మార్కెట్ పతనంలో పెట్టుబడులకు అనుకూలమైన స్టాక్స్‌ను గుర్తించడం ఎలా? – శ్వేత
మార్కెట్లలో కరెక్షన్ మొదలైన తర్వాత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలను అన్వేషించకూడదు. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు ఎంతో విస్తృతమైన పరిశోధన, కసరత్తు కావాలి. కంపెనీ ఎప్పటికప్పుడు వ్యాపారంలో వృద్ధి నమోదు చేస్తోందా? అని చూడాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ మంచి రేషియోలో ఉందా? అని చూడాలి. రుణభారంతో నెట్టుకొస్తూ ఉండకూడదు. అంటే ఎక్కువ రుణాలు తీసుకుని ఉండకూడదు. కంపెనీని నడిపించే యాజమాన్యం నిధులు పక్కదారి పట్టించకుండా నిజాయతీగా, సమర్థవంతంగా పనిచేసేదై ఉండాలి. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీ డబ్బులను వేరే వారికి అప్పగిస్తున్నట్టుగా భావించాలి. అందుకే కంపెనీని నడిపించే వ్యక్తులు విశ్వసనీయత కలిగి ఉండాలి. ఇవన్నీ ఒక కంపెనీలో గుర్తిస్తే ఆకర్షణీయమైన ధర వద్ద షేరులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు గుర్తించింది గొప్ప కంపెనీ అవుతుంది. అయితే, సహేతుక ధర వద్దే కానీ, ఖరీదైన ధరలో కొనుగోలు చేస్తే రాబడులు కష్టం కావచ్చు. ఇలాంటి నాణ్యత అంశాలతో కూడిన కంపెనీలను గుర్తించినప్పుడు వాటిని వాచ్ లిస్ట్ (పరిశీలన జాబితా)లో పెట్టుకోవాలి. వాల్యూరీసెర్చ్ పోర్టల్‌పై వాచ్‌లిస్ట్ పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే మంచి ఫలితాలనిస్తుందని నేను భావిస్తున్నాను. విజయవంతమైన ఇన్వెస్టర్లలో నేను గుర్తించిన అసాధారణ అంశం ఇది. కానీ, ఇందుకు ఎంతో ఓపిక ఉండాలి. మీరు గుర్తించిన కంపెనీలు ఖరీదైన వ్యాల్యూషన్లలోనే ఎక్కవ రోజుల పాటు ట్రేడ్ కావచ్చు. కానీ, మీరు అనుకున్న ధరకు దిగొచ్చే వరకు వేచి చూడాలి.
మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – నవీన్
మార్కెట్లలో ఇప్పుడు అస్థిరతలు కనిపిస్తున్నాయి. ముందు కూడా అస్థిరతలు ఉన్నాయి. భవిష్యత్తులో మరింత ఎక్కువగానూ ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టొచ్చు. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో రక్షణ కల్పించుకోవాలి. సమీప కాలంలో మార్కెట్లపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు, ఏడేళ్ల వరకు అవసరం కానివి అయి ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ అమల్లో పెట్టిన తర్వాత, క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే వారు అయి ఉండి, పెట్టుబడులు పెట్టాలనుకునే సమయంలో మార్కెట్లలో అస్థిరతలు ఉంటే వాటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి?– రేవతి
మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమాకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విషయానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి.

ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment