దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం పుంజుకున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 ప్రారంభ నష్టాలను తిప్పికొట్టాయి. ట్రేడింగ్ సెషన్‌ను రికార్డ్ హై ముగింపు స్థాయిలలో ముగించే ముందు కొత్త గరిష్టాలను తాకాయి.
సెన్సెక్స్ 255.83 పాయింట్లు లేదా 0.30 శాతం పుంజుకుని 85,169.87 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయి 85,247.42కి చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా 63.75 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 26,004.15 వద్ద సెషన్‌ను ముగించే ముందు 26,032.80 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.
నిఫ్టీ లిస్టింగ్‌లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటర్స్, టైటాన్ టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment