఉదాసీనత, ఉద్దీపన ప్యాకేజీ విడుదలతో పెరిగిన లిక్విడిటీ దేశీయంగా విదేశీ పెట్టుబడులకు తోడ్పడినట్లు విశ్లేషకులు తెలిపారు. ఏవైనా ఇతరేతర కారణాలతో ఎఫ్ఐఐలు పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకుంటే దేశీయ ఈక్విటీ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. క్రిస్మస్ పండుగకు ముందు ఎఫ్‌పీఐలు కొనుగోళ్లను తగ్గించిన వెంటనే మార్కెట్లో దిద్దుబాటును చూడవచ్చని నిపుణులంటున్నారు. వ్యాక్సిన్‌పై ఫలితాల ప్రభావం... కోవిడ్–19 కట్టడికి తయారవుతున్న వ్యాక్సిన్ల అభివృద్ధి, పరీక్షల్లో ఫలితాలు వచ్చే రోజుల్లో సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయి. అమెరికా ఫార్మా కంపెనీలై మోడర్నా, ఫైజర్లు రూపొందించిన వ్యాక్సిన్లు మూడో దశలో 95 శాతం ఫలితాలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల విజయవంతంపై మార్కెట్ వర్గాలు భారీ ఆశల్నే పెట్టుకున్నాయి. ఫెడ్ రిజర్వ్ మినిట్స్... ఈ వారంలో దేశీయ ఆర్థిక గణాంకాల విడుదల లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ గమనానికి ప్రధానాంశంగా మారనున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ఇదే వారంలో ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ మినిట్స్, నిరుద్యోగ గణాంకాల నమోదు, పలు కంపెనీల ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటి ప్రభావం ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించగలవు. అలాగే అంతర్జాతీయంగా రెండో దశ కరోనా కేసుల పెరుగుదల ఈక్విటీ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. రూపాయి కీలకమే... రూపాయి కదలికలు కీలకం కానున్నాయి. స్థిరమైన సూచీల ర్యాలీ, క్రమమైన విదేశీ పెట్టుబడుల రాకతో శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలపడి 74.16 వద్ద ముగిసింది. ఇది వారం గరిష్టస్థాయి కావడం విశేషం. నవంబర్ 26న ఎఫ్అండ్ఓ ముగింపు... గురువారం(26న) నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు డిసెంబర్ సిరీస్‌కు పొజిషన్లను రోలోవర్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో మార్కెట్ ఆటుపోట్లకు లోనయ్యే వీలుందని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 27న జీడీపీ క్యూ2 గణాంకాలు... ఈ నెల 27వ తేదీ శుక్రవారం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సెప్టెంబర్ త్రైమాసిక (క్యూ2) గణాంకాలు వెలువడనున్నాయి. అయితే ఇవి మార్కెట్ అనంతరం వెలువడే అవకాశం ఉన్నందున, అంచనాలకు అనుగుణంగా మార్కెట్ కదలాడే అవకాశం ఉంది. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణత నమోదయిన నేపథ్యంలో సెప్టెంబర్ త్రైమాసికంలో 9.5 శాతానికి క్షీణత పరిమితమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
మళ్లీ లాభాల్లోకి మార్కెట్
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 282 పాయింట్లు పెరిగి 43,882 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 87 పాయింట్లను ఆర్జించి 12,859 వద్ద నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి రికవరీ, ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం తదితర మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ కలిసొచ్చింది. చిన్న, మధ్య తరహా షేర్లకు అధికంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 413 పాయింట్ల వరకు ఎగసి 44,013 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 12,892 – 12,771 రేంజ్లో కదలాడింది. మీడియా, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ వారంలో జరిగిన నాలుగు ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లను ఆర్జించాయి. శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3860.78 కోట్ల షేర్లను కొన్నారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రిలయన్స్ షేరుకు నాలుగో నష్టాలే... రిలయన్స్ షేరు వరుసగా నాలుగో రోజూ నష్టాలను చవిచూసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మేందుకే మొగ్గు చూపడంతో ఒక దశలో 4% నష్టపోయి రూ.1895 వద్ద రూ.1895 కనిష్టాన్ని తాకింది. చివరికి 3.50% క్షీణించి రూ.1899 వద్ద స్థిరపడింది. ఇండస్ టవ ర్స్, భారతీ ఇన్ఫ్రాటెల్ టవర్ల వ్యాపార విలీన ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రకటించడంతో ఎయిర్టెల్ షేర్లు 3% లాభంతో రూ.483.50 వద్ద ముగిసింది. గ్లాండ్ ఫార్మా లిస్టింగ్... గ్రాండ్! ముంబై: ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా స్టాక్ మార్కెట్ అరంగ్రేటం అదిరిపోయింది. ఇష్యూ ధర (రూ.1,500)తో పోలిస్తే బీఎస్ఈలో 13 శాతం లాభంతో రూ.1,701 వద్ద లిస్ట్య్యింది. కరోనా రాకతో ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజక్టబుల్ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనవచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు ఆçసక్తి చూపారు. ఒక దశలో 23 శాతం పెరిగి రూ.1,850 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. చివరికి 21 లాభంతో రూ.1,820 వద్ద ముగిశాయి. హైదరాబాద్ ఆధారిత ఈ గ్లాండ్ ఫార్మా కంపెనీ రూ. 1,500 ధరతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ నెల 9న ప్రారంభమై 11న ముగిసిన ఐపీఓ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.6,480 కోట్లను సమీకరించింది. -
మూడోరోజూ రికార్డులే...
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడోరోజూ రికార్డుల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్, ఆటో, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్ 227 పాయింట్లు లాభపడి తొలిసారి 44 వేల పైన 44,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 12,938 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంలో రూపాయి 27 పైసలు బలపడటం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, కరోనా వైరస్ వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతం వార్తలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలోసెన్సెక్స్ 262 పాయింట్లు లాభపడి 44,215 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 12,948 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, టెలికాం రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆర్థిక కంపెనీల యాజమాన్యాలు వెల్లడించిన అవుట్‌లుక్‌లో... ఆదాయాలతో పాటు, ఆస్తుల నాణ్యత మెరుగుపడతాయనే వ్యాఖ్యలతో ఈ రంగ షేర్ల ర్యాలీచేస్తున్నాయని మార్కెట్ నిపుణులంటున్నారు. ఇటీవల పతనాన్ని చవిచూసిన ఆటో షేర్లల్లో షార్ట్ కవరింగ్ జరిగినట్లు వారంటున్నారు. లక్ష్మీ విలాస్.. లోయర్ సర్క్యూట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆర్బీఐ పర్యవేక్షణలోకి వెళ్లిన లక్ష్మీ విలాస్ బ్యాంకు షేరు బుధవారం 20 శాతం నష్టపోయి రూ.12.40 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది. డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్ స్థిరత్వం, ఆర్థిక వ్యవహారాల పటిష్టతల దృష్ట్యా ఆర్బీఐ నెలరోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 6 శాతం లాభపడ్డ ఎల్అండ్టీ షేరు.... టాటా స్టీల్ నుంచి భారీ ఆర్డర్‌ను దక్కించుకోవడంతో ఎల్అండ్టీ షేరు 6% లాభపడి రూ.1,148 వద్ద ముగిసింది. నాల్కో నుంచి మధ్యంతర డివిడెండ్... ప్రభుత్వ రంగ అల్యూమినియం తయారీ కంపెనీ నాల్కో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.0.50 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. మార్కెట్ రికార్డు ర్యాలీ నేపథ్యంలో అదానీ గ్యాస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జుబిలెంట్ పుడ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్, వైభవ్ గ్లోబల్స్ షేర్లు జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్నాయి. విప్రో బైబ్యాక్.. డిసెంబర్ 11 న్యూఢిల్లీ: ప్రతిపాదిత షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కి డిసెంబర్ 11 రికార్డ్ తేదీగా నిర్ణయించినట్లు ఐటీ సేవల సంస్థ విప్రో వెల్లడించింది. దీని కింద సుమారు రూ. 9,500 కోట్ల దాకా విలువ చేసే షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకోసం షేరు ఒక్కింటికి రూ. 400 రేటు నిర్ణయించింది. విప్రో గతేడాది సుమారు రూ. 10,500 కోట్ల దాకా విలువ చేసే షేర్ల బైబ్యాక్ నిర్వహించింది. మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ. 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపారు. -
కొనసాగుతున్న రికార్డులు..
ముంబై: ఫార్మా, మెటల్, ఆటో షేర్ల ర్యాలీతో సూచీలు ఎనిమిదోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు పెరిగి 43,594 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లను ఆర్జించి 12,749 వద్ద స్థిరపడ్డాయి. దీంతో సూచీల రికార్డుల పర్వం మూడోరోజూ కొనసాగినట్లయింది. దేశంలో పది కీలక రంగాల్లో ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం(పీఎల్ఐ)కు ఆమోదం తెలపడంతో సంబంధిత రంగాల్లో విస్తృతంగా కొనుగోళ్లు జరిగాయి. అలాగే ఫైజర్ కంపెనీ రూపొందించిన కోవిడ్ –19 వ్యాక్సిన్ విజయవంతం ఆశలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 431 పాయింట్లు పెరిగి 43, 708 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల 12,770 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో అమ్మకాలు... లాభాలతో మొదలైన మార్కెట్లో తొలి గంటలో కొనుగోళ్లు కొనసాగాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిచూపారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ట్రేడర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఇంధన, మీడియా రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా మిడ్‌సెషన్ కల్లా సెన్సెక్స్ ఇంట్రాడే(43,708) నుంచి ఏకంగా 738 పాయింట్ల కోల్పోగా, నిఫ్టీ డే హై నుంచి 200 పాయింట్లు పడింది. 4 శాతం నష్టపోయిన రిలయన్స్... ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు బుధవారం 4 శాతం నష్టపోయి రూ. 1979 వద్ద స్థిరపడింది. ఎమ్ఎస్సీఐ ఇండెక్స్ రివ్యూలో రిలయన్స్ షేరుకు వెయిటేజీ తగ్గించడంతో అమ్మకాలు తలెత్తాయి. గ్లాండ్ ఫార్మా ఐపీఓకు 2 రెట్ల స్పందన హైదరాబాద్: గ్లాండ్ ఫార్మా ఐపీఓ చివరిరోజు ముగిసేసరికి 2.05 రెట్లు్ల ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూలో భాగంగా కంపెనీ జారీ చేసిన మొత్తం 3.50 కోట్ల షేర్లకు గానూ 6.21 కోట్ల బిడ్లు ధాఖలయ్యాయి. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) విభాగం 6.40 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ)విభాగం 51 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 శాతం సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు తెలిపాయి. రూ.6,480 కోట్ల సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చిన ఇష్యూ ఈ నవంబర్ 9 న ప్రారంభమైంది. -
మార్కెట్లలో ముందుగానే దీపావళి
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్.. లాభాలతో బేర్ ఆపరేటర్లపై కాలు దువ్వుతోంది. దీంతో వరుసగా ఐదో రోజు మార్కెట్లు పరుగు తీశాయి. సెన్సెక్స్ 553 పాయింట్లు జంప్ చేసి 41,893 వద్ద నిలిచింది. తద్వారా 42,000 పాయింట్ల మైలురాయికి చేరువలో ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు జమ చేసుకుని 12,264 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు 9 నెలల గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది జనవరి 24న మాత్రమే మార్కెట్లు ఈ స్థాయిలో కదిలాయి. ఫలితంగా జనవరిలోనే నమోదైన చరిత్రాత్మక గరిష్టాలకు మార్కెట్లు కేవలం 2 శాతం దూరంలో నిలవడం విశేషం. ఐదు రోజుల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లు పురోగమించడం విశేషం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 41,955 వద్ద, నిఫ్టీ 12,280 వద్ద గరిష్టాలను తాకాయి. కారణాలున్నాయ్ మార్కెట్ల జోరుకు పలు కారణాలున్నట్లు స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా అమెరికాసహా ప్రపంచ మార్కెట్లు ర్యాలీ చేయడం, తాజాగా ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీలకు మొగ్గు చూపడం, స్టిములస్ కు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 190 బిలియన్ డాలర్లను పెంచడం, ఎఫ్ఐఐలు దేశీయంగా పెట్టుబడులు కుమ్మరించడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్ నిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ స్టాక్స్ లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా 8,530 కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అక్టోబర్‌లోనూ రూ. 14,537 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఫార్మా వీక్ ఎన్ఎస్ఈలో ప్రైవేట్ బ్యాంక్స్ 2.2 శాతం జంప్ చేయగా.. రియల్టీ, ప్రభుత్వ బ్యాంక్స్, ఐటీ, మెటల్ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఫార్మా 0.7 శాతం వెనకడుగు వేసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్, బజాజ్ ఫిన్, ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, కొటక్ బ్యాంక్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా 3.6-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్ లో మారుతీ, గెయిల్, ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్, నెస్లే, బీపీసీఎల్, సన్ ఫార్మా 3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఎఫ్అండ్ వో.. డెరివేటివ్స్ లో ఐబీ హౌసింగ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మదర్ సన్, అపోలో టైర్, ఆర్ఐఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, శ్రీరామ్ ట్రాన్స్, బంధన్ బ్యాంక్, ముత్తూట్, పేజ్ 5.2- 2.5 శాతం మధ్య జంప్ చేశాయి. అయితే కంకార్, అంబుజా, బాష్, ఏసీసీ, కేడిలా, లుపిన్, ఎల్ఐసీ హౌసింగ్, టొరంట్ ఫార్మా, భెల్ 7-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,512 లాభపడగా.. 1,112 నష్టాలతో నిలిచాయి. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 5,368 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2,208 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 146 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు కేవలం రూ. 8 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
మార్కెట్‌కు బైడెన్ జోష్
ముంబై: అందరూ అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్ష పోటీలో జో బైడెన్ ముందంజలో కొనసాగుతుండడం స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. భారత సేవల రంగం ఏడునెలల తర్వాత మెరుగైన గణాంకాలను ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు దేశ ఆర్థిక రికవరీ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగడం, రూపాయి 40 పైసలు బలపడటం, అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన పెట్టుబడిదారులకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగిసేవరకు మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరిగాయి. ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. మెటల్ షేర్ల పట్ల అధిక ఆసక్తి చూపారు. దీంతో సూచీలకు వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు ఖరారైంది. సెన్సెక్స్ 724 పాయింట్లు పెరిగి 41,340 వద్ద, నిఫ్టీ 212 పాయింట్ల లాభంతో 12,120 వద్ద స్థిరపడ్డాయి. ఇరు సూచీలకిది ఎనిమిది నెలల గరిష్ట ముగింపు కావడం విశేషం. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,727 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్లను ఆర్జించాయి. తద్వారా ఈ ఏడాదిలో నమోదైన నష్టాలను పూడ్చుకోగలిగాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆరుశాతం పెరిగిన ఎస్బీఐ షేరు ఎస్బీఐ షేరు గురువారం బీఎస్ఈలో 6 శాతం లాభపడింది. రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరుతో బ్యాంకు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో షేరు రూ.214 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు తెరతీశారు. ఒకదశలో ఏడుశాతం ఎగిసిన రూ.221 స్థాయికి చేరుకుంది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.218 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,397 కోట్లు పెరిగి రూ.1.95 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ‘‘ఊహించినట్లుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ముందంజ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేకుండా యథాతథ కొనసాగింపును ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్వార్టర్ ఫలితాలు, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు భారత మార్కెట్‌ను లాభాల్లో నడిపిస్తున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగపు అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్ల సంపద రూ.2.78 లక్షల కోట్లు అప్ సూచీలు భారీ ర్యాలీతో గురు వారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.78 లక్షల కోట్లను సంపదను ఆర్జించారు. మార్కెట్లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 162 లక్షల కోట్లకు ఎగసింది. -
మూడోరోజూ ముందుకే...
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో మార్కెట్ ముచ్చటగా మూడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ సూచీలకు దన్నుగా నిలిచింది. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. అధిక వెయిటేజీ రిలయన్స్‌తో పాటు ఐటీ షేర్ల అండతో సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 40,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లను ఆర్జించి 11,900 పైన 11,909 వద్ద స్థిరపడింది. వరుస మూడు ట్రేడింగ్ సెషన్లలో సెనెక్స్ 1,003 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 266 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. 617 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్.... అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ బుధవారం మార్కెట్ లాభాలతో మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవి పోరులో ఊహించినట్లుగానే బైడెన్ ముందంజలో ఉన్నాడనే వార్తలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఉదయం సెషన్లో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,693 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 117 పాయింట్లను ఆర్జించి 11,929 వద్ద ఇంట్రాడే హైని తాకింది. మిడ్ సెషన్లో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు వెనకడుగు వేశాయి. అయితే యూరప్ మార్కెట్ల పాజిటివ్ ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. అలాగే చివరి గంట కొనుగోళ్లు కూడా సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ‘‘యూఎస్ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈక్విటీల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు ఆరంభలాభాల్ని కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మంచిది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ దీపక్ జెసానీ తెలిపారు. సన్‌ఫార్మా షేరు 4 శాతం జంప్: సన్‌ఫార్మా షేరు బుధవారం బీఎస్ఈలో 4 శాతం లాభపడింది. ప్రోత్సాహకరమైన క్యూ2 ఫలితాల ప్రకటన షేరును రెండోరోజూ లాభాల బాట పట్టించింది. ఒకదశలో 6.81 శాతం పెరిగి రూ.518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.504 వద్ద స్థిరపడింది. నవంబర్ 14న దీపావళి మూరత్ ట్రేడింగ్ దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా గంటపాటు మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది నవంబర్ 14 న దీపావళి పండుగ జరగనుంది. అదేరోజు సాయంత్రం 6:15 గంటల నుంచి 7:15 మధ్య ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తామని స్టాక్ ఎక్సే్ఛంజీలు వివరించాయి. హిందూ పంచాంగం ప్రకారం బ్రోకర్లకు, వ్యాపారులకు కొత్త సంవత్సరం దీపావళి రోజున ప్రారంభం అవుతుంది. నవంబర్ 16న (సోమవారం) బలిప్రతిపద పండుగ సందర్భంగా ఎక్సే్ఛంజీలకు సెలవు ప్రకటించారు. దీంతో మార్కెట్లు తిరిగి నవంబర్ 17న ప్రారంభమవుతాయి. -
సెన్సెక్స్ 127 పాయింట్లు ప్లస్
న్యూఢిల్లీ: మార్కెట్ నష్టాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఆటో, ఐటీ, మెటల్, పవర్ షేర్ల అండతో శుక్రవారం తిరిగి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి 40,686 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 11,930 వద్ద నిలిచింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా నమోదవడంతో పాటు అమెరికా ఉద్దీపన ప్యాకేజీ విడుదల చర్చలు పురోగతిని సాధించడం లాంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయనేందుకు సంకేతంగా ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్ 4 శాతం నష్టపోయింది. చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపారు. ఇక వారం మొత్తంగా సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు లాభపడ్డాయి. పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్.. నష్టాల ముగింపు రోజు తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, ఆర్థిక షేర్ల దూకుడుతో ఉదయం సెషన్లో సెన్సెక్స్ 253 పాయింట్లు పెరిగి 40,811 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లను ఆర్జించి 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిలను అందుకున్నాయి. వారాంతం కావడంతో మిడ్‌సెషన్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఆటో, మెటల్ షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలవడంతో లాభాలతో ముగిశాయి. ‘‘మార్కెట్ మరోరోజు కన్సాలిడేట్కు లోనై లాభాలతో ముగిసింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ తాజా సమాచారంతో పాటు రానున్న అధ్యక్ష ఎన్నికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. యూరప్‌లో పుంజుకుంటున్న రెండో దశ కోవిడ్–19 కేసులను నిశితంగా పరిశీలిస్తున్నారు’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరుకు ఫలితాల జోష్.. మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రకటనతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు శుక్రవారం 6 శాతం లాభపడింది. రూ.303.70 వద్ద ముగిసింది. ఈ క్యూ2లో కంపెనీ నికరలాభం 27.77 శాతం వృద్ధి చెంది రూ.141.68 కోట్లను ఆర్జించింది. -
మార్కెట్ మళ్లీ లాభాల బాట...
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల పట్టాలెక్కింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్ 449 పాయింట్లు పెరిగి.. తిరిగి 40 వేల పైన 40,432 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 111 పాయింట్లను ఆర్జించి 11,873 వద్ద ముగిసింది. ఈ ఏడాది చివరికల్లా కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. పడిపోయిన క్రూడాయిల్ ధరలు కూడా మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. చిన్న, మధ్య తరహా షేర్ల కౌంటర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. మరోవైపు అటో, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్ఐఐలు రూ.1656.78 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1621.73 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ నెలకొనడం సూచీలకు కలిసొచ్చింది. పీఎస్‌యూ షేర్లకు బైబ్యాక్ బూస్టింగ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఇంజనీరింగ్స్ ఇండియాతో సహా మొత్తం 8 కంపెనీలను బైబ్యాక్ ప్రక్రియను చేపట్టాల్సిందిగా కేంద్రం కోరినట్లు వచ్చిన వార్తలతో ఇంట్రాడేలో పీఎస్‌యూ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గెయిల్ 4 శాతానికి పైగా లాభపడింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ షేర్లు 3 నుంచి 2 శాతంతో స్థిరపడ్డాయి. బీఎస్ఈలో పీఎస్‌యూ ఇండెక్స్ 2.50 శాతం లాభంతో ముగిసింది. ఎగసి‘పడిన’ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు... మెరుగైన క్యూ2 ఫలితాల ప్రకటనతో భారీ లాభంతో మొదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు మార్కెట్ ముగిసేసరికి 0.35% స్వల్ప లాభంతో రూ.1203.55 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు... చైనా సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక వృద్ధి గణాంకాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. కరోనా పతనం నుంచి వేగంగా రికవరీని సాధిస్తూ ఈ త్రైమాసికపు ఆర్థిక వృద్ధి 4.9%గా నమోదైంది. ఫలితంగా సోమవారం ఆసియా మార్కెట్లు 1.5% పైగా లాభంతో ముగిశాయి. అయితే చిత్రంగా చైనా మార్కెట్ అరశాతం నష్టపోయింది. -
కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు
న్యూఢిల్లీ: కనిష్ట స్థాయిల వద్ద మెటల్, ఫైనాన్స్, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. సెనెక్స్ 255 పాయింట్లు పెరిగి 39,983 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 11,762 వద్ద స్థిరపడ్డాయి. మునుపటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రధాన షేర్ల వ్యాల్యుయేషన్లు దిగివచ్చాయి. అలాగే ధరలు గరిష్టస్థాయిల నుంచి కనిష్టాలకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల వద్ద చిన్న, మధ్య తరహా షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. అయితే ఐటీ, మీడియా షేర్లు మాత్రం స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లకుగానూ 24 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఐఐలు, డీఐఐలు ఇరువురూ శుక్రవారం నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఎఫ్ఐఐలు రూ.479 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.430 కోట్ల షేర్లను విక్రయించారు. ఈ వారంలో సెనెక్స్ 526.51 పాయింట్లు(1.29 శాతం), నిఫ్టీ 157.75 పాయింట్లను కోల్పోయాయి. రెండోదశ కరోనా కేసుల విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వైఖరి నెలకొని ఉంది. మెరిసిన మెటల్ షేర్లు–ఐటీలో అమ్మకాలు... కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్న మెటల్ షేర్లలో శుక్రవారం అనూహ్య ర్యాలీ చోటుచేసుకుంది. టాటా స్టీల్ (5.5 శాతం), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (6.7 శాతం) షేర్ల అండతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం లాభంతో ముగిసింది. అయితే ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగడంతో ఈ రంగ షేర్లు ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మెటల్‌తో పాటు బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్స్ షేర్లలో ర్యాలీ కూడా బెంచ్‌మార్క్ సూచీలకు కలిసొచ్చింది. ఒక దశలో సెన్సెక్స్ 398 పాయింట్లు పెరిగి 40,126 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు లాభపడి 11,790 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ‘నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌లో 11,500 వద్ద బలమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. రెండో త్రైమాసిక ఫలితాలు, ఉద్దీపన ప్యాకేజీ ప్రణాళికల వార్తలు రానున్న రోజుల్లో మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. ఐటీ, టెలికం, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లోని సానుకూలతల దృష్ట్యా రానున్న రోజుల్లో ఈ షేర్లు రాణించే అవకాశం ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ‘నిఫ్టీలో కన్సాలిడేషన్ జరిగేందుకు అవకాశం ఉన్నట్లు సంకేతాలు సూచిస్తున్నాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని., ఇరువైపుల పొజిషన్లను మెయిన్టైన్ చేసుకోవాలని మా కస్టమర్లకు సలహానిస్తున్నాము’ అని రెలిగేర్ బ్రోకింగ్ చైర్మన్ అజిత్ మిశ్రా తెలిపారు. ► హెచ్‌సీఎల్ టెక్ షేరు 3% క్షీణించింది. ► క్యూ2 ఆదాయ వృద్ధి మందగించడంతో మైండ్ ట్రీ షేరు 7 శాతం నష్టాన్ని చవిచూసింది. ► అనుబంధ సంస్థ ఆడిటర్ రాజీనామా తో యూపీఎల్ షేరు 8% క్షీణించింది. ► ఎన్ఎస్ఈలో 89 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. -
40,000 పైకి సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా ఆరో రోజూ కొనుగోళ్ల పర్వం కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 7 నెలల తర్వాత తొలిసారి 40,000 మార్కును అందుకుంది. నిఫ్టీ 11,800 స్థాయి పైకి చేరుకుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విరివిరిగా కొనుగోళ్లు జరగడంతో సూచీల ర్యాలీ సాఫీగా సాగింది. ర్యాలీకి ఐటీ షేర్లు ప్రాతినిధ్యం వహించాయి. అలాగే ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లకు కూడా ఆశించిన స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,469 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,905 పాయింట్ల వద్ద గరిష్టాలను తాకాయి. అయితే చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా 304 పాయింట్ల లాభంతో 40,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లను ఆర్జించి 11,835 వద్ద ముగిసింది. మరోవైపు మీడియా, ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్స్‌లో సెన్సెక్స్ 2,210 పాయింట్లను, నిఫ్టీ 612 పాయింట్లను ఆర్జించాయి. అదరగొట్టిన ఐటీ షేర్లు నేడు సూచీల భారీ లాభార్జనలో ఐటీ షేర్ల పాత్ర ఎంతైనా ఉంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలను మించాయి. అలాగే రూ.16వేల కోట్ల బైబ్యాక్ ప్రకటనతో ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్ షేరు నేడు 3శాతం లాభపడింది. ఈ అక్టోబర్ 13న జరిగే బోర్డు సమావేశంలో బైబ్యాక్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామనే ప్రకటనతో విప్రో షేరు 7% ర్యాలీ చేసింది. ఇదే రంగంలోని ప్రధాన షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు 3–2 శాతం ర్యాలీ చేశాయి. మొత్తం మీద బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 3 శాతం పెరిగింది. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలలోపు కొంతైనా సహాయక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించవచ్చనే వార్తలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో సానుకూల సంకేతాల వాతావరణం నెలకొంది. ఆసియాలో కొన్ని మార్కెట్లు నెల గరిష్టం వద్ద ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభంతో ప్రారంభమయ్యాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం లాభంతో కదలాడాయి. ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. కొనసాగుతున్న ఎఫ్ఐఐల కొనుగోళ్లు భారత ఈక్విటీ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు సానుకూల వైఖరిని కలిగి ఉన్నారు. లాక్డౌన్ ఎత్తివేత తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ అవుతుందనే అంచనాలు వారిని ఆకర్షిస్తున్నాయి. అందుకు సంకేతంగా ఈ వారం ప్రారంభం నుంచి ఎఫ్ఐఐలు మన మార్కెట్లో భారీ ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు. ఐటీ సెక్టార్ మెరుగైన క్యూ2 ఫలితాల ప్రకటనతో మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పింది. అలాగే పలు కంపెనీల బైబ్యాక్‌లు ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచాయి. అమెరికా, భారత్‌లో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన అంచనాలు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ -
అయిదో రోజూ మార్కెట్ ముందుకే..
ముంబై: అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీతో స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 39,879 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 11,739 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,906 పాయింట్లు, నిఫ్టీ 516 పాయింట్లను ఆర్జించాయి. ఆటో, బ్యాంకింగ్, ఐటీ, ప్రైవేట్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంక్, రియల్టీ, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,968– 39,451 పాయింట్ల మధ్య కదలాడగా, నిఫ్టీ 11,763– 11,629 రేంజ్లో ఊగిసలాడింది. బుధవారం ఎఫ్‌పీఐలు రూ.1093 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1129 కోట్ల షేర్లను విక్రయించారు. ఎన్నికలకు ముందు అమెరికాకు ఎలాంటి ఉద్దీపన ప్యాకేజీ ఉండదనే ట్రంప్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా మన మార్కెట్ స్వల్ప నష్టంతో మొదలైంది. ఆదుకున్న హెవీ వెయిటేజీ షేర్ల ర్యాలీ నష్టాలతో మొదలై ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతున్న సూచీలను అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ ఆదుకుంది. రిలయన్స్ రిటైల్‌లో తాజాగా అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ. 5,513 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడినట్లు రిలయన్స్ ప్రకటనతో ఈ కంపెనీ షేరు 3 శాతం లాభపడింది. క్యూ2 ఫలితాలకు ముందు టీసీఎస్ షేరు ఒక శాతం ర్యాలీ చేసింది. రెండో త్రైమాసికంలో తమ వ్యాపారం సాధారణ స్థాయికి చేరుకుందని టైటాన్ తెలపడంతో ఈ షేరు 4.5 శాతం పెరిగింది. వీటికి తోడు మిడ్‌సెషన్ నుంచి ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు వరుసగా 5 రోజూ లాభంతో ముగిశాయి. మెరుగైన దేశీయ ఆర్థిక గణాంకాల వెల్లడితో పాటు కంపెనీల క్యూ2 గణాంకాల పట్ల ఆశావహ అంచనాల నుంచి మార్కెట్ సానుకూల సంకేతాలను అందిపుచ్చుకుందని ఈక్విటీ రీసెర్చ్ అధిపతి పారిస్ బోత్రా తెలిపారు. వ్యాపారాలు తిరిగి గాడిలో పడటంతో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీల షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చిందన్నారు. -
గణాంకాల కిక్.. అమెరికా ఉద్దీపన ఊరట
అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై సానుకూల అంచనాలకు తోడు ఆర్థిక గణాంకాలు ఆశావహంగా ఉండటంతో గురువారం స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. సెన్సెక్స్ 38,500 పాయింట్లపైకి, నిఫ్టీ 11,400 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 63 పైసలు పుంజుకొని 73.13కు చేరడం, అన్‌లాక్ 5 మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 629 పాయింట్లు ఎగసి 38,697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 169 పాయింట్లు పెరిగి 11,417 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్1.65 శాతం, నిఫ్టీ 1.51 శాతం చొప్పున పెరిగాయి. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. ఆరంభం నుంచి అంతే... ఆసియా మార్కెట్ల జోష్‌తో ఆరంభంలోనే మన మార్కెట్ భారీ లాభాలను సాధించింది. రోజంతా లాభాలు కొనసాగాయి. బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు బాగా పెరిగాయి. ఈ వారంలో సెన్సెక్స్ 1,308 పాయింట్లు, నిఫ్టీ 367 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. శాతం పరంగా, సెన్సెక్స్ 3.49 శాతం, నిఫ్టీ 3.31 శాతం చొప్పున పెరిగాయి. సెలవుల కారణంగా షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు పనిచేయలేదు. సాంకేతిక సమస్యల కారణంగా జపాన్ మార్కెట్లో ట్రేడింగ్ జరగలేదు. యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు.... ► ఇండస్ఇండ్ బ్యాంక్ 12.4 శాతం లాభంతో రూ.593 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–ఐటీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, ఓఎన్జీసీ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 29 షేర్లు లాభపడ్డాయి. లాభాలు ఎందుకంటే... ► సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 95,480 కోట్లకు చేరాయి. ఆగస్టులో వసూలయిన జీఎస్టీ వసూళ్లకన్నా సెప్టెంబర్ వసూళ్లు 10% అధికంకావడం విశేషం. ► దేశీయ తయారీ రంగం సెప్టెంబర్‌లో ఎనిమిదిన్నరేళ్ల గరిష్టస్థాయికి ఎగసింది. ► సెప్టెంబర్‌లో వాహన విక్రయాలు జోరుగా పెరిగాయి. మారుతీ, బజాజ్ ఆటో తదితర కంపెనీల అమ్మకాలు 10–30 శాతం రేంజ్లో పెరగడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలేసింది. ► కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం మరో భారీ ఉద్దీపన ప్యాకేజీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటించనున్నదన్న అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ► కంటైన్మెంట్ జోన్లలో మినహా సినిమాహాళ్లు, మాల్స్‌ను తెరవడానికి అన్‌లాక్ 5.0 మార్గదర్శకాల ద్వారా కేంద్రం అనుమతిచ్చింది. ► డాలర్‌తో రూపాయి మారకం విలువ 63 పైసలు పుంజుకొని 73.13కు చేరింది. రూ.1.7 లక్షల కోట్లు ఎగసిన సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.7 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.68 లక్షల కోట్లు ఎగసి 156.9 లక్షల కోట్లకు చేరింది నేడు మార్కెట్‌కు సెలవు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నేడు (అక్టోబర్ 2–శుక్రవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఫారెక్స్, బులియన్ మార్కెట్లు కూడా పనిచేయవు. ట్రేడింగ్ మళ్లీ మూడు రోజుల తర్వాత సోమవారం(ఈ నెల 5న) జరుగుతుంది. -
స్వల్ప లాభాలతో సరి..!
చివరి వరకూ లాభనష్టాల మధ్య, ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడిన బుధవారం నాటి స్టాక్ మార్కెట్ చివరకు స్వల్పలాభాలతో గట్టెక్కింది. కొన్ని ఆర్థిక, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకొని 73.76 వద్దకు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, పై స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇంట్రాడే లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు పెరిగి 38,068 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,248 పాయింట్ల వద్ద ముగిశాయి. మెప్పించని తొలి డిబేట్.... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష అభ్యర్థుల తొలి డిబేట్ ప్రపంచ మార్కెట్లను మెప్పించలేకపోవడం, కరోనా కేసులు పెరుగుతుండటంతో స్టాక్ సూచీలు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మన మార్కెట్ లాభాల్లో మొదలైనా, అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. చివరి వరకూ పరిమిత శ్రేణిలో లాభనష్టాల మధ్య కదలాడింది. ఒక దశలో 145 పతనమైన సెన్సెక్స్ మరో దశలో 263 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 408 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టెక్ మహీంద్రా 3 శాతం లాభంతో రూ.790 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టస్థాయిలను తాకాయి. అపోలో హాస్పిటల్స్, ఎస్కార్ట్స్, రామ్‌కో సిస్టమ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. -
త్వరలో భారీ ప్యాకేజీ!
కేంద్రం గత ప్యాకేజీకి మించి, భారీ ఉద్దీపన ప్యాకేజీని రూపొందిస్తోందన్న వార్తల జోష్‌తో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనమై 73.79కు చేరినా, కరోనా కేసులు పెరుగుతున్నా మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20,000 కోట్ల పెట్టుబడులు అందనున్నాయన్న వార్తలు, ప్రపంచ మార్కెట్లు లాభపడటం..... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడి 37,982 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు ఎగసి 11,228 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6 శాతం పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి. రూ. 3 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 2.81 లక్షల కోట్లు పెరిగి రూ. 155.10లక్షల కోట్లకు ఎగసింది. చివర్లో మరింత జోరు... ఆసియా మార్కెట్ల జోరుతో మన మార్కెట్టు లాభాల్లోనే మొదలైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. చివర్లో కొనుగోళ్ళు మరింత జోరుగా సాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38 వేల పాయింట్లపైకి ఎగబాకింది. ఆర్థిక, వాహన, ఫార్మా రంగ షేర్లు మంచి లాభాలు సాధించాయి. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు–హిందుస్తాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియాలు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 8% లాభంతో రూ.40.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► షేర్ బైబ్యాక్ ఆఫర్ ముగియడంతో సన్ ఫార్మా షేర్ 5 శాతం లాభంతో రూ. 20.75 వద్ద ముగిసింది. ► ఒక్కో షేర్ ఐదు షేర్లుగా నేడు(మంగళవారం)విభజన చెందనుండటంతో లారస్ ల్యాబ్స్ షేర్ 10 శాతం లాభంతో రూ.1,460 వద్ద ముగిసింది. ► పశ్చిమ బెంగాల్లో వచ్చే నెల 1 నుంచి సినిమా హాళ్లు ప్రారంభం కానుండటంతో పీవీఆర్, ఐనాక్స్ విండ్ షేర్లు 6–10 శాతం రేంజ్లో పెరిగాయి. ► వందకు పైగా షేర్లు ఏడాది గరిష్టస్థాయిలకు ఎగిశాయి. ఇండి యామార్ట్ ఇంటర్మెష్, అపోలో హాస్పిటల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. డిష్ టీవీ, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు, అదానీ గ్రీన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► నేటి నుంచి మూడు ఐపీఓలు–మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ ఏఎమ్‌సీ, లిఖిత ఇన్ఫ్రా ప్రారంభం కానున్నాయి. చైనా పరిశ్రమల లాభాలు ఆగస్టులో పెరిగాయి. ఈ లాభాలు వరుసగా నాలుగో నెలలోనూ పెరగడం ఇన్వెస్టర్లలో జోష్ని నింపింది. చైనా తయారీ రంగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నేడు (మంగళవారం)తొలి డిబేట్ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. షాంఘై మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు 1–2 % రేంజ్లో లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 2–3% లాభాల్లో ముగిశాయి. -
మార్కెట్‌కు ‘ప్యాకేజీ’ జోష్..!
గురువారం నాటి భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ శుక్రవారం కోలుకుంది. త్వరలో అమెరికా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగలదన్న వార్తల కారణంగా కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు పుంజుకొని 73.61 వద్దకు చేరడం కలసివచ్చింది. ప్రపంచ మార్కెట్లు గురువారం నాటి నష్టాల నుంచి కోలుకోవడం, గత ఆరు రోజుల పతనం కారణంగా నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం(వేల్యూ బయింగ్), కేంద్ర ప్రభుత్వం కూడా పండగ ప్యాకేజీని ఇవ్వనున్నదన్న వార్తలు.....సానుకూల ప్రభావం చూపించాయి. దీంతో ఆరు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 37,388 పాయింట్ల వద్ద, నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 11,050 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 2.2 శాతం మేర లాభపడ్డాయి. అయితే వారం పరంగా చూస్తే, స్టాక్ సూచీలు భారీగానే నష్టపోయాయి. సెన్సెక్స్1,457 పాయింట్లు,నిఫ్టీ 455 పాయింట్ల మేర పతనమయ్యాయి.సెన్సెక్స్ 3.8 శాతం, నిఫ్టీ 4 శాతం మేర క్షీణించాయి. ఆరంభం నుంచి లాభాలే.... ఆసియా మార్కెట్ల జోష్‌తో మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 917 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. హాంకాంగ్, షాంఘైలు మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు మ్రిÔ¶ మంగా ముగిశాయి. ► సెన్సెక్స్‌లోని అన్ని (30) షేర్లూ లాభపడ్డాయి. ► రూ.20,000 కోట్ల రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ డిమాండ్‌కు సంబంధించిన ఆర్బిట్రేషన్ కేసును గెలవడంతో వొడాఫోన్ ఐడియా షేర్ 14 శాతం లాభంతో రూ.10.36 వద్ద ముగిసింది. ► యాక్సెంచర్ కంపెనీ 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, కంపెనీ వ్యాఖ్యలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. ► రుణ భారం తగ్గంచుకోవడానికి కాకినాడ సెజ్‌లో తనకున్న మొత్తం 51 శాతం వాటాను విక్రయించనుండటంతో జీఎంఆర్ ఇన్ఫ్రా షేర్ 11 శాతం లాభంతో రూ.23.55 వద్ద ముగిసింది. ► 350 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు, ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అపోలో హస్పిటల్స్, గ్రాన్యూల్స్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. లాభాలు ఎందుకంటే... ► ప్యాకేజీలపై ఆశలు కరోనాతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి వచ్చే వారం ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వనున్నదని వార్తలు వచ్చాయి. మరోవైపు పండగ జోష్‌ను పెంచడానికి మన ప్రభుత్వం కూడా ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వొచ్చన్న వార్తలు ఇన్వెస్టర్లలో జోష్‌ను పెంచాయి. ► స్టేబుల్ రేటింగ్... భారత ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ నిలకడగా(స్టేబుల్)గా ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ, స్టాండర్డ్ అండ్ పూర్స్ పేర్కొంది. 2021 నుంచి వృద్ధి పుంజుకోగలదనే అంచనాలను వెలువరించింది. ► వేల్యూ బయింగ్.... గత ఆరు రోజుల నష్టాల కారణంగా పలు షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో వేల్యూ బయింగ్ చోటు చేసుకుంది. ► పుంజుకున్న రూపాయి.... డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు పుంజుకొని 73.61 వద్దకు చేరడం కలసివచ్చింది. 3.52 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.52 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.52 లక్షల కోట్లుపెరిగి రూ.152.28 లక్షల కోట్లకు చేరింది. -
11,600 పాయింట్ల పైకి నిఫ్టీ...
బ్యాంక్, వాహన, ఐటీ, ఫార్మా షేర్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 73.52 వద్ద ముగియడం, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భరోసా వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. నిఫ్టీ కీలకమైన 11,600 పాయింట్ల పైకి ఎగబాకింది. 83 పాయింట్లు లాభపడి 11,605 వద్ద ముగిసింది. ఫిబ్రవరి తర్వాత ఈ సూచీ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఇక సెన్సెక్స్ 259 పాయింట్లు ఎగసి 39,303 పాయింట్ల వద్దకు చేరింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు.... రేట్ల నిర్ణయానికి సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం ఈ రాత్రికి వెలువడనున్న నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం సానుకూల ప్రభావం చూపించింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం లాభాలను పరిమితం చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా.. ఈ బ్లూచిప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఆర్బీఐ అభయం...: ఆర్థిక రికవరీ ఇంకా పుంజుకోలేదని, అయినప్పటికీ, నిధుల లభ్యత పెంచడానికి, వృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభయం ఇచ్చారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 4 శాతం లాభంతో రూ.640 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇండియన్ ఎనర్జీ ఎక్సే ్చంజ్,లారస్ ల్యాబ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకా యి. లక్ష్మీ విలాస్ బ్యాంక్.గంధిమతి అప్లయెన్సెస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
బ్లూచిప్ షేర్ల దన్ను
ట్రేడింగ్ చివర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వివిధ దేశాల తయారీ రంగ గణాంకాలు ఆర్థిక ‘రికవరీ’ సంకేతాలిస్తుండటం, అమెరికా అదనంగా ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు కలసివచ్చాయి. అయితే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలకు కళ్లెం పడింది. సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 39,086 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,535 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు క్షీణించి 73.03 వద్దకు చేరింది. 5 సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి... సెనెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. నష్టాల్లోంచి ఐదుసార్లు లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 165 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 245 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 406 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు ముదురుతుండటంతో ఒడుదుడుకులు చోటు చేసుకుంటున్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5.7 శాతం లాభంతో రూ. 642.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సూచిస్తున్నారు. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2 శాతం లాభంతోరూ. 2,128 వద్దకు చేరింది. సెన్సెక్స్ మొత్తం లాభాల్లో ఈ షేర్ వాటాయే మూడింట రెండు వంతులు ఉండటం విశేషం. సెన్సెక్స్ మొత్తం 185 పాయింట్ల లాభంలో రిలయన్స్ వాటాయే 120 పాయింట్ల మేర ఉంది. సూచిస్తున్నారు. ► జీ ప్లెక్స్ పేరుతో సినిమా–టు–హోమ్ సర్వీస్‌ను అందించనుండటంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 8 శాతం వృద్ధితో రూ.217 వద్ద ముగిసింది. సూచిస్తున్నారు. ► ఆగస్టులో వాహన విక్రయాలు పుంజుకోవడంతో వాహన షేర్లు లాభపడ్డాయి. సూచిస్తున్నారు. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. వీఎస్టీ టిల్లర్స్, అదానీ గ్రీన్, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సూచిస్తున్నారు. ► నిధుల సమీకరణ వార్తల కారణంగా వొడాఫోన్ ఐడియా షేర్ 11 శాతం లాభంతో రూ.9.91కు చేరింది. సూచిస్తున్నారు. ► ఫ్యూచర్ గ్రూప్ షేర్లతో సహా మొత్తం 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. మరోవైపు 256 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. -
ఐదో రోజూ అదే జోరు
ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆర్బీఐ కొత్త నిబంధనలు రుణాలు తీసుకున్నవాళ్లకు కరోనా కల్లోల కాలంలో ఊరటనివ్వనున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 48 పైసలు పుంజుకొని 73.82కు చేరడం సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 253 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 40 పాయింట్ల లాభంతో 39,113 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 11,559 పాయింట్ల వద్దకు చేరింది. వరుసగా ఐదో రోజూ ఈ సూచీలు లాభపడ్డాయి. షాంఘై సూచీ లాభాల్లో ముగియగా, ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. అందరి కళ్లూ పావెల్ ప్రసంగంపైననే.. జాక్సన్ హోల్ సింపోజియమ్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ చేసే గురువారం రాత్రి ప్రసంగంపైననే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. ఆయన ప్రసంగంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ► ఈ ఏడాది డిసెంబర్ వరకూ స్టాంప్ డ్యూటీని 3 శాతం మేర తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో రియల్టీ షేర్లు దూసుకుపోయాయి. డీఎల్ఎఫ్ 10%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రొపర్టీస్, ఓబెరాయ్ రియల్టీ, సన్‌టెక్ రియల్టీ తదితర షేర్లు 7% లాభపడ్డాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 7 శాతం లాభంతో రూ.605 వద్ద ముగిసింది. -
ఆరు నెలల గరిష్టానికి మార్కెట్
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల కొనుగోళ్ల జోరుతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు పుంజుకొని 74.32కు చేరడం, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, వినోద రంగ పరిశ్రమ (సినిమా హాళ్లు తెరవడానికి)మరిన్ని వెసులుబాట్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటం, మూడు ప్రైవేట్ బ్యాంక్‌లను ఎఫ్టీఎస్ఈ గ్లోబల్ ఇండెక్స్‌లో చేర్చడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 38,799 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,466 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అప్రమత్తత అవసరం... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు అంతకంతకూ పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 125 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. నిధుల వరద పారుతుండటంతో మార్కెట్ జోరుగా పెరుగుతోందని, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్మా చికిత్సకు అమెరికా ఎఫ్‌డీఏ ఓకే... కరోనా వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా చికిత్స చేయడానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ను ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడానికి కొన్ని నిబంధనలను సడలించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఫలితంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం యూరప్ మార్కెట్లు 2 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 3.5% లాభంతో రూ.1,387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. హీరో మోటొకార్ప్, ఆఫిల్ ఇండియా, ఇమామి, సనోఫి ఇండియా, ఎస్ఆర్ఎఫ్, ఆర్తి డ్రగ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముంబై ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్ట్‌లో 74 శాతం వాటాను రూ.15,000 కోట్లకు కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 7 శాతం లాభంతో రూ.249 వద్ద ముగిసింది. ఈ గ్రూప్‌లోని ఇతర షేర్లు కూడా లాభపడ్డాయి. ► రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ. 1 ముఖ విలువ పది షేర్లుగా విభజన చేసిన నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం ఎగసింది. చివరకు 0.36 శాతం లాభంతో రూ.2,178 వద్ద ముగిసింది. ► దాదాపు 450కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, రెప్కో హోమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
బ్యాంక్, విద్యుత్ షేర్ల జోరు
బ్యాంక్, విద్యుత్ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పెరిగి 74.84కు చేరడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం.... సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 359 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరకు 214 పాయింట్ల లాభంతో 38,435 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 11,372 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 557 పాయింట్లు, నిఫ్టీ 193 పాయింట్ల చొప్పున పెరిగాయి. లాభాల్లో ఆసియా మార్కెట్లు.... అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చల్లారకున్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా, ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. టెక్నాలజీ షేర్లతో అమెరికా సూచీలు గురువారం లాభపడటంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు 1 శాతం మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో మొదలై, స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ► ఎన్టీపీసీ షేరు 5 శాతం లాభంతో రూ.106 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► వచ్చే నెల 25 నుంచి నిఫ్టీ50 సూచీలో చేర్చనుండటంతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివీస్ ల్యాబ్స్ షేర్లు 1–5 శాతం రేంజ్లో లాభపడ్డాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్ల స్థానంలో ఈ రెండు షేర్లను చేరుస్తున్నారు. ► బోనస్ షేర్ల వార్తల కారణంగా ఆర్తి డ్రగ్స్ షేర్ రెండో రోజూ కూడా ఎగసింది. శుక్రవారం మరో 10 శాతం లాభపడి ఆల్‌టైమ్ హై, రూ.3,122 వద్ద ముగిసింది. ► విద్యుత్తు షేర్ల లాభాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ► నిధుల సమీకరణ వార్తల కారణంగా వా టెక్ వాబాగ్ షేర్ 19 శాతం లాభంతో రూ.218 వద్ద ముగిసింది. -
11,400 దాటేసిన నిఫ్టీ
ప్రపంచ మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా బుధవారం లాభాల్లోనే ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పుంజుకొని 74.82కు చేరడం..... సానుకూల ప్రభావం చూపించాయి. చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో లాభాలు పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 38,615 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,408 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. ప్రభుత్వం చేయూత...! ప్రభుత్వం చేయూతతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పుంజుకోగలవన్న అంచనాలతో కొనుగోళ్లు జరుగుతున్నాయని నిపుణులంటున్నారు. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా,యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటాను రూ.620 కోట్లకు కొనుగోలు చేయడంతో రిలయన్స్ షేర్ 0.7% లాభంతో రూ.2,133 వద్ద ముగిసింది. ► టెక్ మహీంద్రా షేర్ 2 శాతం లాభంతో రూ.727 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద ఆర్బీఐకి రూ.35,000 కోట్లు చెల్లించడంతో యస్ బ్యాంక్ 5% ఎగబాకి రూ.15.80 వద్ద ముగిసింది. ► రిలయన్స్ ఇండస్ట్రీస్....వాటాను కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా ఫ్యూచర్ రిటైల్ 19% లాభంతో రూ.119 వద్ద ముగిసింది. ► దాదాపు 180కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అంబుజా సిమెంట్స్, టాటా కాఫీ, ఎస్బీఐ కార్డ్స్ వంటివి ఉన్నాయి. యాపిల్ @ రూ.150 లక్షల కోట్లు! న్యూయార్క్: యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్ బుధవారం 2 లక్షల కోట్ల డాలర్లకు (రూ.150 లక్షల కోట్లు) చేరింది. ఈ ఘనత సాధించిన తొలి అమెరికా కంపెనీ ఇదే. ప్రపంచంలో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో కంపెనీ ఇది. గత ఏడాది డిసెంబర్లో సౌదీ ఆరామ్కో ఈ రికార్డ్ సాధించింది. అయితే చమురు ధరల పతనం కారణంగా ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 1.82 లక్షల కోట్ల డాలర్లుగానే ఉంది. లాక్డౌన్ కారణంగా చైనాలో ఐఫోన్ తయారీ తగ్గింది. అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయాయి. అయితే ఆన్లైన్ అమ్మకాలు జోరుగా ఉండటంతో యాపిల్‌కు క్రేజ్ తగ్గలేదని నిపుణులంటున్నారు. కాగా, యాపిల్ తాజా మార్కెట్ క్యాప్ బీఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాప్‌కు సమానం. రూ.13.8 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దగ్గర అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా నిలిచింది. రెండేళ్లలో రెట్టింపు....: ఒక్కో షేర్‌ను నాలుగు షేర్లుగా విభజించనున్నామని మూడు వారాల క్రితం యాపిల్ కంపెనీ తెలిపింది. అప్పటినుంచి ఈ షేర్ జోరుగా పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఈ షేర్ 60 శాతం లాభపడింది. ఈ కంపెనీ విలువ రెండేళ్లలోనే రెట్టింపు కావడం విశేషం. రాత్రి 11.30కి న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో యాపిల్ షేర్ 1 శాతం లాభంతో 467 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు లాభాల్లో ముగిశాయి. దీంతో గత మూడు రోజుల నష్టాలకు సోమవారం బ్రేక్ పడింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ జాప్యం అవుతుండటంతో అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా మన మార్కెట్ మాత్రం పెరిగింది. సెన్సెక్స్ మళ్లీ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,200 పాయింట్లపైకి ఎగబాకాయి. చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 38,051 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,247 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్ షేర్లు నష్టపోయినా,విద్యుత్తు, వాహన, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, లోహ షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 74.88 వద్దకు చేరింది. ఐదు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి... సెన్సెక్స్ లాభాల్లోనే మొదలైనా వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ లాభాల్లోకి వచ్చింది. రోజంతా లాభ, నష్టాల మధ్య ట్రేడైంది. సెన్సెక్స్ ఐదు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 143 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 242 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 385 పాయింట్ల రేంజ్లో కదలాడింది. జపాన్ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, త్వరలో పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ను ఆరంభించనున్నదన్న వార్తలతో ఎన్టీపీసీ షేర్ 8 శాతం లాభంతో రూ.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, మైండ్ ట్రీ, వాబ్కో ఇండియా, థైరోకేర్ టెక్నాలజీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ కొనొచ్చు అనే రేటింగ్‌ను ఇవ్వడంతో సన్ టీవీ షేర్ 6% లాభంతో రూ.426 వద్ద ముగిసింది. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు–ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ మాత్రమే నష్టపోగా, మిగిలిన 25 షేర్లు లాభపడ్డాయి. ► హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ షేర్లు కొనుగోలు చేశారన్న వార్తలతో పీటీసీ ఇండస్ట్రీస్ 20% లాభంతో రూ.699 కు చేరింది. ► దాదాపు 400 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పీటీసీ ఇండస్ట్రీస్, ఆప్టో సర్క్యూట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
మూడోరోజూ ముందుకే..!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇంజినీరింగ్,ఆర్థిక, ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 74.90కు చేరడం, ఫార్మా కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించడం.... సానుకూల ప్రభావం చూపించాయి. వరుసగా మూడో రోజూ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు సగం మేర తగ్గిపోయాయి. ఇంట్రాడేలో 390 పాయింట్ల వరకూ ఎగిసిన సెన్సెక్స్ చివరకు 142 పాయింట్ల లాభంతో 38,182 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 11,270 పాయింట్ల వద్దకు చేరింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► లార్సెన్ అండ్ టుబ్రో షేర్ 5 శాతం లాభంతో రూ.960 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ఈ జూన్ క్వార్టర్లో నికర లాభం 81 శాతం ఎగియడంతో దివీస్ ల్యాబ్స్ షేర్ 12 శాతం లాభంతో రూ. 3,117 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.3,228ను తాకింది. ఈ షేర్‌తో పాటు పలు ఫార్మా షేర్లు కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అరబిందో ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, ఇప్కా ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, టొరెంట్ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. ఎస్ఆర్ఎఫ్, వీఎస్టీ టిల్లర్స్, వాబ్కో ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగ షేర్లు రయ్..! వందకు పైగా రక్షణ రంగ పరికరాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రక్షణ రంగ షేర్లు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.465ను తాకిన భారత్ డైనమిక్స్ షేర్ చివరకు శాతం లాభంతో రూ.437 వద్ద ముగిసింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ ఫోర్జ్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ తదితర షేర్లు లాభపడ్డాయి. -
మార్కెట్లకు పాలసీ నిర్ణయాల ఊతం
ముంబై: పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, వృద్ధికి ఊతమిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఉదార విధానాల సంకేతాలివ్వడంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. సెన్సెక్స్ ఏకంగా 362 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ మళ్లీ 11,200 పాయింట్లకు చేరింది. గురువారం ఇంట్రాడేలో 558 పాయింట్లు ర్యాలీ చేసిన సెన్సెక్స్ చివరికి 0.96 శాతం లాభంతో 38,025 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 11,200.15 వద్ద ముగిసింది. ‘దేశీ సూచీలు గరిష్ట స్థాయిల నుంచి తగ్గినప్పటికీ లాభాల్లోనే ముగిశాయి. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటించిన నిర్ణయాలు ఇందుకు కారణం. రేట్ల కోతపై అంచనాలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ మాత్రం రేట్లను యథాతథంగానే ఉంచింది. అయితే, వృద్ధి మెరుగుపడే దాకా ఉదార విధానాలు పాటించనున్నట్లు ద్రవ్యపరపతి విధాన సమీక్షలో సూచనప్రాయంగా వెల్లడించింది. ఒకవేళ ద్రవ్యోల్బణం గానీ అదుపులోకి వస్తే రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానాన్ని మరికాస్త సడలించే అవకాశం ఉంది. ఆర్బీఐకి సంబంధించిన కీలక ఘట్టం పూర్తయిపోవడంతో ఇక మార్కెట్ వర్గాలు మళ్లీ కంపెనీల ఆదాయ అంచనాలు తదితర అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మిశ్రమంగా రియల్టీ, ఆటో సూచీలు.. వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంక్, రియల్టీ, ఆటోమొబైల్ స్టాక్స్ మిశ్రమంగా స్పందించాయి. బంధన్ బ్యాంక్ షేరు 3.57 శాతం, ఆర్బీఎల్ బ్యాంక్ 0.49 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.43 శాతం, ఎస్బీఐ 0.29 శాతం నష్టాల్లో ముగిశాయి. అయితే, సిటీ యూనియన్ బ్యాంక్ 2.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.97 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.24 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.44 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.39 శాతం, ఫెడరల్ బ్యాంక్ 0.19 శాతం పెరిగాయి. అటు ఆటోమొబైల్ స్టాక్స్‌లో టీవీఎస్ మోటార్ 2.22 శాతం, టాటా మోటార్స్ 1.13 శాతం, మారుతీ సుజుకీ ఇండియా 0.49 శాతం, హీరో మోటోకార్ప్ 0.26 శాతం, అశోక్ లేల్యాండ్ 0.10 శాతం పెరిగాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా 0.75 శాతం, బజాజ్ ఆటో 0.67 శాతం, ఎంఆర్ఎఫ్ 0.42 శాతం క్షీణించాయి. బీఎస్ఈ ఆటో సూచీ 0.07 శాతం లాభపడింది. రియల్టీ సూచీ విషయానికొస్తే.. గోద్రెజ్ ప్రాపర్టీస్ 1.48 శాతం, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 1.35 శాతం, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ 0.31 శాతం క్షీణించాయి. రియల్టీ సూచీ 1.15 శాతం పెరిగింది. మరోవైపు, సెన్సెక్స్‌లో టాటా స్టీల్ అత్యధికంగా 3.82 శాతం మేర పెరిగింది. ఇన్ఫీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా తదితర షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ ఐటీ, టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్ సూచీలు పెరిగాయి. టెలికం, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ రంగ షేర్ల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ సూచీలు 0.99 శాతం దాకా పెరిగాయి. అటు ఫారెక్స్ మార్కెట్ విషయానికొస్తే అమెరికా డాలర్‌తో పోలిస్తే గురువారం రూపాయి మారకం విలువ దాదాపు గత ముగింపు స్థాయిలోనే 74.94 వద్ద క్లోజయ్యింది. గ్లోబల్ మార్కెట్లు.. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఖరారు కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణులు కనిపించాయి. హాంకాంగ్, టోక్యో సూచీలు నష్టపోగా, షాంఘై, సియోల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రారంభ సెషన్లో యూరప్ స్టాక్ ఎక్సే్ఛంజీలు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. -
సూచీలకు రిలయన్స్ బలం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇచ్చిన మద్దతుతో దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం తిరిగి లాభాల బాట పట్టాయి. కొనుగోళ్ల మద్దతుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు జీవితకాల గరిష్టానికి (రూ.2,078.90) దూసుకుపోయింది. ఫలితంగా సెన్సెక్స్ 269 పాయింట్లు పెరిగి (0.71 శాతం) 38,140 పాయింట్ల వద్ద క్లోజ్ అవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి (0.74శాతం) 11,215 వద్ద స్థిరపడింది. సూచీలకు వచ్చిన లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే ఎక్కువగా ఉంది. బుధవారం ఒక్క రోజు స్వల్ప నష్టాలను ఎదుర్కొన్న సూచీలు, అంతక్రితం ఐదు రోజులు ర్యాలీ చేయడం గమనార్హం. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్ మహీంద్రా, ఐటీసీ, కోటక్ బ్యాంకు లాభపడగా.. యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ నష్టపోయాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీచడంతో బెంచ్‌మార్క్ సూచీలు లాభాలతో ముగిశాయి. చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలపై ఆందోళనల కంటే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తొందరగా వస్తుందన్న అంచనాలు, కంపెనీల ఫలితాలు ఆశించినదాని కంటే మెరుగ్గా ఉండడం అనుకూలించింది. ఐటీ మినహా చాలా వరకు సూచీలు లాభపడ్డాయి. మార్కెట్లు ఏ మాత్రం పడినా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది’’అంటూ జియోజిత్ ఫై నాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మురిపించిన ‘రోసారి’ లిస్టింగ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలోని రోసారి బయోటెక్ లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు లాభాలు కురిపించింది. ఐపీవోలో భాగంగా ఒక్కో షేరును రూ.425కు కేటాయించగా, ఈ ధరపై 58 శాతం ప్రీమియంతో రూ.670 వద్ద బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఇంట్రాడేలో రూ.804 వరకు వెళ్లి స్టాక్ ఎక్సే్ఛంజ్ అనుమతించిన గరిష్ట ధర రూ.804 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను కూడా తాకింది. చివరకు 75 శాతం లాభంతో రూ.742 వద్ద క్లోజయింది. ఈ ఐపీవోకు అద్భుత స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ నాన్‌స్టాప్ ర్యాలీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్లో పెట్టుబడులకు అమెజాన్ ఆసక్తి చూపిస్తోందంటూ వచ్చిన వార్తలు స్టాక్‌ను నూతన గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.2,078.90 వరకు వెళ్లిన స్టాక్ చివరకు మూడు శాతం లాభపడి రూ.2,060.65 వద్ద క్లోజయింది. ఈ ఏడాది మార్చి 23న 867.82 కనిష్టాన్ని నమోదు చేయగా.. ఈ స్టాక్ కేవలం నాలుగు నెలల్లోనే 135 శాతం లాభపడడం గమనార్హం. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లలో అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగ దిగ్గజాలైన గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, క్వాల్కామ్ తదితర కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ టాప్–50లోకి రిలయన్స్ న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో గుర్తింపు సంపాదించుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 50 కంపెనీల్లోకి ప్రవేశించింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లను దాటిపోవడంతో.. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ విలువ పరంగా 48వ స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయంగా చూస్తే సౌదీఆరామ్‌కో 1.7 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ (సుమారు రూ.127 లక్షల కోట్లు)తో మొదటి స్థానంలో ఉండగా, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గురువారం బీఎస్ఈలో రిలయన్స్ స్టాక్ రూ.2,060.65 వద్ద క్లోజయింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.13,06,329.39 కోట్లను చేరుకుంది. చైనాకు చెందిన ఆలీబాబా గ్రూపు 7వ స్థానంలో ఉంది. టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్ టాప్ 100లో నిలిచింది. టీసీఎస్ మార్కెట్ విలువ రూ.8.14లక్షల కోట్లుగా ఉంది.